ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సంకేతాలు
రెండు నెలలు ద్రవ్యోల్బణం కట్టడి
నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు
ఈ సమస్యపై అప్రమత్తత అవసరమని ఉద్ఘాటన
సింగపూర్: రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా పూ ర్తిగా అదుపులోనికి వచి్చనప్పటి కీ, రేటు తగ్గింపునకు తొందరపడబోమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఈ దిశలో (రేటు తగ్గింపు) నిర్ణయానికి ఇంకా చాలా దూరం ఉందని ఆయన అన్నారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫోరమ్ 2024’లో దాస్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
→ 2022లో గరిష్ట స్థాయి 7.8% వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 4% లక్ష్యం దిగువకు చేరింది. అయితే ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు (రేటు తగ్గింపు) తీసుకోడానికి ఇంకా చాలా దూరం ఉంది. మరోవైపు (సరళతర ద్రవ్య విధానాల వైపు) చూసే ప్రయత్నం చేయలేము.
→ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం చాలా వరకు కష్ట నష్టాలను తట్టుకుని నిలబడుతున్నప్పటికీ, ద్రవ్యో ల్బణం చివరి మైలు లక్ష్య సాధన సవాలుగానే ఉందని పలుసార్లు నిరూపణ అయ్యింది. ద్రవ్యోల్బణం సవాళ్లు ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలకు దారితీస్తాయి.
→ ద్రవ్యోల్బణం కావచ్చు... ప్రతిద్రవ్యోల్బణం కావచ్చు. సమస్య తీవ్రమైనది. ఈ పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సడలించడంలో జాగ్రత్త అవసరం. కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన నిర్వహణలో వివేకం ఉండాలి. మరోవైపు సరఫరా వైపు ప్రభుత్వం చర్యలు చురుకుగా ఉండాలి.
అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నుండి సరళతర పాలసీ సంకేతాల నేపథ్యంలో రేటు తగ్గింపులకు సంబంధించి మార్కెట్ అంచనాలు ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే పాలసీల మార్పు విషయంలో అన్ని విషయాలను విస్తృత స్థాయిలో పరిగణనలోని తీసుకుంటూ, ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిని అనుసరించని సెంట్రల్ బ్యాంకులు– తమ దేశీయ ద్రవ్యోల్బణం–వృద్ధి సమతుల్యత అంశాలపై నిఘా ఉంచి తగిన పాలసీ ఎంపిక చేసుకోవాలి.
భారత్ వృద్ధిలో వినియోగం, పెట్టుబడుల కీలక పాత్ర
భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆయన వ్యాఖ్యానిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, ద్రవ్యోలోటు, కరెంటు అకౌంట్ లోటు వంటి అంతర్లీన పటిష్టతను ప్రతిబింబిస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ పురోగతిలో – ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని దాస్ విశ్లేíÙంచారు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బయటకు వచి్చందని, 2021–24 మధ్య సగటు వాస్తవ జీడీపీ వృద్ధి 8 శాతం కంటే అధికంగా నమోదైందని గవర్నర్ పేర్కొన్నారు.
ద్రవ్య పటిష్టతతోపాటు ప్రభుత్వ భారాలు తగ్గుతుండడం సానుకూల పరిణామమన్నారు. కార్పొరేట్ పనితీరు పటిష్టంగా కొనసాగుతున్నట్లు వివరించారు. ఆర్‌బీఐ నియంత్రించే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు కూడా బలపడ్డాయని గవర్నర్ తెలిపారు. అన్ని స్థాయిల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారం ప్రపంచ పురోగతికి కీలకమని భారత్ భావిస్తున్నట్లు తెలిపారు. 2023లో భారత జీ20 ప్రెసిడెన్సీ, దాని తర్వాత ప్రపంచ దేశాలతో నిరంతర సహకార విధానాలను పరిశీలిస్తే, ఆయా అంశాలు ‘ప్రపంచం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే న్యూ ఢిల్లీ దృష్టిని ప్రతిబింబిస్తాయని దాస్ వివరించారు.
పరస్పర సహకారంతోనే ప్రపంచ పురోగతి
21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుళజాతి అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం, ఉత్పాదకత లాభాలను సాధించడం, మధ్య–ఆదాయ దేశాలకు రుణ పరిష్కారం వంటివి భారత్ ప్రాధాన్యతలలో కొన్నని గవర్నర్ ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ అభివృద్ధి మెరుగుదల కోసం రాబోయే దశాబ్దాలలో ప్రపంచ క్రమాన్ని పునరి్నర్మించడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం మానవజాతి కోసం ఇందుకు సంబంధించి ’ఒక భవిష్యత్తు’ కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు ఇటీవలి నెలల్లో సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోందని అన్నారు. ఈక్విటీ, బాండ్ ఈల్డ్ వంటి అంశాల్లో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉంటున్నాయని వివరించారు. అయితే స్టాక్ మార్కెట్లలో ధరల అసాధారణ పెరుగుదల ఒక అనూహ్య పరిణామమన్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను అనుసంధానానికి, ఈ విషయంలో అసమతుల్యత పరిష్కారానికి సంస్కరణలు అవసరమని అన్నారు. ప్రపంచ ఆర్థిక భద్రతా వలయాన్ని (జీఎఫ్‌ఎస్‌ఎన్) బలోపేతం చేయడంపై కూడా సంస్కరణలు దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
బేస్ మాయతోనే ద్రవ్యోల్బణం తగ్గిందా?
2023 జూలై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ భారీగా (వరుసగా 7.44 శాతం, 6.83 శాతం) ఉన్నందునే 2024 జూలై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) కనబడుతున్నాయని కొందరు నిపుణుల చేస్తున్న వాదనను గవర్నర్ శక్తికాంతదాస్ శక్తికాంతదాస్ తాజా వ్యాఖ్యలు (రేటు తగ్గింపుపై) సమరి్థంచినట్లయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా (మైనస్ లేదా ప్లస్) 4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్‌బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండడం గమనార్హం.
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని కూడా గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్‌బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment