అది చాలాచాలా రిస్క్‌కు దారితీస్తుంది
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల విషయమై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను ఈ దశలో తగ్గించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, ఇది చాలా చాలా రిస్క్‌గా మారుతుందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోందంటూ, భవిష్యత్ ద్రవ్యపరమైన నిర్ణయాలు డేటా ఆధారంగానే ఉంటాయని సంకేతం ఇచ్చారు.
ఈ నెల మొదట్లో జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించడం తెలిసిందే. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, మానిటరీ పాలసీ విధానాన్ని తటస్థానికి సడలించింది. తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. బ్లూంబర్గ్ నిర్వహించిన ఇండియా క్రెడిట్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ అంశాలను ప్రస్తావించారు.
సెపె్టంబర్ నెలకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ, తదుపరి నెల గణాంకాల్లోనూ ఇదే తీరు ఉంటుందని, ఆ తర్వాత మోస్తరు స్థాయికి దిగి రావొచ్చన్నారు. కనుక ఈ దిశలో రేట్ల కోత ఎంతో తొందరపాటు అవుతుంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం చాలా చాలా రిస్‌్కగా మారుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ పోలీసు మాదిరిగా వ్యవహరించకూడదంటూ.. ఫైనాన్షియల్ మార్కెట్లపై కఠిన నిఘా కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నవి ఫిన్‌సర్వ్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ తదితర సంస్థలపై తాజాగా ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment