rates cut
-
వడ్డీ రేట్ల తగ్గింపు తొందరపాటే
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల విషయమై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను ఈ దశలో తగ్గించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, ఇది చాలా చాలా రిస్క్‌గా మారుతుందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోందంటూ, భవిష్యత్ ద్రవ్యపరమైన నిర్ణయాలు డేటా ఆధారంగానే ఉంటాయని సంకేతం ఇచ్చారు. ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించడం తెలిసిందే. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, మానిటరీ పాలసీ విధానాన్ని తటస్థానికి సడలించింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. బ్లూంబర్గ్ నిర్వహించిన ఇండియా క్రెడిట్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ అంశాలను ప్రస్తావించారు. సెపె్టంబర్ నెలకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ, తదుపరి నెల గణాంకాల్లోనూ ఇదే తీరు ఉంటుందని, ఆ తర్వాత మోస్తరు స్థాయికి దిగి రావొచ్చన్నారు. కనుక ఈ దిశలో రేట్ల కోత ఎంతో తొందరపాటు అవుతుంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం చాలా చాలా రిస్‌్కగా మారుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పోలీసు మాదిరిగా వ్యవహరించకూడదంటూ.. ఫైనాన్షియల్ మార్కెట్లపై కఠిన నిఘా కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నవి ఫిన్సర్వ్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ తదితర సంస్థలపై తాజాగా ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
గుడ్‌న్యూస్: సిలిండర్ ధరలపై ఊరట!
బడ్జెట్ ముందర గ్యాస్ సిలిండర్ ధరల నుంచి ఊరట ఇచ్చే ప్రకటన వెలువడింది. డొమెస్టిక్ సిలిండర్లపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించగా.. వరుసగా నాలుగో నెలలోనూ చాలా చోట్ల సిలిండర్ ధరల పెంపు ప్రకటన వెలువడకపోవడం విశేషం. ప్రతి నెలా ఒకటో తేదీన ధరల సవరణపై ఓఎంసీలు ప్రకటిస్తాయన్నది తెలిసిందే. అక్టోబర్ నుంచి డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు అక్టోబర్ నుంచి తగ్గలేదు. నవంబర్ నుంచి పెట్రో ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) ఎల్పీజీ సిలిండర్ ధరలను కొన్ని ప్రాంతాల్లో తగ్గించినట్లు ప్రకటనలు విడుదల చేశాయి. ఐదు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గృహా వినియోగ సిలిండర్ ధర ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావించారు. అదే సమయంలో కమర్షియల్సిలిండర్ల ధరల్లోనూ మార్పు ఉండొచ్చని ఆశించారు. కానీ, ఈ తరుణంలో కేంద్రం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్ని పెంచుకుండా ఊరట ఇచ్చాయి. మరోవైపు ఆయిల్ కంపెనీలు భారీగానే తగ్గింపులు ప్రకటించాయి. క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని అంటున్న తరుణంలో ఇది ప్రత్యేకమనే చెప్పాలి. ఫిబ్రవరి 1న ఢిల్లీలో 14.2 కేజీల ఇండేన్ డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 899.50 గా ఉంది. అలాగే కోల్‌కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర 926రూ. ఉంది. ముంబైలో నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ సిలిండర్ రూ. 899.50 గా, చెన్నైలో రూ. 915.50గా ఉంది ఇవాళ. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కంపెనీలు సిలిండర్ల ధరలు భారీగా తగ్గించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. నాలుగు నెలలుగా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఓఎంసీ కమర్షియల్ సిలిండర్ ధరలపైనా భారీగానే తగ్గింపు ప్రకటించింది. (19కేజీల) ఎల్పీజీ సిలిండర్ రూ.91.50పై. తగ్గింది. ఇది ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. వాస్తవానికి కొత్త ఏడాది మొదటి రోజునే ఓఎంసీ కమర్షియల్ సిలిండర్‌పై 102రూ. తగ్గించింది. అయినప్పటికీ 2 వేల రూపాయలకు పైనే ఉండేది. ప్రస్తుత ధరల సవరణ తర్వాత ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,907రూ.గా ఉంది. -
ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్ పన్నును సైతం తగ్గించింది.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ధరలు పెరిగేవి ఫర్నీచర్ చెప్పులు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు కిచెన్‌లో వాడే వస్తువులు క్లే ఐరన్ స్టీలు కాపర్ సోయా ఫైబర్, సోయా ప్రోటీన్ కమర్షియల్ వాహనాల విడిభాగాలు స్కిమ్డ్ మిల్క్ వాల్ ఫ్యాన్స్ టేబుల్‌వేర్ ధరలు తగ్గేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ ఎలక్ట్రిక్ వాహనాలు మొబైల్ ఫోన్ల విడిభాగాలు ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు -
సెజ్‌లోని ఐటీ కంపెనీలపై..పన్ను తగ్గించండి
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నుంచి పనిచేసే ఐటీ కంపెనీలపై 15 శాతమే కార్పొరేట్ పన్ను విధించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమ డిమాండ్ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న దృష్ట్యా... దీనికోసం సోమవారం నుంచి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్టార్టప్‌లు, మొబైల్ తయారీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రతినిధులు మంత్రి ముందు తమ డిమాండ్ల చిట్టాను విప్పారు. ఐటీ పరిశ్రమ.. ‘‘కొత్తగా ఏర్పడే తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును 15 శాతానికి తగ్గించారు. సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త సేవల కంపెనీలకూ 15 శాతం రేటు అమలు చేస్తే సెజ్‌లలోని తయారీ, సేవల రంగాలకు ఒకటే రేటు అమలవుతుందని కేంద్రానికి సూచించాం’’ అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ చెప్పారు. ఉపాధి కల్పన, పెట్టుబడుల విషయంలో సెజ్‌లు భవిష్యత్తు వృద్ధికి కీలకమన్నారు. విస్తృతమైన టెక్నాలజీలపై (డీప్‌టెక్) పనిచేసే స్టార్టప్‌ల కోసం నిధితోపాటు, ఆవిష్కరణల సమూహాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు వెల్లడించారు. దేశంలో డేటా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించినట్టు రిలయన్స్ జియో వైస్ ప్రెసిడెంట్ విశాఖ సైగల్ తెలిపారు. ఆర్థిక సేవల సంస్థలు.. టర్మ్ ఇన్సూరెన్స్ విస్తరణ కోసం జీఎస్టీ రేటును తగ్గించాలని, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి కేవైసీ నిబంధనలను క్రమబద్ధీకరించాలని ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ రంగానికి చెందిన కంపెనీలు (బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు) ప్రభుత్వానికి సూచించాయి. ప్రభ్వురంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపరచడంపై, పీజే నాయక్ కమిటీ సిఫారసుల అమలుపై దృష్టి సారించాలని కోరాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో ఒత్తిళ్లను తొలగించి, నిర్వహణను మెరుగుపరిచే విషయమై కూడా సూచనలు చేశాయి. ఆర్థిక పరిమితులకు లోబడి వీటిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ‘‘ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై పన్ను మినహాయింపును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలని సూచించాయి. అటల్ పెన్షన్ యోజనలో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు చేయాలని కూడా కోరాం’’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మొబైల్ పరిశ్రమ... ఇటీవల ప్రభుత్వం ఎగుమతులపై తగ్గించిన రాయితీలతో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని, అలాగే, మొబైల్ హ్యాండ్సెట్లపై జీఎస్టీ రేటు తగ్గించాలని కోరింది. దేశంలో పెద్ద ఎత్తున తయారీకి ఇది అవసరమని పేర్కొంది. ఎగుమతులపై 8% రాయితీ ఇవ్వాలని కోరింది. జీఎస్టీ పరిహార చెల్లింపులకు కట్టుబడి ఉన్నాం ముంబై: జీఎస్టీ పరిహార చెల్లింపులపై కేంద్రం తన హామీని విస్మరించబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి భరోసానిచ్చారు. వసూళ్లు తగ్గినందునే పరిహార చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. పరిహారాన్ని వెంటనే కేంద్రం చెల్లించాలంటూ కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇలా స్పందించారు. ‘‘ఇది వారి హక్కు. నేను తోసిపుచ్చడం లేదు. దీన్ని నిలబెట్టుకోకపోవడం ఉండదని స్పష్టం చేయదలుచుకున్నాను’’ అని వివరించారు. ముంబైలో సోమవారం జరిగిన టైమ్స్ నెట్వర్క్ ‘భారత ఆర్థిక సదస్సు’ను ఉద్దేశించి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డేటా (సమాచారం) విశ్వసనీయతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల పరిహారం కీలకమైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 18న జరగనుండగా, రెండు రోజుల ముందు సోమవారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.35,298 కోట్లను జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి (సీబీఐసీ) ట్వీట్ ద్వారా తెలియజేసింది. సకాలంలో పరిహార చెల్లింపులను కేంద్రం విడుదల చేయకపోవడంతో పలు రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
అక్రమ లాభార్జనపై 10% జరిమానా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలపై, ఎలక్ట్రిక్ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్మెంట్ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి అధ్యక్షత వహరించిన జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే తెలిపారు. ► అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని 2021 నవంబర్ వరకు రెండేళ్లపాటు పొడిగింపు. ► జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా అక్రమంగా లాభాలు పోగేసుకుంటే ఆ మొత్తంలో 10% జరిమానా విధింపునకు నిర్ణయం. ప్రస్తుతం ఈ జరిమానా నిబంధనల మేరకు గరిష్టంగా రూ.25,000గానే ఉంది. ► ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను ప్రస్తుతం 12 శాతం ఉండగా, దీన్ని 5 శాతానికి, ఎలక్ట్రిక్ చార్జర్లపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించాలన్న ప్రతిపాదనలను ఫిట్మెంట్ కమిటీకి నివేదింపు. ► ఆధార్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు అనుమతి. ► 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలుకు ఈ ఏడాది ఆగస్టు వరకు గడువు పొడిగింపు. ► వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారిని ఈవే బిల్లులు జారీ చేయకుండా నిషేధం విధింపు సైతం ఆగస్టు వరకు వాయిదా. ► 2020 జనవరి 1 నుంచి ప్రయోగాత్మక విధానంలో ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ విధానం ప్రారంభం. అప్పటి నుంచి జీఎస్టీ నమోదిత మల్టీప్లెక్స్‌లు ఈ టికెట్లనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే, రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలు ఎలక్ట్రానిక్ రూపంలోనే ఇన్వాయిస్లను జారీ చేయాలి. ► నూతన జీఎస్టీ రిటర్నుల దాఖలు వ్యవస్థ కూడా 2020 జనవరి 1 నుంచి అమల్లోకి. తేలని లాటరీల అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలపై 12 శాతం జీఎస్టీ, రాష్ట్రాల గుర్తింపుతో నడిచే లాటరీలపై 28 శాతం పన్ను అమల్లో ఉంది. ఒకటే దేశం ఒకటే పన్ను అన్నది జీఎస్టీ విధానం కావడంతో ఒకటే పన్నును తీసుకురావాలన్నది కేంద్రం ప్రతిపాదన. అయితే, ఇందుకు ఎనిమిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ‘‘దేశవ్యాప్తంగా ఒకటే రేటు ఉండాలన్నది జీఎస్టీ ప్రాథమిక సూత్రం. లాటరీల విషయంలో ప్రస్తుతం రెండు రేట్లు అమల్లో ఉన్నాయి. దీంతో ఆర్టికల్ 340పై స్పష్టత తీసుకోవాలని నిర్ణయించినట్టు’’ చెప్పారు. రేట్లను తదుపరి తగ్గించాలన్న అంశం చర్చకు వచ్చిందా? అన్న ప్రశ్నకు.. మరింత సులభంగా మార్చడమే తమ ఉద్దేశమన్నారు. జీఎస్టీ నిబంధనలు మరింత సులభంగా మార్చడం, జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ, జీఎస్టీ పరిధిలోకి మరి న్ని వస్తు, సేవలను తీసుకురావడమన్నది ఆర్థిక మంత్రి అభిప్రాయంగా ఆర్థిక శాఖ తెలిపింది. -
మార్కెట్ అక్కడక్కడే
అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ పాలసీ వైఖరి మారడం, అనూహ్యూంగా రేట్ల కోత చోటు చేసుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ట్రేడై, మిశ్రమంగా ముగిసింది. ఇంట్రాడేలో 197 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 4 పాయింట్లు నష్టపోయి 36,971 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 11,069 వద్ద ముగిశాయి. ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు ఒడుదుడుకులకు గురై మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్లు లాభపడగా, బ్యాంక్, రియల్టీ షేర్లలో షేర్లు కొన్ని లాభాల్లో, కొన్ని నష్టాల్లో ముగిశాయి. రెపో తగ్గింపువల్ల ఈ ప్రభావితమైన వాహన షేర్లు లాభపడ్డాయి. 273 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆర్బీఐ పాలసీ వెలువడక ముందు వరకూ పరిమిత లాభాల్లో ట్రేడైన స్టాక్ సూచీలు ఆ తర్వాత హెచ్చుతగ్గులకు గురయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం, ముడి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. గత ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్ లాభపడినందున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చివరి అరగంటలో అమ్మకాలు జోరుగా సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 197 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 76 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 273 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కాగా అనిల్ కంపెనీల షేర్ల క్షీణత కొనసాగింది. ఛాలెట్ లిస్టింగ్...స్వల్ప లాభం ఛాలెట్ హోటల్స్ షేర్ స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బీఎస్ఈలో ఈ షేర్ ఇష్యూ ధర, రూ.280తో పోలిస్తే 3.9 శాతం లాభంతో రూ.291 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 5.4 శాతం లాభంతో రూ.292 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 3.7 శాతం లాభంతో రూ.290 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 9.45 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 94 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,954 కోట్లుగా నమోదైంది. మెట్రో నగరాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహించే ఈ కంపెనీ గత నెల 29–31 మధ్య ఐపీఓకు వచ్చింది. -
లీటరు పెట్రోల్‌పై రూపాయి తగ్గింపు
కోల్‌కతా : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి గుద్దిబండలా మారాయి. రోజురోజుకు పైకి ఎగియడమే తప్ప, అసలు తగ్గడం లేదు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షాలు నిన్న భారత్ బంద్ కూడా చేపట్టాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న ఆందోళనలు పెల్లుబిక్కుతున్న ఈ సమయంలో రాష్ట్రాలు రేట్ల తగ్గింపుపై దృష్టిసారిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరపై వాహనదారులకు ఊరటనిచ్చింది. లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి ధర తగ్గించింది. ‘తాము పన్నులను పెంచడం లేదు. మేము నిరంతరం సామాన్య ప్రజల గురించే ఆలోచిస్తుంటాం. పెట్రోల్, డీజిల్ పరిమితిని మించి ఎగియడంతో, లీటరు ఇంధన ధరపై ఒక్క రూపాయి తగ్గించాలని నిర్ణయించాం’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వెంటనే సెంట్రల్ సెస్‌ను కేంద్రం ఉపసంహరించాలని కూడా మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఓ వైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, ధరలను పెంచుతున్నారని, సెస్‌ను పెంచుతున్నారని, ఈ రెండింటిన్నీ పెంచకూడదని అన్నారు. కాగా, మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. మహారాష్ట్రాలో అయితే ఏకంగా పెట్రోల్ ధర సరికొత్త రికార్డులో రూ.90 క్రాస్ చేసింది. న్యూఢిల్లీలో కూడా లీటరు పెట్రోల్ ధర రూ.80.87గా, కోల్‌కతాలో రూ.83.75గా, ముంబైలో రూ.88.26గా, చెన్నైలో రూ.84.07గా ఉన్నాయి. డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.72.97గా, కోల్‌కతాలో రూ.75.82గా, ముంబైలో రూ.77.47గా, చెన్నైలో రూ.77.15గా రికార్డయ్యాయి. ఆదివారం రాజస్తాన్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నును తగ్గించింది. ఈ ధరలపై 4 శాతం పన్ను రేట్లను తగ్గించినట్టు ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించారు. దీంతో ఆ రాష్టంలో లీటరు ఇంధన ధరలు రూ.2.5 తగ్గాయి. -
29 వస్తువులపై జీరో జీఎస్టీ
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 53 వస్తువులపై రేట్లను తగ్గించినట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వీటిలో ముఖ్యంగా హస్తకళల వస్తువులున్నట్టు పేర్కొన్నారు. 29 రకాల హస్తకళ వస్తువులను 0% శ్లాబులోకి తెచ్చామని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించినట్టు ప్రకటించారు. మార్పులు చేసిన జీఎస్టీ రేట్లను జనవరి 25 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించింది. అంతేకాక ఈ సమావేశంలో రిటర్న్స్, ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ-వే బిల్లు ఫిబ్రవరి 1 నుంచి కచ్చితంగా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే నేడు నిర్వహించిన ఈ సమావేశంలో కీలక అంశమైన పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చించలేదు. బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా.. కౌన్సిల్ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ వస్తువులపై మాత్రం జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు. -
కీలక వడ్డీరేటుపై ఆర్బీఐ గుడ్‌న్యూస్
ముంబై : మెజార్టీ విశ్లేషకుల అంచనాల ప్రకారమే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని ప్రకటించింది. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ, కీలక వడ్డీరేటు రెపోను పావు శాతం తగ్గించినట్టు బుధవారం ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న 6.25 శాతం రెపో రేటు, 6 శాతానికి దిగొచ్చింది. ప్రభుత్వ వర్గాల నుంచి పారిశ్రామిక ప్రతినిధుల నుంచి రెపో రేటు తగ్గింపునకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గత 10 నెలల కాలంలో మొట్టమొదటిసారి ఆర్బీఐ ఈ రేటు కోతను చేపట్టింది. రెపో రేటు అంటే బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వడ్డీరేటు. ద్రవ్యోల్బణ భయాల కారణతో ఇన్నిరోజులు యథాతథ రేటును కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ, ఇటీవల ద్రవ్యోల్బణ గణాంకాలు తీవ్ర కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో కోత నిర్ణయం ప్రకటించింది. ప్రతి పాలసీలోనూ మార్కెట్ వర్గాలను ఆర్బీఐ నిరాశపరుస్తూ వచ్చింది. కానీ ఈ పాలసీలో మార్కెట్లకు గుడ్‌న్యూస్ అందించింది.