కీలక వడ్డీరేటుపై ఆర్బీఐ గుడ్‌న్యూస్
కీలక వడ్డీరేటుపై ఆర్బీఐ గుడ్‌న్యూస్
Published Wed, Aug 2 2017 2:32 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM
ముంబై : మెజార్టీ విశ్లేషకుల అంచనాల ప్రకారమే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని ప్రకటించింది. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ, కీలక వడ్డీరేటు రెపోను పావు శాతం తగ్గించినట్టు బుధవారం ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న 6.25 శాతం రెపో రేటు, 6 శాతానికి దిగొచ్చింది. ప్రభుత్వ వర్గాల నుంచి పారిశ్రామిక ప్రతినిధుల నుంచి రెపో రేటు తగ్గింపునకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గత 10 నెలల కాలంలో మొట్టమొదటిసారి ఆర్బీఐ ఈ రేటు కోతను చేపట్టింది.
రెపో రేటు అంటే బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వడ్డీరేటు. ద్రవ్యోల్బణ భయాల కారణతో ఇన్నిరోజులు యథాతథ రేటును కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ, ఇటీవల ద్రవ్యోల్బణ గణాంకాలు తీవ్ర కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో కోత నిర్ణయం ప్రకటించింది. ప్రతి పాలసీలోనూ మార్కెట్ వర్గాలను ఆర్బీఐ నిరాశపరుస్తూ వచ్చింది. కానీ ఈ పాలసీలో మార్కెట్లకు గుడ్‌న్యూస్ అందించింది.
Advertisement
Advertisement