భారత్ ఎకానమీ సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత క్రమంగా రికవరీ బాటన పయనిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బులెటిన్ పేర్కొంది. పండుగల సీజన్, గ్రామీణ డిమాండ్ పెరుగుదల దీనికి దోహదపడుతున్న అంశాలుగా వివరించింది. ద్రవ్యోల్బణం(Inflation) అదుపులో ఉండడం– వృద్ధి సమతౌల్యతతో ప్రపంచ ఎకానమీ కూడా సవాళ్లను తట్టుకుంటూ పురోగమిస్తున్నట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ పేరుతో రూపొందించిన డిసెంబర్ బులెటిన్ విశ్లేషించింది.
ఆర్‌బీఐ బులెటిన్‌లో వ్యక్తమైన అభిప్రాయాలు రచయితలవి తప్ప, సంస్థకు చెందినవిగా పరిగణించరాదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని విశ్లేషించింది. తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండో క్వార్టర్‌లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయిలో 5.4 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: గగనతలంలో 1.42 కోట్ల మంది
ఆర్థిక వ్యవస్థ(economy) వృద్ధి రేటు క్షీణతకు ప్రధానంగా రెండు అంశాలు కారణమని రచయితులు తెలిపారు. స్థిరంగా మూలధనాన్ని సమకూర్చుకోవడం, సరైన రీతిలో ఉత్పత్తి చేయడం.. ఈ రెండు అంశాల్లో వస్తున్న మార్పుల వల్ల ద్రవ్యోల్బణం ప్రతికూలంగా మారుతుందని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ధరల ఒత్తిళ్ల కారణంగా ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment