Economic System
-
అడ్వయిజర్లతో ఆర్థిక ప్రణాళిక ఈజీ!
ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక అవసరం. వివిధ దశల్లో లక్ష్యాలను సాకారం చేసుకుంటూ విజయవంతంగా సాగిపోవడానికి మెరుగైన మార్గాన్ని చూపిస్తుంది. జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడం, అందుకు అనుగుణంగా పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పన, వాటి ఆచరణ ఇవన్నీ ఆర్థిక విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, మనలో ఎక్కువ మందికి ఆర్థిక అంశాలపై కావాల్సినంత అవగాహన ఉండదు. ఇలాంటప్పుడే నిపుణుల సేవలు అవసరం పడతాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత కాలం పాటు, ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలి? ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి.. వీటిని తేల్చడం నిపుణులకే సాధ్యపడుతుంది. అంతేకాదు పెట్టుబడి పెట్టడంతోనే పని ముగిసినట్టు కాదు. తమ లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. ఈ పనిని సులభతరం చేసే వారే ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు లేదా ఫైనాన్షియల్ ప్లానర్లు. వీరిని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఎవరు ఎంపిక చేసుకోవాలి? వీరి సేవలు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై అవగాహన కలి్పంచే కథనమిది... తమకు అనుకూలమైన ఆర్థిక సలహాదారును ఎంపిక చేసుకోవడం విజయంలో కీలకంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మంచి ట్రాక్ రికార్డు అని కాకుండా.. తమ లక్ష్యాల ప్రాధాన్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగే నిపుణులను ఎంపిక చేసుకోవడం అవసరం. ‘‘ఆర్థిక ప్రణాళిక ఆరంభించడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదు. ఎంత ముందుగా ఆరంభిస్తే అంత మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు’’ అనేది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మైంట్ అడ్వయిజర్ల, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ అభిప్రాయం. అందుకని కెరీర్ ఆరంభంలోనే ఆర్థిక నిపుణుల సాయంతో మెరుగైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, ఆ దిశగా అడుగులు వేయడం ద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకున్నట్టు అవుతుంది.నిజంగా అవసరమా? మన విద్యా వ్యవస్థ చాలా విషయాలను నేర్పుతుంది. కానీ ఆర్థిక విషయాలు, ప్రణాళికల గురించి ఎక్కడా కనిపించదు. వివాహం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కనీసం రూ.కోటి ఉంటేనే కానీ సొంతింటి కల సాకారం కాదు. పిల్లల విద్య కోసం ఏటా రూ.లక్షలు వెచి్చంచాలి. ఖరీదైన వైద్యం, రిటైర్మెంట్ తర్వాత జీవన అవసరాలు వీటన్నింటికీ సన్నద్ధంగా ఉండాలి. భారీ ఆదాయం ఆర్జించే వారికి తప్పించి, ప్రణాళిక లేకుండా వీటిని విజయవంతంగా అధిగమించడం సామాన్య, మధ్యతరగతి వారికి అంత సులభం కాదు. అర్హత కలిగిన, సెబీ రిజిస్టర్డ్ నిపుణుల సాయంతో వీటిని అధిగమించేందుకు తేలికైన మార్గాలను గుర్తించొచ్చు. ‘‘తమ జీవితంలో ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వయిజర్ లేదా ప్లానర్ అవసరం తెలిసొస్తుంది. ఇందుకు నిదర్శనం ఇటీవల చూసిన కరోనా విపత్తు. ఆ సమయంలో అత్యవసర నిధి సాయం ప్రాధాన్యాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారు’’ అని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్‌పీఎస్‌బీ) ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పేర్కొన్నారు. ఒకటికి మించి లక్ష్యాలు కలిగి, పొదుపు, మదుపు పట్ల ఆసక్తి కలిగిన వారు నిపుణుల సాయంతో అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఆర్థిక అంశాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న వారు సైతం.. పొదుపు, పెట్టుబడుల పట్ల తగినంత సమయం వెచి్చంచలేనట్టయితే నిపుణుల సాయానికి వెనుకాడొద్దు. అనుకోని అవసరాలు ఏర్పడితే కొందరు రుణాలతో అధిగమిస్తుంటారు. ఆ రుణం తర్వాత మళ్లీ రుణం ఇలా రుణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఎంత సంపాదించినా చివరికి మిగిలేదేమీ ఉండదు. స్వీయ తప్పిదాలు, అవగాహనలేమితో ఆర్థిక సంక్షోభాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థిక నిపుణులను కలవడం వల్ల లక్ష్యాల పట్ల స్పష్టత వస్తుంది. ఆర్థిక సవాళ్లను అధిగమించడం ఎలాగన్న స్పష్టత వస్తుంది. మెరుగైన బాట తెలుస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత సాధ్యపడుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక ఉన్న కుటుంబాల్లో మానసిక ప్రశాంతత పాళ్లు ఎక్కువని పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి.అందుబాటులో ఉన్న ఆప్షన్లు.. ఆర్ఐఏలు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు వీరు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనాన్స్ డిగ్రీ, కనీసం ఆయా విభాగంలో ఐదేళ్ల పాటు సేవలు అందించిన/పనిచేసిన అనుభవంతోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఐఎస్ఎం) నుంచి ఎక్స్ఏ, ఎక్స్‌బీ సర్టిఫికెట్ కలిగి ఉంటారు. వీరు తమ క్లయింట్ల ప్రయోజనాల కోసమే కృషి చేయాలి. ఎవరి నుంచి ఏ రూపంలోనూ కమీషన్లు స్వీకరించరాదని సెబీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.సీఏలుఅకౌంటింగ్, పన్ను, ఆడిట్ అంశాల్లో చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) ఎంతో శిక్షణ పొంది ఉంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ప్రత్యేక నైపుణ్యాలు సీఏలకు ఉండాలని లేదు. అయినా కానీ, పన్ను కోణంలో తమ క్లయింట్లకు పెట్టుబడుల సూచనలు చేయవచ్చు.సీఎఫ్‌పీలు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు తగిన కోర్సులు, పరీక్షలు పూర్తి చేసి ఎఫ్‌పీఎస్‌బీ నుంచి సర్టిఫికేషన్ పొందిన వారు. వ్యక్తుల ఆర్థిక ప్రణాళిక, పన్నులు, బీమా, రియల్ ఎస్టేట్ ప్లానింగ్ తదితర సేవలు అందిస్తారు.క్యూపీఎఫ్పీలు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ (క్యూపీఎఫ్‌పీ) ఆరు నెలల కఠోర శిక్షణ అనంతరం నెట్వర్క్ ఎఫ్పీ నుంచి క్యూపీఎఫ్‌పీ సర్టిఫికేషన్ పొందుతారు. పర్సనల్ ఫైనాన్స్ అంశాలు, నైపుణ్యాల గురించి వీరు పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటారు. తమ క్లయింట్ల ఆర్థిక శ్రేయస్సు దిశగా వీరు.. పొదుపు, పెట్టుబడులు, బీమా, పన్నులు, రుణాలు తదితర అన్ని రకాల వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో సేవలు అందిస్తారు.ఎవరిని ఎంపిక చేసుకోవాలి? సెబీ–ఆర్ఐఏలు లేదా సీఎఫ్‌పీలు, క్యూపీఎఫ్పీలలో ఎవరిని అయినా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, పెట్టుబడుల సలహాలు అందించాలంటే ముందుగా సెబీ నుంచి రిజి్రస్టేషన్ తీసుకోవాల్సిందే. అందుకే ఆర్ఐఏలకు అదనంగా సీఎఫ్‌పీ లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ) లేదా క్యూపీఎఫ్‌పీ అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం మెరుగైనదని నిపుణుల సూచన. సీఎఫ్‌పీ, సీఎఫ్ఏ, క్యూపీఎఫ్‌పీ, సీఏ అన్నవి అదనపు అర్హతలుగానే చూడాలి. ‘‘ఫైనాన్షియల్ ప్లానర్‌ను ఎంపిక చేసుకునే ముందు వారికున్న అర్హతలను నిర్ధారించుకోవాలి. వివిధ రకాల అర్హతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా వివిధ అవసరాలకు సరిపోయే విధంగా ఉంటాయి. క్లయింట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దిశగా కొందరు అడ్వయిజర్లు మార్గదర్శనం చేస్తారు. అదే సీఎఫ్‌పీలు అయితే సమగ్రమైన ఆర్థిక ప్రణాళికా పరిష్కారాలు సూచిస్తారు. రిటైర్మెంట్ కోసం ప్రణాళిక, ఎస్టేట్ ప్లానింగ్ (తదనంతరం వారసులకు బదిలీ), పన్ను ప్రణాళిక, వ్యక్తిగత ఆర్థిక అంశాలకు వీరు పరిష్కారాలు సూచిస్తారు. పెట్టుబడి సలహాదారుల మాదిరిగా కాకుండా సీఎఫ్‌పీలు ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా సమర్థవంతమైన పరిష్కార మార్గాలను చూపిస్తారు’’ అని ఎఫ్‌పీఎస్‌బీ సీఈవో క్రిషన్ మిశ్రా సూచించారు. సీఏలు తమ కోర్సులో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా అధ్యయనం చేస్తారు. అయినప్పటికీ ప్రాక్టీసింగ్‌కు వచ్చే సరికి ఎక్కువ మంది సీఏలు ప్రధానంగా పన్ను అంశాల్లో పరిష్కారాలు, సేవలకు పరిమితం అవుతుంటారు. కాకపోతే తమకున్న అర్హతలు, అనుభవం ఆధారంగా కొందరు ఇతర సూచనలు కూడా చేస్తుంటారు. సీఎఫ్‌పీ సర్టిఫికేషన్ కలిగిన సెబీ ఆర్ఐఏ మంచి ఎంపిక అవుతారని, ఆర్థిక ప్రణాళికపై వీరికి సమగ్రమైన అవగాహన ఉంటుందని గుడ్ మనీ వెల్త్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు మణికరణ్ సింఘాల్ సూచించారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎంపిక విషయంలో తమ స్నేహితులు, బంధువుల సాయాన్ని తీసుకోవచ్చు.ఫీజుకు తగ్గ ప్రతిఫలం! ఆర్థిక నిపుణుల సేవల గురించి తెలిసినా.. వారికి భారీగా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుందని కొందరు వెనకడుగు వేస్తుంటారు. నిజానికి నిపుణుల సేవలతో లాభపడే దాని కంటే వారికి చెల్లించే ఫీజు చాలా చాలా తక్కువ. కొంచెం మొత్తానికి వెనుకాడితే.. ఒక్క తప్పటడుగుతో భారీగా నష్టపోవాల్సి రావచ్చు. అందుకే కొంత ఖర్చయినా నిపుణులను ఆశ్రయించడమే మంచిది. సెబీ 2013లో ‘ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నిబంధనలు’ తీసుకొచి్చంది. అప్పటి వరకు కమీషన్ ఆధారితంగా వీరు సేవలు అందించే వారు. దీంతో ఎక్కువ కమీషన్ కోసం కొందరు తమ ప్రయోజన కోణంలో సలహాలు ఇచ్చే వారు. దీన్ని నివారించేందుకు.. ఫీజుల ఆధారిత నమూనాను సెబీ తీసుకొచి్చంది. సెబీ ఆర్ఐఏ చట్టం 2013 కింద.. స్థిరమైన ఫీజు లేదా, క్లయింట్ తరఫున తాము నిర్వహించే పెట్టుబడుల విలువలో నిర్ణీత శాతం (ఏయూఎం ఆధారిత) మేర ఫీజు కింద తీసుకోవచ్చు. ‘‘ఫీజు ఆధారిత సేవల నమూనాలో ఇన్వెస్టర్ విజయంపైనే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మెరుగైన సూచనలు అందించకపోతే, క్లయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. కమీషన్లకు అవకాశం లేకపోవడంతో ఎలాంటి పక్షపాతం లేని సూచనలు అందించడానికి వీలుంటుంది’’ అని మిశ్రా వివరించారు. ఆర్ఐఏలకు ఫీజులను డిజిటల్ విధానంలో, వారి ఖాతాకే చెల్లించాలి. నగదు రూపంలో, లేదా వేరెవరి ఖాతాకో బదిలీ చేయొద్దు.ఫీజు పరిమితులుఆర్ఐఏలకు సంబంధించి చార్జీల విషయంలో సెబీ పరిమితులు విధించింది. ఫిక్స్డ్ ఫీజు అయితే ఏడాదికి రూ.1.25 లక్షలు మించకూడదు. లేదా, ఇన్వెస్టర్ పెట్టుబడుల విలువలో ఏటా 2.5 శాతం మించి ఫీజు వసూలు చేయరాదు.ఈ అంశాలపై స్పష్టత అవసరం... ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు పూర్తి వివరాలు అందించినప్పుడే వారి నుంచి సరైన సూచనలు, సలహాలు పొందడానికి వీలుంటుంది. ముఖ్యంగా తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రుణాలు, ఆస్తులు, పిల్లలు, వారికి సంబంధించి విద్య, వివాహ లక్ష్యాలు, భవిష్యత్తులో ఏవేవి సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇత్యాది వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కోర్టు వివాదాలు, ఇతరత్రా కోరిన సమాచారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాల ఆధారంగా మెరుగైన ప్రణాళిక, సూచనలు, పరిష్కారాలు సూచించేందుకు ఆస్కారం ఉంటుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మహిళా సూక్ష్మ సంస్థలకు సంక్షోభాల రిస్క్
న్యూఢిల్లీ: మహిళల ఆధ్వర్యంలో నడిచే మెజారిటీ సూక్ష్మ సంస్థల వద్ద అత్యవసర నిధులు లేవని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైతే వీటిపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఓ నివేదిక తెలిపింది. మహిళలు నిర్వహించే సూక్ష్మ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ‘మైక్రోసేవ్ కన్సల్టింగ్’ (ఎంఎస్సీ) అనే సంస్థ సాధాన్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల పరిధిలో ఇది జరిగింది. 1,460 కంప్యూటర్ ఆధారిత వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించింది. వ్యాపార నిర్వహణ పరంగా ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకునేది, సవాళ్లు, ప్రేరణల గురించి మహిళలు తమ అంతరంగాన్ని ఈ సంస్థతో పంచుకున్నారు. ముఖ్య అంశాలు.. → ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం కావాల్సిన నిధులు లేవని 45 శాతం మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు. → వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక అంశాలను వేర్వేరుగా నిర్వహించే విషయంలో చాలా మంది సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో న గదు నిర్వహణ సంక్లిష్టంగా మా రడమే కాకుండా, కచ్చితమై న ఆర్థిక రికార్డుల నిర్వహణ లో రాజీపడాల్సి వస్తోంది. → 60 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు తమ సంస్థలకు సంబంధించి లిఖితపూర్వక రికార్డులు నిర్వహించడం లేదు. లాభాలు, వ్యాపార కార్యకలాపాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున ప్రత్యేకమైన రికార్డుల నిర్వహణ అవసరం లేదని వీరిలో 55 శాతం మంది భావిస్తున్నారు. మిగిలిన వారు రికార్డుల నిర్వహణలో ఉన్న సంక్లిష్టతలను వ్యక్తపరిచారు. రికార్డులు నిర్వహించకపోవడంతో వ్యాపార పనితీరు, ఆర్థిక సామర్థ్యాలను సమీక్షించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. → ఇక ఈ సంస్థల్లో 55% మంది ఎలాంటి ఉద్యోగులను కలిగి లేవు. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఉపా ధి కల్పనకు ఇవి ఏమంత తోడ్పడడం లేదు. -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్‌కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ
లోక్‌సభ 18వ ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై మీడియాలో సమీక్ష జరుగుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వృద్ధి రేటుతో 2024 ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిందని ఆర్థికవేత్తల అంచనా. ఇదే నిజమైతే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ప్రగతి అత్యంత వేగవంతంగా సాగినట్లేనని కూడా వారు భావిస్తున్నారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో నిరుద్యోగం కాస్త ఎక్కువగా ఉందనే ప్రచారం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బాగానే వినిపించింది. ఆధునిక భారతంలో పట్టణ, నగర ప్రాంతాల్లోనే అన్ని విధాలా అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, మారుమూల ప్రాంతాల్లో వృద్ధి అంతగా లేదని కొందరు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు స్థానాలు ఎగబాకి పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అయిదో స్థానానికి చేరుకుంది. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే దేశాన్ని మూడో స్థానానికి తీసుకెళతామని కూడా పాలకపక్షం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించింది. అగ్రశ్రేణి ఇకానమీగా అవతరించినప్పటికీ తలసరి ఆదాయం విషయంలో జీ–20 దేశాల్లో ఇండియా అట్టడుగున ఉందనే విషయాన్ని పాలకులు మరువకూడదని ఆర్థిక నిపుణులు కొందరు గుర్తుచేస్తున్నారు.ప్రపంచ దేశాల ఆర్థిక బలాబలాలను మదింపు చేసి, వాటి పరపతికి సంబంధించి రేటింగ్స్ ఇచ్చే ప్రఖ్యాత సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ ఈ నెలలో భారత సావరిన్ రేటింగ్ పరిస్థితిని ‘సుస్థిర’ (స్టేబుల్) నుంచి ‘సానుకూల’ (పాజిటివ్)గా అంచనావేసింది. బీబీబీ–రేటింగ్‌ను మాత్రం మార్చకుండా మెరుగైన భవిష్యత్తు ఉన్న దేశంగా ఇండియాను పరిగణిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తూ ముందుకు సాగడం వల్ల దాని పరపతిపై నిర్మాణాత్మక ప్రభావం ఉంటుందని ఎస్ అండ్ పీ పేర్కొంది.రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా..మార్చితో పోలిస్తే దేశంలో ఏప్రిల్ నెల వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. కీలకమైన ఈ సూచిక రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4%కు తగ్గకుండా కిందటి నెలలో 4.83% వద్ద నిలిచింది. వినియోగదారుల జీవన ప్రమాణాలను అధికంగా ప్రభావితం చేసే కీలకమైన ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం (ఫుడ్ ఇన్ఫ్లేషన్) మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో కొద్దిగా పెరిగింది (8.52% నుంచి 8.70%కు). 2023 నవంబర్ నుంచి ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8%కి పైనే ఉంటోంది. సామాన్య, పేద ప్రజలకు అత్యంత కీలకమైన ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అందుకే, సాధారణ ఎన్నికలను, పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు కిందటేడాది నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి గోధుమలు, బియ్యం, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది.అంతర్జాతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు21వ శతాబ్దం మొదటి పాతికేళ్ల చివరిలోకి వచ్చిన ప్రస్తుత సమయంలో నిరుద్యోగం కూడా ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. దేశంలో మార్చిలో 7.4%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.1%కు పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేట్ సంస్థ అంచనావేసింది. పట్టణ ప్రాంతాల్లో 19–29 ఏళ్ల యువతలో నిరుద్యోగం 2023 చివరి మూడు నెలలతో పోల్చితే స్వల్పంగా (16.5% నుంచి 17%కి) పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అంతర్జాతీయరంగంలో ఇండియా పలుకుబడి చెప్పుకోదగ్గ రీతిలో పెరిగిందనే నిపుణులు అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ బడా కంపెనీలను ఒక్క చైనా వైపే చూడకుండా ఇండియా రావాలని కోరుతూ ప్రోత్సాహకాలను అందిస్తానంటోంది. మొత్తంమీద భారత విదేశాంగ విధానం ఈ పదేళ్లలో చెప్పుకోదగిన విజయాలు సాధించిందని కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ మొదటి పక్షంలో కేంద్రంలో అధికారం చేపట్టే కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.-విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు. -
వృద్ధి గాథలో చూడాల్సిన కోణం
జీడీపీలో భారత్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. 1990ల్లో 17వ స్థానంలో ఉండేది. మూడు దశాబ్దాల క్రితం తలసరి ఆదాయంలో 161వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు కేవలం 159వ స్థానానికి మాత్రమే ఎగబాకింది. తలసరి ఆదాయం పెరగకుండా జీడీపీ పెరగడం దీనికి ఒక కారణం. భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్ పెరగాలంటే, సగటు వృద్ధి రేటు చాలా ఎక్కువుండాలి. గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినా, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ప్రపంచ దేశాలు ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఇదే. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉంది. 2030 నాటికి మన జీడీపీ మూడవ స్థానానికి చేరుకుంటుందని అంచనా. 1990ల ప్రారంభంలో, జీడీపీ పరంగా భారతదేశం 17వ స్థానంలో ఉండేది. ఈ విషయంలో దాని సాపేక్ష స్థానం గణనీయంగా మెరుగు పడిందనడంలో సందేహం లేదు. అయితే, తలసరి ఆదాయం ప్రాతి పదికన, భారతదేశం 1990ల ప్రారంభంలో 161వ స్థానంలో ఉండగా ఇప్పుడు 159వ స్థానంలో ఉంది. అంటే, తలసరి ఆదాయం పరంగా భారతదేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా 17వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకున్న కాలంలోనూ పెద్దగా మారలేదు. ఎందుకు? తలసరి ఆదాయాన్ని పెంచకుండా యాంత్రికంగా జీడీపీని పెంచే జనాభా పెరుగుదలే దీనికి కారణమని అనుకోవచ్చు. కానీ అది కారణం కాదు. వాస్తవానికి, జనాభా పరంగా భారతదేశ సాపేక్ష స్థానం ఈ కాలంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద (చైనా తర్వాత) దేశంగా ఉంది. అంతే కాదు, చర్చిస్తున్న కాలంలో జనాభా పెరుగుదల రేటు విషయంలో భారత్‌కూ, ప్రపంచ సగటుకూ గణనీయంగా తేడా లేదు. పైగా కాలక్రమేణా, దాని జనాభా పెరుగుదల రేటు తగ్గింది. 1991, 2021 మధ్య తలసరి స్థూల దేశీయోత్పత్తి ఏడు రెట్లు ఎక్కువ పెరిగిందనే వాస్తవంలో కొంత సమాధానం ఉంది. ద్రవ్యో ల్బణం ప్రభావాన్ని మినహాయిస్తే, దేశ తలసరి వాస్తవ జీడీపీ దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు చూడవచ్చు. అయినప్పటికీ, జీడీపీ ర్యాంకింగ్ మెరుగుపడి తలసరి జీడీపీ ఎందుకు స్తబ్ధుగా ఉంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దేశ తలసరి జీడీపీ దశాబ్దంలో రెట్టింపు అయిందనుకుందాం. ఆ దేశాలు ఇప్పటికే తలసరి సగటు జీడీపీని ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే లేదా అవి కూడా సహేతుకమైన అధిక రేటుతో వృద్ధి చెందుతున్నట్లయితే, ఇతర దేశాలతో పోలిస్తే దాని సాపేక్ష స్థితిలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ, ఆ దేశ జనాభా ఎంత పెద్దదైతే, మొత్తం జీడీపీ విలువ ఆ జనాభా దామాషా ప్రకారం అంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, దాని జనాభా రెట్టింపు అయితే, మొత్తం జీడీపీ నాలుగు రెట్లు పెరుగుతుంది. మనం దీనిని జనాభా గుణకం ప్రభావం అని పిలవవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే అధిక జనాభా ఉన్న దేశ సాపేక్ష స్థానం జీడీపీ పరంగా పెరిగే అవ కాశం ఉంది. ఈ పెద్ద జనాభా గుణకం కారణంగానే భారతదేశం 1990ల ప్రారంభం నుండి ఇప్పటి వరకు జీడీపీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎదగగలిగింది. కానీ భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్‌ను పెంచడానికి సగటు వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి. అనేక దశాబ్దాలుగా జీడీపీ ర్యాంకింగ్‌లో భారత్ సాధిస్తున్న మెరుగుదల వెనుక... అధిక జనాభా, తలసరి జీడీపీకి చెందిన అధిక వృద్ధిరేటు కలయిక దాగి ఉంది. చైనాతో పోల్చి చూద్దాం. 1991, 2021 మధ్య, జీడీపీలో చైనా ర్యాంక్ 11 నుండి 2వ స్థానానికి పెరిగింది. అదే సమయంలో సగటు తలసరి ఆదాయంలో దాని స్థానం 158 నుండి 75కి పెరిగింది. ఈ కాలంలో దాని తలసరి జీడీపీ 38 రెట్లు పెరిగింది. అయితే భారతదేశ తలసరి జీడీపీ కేవలం ఏడు రెట్లు మాత్రమే పెరిగింది. చైనాలో ఎక్కువ జనాభా ఉన్నందున, జనాభా గుణకం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వారు సగటు తలసరి ఆదా యాన్ని కూడా అనేక రెట్లు పెంచుకోగలిగారు. కాబట్టి మొత్తం ఆదాయం, తలసరి ఆదాయం రెండింటిలోనూ వారి సాపేక్ష స్థానం మెరుగుపడింది. ఇప్పుడు, అసమానతల వెలుగులో, జీడీపీ లేదా జాతీయ ఆదాయం అనేది సగటు వ్యక్తి జీవన నాణ్యతకు నమ్మదగిన కొల మానం కాదని అందరికీ తెలుసు. ధనవంతులైన 10 శాతం మంది ఆదాయం 10 శాతం పెరిగి, మిగిలిన వారి ఆదాయం అలాగే ఉంటే, జాతీయ ఆదాయం 10 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. తలసరి జీడీపీ ఈ విషయంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణానికి కొంచెం ఎక్కువ విశ్వసనీయ సూచికగా ఉంటుంది. ఈ ఉదాహరణలో, తల సరి ఆదాయం 1 శాతం మాత్రమే పెరుగుతుంది. అభివృద్ధి పరంగా నిజమైన ప్రశ్న ఏమిటంటే, మొత్తం లేదా సగటు జాతీయ వృద్ధిరేటు సాధారణ జనాభా జీవన ప్రమాణాల పెరుగుదలను ఎంతవరకు ప్రతిబింబిస్తుంది అనేది. ఇప్పుడు, అధిక జనాభా కలిగిన దేశం తన తలసరి ఆదాయాన్ని దీర్ఘకాలంపాటు పెంచగలిగితే, పేదల ఉనికి ఎల్లప్పుడూ సగటు కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంత విశ్వసనీయతకు అర్హమైనది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్‌పై దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఏమిటి? ఈ గణాంకాలు మొత్తం చిత్రాన్ని పట్టుకోకపోయినా, ఇంకేదాన్నో సూచిస్తాయి. మార్కెట్ సైజు, జీడీపీ వృద్ధి లాభాల్లో సింహభాగాన్ని కైవసం చేసుకుంటున్న జనాభాలోని అతి చిన్న భాగపు సౌభాగ్యం ఇందులో ఉంది. అత్యధిక రాబడిని కోరుకునే మార్కెట్లు లేదా సరళ మైన గ్లోబల్ క్యాపిటల్‌పై నిశితమైన దృష్టిని కలిగి ఉన్న బహుళజాతి సంస్థలు మొత్తం లేదా తలసరి జీడీపీ గురించి పట్టించు కోవు. గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని ఒక చిన్న భాగం వారికి ముఖ్యం. గత మూడు దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగం జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భారత దేశ జనాభాకు సంబంధించి అది చిన్నదే అయినప్పటికీ, మార్కెట్‌గా ఆ సమూహ పరిమాణం తక్కువ కాదు. ఎందుకంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్ మొత్తం జనాభా భారతదేశ మొత్తం జనాభాలో 4–5 శాతానికి దగ్గరగా ఉంటుంది. చిన్న దేశాలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండవచ్చు లేదా వేగంగా వృద్ధి చెందవచ్చు, కానీ మార్కెట్ పరిమాణం కారణంగా భారతదేశం ముఖ్యమైనది. కాబట్టి మొత్తం జీడీపీ విలువ లేదా దాని వృద్ధి రేటు అభివృద్ధికి కొలమానంగా బలహీనంగా ఉన్నప్పటికీ లేదా జనాభాలో అధిక భాగం పేదగా ఉన్నప్పటికీ, ఇది బాగా డబ్బున్న, సంపన్న సమూహపు కొనుగోలు శక్తికి సూచిక. ఆర్థిక వ్యవస్థలోని ఈ విభాగం లగ్జరీ కార్లు లేదా ఫ్యాన్సీ స్మార్ట్ఫోన్ల మార్కె ట్‌గా పరిమాణ పరంగా చూస్తే అనేక సంపన్న దేశాలతో పోటీపడ గలదు. అదే సమయంలో మెరిసే షాపింగ్ మాల్స్, విలాసవంతమైన వస్తువులు, సేవల వినియోగం పెరగడం వల్ల భారత్ ప్రకాశిస్తున్నట్లు భ్రమ కలగవచ్చు. మార్కెట్ పరిమాణం ఎందుకు ముఖ్యమైనది? మొదటిది, భారీ స్థాయి తయారీ పరిశ్రమలకు సంభావ్య కొనుగోలుదారుల పరంగా నిర్దిష్ట పరిమాణంలోని మార్కెట్ అవసరం. లేకపోతే, పెట్టుబడి లాభ దాయకం కాదు. రెండవది, తలసరి ఆదాయంతో సంబంధం లేకుండా, ఒక పెద్ద దేశం జనాభాలో కొంత భాగం ఆదాయం నిర్దిష్ట పరిమి తిని మించి ఉంటే, దాని డిమాండ్లు అవసరాల నుండి విలాసాలకు మారుతాయి. కాబట్టి, జీడీపీ పరంగా భారతదేశ పెరుగుదల పూర్తిగా గణాంక నిర్మాణమేననీ, ఇది సామాన్యుల జీవన ప్రమాణాన్ని ప్రతిబింబించదనీ లేదా సగటు తలసరి ఆదాయం పెరగలేదనీ ఎవరైనా అనుకుంటే... వాళ్లు అసలు కథను విస్మరిస్తున్నట్టు. కొనుగోలు శక్తి జనాభాలోని నిర్దిష్ట విభాగానికి విపరీతంగా పెరిగింది. కాకపోతే సమస్య ఏమిటంటే– సప్లయ్, డిమాండ్ ఆట ఒక చిన్న విభాగానికే పరిమిత మైతే... అది జనాభాలో ఎక్కువ భాగానికి విస్తరించకపోతే ఆర్థిక వృద్ధి స్తబ్ధతకు గురవుతుంది. కోవిడ్ మహమ్మారి ముందు కనిపించిన వృద్ధి క్షీణత సంకేతాలు దానికి ప్రతిబింబం కావచ్చు. మైత్రీశ్ ఘటక్ వ్యాసకర్త లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Oxfam Inequality Report 2024: డబ్బు ఉన్నవారు.. లేనివారికి మధ్య ఇంత తేడా..!
ప్రపంచంలో ఆదాయం, సంపదపరంగా తీవ్ర అసమానతలు రాజ్యమేలుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దాంతో ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, దిగువ శ్రేణివారి పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి అయిదుగురి నికర సంపద విలువ, కొవిడ్ మహమ్మారి వ్యాపించిన 2020 తర్వాత రెట్టింపునకు పైగా పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. అదే సమయంలో 500 కోట్లమంది మాత్రం మరింత పేదరికంలోకి వెళ్లారని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ‘ఇనీక్వాలిటీ ఇంక్.’ పేరుతో రిపోర్ట్ విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. కంపెనీ లాభాలు పెరిగినా.. ఉద్యోగాల్లో కోత అతిపెద్ద కంపెనీల్లో డెబ్భై శాతం సంస్థల్లో ఒక బిలియనీర్ సీఈఓ ఉన్నారు. ఈ కంపెనీలు 10.2 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నాయి. అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల జీడీపీల కంటే అధిక సంపద వీరి వద్దే ఉంది. గత మూడేళ్లలో 148 పెద్దకంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను నమోదు చేశాయి. ఏటా సగటున 52 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు లక్షల మంది ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. 500 కోట్ల మంది పేదలు.. ప్రపంచంలోని అగ్రగామి అయిదుగురు ధనవంతులు ఇలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020 నుంచి 405 బిలియన్ డాలర్ల (రూ.33.61 లక్షల కోట్ల) నుంచి 464 బిలియన్ డాలర్లు (రూ.38.51 లక్షల కోట్లు) పెరిగి 869 బిలియన్ డాలర్ల (రూ.72.12 లక్షల కోట్ల)కు చేరింది. అంటే గంటకు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.116 కోట్ల) చొప్పున వీరు సంపదను పోగేసుకున్నారు. ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 లక్షల కోట్ల డాలర్ల అదనపు సంపదను పోగేసుకున్నారు. ఇదే సమయంలో 500 కోట్ల మంది సామాన్యులు మాత్రం మరింత పేదలయ్యారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచం వీరిలో నుంచి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల సంపద)ను చూడడానికి ఒక దశాబ్దం పడుతుంది. పేదరికం మాత్రం మరో 229 ఏళ్లకు గానీ అంతం కాదు. భారీగా తగ్గిన కార్పొరేట్ పన్నులు.. ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉండగా.. తాజాగా అది 23.1 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని వేతనాలు.. ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ.. సంపద మాత్రం 69 శాతం వీటి దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు. ఇదీ చదవండి: మురికివాడ రూపురేఖలు మార్చనున్న అదానీ..? మహిళల కంటే పురుషుల వద్దే అధికం.. ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు(రూ.8.23 కోట్లు) ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగింతలు అధికం. -
జీడీపీ గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలపై ఆధారపడి కదిలే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వివరాలు గురువారం(30న) వెల్లడికానున్నాయి. అక్టోబర్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు సైతం ఇదే రోజు విడుదలకానున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. గురువారం నవంబర్ డెరివేటివ్స్ సిరీస్ గడువు ముగియనుంది. శుక్రవారం(డిసెంబర్ 1న) తయారీ రంగ పనితీరు వెల్లడించే నవంబర్ పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్ ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. ఇతర అంశాలూ కీలకమే.. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకంతోపాటు.. దేశీయంగా రూపాయి కదలికలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 83.38వరకూ నీరసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముడిచమురు ధరలు, యూఎస్ బాండ్ల ఈల్డ్స్‌కు సైతం ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మీనా తెలియజేశారు. నవంబర్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వారాంతాన ఆటో రంగ దిగ్గజాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ నందా తెలియజేశారు. వీటికితోడు యూఎస్ జీడీపీ, యూఎస్ పీఎంఐ, చమురు నిల్వలు, యూరోజోన్ సీపీఐ తదితర గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. వడ్డీ రేట్ల ప్రభావం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. హెచ్చుతగ్గుల మధ్య నికరంగా సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు లేదా పెట్టుబడులు ఈ వారం కొంతమేర ప్రభావం చూపనున్నట్లు మీనా పేర్కొన్నారు. యూఎస్‌లో అంచనాలకంటే అధికంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో విశ్వాసం నెలకొననున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు యోచనను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో పదేళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ రెండు వారాల క్రితం నమోదైన 5 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చాయి. వెరసి దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల అమ్మకాలు నెమ్మదించవచ్చని తెలియజేశారు. -
వరదలా విదేశీ డబ్బులు.. ప్రపంచంలోనే తొలి స్థానంలో ప్రవాస భారతీయులు
వంద బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో సుమారు 8 లక్షల కోట్లు! గతేడాది విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తమిది! ఇలాంటి చెల్లింపుల్లో ప్రవాస భారతీయులు ప్రపంచంలోనే టాప్! అయితే ఏంటి? చాలా ఉంది! ఈ మొత్తం అనేక మందికి అన్నం పెడుతోంది! పేదరికం తగ్గేందుకు, ప్రజల ఆరోగ్యం మెరుగయ్యేందుకు, నవజాత శిశువులు పుష్టిగా ఉండేందుకూ కారణమవుతోంది..ఎలా? ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022–23లో ప్రపంచం మొత్తమ్మీద అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు పంపిన మొత్తం 80,000 కోట్ల డాలర్లు. ఈ విషయంలో అన్ని దేశాల కంటే తొలి స్థానంలో ఉన్న భారత్‌కు విదేశాల్లోని భారతీయులు వంద బిలియన్ డాలర్లు పంపితే, అరవై బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది. విదేశాల్లో ఉన్న మన బంధువులు లేదా మిత్రులు ఇంటికి పంపే డబ్బుల్ని ఇక్కడ రకరకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదులుతూ ఉంటాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయమూ లభిస్తుంటుంది. పైగా మధ్యవర్తి లేకుండా నేరుగా డాలర్లు భారత్‌కు వస్తుంటాయి. ఈ డాలర్లను ప్రభుత్వం ముడిచమురు, తదితర కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఎగువన ఉన్న వారికీ... దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారినే కాకుండా ఎగువన ఉన్న వారికీ ఈ చెల్లింపులు ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దారిద్య్రరేఖకు కొంచెం ఎగువన ఉన్న వారు కూడా కిందకు పడిపోతారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని బంధుమిత్రులు పంపే అదనపు మొత్తాలు బాధితులు పుంజుకునేందుకు ఉపయోగపడతాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2018 ఆగస్టు నాటి భారీ వరదల సమయంలో భారత్‌కు చెల్లింపులు దాదాపు 14 శాతం వరకూ పెరిగాయి. అంతెందుకు 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినా, విదేశీ పెట్టుబడులు తగ్గిపోయినా ఈ రకమైన చెల్లింపులు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వాలకు నమ్మకంగా వచ్చిపడే విదేశీ మారక ద్రవ్యం ఇది. వ్యయం తడిసిమోపెడు! అంతాబాగానే ఉంది కానీ.. ఇటీవలి కాలంలో చెల్లింపుల కోసం అయ్యే వ్యయం తడిసిమోపెడు అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ అధ్యక్షతన ప్రస్తుతం జరుగుతున్న జీ20 సమావేశాల్లోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరగడం గమనార్హం. డాలర్ మారకం విలువల్లోని తేడాలు, పంపేందుకు, అందుకునేందుకు చెల్లించాల్సిన కమీషన్లు ఎక్కువగా ఉండటం వల్ల చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం. ప్రస్తుతం ఈ కమీషన్లు, మారక విలువల్లోని తేడాలనీ కలిపి ప్రతి చెల్లింపునకూ 6.24 శాతం మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తోంది. చదవండి: మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ? అయితే మూడేళ్ల క్రితం ఇది ఏడు శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో దీనిని మూడు శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బులు మార్పిడి చేసే కంపెనీలు మరిన్ని అందుబాటులో ఉండేలా చేసి వాటి మధ్య పోటీ పెంచాలన్నది ఈ దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఒకటి. ఆయా దేశాలు ఈ చెల్లింపులపై విధిస్తున్న పన్నులను తగ్గించేందుకు, వీలైతే పూర్తిగా మాఫీ చేసేలా కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యయం తగ్గించుకునేందుకు వలస కార్మికులు లేదా ఉద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించడం వల్ల కొన్నిసార్లు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని ఈ వ్యయాన్ని వీలైనంతగా తగ్గిస్తే వినియోగదారులకు లాభం చేకూరడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. విదేశాలకూ పెరుగుతున్న చెల్లింపులు దశాబ్దాలుగా విదేశాల నుంచి భారత్‌కు ‘‘చెల్లింపులు’’ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో విదేశాలకు వెళుతున్న మొత్తం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం గత ఏడాది ఈ మొత్తం 2,710 కోట్ల డాలర్లకు చేరుకుంది. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు తమ వ్యక్తిగత అవసరాల కోసం (పర్యాటకం, విద్య, అనుమతులు అవసరం లేని పెట్టుబడులు) ఏటా దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. 2004లో ఇది రూ.24 లక్షలు మాత్రమే. 2015లో ఈ పరిమితిని పెంచారు. దీంతో 2004లో విదేశాలకు వెళ్లే మొత్తం 460 బిలియన్ డాలర్లు కాగా 2022 నాటికి 2,710 కోట్ల డాలర్లకు చేరింది. 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే.. గత ఏడాది చెల్లింపుల్లో దాదాపు 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే అందుకున్నాయి. కొన్ని దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఈ చెల్లింపులు ఉండటం గమనార్హం. కాగా ఈ డబ్బులు పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై మూడేళ్ల క్రితం మారియా ఫాషోలిన్సే అనే శాస్త్రవేత్త ఒక అధ్యయనం నిర్వహించారు. కార్మికులను ఇతర దేశాలకు పంపే 25 ఆసియా దేశాలను ఎంచుకుని ఈ అధ్యయనం చేశారు. వలసలు, చెల్లింపులపై ప్రపంచబ్యాంకు వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆయా దేశాల్లోని పేదల సంఖ్య, వారిలో ఉండే అంతరం (కటిక పేదలు.. ఓ మోస్తరు పేదలు) వంటి వివరాలు సేకరించారు. వీటిద్వారా ఆయా దేశాల్లో పేదరికం ఎంతమేరకు ఉందన్నది నిర్ధారించుకున్నారు. రోజుకు రెండు డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ప్రపంచబ్యాంకు పేదల కింద లెక్కవేస్తుంది. ఈ వివరాలను పొందుపరిచి గణితశాస్త్ర సూత్రాల ప్రకారం లెక్క వేస్తే విదేశాల నుంచి వీరికి అందే చెల్లింపుల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమైంది. ఒకొక్కరికి అందే డబ్బులు పది శాతం పెరిగినా ఆ దేశంలో పేదరికంలో ఉన్న వారి శాతం (వంద మందిలో పేదల సంఖ్య) 0.4 శాతం తగ్గుతుందని తేలింది. చెల్లింపుల డబ్బులతో పేదలు మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. పిల్లలను చదివించుకునేందుకూ వీలేర్పడుతోంది. ఆపత్కాలాన్ని కూడా తట్టుకుని వీరు బతకగలుగుతున్నారు. - (కంచర్ల యాదగిరిరెడ్డి) -
సాయం కాదు, సంక్షోభాలు ఆపాలి!
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉన్న వనరులు ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ద్వారా లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఐఎంఎఫ్ కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. ఐఎంఎఫ్ తలకెత్తుకుంటున్న చాలా పనులు ఇతర సంస్థలు ఇంతకంటే మెరుగ్గా నిర్వహించగలవు. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్పగలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. ఇదే సూత్రం ఐఎంఎఫ్కూ వర్తిస్తుంది. ఎలాగైతే వాతావరణ మార్పుల మీద ప్రపంచ బ్యాంక్ ఏమీ చేయలేకపోతున్నదో, దాని కవల అయిన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సంస్థ కూడా దాని ప్రధాన కార్యకలాపాలపై చేష్టలుడిగి చూస్తోంది. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. కానీ అమెరికాలో బ్యాంకులు కుప్ప గూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపులకు లోనవుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచడటంతో ఎదుగుతున్న మార్కెట్లలో రుణాలకు డిమాండ్ పెరిగిపోతోంది. అయినా వీటిని ఎదుర్కోవడంలో ఐఎంఎఫ్ ప్రధాన భూమిక పోషించడం లేదు. లింగవివక్ష, మానవాభివృద్ధి వంటి అంశాల మీద దృష్టి పెడుతూ– అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొ నేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు వృద్ధిని పెంచుకునేలా, పేదరి కాన్ని తగ్గించుకునేలా రూపొందించే కార్యక్రమాల మీద ఐఎంఎఫ్ తన మొత్తం శక్తిని వెచ్చిస్తోంది. కానీ ఇతర సంస్థలు కూడా ఈ పనులు మెరుగ్గా నిర్వహించగలవు. నిఘా నామమాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఐఎంఎఫ్‌పై ప్రధానంగా ఆరు అభ్యంతరాలు వినిపిస్తాయి! ఆర్థిక మార్కెట్ల అస్థిరత్వానికి దారితీసే ఓపెన్ కేపిటల్ మార్కెట్లకు అవసరానికి మించి మద్దతివ్వడం వీటిల్లో ఒకటి. ఇక రెండో విమర్శ... అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు భిన్నమైన సలహాలివ్వడం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిఘా నామమాత్రంగా సాగడం, ఆ దేశాల విధానాలపై విశ్లేషణ కూడా అంతంతమాత్రంగానే చేయడం మూడో విమర్శ. దీని ప్రభావం చిన్న దేశాలపై కూడా పడుతుందన్నది ఇక్కడ గమనించా ల్సిన విషయం. ప్రపంచస్థాయి సంక్షోభాలను ముందుగానే గుర్తించగలిగే ఐఎంఎఫ్ అసమర్థత కూడా దీనికి జత కలుస్తుంది. ఇప్పుడు నాలుగో విమర్శ విషయానికి వద్దాం. ఐఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాల పరిమాణం ఏకపక్షంగా ఉంటుంది. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాలు తమ కోటా కంటే 30 రెట్లు అదనంగా ఐఎంఎఫ్ ప్రయోజనాలు పొందుతూంటాయి. ఒక వైపు యుద్ధం జరుగుతూండగా, ఉక్రెయిన్ లో సుమారు 1500 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును హడావిడిగా ఆమోదించారు. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కేవలం 300 కోట్ల డాలర్ల సాయం కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చింది. శ్రీలంకకు మిత్రుడని చాటుకున్న చైనా కూడా సాయం కోసం ఏడాదిపాటు నిరీక్షింపజేసిన విషయం గమనార్హం. జీ7 దేశాల రాజకీయ మద్దతు లేకుంటే ఇంతకంటే చాలా తక్కువ మొత్తాలకు కూడా చిన్న దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలా చిన్న మొత్తాలను తీసుకున్నప్పుడు పొదుపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలూ తక్కువగా ఉంటాయి. బకాయిల వల్ల రుణాలివ్వడం నిలిపేసిన తరువాత కూడా ఐఎంఎఫ్ వరుసగా రుణాలిస్తోందన్నది ఐదవ విమర్శ. ఈ రుణాలు దివాళా తీయడానికే కాకుండా, ద్రవ్య లభ్యత లేమికీ ఇస్తూండటం గమనార్హం. ఐఎంఎఫ్ తరచూ ప్రైవేట్ రుణదాతలకూ డబ్బులిస్తూంటుంది. అది కూడా వారి వాణిజ్య ప్రభుత్వాలకిచ్చిన రుణాలు ప్రజా రుణంగా మారిన తరువాత కూడా. ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత పౌరు లపై పడుతుంది. ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 25 శాతం (48) తమ సభ్యత్వ కాలంలో సగంకాలం రుణగ్రహీతలుగా కొనసాగుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, ఐఎంఎఫ్ ప్రాపకంలో ఉన్నాయన్నమాట. చివరిగా ఐఎంఎఫ్‌పై ఉన్న ఆరో విమర్శ... ఐక్యరాజ్య సమితి లోని పలు విభాగాలు లేదా బ్యాంకులు చేయదగ్గ పనుల్లో ఐఎంఎఫ్ వేలు పెడుతూండటం. రెసిలియన్్స అండ్ ట్రస్ట్ ఫెసిలిటీ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త పథకం ద్వారా ఇరవై ఏళ్ల గరిష్ఠ పరిమితితో సామాజిక కార్యక్రమాలకు రుణాలిస్తోంది. ఇది కాస్తా ఐఎంఎఫ్‌ను ఏదో అంతర్జాతీయ సహాయ సంస్థ స్థాయికి మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచస్థాయి సమస్యలకు పనికిరాదు? 2008–09 ఆర్థిక మాంద్యం, 2020 నాటి కోవిడ్, తాజాగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధం... ఈ అంశాలపై ఐఎంఎఫ్ వ్యవహారశైలిని గమనిస్తే, తనకున్న నియమ నిబంధనలు, వనరులను దృష్టిలో ఉంచుకుంటే... అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఈ సంస్థకు లేదనే చెప్పాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ఆయా ప్రాంతాల్లోని దేశాలు చేసుకునే ఒప్పందాల ప్రకారం లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఐఎంఎఫ్ వద్ద ఉన్న వనరులు ఇప్పుడు సుమారు లక్ష కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. ఇది ఒకట్రెండు దేశాల ఆర్థిక సంక్షోభాలను గట్టెక్కించేందుకూ ఉపయోగపడని పరిస్థితి. అంతర్జాతీయ సంక్షోభాల మాట సరేసరి. ఈ మొత్తంలోనూ సగం సొంత వనరుల నుంచి సమ కూర్చున్నవి కాగా, మిగిలిన సగం విచక్షణపై లభించే రుణ ఏర్పాట్లు. ఐఎంఎఫ్ మూలధనాన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవస రముంది. అలాగే జీడీపీ ఆధారంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లూ చేయాలి. రుణాలపై సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్న ఈ తరుణంలో ఇది మరీ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఐఎంఎఫ్ ప్రాంతీయ స్థాయిలో లిక్విడిటీ ఏర్పాట్లు చేయడం ద్వారా సూక్ష్మ స్థాయిలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటునందించాలి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) కింద సుమారు 660.7 బిలియన్లు ఉండగా(ఇది కరెన్సీ కాదు) ఇవి సుమారు 950 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ప్రపంచ జీడీపీలో ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ. ఒక్కో ఎస్డీఆర్ జారీ రాజకీయ ప్రభావానికి గురవుతూంటుంది. ఎస్‌డీఆర్‌లు ఐదేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌గా జారీ అయ్యేలా చూడాలి. అలాగే వీటి మొత్తం జీడీపీలో కనీసం ఒక్కశాతం ఉండేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు ఎక్కువ షేర్లు కేటాయించేలా ఏర్పాట్లు చేయా ల్సిన అవసరముంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఇప్పు డున్న పరిస్థితుల్లో చాలా కష్టం. చిట్ట చివరి రుణ వితరణ సంస్థగా ఉండాలి ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా సంస్కరణలకు లోనైన ఐఎంఎఫ్ ఉండాలి. అలాగే ఇది కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. సూక్ష్మస్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలే గానీ... సాయం చేసే సంస్థగా మారకూడదు. ఐఎంఎఫ్‌ను చిట్టచివరి రుణ వితరణ సంస్థగా మాత్రమే పరిగణించాలి. ఉనికిలో ఉండేందుకు మాత్రమే కొత్త కొత్త పథకాలను సృష్టించడం, రుణ వితరణ చేపట్టడం చేయరాదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్ప గలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. సెంట్రల్ బ్యాంక్స్ పరస్పర సహకారాన్ని ఐఎంఎఫ్ ప్రోత్సహించాలి. అలాగే ప్రాంతీయ స్థాయిలో సహాయానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఇలాంటి ప్రయత్నాలను ఐఎంఎఫ్ నిరోధించిన మాట అందరికీ తెలిసిందే. అన్ని దేశాలకు సాయం చేసే ఏకైక సంస్థగా మారడం కాకుండా... ఆర్థిక సుస్థిరత కోసం బహుముఖీనంగా పని చేసే మరింత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నించాలి. అజయ్ ఛిబ్బర్ వ్యాసకర్త జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్ (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
ప్లీజ్.. ఛాయ్ తాగడం తగ్గించండి: పాక్ మంత్రి
Pak import tea on loan: పాకిస్తాన్‌లోని ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న పౌరులకు...పాక్ స్థానిక మంత్రి ఒకరు తాజాగా ఒక సలహ ఇచ్చారు. టీ వినియోగాన్ని తగ్గించాలని పాక్ మంత్రి ప్రజలను కోరారు. టీని కూడా అప్పుగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ప్రజలను టీ తాగడం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పాక్‌లో విదేశీ మారక నిల్వలు తగ్గడంతో.. దిగుమతుల బిల్లును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నగదు కొరతతో సతమతమవుతున్న టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరాడు ఆయన. అదీగాక 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాక్ సుమారు రూ.2 వేల కోట్ల టీని వినియోగించిందని తేలడంతో పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఈ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన పాక్ టీని దిగుమతి చేసుకోవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పారు. గతేడాది కంటే రూ. 4 వందల కోట్ల టీని పాక్ అధికంగా దిగుమతి చేసుకుందని తెలిపారు. ఐతే పాక్ మంత్రి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ...నెటిజన్లు పాక్ ప్రభుత్వ తీరుని, ఆయన్ను విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలు అట్టించారు. అంతేకాదు ఆయన గతంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు రాత్రి 8.30 గంటలకు మార్కెట్లను మూసివేయాలని వ్యాపారులను కోరినట్లు ప్రణాళిక మంత్రి తెలిపారు. పైగా ఇది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లును తగ్గించడానికి సహాయపడుతుందని ఇక్బాల్ అన్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక వ్యవస్థలా మారిపోతుందంటూ హెచ్చరించారు. (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
AP: గ్రామాలకు ఆర్థిక స్వాతంత్య్రం
సాక్షి, అమరావతి : గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించింది. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులకు వీలుగా ప్రతి పంచాయతీ పేరిట బ్యాంకుల్లో ముందస్తుగానే నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ పేరిట ఇప్పటికే బ్యాంకుల్లో (వ్యక్తిగత ఖాతాలను) పీడీ ఖాతాలను తెరిచింది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతి తీసుకోవడం వంటివి కూడా ఉండవు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేటాయించే దాదాపు రెండు వేల కోట్లకు పైగా నిధులను ఏటా ఆయా బ్యాంకు ఖాతాల్లో జమచేసే అవకాశముంది. అకౌంట్ టూ అకౌంట్‌కి మాత్రమే బదిలీ గ్రామాలకు కొత్తగా పూర్తిస్థాయి నిధులను అందుబాటులోకి తీసుకొస్తూ గ్రామ పంచాయతీల పేరిట బ్యాంకులో తెరిచిన పీడీ ఖాతాల నుంచి సర్పంచి సైతం ముందుగా డబ్బులు డ్రా చేసుకోకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ఖాతాల్లో జమయ్యే నిధులను చెక్కులతోనూ డ్రా చేసుకోవడానికి వీలుండదు. గ్రామ పంచాయతీలో వివిధ ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘గ్రామ స్వరాజ్య’ ఈ–పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ బిల్లు మొత్తాన్ని ఏ వ్యక్తికి అందజేయాలో అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను సర్పంచి అనుమతితో గ్రామ కార్యదర్శి ఆ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ పంచాయతీ అకౌంట్‌కు అనుసంధానమై ఉంటుంది. వివరాలు నమోదు ప్రక్రియ పూర్తవగానే గ్రామ పంచాయతీ అకౌంట్ నుంచి బిల్లు మొత్తం సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతాయి. ఇందుకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతులు, లేదా ఇతర ఉన్నతాధికారుల జోక్యం కూడా ఎక్కడా ఉండదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఈ లావాదేవీల వివరాల సమాచారం ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ తెలుస్తుంది. ఒకసారి లావాదేవీ పూర్తయ్యాక అందుకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలుండదు. ఆన్లైన్లో నమోదు చేసే బిల్లులపై ప్రభుత్వం ఏటా ఆడిట్ నిర్వహిస్తుంది. తప్పులు దొర్లితే సంబంధిత సర్పంచి, గ్రామ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానానికి చంద్రబాబు ‘నో’ గ్రామ పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ నియంత్రణ లేకుండా 2018 నుంచి పూర్తిస్థాయిలో స్థానిక సంస్థల స్థాయిలోనే ఆ నిధులు అందుబాటులో ఉంచాలని 2017లోనే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది. కానీ, ఈ ప్రతిపాదనకు అప్పట్లోని చంద్రబాబు ప్రభుత్వం నో చెప్పింది. పూర్తిస్థాయి గ్రామ స్వరాజ్యం దిశగా.. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ పంచాయతీలోనూ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ప్రభుత్వోద్యోగులు ఉండేవారు కాదు. జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి గ్రామంలోనూ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. ఇందుకోసం ఏకంగా 1.34 లక్షల మందిని నియమించారు. నగరాలతో సమానంగా మారుమూల కుగ్రామాల్లో సైతం 543 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనినైనా సొంత గ్రామంలోనే పూర్తిచేసుకునే సౌలభ్యం కల్పించింది. దీనికి తోడు.. ప్రాధాన్యతా క్రమంలో గ్రామ అవసరాలకు పంచాయతీ స్థాయిలోనే బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా రాష్ట్రంలో గ్రామాలు ఇప్పుడు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సాగుతున్నాయి. ఐదేళ్లకు రూ.10,231కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు ఐదేళ్ల పాటు రూ.10,231 కోట్లు మేర రాష్ట్రంలోని గ్రామాలకు కేటాయిస్తారు. వీటిలో 70 శాతం పంచాయతీలకు, 15 శాతం చొప్పున మండల, జిల్లా పరిషత్‌లకు ఏటా నిర్ణీత మొత్తంలో విడుదల చేస్తారు. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్‌లు ఉండగా.. ఇప్పటికే 12,686 గ్రామ పంచాయతీలు, 593 మండల పరిషత్‌లు, 12 జిల్లా పరిషత్‌లలో పీడీ ఖాతాలు తెరిచే ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ పూర్తిచేసింది. -
కూరగాయల దండతో అసెంబ్లీకి
లాహోర్: మనం నిత్యం ఏవో ఒక నిరసనలు చూస్తుంటాం. చాలావరకు తమదైన రీతిలో ఒక్కోరకంగా నిసనలు చేస్తుంటారు. చెప్పాలంటే చాలా వరకు వినూత్న రీతిలో ఉంటాయి. అర్థ నగ్నంగా లేకపోతే చిత్రమైన వేషధారణలో నిరసనలు తెలుపుతూ ఉంటారు. అచ్చం అలానే పాకిస్తాన్‌కి చెందిన ఒక ఎంపీ వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: ఫోన్లో ఆడుతూ రూ.61,000 విలువ చేసే బొమ్మలను ఆర్డర్ చేసింది) వివరాల్లోకెళ్లితే..... పాకిస్తాన్ ముస్లిం లీ-ఎన్ (పీఎంఎల్-ఎన్) ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు తారిఖ్ మసీహ్.. కూరగాయలతో తయారు చేసిన దండను ధరించి సైకిల్‌పై పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీకి వెళ్లారు. అసలు ఎందుకు ఆయన ఇలా వెళ్లారంటే పాకిస్తాన్ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగాళాదుంపలు, టమోటాలు, క్యాప్సికమ్‌లతో చేసిన దండను ధరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీకి వచ్చేందకు సైకిల్‌నే వినయోగిస్తానని కూడా చెప్పారు. పాకిస్తాన్ దేశం ఈ అత్యధిక ద్రవ్యోల్బణానికి ప్రతిగా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదర్కొంటూ భారీ మూల్యం చెల్లిస్తోందన్నారు. ఈ ద్రవ్యోల్బణ ప్రభావంతో పేదలే కాక వైట్‌కాలర్ జాబ్ చేస్తున్న ఉద్యోగుల సైతం నలిగిపోతున్నారంటు మసీహ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే గత 70 ఏళ్లలో పాకిస్తాన్లో పెరిగిన ద్రవ్యోల్బణం కంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక స్థాయికి చేరుకుందని పాకిస్తాన్ స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) -
ఎకానమీని గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్!?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్ తప్పదని భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. దిగువ మధ్య తరగతి సమాజాన్ని అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి సహాయక ప్యాకేజ్ని ప్రకటించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చిన్న పరిశ్రమలకు హామీ రహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచే విషయాన్ని పరిశీలించాలని ఒక ఇంటర్వ్యూలో కోరారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్‌లో భాగంగా గత ఏడాది రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ ఏప్రిల్, మే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపివేసిందని కొటక్ అన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో లోబేస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను కొటక్ ప్రస్తావిస్తూ, ‘‘నిజానికి బేస్ ఎఫెక్ట్‌తో చూసుకున్నా, వృద్ధి రెండంకెల దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని వేచి చూడాల్సి ఉంది’’ అని అన్నారు. ఇప్పటికి ప్యాకేజ్‌లు ఇలా... 2020లో కేంద్రం కరోనాను ఎదుర్కొనడానికి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ని ప్రకటించింది. ఈ విలువ రూ. 27.1 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ విలువ 13 శాతం అని కేంద్రం ప్రకటించినప్పటికీ, ద్రవ్య పరంగా ఇది 2 శాతం దాటబోదని అంచనా. మిగిలినదంతా రుణ రూపంలో సమకూర్చినదేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ. 30 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీలను దశలవారీగా ప్రకటించింది. ఈ మొత్తం జీడీపీలో దాదాపు 15%. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమేనని పేర్కొంది. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయని విశ్లేషించింది. లాక్డౌన్లు సడలించే సమయంలో ప్రకటించే అవకాశం: బెర్న్‌స్టెయిన్ సెకండ్ వేవ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న లాక్డౌన్లు, సంబంధిత ఆంక్షలు సడలించే సమయంలో కేంద్రం మరోదఫా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ అంచనావేసింది. ఏప్రిల్, మే నెలల్లో భారత్ ఆర్థిక క్రియాశీలత తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని తన సూచీలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఇంధన వినియోగం, విద్యుత్ డిమాండ్, ఈ–వే బిల్లులు, పారిశ్రామిక ఉత్పత్తి వంటి అంశాల్లో ప్రతికూల గణాంకాలు నమోదవుతున్నట్లు వివరించింది. అలాగే సరఫరాల సమస్యలూ తీవ్రమైనట్లు పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం పరిస్థితులు కొంత అదుపులో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సెకండ్‌వేవ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా, అది మొదటివేవ్ అంత తీవ్రంగా లేదని విశ్లేషించింది. -
ఎకానమీ సూచీలన్నీ ‘ఏప్రిల్’ ఫూల్!
ముంబై: ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏప్రిల్ సూచీలన్నీ మోసపూరితమైనవేనని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా వ్యాఖ్యానించింది. ఇవి బేస్ ఎఫెక్ట్ మాయలో ఉన్నాయని పేర్కొంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ సవాళ్ల నేపథ్యంలో వినియోగ సెంటిమెంట్ భారీగా పడిపోయిందని విశ్లేషించింది. ‘పోల్చుతున్న నెల లో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదు కావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెల లో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్రా తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►బేస్ ఎఫెక్ట్ వల్ల పలు రంగాలు ఏప్రిల్‌లో వృద్ధి శాతాల్లో భారీగా నమోదయినట్లు కనబడుతున్నప్పటికీ, నిజానికి ఆయా రంగాల తీరు ఆందోళనకరంగానే ఉంది. ►ప్రత్యేకించి వినియోగ సెంటిమెంట్ భారీగా దెబ్బతింది. భారీగా పెరిగిన ఆరోగ్య, ఇంధన బిల్లుల వల్ల ఇతర వ్యయాలవైపు వినియోగదారుడు తక్షణం దృష్టి సారించే అవకాశం లేదు. పలు సేవలపై వ్యయాలను భారీగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ►2021 ఏప్రిల్‌లో 13 నాన్ ఫైనాన్షియల్ ఇండికేటర్లు 2019 ఏప్రిల్‌తో పోల్చితే ఎంతో బలహీనంగా ఉన్నాయి. జీఎస్టీ ఈ–బే బిల్లులు, ఎలక్ట్రిసిటీ జనరేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్, రైల్వే రవాణా ట్రాఫిక్, దేశీయ విమాన ప్రయాణాలు, ఆటో ఉత్పత్తి, పెట్రోల్, డీజిల్ వినియోగం, కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ►పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు నేపథ్యంలో మే నెలలో పరిస్థితి కూడా ఏప్రిల్ తరహాలోనే కొనసాగే అవకాశం ఉంది. ►కాగా 2021 మార్చితో పోల్చి ఏప్రిల్‌ను పరిశీలిస్తే, 15 హై ఫ్రీక్వెన్సీ సూచీలు (బ్యాంక్ డిపాజిట్లు మినహా) వార్షిక పనితీరు బాగుంది. లో బేస్ దీనికి ప్రధాన కారణంగా ఉంది. ఆటోమొబైల్స్ ఉత్పత్తి, వాహన రిజిస్ట్రేషన్లు, నాన్–ఆయిల్ సంబంధ ఉత్పత్తుల ఎగుమతులు, జీఎస్టీ ఈ–వే బిల్లులు ఇందులో ఉన్నాయి. ►ఏప్రిల్ నెల్లో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ల చరిత్రాత్మక రికార్డు ఒక మినహాయింపు. కమోడిటీ ధరల్లో పెరుగుదల, దీనితో ముడి పదార్ఘాల వ్యయ భారాలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రికార్డు వసూళ్లకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆదాయాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ మార్కె ట్ రుణ సమీకరణలు మరింత పెరిగే వీలుంది. దీర్ఘకాలిక ప్రభావం.. సెకండ్ వేవ్‌లో రోజూవారీ కేసుల సంఖ్య ఇంకా తీవ్రంగానే కొనసాగుతూనే ఉంది. ఇది వినియోగదారు సెంటిమెంట్‌పై దీర్ఘకాలింగా ప్రభావం చూపుతూనే ఉంటుంది. భారీగా పెరిగిన ఆరోగ్య, ఇంధన బిల్లులు... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇతర వ్యయాల కట్టడికి దారితీస్తాయి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి పలు కన్జూమర్ డ్యూరబుల్స్‌పై వ్యయాలు సమీప కాలంలో పరిమితంగా ఉంటాయి. ప్రత్యక్ష సేవల రంగాలపై వ్యయాలు తగ్గుయాయి. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ మొదటి వేవ్‌లో 80 శాతం ఆదాయ నష్టం ప్రైవేటుదే! భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక పేర్కొంది. దీనిలో ప్రత్యేకంగా కుటుంబాల ఆదాయ నష్టాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. కాగా, ఇతర దేశాల విషయంలో ఆర్థిక నష్టం పూర్తిగా ప్రభుత్వాలే భరించాయని విశ్లేషించింది. జీడీపీలో దాదాపు 10 శాతంగా పేర్కొంటూ రూ.21 లక్షల కోట్ల ప్యాకేజ్ని కేంద్రం ప్రకటించినప్పటికీ, నిజానికి లభించిన మద్దతు కేవలం జీడీపీలో 2 శాతమేనని తెలిపింది. మిగిలినదంతా రుణ రూపంలో సమకూర్చినదేనని తెలిపింది. జరిగిన నష్టం మొత్తాన్ని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో ప్రభుత్వాలు భరిస్తే, 20 శాతం నుంచి 60 శాతం నష్టాన్ని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్లు భరించాయని పేర్కొంది. వర్థమాన దేశాల్లో కేవలం దక్షిణాఫ్రికా మాత్రం మొత్తం నష్టాన్ని భరించిందని తెలిపింది. కుటుంబ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కీలకం.. భారత్‌లో మొదటి వేవ్ జరిగిన ఆర్థిక నష్టంలో కార్పొరేట్ రంగానికి కేవలం 12 నుంచి 16 శాతమని, మిగిలినది కుటుంబాలు భరించాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి నుంచి కుటుంబాలను గట్టెక్కించాలంటే కుటుంబాలకు ఉపాధి హామీ, ప్రత్యక్ష నగదు బదలాయింపులు కీలకమని పేర్కొంది. ‘హౌస్‌హోల్డ్ సెక్టార్ పటిష్టంగా లేకపోతే, మహమ్మారి అనంతరం భారత్ పటిష్ట వృద్ధి సాధించడం కష్టసాధ్యం’ అని విశ్లేషించింది. బేస్ మాయలో కొన్ని గణాంకాలు ►2020–21 ఆర్థిక సంవత్సరంలో క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో... 2021–22లో ఎకానమీ 8 నుంచి 10 శాతం వరకూ వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇది బేస్ ఎఫెక్ట్ ప్రభావం. ►ఏప్రిల్ నెల్లో ఎగుమతులు, దిగుమతులు శాతాల్లో చూస్తే, వరుసగా 195.72%, 167% పెరిగాయి. లోబేస్ దీనికి ప్రధాన కారణం. ►భారత పారిశ్రామిక రంగం ఉత్పత్తి సూచీ (ఐఐపీ) మార్చిలో భారీగా 22.4 శాతం వృద్ధిని (2020 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణం. ►ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 2021 మార్చి ఉత్పత్తి వృద్ధి రేటు భారీగా 6.8 శాతంగా నమోదయ్యింది. గడచిన 32 నెలల్లో ఇంత స్థాయి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. 2020 మార్చి నెలలో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధి నమెదుకాకపోగా ఏకంగా 8.6 శాతం క్షీణత నమోదయ్యింది. ►ఇక ఏప్రిల్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన మూడు నెలల ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. దీనికి కూడా 2020 ‘హై బేస్ ఎఫెక్ట్’ కారణం. -
పెట్టుబడుల ఉపసంహరణ ఎవరికి చేటు?
ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా. భారతదేశంలో ప్రభుత్వ రంగం అనేది ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలకే (పీఎస్‌యూ) ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. ఆర్థిక వృద్ధి, పెరుగుదలలో పీఎస్‌యులు పోషించే కీలకపాత్ర కారణంగా.. ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచి ప్రభుత్వ గుత్తాధిపత్యం క్రమేణా ముగుస్తున్న కాలం లోనూ ప్రభుత్వరంగ సంస్థలు శిఖరస్థాయిలోనే ఉంటూ వచ్చాయి. 1991 తర్వాత రెండో తరం సంస్కరణలు ప్రభుత్వరంగ సంస్థలలో మొదలయ్యాయి. దీంతో పీఎస్‌యూలను మహారత్న, నవరత్న, మినీ రత్న అనే భాగాలుగా వర్గీకరించారు. పాలనాపరమైన, ఆర్థిక స్వయంప్రతిపత్తికి సంబంధించిన సంస్కరణలు, అవగాహనా ఒప్పందాల ద్వారా స్వీయ బాధ్యత వంటివి ప్రభుత్వం పీఎస్‌యూల ద్వారా సొంతంగా బిజినెస్ నిర్వహించాలనే భావనను ముందుకు తీసుకొచ్చాయి. ఈ పంథాలో తొలి లక్ష్యం నష్టాలు తెస్తున్న పీఎస్‌యూలను పునర్ వ్యవస్థీకరించడం. నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను వదిలించుకోవడానికి మొదటగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణలను ఒక ఐచ్ఛికంగా తీసుకొచ్చారు. రెండోది.. లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూలకు ఆర్థిక, పాలనాపరమైన స్వయంప్రతిపత్తిని అందించడమే. అయితే నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు గానే చలామణి అవుతూ వచ్చాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ప్రోత్సహించినట్లుగా, కీన్సియన్ తరహా సంస్థలను పరిత్యజించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడమే. అంటే సంక్షేమ రాజ్యంగా ఉంటున్న భారతదేశాన్ని నయా ఉదారవాద దేశంగా మార్చివేయడంలో ఇది ఒక భాగం. మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడమే లక్ష్యం అయినప్పటికీ, లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూల విషయంలో ఇది సమర్థనీయంగా ఉండదు. పైగా పీఎస్‌యూలనుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంటే సామాజిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అని చెబుతూ రాజకీయంగా భాష్యం చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణకు ఇది కొత్త భాష్యం అన్నమాట.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెబినార్ ద్వారా పాల్గొన్న సదస్సులో ‘ప్రైవేటీకరణ, సంపదపై రాబడి’ అనే పేరుతో చేసిన ప్రసంగం యావత్తూ నయా ఉదారవాద ఎజెండాకు సంగ్రహరూపంగానే కనబడుతుంది. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు పైకి లేవనెత్తడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగపరుస్తున్నామని నరేంద్రమోదీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలతో నడిచే పీఎస్‌యూలకు వెచ్చించే డబ్బును సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. అలాగే మానవ వనరుల సమర్థ నిర్వహణ వాదాన్ని కూడా ప్రధాని తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వోద్యోగులు తాము శిక్షణ పొందిన రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించలేకపోతున్నారని, అది వారి ప్రతిభకు అన్యాయం చేయడమే అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే ప్రధాని చేసిన వెబినార్ ప్రసంగంలో నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను మాత్రమే ప్రైవేటీకరిస్తామనే చెప్పలేదు. వ్యూహాత్మక రంగంలోని అతి కొద్ది పీఎస్‌యూలను మినహాయించి తక్కిన మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఈ ప్రైవేటీకరణ భావనను ఆయన విస్తరించడం విశేషం. వ్యాపారంలో కొనసాగడం ప్రభుత్వం పని కాదనే పచ్చి నయా ఉదారవాద వాదనను ప్రధాని ఈ సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ఈ వాదన పరిమితమైన ప్రభుత్వం, సత్పరిపాలన భావనకు సంబంధించింది.ఇక్కడ సత్పరిపాలన అంటే భాగస్వామ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, బాధ్యతాయుతం, సమర్థవంతం, న్యాయబద్ధత, సమీకృతం, చట్టబద్ధత అనేటటువంటి భావజాలపరంగా తటస్థంగా ఉండే లక్షణాలను ముందుకు తీసుకురావడమే తప్ప మరేమీ కాదు. పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలన అనే నయా ఉదారవాద ఎజెండాను ఇది ముందుకు నెడుతుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఈ సత్పరిపాలనా భావనే కేంద్ర స్థానంలో ఉంటోంది.ఇది సంక్షేమవాదం, నయా ఉదారవాదం భావనలపై భావజాలపరమైన చర్చలో భాగం కావచ్చు. కానీ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధించడం, పబ్లిక్ సెక్టర్ని సంస్కరించడం అనే లక్ష్యాల సాధనలో తన హక్కులను కాపాడుకోగలగాలి.మెజారిటీ ప్రజల ఎంపికద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనే నయా ఉదారవాద ఎజెండాను ముందుకు తీసుకురావడానికి కలలు కంటున్న పరిస్థితి ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో నయా ఉదారవాదాన్ని అమలు చేయడం ద్వారా కలిగే ఫలితాలు ఎలా ఉండబోతాయన్నదే.ఈ నయా ఉదారవాదంలోనూ సంక్షేమవాదం కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా సేకరించిన నిధులను సరిగా ఉపయోగించడం ద్వారా ప్రధాని సూచించినట్లుగా పేదలకు ఇళ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలలు తెరవడం, పేదలకు పరిశుభ్రమైన నీటిని కల్పించడం వంటి సంక్షేమ చర్యలు చేపట్టవచ్చు. మొదటగా ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడం ద్వారా ప్రభుత్వ గుత్తాధిపత్యానికి ముగింపు పలకవచ్చు. కానీ ఒక్క శాతంమంది అతి సంపన్నుల చేతిలో 40 శాతం దేశ సంపద పోగుపడి ఉన్న దేశంలో కొద్ది మంది బడా పెట్టుబడిదారుల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం నుంచి ప్రైవేటీకరణను ఏది నిరోధించగలుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ గుత్తాధిపతులు కేవలం పరిశ్రమ రంగంతో పాటు ఇతర రంగాల్లో విధాన నిర్ణయాలను కూడా వీరు విశేషంగా ప్రభావితం చేయగలరు.రెండోది, ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా.మూడోది. ప్రైవేటీకరణ ఒక ప్రభుత్వానికే పరిమితమైనది కాదు. పరిమిత ప్రభుత్వం అనేది ఉండదు. నయా ఉదారవాద ప్రభుత్వం అనేది వాస్తవంగా ఒక రెగ్యులేటరీ ప్రభుత్వం. పాలించడానికి అది నియంత్రణా వ్యవస్థలను రూపొందించి, చట్టాల అనువర్తనం, ప్రామాణిక ఆచరణలు లేదా సేవలకు హామీ ఇస్తుంది. పైగా తనదైన జాప్యందారీ వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వీటిని సేవించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తికి న్యాయం చేకూర్చలేరు. బ్యాంకింగ్, విమానయాన రంగాల్లో దివాలాకు సంబంధించిన పలు కేసుల కారణంగా నష్టాల పాలవుతున్న ప్రైవేట్ కంపెనీల జాబితా మరింతగా పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ప్రభుత్వం వ్యాపార సామర్థ్యంతోటే ఉండాలి: ప్రభుత్వం కేవలం ఖర్చుపెట్టే సంస్థగానే ఉండిపోవలసిన అవసరం లేదు. సంపాదించే సంస్థగా కూడా ఉండాలి. వ్యాపారంలో కొనసాగినప్పుడు ఇది సాధ్యపడుతుంది. దీనికి చేయవలసిందల్లా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్తమ పాలనను అమలు చేయడమే. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర పీఎస్‌యూలకు నమూనాగా ఉండాలి. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సంస్కరించినట్లయితే, లాభాలబాట పట్టే ఆ సంస్థలు తిరిగి సాధికారత సాధించగలవు. ఉత్తమపాలన అనేది ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా సమర్థతకు, ఆర్థికానికి, సామర్థ్యానికి, జవాబుదారీతనానికి హామీపడగలదు. జుబేర్ నజీర్ వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ -
లైఫ్ ఈజీ చేసుకుందాం ఇలా...
కొత్తగా ఏదో ఒకటి చేయాలి.. ఏటా నూతన సంవత్సరంలోకి ప్రవేశించే సమయంలో చాలా మంది అనుకునే సంకల్పమే ఇది. కానీ, కొద్ది మందే అనుకున్నవి ఆచరణలో పెడుతుంటారు. 2020 ఎన్నో పాఠాలు చెప్పి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరావన్న హెచ్చరికలు కూడా ఇచ్చి వెళ్లింది. అందుకే 2021లో అయినా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రణాళికలపై దృష్టి పెట్టి.. అమల్లో పెట్టడం ద్వారా ఎంతో స్థైర్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందే అవకాశాన్ని కోల్పోవద్దు. ఇందుకు ఏం చేయవచ్చంటే..? ఆపద్బాంధవ.. బీమా ఆరోగ్య బీమా, జీవిత బీమా తమకు అంతగా అవసరం లేదనుకునే వారు ఎందరో ఉన్నారు. వీటి ప్రాధాన్యం ఎంతన్నది కరోనా వైరస్ చాలా మందికి తెలిసేలా చేసింది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన వారు రూ.లక్షల్లో ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. బీమా పాలసీ లేని వారు తమ కష్టార్జితాన్ని వైద్య చికిత్సల కోసం ధారపోయాల్సి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వారి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఎటువంటి జీవిత బీమా పాలసీ లేకుండా కరోనాతో మరణించినట్టయితే.. పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించాలి. ఒకవేళ జీవిత బీమా పాలసీ ఉన్నా తగినంత కవరేజీ లేని కుటుంబాలకు వాస్తవంలో రక్షణ లేనట్టుగానే భావించాలి. కట్టిన ప్రీమియం రాదన్న ప్రతికూల ధోరణితో టర్మ్ ప్లాన్లకు బదులు.. మరణించినా లేదా మెచ్యూరిటీ తీరినా రాబడులతో వెనక్కిచ్చే ఎండోమెంట్ ప్లాన్లు తీసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ, రూ.1–5 లక్షల ఎండోమెంట్ ప్లాన్ ఓ కుటుంబ అవసరాలను ఏ మాత్రం తీర్చగలదో ఆలోచించండి. అందుకే హెల్త్, లైఫ్ ప్లాన్లు లేని వారు వెంటనే వాటిని తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్న వారు.. వీలు చేసుకుని టర్మ్ ప్లాన్ తీసుకునేందుకు ప్రయత్నించాలి. తమ వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ 10 రెట్ల మేర అయినా బీమా తీసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు ఉంటే ఆ మొత్తాన్ని కూడా కవరేజీకి కలిపి అధిక మొత్తంలో బీమా తీసుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తాము లేని లోటును తీర్చే రక్షణ ఏర్పాటు చేసిన వారు అవుతారు. అనారోగ్యం, ప్రమాదాలు చెప్పి రావు. వయసులో ఉన్న వారికి కూడా ఇటువంటివి ఎదురుకావచ్చు. ఒకవేళ హెల్త్ పాలసీ ఉన్నా కేవలం రూ.2–3లక్షల కవరేజీయే ఉంటే.. దానికి టాపప్ తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాలి. టాపప్‌కు ప్రీమియం తక్కువే ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల హెల్త్ కవరేజీ అయినా ఉండాలి. దీనికి అదనంగా టాపప్ కూడా జోడించుకోవాలన్నది నిపుణుల సూచన. సాయం కోసం ఎదురుచూడొద్దు అనుకోని అవసరం ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక సాయం కోసం బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఆశ్రయించడం కంటే.. ఒక ప్రత్యేక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మనశ్శాంతిని, ధైర్యాన్నిస్తుంది. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ప్రమాదానికి గురి కావడం ఇటువంటివన్నీ అత్యవసర పరిస్థితులే. అందుకే కనీసం 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇందులో రుణాలకు చేసే చెల్లింపులు కూడా భాగంగా ఉండాలి. ఈ మొత్తాన్ని బ్యాంకు ఎఫ్డీలు లేదా లిక్విడ్ ఫండ్స్ రూపంలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అవసరం ఏర్పడినప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ప్రత్యేక నిధిని సమకూర్చుకోవడమే కాదు.. అత్యవసరాలు ఎదురైతే తప్పించి చిన్న అవసరాలకు కదపకూడదు. భిన్న సాధనాలకు కేటాయింపులు పెట్టుబడులన్నింటినీ ఒకటే సాధనంలో కాకుండా భిన్న సాధనాలకు కేటాయించుకోవడం కూడా ఆర్థిక ప్రణాళికలో ఒక భాగమే. ఉదాహరణకు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అప్పుడు మీరు చాలా రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. పెట్టుబడుల పరంగా మీ నిర్ణయాల్లో తప్పిదం చోటు చేసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఈక్విటీలు, డెట్, బంగారం ఇలా వీలైనన్ని సాధనాల మధ్య పెట్టుబడులను వేరు చేసుకోవాలి. దీనివల్ల రిస్క్‌ను మించి రాబడులు వస్తాయి. మీ రిస్క్ సామర్థ్యం, ఆశిస్తున్న రాబడులు, పెట్టుబడులకు ఉన్న వ్యవధి వీటి ఆధారంగా ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది ఆర్థిక సలహాదారుల సాయంతో నిర్ణయిం చుకోవాలి. ఒక్కో విభాగం అద్భుత పనితీరుతో అందులోని పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగిపోతే.. అందుకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఈక్విటీలకు 50% కేటాయించాలన్నది మీ ప్రణాళిక అయితే.. మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 60 శాతానికి చేరితే.. అప్పుడు 10% మేర ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఆగొద్దు పెట్టుబడులు ఎప్పుడూ లక్ష్యాలకు అనుగుణంగా సాగిపోవాలి. మధ్యలో వచ్చే ఆటుపోట్లను చూసి పెట్టుబడుల ప్రణాళికలు ఆగిపోకూడదు. గతేడాది మార్చి చివరికి మార్కెట్లు కనిష్టాలకు పడిపోయినప్పుడు కంగారుపడిపోయి స్టాక్స్‌ను అమ్ముకున్న వారు.. డిసెంబర్ వచ్చే సరికి ఎంతో విచారించి ఉంటారు. ఎందుకంటే తొమ్మిది నెలల్లో మార్కెట్లు కొత్త గరిష్టాలకు వెళ్లిపోయాయి. మార్కెట్లు ఎప్పుడూ పడి లేచే కెరటాలు. అలాగే, స్టాక్స్ విక్రయించకుండా.. అదనంగా ఇన్వెస్ట్ చేసిన వారు భారీ లాభాలను కళ్లచూసి ఉంటారు. అందుకే ఈక్విటీ పెట్టుబడులు కనీసం ఐదేళ్లకు మించిన కాలానికే సముచితం. అందులోనూ నేరుగా స్టాక్స్‌లో కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో, అందులోనూ ప్రతీ నెలా ఇంతచొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం.. సగటున అధిక రాబడులను సమకూర్చుకునేందుకు, రిస్క్‌ను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఇరువైపులా ప్రయోజనాలను తెచ్చిపెట్టే సాధనమే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఎక్కువ మొత్తాలను అలాగే ఉంచేయవద్దు. సేవింగ్స్ వడ్డీ రేటు 4–5 శాతం అన్నది ద్రవ్యోల్బణానికే సరిపోతుంది. కనుక అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్లుగా మార్చే ఆటోస్వీప్ సదుపాయాన్ని ఎంచుకోవాలి. నామినీని, విల్లును మర్చిపోవద్దు ఒక వ్యక్తి మరణానంతరం అతని పేరిట ఉన్న ఆస్తులు, పెట్టుబడులు కుటుంబ సభ్యులకు సులభంగా అందేలా చేసేదే విల్లు. ఎవరికి ఏవి, ఏ మేరకు చెందాలన్నదీ విల్లులో నిర్దేశించుకోవచ్చు. తమ పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు, బీమా పాలసీల వివరాలు కుటుంబ సభ్యులకు తప్పకుండా తెలియజేయాలి. బీమా ప్లాన్లు, పెట్టుబడుల్లో నామినీని చేర్చాలి. ఖర్చు/పొదుపు కరోనా, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా గతంతో పోలిస్తే కొన్ని అనవసర వ్యయాలు తగ్గాయి. వీకెండ్లో బయటకు వెళ్లి రెస్టారెంట్లలో తినడం, సినిమాలు, పర్యటనలు వంటివి చాలా వరకు తగ్గాయి. వేతనాల్లో కోతలు పడిన వారికి ఈ విధంగా తగ్గిన వ్యయాలు కాస్త ఊరటనిచ్చాయి. అదే సమయంలో వేతన కోతల్లేని వారికి మిగిలిన మేర అదనంగా ఇన్వెస్ట్ చేసుకునే మంచి అవకాశం లభించిందనే చెప్పుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా.. ఎంత పొదుపు చేశారన్నదే మీ ఆర్థిక పరిస్థితులను మార్చే సూత్రం అవుతుంది. కనుక పరిమితుల్లోపే ఖర్చు చేసుకోవాలి. అందుకే నెలవారీ బడ్జెట్ రూపొందించుకుని దాని ప్రకారం ఖర్చు, ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ వ్యయాలపై మీకు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతగా అవసరం లేని వాటి కోసం రుణాలపై కొనుగోళ్లకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ తరహా అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి. కొత్త ఏడాది ప్లానింగ్ ► జనవరి: బీమా కవరేజీ మీకు సరిపడా ఉన్నదీ, లేనిదీ ఒక్కసారి సరిచూసుకోవాలి. అలాగే, బీమా ప్రీమియం, ఈఎంఐ చెల్లింపుల తేదీల కోసం రిమైండర్ పెట్టుకోవాలి. ► ఫిబ్రవరి: కేంద్ర బడ్జెట్లో కొత్త నిబంధనల వల్ల మీ ఆదాయం, పన్నులు, పెట్టుబడుల ప్రణాళికలను మార్చుకోవాలేమో సరిచూసుకోవాలి. ► మార్చి: 2020–21 సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగో విడత చెల్లింపుల గడువు మార్చి 15తో ముగుస్తుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఈలోపు ఆ పనిచేసేయాలి. పన్ను ఆదా కోసం పెట్టుబడులకు మార్చితో గడువు ముగిసిపోతుంది. ఫాస్టాగ్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ► ఏప్రిల్: 2021–22 నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభం కనుక.. ఆర్థిక నిపుణుల సాయంతో పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుని లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. సొంతంగా ఆ పరిజ్ఞానం ఉంటే తామే ఆ పనిచేసుకోవచ్చు. ► మే: ఈ నెలలో 14న అక్షయ తృతీయ ఉంది. ఆ రోజు బంగారం కొనుగోలు చేసుకోవాలని అనుకుంటే అందుకు కావాల్సిన మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి. ► జూన్: 2021–22 మొదటి అడ్వాన్స్ ట్యాక్స్ గడువు జూన్ 15. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్నులు వేసేందుకు గాను పనిచేస్తున్న సంస్థ వద్ద ఫామ్ 16 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ► జూలై: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకు గడువు. ఆ లోపు రిటర్నులు ఫైల్ చేయాలి. ► ఆగస్టు: పెట్టుబడులపై మధ్యంతర సమీక్ష మంచిది. ► సెప్టెంబర్: 2021–22 రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ను 15వ తేదీలోపు చెల్లించాలి. ► అక్టోబర్: దసరా పండుగ భారీ ఆఫర్ల సమయంలో కొనుగోళ్లకు ముందుగానే సన్నద్ధం అయితే మంచిది. ► నవంబర్: ఈ నెలలో దీపావళి పండుగ 4న వస్తోంది. ఆ సందర్భంలో కొనుగోళ్లకు సన్నద్ధులు కావాలి. ► డిసెంబర్: మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ (2021–22)కు 15 వరకు గడువు ఉంది. 25న క్రిస్మస్ పండుగ వేడుకలకు బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి. -
కరోనా కట్టడి: భారత్‌పై ఐఎంఎఫ్ ప్రశంసలు
వాషింగ్టన్: కరోనా వైరస్ కట్టడితో పాటు దానివల్ల కుంటుపడిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఫ్) ప్రశంసించింది. అంతేకాకుండా ఆర్థికవ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని సూచించింది. అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా మాట్లాడుతూ.. ‘కరోనా కాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని మా అభిప్రాయం. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అప్డేట్ ఆవిష్కరణలో ఇదే విషయాన్ని ప్రముఖంగా వెల్లడించబోతున్నాం. వరల్డ్ ఎకనమిక్ అప్డేట్ను ఈ నెల 26న విడుదల చేస్తాం. దీన్ని ప్రతి ఒక్కరు శ్రద్దగా గమనించాలి’ అంటూ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. (చదవండి: రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం) ఇక ఈ సమావేశం సందర్భంగా భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ గురించి జార్జీవా ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పని చేసినట్లు ప్రశంసించారు. అంతేకాక భారత్ ఈ ఏడాది 2021ని తన ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవడం కోసం వినియోగించుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్‌లో చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించి మరింత ముందుకు వెళ్లాలని క్రిస్టాలినా జార్జీవా సూచించారు. సాగు చట్టాలపై ఐఎంఎఫ్ స్పందన ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఐఎంఎఫ్ స్పందించింది. వ్యవసాయ సంస్కరణల్లో సాగు చట్టాలు ఓ ముందడుగని తెలిపింది. వీటి వల్ల మధ్యవర్తుల అవసరం లేకుండానే రైతులు నేరుగా తమ పంటను అమ్ముకోవచ్చన్నది. అయితే ఈ నూతన చట్టాల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నవారికి సామాజకి భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. -
2020.. కలలు కల్లలు
కొత్త సంవత్సరం.. కొత్త దశాబ్దిలోకి అడుగిడుతున్న సంబరం.. ఎన్నో కలలు, ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదికి ప్రపంచం మొత్తం స్వాగతం పలికింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇచ్చింది. ‘నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు’ అంటూ ప్రపంచాన్ని ఓ ఆటాడుకుంది. ముఖ్యంగా కోవిడ్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ప్రపంచదేశాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి. వ్యక్తులు, రంగాలు, వ్యవస్థలు ఇలా ఒక్కటేమిటి.. ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ 2020 సంవత్సరానికి, కరోనా దెబ్బకు బాధితులే.. చాలా మందికి ఈ సంవత్సరం చాలా పాఠాలు నేర్పింది. ఈ ఏడది తెలంగాణ రాష్ట్రంలో 2020లో జరిగిన అనూహ్య పరిణామాలు ఏంటి? ఇక్కడి వ్యవస్థలు ఎలా మారాయి.. ఏయే రంగాలు ఎలా ఇబ్బంది పడ్డాయి.. ఎవరు హీరోలు అయ్యారు.. అనే విషయాలపై ఓ రౌండప్. -సాక్షి, హైదరాబాద్ అవిశ్రాంత పోరాట యోధులు.. వైద్యులు, వైద్య సిబ్బంది ఈ ఏడాది హీరోలుగా నిలి చారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆ వైరస్ సోకిన వారందరికీ చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి గజగజ వణికిపోతుంటే.. వైద్యులు మాత్రం ధైర్యంగా అన్నీ తామై వైరస్ సోకిన వారికి సపర్యలు చేశారు. చాలా మంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అదే వైరస్‌కు బలయ్యారు కూడా. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలందిస్తూ మన రాష్ట్రంలో దాదాపు 3,500 మందికి కరోనా సోకగా, అందులో దాదాపు 40 మంది చనిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది మొత్తం అన్ని ఆస్పత్రుల్లో కూడా కరోనా తప్ప వేరే వైద్య సేవలు చాలా తక్కు వగా అందాయి. కరోనా కారణంగా ప్రభుత్వాస్ప త్రుల్లో సదుపాయాలు పెరిగాయి. ఇదిలావుంటే కరోనా కారణంగా మెడికల్ కాలేజీలు తెరవకపోవ డంతో వైద్య విద్యార్థులు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యారు. అసలైన వారియర్స్.. ఈ ఏడాది పోలీసులు యుద్ధవీరులయ్యారు. ప్రజలందరినీ తమ ప్రాణాలు పణంగా పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరీంనగర్లో కరోనా ఆనవాళ్లు కన్పించిన రోజు నుంచి నేడు బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్ సోకిన వారిని గుర్తించడంలో ఎనలేకి కృషి చేశారు. లాక్డౌన్ విధించాక ఎవరూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. వైరస్ నియంత్రణలో, లాక్డౌన్ అమలులో పోలీసు శాఖ పోషించిన పాత్ర ప్రశంసనీయం. అలాంటిది నిర్విఘ్నంగా సాగుతున్న ఈ యజ్ఞంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొన్నారు. పోలీస్ శాఖలో దాదాపు 5,700 మంది కరోనా బారినపడ్డారు. 50కి పైగా పోలీసులు అమరులయ్యారు. స్కూళ్లు తెరుచుకునేదెలా? రాష్ట్రంలో విద్యా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 మార్చి 16 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇంటర్ ఫలి తాల్లో ఆలస్యం, పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు తెరుచుకోలేదు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి పాఠశా లలు, ఇంటర్లో ఆన్లైన్ బోధన ప్రారంభిం చాల్సి వచ్చింది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్లు, అధ్యాపకులు ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ కూడా చాలా ఆలస్య మైంది. కాగా, ఈ పరిస్థితుల్లోనూ విద్యా ర్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020– 21 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సులు తీసు కొచ్చింది. ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర కోర్సులకు అనుమతి ఇవ్వగా, డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీకాం టాక్సేషన్, బీకాం ఫారిన్ ట్రేడ్, బీఏ మ్యాథమెటిక్స్ వంటి కొత్త కోర్సులకు ఓకే చెప్పింది. అన్ని గ్రూపుల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేలా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)లో మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్ అవసరాలకు ఉపయోగపడేలా ఎం.ఫార్మసీ లోనూ 4 కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చింది. వెనుకబడిన గురుకులాలు.. గురుకుల విద్యపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. మార్చిలో ఇంటిబాట పట్టిన పిల్లలు తిరిగి ఇప్పటివరకు గురుకులాన్ని చూడలేదు. ఆన్లైన్ తరగతులు, వీడియో పాఠాల ద్వారా బోధన ప్రారంభించాలని గురుకుల సొసైటీలు భావించినా.. పెద్దగా ఫలితం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 960 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 3.85 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఎంసెట్, నీట్, క్లాట్ తదితర శిక్షణలిచ్చి తీర్చిదిద్దడంతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆన్లైన్ బోధనతో పిల్లలు కాస్త వెనుకబడినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. పడకేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నుంచి పనులు పుంజుకునే సమయంలోనే వైరస్ విస్తృతి పెరగడంతో విదేశాల నుంచి రావాల్సిన యంత్ర సామగ్రి రాకపోవడం, వలస కూలీలు స్వస్థ లాలకు వెళ్లిపోవడం తదితర కారణాలతో పనులన్నీ నిలిచి పోయాయి. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల ఎత్తిపోతల పథకాల యంత్రాలు పలు దేశాల నుంచి రావాల్సి ఉంది. ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపైనా ప్రభావం బాగానే పడింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి విడతగా గోదావరి బేసిన్లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని భావించినా కుదరలేదు. ఇసుక లభ్యత లేకపోవడం, సిమెంట్ ధర పెరగడంతో కాంట్రాక్టర్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇడిసిపెడితే నడిసిపోతా.. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో అందరికన్నా ఎక్కువగా బాధ అనుభవించింది వలస కార్మికులే.. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో ఉపాధి లేక పూటగడవడం కష్టంగా మారింది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు స్తంభించిపోవడంతో దిక్కు తోచని స్థితిలో లక్షలాది వలస కూలీలు మైళ్లకు మైళ్లు నడిచి పోయారు.. కాలినడకన వెళ్తున్న ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కంటతడి పెట్టించాయి. రాష్ట్రం నుంచి దాదాపు 9.57 లక్షల మంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఇప్పటివరకు 32 శాతమే తిరిగి వచ్చినట్లు కార్మిక శాఖ అంచనా. ఆర్టీసీకి దెబ్బ మీద దెబ్బ నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా, లాక్డౌన్ రూపంలో రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. మార్చి చివర నుంచి అన్ని బస్సులు డిపోలకే పరిమితం కాగా, మే మూడో వారంలో జిల్లా సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ చివరలో సిటీ బస్సులు పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ జిల్లా సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగానే ఉంటోంది. హైదరాబాద్‌లో కనీసం 50 శాతానికి కూడా చేరుకోలేదు. లాక్ డౌన్‌కు పూర్వం నిత్యం రూ.13 కోట్ల మేర టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఇప్పుడు తొమ్మిదిన్నర కోట్లను మించట్లేదు. టికెట్ రూపంలోనే రూ.2వేల కోట్లు నష్టపోయింది. మరో వైపు కరోనాతో దాదాపు 50 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోగా, 2 వేల మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కరోనా మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తలకిందులైంది. లాక్‌డౌన్‌తో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ తేల్చింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత తీవ్రమైంది. రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. 15 శాతం ఆదాయ వృద్ధి రేటుతో 2020–21లో రూ.1,15,900 కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించగా, రూ.68,781 కోట్ల ఆదాయమే సమకూర నుంది. ఈ ఏడాది వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.32 వేలకు పైగా రాబడి వస్తుందని అంచనా వేస్తే, అక్టోబర్ నాటికి రూ.12,800 కోట్లు మాత్రమే వచ్చింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మరో రూ.5 వేల కోట్లు వచ్చినా రూ.18 వేల కోట్ల వరకు మాత్రమే జీఎస్టీ వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనుకున్నా.. ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు కూడా దాటలేదు. రూ.30 వేల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో రావాల్సి ఉండగా, రూ.2వేల కోట్లు రాలేదు. అప్పుల విషయానికొస్తే ఏప్రిల్‌లో రూ.5,700 కోట్లు, మేలో రూ.7,642 కోట్లు, జూన్‌లో రూ.4,318 కోట్లు.. ఇలా 7 నెలల కాలంలోనే రూ.27 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పరిశ్రమలు, ఐటీ శాఖ కాస్త మెరుగు.. పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ఒడిదొడుకులకు లోనైనా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అమెజాన్ సంస్థ ప్రపం చంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. రూ.20,670 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకుంది. బయో ఫార్మా రం గానికి ఊతమిచ్చేలా రూ.60 కోట్లతో బీ–హబ్ కూడా ప్రారంభమైంది. సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణ వంటి అంశాల్లో పు రోగతి కన్పించింది. సులభతర వాణిజ్య విధానంలో రా ష్ట్రం మూడో ర్యాంకు సాధించింది. కాగా, ఐటీ సంస్థల న్నీ మార్చి మొదటి వారం నుంచే లాక్డౌన్ ప్రకటించా యి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత విస్తృతం చేయ డంతో 5.5 లక్షల మంది ఉద్యోగుల్లో 90% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త నియా మకాలు నిలిచిపోవడం, స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత, అద్దెల తగ్గింపు, ఐటీ కంపెనీలపై ఆధారపడి పనిచేసే హౌస్ కీపింగ్, కేటరింగ్ విభాగాల్లో పనిచేసే వారి ఉపాధికి గండిపడింది వెలవెలబోయిన పర్యాటకం గత 9 నెలలుగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా బోసిబోయాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు కరోనా పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. మార్చి చివరి నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేశారు. జూన్‌లో హోటళ్లను, ఆగస్టులో మిగతావి తెరిచారు. పర్యాటకుల నుంచి స్పందన మాత్రం రాలేదు. ఇప్పుడిప్పుడే కాస్త జనాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. మోతమోగిన విద్యుత్ బిల్లులు కరోనా కష్టకాలంలో జూన్ నెల విద్యుత్ బిల్లులు అనూహ్యంగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం 2020 మార్చి 22 నుంచి దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ కారణంగా స్పాట్ మీటర్ రీడింగ్ తీయలేకపోయారు. లాక్డౌన్ సడలించడంతో జూన్ నెలలో 3 నెలల వినియోగానికి సంబంధించిన రీడింగ్ ఒకేసారి తీసి, సగటు వినియోగం ఆధారంగా వేశారు. దీంతో టారీఫ్ శ్లాబులు మారిపోయి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. కాస్త ఆశావహ పరిస్థితులు.. ఈ ఏడాది విపత్కర పరిస్థితుల్లోనూ మాస్క్‌లు మొదలుకుని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఫార్మాస్యూటికల్ రంగంలో ఆశించిన మేర ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందడం మంచి పరిణామం. ఎన్–95/ఎఫ్ఎఫ్పీ–2 మాస్క్‌ల ఎగుమతులు మెరుగు పడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23% పెరిగాయి. 110 దేశాలకు రూ.554 కోట్ల విలువైన డైరీ ప్రొడక్టులను ఎగుమతి చేశారు. కార్పెట్లు, ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, హెల్త్, వెల్నెస్, దుస్తులు తదితరాల ఎగుమతులు భారీగా జరిగాయి. జెమ్ అండ్ జ్యువెలరీ రంగానికి సంబంధించి రూ.1.6 లక్షల కోట్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని అంచనా. -
ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!
వాషింగ్టన్: అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిౖకైన కమల హ్యారిస్ పనిచేయాలనుకుంటున్నారని ఆయన బృందం వెల్లడించింది. కోవిడ్–19 నియంత్రణ, మళ్లీ అభివృద్ధి పట్టాల పైకి ఆర్థిక రంగం, వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల అంతం, వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం.. ఇవే బైడెన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించింది. అధికార మార్పిడి విధుల్లో ఉన్న బైడెన్ బృందం ఈ విషయాన్ని తమ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సమగ్ర వ్యూహంతో ఈ లక్ష్యాలను సాధించాలని బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించడం తక్షణ విధిగా బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. వైరస్ వల్ల కుదేలైన కుటుంబాలను, చిన్న వ్యాపారాలను, బాధితులను, కోవిడ్–19పై పోరాడుతున్న యోధులను పరిరక్షించడానికి ప్రాథాన్యం ఇస్తున్నట్లు వివరించింది. కరోనా నియంత్రణ తరువాత.. మంచి వేతనాలు లభించే లక్షలాది ఉద్యోగాల కల్పన బైడెన్ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపింది. అత్యుత్తమ అమెరికాను నిర్మించే దిశగా దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు అవసరమైన అన్ని హక్కులు, సదుపాయాలను కల్పించాలని సంకల్పించినట్లు వెల్లడించింది. ఒకవైపు కరోనాను నియంత్రిస్తూనే, మరోవైపు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం జరిగేలా, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల తొలగింపు బైడెన్ ప్రభుత్వ మూడో లక్ష్యమని వివరించింది. అమెరికా సమాజంలో భాగమైన బ్లాక్స్, బ్రౌన్స్ సంక్షేమం, వారి అభివృద్ధి కేంద్రంగా ఆర్థిక వృద్ధి సాగాలనేది నూతన ప్రభుత్వ ఆలోచన అని పేర్కొంది. దేశంలోని అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేసింది. బైడెన్‌కు ఇప్పుడే ‘విషెస్’ చెప్పం! మాస్కో/బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడేవరకు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపకూడదని రష్యా, చైనా నిర్ణయించాయి. అమెరికా చట్టాలు, నిబంధనల ప్రకారం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు స్పష్టమైన తరువాతే తాము స్పందిస్తామని తెలిపాయి. ఎన్నికలపై తలెత్తిన న్యాయ వివాదాలు పరిష్కారమై, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాతే బైడెన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందిస్తారని సోమవారం రష్యా ప్రకటించింది. బైడెన్ విజయం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలపని దేశాల్లో చైనా, రష్యాతోపాటు బ్రెజిల్, టర్కీ, మెక్సికో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ఎన్నిక కావడంపై చైనా అధికారికంగా స్పందించలేదు ఈ విషయంలో అంతర్జాతీయ సంప్రదాయాలను పాటిస్తామంది. అక్కడి మీడియా మాత్రం వారి ఎన్నికను నిర్ధారిస్తూ పలు విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది. -
లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే...
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైద్యపరంగా మరో సంక్షోభం కూడా తలెత్తుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధాన నిర్ణేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువే ఉన్నాయని, కానీ లాక్డౌన్ పొడిగించడం వల్ల ప్రయోజనం మాత్రం ఉండబోదని మహీంద్రా అభిప్రాయపడ్డారు. ‘గతంలో నేను ట్వీట్ చేసినట్లుగా లాక్డౌన్ పొడిగింపులు ఆర్థికంగా వినాశకరం మాత్రమే కాదు మరో వైద్యపరమైన సంక్షోభానికి కూడా దారితీసే ప్రమాదముంది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో మహీంద్రా ట్వీట్ చేశారు. మానసిక ఆరోగ్యంపై లాక్డౌన్ ప్రతికూల ప్రభావాలు, కోవిడ్‌యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని గుర్తు చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని పేర్కొన్నారు. 49 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను సమగ్రమైన విధంగా ఎత్తివేయాలంటూ మహీంద్రా గతంలో కూడా ప్రతిపాదించారు. -
కరోనా దెబ్బకు కుదేలైన అర్ధిక రంగం
-
ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్అండ్టీ అధినేత ఏఎం నాయక్ మొదలైన వారు దీనికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019–20 ఏడాదికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కార్పొరేట్లతో ప్రధాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సవాళ్లతో సమరం..: డిమాండ్ మందగమనం, తయారీ రంగం బలహీనత తదితర అంశాల కారణంగా జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించి.. ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గతేడాది గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులకు మరింత మూలధన నిధులివ్వడం, పలు బ్యాంకులను విలీనం చేయడంతో పాటు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22%కి తగ్గించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే, ఇవేవీ కూడా బలహీనపడిన వినియోగ డిమాండ్‌ను నేరుగా పెంచేందుకు దోహపడేవి కావనే విమర్శలు ఉన్నాయి. దీంతో వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన 60 మంది పైగా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ కసరత్తులో భాగంగా పరిశ్రమవర్గాలతో సమావేశమవుతున్నారు. దీంతో రాబోయే బడ్జెట్లో మరిన్ని సంస్కరణలపై అంచనాలు నెలకొన్నాయి. కార్పొరేట్లపై కక్ష సాధింపు అనుకోవద్దు.. అవినీతి కట్టడి చర్యలపై మోదీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎలాంటి అవరోధాలు లేని పారదర్శక పరిస్థితుల్లో కార్పొరేట్లు నిర్భయంగా సంపద సృష్టి జరపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. చట్టాల సాలెగూళ్ల నుంచి పరిశ్రమను బైటపడేసేందుకు గడిచిన అయిదేళ్లుగా తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు. కాగా, కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును, సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్ కిర్లోస్కర్ జీవిత కధ ‘యాంత్రిక్ కి యాత్ర’ హిందీ వెర్షన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. -
ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు ► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి. ► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది. ► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి. ► ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ క్వార్టర్లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది. ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
‘అభివృద్ధి’లో ఈ తప్పుడు లెక్కలు ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశాభివృద్ధి అంటే జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రేటు 7.3 శాతమని, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ జీడీపీ రేటు 6.7 శాతంగా ఉందని ‘సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్’, నీతి అయోగ్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు అనుసరించిన ఆర్థిక సూత్రం లెక్కల ప్రకారం యూపీఏ హయాంలో జీడీపీ వద్ధిరేటు 7.75 ఉండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను కారణంగా జీడీపీ రేటు 5.7కు పడిపోయిందని తేలింది. ఈ లెక్కలను మోదీ ప్రభుత్వం తప్పని తిరస్కరించడమే కాకుండా జీడీపీని లెక్కిస్తున్న సూత్రమే తప్పని తేల్చింది. మరో ఆర్థిక సూత్రాన్ని అనుసరించి కొత్త జీడీపీ రేటును లెక్కించాల్సిందిగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌ను మోదీ ప్రభుత్వం ఆదేశించింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీడీపీ రేటును లెక్కించాలని ప్రభుత్వం పెద్దలు ముందుగా సూచించారు. కొత్త ఆర్థిక సూత్రం ప్రకారం జీడీపి రేటును లెక్కించాల్సి వచ్చినప్పుడు అంతకుముందు ఐదేళ్ల క్రితం జీడీపీ రేటు ఎంత ఉందో కూడా లెక్కించడం చట్ట ప్రకారం తప్పనిసరని అధికారులు, ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో అలాగే కానిమ్మని మోదీ ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ఆర్థిక సూత్రం ప్రకారం మోదీ ప్రభుత్వం హయాంలో జీడీపీ రేటు 7.6 శాతం ఉన్నట్లు తేలింది. అంతకుముందు ఐదేళ్ల క్రితం అంటే, యూపీఏ ప్రభుత్వం హయాంలో జీడీపీ రేటు 10.1 శాతం ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను వెల్లడించడం కోసం నవంబర్ 12వ తేదీన సీఎస్ఓ పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా హఠాత్తుగా నాడు ఆ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసింది. అంతకుముందు సీఎస్ఓ వెబ్సైట్లో పేర్కొన్న యూపీఏ హయంలోని జీడీపి రేటు 10.1 శాతాన్ని తొలగించింది. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చైర్మన్‌గా వ్యవహరించే ‘నీతి అయోగ్’ సీఎస్ఓతో కలిసి భారత జీడీపీ రేటు అంచనాలకు కసరత్తు చేసింది. నీతి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫామ్ ఇండయా)వైస్ చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం ఆ పదవిలో రాజీవ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇలా ప్రభుత్వం చేతుల్లో ఉండే రాజకీయ విభాగం సీఎస్ఓ లెక్కల్లో జోక్యం చేసుకోవడం ఏమిటో! సంప్రదాయం ప్రకారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించాల్సిందిపోయి ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించడం ఏమిటో, అప్పోడోరకం, ఇప్పుడోరకం లెక్కలేమిటో విజ్ఞులకే తెలియాలి? ఏదోరకంగా నరేంద్ర మోదీ హయాంలో జరిగిన జీడీపీ రేటును లెక్కించడానికి లేదా అంచనా వేయడానికి ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది. రఘురామ్ రాజన్ నుంచి అర్వింద్ పనగారియా వరకు, ఆ మాటకొస్తే మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియం లాంటి మహా మహా ఆర్థిక నిపుణలు మోదీ హయాంలోనే పనిచేశారు. వారిలో ఎవరిని అడిగినా చిటికలో లెక్కలు తేల్చేవారు. -
కాస్ట్లీ బురద.. తలరాతను మార్చేస్తోంది
టోక్యో : బురద పేరుకు పోయి పర్యాటక రంగానికి కూడా పనికి రాకుండా పోయిన ఆ దీవి.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించేదిగా మారింది. జపాన్ తలరాతను మార్చేసే వార్తలను జపనీస్ పరిశోధక బృందం ఒకటి వెలుగులోకి తెచ్చింది. జపాన్‌కు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరీ ఐలాండ్‌లో తాజాగా అరుదైన ఖనిజాలను గుర్తించారు. సుమారు కోటి 60 లక్షల టన్నుల బురదలో అరుదుగా లభించే ఖనిజాలను వెలుగులోకి తెచ్చారు. ఇట్రియం, యూరోపియం, టెర్బియం, డిస్ప్రోజియం.. ఇలా అరుదైన ఖనిజాలను కనిపెట్టింది. వీటిని స్మార్ట్‌ఫోన్స్, మిస్సైల్ వ్యవస్థలు, రాడార్ పరికరాలు, హైబ్రిడ్ వాహనాల తయారీలో వాడుతారు. ఈ దీవి జపాన్ సరిహద్దులోనే ఉందని.. దానిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని టోక్యో వర్గాలు ప్రకటించుకున్నాయి. ఇప్పటికే ఇట్రియం అనే అరుదైన ఖనిజాన్ని ఈ బురదలో నుంచి వెలికి తీయగా.. సమీప భవిష్యత్‌లో మిగతా ఖనిజాల వెలికితీత ప్రారంభం కానుంది. ఇట్రియంను కెమెరా లెన్స్‌లు, సూపర్ కండక్టర్స్, సెల్‌ఫోన్ స్క్రీన్ల తయారీలో వాడుతారు. ఇక ఈ బురదలో 780 ఏళ్లకు సరిపడా ఇట్రియం, 620 ఏళ్లకు సరిపడా యూరోపియం, 420 ఏళ్లకు సరిపడా టెర్బియం, 730 ఏళ్లకు సరిపడా డిస్ప్రోజియం ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచానికి అవసరమైన చాలా అరుదైన ఖనిజాలు చాలా కొన్ని ప్రదేశాల్లోనే లభిస్తాయని, అందులో ఇదీ ఒకటని యూఎస్ జియోలాజికల్ సర్వే తేల్చి చెప్పింది. అరుదైన భూఖనిజాల విషయంలో ప్రపంచమంతా చైనాపైనే ఆధారపుడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ గనుక ఈ ఖనిజాల ఉత్పత్తిని కొనసాగిస్తే మాత్రం ఏడాది తిరగకుండానే చైనాను మించి పోవటం ఖాయమని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.