లాహోర్: మనం నిత్యం ఏవో ఒక నిరసనలు చూస్తుంటాం. చాలావరకు తమదైన రీతిలో ఒక్కోరకంగా నిసనలు చేస్తుంటారు. చెప్పాలంటే చాలా వరకు వినూత్న రీతిలో ఉంటాయి. అర్థ నగ్నంగా లేకపోతే చిత్రమైన వేషధారణలో నిరసనలు తెలుపుతూ ఉంటారు. అచ్చం అలానే పాకిస్తాన్‌కి చెందిన ఒక ఎంపీ వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు.
(చదవండి: ఫోన్‌లో ఆడుతూ రూ.61,000 విలువ చేసే బొమ్మలను ఆర్డర్ చేసింది)
వివరాల్లోకెళ్లితే..... పాకిస్తాన్ ముస్లిం లీ-ఎన్ (పీఎంఎల్-ఎన్) ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు తారిఖ్ మసీహ్.. కూరగాయలతో తయారు చేసిన దండను ధరించి సైకిల్‌పై పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీకి వెళ్లారు. అసలు ఎందుకు ఆయన ఇలా వెళ్లారంటే పాకిస్తాన్ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగాళాదుంపలు, టమోటాలు, క్యాప్సికమ్‌లతో చేసిన దండను ధరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీకి వచ్చేందకు సైకిల్‌నే వినయోగిస్తానని కూడా చెప్పారు.
పాకిస్తాన్ దేశం ఈ అత్యధిక ద్రవ్యోల్బణానికి ప్రతిగా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదర్కొంటూ భారీ మూల్యం చెల్లిస్తోందన్నారు. ఈ ద్రవ్యోల్బణ ప్రభావంతో పేదలే కాక వైట్‌కాలర్ జాబ్ చేస్తున్న ఉద్యోగుల సైతం నలిగిపోతున్నారంటు మసీహ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే గత 70 ఏళ్లలో పాకిస్తాన్‌లో పెరిగిన ద్రవ్యోల్బణం కంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక స్థాయికి చేరుకుందని పాకిస్తాన్ స్థానిక మీడియా పేర్కొంది.
(చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి)
Comments
Please login to add a commentAdd a comment