Unemployments
-
ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది
కాలేజ్‌లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్మెంట్ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సూర్య కళావతి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్‌మేళా టార్గెట్ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్ మేకింగ్ యూనిట్ల నుంచి మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్ – నాన్ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మంచి సహకారం మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్ కంపెనీ, జీఎస్ఆర్ ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్‌లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి. వేలాది ఉద్యోగాలకు వేదిక! మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్ వరకు అక్కడే చదివాను. బీటెక్ కడపలోని కేఎస్ఆర్ఎమ్లో. ఎంటెక్ ఎస్వీయూ, పీహెచ్డీ జేఎన్టీయూ హైదరాబాద్, పోస్ట్ డాక్టరేట్ పిట్స్బెర్గ్లోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్ఆర్ఎమ్ కాలేజ్తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. – మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. అనూహ్యమైన స్పందన! అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్‌మేళా కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్‌లో ఉన్న కిరణ్ రాయల్ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్ ఇస్తుంటారు. ఈ సోషల్ కాజ్లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి క్యాలెండర్ సిద్ధమవుతోంది. – జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం – వాకా మంజులారెడ్డి -
స్థానిక ఉత్పత్తులే కొనండి
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి. 3 రోజులు గుజరాత్‌కు మోదీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది. అల్లర్లపై మాట్లాడరేం? శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్‌పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో వడ్డీ రేట్లు తగ్గింపు, రైతులకు కనీస మద్దతు ధర, రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోద ముద్ర, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ప్రధానమైనవి. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాల్లో దానిపై చర్చ జరుగుతుంది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయ సభలు యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదో తేదీన పూర్తికానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలి : కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఉదయం పార్టీ పార్లమెంటు వ్యూహాల గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలతో సమన్వయంతో పని చేయాలని నిర్ణయానికొచ్చారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. -
మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు..అధికారుల్ని అడ్డుకున్న ఏబీఎన్ రాధాకృష్ణ!
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏపీ సీఐడీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే.. మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ శుక్రవారం సోదాలు నిర్వహించారు. కాగా, గతంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సలహాదారుగా పనిచేశారు. తన పదవీ కాలంలో యువకులకు శిక్షణనిచ్చే క్రమంలో.. లక్ష్మినారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని పలు అభియోగాలు నమోదయ్యాయి. లక్ష్మినారాయణ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర సీఎస్‌గా పనిచేశారు. లక్ష్మినారాయణ రూ. 242 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది. సోదాలో భాగంగా.. ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మినారాయణ ఇంట్లో వెళ్లినప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో రాధాకృష్ణ, లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులు ఏపీ సీఐడీ అధికారులను ఇంట్లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం.. అధికారులు మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి -
కూరగాయల దండతో అసెంబ్లీకి
లాహోర్: మనం నిత్యం ఏవో ఒక నిరసనలు చూస్తుంటాం. చాలావరకు తమదైన రీతిలో ఒక్కోరకంగా నిసనలు చేస్తుంటారు. చెప్పాలంటే చాలా వరకు వినూత్న రీతిలో ఉంటాయి. అర్థ నగ్నంగా లేకపోతే చిత్రమైన వేషధారణలో నిరసనలు తెలుపుతూ ఉంటారు. అచ్చం అలానే పాకిస్తాన్‌కి చెందిన ఒక ఎంపీ వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: ఫోన్లో ఆడుతూ రూ.61,000 విలువ చేసే బొమ్మలను ఆర్డర్ చేసింది) వివరాల్లోకెళ్లితే..... పాకిస్తాన్ ముస్లిం లీ-ఎన్ (పీఎంఎల్-ఎన్) ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు తారిఖ్ మసీహ్.. కూరగాయలతో తయారు చేసిన దండను ధరించి సైకిల్‌పై పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీకి వెళ్లారు. అసలు ఎందుకు ఆయన ఇలా వెళ్లారంటే పాకిస్తాన్ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగాళాదుంపలు, టమోటాలు, క్యాప్సికమ్‌లతో చేసిన దండను ధరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీకి వచ్చేందకు సైకిల్‌నే వినయోగిస్తానని కూడా చెప్పారు. పాకిస్తాన్ దేశం ఈ అత్యధిక ద్రవ్యోల్బణానికి ప్రతిగా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదర్కొంటూ భారీ మూల్యం చెల్లిస్తోందన్నారు. ఈ ద్రవ్యోల్బణ ప్రభావంతో పేదలే కాక వైట్‌కాలర్ జాబ్ చేస్తున్న ఉద్యోగుల సైతం నలిగిపోతున్నారంటు మసీహ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే గత 70 ఏళ్లలో పాకిస్తాన్లో పెరిగిన ద్రవ్యోల్బణం కంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక స్థాయికి చేరుకుందని పాకిస్తాన్ స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) -
నేటి నుంచే ‘జంగ్ సైరన్’
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుడుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజులపాటు సాగనుంది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’పేరుతో డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందించాలని, రూ.4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించాలని, వెంటనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో భాగంగా మండల, ఉమ్మడి జిల్లాల స్థాయిలో యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టనున్నాయి. అదేవిధంగా పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కలిసి సదస్సులు నిర్వహిస్తారు. వీటికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలు హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న పరేడ్‌గ్రౌండ్‌లో ముగింపు కార్యక్రమాన్ని లక్షలాది మంది నిరుద్యోగులతో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ మెడలు వంచాలి: రేవంత్ రెడ్డి ‘జంగ్ సైరన్’గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తిని టీఆర్ఎస్ మంటగలిపిందన్నారు. ఏడున్నరేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణ యువతతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన చేపడుతున్న ఈ ఆందోళనకు అందరూ మద్దతుగా నిలిచి ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ జంగ్ సైరన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం గాంధీభవన్‌లో యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లేవని యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన లేక విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు. -
కోరిన కంపెనీ లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు ఎర
ఒడిశా : దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగినట్లు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉద్యోగం ఇప్పిస్తామంటే చాలు నిరుద్యోగులకు అదో పండుగే. దీన్నిఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్ల నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ అశ చూపి అందినంత వరకు దోచుకుంటున్నారు. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్న ఓ గ్యాంగ్‌కి ఒడిశా పోలీసులు చెక్ పెట్టారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను మోసం చేస్తున్నఐదుగురు అంతర రాష్ట్ర మోసగాళ్లను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా ప్లాన్ ప్రకారం చేస్తారు అంగూల్ పోలీసు సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా మాట్లాడుతూ, ఈ ముఠా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి వద్ద 8 లక్షల వరకు తీసుకుంటారు. అనంతరం వారికి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ నియామక పత్రాలను జారీ చేస్తుంటారు. తాము మోసపోయినట్లు నిరుద్యోగులు తెలుసుకునే సమయానిక అక్కడి నుంచి మకాం మార్చేస్తారు. ఈ దందా 2018 నుంచి జరుగుతోందని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. అయితే గత నెలలో ఈ మోసగాళ్ల భాగోతం మొదట పోలీసుల దృష్టికి వచ్చింది. అంగూల్ జిల్లాకు చెందిన 59 ఏళ్ల ప్రణబంధు జెనా తన కొడుకుకి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మిశ్రా అనే వ్యక్తికి 4,50,000 నగదుని తీసుకున్నాడు. నెలలు గడిచిన తన కొడుకుకు ఎలాంటి ఉద్యోగం రాకపోయేసరకి మోసపోయాడని గ్రహించి జెనా పోలీసులను ఆశ్రయించాడు. ఐతే... పోలీసులు ఇంకైనా ప్రజలు ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దనీ, అడ్డదారుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన ఓ సర్వేలో నిరుద్యోగిత రేటు 10.7 శాతం పాయింట్లు పెరిగి 2020 ఏప్రిల్‌కు 23.8 శాతం నిరుద్యోగులు ఉన్నారని తేలింది. ( చదవండి : లక్నో కేంద్రంగా కాల్ సెంటర్.. నిరుద్యోగులకు వల ) -
ఉద్యోగాలేవీ?: రాహుల్
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్ విధించడం... ఈ మూడు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఉపాధి కల్పించండి’అనే నినాదంతో కాంగ్రెస్ యువజన విభాగం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాహుల్... మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘మోదీ ప్రధాని పదవి చేపట్టినపుడు ప్రతియేటా రెండో కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. స్వప్నాన్ని చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఎందుకిలా జరిగింది? తప్పుడు విధానాలే కారణం. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్... ఈ మూడు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వాస్తవమేమిటంటే ఇప్పుడు భారత్ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోంది’అని రాహుల్ ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోలో ధ్వజమెత్తారు. అందుకే యూత్ కాంగ్రెస్ వీధులకు ఎక్కిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను యూత్ కాంగ్రెస్ లేవనెత్తడం సంతోషకరమన్నారు. యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమన్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలి: శశిథరూర్ పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు కాంగ్రెస్ వేగవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని, సరైనా దిశానిర్దేశం కొరవడిందని వ్యతిరేక మీడియా కారణంగా ప్రజల్లో నెలకొంటున్న అభిప్రాయాన్ని అడ్డుకోవాలంటే.. వెంటనే అధ్యక్ష నియామకం జరగాలన్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఒకవేళ రాహుల్ బాధ్యతలు స్వీకరించడానికి విముఖంగా ఉంటే... కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియను వెంటనే చేపట్టాలని శశిథరూర్ ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. తాత్కాలిక సారథిగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఈనెల పదో తేదీతో ఏడాది అవుతుంది. సోనియా నిరవధికంగా ఈ బాధ్యతలు మోయాలనుకోవడం న్యాయం కాదని శశిథరూర్ అన్నారు. గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోతోందని, సవాళ్లను స్వీకరించడం లేదనే ప్రచారానికి తెరపడాలన్నారు. రాహుల్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపొచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొంత కాలం సోనియా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం సోమవారంతో ముగిసినా మరికొంతకాలం ఆమె పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి తెలిపారు. సమీప భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. -
ఈ ఏడాది హెచ్1బీ లేనట్లే
వాషింగ్టన్: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 , ఇతర తాత్కాలిక వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్తే దేశంలో స్థానికులకు అవకాశాలు వస్తాయన్నారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కి శనివారం ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ఒకట్రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులపై సంతకం చేస్తానన్నారు. అయితే ఈ ఆంక్షల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.. ‘‘ఈ వీసాల అనుమతుల్లో కచ్చితంగా కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసే సంస్థలకు సంబంధించి ఎంతో కొంత మినహాయింపులు ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే వీసా విధానాన్ని బాగా కఠినతరం చేస్తాం. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే, విదేశీయులకు అడ్డుకట్ట తప్పనిసరి’’అని ట్రంప్ చెప్పారు. ఏడాది చివరి వరకు వీసాలపై ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయి. డాలర్ డ్రీమ్స్‌తో అమెరికా వెళ్లాలనుకొని హెచ్–1బీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాదికి వీసా వచ్చే అవకాశాలు ఇక ఉండవు. కోవిడ్–19తో అల్లాడిపోయిన అగ్రరాజ్యంలో నిరుద్యోగం రేటు కనీవినీ ఎరుగని స్థాయిలో 4.1శాతం నుంచి 13.5శాతానికి పెరిగిపోయింది. కంప్యూటర్‌కు సంబంధించిన రంగాలలో నిరుద్యోగం రేటు 2020 జనవరిలో 3% ఉంటే, మే నాటికి 2.5% తగ్గింది. విదేశాల నుంచి నిపుణులైన పనివారిని తీసుకోకపోతే అమెరికా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే ఎన్నో టెక్కీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ► ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపించనుంది. ఏటా జారీ చేసే 85 వేల హెచ్–1బీ వీసాల్లో 70శాతం ఇండియన్ టెక్కీలే. ► ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ సర్వీసు కంపెనీలకంటే అమెరికా టెక్ సంస్థలపై ప్రభావం అధికంగా చూపించనుంది. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులైన టెక్కీలకు హెచ్–1బీ ద్వారా ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు. ఇక ఇండియన్ సంస్థలు స్థానిక అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ► ఇప్పటికే అమెరికాలో హెచ్–1బీతో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చునని ఇమిగ్రేషన్ లాయర్లు వెల్లడించారు. ► అమెరికా పౌరసత్వం మరియు ఇమిగ్రేషన్ సర్వీసు గణాంకాల ప్రకారం 2016–19 మధ్య హెచ్–1బీలో భారత కంపెనీల వాటా 51% నుంచి 24%కి తగ్గిపోయింది. -
హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు వర్క్ వీసాల జారీని నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నారని వెల్లడించింది. పలువురు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వెలువడిన ఆ కథనం ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. (‘ట్రంప్.. తిరిగి బంకర్లోకి వెళ్లు’) ఆ నిర్ణయం అమల్లోకి వస్తే.. కొత్తగా హెచ్1బీ, లేదా ఇతర వర్క్ వీసా వచ్చినవారు అమెరికా వెలుపల ఉంటే, వారికి కూడా దేశంలోకి అనుమతి ఉండదు. అయితే, ఇప్పటికే హెచ్1బీ, ఇతర వీసాలపై అమెరికాలో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నిపుణులైన విదేశీయులకు అమెరికాలోని సంస్థలు అమెరికాలో ఉద్యోగ అవకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. భారతీయుల్లో చాలామంది ఈ వీసా సాధించాలని కలలు కంటుంటారు. భారత్, చైనాల నుంచి వేలాది మంది వృత్తి నిపుణులను టెక్నాలజీ సంస్థలు ఈ వీసాపై అమెరికాకు తీసుకువస్తుంటాయి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయి, ఇండియాకు తిరిగొచ్చిన భారతీయులకు ట్రంప్ తీసుకోనున్న నిర్ణయం అశనిపాతం కానుంది. హెచ్1బీతో పాటు, హెచ్2బీ, జే1, ఎల్1 వీసాలను కూడా రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని, పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి హోగన్ గిడ్లీ స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, సంస్థలకు అవసరమైన నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తూ ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌నకు యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ డోనోహూ ఒక లేఖ రాశారు. (జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడి ఆవేదన) -
మళ్లీ ప్రపంచ మార్కెట్లు క్రాష్..!
టోక్యో/న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధికి తీవ్రంగానే విఘాతం కలిగిందన్న తాజా గణాంకాల కారణంగా ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. కార్మికుల దినోత్సవం సందర్భంగా చాలా మార్కెట్లలో ట్రేడింగ్ జరగలేదు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కారణంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ పతనం తప్పిందని నిపుణులంటున్నారు. పతనం ఎందుకంటే...: ఆస్ట్రేలియాలో తయారీ రంగం 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా కరోనా వైరస్ మూలం ఎక్కడో విచారణ చేయాలన్న అంశంపై ఆస్ట్రేలియా, చైనాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతులపై ఆంక్షలు వి«ధించడం వంటి చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. మరోవైపు నిరుద్యోగ భృతి కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆరు వారాల్లో మూడు కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో వినియోగదారుల వ్యయం రికార్డ్ స్థాయికి పడిపోయింది. కాగా యూరోజోన్ వృద్ధి ఈ క్యూ1లో 3.8 శాతం తగ్గింది. ఈ గణాంకాలు మొదలైనప్పటి (1995) నుంచి చూస్తే, ఇదే అత్యంత అధ్వాన క్షీణత. ఆస్ట్రేలియా స్టాక్ సూచీ 5 శాతం పడిపోగా, జపాన్ నికాయ్ 3 శాతం నష్టపోయింది. బ్రిటన్ ఎఫ్టీఎస్సీ 2 శాతం మేర క్షీణించింది. రాత్రి గం.11.30 ని.సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 3–4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పగటి పూట ట్రేడింగ్‌లో 5 శాతం మేర నష్టపోయి, 9,300 పాయింట్ల దరిదాపుల్లోకి వచ్చింది. గురువారం నిఫ్టీ 306 పాయింట్లు లాభపడి 9,860 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మన మార్కెట్లో ట్రేడింగ్ జరిగిఉంటే, సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయి ఉండేవని నిపుణులంటున్నారు. -
మాయ మాటలు మాంత్రికుడు.. చంద్రాలు సారు....
సాక్షి, గుంటూరు: ‘నమ్మకం ఎరుగని నాయకుడు.. మాయ మాటలు చెప్పే మాంత్రికుడు. కుట్రలు చేసే కుతంత్రికుడు. ప్రశ్నిస్తే బెదిరించే పాలకుడు. అభివృద్ధికి మారుపేరు నేనంటూ చెప్పుకునే ఢాంబికుడు.. వెనుకబడిన వర్గాలను విస్మరించిన వంచకుడు’ అంటూ అలవికాని హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నిన్నెలా నమ్మేదంటూ నిట్టూరుస్తున్నారు. హామీలు మరిచారు గత ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రచారానికి మిమ్మల్ని రానివ్వకుంటే మాదిగజాతి మీకు అండగా ఉండి స్వాగతించింది. మీ పాదయాత్రలో మాలమహానాడు కార్యకర్తలు రాళ్లురువ్వితే మాజాతి ముందుండి నడింపించింది. అదిలాబాద్ జిల్లా భైంసా ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలో మా బిడ్డలు నలుగురు ప్రాణాలను అర్పించారు. ఆ సమయంలో చనిపోయిన వారికి ఒక్కక్కరికీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ‘నాకోసం ప్రాణాలర్పించిన ఆ నలుగురి సాక్షిగా చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు అండగా నిలుస్తాను’ అని అన్నారు. గతంలో వర్గీకరణ చేసిందినేనే.. మళ్లీ అధికారంలోకి వచ్చాకా చేసేది కూడా నేనే అంటూ ఇచ్చిన హామీ ఏమైంది. నిన్ను నమ్మి ఏపీ రాష్ట్రంలోనూ పూర్తిగా మీకు సహకరించాం. విశాఖలో ముగిసిన పాదయాత్రలోనూ అవే మాటాలు చెప్పారు. ఐదేళ్ల పాలన ముగిసినా నేటికీ మీరిచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు...ఇంక నిన్ను నమ్మం బాబూ. – కోట సుబ్బుమాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జీ, ఎమ్మార్పీస్ రుణమాఫీకి శఠగోపం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి డ్వాక్రా మహిళలు మోసపోయారు. మహిళా స్వయంసహాయక సంఘాలకు రుణమాఫీ హామీని నమ్మిన మహిళలు బ్యాంకులకు రుణాలు కట్టక డిఫాల్టర్లుగా మారారు. కొన్ని సంఘాల నిర్వీర్యమయ్యాయి. డ్వాక్రా మహిళలు బ్యాంకు అప్పులు తీర్చేందుకు నానా అవస్థలు పడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాకా రుణమాఫీ కాదు ప్రోత్సహకంగా ఒక్కొ సభ్యురాలికి రూ.10వేలు అందజేస్తామని మాటమార్చింది. 2015, 2016 సంవత్సరాల్లో రెండు విడతలుగా రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంది. తీరా ఎన్నికలు సమీపించడంతో అక్కచెల్లెమ్మలకు పసుపు కుంకుమ కింద ఇస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి అవికూడా మూడు దఫాలుగా ఇస్తానంటూ ముందుస్తు చెక్కుల్ని పంపిణీ చేశారు. కేవలం ఎన్నికల సమయంలో ఆ డబ్బుల్ని తీసుకున్న మహిళల ఓట్లును కాజేసేందుకు ఇచ్చిన విషయం అంతా గ్రహించారు. అందుకే మహిళలెవ్వరు నిన్ను నమ్మరు బాబూ! – పిడతల ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యురాలు యడ్లపాడు నిరుద్యోగ భృతి ఏదీ ? సీఆర్డీఏ పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు కచ్చితంగా ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మంత్రులు హామీ ఇచ్చారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న వారికి వారికిష్టమైన రంగాలేవో గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆయా విభాగాల్లోనే ఉపాధిని కల్పిస్తామంటే సంతోషించాం. ఎస్టీ కుటుంబానికి చెందిన మా ఇంట్లో నా అన్న శేఖర్‌నాయక్ డిగ్రీపూర్తి చేసి ఐదేళ్లు, నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు గడిచాయి.నిబంధనల పేరిట అనర్హులగా ప్రకటించి భృతి ఇవ్వడం లేదు. నా తండ్రి మతనాయక్ నా చిన్నతనంలోనే మృతి చెందితే అమ్మ రమణిబాయి నిరక్ష్యరాస్యురాలైనా క్వారీల్లో కంకకొట్టి, వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ మా ఇద్దరిని చదివించింది. మాకు ఎలాంటి ఆసరా లేదు. దశాబ్దాల కిందట ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు కూలిపోయింది. కనీసం ఇంటి రుణమిచ్చి ప్రొత్సహించిన పాపాన పోలేదు. కనీసం నిరుద్యోగ భృతి వస్తే కుటుంబానికి కాస్తంత ఆసరా అవుతుందంటే దాన్ని ఇవ్వలేదు. అర్హత ఉండి భతి పొందలేని నిరుద్యోగులు నిన్ను ఎందుకు నమ్మాలి బాబూ? – వి వెంకటేశ్వరనాయక్, బోయపాలెం, యడ్లపాడు మండలం -
నవతరం..నడకెటు?
నిరుద్యోగమే ప్రధానాంశం భారత్‌లోనూ, అటు ఇండోనేసియాలో కూడా నిరుద్యోగమే ఎన్నికల్లో అతి పెద్ద అంశంగా మారబోతోంది. భారత్‌లో నిరుద్యోగం 20 ఏళ్లలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. మన దేశంలో దాదాపుగా రెండు కోట్ల మంది యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ హవాతో యువతరం బీజేపీ వైపే ఉంది. ఈసారి ఆ స్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ‘మిలీనియల్స్’లో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి నెలకొంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే నిరుద్యోగం అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. అటు ఇండోనేసియాను నిరుద్యోగం పీడిస్తోంది. నిరుద్యోగం జాతీయ సగటు 5 శాతంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం ఉంది. రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న జొకో విదోదో ఈ సమస్య పరిష్కారానికి మళ్లీ పారిశ్రామీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు ఇస్తున్నారు. ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికల్లో యువతరాన్ని ఆకర్షించేలా వ్యూహరచన చేస్తున్నారు. మిలీనియల్స్.. 1982 నుంచి 2001 మధ్య పుట్టినవారిని మిలీనియల్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం అందరి దృష్టి వీరి మీదే ఉంది.. ఎందుకంటే.. ఆసియాలో ఈ ఏడాది రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో జరగనున్న ఎన్నికలలో వీరు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఇలా భారత్, ఇండోనేసియాలో 50 కోట్ల మంది ‘మిలీనియల్స్’ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ దేశాలను నడిపించే నేతలెవరో తీర్పు చెప్పనున్నారు. భారత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 20 నుంచి 34 ఏళ్ల వయసు మధ్యనున్న వారి సంఖ్య 26 శాతానికి పెరిగింది. 40 కోట్ల మందికిపైగా ‘మిలీనియల్స్’ మన దేశంలో ఓటు హక్కు కలిగిఉంటే, ఇండోనేసియాలో 7.9 కోట్ల మంది వినియోగించుకోబోతున్నారు. వీరంతా ఎవరికి ఓటు వేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఎందుకంటే ఈ తరం ఓటర్లు ఎవరి ప్రభావానికీ లోనుకాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోగల శక్తిమంతులు. అందుకే వారిని ఆకర్షించడం పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది.ఎన్నికలంటే కులం, మతం వంటివి అగ్రస్థానంలో ఉంటాయి. ఈ యువ ఓటర్లను ఆకర్షించేవి మాత్రం ఆర్థికాంశాలే అనేది విశ్లేషకుల భావన. నిరుద్యోగం తీర్చేవారివైపే యువతరం..? 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారు గంపగుత్తగా బీజేపీకి ఓటు వేశారని పలు పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’(సీఎస్డీఎస్) చేసిన సర్వేలో యువ ఓటర్లలో బీజేపీ పట్టు కోల్పోతోందని తేలింది. ఏ ప్రభుత్వమైతే ఉద్యోగాల కల్పన దిశగా స్పష్టమైన హామీలు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేస్తామన్న నమ్మకాన్ని కలగజేస్తుందో వారికే యువతరం ఓటు వేయనుందని ఆ సర్వే చెబుతోంది. గుజరాత్ సహా ఇటీవల జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారిని ఆకర్షించేలా వ్యూహాలు పన్నడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్న అంచనాలు ఉన్నాయి. రామమందిర నిర్మాణం, హిందూత్వకార్డు వంటి అంశాల కంటే ఆర్థికపరమైన అంశాలకే నేటి తరం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అది గ్రహించిన బీజేపీ ప్రభుత్వం చమురు ధరల్ని తగ్గించడం, జీఎస్టీలో 28 శాతం శ్లాబులో ఉన్న ఎన్నో వస్తువుల్ని 12 శాతం శ్లాబులోకి తీసుకురావడం వంటి చర్యల్ని తీసుకుంటోంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే సత్తా ఉన్న 40 కోట్ల మంది ‘మిలీనియల్స్’ ఈసారి ఏ పార్టీకి అండగా ఉంటారో, ఎవరిని అందలం ఎక్కిస్తారో? అన్నది ఆసక్తికరంగా మారింది. స్వీయనిర్ణయం గలవారు.. మిలీనియల్స్‌లో ఎక్కువ మంది ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడ్డవారు. సొంతంగా ఆలోచనలు చేయగలిగిన శక్తి కలిగినవారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఆయా అంశాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారే. ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా తమకంటూ అభిప్రాయాలను కలిగి ఉన్నవారు. మిలీనియల్స్‌లో అత్యధికులు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నవారే. కల్పిత వార్తలే అడ్డంకి... యువ ఓటర్లు సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక కాలం గడుపుతారు. ‘మిలీనియల్స్’ రోజుకు సగటున 5 నుంచి 6 గంటలు సోషల్ మీడియాలోనే ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు, విస్తృతంగా విషయ పరిజ్ఞానాన్ని కూడా నేటి తరం పెంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాను నకిలీ వార్తలు వరదలా ముంచెత్తుతూ ఉండటంతో ఏది అసలు, ఏది నకిలీ తేడా తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. రాజకీయ పార్టీలకు తమ పార్టీల పట్ల జరిగే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం అతి పెద్ద సమస్యే. కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతంతో ఫేస్బుక్ ఎన్నికల్ని ప్రభావితం చేయగలదన్న ఆందోళనలు అన్ని పార్టీల్లోనూ నెలకొన్నాయి. ‘మిలీనియల్స్’ను ఆకర్షించాలంటే సోషల్ మీడియా ప్రచారం ఒక్కటే సరిపోదు, కల్పిత వార్తలను కూడా తిప్పి కొట్టాలి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అదే పెద్ద అడ్డంకిగా మారనుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రేపటి ఫన్డేలో...
నిరుద్యోగం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆకలి చంపేస్తున్నా, కడుపు నిండిందని చెప్పాలి. సొంత ఇంట్లోని వ్యక్తుల దగ్గర కూడా ‘‘డబ్బులున్నాయా?’’ అనడిగితే ఉన్నాయంటూ తలూపాలి. ఎందుకంటే ఆకలని, డబ్బులని అడగడంలో నిరుద్యోగం ఒక సిగ్గును తెచ్చిపెడుతుంది. భయపెడుతుంది. అలాంటి ఒకతని చిన్న జీవితాన్ని చదవండి.. ‘చెరిగిపోయిన చిత్రాలు’ కథలో... మొదటి సినిమా ఆ అమ్మాయి ఇప్పటివరకూ థియేటర్లో ఒక్క సినిమా కూడా చూడలేదు. అసలు థియేటర్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆరోజు ఆ అమ్మాయి వాళ్ల నాన్న, తమ్ముడు సినిమాకు వెళుతున్నారు. ‘‘నువ్వూ వస్తావా?’’ అని అడిగాడు నాన్న, అమ్మాయిని. ఎందుకో ఆ అమ్మాయికి మొదటిసారి సినిమాకు వెళ్లాలనిపించింది. కొత్త బట్టలేస్కొని, తనకిష్టమైన చెప్పులు తొడుక్కొని బయల్దేరింది. బయటేమో ఎర్రటి ఎండ. థియేటర్‌కి వెళ్లాలంటే పక్క ఊరికి వెళ్లాలి. దార్లో చెప్పు తెగిపోయింది. ఆ అమ్మాయికి ఇలా మొదటి సినిమా అనుభవమంతా రకరకాలుగా సాగిపోయింది. ఆ ఒక్కరోజు, ఆమెకు ఆ మొదటి సినిమా ఇచ్చిన అనుభూతిని చదవండి.. ‘మొదటి సినిమా’ కథలో... హృదయభాష అతనిది ఒక విచిత్రమైన భాష. చాలా చదివాడు. ఎంత చదివాడంటే, అందరూ మాట్లాడే భాష కాకుండా, కొత్త భాష కనిపెట్టి మరీ మాట్లాడేటంత. ఆ కొత్త భాషే అతనికి లెక్కలేనన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. చావుకు దగ్గరయ్యే వరకూ, అతని సొంత భాష అతణ్ని ఎలా ఇబ్బంది పెట్టింది? చదవండి.. ‘హృదయ భాష’ కథలో... -
జాబు కావాలా బాబూ..?
సిద్దిపేట టౌన్: ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో పైరవీకారులు కొత్త దందాకు తెరతీశారు. తమకున్న పరిచయాలతో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగంపై ఆశతో కొందరు ఈ మోసగాళ్ల వలలో పడుతున్నారు. జాబ్ కావాలంటే ఖర్చు అవుతుంది లేకపోతే ఊరికే రాదు కదా అంటూ నిరుద్యోగుల దగ్గర నమ్మబలుకుతున్నారు. వారి మాటలు నమ్మి జాబ్ వస్తుందనే సంతోషంలో తర్వాత పరిణామాలు ఏమిటనేది ఆలోచించకుండానే అడిగినన్ని డబ్బులు వారి చేతిలో పెడుతున్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో పరిచయాలు పెంచుకొని రోజు కలెక్టరేట్‌కు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అక్కడికి వచ్చిన వారితో మాటామాటా కలిపి వారిని జాబ్ ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలోని సుమారు 40 మంది వరకు ఉద్యోగాలకోసం పైరవీకారులకు డబ్బులు ఇచ్చి వారి వెంట తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జాబ్‌లు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి పేరును వాడుకుంటూ అతనికి మాకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మేం ఎవరికి జాబ్ కావాలని చెప్పితే వారికి జాబ్ ఇస్తారంటూ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. కలెక్టరేట్లోనే తిష్ట... ఒక వ్యక్తికి కలెక్టరేట్లో జాబ్ ఇప్పిస్తామని అందులో పనిచేసే అతను సుమారు రూ.1 లక్ష తీసుకొని 2 నెలల్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పినట్టు సమాచారం. డబ్బులు తీసుకొని 6 నెలలకు పైగా గడిచినా జాబ్ ఇప్పించకపోవడంతో విసిగిపోయిన సదరు వ్యక్తి డబ్బులు తీసుకున్న వ్యక్తికోసం 2 నెలలుగా రోజు కలెక్టరేట్‌కు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి చూస్తూ తిరిగిపోతున్నాడు. కలెక్టరేట్‌లోకి ఒక సాధారణ వ్యక్తిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నా ఎందుకు వస్తున్నాడంటూ అతని గురించి ఎవరూ ఆరా తీయకపోవడం విశేషం. డబ్బులు తీసుకున్న వ్యక్తి బుజ్జగిస్తూ రేపూ మాపు వస్తుంది అంటూ తిప్పుతుండడంతో గట్టిగా నిలదీయడంతో అతని డబ్బులు అతనికి తిరిగి ఇస్తానంటూ చెప్పినట్టు తెలిసింది. దీనిపై కలెక్టరెట్ అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. అధికారుల అండా.. లేక ప్రజాప్రతినిధులదా! జాబ్‌లు ఇప్పిస్తామంటూ ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న కొందరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారులతో సాన్నిహిత్యం పెంచుకొని అమాయకులను నమ్మించి వారి జేబులు కొల్లగొడుతున్నారు. ప్రజాప్రతినిధులే అనుకుంటే ప్రభుత్వ అధికారులు సైతం ఉద్యోగాల పేరిట పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలో ఓ 10, 15 మంది పైరవీకారులుగా అవతారం ఎత్తి అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నా ఎవరూ దీని గురించి నోరు మెదపడం లేదు. డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు సైతం వీరి గురించి వివరాలు చెప్తున్నారు తప్పితే బయటకు వచ్చి నిలదీసేవారు ఎవరూ లేకపోవడం కొసమెరుపు. ఇలాంటి వాటికి ఇకనైనా ఫుల్స్టాప్ పడుతుందా లేదా చూడాలి. -
నిరుద్యోగ భృతి రూ. 2,000
-
నిరుద్యోగ భృతి రూ. 2,000
సాక్షి, హైదరాబాద్ : మరో కీలకమైన నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లక్షలాది మంది రైతులను ఆదుకునేందుకు వ్యవసాయానికి పెట్టుబడి సాయం పథకానికి శ్రీకారం చుట్టిన సర్కారు.. నిరుద్యోగ యువతపైనా దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో ఆశించినన్ని ఉద్యోగావకాశాలు రాకపోవటంతో అసంతృప్తితో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ప్రతినెలా ఆర్థిక సాయం అందించే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకానికి అవసరమైన విధివిధానాలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లోనే ఈ పథకాన్ని ప్రకటించాలని భావిస్తోంది. నిరుద్యోగ భృతి అమలుకు అవసరమైనన్ని నిధుల కేటాయింపులు, సాధ్యాసాధ్యాలపై అధ్యయన బాధ్యతను ఆర్థిక శాఖకు అప్పగించినట్లు సమాచారం. 18 ఏళ్లు నిండి డిగ్రీ పూర్తి చేసి.. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగం లేని వారందరినీ ఈ పథకానికి అర్హులుగా పరిగణించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులుంటారన్న అంచనాతో లెక్కలేసుకుంది. ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.2 వేల చొప్పున భృతి చెల్లించాలని భావిస్తోంది. కనీసం 18 ఏళ్ల వయస్సు నుంచి గరిష్టంగా 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చాలని భావిస్తోంది. అర్హతలు, విధివిధానాలు, మార్గదర్శకాల తయారీ బాధ్యతను సీఎం కేసీఆర్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితోపాటు ఆర్థిక శాఖ అధికారులకు అప్పగించినట్లు సమాచారం. నిరుద్యోగుల లెక్కలపై గందరగోళం రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారన్న లెక్కలు ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో లేవు. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటివరకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో దాదాపు 20 లక్షల జాబ్‌కార్డుదారులున్నారు. వీరిలో నిరక్షరాస్యులతోపాటు చదువుకున్నవారూ ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనాలున్నాయి. అయితే కనీస డిగ్రీ విద్యార్హత, వయసు నిబంధనలతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, మొత్తం 10 లక్షల నుంచి 15 లక్షల మధ్య నిరుద్యోగ భృతి పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి హామీ మార్గదర్శకాల ప్రకారం వరుసగా 180 రోజులు పని దొరకని వారందరినీ నిరుద్యోగులుగా పరిగణిస్తారు. ఎవరిని, ఏ ప్రాతిపదికన నిరుద్యోగులుగా పరిగణించాలన్న విషయంలో అధికారులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎందరు నిరుద్యోగులున్నారు? నిరుద్యోగిని నిర్ధారించేందుకు ఏయే అర్హతలుండాలి? ఒక్కొక్కరికి ఎంత భృతి చెల్లించాలి? పథకానికి ఏయే మార్గదర్శకాలుండాలి? అన్న అంశాలపై ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. నిరుద్యోగుల సంఖ్యను గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు డిగ్రీ పూర్తి చేసి వారి నుంచి అర్హత ధ్రువపత్రాలతోపాటు తాను నిరుద్యోగినని అఫిడవిట్‌ను తీసుకోవాలని యోచిస్తోంది. ఏడాదికి రూ.2,400 కోట్ల భారం దాదాపు 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లించాలంటే.. నెలకు రూ.200 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,400 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కాలేజీ యాజమాన్యాల జేబులు నింపుతోందని, దీన్ని అమలు చేసే బదులు నిరుద్యోగులకు జీవన భృతి కల్పించడమే మేలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. వ్యవసాయ పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్న తరుణంలో నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చే భృతికి నిధుల సర్దుబాటు పెద్ద కష్టమేమీ కాదని అధికారులు చెబుతున్నారు.} ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తు సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావటంతో 2018–19 బడ్జెట్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా కొత్త జనాకర్షక పథకాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే దాదాపు 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడి సాయం పథకాన్ని ప్రకటించారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డప్పట్నుంచీ తగినన్ని నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్షాలు సైతం అదే అంశాన్ని ప్రధానాస్త్రంగా ఎంచుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎత్తుగడను చిత్తు చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తేవాలని సీఎం భావిస్తున్నారు. అర్హత ఏమిటి? డిగ్రీ పూర్తి చేసి.. 18–30 ఏళ్ల మధ్య వయసున్న వారు! ఎంత మందికి? 10 లక్షల నుంచి 15 లక్షల మంది ఉండొచ్చని అంచనా -
నిరుద్యోగంపై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదారాబాద్ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ యువత, నిరుద్యోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం సోషల్‌మీడియా ట్విటర్ వేదికగా నిరుద్యోగం గురించి వ్యాఖ్యానించారు. స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను గురించి ఆయన ట్వీట్ చేశారు. భారత వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా నిరుద్యోగాన్ని అరికట్టివచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వరి, పాలు, పళ్లు, కూరగాయలు, మిర్చి పండించి సూపర్ మార్కెట్లకు అందిచండం ద్వారా ప్రపంచానికి ఆహారాన్ని అందించవచ్చని కోవింద్ అన్నారు. వ్యవసాయ రంగం భారత్‌లోని వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్సించడంలో సహాయ పడుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
ఉద్యోగం రాలేదని ఉసురు తీసుకున్నాడు..
ఓ యువకుడు ఉన్నత చదువులు చదివాడు. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేటు ఫైనాన్స్, చిట్ ఫండ్స్ సంస్థల్లో పని చేస్తూనే తనకిష్టమైన పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండు సార్లు ఎస్సై ఉద్యోగానికి పరీక్షలు రాసి కొన్ని మార్కుల తేడాతో విఫలమయ్యాడు. అనంతరం ఇక తనకు ఉద్యోగం రాదేమోనని మనస్తాపం చెందిన ఆ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు, కుటుంబీకులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. మంచిర్యాల క్రైం: మంచిర్యాల పట్టణంలోని మేదరివాడకు చెందిన వినోద్‌కుమార్(31) ఉద్యోగం రాదేమోనని మనస్తాపం చెంది గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మేదరివాడలోని వైశ్య భవన్ సమీపంలో నివాసం ఉంటున్న వంగపెల్లి సాగర్‌రావు, విజయలక్ష్మీ దంపతుల కుమారుడు వినోద్‌కుమార్. ఎంబీఏ పూర్తి చేసి గత కొంత కాలంగా గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే తపన, పోలీస్ ఉద్యోగమంటే మక్కువతో రెండు సార్లు ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నాలు చేశాడు. రాత పరీక్షలో రెండు మార్కుల తేడాతో ఉద్యోగం ఆ యువకుడిని వరించలేదు. అప్పటి నుంచి తనకు ఉద్యోగం రాదేమోనని వినోద్ మనస్తాపం చెందుతున్నాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. వినోద్ తల్లిదండ్రులు రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. వినోద్, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్ ఇంటివద్దనే ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తమ్ముడు బయటకు వెళ్లడంతో వినోద్ ఉరేసుకున్నాడు. గోప్యంగా ఉంచేందుకు యత్నం వినోద్ ఆత్మహత్యను గోప్యంగా ఉంచేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఆత్మహత్య చేసుకున్న విషయం శుక్రవారం ఉదయం వరకు ఎవరికీ తెలియకుండా ఉంచారు. వినోద్ తమ్ముడు శ్రావన్ వినోద్‌ను కాపాడే ప్రయత్నంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే వినోద్ మృతి చెందాడని వైద్యులు ద్రువీకరించారు. ఆత్మహత్యను గోప్యంగా ఉంచి కుటుంబీకులు శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు సిద్ధం చేశారు. ఆగిన అంత్యక్రియలు వినోద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న సీఐ మహేశ్, ఎస్సైలు శ్రీనివాస్ యాదవ్, కే.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వినోద్ అంత్యక్రియలను నిలిపివేశారు. కుటుంబసభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వినోద్ మృతదేహాన్ని పోస్టు మార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. -
అధికారంలోకి రాగానే 3వేల నిరుద్యోగ భృతి
సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందజేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ముఖ్యమంత్రి తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు కల్పించారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులకు రుణమాఫీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వరికి మద్దతు ధర రూ.2 వేలు, అలాగే పత్తి, మిర్చి పంటలకు సరైన మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే 2019 ఎన్నికల్లో హుజూర్ నగర్, కోదాడలో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీ గెలుపొందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. -
యువత తెలివిని మార్కెటింగ్ చేస్తున్నా: బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: ఐటీలో పెను మార్పులను ఇరవై ఏళ్ల కిందటే ఊహించి ఈ రంగానికి పునాది వేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ)ఆ«ధ్వర్యంలో శనివారం విజయవాడ బందరు రోడ్డులోని ఏ–కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మెగా జాబ్ మేళా వీడ్కోలు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో అన్ని రంగాలలో కలిపి 15 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. మన యువతకు ఉన్న తెలివితేటలు ఇండియాలో ఎవరికీ లేవని, వారి తెలివినే తాను మార్కెటింగ్ చేస్తున్నానని చెప్పారు. ప్రతి నెలా ఒక్కో విభాగంలో కాన్ఫరెస్స్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 1,087 మందికి ఉద్యోగాలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వీరికి గరిష్ట వేతనం ఏడాదికి రూ.3.10 లక్షలు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 5.35 లక్షల ఉద్యోగాలిచ్చామని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో 15 లక్షల ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు తెలిపారు. శనివారం శాసనసభలో పెట్టుబడులు, యువజన విధానం, నిరుద్యోగ భృతిపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23, 24, 25వ తేదీల్లో విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడుదారుల భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగ భృతిపై కమిటీల ఏర్పాటు నిరుద్యోగ భృతిపై కేబినెట్ సబ్‌కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని, విధి విధానాలు రూపొందించేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడా నిరుద్యోగ భృతి విజయవంతం కాలేదన్నారు. అర్హులకే నిరుద్యోగ భృతిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా యువత వివరాలు, భూమి, రేషన్‌కార్డులు తదితర కేటగిరీల కింద సమగ్ర సమాచారం సేకరిస్తున్నామన్నారు. విధి విధానాల అడ్వయిజరీ కౌన్సిల్ ఛైర్మన్‌గా తాను, అమలుకు సీఎస్ ఛైర్మన్‌గా ఉంటారన్నారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, రాధాకృష్ణ, చాంద్‌బాషా, ఆనందరావు, జీవీ ఆంజనేయులు, గణేష్‌లు పాల్గొనగా, మంత్రులు అమరనాధ్‌రెడ్డి, కొల్లు రవీంద్రలు సమాధానమిచ్చారు. శాసనసభ నిరవధిక వాయిదా చర్చపై సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. నవంబరు 10 నుంచి డిసెంబర్ 2 వరకు 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందాయని, రెండు బిల్లులు ఉపసంహరించుకున్నట్లు వివరించారు. -
నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ చెలగాటం
కొత్తపేట: రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో పాలనను భ్రష్టుపట్టిస్తోందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయకుండా, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ అటు నిరుద్యోగులు, ఇటు సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం పలివెల గ్రామంలో వైఎస్సార్ సీపీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా వైఎస్సార్ కుటుంబం, నవరత్నాల ప్రచారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగమిస్తామని, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వాటి సంగతే మర్చిపోయారని విమర్శించారు. వివిధ శాఖల్లో 10 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించి వారిని రోడ్డున పడేశారని తెలిపారు. ఫలితంగా వయోపరిమితి దాటిపోయి మరో ఉద్యోగంలో చేరే అవకాశం లేక వారి భవిష్యత్ అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఉచిత సివిల్ సర్వీస్ కోచింగ్‌కు 4 నెలలు క్రితం అర్హత పరీక్ష పెట్టి, వారికి ఆ అవకాశం కల్పించకుండా అయోమయానికి గురిచేసిందన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉందన్నారు. రైతులు, మహిళలు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేశారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో పేద, సామాన్య కుటుంబాలకు అన్ని విధాలా ప్రయోజనాలు, ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించారని చెప్పారు. ఈ పథకాల అమలు ద్వారా రాష్ట్రానికి వైఎస్సార్ స్వర్ణయుగాన్ని తీసుకురానున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్‌కు చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ నేతృత్వంలో ఏర్పడే రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, సర్పంచి సరిపెల్ల ఆనంద్, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు సత్తిరాజు (రాజా), పార్టీ జిల్లా కార్యదర్శులు నెల్లి లక్ష్మీపతిరావు, రెడ్డి చంటి, పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, గ్రామ అధ్యక్షుడు భమిడిపాటి దుర్గాలక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
మాదాపూర్: ప్రముఖ ఐటీ కంపనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన హర్షత్ నవీన్ (28) ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రై వేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిరుద్యోగులను మోసం చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే నౌకరి, మాన్స్టర్ జాబ్ పోర్టల్ నుంచి నిరుద్యోగుల వివరాలు సేకరించి వారికి నకిలి ఈ-మెయిళ్లు పంపించాడు. సుమారు 8 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి రూ. 8 లక్షల వసూలు చేసి పారిపోయాడు. ఎటువంటి అనుమానం రాకుండా ఐల్యాబ్స్, రహేజా మాక్స్ మాస్ లలో దొంగ ఇంటర్వ్యూలు సైతం చేయించాడు. వేణుగోపాల్ అనే వ్యక్తి సహకరించాడు. ప్రస్తుతం వేణుగోపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హర్షత్ నవీన్‌ను రిమాండ్‌కు పంపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.