సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందజేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ముఖ్యమంత్రి తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు కల్పించారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘనత ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులకు రుణమాఫీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వరికి మద్దతు ధర రూ.2 వేలు, అలాగే పత్తి, మిర్చి పంటలకు సరైన మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే 2019 ఎన్నికల్లో హుజూర్ నగర్, కోదాడలో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీ గెలుపొందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment