Uthamkumar reddy
-
టీఆర్ఎస్కు అభ్యర్థి దొరకలేదా?
మిర్యాలగూడ : నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడానికి టీఆర్ఎస్కు స్థానికులు దొరకలేదా? టికెట్ అమ్ముకున్నారా? అని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మిర్యాలగూడలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక హనుమాన్‌పేట చౌరస్తా నుంచి రాజీవ్‌చౌక్ వరకు సాగింది. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి మునుగోడులో చెల్లని రూపాయి, నల్లగొండలో చెల్లుతుందా? అని అన్నారు. నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, డబ్బు, మద్యంతో వచ్చే వారిని ఓడిస్తారని అన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, రాహుల్‌గాంధీకి, నరేంద్రమోదీకి మధ్య జరుగుతున్నాయని అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి పేద కుటుం బానికి నెలకు రూ.6 వేల రూపాయల చొప్పున అందిస్తారని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే సారి చేస్తారని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచి నల్లగొండ ప్రజలు గర్వపడేలా నడుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అద్యక్షుడు శంకర్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. నల్లగొండ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశ రక్షణకు సైనికుడిగా పనిచేస్తే టీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాదారుడిగా ఆక్రమణ లకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇందిరమ్మ రా జ్యం రావాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాల ని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, మేడ సురేందర్‌రెడ్డి, ముజ్జ రామకృష్ణ, సలీం, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, శాగ జలేందర్‌రెడ్డి, ఎం డీ ఇస్మాయిల్, కంచర్లకుంట్ల దయాకర్‌రెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, తమన్న, ఆరీఫ్, టీడీపీ నాయకులు కాసుల సత్యం, మాన్యానాయక్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర వారధి నిర్మించా..ఆదరించాలి
మఠంపల్లి : తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మట్టపల్లి వద్ద క్రిష్ణానదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రూ.50కోట్లు మంజూరు చేసి అంతరాష్ట్ర వారథి హైలెవల్ వంతెన నిర్మాణానికి కృషి చేసినందున ఆదరించి కాంగ్రెస్‌పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మట్టపల్లి, పెదవీడు, మఠంపల్లి, రఘునాథపాలెం, తదదితర గ్రామాలలో రోడ్‌షో నిర్వహించారు. ముందుగా ఆయన హైలెవల్ వంతెనను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలలో మాట్లాడారు. కిష్టపట్టె ప్రాంతం వ్యవసాయాభివృద్ధితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు రైల్వేలైను, హైలెవల్ వంతెన, సబ్స్టేషన్లు నిర్మించానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈప్రాంత అభివృద్దికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. కాగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలతో ఉత్తమ్‌కు ఘన స్వాగతం పలికారు. -
కేసీఆర్ అప్పులు పెంచారు
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాండూరులో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాటాడారు. తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసిన కేసీఆర్ రీ డిజైన్లకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతానికి సాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఖర్చు మొదట్లో రూ.10 వేల కోట్లు ఉంటే.. రీడిజైన్ చేసి.. రూ.60 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తా మని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులు రూ.17 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల అప్పు ఉందని తెలిపారు. కానీ కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బంగారుమయమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ రూ.300 కోట్ల బంగళాలో విశ్రాంతి తీసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చార్మినార్‌లో కలుపుతాం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాండూరు ప్రాంత ప్రజల, నిరుద్యోగుల ఆకాంక్షలను విరుద్ధంగా జిల్లాను జోగులాంబ జోన్లో కలిపి అన్యాయం చేశారన్నారు. ఈ ప్రాంతం కంది సాగుకు ప్రసిద్ధి పొందిందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న కంది బోర్డు ఏర్పాటు కలను తీరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ టౌన్ మంజూరుచేయగా, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శాటిలైట్ టౌన్‌కు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. తాండూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. స్టోన్ పరిశ్రమ కారణంగా వెలువడుతున్న కాలుష్య నియత్రంణకు చర్చలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రులను కూడా అప్‌గ్రేడ్ చేసి, ఈఎస్ఐ దవాఖానా సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాత తాండూరులో ఫ్లైఓవర్ లేదా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పారు. నాపరాతి పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి వ్యాపారాన్ని దివాలాతీసే విధంగా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. జిల్లాలోని కోట్‌పల్లి, శివసాగర్, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని వివరించా దొరల పాలన అంతం కావాలి రాష్ట్రంలో దొరల పాలన అంతం కావాలంటే ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. మన భూములు, నీళ్లు, నిధులు మనకు దక్కాలన్నారు. చండీయాగాలు చేస్తే ప్రజలు అభివృద్ధి చెందరని, ప్రజారంజకమైన పాలన సాగించాలని తెలిపారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పాటనై వస్తున్నానమ్మో అంటూ గద్దర్ తాను రాసిన పాటలను ఆలపించి సభికులను ఉత్తేజపరిచారు. ఆయన పాట పాడుతున్న సమయంలో రాహుల్‌గాంధీ ఆసక్తిగా గమనించడం విశేషం. కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి కమీషన్లు.. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పైసలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, కమీషన్లు మాత్రం కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వెళ్తున్నాయని టీజేఎస్ అధినేత, ఫ్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏ ఒక్కడివల్లనో తెలంగాణ రాష్ట్రం రాలేదని, ఎంతోమంది త్యాగాలు, బలిదానాల కారణంగానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగావకాశాల కోసం నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. -
‘చే’జారిన దుబ్బాక.!
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకులతోపాటు ఆయా పార్టీల కార్యకర్తల్లో కూడా ఆందోళన మొదలైంది. జిల్లాలో మొదటి నుండి రాజకీయ తలనొప్పులకు వేదికగా మారిన హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లో పరిస్థితి కూట మి పార్టీలను కలవరానికి గురి చేస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి ఎవరితో సంబంధం లేకుండా ప్రచారం చేస్తుండగా.. దుబ్బాకలో మాత్రం రోజుకో తీరుగా పరిణామాలు మారడం కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. సాక్షి, సిద్దిపేట: పొత్తులో భాగంగా దుబ్బాక స్థానాన్ని తెలంగాణ జనసమితి పార్టీకి కేటాయించారు. చివరి నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య మద్దుల నాగేశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పటి వరకు ప్రచార ఆర్భాటం లేకపోవడంతో నియోజకవర్గంలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. మరోవైపు నాగేశ్వర్‌రెడ్డికి ఇచ్చిన బీ ఫారం రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన ఉత్తరం సరైన సమయానికి ఎన్నికల అధికారికి చేరకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఇంతకాలం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేసిన ముత్యం రెడ్డి టికెట్ రాకపోవడంతో గులాబీ కండువా కప్పుకొని.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కేడర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎన్నికల ముందు మద్దుల హడావుడి నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ బీఫారం తెచ్చుకున్న ఎంజేబీ(మద్దుల జానా భాయ్) ట్రస్ట్ అధినేత నాగేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న నాగేశ్వర్‌రెడ్డి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీ నుండి బయటకొచ్చారు. ట్రస్ట్ కార్యక్రమాలతోపాటు, ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అనుచరవర్గాన్ని పెంచుకున్నారు. కేడర్‌లో ఉత్సాహం నింపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటి వరకు దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ముత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావన్ కుమార్‌రెడ్డిలతోపాటు మద్దుల నాగేశ్వర్‌రెడ్డి రాకతో పార్టీలో టికెట్ పోరు త్రిముఖంగా మారింది. ఈ త్రిముఖ పోటీలో ఎవరికివారే తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలోనే కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీలు ప్రజా కూటమిగా ఏర్పడటంతో టికెట్ పోటీ రసవత్తరంగా మారింది. పొత్తులో భాగంగా సిద్దిపేటతోపాటు, దుబ్బాక సీటు టీజేఎస్‌కు అప్పగించారు. ఈలోపే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ముత్యం రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చివరి నిమిషం వరకు బీ ఫారం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ముత్యం రెడ్డి మనోవేదనకు గురై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే అప్పటికే కూటమి అభ్యర్థిగా చిన్నం రాజ్‌కుమార్ టీజేఎస్ బీ ఫారంతో నామినేషన్ వేయగా.. సినీ ఫక్కీలో చివరి నిమిషంలో నాగేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ బీఫారంతో నామినేషన్ వేశారు. ఇలా బీఫారం అయితే తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి.. ప్రచారం చేయడంలో మాత్రం అలసత్వంగా ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బీ ఫారం రద్దుకు ఉత్తమ్ ఉత్తరం పొత్తులు, టికెట్ల పంపిణీకి ఎవరికి వారుగా> నామినేషన్లు వేశారు. నామినేషన్ స్వీకరణ చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పార్టీ బీ ఫారంతో నామినేషన్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాగే జరిగింది. దీంతో మళ్లీ సమావేశమైన కూటమి పెద్దలు కొన్నిచోట్ల టీజేఎస్ వారిని, మరికొన్ని కోట్ల కాంగ్రెస్ వారిని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నాగేశ్వర్‌రెడ్డికి అందజేసిన బీ ఫారం రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశారు. ఈ నేపథ్యంలో తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉండగా.. మద్దుల మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో దుబ్బాకలో కూటమి అభ్యర్థిగా రాజ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా నాగేశ్వర్‌రెడ్డి ఇద్దరూ బరిలో మిగిలారు. కూటమిలో ఒప్పందం ప్రకారం నాకే టికెట్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నాకే మద్దతు పలుకుతున్నారని రాజ్‌కుమార్ ప్రచారం చేయడం గమనార్హం. ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాసిన ఉత్తరం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గందరగోళంలో కాంగ్రెస్ కార్యకర్తలు గడిచిన మూడు వారాలుగా దుబ్బాలో చోటుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న ముత్యం రెడ్డి.. టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది కారెక్కారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించినా ప్రచారం చేయడం లేదు. దానికితోడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మద్దుల అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు లేఖ రాశారు. ఇంతలో పొత్తులో భాగంగా దుబ్బాక స్థానాన్ని పార్టీకి సంబంధం లేని కొత్త వ్యక్తి అయిన చిందం రాజ్‌కుమార్‌కు కేటాయించడంతో కార్యకర్తలు అసహనంతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. కొందరు మాత్రం తప్పదన్నుట్టుగా మొక్కుబడి ప్రచారంతో నెట్టుకొస్తున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కలలు కన్న కార్యకర్తల ఆశలు నీరుగారిపోయాయి. మనసు చంపుకుని కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించలేక, మద్దుల కోసం ఎదురు చూడలేక సతమతం అవుతున్నారు. -
తమ్ముడికే మద్దతు
పాపన్నపేట(మెదక్): ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న పట్లోళ్ల సోదరులు ఒక్కటయ్యారు. మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి విఫలుడైన శశిధర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన సోదరుడైన ఉపేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీఫాం వచ్చింది. ఆపై అన్నను పోటీ నుంచి విరమించుకోవాలంటూ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ సమయం గడిచి పోయింది. దీంతో అన్నదమ్ముల మధ్య పోటీ అనివార్యమైంది. బంధుత్వ ప్రయత్నాలతో పని కాక పోవడంతో ఇక బంతి కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోకెళ్లింది. దీంతో శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నుంచి శశిధర్‌కు పిలుపు రావడం.. ఆయన అదే రాత్రి హుజూర్నగర్ వెళ్లి పీసీసీ అధ్యక్షుడిని కలిశాడు. ఆయన ఇచ్చన హామీ మేరకు ఇంటికి వచ్చిన శశిధర్‌రెడ్డి ఆదివారం యూసుఫ్‌పేటలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తాను కాంగ్రెస్‌కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో నాటకీయం పరిణామాలకు తెర పడింది. దీంతో మెదక్ నియోజకవ వర్గంలోలో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మెతుకుసీమ నియోజకవర్గ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ గెలుపుకు కృషి.. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలోని తన స్వగృహంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డితో కలసి మాట్లాడారు. తాను కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించాన్నారు. ఈ క్రమంలో తొక్కని గడపలేదు.. మొక్కని దేవుడు లేడని చెప్పారు. అయినా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా టికెట్ రాలేదని ఆయన వాపోయారు. తన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. అనంతరం తన తమ్ముడైన ఉపేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిసిందన్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ మేరకు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఉపేందర్‌రెడ్డి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని చెప్పారు. కార్యకర్తల సమక్షంలో విషయం చెప్పి తాను ఈ క్షణం నుంచి ఉపేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసి గెలిపిస్తాన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, తన అభిమానులు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు అనేక నాటకీయ పరిమాణాల మ«ధ్య కాంగ్రెస్ బీఫాం లభించందన్నారు. అనేక ఆటంకాలను అధిగమించి తన డ్రైవర్ బాల్‌రెడ్డి 42 కిలోమీటర్ల దూరాన్ని 18 నిమిషాల్లో చేరి సకాలంలో బీఫాం అందజేశాడని గుర్తు చేశారు. తన అన్న ఆశీర్వాదాలు, కాంగ్రెస్ కార్యకర్తల అభిమానంతో ఎన్నికల్లో విజయం సాధిస్తానన్నారు. ఈ క్షణం నుంచే శశిధర్‌రెడ్డి తన తరఫున ప్రచార బాధ్యతలు స్వీకరించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. శశిధర్‌రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా టికెట్ వస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను అన్న అడుగు జాడల్లో నడుస్తానని చెప్తూ.. శశిధర్‌రెడ్డికి పాదాభివందనం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్లు గోపాల్‌రెడ్డి, నర్సింలుగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృత్‌రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంతప్ప, మెదక్ మాజీ ఎంపీపీ పద్మాదరావు, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు, చిన్నశంకరంపేట మాజీ జెడ్పీటీసీ రమణ, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్నకు నో.. తమ్ముడికి ఓకే
సాక్షి, మెదక్: కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ఎవ్వరికీ అంతుపట్టవు. దీనికి మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికే నిదర్శనం. మెదక్ టికెట్ కేటాయింపు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సొంత పార్టీ నాయకులనే కాదు మహాకూటమిలోని భాగస్వామి టీజేఎస్‌ను కూడా నెవ్వరపోయేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిని కాదని నామినేషన్ చివరిరోజున అనూహ్యంగా ఆయన సోదరుడు ఉపేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ఈ విషయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపేందర్‌రెడ్డి నామినేషన్ సమయం ముగుస్తుందనగా చివరిని మిషంలో కాంగ్రెస్ బీఫామ్‌తో నామినేషన్ వేశారు. దీంతో మెదక్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి చేరిపోయాడు. స్నేహపూర్వక పోటీలో భాగంగా మెదక్ టికెట్‌ను ఉపేందర్‌రెడ్డికి ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ఉపేందర్‌రెడ్డిని పోటీకి దించినట్లు సమాచారం. మరోవైపు మహాకూటమిలో భాగస్వాములైన తెలంగాణ జనసమితి నేతలకు కాంగ్రెస్ నిర్ణయం ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఆ పార్టీ తీరుపై టీజేఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దించే విషయమై కాంగ్రెస్ పార్టీలో సోమవారం ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. పొత్తులో టీజేఎస్‌కు టికెట్ దక్కటంతో ఆశావహులంతా స్నేహపూర్వక పోటీకి కోసం మాజీ ఎంపీ విజయశాంతి ద్వారా వత్తిడి తీసుకువచ్చారు. దీనికి అంగీకరించిన అధిష్టానం ఉదయం ఎమ్మెల్యే టికెట్ ఆశావహులను హైదరాబాద్ రప్పించుకుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నివాసంలో మెదక్ నేతలతో సమావేశమయ్యారు. మెదక్ టికెట్‌ను పటాన్‌చెరుకు చెందిన గాలి అనిల్‌కుమార్‌కు ఇస్తున్నట్లు మొదట ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలియజేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఆశావహులు అసంతప్తి వ్యక్తం చేయడంతోపాటు స్థానిక నేతకు బీఫామ్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనూహ్యంగా ఉపేందర్‌రెడ్డి పేరు తెరపైకి తీసుకురావటంతో చర్చల్లో పాల్గొన్న నేతలు అంగీకరించినట్లు సమాచారం. ఎన్సీపీ నుంచి శశిధర్‌రెడ్డి.. శశిధర్‌రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. మెదక్ టికెట్ రేసులో ఉపేందర్‌రెడ్డి పేరు ఎక్కడ కూడా వినిపించలేదు. అయితే అనూహ్యంగా ఆయనకు టికెట్ దక్కటంపై శశిధర్‌రెడ్డి వర్గంతోపాటు కాంగ్రెస్ నాయకుల్లో అశ్చర్యం వ్యక్తం అవుతోంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, ఏఐసీసీ పెద్దల ద్వారా టికెట్ కోసం ప్రయత్నించటం వల్లనే ఉపేందర్‌రెడ్డి టికెట్ దక్కిందని తెలుస్తోంది. దీనికితోడు ఉపేందర్‌రెడ్డి కుటుంబానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య సమీప బంధుత్వం ఉందని సమాచారం. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. శశిధర్‌రెడ్డి మాత్రం ఎన్సీపీ తరఫున, సోదరుడు కాంగ్రెస్ తరఫున బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే శశిధర్‌రెడ్డిని ఉపసంహరించుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. చివరి వరకు ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి బీఫామ్ సమర్పించే వరకు ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ టికెట్ ఉపేందర్‌రెడ్డికి ఇస్తున్నట్లు మధ్యాహ్నం 12 గంటలకు తెలిసింది. దీంతో ఆయన మెదక్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని 1గంట తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ బీఫామ్ హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంది. ఉపేందర్‌రెడ్డి సన్నిహితుడు గోపాల్ అనే వ్యక్తి బీఫామ్ హైదరాబాద్ నుంచి తీసుకువచ్చాడు. నామినేషన్ సమయం ముగుస్తుందనగా కొద్ది నిమిషాల ముందుకు బీఫామ్ ఉపేందర్‌రెడ్డికి చేతికి వచ్చింది. దీంతో ఆయన హడావుడిగా మరో నామినేషన్ వేశారు. అయితే బీఫామ్ చేతికి వచ్చేంత వరకు ఉపేందర్‌రెడ్డి ఆయన మద్దతుదారుల్లో టెన్షన్ కనిపించింది. -
మళ్లీ వస్తే ఎవరినీ బతకనివ్వరు
సాక్షి, హైదరాబాద్: నలుగురు సభ్యులున్న కుటుం బం 4 కోట్ల తెలంగాణ ప్రజలను హింసిస్తోందని, ఆ నలుగురి కబంధ హస్తాల్లో పడి ప్రజలు విలవిల్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే లక్ష్యం తో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ‘వీ టూ’కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. అత్యంత అవినీతి, నియంతృత్వ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ ముదనష్టపు ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, లేకపోతే ఎవరినీ బతకనివ్వరన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే డబ్బు, మద్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. విద్యాసంస్థలపై కుట్రలా..? ప్రైవేటు సంస్థలు భయపడొద్దని, విద్యాసంస్థలను బెదిరిస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. సేవ చేయాలని ముందుకొచ్చిన విద్యా సంస్థలకు మేలు చేయకపోగా, మూసివేసేలా అణచివేత చర్య లు చేపట్టారన్నారు. విద్యా సంస్థలు పౌల్ట్రీ షెడ్డుల్లో నడుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా నిరాధార ఆరోపణలతో సీఎం కేసీఆర్ అవమానించారని గుర్తు చేశారు. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా విద్యా సంస్థలను మూసేసేలా చేశారని మండిపడ్డారు. ఆంక్షలు లేకుండా ఫీజులు డిసెంబర్ 12న మహాకూటమి ప్రమాణ స్వీకారం చేస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంక్షలు లేకుండా 100% ఫీజు ఇస్తామన్నారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లోని 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందికి రూ.5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. సిబ్బందికి వసతిగృహం కోసం హౌజింగ్ స్కీంను ప్రవేశ పెడతామన్నారు. ఎలక్ట్రిసిటీ చార్జీలను కమర్షియల్ నుంచి డొమెస్టిక్‌కు తగ్గిస్తామని చెప్పారు. మున్సిపల్, ఆస్తి పన్నులను కమర్షియల్ నుంచి రెసిడెన్స్ కేటగిరీకి మార్చుతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని, అంతా సీఎం కనుసన్నల్లోనే ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకోసారి సమావేశం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు ఉండబోవని చెప్పారు. 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ఉద్ఘాటించారు. ఫీజు, మెస్ చార్జీలను పెంచి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫీజు రూ.1,700 అంటే అది విద్యా వ్యవస్థను అవమానపరచడమేనన్నారు. అందరూ మరో 45 రోజులు కష్టబడి పనిచేస్తే నియంత పాలన అంతమవుతుందన్నారు. రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ కేసీఆర్‌లోనే స్వపరిపాలన అంటే కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయని విమర్శించారు. ఆయన వల్ల నాలుగేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. కేసీఆర్ తెలంగాణకు చీడ పురుగులా తయారయ్యారని మండిపడ్డారు. అందుకే ఆయనను గద్దె దింపేందుకు మహాకూటమి ఏర్పాటైందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో టీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. అలాంటి పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని కోరారు. తెలంగాణ ప్రజలు చదువుకుంటే ఓట్లు వేయరని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందుకే ఫీజులపై ఆంక్షలు పెట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తమ పిల్లలను చదివించుకోవాలని తల్లిదండ్రులు అనుకుం టే.. కేసీఆర్ మాత్రం పిల్లలు బర్లకాడికి, గొర్లకాడికి, పందుల కాడికి, చేపల కాడికి పోవాలన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి పాలన మళ్లీ రాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రభుత్వ విధానాల వల్ల కనుమరుగయ్యాయని జేఏసీ చైర్మన్ జి.రమణారెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే టీఆర్ఎస్ను ఓడించేందుకు, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మహా కూటమిని గెలిపించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ గౌరి సతీశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ పథకాల స్ఫూర్తితో..
కోదాడ: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశారని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో రైతురాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. నాడు రుణమాఫీ ఒకేసారి చేసి చూపిన ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌దేనని గుర్తుచేసుకున్నారు. అందరూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాధ్యం కాదని చెప్పినా వైఎస్ మాత్రం ఉచిత విద్యుత్ ఇచ్చారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ ఒకేసారి చేసి చూపుతామన్నారు. మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, దానిని అధిగమించేందుకు రూ.5 వేల కోట్లతో నిధిని ఏర్పా టు చేసి మద్దతు ధరపై రైతులకు బోనస్ ఇస్తామన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో చేరుస్తా మని తెలిపారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో రైతుల కు పంటల బీమా సరిగా అమలు కాలేదనన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో ప్రీమియం వసూలు చేసుకుంటున్నాయని, కానీ పంట నష్టం జరిగినప్పుడు మాత్రం ఆదుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతురాజ్యం ట్రస్ట్ అధ్యక్షుడు కళ్లెం ఉపేందర్‌రెడ్డి, జిల్లా అద్యక్షుడు హసన్‌బాద్ రాజేశ్, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి, మాజీ ఎంపీ బలరాం నాయక్, డీఎల్ఎఫ్ అభ్యర్థి బుర్రి శ్రీరాములు, బండ్ల గణేశ్, టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పందిరి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాళ్ల చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం
ఢిల్లీ: గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, పృద్వీరాజ్ సహా సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ఇలాంటి బలమైన నాయకుల చేరికతో పార్టీ క్రమక్రమంగా మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. 2019లో గెలిచే దిశగా కాంగ్రెస్ పయనం చేస్తోందన్నారు. ప్రతాప్ రెడ్డిని అధికార టీఆర్ఎస్ పార్టీ జైలులో పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ..కేసీఆర్‌కు పరిపాలనా అనుభవం లేదని తెలిపారు. ఏడాది నుంచి సెక్రటేరియట్‌కు రాని వ్యక్తి పాలన ఏం చేస్తాడని ప్రశ్నించారు. హామీల అమలులో పూర్తిగా విఫలమైన కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. -
కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం
మేళ్లచెరువు : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకో బోమని తిరిగి వడ్డీతో సహా వసూలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన సోమవారం రాత్రి మండలంలోని వేపల మాధవరం గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ నాయకులను ఇబ్బందులు పెడితే సహించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కిష్టపట్టి ప్రాంతంలో ఏ పార్టీ నాయకులు చేయని అభివృద్ధిని తాను చేయించానన్నారు. మండలంలో రోడ్లు, కష్ణానది నుంచి సాగునీరు వంటవి అభివృద్ధి చేశానని రాబోయే ఎన్నికల్లో తనను రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు గ్రామంలో అయనకు బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాణోతు సైదమ్మ, మాజీ సర్పంచ్ బోగాల మోహన్‌రెడ్డి, బాలరాజు, వెంకయ్య, శ్రీనివాసరెడ్డి, కర్నె ప్రతాపరెడ్డి, అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు సముచిత స్థానం
సాక్షి వనపర్తి: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభించిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన మహిళా గర్జన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో స్థానం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అన్ని రకాలుగా అణచివేతకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోగా, చెల్లించిన వడ్డీ డబ్బులను తిరిగి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు, స్వయం ఉపాధి సంఘాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. 2019లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కు మహిళలంటే చిన్నచూపు: సుస్మితాదేవ్ కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు సముచిత గౌరవం లభిస్తుందని ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ అన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మహిళలు అంటే చిన్నచూపు ఉందని.. కేసీఆర్ కుమార్తె కవిత రూ.30 వేల చీర కట్టుకుని తిరుగుతుంటే.. రాష్ట్రంలోని మహిళలకు రూ.30 చీర కట్టబెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని మహిళ పేరిటే ఇచ్చామని గుర్తు చేశారు. సభలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డీ.కే అరుణ, సంపత్ కుమార్, గీతారెడ్డి, పార్టీ నేతలు మల్లు రవి, మధుయాష్కీ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. ఇదీ మహిళా డిక్లరేషన్ - రివాల్వింగ్ ఫండ్ క్రింద ప్రతీ సంఘానికి లక్ష తగ్గకుండా.. నగదును గ్రాంట్ రూపంలో ఇస్తాం. - ఇవి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. - అభయహస్తం పథకానికి పూర్వ వైభవం తెచ్చి పింఛన్‌ను రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచుతాం - 1.10 లక్షల మందికి ఈ పథకాన్ని విస్తరించి ఇన్సూరెన్స్‌ను వర్తింపజేస్తాం. - సహజ మరణానికి రూ.30 వేల నుంచి రూ.2.50 లక్షలకు, ప్రమాద మరణమైతే రూ.5 లక్షలు. - వడ్డీ లేని రుణం బకాయిలు చెల్లించడంతో పాటు సంఘాల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతాం. - గ్రామైక్య సంఘాలకు రూ.15 లక్షలతో, మండల సమాఖ్యలకు రూ.30 లక్షలతో భవనాలు నిర్మిస్తాం - మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం - సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం తో పాటు విలేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతాం. -
ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమే : ఉత్తమ్
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ జరగదనేది తమ అభిప్రాయమని, డీలిమిటేషన్ పై వాళ్లేం చేసినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సమయం, ఇతర పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదనుకుంటున్నామని వివరించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నం సహజమన్నారు. కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తుందని, దానిపై ఏదైనా క్లారిటీ వస్తే చెబుతామన్నారు. 102 సీట్లు గెలుస్తామని చెప్పడం, మా శ్రేణులను బలహీన పరిచే ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. మహాభారతంలో ఎక్కువ అస్త్రాలు, జనం కౌరవుల వద్దే ఉన్నాయని, అయినా పాండవులే గెలిచారని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయం మావైపే ఉందని మేం విశ్వసిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లోనే రెండు పంటలు వేస్తున్నారని తెలిపారు. ఇందులో 62 శాతం రైతులు 2.5 ఎకరాలలోపే భూమి కలిగి ఉన్నారని, మెజారిటీ రైతులకు రూ. 2 వేల నుంచి మూడు వేలలోపే పెట్టుబడి సాయం అందుతుందన్నారు. అదే గిట్టుబాటు ధర, బోనస్ కల్పిస్తే రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు క్వింటాలుకు రూ. వంద తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం చెల్లుకు చెల్లవుతుందని తెలిపారు. -
అధికారంలోకి రాగానే 3వేల నిరుద్యోగ భృతి
సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందజేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ముఖ్యమంత్రి తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు కల్పించారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులకు రుణమాఫీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వరికి మద్దతు ధర రూ.2 వేలు, అలాగే పత్తి, మిర్చి పంటలకు సరైన మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే 2019 ఎన్నికల్లో హుజూర్ నగర్, కోదాడలో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీ గెలుపొందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. -
వారసత్వ ఉద్యోగాల్లో కుట్ర
సింగరేణి కార్మికులకు సర్కారు మోసం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికు లను కూడా మోసగించారని, సింగరేణి వార సత్వ ఉద్యోగాల విషయంలో ఆయన చేసిన మోసం అందరికీ అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫి కేషన్ రానున్న నేపథ్యంలో శుక్రవారం గాంధీ భవన్లో టీపీసీసీ సింగరేణి సబ్‌కమిటీ సమా వేశం జరిగింది. సబ్‌కమిటీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ కుట్ర చేసిందని విమర్శించారు. గుర్తింపు ఎన్నికలు వస్తున్న సమయంలో వారసత్వ ఉద్యోగాల జీవో ఇచ్చారని, అయితే దానిపై తెలంగాణ జాగృతి వాళ్లతోనే కోర్టులో కేసు వేయించారని ఆరోపించారు. కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని మోసం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై 55 వేల మంది కార్మికులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించడం ద్వారా కేసీఆర్ కు బుద్ధిచెప్పాలన్నారు. గండ్ర వెంకటరమణా రెడ్డి, మరో నేత జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సింగరేణిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర చేపడతామన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొన్నారు. -
ఆయన అబద్ధాలు శృతిమించుతున్నాయి..
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు శృతి మించుతున్నాయని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ..పులిచింతలపై ఉత్తమ్ మాట్లాడుతున్నవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. ఉత్తమ్ చెప్పిన దాంట్లో పులిచింతల హుజుర్ నగర్లో ఉందనేది మాత్రమే నిజమన్నారు. 2006లో పులిచింతల హైడల్ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు వచ్చినా కాంగ్రెస్ హాయంలో తట్టెడు మన్ను కూడా తీయలేదన్నారు. అపుడు ఆంధ్రా సీఎంలకు భయపడి ఉత్తమ్ లాంటి వారు పులిచింతలపై మాట్లాడలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే 2015లో పులిచింతల హైడల్ ప్రాజెక్టు డీపీఆర్ 563 కోట్ల రూపాయలతో రూపొందిందని తెలిపారు. కేసీఆర్ చొరవతోనే విద్యుత్ ప్రాజెక్టులు వేగిరంగా పూర్తవుతున్నాయని చెప్పారు. భూపాలపల్లి , కడప థర్మల్ ప్లాంట్లు ఒకేసారి మొదలయ్యాయి..భూపాలపల్లి పూర్తయితే కడప ప్లాంటు ఎందుకు పూర్తి కాలేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలని కోరారు. ప్రాజెక్టులను ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ ఆరు వేల మెగావాట్ల కరెంటు యిస్తే గత మూడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 12 వేల మెగావాట్ల కరెంటు ఇచ్చిందని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రం లో విద్యుత్ ఉత్పాదనను 28 వేల మెగావాట్లకు పెంచుతామన్నారు.మేము విద్యుత్ పై చెప్పిన గణాంకాలు తప్పుంటే ఉత్తమ్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విద్యుత్ పై కాంగ్రెస్ నేతలు అబద్దాలు ఆడటం మానుకోవాలని సూచించారు. -
రాష్ట్ర బడ్జెట్‌తో ఉత్తమ్ మైండ్ బ్లాక్: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె .లక్ష్మా రెడ్డి ఖండించారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదన్న ఉత్తమ్ ఆరోపణలు అర్థరహితమన్నారు. ఏ ఆస్పత్రి కైనా వెళ్దాం.. హెల్త్ కార్డు పనిచేస్తే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. శుద్ధ అబద్దాలతో ఉత్తమ్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత మూడు నెలల్లో 4,100 మందికి హెల్త్ కార్డుల ద్వారా వైద్యం అందిందని తెలిపారు. ఈ విషయంలోనే ఇన్ని అబద్దాలు మాట్లాడుతున్న ఉత్తమ్ గవర్నర్ ప్రసంగం అబద్ధమంటూ సీఎంను రాజీనామా కోరడం హాస్యాస్పదమని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం దక్కిందన్నారు. ఈ బడ్జెట్ తో ఉత్తమ్ మైండ్ బ్లాంక్ అయిందని వ్యాఖ్యానించారు. -
నాలా వ్యవస్థ సరిగ్గా లేక ముంపు
అల్వాల్: వరద సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అల్వాల్‌లో శనివారం మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి నందికంటి శ్రీధర్‌తో కలిసి ముంపు బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చామన్నారు. అల్వాల్‌లో ఉన్న చెరువులకు అనుగుణంగా నాలా వ్యవస్థ లేకపోవడం వల్లే ముంపు సమస్య నెలకొందని ఇందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ముంపునకు గురైన వారందరికీ అవసరమగు సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు. భూదేవినగర్ గుడిసెవాసులతో మాట్లాడి అన్నదానంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్, నాయకులు సాయిజెన్ శేఖర్, డోలి రమేష్, గీతారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ్‌ను చిత్తుగా ఓడించండి
గరిడేపల్లి, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం గరిడేపల్లి మండలం ఎల్బీనగర్, కోదండరాంపురం, మర్రికుంట, గడ్డిపల్లి, కుతుబ్షాపురం, వెలిదండ, తాళ్లమొల్కాపురం, గరిడేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఐదేళ్లలో నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ్ పాలనలో పేకాట క్లబ్‌లు, కోడి పందేలు, బెల్లం షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాయని ఆరోపించారు. ఆయన చెప్పుకుంటున్న వేల కోట్ల అభివృద్ధి కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితమన్నారు. 610 జీఓ అమలు కమిటీ చైర్మన్‌గా తెలంగాణ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను పరామర్శించలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాను తెలంగాణ వాదినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు హుజూర్నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ముస్లింలకు వెన్నుపోటు పొడిచి కోదాడ స్థానాన్ని తన సతీమణికి ఇప్పించుకున్న చరిత్ర ఉత్తమ్‌దేనన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లను మూసివేయించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు పేదలందరికీ అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు శ్రీకాంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బొల్లగాని సైదులుగౌడ్, పెదపోలు సైదులుగౌడ్, కర్నాటి నాగిరెడ్డి, కొత్త రామకృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, బొమ్మనాగమ్మ, మట్టపల్లి సైదులు, కీత వెంకటేశ్వర్లు, ఆకుల శ్రీనివాస్, బట్టిపల్లి నాగయ్య, కీత అరవింద్, సురభీ అరవింద్ పాల్గొన్నారు.