
టీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఢిల్లీ: గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, పృద్వీరాజ్ సహా సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ఇలాంటి బలమైన నాయకుల చేరికతో పార్టీ క్రమక్రమంగా మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. 2019లో గెలిచే దిశగా కాంగ్రెస్ పయనం చేస్తోందన్నారు. ప్రతాప్ రెడ్డిని అధికార టీఆర్‌ఎస్ పార్టీ జైలులో పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు.
ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ..కేసీఆర్‌కు పరిపాలనా అనుభవం లేదని తెలిపారు. ఏడాది నుంచి సెక్రటేరియట్‌కు రాని వ్యక్తి పాలన ఏం చేస్తాడని ప్రశ్నించారు. హామీల అమలులో పూర్తిగా విఫలమైన కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment