madan mohan
-
దయాకర్‌కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి పార్టీ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి ఈ నోటీసుల్విలని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్‌లో సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సంఘం సభ్యులు కమలాకర్‌రావు, మాజీ మంత్రి వినోద్, గంగారాంలు పాల్గొన్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేసిన కె.మదన్మోహన్రావును పార్టీ లైన్ దాట వద్దని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. ఆయన పార్టీ పేరుతో కాకుండా మదన్ యూత్ ఫోర్స్ పేరుతో కార్యక్రమాలు చేయడం, పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండానే ఎల్లారెడ్డిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం వంటివి ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం ఆయనకు లేఖ పంపనుంది. కాగా, మదన్మోహన్ను సస్పెండ్ చేసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు ఆ అధికారం లేదని అభిప్రాయపడ్డ కమిటీ, డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర కమిటీకి తెలియ జేయాలని, అలా నేరుగా సస్పెండ్ చేయవద్దంటూ ఆయనకు కూడా లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్‌బై?) ఇక, దుబ్బాక నియో జకవర్గానికి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి సంబంధించిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అంశంపై సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కమిటీ సూచించింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తన పరిధి దాటి వరంగల్‌లో రాజకీయం చేస్తున్నారని.. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన క్రమశిక్షణ సంఘం, రాఘవరెడ్డి పాలకుర్తికే పరిమితం కావాలని సూచిస్తూ ఆయనకు లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్ ట్వీట్) -
గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
భువనేశ్వర్ : బాలాసోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత మదన్ మోహన్ దత్తా (61) కన్నుమూశారు. గుండెపోటుతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయ 9 :45గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కుమారుడు మనస్ దత్తా అధికారికంగా ధ్రువీకరించారు. మదన్ మోహన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతకుముందు ఆయన పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో తొలిసారిగా బాలాసోర్ సర్దార్ నియోజకవర్గం నుంచి పోటీచేసి 13,406 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మదన్ మోహన్ ఇకలేరన్న వార్త నన్ను షాక్‌కి గురిచేసింది ఆయన నాకు సోదరుడి లాంటి వారు అంటూ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్వీట్ చేశారు. మదన్ మోహన్ మృతిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీజేపీ అధికార ప్రతినిధి గోలక్ మోహపాత్రాతో సహా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. (‘అందుకే మమతకు ఆహ్వానం లేదు’ ) -
కాంగ్రెస్ తరపు నుంచి ఆ ఇద్దరే..
అందరూ అనుకున్నట్లుగానే ఆ ఇద్దరినే కాంగ్రెస్ అధిష్టానం మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అర్థరాత్రి వరకు మంతనాలు జరిపి విడుదల చేసిన ఎనిమిది మందితో కూడిన మొదటి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మెదక్ లోక్‌సభ స్థానానికి గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ నుంచి మదన్మోహన్రావు స్థానం దక్కించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు గాలి అనిల్‌కుమార్‌కు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మెదక్ లోక్‌సభ టికెట్ ఇస్తామని చెప్పినట్లుగానే ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ గ్రామానికి చెందిన గాలి అనిల్‌కుమార్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేశారు. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో పటాన్చెరు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని, లోక్‌సభ టికెట్ ఇస్తామని టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్ ఇతర కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. మెదక్ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ విజయశాంతి, గతంలో పోటీ చేసిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పోటీలో ఉంటారని భావించినా వారు సుముఖత చూపలేదు. చివరకు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి భార్య నిర్మలారెడ్డి, గాలి అనిల్‌కుమార్ మాత్రమే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గాలి అనిల్‌కుమార్‌కే టికెట్ ఇవ్వాలని విజయశాంతితోపాటు, ఇతర నాయకులు ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు జగ్గారెడ్డి కూడా అనిల్‌కు టికెట్ ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని అంగీకరించినట్లు సమాచారం. ఎట్టకేలకు జహీరాబాద్‌లో.. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్మోహన్రావును ప్రకటించారు. కామారెడ్డికి చెందిన ఆయన ప్రవాస భారతీ యుడు. ఎమ్మెస్సీ చదివి, విదేశాల్లో 17 ఏళ్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన మదన్మోహన్రావు అప్పటి నుంచి టీడీపీలో కీలక నాయకుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమీప బంధువైన ఈయన పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009లో జహీరాబాద్ లోక్‌సభ నుంచి టీడీపీని టికెట్ ఇవ్వమని కోరారు. అప్పుడు సయ్యద్ యూసూఫ్ అలీకి పొత్తులో భాగంగా సీటు కేటాయించారు. అనంతరం 2014లో జరిగి ఎన్నికల్లో పోటీ చేసిన మదన్మోహన్రావు 1,57,497 ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన ఈయన తిరిగి జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. నియోజకవర్గ పెద్దలతో సమావేశం టికెట్లు కేటాయించిన నేపథ్యంలో మెదక్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ అభ్యర్థి మదన్మోహన్రావు శనివారం నుంచే తమ కార్యకలాపాలను మొదలు పెట్టారు. ఈ ఇద్దరు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న శాసనసభా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఇంతకు ముందు పోటీ చేసిన వారు, సీనియర్ నాయకులకు ఫోన్‌చేసి తమకు సహకరించాలని కోరినట్లు సమాచారం. అదేవిధంగా టికెట్ వచ్చిందని తెలియగానే ఇరువురి కార్యాలయాల వద్దకు కార్యకర్తలు రావడంతో అంతా బిజీబిజీగా మారారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకొని సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నామినేషన్లు వేస్తామని, ఇందుకుగాను అందరిని సమీకరించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. -
వాళ్ల చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం
ఢిల్లీ: గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, పృద్వీరాజ్ సహా సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ఇలాంటి బలమైన నాయకుల చేరికతో పార్టీ క్రమక్రమంగా మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. 2019లో గెలిచే దిశగా కాంగ్రెస్ పయనం చేస్తోందన్నారు. ప్రతాప్ రెడ్డిని అధికార టీఆర్ఎస్ పార్టీ జైలులో పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ..కేసీఆర్‌కు పరిపాలనా అనుభవం లేదని తెలిపారు. ఏడాది నుంచి సెక్రటేరియట్‌కు రాని వ్యక్తి పాలన ఏం చేస్తాడని ప్రశ్నించారు. హామీల అమలులో పూర్తిగా విఫలమైన కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. -
బుల్లెట్ ఇంకా నా శరీరంలోనే ఉంది...
నేడు పోలీసు అమరవీరుల దినం మృతుల కుటుంబాలకు అందని సాయం పోలీస్.. ఈ మూడక్షరాల ఈ రక్షణ వ్యవస్థే లేకుంటే.. బయటికెళ్లాలన్నా భయపడాల్సిందే.. సభలు సమావేశాలు బందే. ప్రాణం పోసినవాళ్లు దేవుళ్లయితే ఆ ప్రాణాలు కాపాడేవారు పోలీసులు. ఐశ్వర్యం ప్రసాదించేవాళ్లు దేవుళ్లు.. వాటికి కాపాలాదారులు పోలీసులు. అందుకే పోలీసులకు సెల్యూట్. త్యాగనిరతికి, సేవకు మారుపేరైన పోలీసులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందనడంలో సందేహం లేదు. అలాంటి వారిని ప్రతీ సంవత్సరం ఓ రోజు స్మరించుకునే రోజు ఉంది. అదే అక్టోబర్ 21. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. ఇంట్లోనే మదన్మోహన్ కాల్చివేత మంచిర్యాల టౌన్ : మదన్మోహన్.. 1998లో తిర్యాణి ఎస్సై. ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఏవేదో విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా తూటాల వర్షం. గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తుల దాడి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మదన్మోహన్ కుప్పకూలిపోయాడు. ఆయనే తిర్యాణి ఎస్సై చేతి మదన్మోహన్. చంపింది అప్పటి పీపుల్స్‌వార్ న క్సలైట్లు. సరిగ్గా ఈ సంఘటన జరిగి ఇప్పటికి పదహారేళ్లు అవుతోంది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి, మదన్మోహన్ పెద్ద కూతురు మాధవి మాటల్లో ఆనాటి ఘటన వివరాలు.. బుల్లెట్ ఇంకా నా శరీరంలోనే ఉంది... మా నాన్నది కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్. ముగ్గురు అన్నదమ్ముల్లో ఆయనే పెద్ద. పోలీసు శాఖలో ఉద్యోగం చేయాలని తపనతో 1977లో కానిస్టేబుల్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్. జిల్లాలో అప్పుడు పీపుల్స్‌వార్(ఇప్పుడు మావోయిస్టు) కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. నక్సలైట్ల చర్యలను అదుపు చేయడంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడంతో నక్సలైట్లకు టార్గెట్‌గా మారారు. నక్సలైట్లు తన పద్ధతి మార్చుకోవాలంటూ వాల్‌పోస్టర్లు, లేఖల ద్వారా కూడా హెచ్చరించారు. అయినా విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నారు. 1988లో నక్సలైట్లను నిరోధించడంలో చూపిన తెగువకు గుర్తుగా ఎస్సైగా పదోన్నతి కల్పించారు. ఎస్సైగా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురవడంతో ఆరు నెలల పాటు సెలవు పెట్టారు. సెలవులు ముగియడంతో 1998 నవంబర్ 18న తిరిగి విధుల్లో చేరారు. అదే రోజు మంచిర్యాల ఏసీసీలోని సొంతింటికి వచ్చి అమ్మ రాధ, నాతో ఇంటి ముందు మాట్లాడుతున్నారు. చెల్లెళ్లు మనీలా, మమత ఇంట్లో ఉన్నారు. ఎప్పటి నుంచో ఆయన కదలికలపై నిఘా వేసిన నక్సలైట్లు ఐదుగురు సాయంత్రం 5 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఇంటికి వచ్చి ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఊహించని ఘటన. తేరుకునేలోపే నాన్న రక్తం మడుగులో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. నక్సలైట్లు ద్విచక్రవాహనాలపై పారిపోయారు. ఆ కాల్పుల్లో ఓ బుల్లెట్ అమ్మకు కూడా తగిలి తీవ్ర రక్తస్రావమైంది. మరో బుల్లెట్ నాకు తాకింది. ఇప్పటికి బుల్లెట్ నా శరీరంలో అలానే ఉంది. బయటకు తీస్తే ప్రాణాలకు హాని అని వైద్యులు చెప్పారు అందుకే తీయలేదు. ఆనాడు అమ్మ, చెల్లి మమతకు ఏమీ కాలేదని సంతోషించాం. కానీ రెండేళ్ల క్రితం జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమ్మ, చెల్లి ఇద్దరూ మృతి చెందారు. నేను అనారోగ్యంతో ఉండడంతో చెల్లెలు మనీలాకు నాన్న చనిపోయిన ఐదు రోజుల్లోనే పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత నాకు కోర్టులో జాబ్ వచ్చింది. ఏది ఏమైనా 1998 నవంబర్ 18 నా జీవితంలో అత్యంత భయానకమైన రోజు. - మాధవి, మదన్మోహన్, పెద్ద కూతురు, ప్రత్యక్ష సాక్షి మున్నాసింగ్ ప్రాణత్యాగం.. పట్టించుకోని ప్రభుత్వం నెన్నెల : అప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ ఇంటి పెద్ద దిక్కు మావోయిస్టుల దాడిలో కన్నుమూశాడు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుంటుంబంలో చీకటి అలుముకుంది. వారిని ఆదుకొని బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అందమైన ఆ ఉమ్మడి కుటుంబం చెల్లాచెదురైంది. ఉపాది కోసం పట్టణాలకు వలసబాట పట్టాల్సి వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్న, జీవోల్లో సవరణలు చోటు చేసుకున్న వారికి మాత్రం ప్రభుత్వం సాయం అందడం లేదు. ఇది... మావోయిస్టుల చేతిలో 2-11-1998లో మృతిచెందిన మండల కేంద్రానికి చెందిన మున్నాసింగ్ కుటుంబం దీనగాథ. నెన్నెలకు చెందిన మున్నాసింగ్(జగదీశ్వర్ సింగ్)ను మావోయిస్టులు 1998లో దారుణంగా హత్య చేశారు. ఆయన మృతితో ఆ కుంటుంబం దిక్కులేనిదైంది. మున్నాసింగ్ చిన్న కొడుకు అరుణ్‌సింగ్ తన తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉపాధి కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అధికారులను నాయకులను వేడుకున్నా ఫలితం దక్కడం లేదు. ఇతర నక్సల్స్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారని, తమకు మాత్రం అధికారులు ఉద్యోగం కానీ ఉపాధి కానీ చూపించలేదని మున్నాసింగ్ భార్య రాజేశ్వరీబాయి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ సాయానికి సాకులు తీవ్రవాద ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు వర్తించేలా ప్రభుత్వం జారీ చేసిన అనేక జీవోల్లో మున్నాసింగ్ కుంటుంబాన్ని ఏ ఒక్క జీవో ఆదుకోలేకపోతోంది. జీవో ఎంఎస్ నంబరు 619/79, 612/91, 536/96, 469/96, 173/97, 76/98, 504/08, 50/14లు ప్రభుత్వం విడుదల చేసింది. తీవ్రవాద బాధిత కుటుంబాలకు చేయుత ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. దీనికి ప్రతిపాదిక అంటూ లేదు. ఒక్కోసారి పరిహారం మాత్రమే ఇస్తుండగా, కొన్ని సందర్బాల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఉద్యోగం ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. 50/14 ప్రకారం 1996 సంవత్సరం కంటే ముందు తీవ్రవాద ఘటనల్లో మృతిచెందిన వారి కుటుంబానికి పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు. కానీ సకాలంలో దరఖాస్తు చేసుకోలేదనే సాకుతో మున్నాసింగ్ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందడం లేదు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమను ఇప్పటికైనా ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.