గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి | Balasore Bjp MLA Madan Mohan Dutta Passes Away | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

Published Wed, Jun 17 2020 11:54 AM | Last Updated on Wed, Jun 17 2020 1:00 PM

Balasore Bjp MLA Madan Mohan Dutta Passes Away - Sakshi

భువ‌నేశ్వ‌ర్ : బాలాసోర్  నియోజ‌క‌వ‌ర్గ  ఎమ్మెల్యే, బీజేపీ నేత మ‌ద‌న్ మోహ‌న్ ద‌త్తా (61) క‌న్నుమూశారు. గుండెపోటుతో భువ‌నేశ్వ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం ఉద‌య 9 :45గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే కుమారుడు మ‌న‌స్ ద‌త్తా అధికారికంగా ధ్రువీకరించారు. మ‌ద‌న్ మోహ‌న్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇంత‌కుముందు ఆయ‌న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన‌ట్లు స‌మాచారం.

2019 ఎన్నిక‌ల్లో తొలిసారిగా  బాలాసోర్ స‌ర్దార్ నియోజక‌వ‌ర్గం నుంచి పోటీచేసి 13,406 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. మ‌ద‌న్ మోహ‌న్ ఇక‌లేరన్న వార్త నన్ను షాక్‌కి గురిచేసింది ఆయ‌న నాకు సోద‌రుడి లాంటి వారు అంటూ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ ట్వీట్ చేశారు. మ‌ద‌న్ మోహ‌న్ మృతిపై ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్, బీజేపీ అధికార ప్ర‌తినిధి గోల‌క్ మోహ‌పాత్రాతో స‌హా ప‌లువురు నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు. (‘అందుకే మమతకు ఆహ్వానం లేదు’ )


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement