ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన తొలి ముస్లిం మహిళ..! | Sofia Firdous, Odisha's First-Ever Woman Muslim MLA | Sakshi
Sakshi News home page

ఒడిశా రాజకీయాల్లో సోఫియా సంచలనం.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌

Published Sat, Jun 8 2024 5:13 PM | Last Updated on Sat, Jun 8 2024 5:45 PM

Sofia Firdous, Odisha's First-Ever Woman Muslim MLA

ఒడిశా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ముస్లిం మైనారిటీకి చెందిన మహిళ ఎన్నికైంది. ఆమె పేరు సోఫియా ఫిర్దౌస్‌.. వయసు 32 ఏళ్లు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బారాబతి-కటక్‌ స్థానం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి బీజేపికి చెందిన పూర్ణ చంద్ర మహాపాత్రను ఎనిమిది వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతకీ ఈ సోఫియాకున్న ఆసక్తికర నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 

ఫిర్దౌస్‌ ఒడిశా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ మోకిమ్‌ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.

కెరీర్‌..

  • ఫిర్దౌస్‌ కళింగ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చూశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటిబవ్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను కూడా పూర్తి చేశారు.

  • 2023లో కాన్ఫెడరేషన్‌ ఆప్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసీయేషిన్‌ ఆఫ్‌ ఇండియా(సీఆర్‌ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్‌ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్‌ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్‌ జోన్‌ కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు.  

  • ఆ తర్వాత ఆమె ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)కి కో చైర్మన్‌గా కూడా చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్‌డబ్ల్యూఈసీ సభ్యురాలు కూడా. 

  • ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్‌ మెరాజ్‌ ఉల్‌ హక్‌ను వివాహం చేసుకున్నారు. 

  • రాజకీయాల్లో ఒడిషా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి, ఫిర్దౌస్‌కు ఆదర్శమట. విశేషం ఏంటంటే.. 1972లో బారాబతి-కటక్‌ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు. 

  • కాగా, ఈ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు గణనీయమైన రాజకీయ మార్పును చవిచూశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకోని విజయం సాధించింది. దీంతో 24  ఏళ్ల పాటు ఏకధాటిగా  పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ పాలనకు తెరపడింది. 

(చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement