రాష్ట్ర బడ్జెట్‌తో ఉత్తమ్ మైండ్ బ్లాక్: లక్ష్మారెడ్డి
రాష్ట్ర బడ్జెట్‌తో ఉత్తమ్ మైండ్ బ్లాక్: లక్ష్మారెడ్డి
Published Mon, Mar 13 2017 5:46 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె .లక్ష్మా రెడ్డి ఖండించారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదన్న ఉత్తమ్ ఆరోపణలు అర్థరహితమన్నారు. ఏ ఆస్పత్రి కైనా వెళ్దాం.. హెల్త్ కార్డు పనిచేస్తే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. శుద్ధ అబద్దాలతో ఉత్తమ్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
గత మూడు నెలల్లో 4,100 మందికి హెల్త్ కార్డుల ద్వారా వైద్యం అందిందని తెలిపారు. ఈ విషయంలోనే ఇన్ని అబద్దాలు మాట్లాడుతున్న ఉత్తమ్ గవర్నర్ ప్రసంగం అబద్ధమంటూ సీఎంను రాజీనామా కోరడం హాస్యాస్పదమని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం దక్కిందన్నారు. ఈ బడ్జెట్ తో ఉత్తమ్ మైండ్ బ్లాంక్ అయిందని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement