state budget
-
ప్రాజెక్టులు పరుగులు పెట్టేనా!
గ్లోబల్ సిటీ వైపు అడుగులు వేస్తూ.. ప్రగతి పథాన దూసుకెళుతోంది మన మహా నగరం. ఎలివేటెడ్ కారిడార్లు, ఫోర్త్‌సిటీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణాలు, మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో రెండో దశకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిధులు అవసరం. అలాగే మూసీకి పునరుజ్జీవం కల్పంచాలనే సంకల్పంతో ఉంది. నది సుందరీకరణకు నడుం బిగించింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని జలమండలి సైతం ఆశిస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ.5,500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమరి్పంచింది. ఇలా వివిధ విభాగాలు నిధుల కేటాయింపులపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. బుధవారం శాసన సభలో డిప్యూటీ సీఎం, విత్త మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో భాగ్యనగరానికి ఎంతమేరకు ప్రాధాన్యం దక్కుతుందో చూడాలి మరి. హైదరాబాద్ మహా నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాల మేరకు గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ప్రారంత్సవాలు పూర్తి చేసుకున్న ప్రాజెక్టులకు నిధుల కొరతే ప్రధాన సమస్యగా మారింది. నగరానికి ఉత్తరం వైపు రెండు ఎలివేటెడ్ కారిడార్లతో పాటు, ఫోర్త్‌సిటీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ టెండర్ నోటీసులను వెల్లడించింది. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో రెండో దశకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు సావరిన్ గ్యారెంటీ లభిస్తే ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో ఆయా ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు లభిస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎలివేటెడ్ కారిడార్లు.. ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు 5.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌కు బేగంపేట్ విమానాశ్రయం వద్ద 600 మీటర్ల సొరంగ మార్గానికి ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి లభించడంతో నిర్మాణ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణకయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,450 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వరకు 18.1 కిలో మీటర్ల రెండో ఎలివేటెడ్ కారిడార్‌కు సుమారు 197 ఎకరాల భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇందులో 113.48 ఎకరాలు రక్షణశాఖ నుంచి సేకరించాల్సి ఉంది. మరో 83.72 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాలి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,232 కోట్లు కానున్నట్లు అంచనా. ఈ మార్గంలో క్షేత్రస్థాయి సర్వేతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి. రక్షణశాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే నిర్మాణం చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉంది. కానీ.. నిధుల కొరతే ప్రధాన సమస్య. రతన్‌టాటా గ్రీర్ఫీల్డ్ రోడ్డు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ‘రతన్‌టాటా రోడ్డు’గా నామకరణం చేసింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ఔటర్‌రింగ్ రోడ్డులోని టాటా ఇంటర్చేంజ్ (రావిర్యాల) నుంచి ఆమన్‌గల్ రీజినల్ రింగ్ రోడ్డు వరకు 41.50 కిలోమీటర్ల రేడియల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రెండు దశలుగా నిర్మించనున్నారు. మొదటి దశలో రావిర్యాల నుంచి (టాటా ఇంటర్చేంజ్) నుంచి మీర్ఖాన్పేట్ వరకు 19.2 కిలో మీటర్లు పూర్తి చేస్తారు. ఇందుకోసం రూ.1,665 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. రెండోదశలో మీర్ఖాన్పేట్ నుంచి ట్రిపుల్ ఆర్ వద్ద అమన్‌గల్ వరకు రూ.2,365 కోట్లతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని 14 గ్రామాలకు ఈ రోడ్డుతో కనెక్టివిటీ సదుపాయం ఏర్పడనుంది. ఈ ప్రాజెక్టు కోసం హెచ్ఎండీఏ టెండర్లను కూడా ఆహ్వానించింది. మెట్రో రెండో దశ.. మెట్రోరెండో దశలో రెండు భాగాలుగా విస్తరణకు ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టులను రూపొందించింది. మొదటిభాగంగా 5 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి సుమారు రూ.24 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు మియాపూర్ నుంచి పటాన్చెరు. రాయదుర్గం నుంచి కోకాపేట్, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విస్తరించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణతో పాటు అటు హైకోర్టు వరకు మరో లైన్ చేపట్టాల్సి ఉంది. మొత్తం 76.4 కిలోమీటర్ల మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రస్తుతం కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తోంది. దీంతో పాటు రెండో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్లు చేపట్టనున్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్కిల్ వర్సిటీ వరకు ఈ కారిడార్ నిర్మాణం కోసం సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఫోర్త్‌సిటీతో పాటు నార్త్‌సిటీలో రెండు కారిడార్లకు సైతం డీపీఆర్‌లను రూపొందించేందుకు హెచ్ఏఎంఎల్ కసరత్తు చేపట్టింది. రెండో దశలో మొదట ప్రతిపాదించిన 5 కారిడార్లు కలిపి 76.4 కిలోమీటర్లు కాగా, ఫోర్త్‌సిటీతో రెండో దశ 116.4 కిలోమీటర్లకు పెరగనుంది. అలాగే నార్త్‌సిటీ రెండు కారిడార్లతో కలిపి మొత్తం రెండో దశ ప్రాజెక్టు 161.4 కిలోమీటర్లకు చేరనుంది. దీంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును చేపట్టాలనేది ప్రతిపాదన.మూసీ మెరిసేనా? మూసీ నదికి పునరుజ్జీ కల్పించాలన్న ముఖ్యమంత్రి కల బడ్జెట్ కేటాయింపులతో తీరనుంది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌పై మూసీ రిఫర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) కోటి ఆశలు పెట్టకుంది. తొలి దశలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కి.మీ., అలాగే హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 8.5 కి.మీ. రెండు వైపులా 21 కి.మీ. మేర మూసీ నదీ సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయా అభివృద్ధి పనులకు తాజా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూసీ శుద్ధి, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, సుందరీకరణ, బృహత్ ప్రణాళిక రూపకల్పనలపై ఎంఆర్డీసీఎల్ అధికారులు దృష్టి సారించారు. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి 5 టీఎంసీల నీటిని తరలించి, నదిని శుద్ధి చేయడంతో పాటు మూసీ చుట్టూ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. అలాగే మూసీపై 11 వారసత్వ వంతెనలను నిర్మించనున్నారు. నది బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు అమ్యూజ్మెంట్పార్క్, వాటర్ ఫాల్స్, చి్రల్డన్ వాటర్ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, సైకిల్ ట్రాక్‌లు, గ్రీన్ స్పేస్‌లు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలను అభివృద్ధి చేయనున్నారు.జలమండలికి ‘నిధుల’ వరద పారేనా! ఈసారి రాష్ట్ర బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని జలమండలి ఆశిస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ.5,500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచింది. గోదావరి రెండు, మూడో దశ పనులు, ఓటర్ రింగ్ రోడ్ తాగునీటి సరఫరా పథకం–3, ఎస్టీపీ, రుణాల చెల్లింపు, ఉచిత నీరు, విద్యుత్ రాయితీ కింద నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్లో దాదాపు రూ.5,650 కోట్లతో ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం రూ.3,385 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం పెరిగిన అవసరాల దృష్ట్యా రూ.4 వేల కోట్లకు పైగా నిధుల కేటాయింపులు ఉండవచ్చని జలమండలి ఆశలు పెట్టుకుంది. మహా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గోదావరి ఫేజ్–2, 3 నిర్మాణ పనుల మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా కింద అవసరమైన నిధుల కేటాయింపునకు ప్రతిపాదనలు సమర్పించింది. ఓటర్ రింగ్‌రోడ్ తాగునీటి సరఫరా పథకం–3, సుంకిశాల పనులు చేపట్టేందుకు నిధులు అవసరమని భావిస్తోంది. వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా కొత్త ఎస్టీపీ ప్రాజెక్టుల మిగిలిన పనుల కోసం, ఉచిత నీటి సరఫరా నిధుపై జల మండలి ఆశలు పెట్టుకుంది. -
ఉచితాలు.. శాపాలు!
ఎన్నికలవేళ అధికార, ప్రతిపక్షనేతలు ‘ఉచితాలు’పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటర్లు కూడా దీర్ఘకాలికంగా ఆర్థిక వెసులుబాటు కోసం ఆలోచించకుండా ఈ ‘ఉచితాలు’వైపే మొగ్గుతున్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి అప్పు చేయాల్సి వస్తోంది. పార్టీలకు అతీతంగా గతంలో కంటే మరింత మెరుగైన ‘ఉచిత’ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మ్యానిఫెస్టో తయారు చేయించుకుని ప్రచారాలకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటికోసం తిరిగి అప్పు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విభిన్న పార్టీలకు చెంది వివిధ రాష్ట్రాల్లో పాగా వేసిన కొన్ని ప్రభుత్వాల ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.హిమాచల్ప్రదేశ్హిమాచల్ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా అప్పు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. దీనికి రూ.95,000 కోట్ల అప్పు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలపాటు మంత్రులు తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. సరైన నిధులులేక ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం సవాలుగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మధ్యప్రదేశ్బీజేపీ గతేడాది రాష్ట్రంలో గెలుపొందడానికి ప్రధాన కారణం ‘లడ్లీ బెహనా’ పథకం అని ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఈ పథకం ప్రకారం వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండి 21-65 ఏళ్లు ఉన్న రాష్ట్ర మహిళలకు నెలకు రూ.1,000 నేరుగా తమ బ్యాంకులో జమ చేస్తారు. దీని అమలుకు ఈ ఏడాది రూ.18,984 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఒక్కనెలలోనే ఈ రాష్ట్రం రూ.10,000 కోట్లు అప్పు చేసింది. గతేడాది మొత్తంగా రూ.76,230 కోట్లు అప్పు పోగైంది. గడిచిన బడ్జెట్ సెషన్లో తెలిపిన వివరాల ప్రకారం మొత్తం రాష్ట్ర అప్పులు రూ.4.18 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యకలాపాల కోసం అదనంగా రూ.94,431 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ మోటార్ల కొనుగోలు కోసం రాయితీ రూపంలో రూ.4,775 కోట్లు చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడితే రూ.100 చెల్లించి బిల్లు మాఫీ చేసుకునే పథకానికి రూ.3,500 కోట్లు వెచ్చించాలి. రైతులు వాడే కరెంటు కోసం రూ.6,290 కోట్లు అవసరం అవుతాయి. బాలికల కోసం చేపట్టిన ‘లడ్లీ లక్ష్మీ’ పథకం కోసం రూ.1,231 కోట్లు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, లోన్ల వడ్డీ చెల్లింపు కోసం రూ.1,17,945 కోట్లు అవసరం. ఈ ఏడాది రాష్ట్ర ద్రవ్యలోటు 4.1 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.కర్ణాటకకర్ణాటకలో కాంగ్రెస్ గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చిలో బోస్టన్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకుని అదనంగా రూ.55 వేలకోట్లు-రూ.60 వేలకోట్లు ఎలా సమకూర్చుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికలవేళ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీల అమలు ప్రస్తుతం ఆర్థికభారంగా మారుతుంది. గతేడాది ఐదు గ్యారంటీలకు రూ.36 వేలకోట్లు కేటాయించారు. ఈసారి దీన్ని రూ.53,674 కోట్లకు పెంచారు. కేవలం ‘గృహలక్ష్మీ’ పథకానికి అందులో సగం కంటే ఎక్కువ అంటే రూ.28,608 కోట్లు కేటాయించారు. పథకాల అమలు, ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ఏడాది కర్ణాటక రూ.1,05,246 కోట్ల అప్పు చేయాల్సి ఉంటుంది.పంజాబ్ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్రంలోని రైతులు, గృహావసరాల కోసం రూ.17,110 కోట్లతో విద్యుత్‌ను అందిస్తోంది. మార్చి 2024 వరకు రాష్ట్ర అప్పులు మొత్తం రూ.3,51,130 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ డేటా తెలిపింది. రాష్ట్ర ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంది.ఇదీ చదవండి: ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఏటా అదనంగా రూ.20,378 కోట్లు అవసరం అవుతాయి. రైతు రుణమాఫీ కోసం రూ.15,470 కోట్లు కావాల్సి ఉంది. మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రూ.3,083 కోట్లు అవసరం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం రూ.1,825 కోట్లు కావాలి. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 హామీ ఇంకా అమల్లోకి రాలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల కోసం రూ.5 లక్షలు-రూ.6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. -
ఇది.. ప్రగతి, సంక్షేమాల బడ్జెట్!
‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు’’ అన్నారు అంబేడ్కర్ మహాశయుడు. అక్షరాలా ఈ మార్గంలోనే సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. ‘అభయ హస్తం’ కింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పు తెస్తు్తన్నాయి. వాటిని నెరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. రూ. 2,91,159 కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.‘‘వెన్నెలలు లేవు–పున్నమ కన్నె లేదుపైడి వన్నెల నెలవంక జాడలేదుచుక్కలే లేవు ఆకాశ శోక వీధిధూమధామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’’ – దాశరథి కృష్ణమాచార్యఅవును... దాశరథి స్థితికి దగ్గరగా... గత అరవై యేండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మాత్రమే కాదు, గత ప్రభుత్వ దశాబ్ద పాలనలో కూడా తెలంగాణ అదే నిస్తేజ పరిస్థితిని అనుభవించింది. సంక్షేమం మాటను ఆశ్రితులకు సమర్పయామి మంత్రం... రూల్స్ మాటున తమ రాజకీయ యవనికకు రూట్స్‌గా నిలబడ్డ బడా బాబులకు అప్పనంగా ప్రజల ఆస్తుల సంతర్పణ చేసింది బీఆర్ఎస్ సర్కారు. ఏ బడ్జెట్ చూసినా... కేటాయింపులు, ఆపై తటపటాయింపులతో తల్లడిల్లిపోయిన తెలంగాణ ప్రజానీకానికి నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు కావాల్సిన కేటాయింపులను ఈ బడ్జెట్లో చేశాం. అటు అసెంబ్లీలో గౌరవ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామాత్యులు భట్టి విక్రమార్క, ఇటు మండలిలో సోదరుడు, ఐటీ పరిశ్రమల శాఖా మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఒకవైపు సంక్షేమం, మరో వైపు పురోగామి నిర్ణయాలతో జనరంజక బడ్జెట్‌ను మిత్రులిద్దరూ ప్రవేశపెట్టారు.నిరుద్యోగులకు అభయం..దాదాపు లక్షన్నర ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ కోర్సులను పూర్తి చేసుకొని ఉద్యోగ సాధనలోకి దిగుతున్నారు. వీరికి స్కిల్స్ అందించే స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. దానివల్ల ప్రతీ యేటా నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ, ఉద్యమాలు చేసే స్థాయికి సమస్య పెరిగింది. అందుకే, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్‌తో కలిసి రూ. 2,324 కోట్లతో 65 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చుతున్నాం. యూనివర్సిటీల పునర్వై భవం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం. నిరుద్యోగ జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం. కృత్తిమ మేధలో నిపుణులను తయారు చేసేందుకు, హైదరాబాద్‌ను ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సెప్టెంబర్ 5, 6 తేదీలలో ‘మేకింగ్ ఏఐ ఫర్ ఎవ్రీవన్’ ప్రధానాంశంగా నిర్వహించ తలపెట్టిన సమావేశం తెలంగాణ యువతకు కొత్త భవి ష్యత్తుకు మార్గం చూపిస్తుందని విశ్వసిస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆయురారోగ్యాలకు శ్రీరామరక్షగా నిలిచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ఈ పథకం కింద ఉన్న 1,672 చికిత్సలలో 1,375 చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ ధరలను 20 శాతం పెంచడంతోపాటుగా 163 వ్యాధులను కొత్తగా ఈ పథకంలో చేర్చాం. ప్రతీ ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును తీసుకువస్తున్నాం. ఇవేకాదు, ఎస్సీ సంక్షేమానికి రూ. 33,124 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.17,056 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 9,200 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ. 3,003 కోట్లు కేటాయించాం.అభయహస్తం – పేదోళ్ల నేస్తం..రహదారులు అభివృద్ధికి జీవనాడులు అంటారు. అందుకే మా ప్రభుత్వం రహదారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టే రీజినల్ రింగు రోడ్డుకు ఈ బడ్జెట్లో రూ.1,525 కోట్లు కేటాయించాం. దాదాపు రూ. 26,502 కోట్ల ప్రాథమిక అంచనాతో నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు ఏర్పడి అనూహ్యమైన అభివృద్ధిని సాధించి తెలంగాణను దేశంలో నెంబర్ వన్‌గా మార్చు తాయి. రాష్ట్ర రహదారులు, భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 5,790 కోట్లు కేటాయించాం.అభయ హస్తం క్రింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పును తెస్తు్త న్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 68.60 కోట్ల మంది అక్కలు, చెల్లెండ్లు, తల్లులు తమ గమ్యాలకు చేరు కున్నారు. దీనికోసం రూ. 2,351 కోట్లను సోదరీమణులకు ఆదా చేశాం. అంతేకాదు 39,57,637 కుటుంబాల్లోని సోదరీమణులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. దీనికోసం ఇప్పటికే రూ. 200 కోట్లను కేటాయించాం. బడ్జెట్లో మరో రూ. 723 కోట్లను కేటాయించాం. గృహజ్యోతి పథకం ద్వారా అల్పాదాయ వర్గాల ఇళ్లలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పటికే ఈ పథకం కింద 45,81,676 ఇళ్లకు ఉచిత విద్యుత్ వెలుగులు అందించాం. దీని కోసం బడ్జెట్లో రూ. 583.05 కోట్లు కేటాయించాం. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. దీని కింద ప్రతీ నియోజక వర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మించాలని సంకల్పించాం.వెలుగుల తెలంగాణను నిర్మిస్తాం..ప్రతీకార రాజకీయాలకన్నా, ప్రగతి రాజకీయాలను విశ్వసిస్తాం. అందుకే, 2014 నాటికి ఉన్న రూ. 75,577 కోట్ల అప్పులను 2023 డిసెంబర్ నాటికి రూ. 6,71,757 కోట్ల రూపాయలకు చేర్చినప్పటికీ విశాల ఆలోచనలతో పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, దుబారాను తగ్గిస్తూ, క్రమశిక్షణతో కూడిన పాలనకు బాటలేస్తున్నాం. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి ఇప్పటికే రూ. 42,892 కోట్లు చెల్లించాం. సంక్షేమానికి రూ. 34,579 కోట్లు ఖర్చు చేశాం. అంబేడ్కర్ మహాశయుడు చెప్పినట్టు, ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. పునాది ఎంత బలంగా ఉంటే, ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది.’’ అక్షరాలా మేం ఈ మార్గాన్నే ఎంచు కున్నాం.‘అది చేసేంతవరకూ చూడటానికి ఎప్పుడూ అసాధ్యంగా కనిపి స్తుంది’ అని నెల్సన్ మండేలా చెప్పినట్టు, మేం రుణమాఫీ ప్రకటించిన రోజు అందరూ సందేహించినవారే. కానీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 11 లక్షల మంది లక్షలోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేశాం. ఆగస్ట్ 15 లోపలే రెండు లక్షల రుణాలున్న రైతన్నలందరి రుణాలను మాఫీ చేసి ఈ దేశ స్వాతంత్యం వచ్చిన రోజు నాటికి తెలంగాణ రైతన్నకు రుణ స్వాతంత్య్రం కలిగిస్తాం. భూమిలేని రైతుకూలీ లకు యేడాదికి 12 వేల ఆర్థిక సాయం అందిస్తాం. పంట బీమా చేసి రైతన్న కష్టనష్టాల్లో అండగా ఉంటాం. వరి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 500 బోనస్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.శ్రీధర్ బాబు బడ్జెట్లో మహాత్మాగాంధీ మాటను ఉట్టంకించినట్టు, ‘‘మనం చేసే పనులకు, చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించడానికి సరి పోతుం’’దనే మాట అక్షర సత్యం. ఇవ్వాళ మేం ప్రవేశపెట్టిన రూ. 2,91,159 కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.– కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యాసకర్త రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు -
వ్యవసాయానికి 64 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలంటూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.64 వేల కోట్ల మేర అవసరమని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టులో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం శాఖల వారీగా ప్రతిపాదనలను స్వీకరిస్తోంది.పథకాల వారీగా అవసరాలతో..: బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పథకాల వారీగా నిధుల అవసరాలను వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు, రైతుభరోసా కోసం రూ.23 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటల బీమాకు రూ.3 వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. దీంతోపాటు రైతుబీమాకు రూ.1,500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల కోసం మిగతా నిధులను కోరారు. ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి దాదాపు వెయ్యి కోట్లు కావాలని కోరినట్టు సమాచారం.వ్యవసాయ యాంత్రీకరణ కీలకంగత పదేళ్లుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. కానీ ప్రభుత్వం నుంచి కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై అందే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. బయట మార్కెట్లో కొనాలంటే.. రైతులు ఆ ధరలు భరించడం కష్టం. కొరత కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2018 వరకు ప్రభుత్వం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చిందని.. ఆ తర్వాత పథకం నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు. -
ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ మోసం బయటపడింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన మోసం బయటపడిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్‌ది అంకెలతో పాటు మాటల గారడీ సర్కార్ అని విమర్శించారు. ‘‘మొత్తంగా ఈ బడ్జెట్.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోంది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసం’’అని మండిపడ్డారు. బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలను చూస్తే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చి న గ్యారంటీ.. ఇక అమలు కానట్టేనన్నారు. ‘ౖసాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు (రూ. 28 వేల కోట్లు) ఏమాత్రం సరిపోవు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీకి కూడా ఈ నిధులు సరిపోవు’అని వ్యాఖ్యానించారు. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’అమలవుతుందా? బడ్జెట్లో వైద్యరంగానికి రూ.11వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమ లు చేస్తుందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారు? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మైనారిటీలకు (15 శాతం జనాభాకి) రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 50 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసిందని విమర్శించారు.వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని, మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఇక ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు లేనట్టేనా? కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో... మొదటి సమావేశంలోనే బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామన్నారనీ కానీ ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలను నిలువునా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంబేడ్కర్ మాటలను ఉటంకించారు. కానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ‘కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి గొప్పగా చెప్పుకున్నరు. బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ. 7,700 కోట్లు. మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే.. ఇచ్చింది రూ.7,700 కోట్లు మాత్రమే’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
నీ వంకరబుద్ధి తో రాష్ట్రం దివాళా తీసుడు ఖాయం
-
ఐదోసారీ జనరంజకమే
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జెండర్ బేస్డ్ బడ్జెట్ సిద్ధం చేసింది. రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్ రూపొందించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.41,388 కోట్లు రానున్నాయి. మొత్తం మీద 2023 – 24 వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా. నేటి ఉదయం మంత్రిమండలి ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు. నవరత్నభరితంగా బడ్జెట్.. నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు. -
ఏపీలో అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా పెరుగుతుండగా అభివృద్ధియేతర వ్యయం ఏటా తగ్గుతోందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. వడ్డీల చెల్లింపుల వ్యయం కూడా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి తగ్గుతోందని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై రూపొందించిన అధ్యయన నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. 2020 – 21 నుంచి 2022 – 23 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను విశ్లేషించింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించే నిధులను అభివృద్ధి వ్యయంగా పరిగణించాలని పేర్కొంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితరాలపై చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం.. నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాలపై వ్యయం పెరుగుతోంది. 2021 – 22 నుంచి 2022 – 23 వరకు మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మించి రాష్ట్రం అభివృద్ధి వ్యయం చేస్తోంది. ► 2020 – 21 (అకౌంట్స్)లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం 63.0 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం 72.0 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం 29.7 శాతం నుంచి 21.6 శాతానికి తగ్గింది. ► 2020 – 21 రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపుల వ్యయం 13.1 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల్లో 10.2 శాతానికి తగ్గింది. ► ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య వ్యయం 2020 – 21లో రూ.9,990.6 కోట్లు ఉండగా 2021–22లో రూ.16,659.5 కోట్లకు పెరిగింది. 2022–23లో రూ.17,988.2 కోట్లకు చేరుకుంది. -
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బడ్జెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బడ్జెట్ తమదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌పై శాసన సభలో చర్చకు మంగళవారం మంత్రి బుగ్గన సమాధానమిచ్చారు. జాతీయ స్థాయికంటే మెరుగైన రీతిలో వివిధ రంగాల్లో వృద్ధి రేటు సాధించడం తమ ప్రభుత్వ ఘన విజయమని ఆయన చెప్పారు. చీకటి బడ్జెట్ అన్న టీడీపీ విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే తమ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం పురోభివృద్ధి సాధించిందని గణాంకాలతో సహా వివరించారు. ‘కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నా, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా కొనసాగిస్తున్నాం. 2018–19లో రాష్ట్ర రాబడి రూ.58,037 కోట్లు ఉంది. కాంపౌండింగ్ గ్రోత్నుబట్టి 2019–20లో రూ.65,928 కోట్ల రాబడి రావాల్సి ఉండగా రూ. 57,831 కోట్లు మాత్రమే వచ్చింది. 2020–21లో రూ.74,893 కోట్ల రాబడి రావాల్సి ఉండగా రూ.57,427 కోట్లు, 2021–22లో రూ.85,077 కోట్లు రావాల్సి ఉండగా రూ.73,629 కోట్లు వచ్చింది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే కోవిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసింది. రాష్ట్రంలో ఒక్క లేబొరేటరీ లేని స్థితి నుంచి వైద్య మౌలిక వసతులు పెంచుకుంటూ దేశంలోనే కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న టాప్–3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపడం సీఎం జగన్ ఘనత. కేవలం 0.67 శాతం మరణాల రేటుతో దేశంలో కోవిడ్ మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 2021– 22లో రాష్ట్రం స్థూల ఉత్పత్తిలో 18.47 శాతం, తలసరి ఆదాయంలో 17.58% వృద్థి రేటు సాధించింది. వ్యవసాయ రంగంలో 14.5%, పరిశ్రమల రంగంలో 25.58%, సేవా రంగంలో 18.91% పెరుగుదల మా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం. నీతి ఆయోగ్ నివేదికలపరంగా దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఏపీ నిలిచింది. టీడీపీ ఆరోపిస్తున్నట్టు దోచుకుందీ దాచుకుందీ ఎక్కడ’ అని బుగ్గన ప్రశ్నించారు. సంక్షేమ, అభివృద్ధికారక బడ్జెట్: స్పీకర్ తమ్మినేని సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉన్న బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో మంగళవారం సమాధానం ఇచ్చిన తరువాత ఆయన మాట్లాడుతూ.. ‘పేదరికాన్ని రూపుమాపేందుకు విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయించడం ప్రశంసనీయం. పేద పిల్లల విద్య కోసం ఇంతగా చొరవ చూపిన ప్రభుత్వం మరొకటి లేదు. అవినీతి రహిత పరిపాలనను అందిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్ జగన్ డైనమిక్ సీఎం. రాష్ట్రాభివృద్ధికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా సాగిపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ ఆయన ప్రయత్నానికి సహకరించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని చెప్పారు. బడుగు వర్గాల ఆర్థిక స్వావలంబన: ప్రభుత్వ విప్ చెవిరెడ్డి బడుగు, బలహీనవర్గాల ఆర్థిక స్వావలంబన దిశగా బడ్జెట్లో భరోసా ఇచ్చారు. దేశ ఆత్మ గ్రామాల్లో ఉందన్న గాంధీజీ మాటలను అనుసరించి గ్రామ స్వరాజ్యం దిశగా అనేక సంక్షేమ పథకాలకు తీసుకొస్తున్నారు. రైతు త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వంగా బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. మహిళలు పండుగ చేసుకుంటున్నారు: ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ యూరప్ దేశాల్లోని విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తూ అంగన్వాడీ స్కూళ్లను పీపీ1, పీపీ2 స్కూళ్లుగా మార్చడంపట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఒడితో మరెందరో విద్యార్థులు బాల్య వివాహాల నుంచి విముక్తి పొందారు. ప్రతి పల్లెలో మహిళలు పండుగలు చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం పల్లెల్లోకి తీసుకొచ్చారు. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే ధనలక్ష్మి మా ప్రభుత్వంలో భూమి కనిపిస్తే రైతు ఏ పంట వేస్తే మంచిదో ఆలోచిస్తాం. అందుకే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించాం. అదే టీడీపీ వాళ్లు దానిని ఎలా రియల్ ఎస్టేట్ చేయాలో లెక్కలేస్తారు. ఏళ్లుగా వెతలు పడుతున్న గిరిజన రైతులకు లక్షల ఎకరాల కొండు పోడు భూముల సాగు హక్కు పత్రాలను ఇచ్చిన చరిత్ర జగనన్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వంపై రాళ్లు విసురుతున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అవే రాళ్ల దెబ్బలు తగులుతాయి. చిత్తశుద్ధితో పాలన: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల కష్టాలు, బాధలు, ఇబ్బందులు తీర్చాలనే చిత్తశుద్ధితో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ సీరియస్ సినిమాలో వచ్చే కమెడియన్ లాంటి వాడు. ప్రగతిదాయక బడ్జెట్: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాష్ట్ర ప్రగతికి దోహదపడే బడ్జెట్ ఇది. అన్ని వర్గాల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించడం సంతోషకరం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ సానుభూతిపరులు అనర్హులైనా పథకాలు ఇచ్చారు. మిగిలిన ప్రజలకు అర్హతలు ఉన్నప్పటికీ జాబితా నుంచి తొలగించడమే పనిగా ఉండేది. ప్రస్తుతం మా ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా ప్రజలకు ఇవ్వడమే పనిగా పెట్టుకుంది. టీడీపీ చేసిన అప్పులు ఏం చేశారో చెప్పగలరా? ‘మా ప్రభుత్వం చేసిన అప్పులు సంక్షేమ పథకాలుగా ప్రజలకు చేరాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఆధార్ కార్డులతో సహా పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాం. టీడీపీ ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. ఆ నిధులు ఆ పార్టీ వారి జేబుల్లోకే వెళ్లాయి. అంతగా అప్పులు చేసిన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇది చేశామని ప్రజలకు చెప్పుకోడానికి ఒక్కటైన ఉందా? కాగ్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా ఉన్న పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా చేజిక్కించుకుని టీడీపీ రాజకీయ రాద్ధాంతం చేస్తోంది’ అని మంత్రి బుగ్గన విమర్శించారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే ఏకైక అజెండాగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్‌పై దాడికి యత్నించినప్పటి నుంచి ఇప్పటివరకూ సభలో గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఉక్రెయిన్‌లో బాంబులు వేస్తున్న ప్రదేశాలను గూగుల్‌లో చూసి గుర్తించాలన్న తెలివి తేటలున్న చంద్రబాబు, టీడీపీ నేతలతో తామేం వాదించగలమని ఎద్దేవా చేశారు. -
విద్యకు బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్లో విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని సోషల్ డెమొక్రటిక్ ఫోరం డిమాండ్ చేసింది. లాక్డౌన్ తర్వాత పరిస్థితులతో విద్యారంగం మరింత నిర్లక్ష్యానికి గురైందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. ఈమేరకు సోషల్ డెమొక్రటిక్ ఫోరం అడ్వైజర్ మాధవరావు, కన్వీనర్ ఆకునూరి మురళి తదితరులు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీల కోసం మరో రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. -
బడ్జెట్లో బీసీలకు రూ. 10 వేల కోట్లివ్వాలి
కాచిగూడ: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘం ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన సోమవారం కలిశారు. బీసీల బడ్జెట్‌పై చర్చించారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని.. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. -
నిధులు లేకుండా దళితబంధు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధు పథకాన్ని నిధులు లేకుండా ఒట్టిగా అమలు చేస్తామంటున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో సీఎం దళిత సాధికారత పథకం కోసం రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.లక్షా 70 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని దళిత ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీరు చెప్పినట్టు దీనికి నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టత ఇవ్వాలి’అని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితబంధుపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనలు గొప్పగా ఉన్నా, వాటి అమలుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ పథకం అమలు కావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని కోరారు. ముస్లింలు, బీసీలు, ఈబీసీలకు సైతం ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని సూచించారు. స్పష్టత ఇవ్వాలి... దళితబంధు కింద లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఇస్తే వాళ్లు రెండు, మూడు వ్యాపారాలు చేసుకోవచ్చా.. వారికి నచ్చే వ్యాపారం చేసుకోవచ్చా.. అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని భట్టివిక్రమార్క కోరారు. పెద్దఎత్తున వ్యాపారం చేసుకోవాలని అనుకుంటే పదిమంది కలుసుకుని చేసుకోవచ్చా.. అని ప్రశ్నించారు. ఉన్న మండలంలోనే వ్యాపారాలు చేసుకోవాలా? నచ్చిన ప్రాంతాల్లో చేసుకునే అవకాశం ఉందా? అని అడిగారు. రేషన్‌కార్డు లేనివారిని కుటుంబంగా పరిగణించరా? పెళ్లి అయినవారిని పరిగణనలోకి తీసుకుంటారా అన్న అంశంపై స్పష్టత కోరారు. -
అసాధారణ రీతిలో అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈసారి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసిన రోజునే రాష్ట్ర బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టబోతున్నారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో అటు ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఇటు విడిపోయిన తరువాత గానీ ఇలాంటి అసాధారణ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 16న రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభం కానున్న సమావేశాలు ఆ తరువాత 17వ తేదీ మరొక్క రోజు మాత్రమే జరగబోతున్నట్లు అనధికారిక సంకేతాలు అందుతున్నాయి. గతంలో ఎలా.. ► వాస్తవానికి బడ్జెట్ సాధారణ సమావేశాలు కనీసం రెండు వారాలకు పైగా జరిగే సంప్రదాయం ఉంది. అదే ఉమ్మడి రాష్ట్రంలో అయితే పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఆరు వారాలపాటు దీర్ఘకాలికంగా జరిగితే.. అందులో సెలవులు పోను కనీసం 28 నుంచి 31 రోజుల వరకూ పూర్తి పని దినాలుండేవి. ► విభజన తరువాత బడ్జెట్ సమావేశాల కాలాన్ని రెండు నుంచి మూడు వారాలకు కుదించుకున్నారు. అందులో 12 నుంచి 14 పని దినాలు అనివార్యంగా ఉండేవి. ► గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రారంభానికి ఒక రోజు వ్యవధి ఉండేది. సాధారణ బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన తరువాత మధ్యలో ఒక రోజు కంటే మించి విరామం ఉండేది. ► ఆ తరువాతే చర్చ ప్రారంభమై శాఖల పద్దుల వారీగా చర్చలు జరిపి ఆమోదించేవారు. సమావేశాలు చివరకు వచ్చేప్పటికి ద్రవ్య వినిమయ బిల్లును ఉభయ సభలూ విడివిడిగా ఆమోదించేవి. ప్రస్తుతం ఈ ప్రక్రియకు ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిలా.. ► ఈ నెల 16వ తేదీ సమావేశాల తొలి రోజున ఉదయం 10 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్‌భవన్ నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ సౌకర్యం ద్వారా వెలగపూడిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది గంటసేపు ఉంటుందని అంచనా. ► గవర్నర్ రాజ్‌భవన్ నుంచి ప్రసంగించినా.. అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చూసే అవకాశం ఆయనకు ఉంటుంది. ప్రసంగం ముగిసిన వెంటనే సంయుక్త సమావేశం ముగుస్తుంది. ► ఆ వెంటనే ఆయా సభల బీఏసీ సమావేశాలు విడివిడిగా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్ చాంబర్లలో జరుగుతాయి. కార్యక్రమాల ఖరారుపై నిర్ణయం తీసుకున్న అనంతరం గంట సేపటికి ఉభయ సభలూ విడివిడిగా సమావేశమవుతాయి. ► వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. నిర్దేశిత, నియమిత సమయాలను కచ్చితంగా పాటిస్తూ పరిమితంగా సభ్యులను చర్చకు అనుమతిస్తారు. తీర్మానం ఆమోదించిన తరువాత ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. ► వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ఆ వెంటనే ప్రతిపాదిస్తారు. వెనువెంటనే చర్చ ప్రారంభమై సాధారణ బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు అంటే.. 17వ తేదీన ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ► అదే రోజున ఉభయ సభలూ దశల వారీగా ప్రభుత్వ శాఖల పద్దులను, ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో రోజు సాయంత్రంలోపు ఈ తంతు అంతా పూర్తి కావాలని భావిస్తున్నారు. ఎందుకిలా.. ► కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పరిణమించడంతో అనివార్యంగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ► కోవిడ్–19 నేపథ్యంలో దాని వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ► దీంతో రాష్ట్రంలోనూ మార్చి 24వ తేదీ నుంచి ఆ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం సహా పలు మార్గదర్శకాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ► ఈ దృష్ట్యా బడ్జెట్ సమావేశాలను అన్ని సంప్రదాయాలకు భిన్నంగా.. అసాధారణ రీతిలో ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజులకే పరిమితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారమే.. ► ఆరు నెలలు దాటక ముందే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు తప్పనిసరిగా జరపాల్సి ఉండటంతో ముందుగానే ఈ సమావేశాల నిర్వహణకు పూనుకున్నారు. 2020 జనవరిలో చివరి సారిగా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ► ఆ ప్రకారం ఆరు నెలల లోపు అంటే జూలై 22వ తేదీకి ముందే సమావేశాలు జరపాల్సి ఉంది. కానీ, ఈ ఆర్ధిక ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను కరోనా నేపథ్యంలో మార్చిలో నిర్వహించలేకపోవడంతో తొలి త్రైమాసికానికి అంటే ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు వ్యయానికి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించారు. ► జూలై నుంచి వ్యయానికి తప్పనిసరిగా బడెŠజ్ట్ను అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి పరిమిత రోజుల బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. -
అంతా భ్రాంతియేనా..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ మళ్లీ రాష్ట్రానికి నిరాశే మిగిల్చింది. మాంద్యం నేపథ్యంలో కేంద్రం నుంచి ఉదారంగా సాయం అందుతుందని, కేంద్ర ప్రశంసలు అందుకున్న పథకాలకు నిధులు ఇస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పసుపు బోర్డు ఏర్పాటు లాంటి అంశాల ఊసే లేదు. తెలుగింటి కోడలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో లెక్కల పద్దులో ఏపీ పునర్వ్యవస్థీకరణ గురించి పట్టించుకోలేదు. రాష్ట్రం అడిగిన పథకాలకు కనీస నిధులు కూడా కేటాయించలేదు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగు, తాగు నీటి పథకాలకు నిధులు కేటాయించకపోవడంతోపాటు పన్ను వాటాలోనూ కోత పెట్టడంతో ఈసారి రాష్ట్ర బడ్జెట్ అంచనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, నిరుద్యోగ భృతి లాంటి వాటి అమలుకు ఆర్థిక వెసులుబాటు కష్టమేనని లెక్కలు వేస్తున్నాయి. మాంద్యం కారణంగా రాష్ట్ర ఆదాయంలో కొంత తగ్గుదల కనిపిస్తోందని, దీంతో భారీ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రులను కలవడంతోపాటు కేంద్రానికి లేఖలు రాశారు. మంత్రి హరీశ్‌రావు 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌తో భేటీలో కాళేశ్వరం, మిషన్ భగీరథల నిర్వహణ కోసం రూ.52 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. ఏదో అలా అలా.. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలు, ఐజీఎస్టీ చెల్లింపులు, పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.35 వేల కోట్ల వరకు అదనపు నిధులు కేటాయిస్తారని ప్రభుత్వం ఆశించింది. కానీ తెలంగాణకు రూ.16 వేల కోట్ల పన్నుల వాటానే కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. దీంతో ప్రస్తుత సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు వచ్చే ఏడాది నిధుల కటకట తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కొత్త పథకాల అమలుకు అవకాశాల్లేవని తేల్చేస్తున్నారు. ఇక 2020–21 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు కూడా ఆచితూచి ఉంటాయని పేర్కొంటున్నారు. అందులోనూ కోతే.. పన్నుల వాటాలోనూ కేంద్రం రాష్ట్రానికి కోత పెట్టింది. మొత్తం పన్ను వాటాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.437 శాతం ఇవ్వగా, దాన్ని 2.133 శాతానికి కుదించింది. 2019–20లో రూ.17 వేల కోట్లకు పైగా పన్నుల వాటా అంచనాలను పెట్టిన కేంద్రం ఇప్పుడు మరో రూ.వెయ్యి కోట్లు తగ్గించి రూ.16 వేల కోట్ల పైచిలుకు చూపెట్టింది. అందులో ఎంత ఇస్తుందన్న దానిపైనా అనుమానాలున్నాయని ఆర్థిక వర్గాలు అంటు న్నాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ లాంటి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బడ్జెట్లో ప్రస్తావించనేలేదు. అయితే, బెంగళూరులో మెట్రో తరహాలో సబర్బన్ రైల్వే వ్యవస్థకు రూ.18,600 కోట్లను ప్రతిపాదించిన కేంద్రం తెలంగాణలోని గ్రామాల రూపురేఖలను మార్చే రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) లాంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రతిపాదనలపై 4 గంటల పాటు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం.. కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచారు. -
ప్రాజెక్టుల నిర్వహణకు బడ్జెట్లో నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ఇకపై ప్రభుత్వమే చూడనుంది. ఎత్తిపోతల పథకాల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం)కు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఎత్తిపోతల పథకాల ఓఅండ్‌ఎంకు ఇక ఏటా రాష్ట్ర బడ్జెట్లో నిధులు సైతం కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎత్తిపోతల పథకాల పరిధిలో పంప్‌హౌస్‌ల్లోని మోటార్లు, పంపులు, విద్యుత్ సరఫరా చేసే జనరేటర్లు, డ్యామ్‌ల పరిధిలో గేట్లు, వాటి నిర్వహణ, కాల్వలు, టన్నెళ్లు ఇవన్నీ ఓఅండ్ఎం కిందకే వస్తాయి. ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టే ఏజెన్సీలు నిర్ణీత కాలం వరకే ఓఅండ్ఎం బాధ్యతలను చూస్తున్నాయి. ఆ తర్వాత ఈ బాధ్యతలను ప్రభుత్వమే చూడాలి. అయితే ప్రభుత్వం వద్ద అంత సిబ్బంది లేక టెండర్ల ద్వారా మళ్లీ ప్రై వేటు ఎజెన్సీలకే ఆ బాధ్యతలను కట్టబెడుతోంది. కాగా వరద ఉండే 6 నెలల కాలానికే ఈ నిర్వహణ బాధ్యతలకై టెండర్లు పిలుస్తుండటంతో ప్రైవేటు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు బడ్జెట్లో కేటాయించడం లేదు. అదీగాక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ మున్ముందు కత్తిమీద సాము కానుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఓఅండ్‌ఎంకే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రానుంది. 2020–21 నుంచి 2024–25 వరకు రానున్న ఐదేళ్ల కాలానికి విద్యుత్ అవసరాలకు, నిర్వహణ భారం కలిపి ఏకంగా రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో విద్యుత్ అవసరాల ఖర్చే రూ.37,796 కోట్లు ఉండగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా ఉన్న పంపులు, మోటార్లు, గేట్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాల్వలు, టన్నెళ్లు, వాటి పొడవు, రిజర్వాయర్లు, వాటి పరిధిలోని లిఫ్టులు తదితర వివరాలన్నీ ముందుగా తేల్చి, వాటి నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మ్యాన్యువల్‌ను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల సాగునీటి శాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని రూపొందించాలని చెప్పారు. -
అప్పులు 3 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీలు కలిపి రూ. 3.03 లక్షల కోట్లు ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మొత్తం అప్పులు రూ. 1.92 లక్షల కోట్లు కాగా, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీ రూ. 77,304 కోట్లు అని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఖర్చులు ఇష్టారాజ్యంగా చేస్తే ప్రమాదంలో పడతామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణగా మారుతుందన్నారు. చేసే పనులు తక్కువ.. ప్రచారం ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. 2022–23 నాటికి ఇవి మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. సన్నబియ్యం ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావని వ్యాఖ్యానించారు. విద్యుత్ వెలుగులు కాంగ్రెస్ చలవేనని అన్నారు. కూకట్పల్లి మండలంలో దళిత మహిళలకు 4 ఎకరాల్లో పట్టాలిచ్చారని, వాటిని కొందరు పెద్దలు ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన గ్లోబరీనా సంస్థపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరణి వెబ్సైట్లోనూ గ్లోబరీనా జోక్యం ఉన్నట్లు చెబుతున్నారని, దాన్ని దూరం పెట్టాలని సూచించారు. ఎనిమిది, పదేళ్లుగా పనిచేస్తున్న హోంగార్డులను తీసేశారని, వారు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులకు ఫెలోషిప్ రావడంలేదన్నారు. ఇంతలో అధికార పక్ష సభ్యుడు బాల్క సుమన్ అడ్డుతగలగా, ఆయన్ను సంక్షేమ మంత్రిగానో ఏదో ఒకటి చేయాలని భట్టి ఎద్దేవా చేశారు. ఏడెనిమిది నెలల నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకాలు రావడంలేదన్నారు. మున్సిపల్ పంచాయతీ కార్మికుల జీతాలను రూ. 18 వేలు చేయాలని డిమాండ్ చేశారు. పాలీహౌస్ రైతులకు డబ్బులు నిలిపివేశారని తెలిపారు. గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు బంగారు రుణం తీసుకుంటే, రుణమాఫీని వర్తింపచేయలేదని భట్టి స్పీకర్‌కు ఆధారాలతో సహా వివరించారు. రూ. 78 వేలు తీసుకుంటే మాఫీ కాకపోగా, ఇప్పుడది వడ్డీతో కలిపి రూ.1.47 లక్షలు అయిందన్నారు. ఇంతలో స్పీకర్ జోక్యం చేసుకొని.. ఏడు శాతం లోపు వడ్డీ ఉన్నటువంటి బంగారు రుణాలను మాత్రమే పంట రుణాలుగా పరిగణిస్తారని, అంతకుమించితే పరిగణించరని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనంపై అభ్యంతరం తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకుపోవడంపై భట్టి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకేసారి 12 మంది విలీనం కాలేదన్నారు. ఒకసారి ఒకరు, మరోసారి ఇద్దరు ఇలా వేర్వేరుగా చేరారని, ఆ సమయంలో స్పీకర్‌కు విన్నవించామని గుర్తు చేశారు. ఆ సమయంలో వారిపై చర్య తీసుకోకుండా కాలయాపన చేశారని, చివరకు వేర్వేరు సమయాల్లో చేరిన 12 మందిని విలీనం చేశారని ఆరోపించారు. తమ ఫిర్యాదు సమయంలోనే ఒకరిద్దరిపై వేటు వేస్తే తమకు న్యాయం జరిగేదని వాపోయారు. ఇది సమంజసం కాదన్నారు. పాతబస్తీకి మెట్రో నడపండి.. ఎంఐఎం సభ్యుడు ముజంఖాన్ మాట్లాడుతూ.. పాతబస్తీకి మెట్రోరైలును తీసుకురావాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. జ్వరాల తీవ్రత ఉన్నందున వైద్య ఖాళీలను భర్తీ చేయా లని కోరారు. అవసరమైన మందులను సరఫరా చేయాలన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ సభ్యుడు ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబాల ను ఆదుకునేందుకు మంత్రులు అజయ్, ఎర్రబెల్లి దయాకర్లతో కలిసి ఏపీకి వెళ్లామన్నారు. అక్కడి సీఎం జగన్‌తో కలిసి పరిస్థితిని చక్కదిద్దామని తెలిపారు. అక్కడి ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 3 లక్షలు, సాధారణంగా బయటపడిన వారికి రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించామన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. పీహెచ్డీ విద్యార్థులకు కేంద్రమే ఫెలోషిప్ ఇస్తుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఫెలోషిప్‌పై విద్యార్థులకు అన్యాయం చేస్తుందన్నారు. -
ముగింపు ..తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా ముగింపు దశలోని ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు భారీగా తగ్గాయి. మరో రూ.వెయ్యికోట్లు కేటాయించినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ, ప్రభుత్వం కేవలం రూ.87 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు. కోయిల్సాగర్ల కింద మొత్తంగా 8.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 6.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తిచేయగా, మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన పనుల పూర్తికి, 12 శాతం మేర మిగిలిన భూసేకరణకు రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు కనిష్టంగా రూ.400 కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.4 కోట్లతో సరిపెట్టారు. ఈ ప్రాజెక్టు కింద పనులకు సంబంధించి రూ.70 కోట్లు, భూసేకరణకు సంబంధించి రూ.17 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 3 లక్షల ఎక రాల కు నీరిచ్చే అవకాశాలుండగా, మిగతా ఆయకట్టు ను వచ్చే ఏడాదికి సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నిధులతో అధి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక భీమా, నెట్టెంపాడుల పరిధిలోనూ పెండింగ్ బిల్లులు రూ.33 కోట్ల మేర ఉన్నాయి. భూసేకరణకు మరో రూ.17 కోట్లు అవసరం. వీటి కింద నిర్ణయించిన చెరో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే కనిష్టంగా రూ.400 కోట్లు అవసరంకాగా కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. ప్రాణహిత మూలకే.. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లోని టన్నెల్ పనులు గాడిన పడే అవకాశం కనబడటం లేదు. పనుల పూర్తికి నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడమే దీనికి కారణం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీ లకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు. కన్వేయర్ బెల్ట్, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీకి రూ.80 కోట్లను అడ్వాన్సు కింద చెల్లించాలని ప్రతిపాదన వచ్చినా తుది రూపం తీసుకోలేదు. పనులకు సంబంధించి రూ.80 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.22 కోట్లు, భూసేకరణకు రూ.270 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా ప్రాజెక్టుకు రూ.300 కోట్ల మేర కేటాయింపులు కోరినా రూ. 17.31 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ్మిడిహెట్టి కాకుండా దానికి ఎగువన వార్ధా నదిపై దీన్ని నిర్మించాలని భావిస్తుండ టంతో ప్రభుత్వం కేటాయింపులు తగ్గించింది. -
అన్నదాతకు అగ్రస్థానం
సాక్షి, రంగారెడ్డి : రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం దక్కింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. అలాగే.. నిధుల్లేక నీరసిస్తున్న పల్లెలకు ప్రతినెలా డబ్బులు అందజేస్తామని పేర్కొనడం ఊరటనిచ్చే అంశం. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిచ్చారు. అయితే, జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాత్రం నిధులు తక్కువ కేటాయించారు. గతేడాది రూ.2,179 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం రూ.500 కోట్లతో సరిపుచ్చారు. రుణమాఫీతో రూ.1.32 లక్షల మంది రైతులకు మేలు రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంట రుణాల మాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించారు. రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బడ్జెట్లో పంట రుణమాఫీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో సుమారు 2.81 లక్షల మంది రైతులు ఉండగా.. వీరిలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారు 1.32 లక్షల వరకు ఉన్నారని అంచనా. రుణమాఫీ జరిగితే వీరందరికీ మేలు జరగనుంది. అన్నదాతలకు భరోసా.. రైతుబంధు పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు జరిపింది. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం దక్కుతోంది. ఇలా జిల్లాలో ఇప్పటివరకు 754 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. తాజాగా నిధుల కేటాయింపుతో మరిన్ని కుటుంబాలకు అండ లభించనుంది. అలాగే సాగు భారాన్ని రైతులకు తగ్గించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి నిధులు కేటాయించారు. పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుండగా కొంతకాలంగా నిధుల కొరతతో రైతులకు సొమ్ము సకాలంలో అందడం లేదు. ఈ ఖరీఫ్‌లో 2.38 లక్షల మంది రైతులకుగాను.. 1.47 లక్షల మందికే రైతుబంధు సొమ్ము అందింది. మిగిలిన 90వేల పైచిలుకు మంది అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. నిధుల కేటాయింపుతో ఇకపై ఆ పరిస్థితి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. మరింత మందికి ‘ఆసరా’.. కుదించిన ఆసరా పింఛన్ అర్హత వయసుకు లోబడి ఉన్న అర్హులకు ఈ ఏడాది పింఛన్ అందనుంది. ఆసరా పించన్ వయసును రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కుదించింది. పించన్ పొందేందుకు అంతకుముందు కనిష్టంగా 65 ఏళ్లు ఉండగా.. ఈ వయసును 57కు కుదించింది. ఈ నిర్ధిష్ట వయసు గల వారి వివరాలను సేకరిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ.. 32 వేలకుపైగా మంది అర్హులను ఈ ఏడాది మేలో గుర్తించింది. ఆ తదుపరి నెల నుంచి పింఛన్ సొమ్ము దక్కుతుందని లబ్ధిదారులు ఆశించారు. అయితే, మూడు నెలలు గడిచినా ఊసే లేకపోవడంతో అర్హులు అయోమయంలో పడ్డారు. తాజా బడ్జెట్లో వీరికి నిధులు కేటాయించడంతో వీరి ఉపశమనం కలగనుంది. ‘పాలమూరు–రంగారెడ్డి’కి అత్తెసరుగానే.. జిల్లా సాగునీటి అవసరాలు తీర్చే ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల తక్కుక కేటాయింపు జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. గతేడాది కేటాయింపులతో పోల్చితే ఇది నాలుగో వంతు కంటే తక్కువే. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును నిధుల కొరత వేధిస్తోంది. తాజాగా విద్యుత్ ఆర్థిక సంస్థ (పీఎఫ్సీ) నుంచి రూ.10వేల కోట్లు రుణాన్ని ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తామని పేర్కొన్న సీఎం.. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టుకు పూర్తి చేస్తాయని తెలిపారు. నిర్దేశిత గడువులోగా పొలాలకు నీరందించడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేయాల్సిన తరుణంలో స్వల్ప కేటాయింపులు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఇది ప్రజా బడ్జెట్.. అంతటా ఆర్థిక మాంద్యం ఉన్నా.. సంక్షేమ రంగానికి నిధుల్లో కోత పెట్టలేదు. అన్ని రంగాలకు కేటాయింపుల్లో సముచిత స్థానం కల్పించడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే ప్రజా బడ్జెట్ ఇది. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, విద్య, వైద్యం, నీటి పారుదల, మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా కేటాయింపులు చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – పి.సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి -
రుణాలతోనే గట్టెక్కేది?
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు మరోమారు అగ్రతాంబూలం దక్కనుంది. గతంలో మాదిరే ఈ ఏడాది నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు కలిపి రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిన నీటిపారుదల శాఖ రూ.26 వేల కోట్లతో అంచనాలు వేసింది. ఇందులో ఇప్పటికే కార్పొరేషన్ల ద్వారా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసేలా అంచనాలు సిద్ధమైనట్లు సమాచారం. రుణాలే ఆధారం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో భారీగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో ఆరు నెలల కాలానికి రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. పనులకు సంబంధించి మరో రూ.5వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా ఈ నెలలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో రూ.26 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా రూ.25 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముగింపు దశకొచ్చిన నేపథ్యంలో కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం పాలమూరు–రంగారెడ్డికి దక్క నుంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.10 వేల కోట్ల మేర రుణాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు అనుమతి రాగా ఇందులో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లమేర ఖర్చు చేసేలా కేటాయింపులు చేసే చాన్సుంది. ఇక కాళేశ్వరానికి రూ.6వేల కోట్ల మేర కేటాయింపులతో అంచనాలు వేయగా, ఇందులో రుణాల ద్వారానే అధిక ఖర్చు చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ. 6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇక పూర్వ మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించనున్నారు. -
ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నా రు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన నుంచి నిధుల సద్వినియోగం వరకు ప్రతీ దశలోనూ పూర్తిస్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని స్పష్టంచేశారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి కేసీఆర్ మంగళవారం రెండో రోజు ప్రగతి భవన్లో కసరత్తు చేశా రు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చ జరిగింది. సెప్టెంబర్‌లో వినాయక చవితి ఉత్సవా లు, నిమజ్జనం, మొహర్రం పండుగలున్నాయి. ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్లు, సెక్రటరీల సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ పాల్గొంటారు. ఈ విషయాలన్నిం టి దృష్ట్యా సెప్టెంబర్ 4, 9, 14 తేదీల్లో సమావేశాలు ప్రారంభించవచ్చని అసెంబ్లీ కార్యదర్శి ప్రతిపాదించారు. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మూడు తేదీల్లో ఒక తేదీని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. గవర్నర్ ప్రసంగం ఉండదు.. ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయ సభలను ఉద్దేశిం చి గవర్నర్ ప్రసంగం చేసినందున బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో చర్చ వంటి ప్రక్రియలుంటాయి. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీని సమావేశపరచడానికి ముందే మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశమవ్వాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేలా ఆయా శాఖలకు సరైన మార్గదర్శనం చేయాలని భావిస్తున్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ఆక్వాకు ఆక్సిజన్
సాక్షి, మచిలీపట్నం: మత్స్యకారులకు భరోసా లభించింది. చేపల వేట జీవనంగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. శుక్రవారం ప్రకటించిన బడ్జెట్లో మత్స్యకారులకు పెద్ద పీట వేస్తూ నిధులు కేటా యించడం మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంబడి 49 వేల హెక్టార్లలో మంచినీటి చేపలు, మరో 19 వేల హెక్టార్లలో ఉప్పు నీటి చేపల సాగు చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 30 వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. సముద్ర తీరం వెంబడి జిల్లాలోలో 101 మెకనైజ్డ్ బోట్లు, 1,458 మోటా రైజ్డ్ బోట్లను వినియోగిస్తూ మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం మంజూ రుచేసిన నిధులు సైతం పక్కదారి పట్టించి మత్స్యకారులకు పూర్తిగా మొండి చేయి చూపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి వారిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. నిషేధ భృతి రూ.10 వేలకు పెంపు ఏటా వేసవిలో సముద్రతీరంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఆ సమయంలో మత్స్యకారుల జీవన భృతి పేరిట ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ. 4 వేలు ఇచ్చేవారు. అవి కూడా సమయానికి అందేవి కావు. కానీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో జీవన భృతి రూ.10 వేలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయిం పులు చేశారు. సముద్ర తీరంలో ఉన్న 8,980మంది మత్స్య కారులకు ఇక నుం చి ఒక్కొక్కరికి రూ. 10 వేలు సాయంగా అందనున్నాయి. వీటిని 2020 జనవరిలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూ.1.50 కే ఆక్వా రైతులకు ఒక యూనిట్‌కు రూ. 2ను వసూలు చేస్తుండగా, ఇక నుంచి రూ. 1.50కే అందించనుంది. దీనికి సంబంధించి రూ. 475 కోట్లు కేటా యింపులు చేసింది. డీజిల్‌ను సబ్సిడీపై అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు రూ. 200 కోట్లు కేటాయించడం వల్ల ఎంఎస్ యాక్ట్ కింద మత్స్యశాఖాధికారుల వద్ద నమోదు చేసుకున్న మెకనైజ్ట్ బోట్లకు నెలకు రూ.3 వేల లీటర్లు, మోటారైజ్డ్ బోట్లకు నెలకు 300లీటర్ల డీజిల్‌ను ఒక్కొక్క లీటర్‌కు రూ. 6.03 చొప్పున సబ్సిడీ పొందే అవకాశం కలిగింది. దీంతోడీజిల్ భారం తగ్గి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు మరింత ఆర్థిక ప్రయోజనం కలుగనుంది. మత్స్యకారులకు ఎంతో మేలు ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేకూర్చేలా బడ్జెట్లో కేటాయింపులు చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు లేక, ఆర్థిక ప్రయోజనం కలుగలేదు. ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులు ఉన్నందున నిర్ధిష్ట కాలంలో మత్స్యకారులకు సాయం అందుతుందనే నమ్మకం ఉంది. – లంకే వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ జిల్లాలో సముద్ర తీరం 111 కిలోమీటర్లు మంచినీటి చేపల సాగు 49 వేల హెక్టార్లు చేపల వేటపై జీవిస్తున్న మత్స్యకారులు 8,980 మంది ఉప్పునీటి చేపల సాగు 19 వేల హెక్టార్లు ఆక్వా సాగు చేస్తున్న రైతులు 30 వేల మంది -
బడ్జెట్లో విద్యా రంగానికి పెద్దపీట
-
బడ్జెట్లో రూ.5,116 కోట్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్లో తమ శాఖకు రూ.5,116.40 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ కోరింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్సింగ్, సాంబశివరావు (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ) ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. బడ్జెట్ ముందస్తు కసరత్తులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం వివిధ శాఖల మంత్రులు, అధికారులతో విభాగాల వారీగా సమావేశమయ్యారు. భూ పరిపాలన, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు సంబంధించి రూ.5,116.40 కోట్లు కేటాయించాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్థిక శాఖ మంత్రికి నివేదించారు. సాధారణ బడ్జెట్ కింద రూ.1,430.40 కోట్లు, వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు రూ.3,686 కోట్లు కలిపి మొత్తం రూ.5,116.40 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రూ.25 కోట్లు ఇవ్వండి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మూడు జిల్లాలుగా మార్చేసి, అందులో రెండింటిని గిరిజన జిల్లాలుగా చేయాలని, దీంతోపాటు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాన్ని విడగొట్టి పోలవరం గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. జిల్లాల ఏర్పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదని, తర్వాత చేపడతామని, అయినప్పటికీ ఇందుకోసం రూ.25 కోట్ల బడ్జెట్ కావాలంటూ ప్రతిపాదించామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్సార్సీపీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ హామీ అమలుకు రూ.13 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ విన్నవించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందుకోసం మొదటి ఏడాది రూ.3,648 కోట్లు కావాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 2019–20 బడ్జెట్ ప్రతిపాదనలపై మంగళవారం సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని.. ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని చెప్పారు. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయిస్తామని.. తద్వారా అధిక శాతం ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసేలా నిధులు కేటాయింపు చేస్తామని తెలిపారు. బడ్జెట్లో విద్యా రంగానికి పెద్దపీట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక (2019–20) సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారని ఆయన తెలిపారు. ముందస్తు బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అమలు చేయడానికి అయ్యే మొత్తం నిధులు కేటాయించనున్నారని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్ర వాటా నిధులు కూడా అందించడానికి ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పాఠశాల విద్యకు 39,897 కోట్లు ఇవ్వండి 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.39,897.42 కోట్లు కేటాయించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. నవరత్నాల హామీల్లో ఒకటైన అమ్మ ఒడి పథకంతోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మేరకు నిధులు అవసరమని పేర్కొంది. ఇక ఉన్నత విద్యాశాఖకు రూ.5,027.15 కోట్లు అవసరమని ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు అందజేసింది. -
చదివింపులు 'అరకొర'
పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు తగ్గుతున్నాయి. గత రెండేళ్లలో నిధుల కేటాయింపులు ఎక్కువే అనిపించినా, పెరుగుతున్న రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి చూస్తే విద్యా శాఖ వాటా తగ్గిపోతోంది. ఈ ప్రభావం అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోందన్న విమర్శలున్నాయి. ఈసారైతే రాష్ట్ర బడ్జెట్లో వాటా కాదు నిధుల పరంగా చూసినా విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం.. రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇప్పుడు 6.71 శాతానికి పడిపోయింది. పాఠశాల విద్యకు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ తగ్గింది. విద్యాశాఖ అధికారులు దాదాపు రూ.15 కోట్లకు పైగా బడ్జెట్ కావాలని ప్రతిపాదిస్తే ప్రభుత్వం రూ.12,220.78 కోట్లే కేటాయించింది. ఇవి విద్యాశాఖకు ఏ మూలకూ సరిపోవని పలు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఏ విభాగానికి ఎంత బడ్జెట్ కేటాయించారన్న స్పష్టత లేదని చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ వేతనాల చెల్లింపులు, నిర్వహణ ఖర్చులకే సరిపోతాయని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ క్రమంగా తగ్గిపోతున్న విద్యాశాఖ వాటా.. రాష్ట్రం ఏర్పడిన తరువాత బడ్జెట్లో విద్యారంగం వాటా పరిస్థితిని పరిశీలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి రాష్ట్ర బడ్జెట్ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగకపోగా తగ్గిపోయింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ. 10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్లో 10.88%) కేటాయించింది. 2015–16లో రాష్ట్ర బడ్జెట్ 1,15,689కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 11,216 కోట్లు (9.69%) కేటాయించింది. 2016– 17లో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,30,415 కోట్లు కాగా, విద్యాశాఖకు మాత్రం రూ. 10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017–18లోనూ రాష్ట్ర బడ్జెట్ 1,49,453 కోట్లకు పెరిగింది. ఇందులో విద్యా శాఖ బడ్జెట్ రూ. 12,278 కోట్లకు పెరిగినా మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితం అయింది. అంతకుముందు సంవత్స రంతో పోల్చితే 2018–19లో విద్యా శాఖ బడ్జెట్ రూ. 500 కోట్లకు పైగా పెరిగి రూ. 13,278 కోట్లకు చేరుకుంది. వాటా పరంగా చూస్తే 7.61 శాతమే. ఈసారి బడ్జెట్ కేటాయింపులు చూస్తే వాటానే కాదు.. నిధుల పరంగా చూసినా గతేడాది కంటే విద్యాశాఖకు కేటాయింపులు తగ్గిపోయాయి. 2018–19లో రాష్ట్ర బడ్జెట్ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 13,278 కోట్లు కేటాయించిన ప్రభు త్వం.. ఈసారి రూ. 1,058 కోట్లు తగ్గించి రూ. 12,220.78 కోట్లకు పరిమితం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే ఈసారి విద్యాశాఖ వాటా 6.71 శాతానికి పడిపోయింది. ఉన్నత, సాంకేతిక విద్యలోనూ తగ్గిన కేటాయింపులు ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కేటాయించిన బడ్జెట్ గతేడాది కంటే ఈసారి రూ. 250 కోట్ల వరకు తగ్గిపోయింది. గత ఏడాది ఉన్నత విద్యకు రూ. 2,205.57 కోట్లు కేటా యించిన ప్రభుత్వం ఈసారి రూ. 1,916.85 కోట్లు కేటాయిం చింది. సాంకేతిక విద్యకు 2018–19లో రూ. 422.32 కోట్లు కేటాయించగా. ఈసారి దానిని రూ. 394.93 కోట్లకు పరిమితం చేసింది. ఉన్నత విద్యలో యూనివర్సిటీలకు కేటాయింపుల అంశంపై వివరాలు ఇవ్వకపోవడంతో తమకు ఎంత వచ్చిందన్నది తెలియని పరిస్థితి నెలకొంది. రూ. 13 వేల కోట్లు కావాలన్నా.. పాఠశాల విద్యా శాఖకు, వివిధ పథకాల నిర్వహణకు రూ. 13 వేల కోట్లు కావాలని పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం రూ. 9,909 కోట్లు మాత్రమే కేటాయించింది. కనీసం గతేడాది సవరించిన బడ్జెట్ ప్రకారం కూడా కేటాయింపులు జరపలేదు. 2016–17లో పాఠశాల విద్యకు రూ. 8,224.63 కోట్లు కేటాయించగా, 2017–18లో రూ. 10,215.30 కోట్లు కేటాయించి దానిని రూ. 10,197.22 కోట్లకు సవరించింది. 2018–19లో రూ. 10,830.30 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.9,909 కోట్లకు తగ్గింది. దీంతో పాఠశాల విద్యాశాఖకు కేటాయింపుల్లోనే భారీగా కోత పడింది. ఈ కోత నిర్వహణ వ్యయంలో పడిందా? పథకాల్లో తగ్గిందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ బడ్జెట్ ఏ మూలకూ సరిపోదు విద్యాశాఖకు ఈ బడ్జెట్ ఏ మూలకూ సరిపోదు. వేతనాలు, నిర్వహణ ఖర్చులకే ఇది సరిపోతుంది. గతంలో చేసిన చేసిన కేటాయింపులకంటే తగ్గించడం దారుణం. పెరిగిన రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా దీనిని పెంచా ల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ, ఇంగ్లిషు మీడియం విద్యా బోధనకు నిధులు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం పునరాలోచంచి బడ్జెట్‌ను పెంచాలి. – చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి తక్కువ కేటాయింపులు ఇవీ విద్యాశాఖకు కేటాయించిన ఈ బడ్జెట్ దక్షిణాది రాష్ట్రాల్లోనే తక్కువ. ఈ రాష్ట్రంలోనూ విద్యకు ఇంత తక్కువ కేటాయింపులు లేవు. కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలు, వసతుల కల్పనకు ఈ బడ్జెట్ సరిపోదు. ఇంత తక్కువ నిధులతో ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది. – నారాయణ, తల్లిదండ్రుల సంఘం మరిన్ని నిధులను కేటాయించాలి.. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు, నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులను విద్యాశాఖకు కేటాయించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎక్కువ నిధులను కేటాయించాలి. ఆ దిశగా సీఎం ఆలోచనలు చేయాలి. – గౌరు సతీష్ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,204 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు. సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు గతేడాది కంటే రూ.170.58 కోట్లు తక్కువ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019–20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017–18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయిం చింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు. -
మోసం చేయడానికే.. ‘అన్నదాత సుఖీభవ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సీఎం చంద్రబాబు నాయుడు స్తోత్రంలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇది మధ్యంతర బడ్జెటో లేక పూర్తిస్థాయి బడ్జెటో టీడీపీ నాయకులకే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ రాబోయే ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడారు. ఇది కేవలం ఎన్నికల బడ్జెటే అంటూ తేల్చిచెప్పారు. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప నిజంగా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గాలు లేవన్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, బాబు మాయ మాటలను నమ్మరని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయని చంద్రబాబు.. రైతులను మరోసారి మోసగించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు సరిగా లేవని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదించిన రైతు రుణమాపీలో ఇంకా రూ.8,200 కోట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నాటికి రైతుల అప్పులు రూ.1.37లక్షల కోట్లకు చేరాయని ఆయన అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఇళ్ల మంజూరు కేవలం రూ.4,099 కోట్ల రూపాయల కేటాయింపులతో ఎలా సాధ్యమని రామకృష్ణ ప్రశ్నించారు. -
తొలి బడ్జెట్లోనే పెట్రోల్‌పై పన్ను భారం..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి రాష్ట్ర అసెంబ్లీలో గురువారం జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖనూ పర్యవేక్షిస్తున్న కుమారస్వామి మిగులు బడ్జెట్‌ను సాధించడమే తన లక్ష్యంగా స్పష్టం చేశారు. తొలి బడ్జెట్లోనే పెట్రోల్, డీజిల్‌లపై పన్ను భారాలను మోపారు. పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న పన్నును 30 నుంచి 32 శాతానికి, డీజిల్‌పై 19 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ 1.14, డీజిల్ రూ 1.12 మేర పెరగుతాయని చెప్పారు. ఇక తొలి విడతగా 2017 డిసెంబర్ 31 వరకూ ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. సకాలంలో రుణాలను చెల్లించిన రైతులకు ప్రోత్సాహకరంగా బకాయిలు లేని రైతులకు రూ 25,000 నగదు లేదా వారు చెల్లించిన రుణంలో ఏది తక్కువైతే దాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రుణాల మాఫీతో రైతులకు రూ 34,000 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని కుమారస్వామి చెప్పారు. రైతులకు తాజా రుణాలు లభించేలా బకాయిలు రద్దయినట్టు బ్యాంకుల నుంచి రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేస్తామని వెల్లడించారు. దీనికోసం 2018-19 బడ్జెట్లో రూ 6,500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. -
కేంద్ర నిధుల రాబడిలో భారీ లోటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే ఆదా యాన్ని అమాంతంగా పెంచి చూపారని, వాస్తవానికి వాటిలో సగం నిధులూ రావడం లేదని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు. 2014–15 నుంచి 2017–18 వరకు కేంద్రం నుంచి రూ.75,535 కోట్లు వస్తా యని అంచనా వేయగా.. రూ.33,125 కోట్లే వచ్చాయని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. జనంపై ఏటేటా పన్నుల భారం పెరుగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలకు కేటాయింపులు పెంచుతూ.. విడుదల చేస్తున్న నిధులు తగ్గిస్తున్నార న్నారు. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 72% నిధులు వస్తున్నాయని, బడ్జెట్లో నగరానికి పెద్దపీట వేయాలని కోరారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘డబుల్’ఇళ్ల హామీతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలు విజయం సాధించాయని.. సత్వరం ఆ ఇళ్లు పూర్తి చేయాలని కోరారు. మిగులుంటే ఖర్చు చేయడం లేదేం?: కిషన్‌రెడ్డి బడ్జెట్లో రూ.5,525 కోట్లను మిగులుగా చూపారని.. మిగులు ఉంటే ప్రతి నెలా చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోందని బీజేపీపక్ష నేత జి.కిషన్‌రెడ్డి నిలదీశారు. ఫీజులు, స్కాలర్షిప్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, పరిశ్రమలకు రాయితీల బకా యిలు వంటివి సకాలంలో ఎందుకు చెల్లించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీని నెరవేర్చడం లేదేమని ప్రశ్నించారు. ప్రభుత్వం నామమాత్రంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోందని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. -
ఎన్నారై పాలసీకి ఈ బడ్జెట్ తొలిమెట్టు
(నిజామాబాద్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.100 కోట్లు ఎన్ఆర్ఐ సెల్‌కు కేటాయించింది. తొలిసారిగా ఎన్ఆర్ఐ సెల్‌కు బడ్జెట్లో నిధులు కేటాయించినా ఈ నిధుల వినియోగంపై విధి విధానాలు వెల్లడించ లేదు. సాధారణ పరిపాలన శాఖలో ఎన్ఆర్ఐ సెల్ ఒక విభాగంలా ఉంది. ఇప్పటివరకు ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక శాఖ అంటూ ఏమీ లేదు. కేవలం ఎన్ఆర్ఐ సెల్ మాత్రమే ఉంది. ఎన్ఆర్ఐ సెల్‌కు తొలిసారి రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని ప్రవాస భారతీయులు స్వాగతిస్తున్నారు. కానీ ఈ నిధుల వినియోగంపై స్పష్టత లేక పోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఈ నిధులను ఏ విధంగా వినియోగిస్తారో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. ఎన్ఆర్ఐ సెల్ అన్ని దేశాల్లోని ప్రవాస భారతీయుల కోసం పనిచేస్తుంది. అయితే తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. ఆ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎంతో మంది సరైన జీతం పొందలేకపోవడంతో పాటు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల మరణిస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.100 కోట్ల నిధుల నుంచి గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి ఎంతమేరకు ఖర్చు చేస్తుందో వెల్లడి కావాల్సి ఉంది. 2014కు ముందు గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాల వల్ల మరణించిన వారి సంఖ్య వెయ్యి ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మరణించిన వారి సంఖ్య 600 వరకు ఉంది. ఈ బాధిత కుటుంబాలకు ఈ బడ్జెట్ నుంచి ఎంత మేరకు సహాయం అందిస్తారో వివరంగా ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఎన్నారై పాలసీకి ఈ బడ్జెట్ తొలిమెట్టు 2016 జులై 27న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నారై పాలసీ మీటింగ్‌కు నేను హాజరయ్యాను. చాలా మంది ప్రవాస భారతీయులం ఎన్నో సలహాలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేశాము. ప్రభుత్వానికి స్పష్టమైన ప్రవాసీ విధానం ఉంటే సంక్షేమంతోపాటు, అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఈ బడ్జెట్లో ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించడం సంతోషకరం. రాబోయే ఎన్నారై పాలసీకి ఈ బడ్జెట్ తొలిమెట్టు. నేను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నారై మంత్రి కేటీఆర్‌లను కలిసి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించాను. వారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం త్వరలోనే ఎన్నారై పాలసీ ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం విదేశాలలోని తెలంగాణ ఎన్నారైలను గుడ్‌విల్ అంబాసిడర్లుగా నియమించి ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసే ఆలోచనలో ఉన్నది. – డాక్టర్ మోహన్ గోలి, టీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వయిజరీ బోర్డు మెంబర్ వెయ్యి కోట్లు అనుకుంటే.. వందతో సరిపెట్టారు ఎన్నో ఆశలతో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డలను ఆదుకోవడానికి సమగ్రమైన ప్రవాసీ విధానాన్ని ప్రవేశ పెట్టా లి. కనీసం వెయ్యి కోట్లు కేటాయిస్తారనుకుంటే కేవలం వంద కోట్లతో సరిపెట్టారు. కువైట్ క్షమాబిక్ష పథకంలో వలసకార్మికులకు సహాయపడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై మంత్రిని, ఏపీ ఎన్నార్టీ(నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ) చైర్మన్‌ను కువైట్‌కు పంపించి వారి బాగోగులను పట్టించుకున్నది. అవసరమైనవారికి ఉచిత విమాన ప్రయాణ టికెట్లు సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఎందుకు స్పందించలేదు. –వార్ల మృణాళిని, కువైట్ ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ -
రాయదుర్గం టు ఆర్జీఐఏ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు మార్గాన్ని రాయదుర్గం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు (31 కి.మీ) పొడిగించేందుకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించింది. మరో రూ.200 కోట్ల నిధులను మెట్రో మొదటి దశ పనులకు కేటాయించింది. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ (30 కి.మీ) మార్గంలో మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. తాజాగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గానికి సైతం పాత అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ నాటికి ఎల్బీనగర్–అమీర్‌పేట్, హైటెక్‌సిటీ–అమీర్‌పేట్ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్ గత నాలుగేళ్లుగా మెట్రోరైలుపై ఏర్పాటు చేస్తున్న ప్రతి సమీక్ష సమావేశంలో సూచిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు 31కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో రూ.400కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ, సాధ్యాసాధ్యాల పరిశీలన, స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలు గుర్తించడం, అవసరమైన భుములు, ఆస్తులు సేకరించడం, రహదారుల విస్తరణ, బాధితులకు పరిహారం చెల్లించడం తదితర పనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా ఈ మార్గంలో ఒక్కో కిలోమీటర్ దూరానికి రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.6,200 కోట్లు వ్యయం కానుంది. ఈ స్థాయిలో నిధులను ప్రభుత్వం ఏదేని ఆర్థిక సంస్థ నుంచి రుణంగా సేకరిస్తుందా? లేదా మెట్రో మొదటి దశ తరహాలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం లేదా హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపడుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా ప్రభుత్వం గతేడాది బడ్జెట్లో మెట్రోకు రూ.200 కోట్లు కేటాయించింది. తొలిదశకే ఆపసోపాలు... ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో మెట్రో మొదటి దశను చేపట్టిన విషయం విదితమే. ఈ పనులకే రూ.14,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆస్తుల సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో మెట్రో నిర్మాణ గడువు 18 నెలలు పెరిగి నిర్మాణ వ్యయం రూ.3వేల కోట్లకు చేరిందని నిర్మాణ సంస్థ గగ్గోలు పెడుతోంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ వరకు మెట్రో మార్గాన్ని చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది తేలాల్సి ఉంది. -
బొల్లారం – సికింద్రాబాద్
సాక్షి, సిటీబ్యూరో: రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటికే విద్యుదీకరణ, రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు పూర్తి చేసుకున్న 12.5 కిలోమీటర్ల మల్కాజిగిరి–బొల్లారం ఎంఎంటీఎస్ రెండో దశ మార్గంలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇటు సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్ వరకు, అటు కాచిగూడ నుంచి మల్కాజిగిరి, బొల్లారం మీదుగా మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకలకు అవకాశం కలగనుంది. 2013లో రూ.810 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశలో మొత్తం 6 లైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బొల్లారం–మల్కాజిగిరి పూర్తయింది. త్వరలో పటాన్చెరు–తెల్లాపూర్, సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గాలు కూడా పూర్తి కానున్నాయి. రెండో దశకు అయ్యే వ్యయంలో సుమారు రూ.544 కోట్లను రాష్ట్రమే భరించాల్సి ఉండగా... గతంలో రూ.160 కోట్లు, ప్రస్తుతం రూ.50 కోట్లు కేటాయించింది. ఇంకా రూ.334 కోట్ల వరకు రాష్ట్రం అందజేయాల్సి ఉంది. మిగతా మొత్తాన్ని రైల్వేశాఖ భరిస్తోంది. సింగిల్ లైన్లను డబ్లింగ్ చేయడం, విద్యుదీకరించడం, అవసరమైన చోట కొత్తలైన్లు వేయడం వంటి నిర్మాణ పనులను ఈ ప్రాజెక్టు కింద చేపట్టారు. కొత్తగా ఎంఎంటీఎస్ రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. అలాగే అల్వాల్, సుచిత్ర, భూదేవీనగర్ తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు కూడా నిర్మించాల్సి ఉంది. ఆరేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టినప్పటికీ నిధుల కొరత, భూ సేకరణలో సమస్యలతో తీవ్ర జాప్యం జరిగింది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేసి విద్యుదీకరించాల్సి ఉంది. ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల కొత్త లైన్లు నిర్మించి, అక్కడ రైల్వే స్టేషన్ కట్టాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ జీఎమ్మార్ నిరాకరించడంతో అది వాయిదా పడింది. మిగతా సెక్టార్లలో పనులు కొనసాగుతున్నాయి. 2019 చివరి నాటికి దశలవారీగా ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. -
జలమండలికి రూ.1,420.5 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్లో జలమండలికి ఆశాభంగమే ఎదురైంది. జలమండలి రూ.2,915 కోట్లు ప్రతిపాదించగా... ప్రభుత్వం అందులో సగమే రూ.1,420.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులు గతేడాదితో సమానం కావడం గమనార్హం. ప్రస్తుత నిధుల్లో కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ పథకాలకు జలమండలి హడ్కో సంస్థ నుంచి తీసుకున్న రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకు రూ.670.5 కోట్లు కేటాయించింది. మరో రూ.750 కోట్ల నిధులతో కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణం, ప్రధాన నగరం, శివార్లు, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో మంచినీటి వసతుల కల్పన, రోజూ నీళ్లు (డైలీ వాటర్ స్కీమ్), రక్షిత మంచినీటి ప్రణాళిక అమలు, మూసీకి ఆనుకొని మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం, కోర్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అధునికీకరణ, ఔటర్ చుట్టూ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు, నాన్ రెవెన్యూ వాటర్ తగ్గింపు, నీటి మీటర్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు వీటిని వ్యయం చేయాలని నిర్దేశించడం విశేషం. కాగా పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న బోర్డుకు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ.5,200 కోట్ల రుణాలు భారంగా పరిణమించాయి. మరోవైపు ప్రతి నెలా రూ.95 కోట్ల రెవెన్యూ ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ... విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు వెరసి ప్రతి నెలా ఖర్చు రూ.130 కోట్లవుతోంది. దీంతో ప్రతి నెలా రూ.35 కోట్ల లోటుతో బోర్డు నెట్టుకొస్తోంది. జలమండలికి 2016–17లో రూ.వెయ్యి కోట్లు, 2017–18లోరూ.1420.5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. -
ఆర్టీసీకి అంతంతే!
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్లో గ్రేటర్ ఆర్టీసీకి అరకొర నిధులే దక్కాయి. ప్రతిరోజు సుమారు 33లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న గ్రేటర్ ఆర్టీసీ... రూ.350 కోట్లకు పైగా నష్టాల్లో కూరుకొని ఉంది. వెయ్యికి పైగా డొక్కు బస్సులే దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త బస్సుల కొనుగోళ్లకు, ఆర్టీసీ బలోపేతానికి తాజా నిధులు ఏ మాత్రం భరోసానివ్వలేవని ఆర్టీసీ కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీకి ఈ బడ్జెట్లో రూ.975 కోట్లు కేటాయించినట్లు అంకెల గారెడీలు చేసినప్పటికీ... ఇందులో బస్‌పాస్‌లు, ఇతర రాయితీల కోసం కేటాయించే నిధులే ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది. పైగా ఇవి తెలంగాణ మొత్తానికి కేటాయించిన నిధులు. ఇందులో గ్రేటర్ ఆర్టీసీకి రూ.130కోట్ల వరకు లభించవచ్చునని అంచనా. కానీ ఆ డబ్బుల్లో ఎక్కువ భాగం విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు తదితర వర్గాల బస్‌పాస్‌లకే ఖర్చయ్యే అవకాశం ఉంది. నష్టాల బాట నుంచి గట్టెక్కే అవకాశం మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. -
కళాభారతి కథే లేదు!
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్లో సీఎం కలల స్వప్నం కళాభారతి ప్రస్తావనే లేదు. జాతీయ కళావేదిక రవీంద్రభారతికి రూ.2 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. భాషా సాంస్కృతిక శాఖ రూ.103 కోట్లతో ప్రతిపాదనలు పంపగా... అందులో సగమే రూ.58 కోట్లు కేటాయించింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఏటా బోనాలు, బతుకమ్మ, రాష్ట్ర అవతరణ దినోత్సవం తదితర ప్రభుత్వ వేడుకల్లో సాంస్కృతిక శాఖది ముఖ్య భూమిక. తెలంగాణ మహనీయుల పేరుతో అవార్డులు అందిస్తూ, వారి జయంతి, వర్ధంతి నిర్వహిస్తోంది. ఇవన్నీ దిగ్విజయంగా జరగాలంటే రూ.103 కోట్లు పైనే ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికిప్రతిపాదనలు పంపగా.. బడ్జెట్లో మాత్రం రూ.58 కోట్లు కేటాయించింది. కాకపోతే గతేడాదితో పోలిస్తే రూ.12కోట్లు పెంచారు. వీటిలో దాదాపు రూ.3.5 కోట్లతో మన టీవీ కార్యాలయంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నారు. సాహిత్య అకాడమీకి రూ.4 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో మళ్లీ ఎప్పటి మాదిరి వివిధ వేడుకలనిర్వహణకు ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిధులతోనేఅంతర్జాతీయ ఫెస్టివల్, థియేటర్, ఆర్ట్ ఫెస్టివల్స్, ఏప్రిల్ 1 నుంచి జూన్ 2 వరకు నిరంతర కళారాధన నిర్వహించాలనినిర్ణయించారు. ఇక సాంస్కృతిక సారథికి రూ.20 కోట్లు అవసరం కానున్నాయి. ఇవన్నీ పోను కళలను బతికించుకునేందుకు, కళాకారులకు చేయూతనిచ్చేందుకుకార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఇది ఎలా సాధ్యమని పలువురు వాపోతున్నారు. పర్యాటకాభివృద్ధిని మరిచారు... రాష్ట్ర ఆదాయ వనరుల్లో పర్యాటక శాఖ ఒకటి. దీనికి గుండెకాయ లాంటిదైన తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)ని ప్రభుత్వం విస్మరించింది. బడ్జెట్లో అరకొరగా రూ.30 కోట్లు కేటాయించింది. మరిన్ని నిధులు కేటాయించి హరిత హోటల్స్, ఇతర హేరిటేజ్ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించలేదు. -
‘ట్విన్ టవర్స్’ నిధులు అదుర్స్
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం నగర పోలీసు విభాగానికి పెద్దపీట వేసింది. హోంశాఖకు మొత్తం రూ.1389.66 కోట్లు కేటాయించగా... ఇందులో రూ.574.2 కోట్లు (41.3 శాతం) నగర పోలీసు విభాగానికి దక్కాయి. ‘ట్విన్ టవర్స్’గా పిలిచే బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మించనున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (ఐసీసీసీ) మూడో విడతగా రూ.280.8 కోట్లు కేటాయించడం గమనార్హం. ‘పది లక్షల కళ్ల’ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాజెక్టుకు రూ.140 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.509 కోట్లు కేటాయించగా... ఈసారి కేటాయింపులు రూ.63 కోట్లు పెరిగాయి. పోలీసు అధికారులు ప్రతిపాదనలకు అనుగుణంగానే కేటాయింపులు ఉండటం విశేషం. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు రూ.42.97 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి. దాదాపు రెండేళ్ల క్రితం ఏర్పడిన రాచకొండకు పోలీసు కమిషనరేట్ నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించింది. ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు.. బంజారాహిల్స్‌లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.280.8 కోట్లు కేటాయించారు. నిర్మించతలపెట్టిన దాని కంటే ఎత్తు తగ్గడం, తదితర కారణాల నేపథ్యంలో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. మౌలిక వసతులకు రూ.10కోట్లు.. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌లో భాగంగా పోలీసుస్టేషన్ల స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆధునిక హంగులతో కూడిన ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల ఏర్పాటు, ప్రత్యేకంగా రిసెప్షన్ తదితరాల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. కొత్తగా పోలీసుక్వార్టర్స్ నిర్మాణం, అభివృద్ధి, అధికారుల కార్యాలయాలు, సిబ్బందికి బ్యారెక్స్, యంత్రసామాగ్రి కొనుగోలు కోసం రూ.40 కోట్లు కేటాయించారు. ‘ట్రాఫిక్ టెక్నాలజీ’కి రూ.10 కోట్లు.. నగర ట్రాఫిక్ విభాగం ప్రమాదాల నిరోధం, నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, విధి నిర్వహణలో పారదర్శకతలకు ప్రాధాన్యం ఇస్తూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పథకం కింద ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఈ ఏడాది రూ.10 కోట్లు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమేయం లేకుండా ట్రాఫిక్ నిర్వహణ, ఉల్లంఘనుల గుర్తింపు, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీ లక్ష్యాలుగా ఉన్న ఈ ప్రాజెక్టుకు తుది దశకు చేరింది. దీంతో పాటు జీపీఎస్ టెక్నాలజీతో పని చేసే డిజిటల్ కెమెరాలు, 3 జీ కనెక్టివిటీతో పని చేసే చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు, ఇతర ఊపకరణాలకు నిధులు కేటాయించారు. ఈ కోణంలో సైబరాబాద్‌కు రూ.5 కోట్లు, రాచకొండకు రూ.కోటి కేటాయించింది. రూ.12 కోట్లతో వ్యవస్థీకృత నేరాలకు చెక్ సైబర్ నేరాలతో పాటు వ్యవస్థీకృతంగా రెచ్చిపోతున్న ముఠాల పైనా నగర పోలీసులు సాంకేతిక యుద్ధం చేయనున్నారు. దీనికి అవసరమైన సాఫ్ట్వేర్స్, ఇతర ఉపకరణాలు ఖరీదుతో పాటు క్రైమ్ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకుగాను సర్కారు రూ.12 కోట్లు కేటాయించింది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో భాగంగా పోలీసు విభా గం అనేక ఎనలటిక్స్‌ను సమకూర్చుకుంటోంది. నేరగాళ్ల కదలికలపై నిఘా, అనుమానితుల గుర్తింపు తదితరాల కోసం వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సైబర్, క్రైమ్ ల్యాబ్స్‌తో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌లో భారీ స్థాయిలో బ్యాక్ఎండ్ సేవలు చేసే సాఫ్ట్‌వేర్స్‌తో పాటు వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్, రిట్రీవ్ సాఫ్ట్వేర్స్ సమీకరించుకున్నారు. ఈ బడ్జెట్‌తో అవసరమైన అదనపు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉన్న వాటి అభివృద్ధికి వీటిని వెచ్చించనున్నారు. సైబరాబాద్‌లో ఈ పద్దు కింద రూ.5 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది. రాచకొండ కమిషనరేట్‌కు నిధులు.. 2016లో ఆవిర్భవించిన రాచకొండ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా కమిషనరేట్ భవనం లేకపోవడంతో ఇప్పటికీ గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్‌లోనే కొనసాగుతోంది. సరూర్‌నగర్‌లోని వీఎం హోమ్ స్థలాన్ని కేటాయించినా... కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీం తో రంగారెడ్డి జిల్లాలో 56 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకు ంది. గురువారం నాటి బడ్జెట్లో కమిషనరేట్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు కేటాయించారు. డేగ‘కళ్ల’ కోసం రూ.140కోట్లు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.140 కోట్లు కేటాయించింది. సైబరాబాద్‌కు రూ.6 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది. ప్రతిపాదనల మేరకు కేటాయింపులు రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి ప్రతిపాదనల మేరకు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రతి ఠాణాను మోడల్‌గా మార్చడానికి, ట్రాఫిక్ స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేస్తాం. కమిషనరేట్ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇది తొలి దఫా నిధులు మాత్రమే. భూమి స్వాధీనం, అభివృద్ధి పూర్తి చేసిన తర్వాత రెండో దఫాగా అవసరమైన మొత్తం ప్రతిపాదిస్తాం. – మహేష్ మురళీధర భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
రైతు కానుకగా భారీ పద్దు!
-
రైతు కానుకగా భారీ పద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఐదో భారీ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ అదే పంథాను అనుసరించనుంది. సుమారు రూ.1.81 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. నేడు ఉదయం 11 గంటలకు.. బడ్జెట్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రివర్గం.. 2018–19 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆయన వరుసగా ఐదో బడ్జెట్ పెట్టనుండడం గమనార్హం. ఇక శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెడతారు. గతేడాది ప్రభుత్వం రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ప్రగతి పద్దుకు రూ.88,038 కోట్లు, నిర్వహణ పద్దుకు రూ.61,607 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయానికి పెద్దపీట నాలుగేళ్లలో రైతుల రుణమాఫీకి రూ.17 వేల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతుల కోసం భారీ వ్యయంతో కూడిన పథకా న్ని ఆవిష్కరిస్తోంది. దేశంలోనే వినూత్నంగా రైతులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేయనుంది. ఏటా రెండు పంట సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రైతులక్ష్మి పేరిట అమలు చేయనున్న ఈ పథకానికి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించనుంది. దీంతోపాటు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించే పథకాన్ని అమలు చేయనుంది. దీనికి రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75 వేల నుంచి రూ.1,00,116కు పెంచనుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఈ ఏడాది రూ.5,400 కోట్ల సబ్సిడీ చెల్లించనుంది. నిరుటి అంచనాలకు ఇంకా దూరమే! ఆదాయ వృద్ధి గణనీయంగా పెరిగినా.. గత బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం ఇప్పటికీ అందుకోలేకపోయింది. జీఎస్టీ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడి రూ.1.20 లక్షల కోట్లకు మించే అవకాశం లేదు. ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన నివేదికల ప్రకారం జనవరి నెలాఖరు వరకు తొలి పది నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ.66,116 కోట్లు వచ్చింది. ఇక కేంద్రం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచడంతో అదనపు అప్పు సమకూరింది. బడ్జెట్‌తోపాటు రెండు బిల్లులు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రెండు బిల్లులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర డీజీపీ నియామక అధికారం రాష్ట్రం చేతుల్లోనే ఉండేలా రూపొందించిన ‘హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్సెస్ యాక్ట్–2018’బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇక వైద్యవిద్యలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధనను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లును కూడా ఆమోదించింది. వీటితోపాటు నీటి పారుదల శాఖలో భారీ కార్పొరేషన్ ఏర్పాటు, సాయి సింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల స్థలం కేటాయింపు, విదేశీ భవన్‌కు రెండు ఎకరాలు, రాచకొండ కమిషనరేట్‌కు 56 ఎకరాల స్థలం కేటాయింపులు, ఛనాకా–కొరట ప్రాజెక్టు పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను చేర్చే అంశాలపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త పంచాయతీరాజ్ బిల్లుపై కేబినెట్ చర్చించినా.. ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టాలా.. వేచి చూడాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ అనంతర పరిణామాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ‘సాగు నీటి’కి రుణాలే..! సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో రూ.20 వేల కోట్ల మేర కేటాయించే అవకాశాలున్నాయి. కాళేశ్వరం, పాలమూరు కార్పొరేషన్ల ద్వారా రుణాలను సమీక రించనున్నారు. వివిధ సందర్భాల్లో సీఎం ప్రకటించిన కొత్త వరాలన్నింటికీ తాజా బడ్జెట్లో చోటు కల్పించనున్నారు. వైద్యారోగ్య రంగానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించే అవకాశాలు న్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు రూ.12 వేల చొప్పున ప్రోత్సాహకం, కేసీఆర్ కిట్ పంపిణీ పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులను సమీకరించనున్నారు. వీటికి బడ్జెటేతర కోటా లో రుణాలు సమీకరించనున్నారు. ఇక సబ్సిడీపై గొర్రెలు, బర్రెలు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూతనిచ్చేందుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తారు. ప్రగతిపద్దులో 15 శాతం తగ్గకుండా ఎస్సీ అభివృద్ధి నిధి, 9 శాతం తగ్గకుండా ఎస్టీల అభివృద్ధికి ని«ధులు కేటాయించనున్నట్లు తెలిసింది. -
ఈ లెక్కలెలా నమ్మాలి బాబూ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వసనీయత కనిపించడం లేదని.. ఇంత తప్పుల తడకలతో కూడిన బడ్జెట్‌ను ఎన్నడూ చూడలేదని అధికార వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. బడ్జెట్ గణాంకాలు కూడా వారి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలని అందరం కోరుకుంటామని.. కానీ కేంద్రం నుంచి రాని నిధులు కూడా వస్తాయంటూ బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించడం ప్రజల్ని మోసం చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ కింద కేవలం రూ.138 కోట్లు మాత్రమే వస్తాయని కేంద్రం ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బడ్జెట్ పెట్టడానికి ముందు కూడా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారని.. అయినా కూడా రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం నుంచి రూ.12,099 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. మన రాష్ట్రానికి ఏఏ నిధులు వస్తాయో అందులో స్పష్టం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు భర్తీ కింద కేటాయింపులు చేయకుండా.. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు వస్తాయని ప్రతిపాదించడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. అలాగే వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్ర బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మాత్రం కేంద్రం నుంచి రూ.350 కోట్లు వస్తాయని ప్రతిపాదించడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రాని నిధులను కూడా వస్తాయంటూ భారీగా ప్రతిపాదించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.9000 కోట్లు వస్తాయని పేర్కొనడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. ఇలాంటి అంకెల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి ప్రయోజనం ఉండదని.. కేవలం ప్రచారం చేసుకోవడానికే పనికివస్తుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం
సాక్షి, అమరావతి: సమసమాజ లక్ష్య సాధన కోసం సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. స్థూల ప్రణాళికలు, సూక్ష్మ అమలు.. అనే విధానంతో తాను ప్రవేశపెట్టే వివిధ పథకాలు తమ ప్రభుత్వ ఉద్దేశాలను ద్విగుణీకృతం చేస్తాయని తనకు గట్టి నమ్మకం ఉందన్నారు. సాధ్యమైన ఆదాయ వనరులను మదింపు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన అన్ని బకాయిలు అందుతాయనే ఆకాంక్షతో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరుల అంచనాలను ప్రాధాన్యాలతో సర్దుబాటు చేయడం కష్టమైన చర్యని పేర్కొన్నారు. అన్ని వర్గాల జీవనాన్ని మెరుగుపర్చడమే ప్రభుత్వ పథకాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించారు. అనేక సవాళ్ల మధ్య కూడా పట్టుదల, దృఢ చిత్తంతో మనం సాధిస్తున్నపురోగతి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2017 –18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే బడ్జెట్ 21.70 శాతం పెరిగిందని వివరించారు. మొత్తం 52 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని సరిగ్గా మధ్యాహ్నం 11.29 గంటలకు ప్రారంభించి, 12.55కు పూర్తిచేశారు. రూ.19 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.19,070 కోట్లతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.18602.98 కోట్లు కాగా 467.38 కోట్లు పెట్టుబడి వ్యయం. రైతు సంక్షేమం, పంటల ఉత్పాదక పెంపే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రుణమాఫీకి రూ.4,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
వ్యవసాయ బడ్జెట్‌పై సర్కారు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపింది. ఎన్నికలకు ముందు ఇదే ఆఖరి, పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో కొత్త పథకాలుంటాయనే అంచనాలకు తెరపడింది. అందరి దృష్టి జాతీయ రాజకీయాల వైపు మళ్లడంతో ఈసారి కొత్త పథకాలు, కొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. శాఖలవారీగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి అడ్డుగా ఉండటమే ఇందుకు కారణం. 2018–19 రాష్ట్ర బడ్జెట్‌తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే అంశాలపై మంత్రులు, ఆర్థికశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఈసారి బడ్జెట్లో వ్యవసాయదారుల కోసం మరిన్ని కార్యక్రమాలు, పథకాల కోసం నిధులు కేటాయిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీని సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చ జరిగింది. అయితే మొత్తం ప్రభుత్వానికి ఒకే బడ్జెట్ ఉండాలని, శాఖలవారీగా ప్రత్యేక బడ్జెట్లు ప్రవేశ పెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ నియమావళిలోని రూల్ నంబర్ 150 ప్రకారం ఆదాయ, వ్యయాలు మాత్రమే బడ్జెట్ కిందకు వస్తాయని వివరించారు. ఇతరత్రా ప్రణాళికలు, వివరణలన్నీ పద్దుల కిందకే వస్తాయిగానీ, ప్రత్యేక బడ్జెట్ కింద పరిగణించడానికి వీలు లేదని అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకసారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టడం వివాదాస్పదమైందని అధికారులు చెప్పారు. కేంద్రంలోనూ రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్లోనే కలిపి ప్రవేశపెడుతున్న విషయాన్ని సీఎంకు వారు వివరించారు. దీంతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, ప్రవేశ పెడుతున్న పథకాలు, వెచ్చిస్తున్న నిధులను బడ్జెట్లోనే వివరించాలని సీఎం చెప్పారు. కొత్త పథకాలకు బ్రేక్... వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్నే అత్యంత ప్రతిష్టాత్మకంగా బడ్జెట్లో ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఎకరానికి రూ. 8 వేల చొప్పున 76 లక్షల మంది రైతులకు సాయం అందించే ఈ పథకానికి దాదాపు రూ. 11 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించనుంది. కల్యాణలక్ష్మి పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. లక్షకు పెంచడం మినహా కొత్త పథకాల జోలికి వెళ్లకూడదని సూచనప్రాయంగా నిర్ణయించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూ. 2,000 చొప్పున నెలసరి భృతి అందించేందుకు చేసిన ప్రాథమిక కసరత్తును సైతం ప్రభుత్వం తాత్కాలికంగా పక్కనబెట్టింది. బడ్జెట్లో ఈ అంశాన్ని పొందుపరచాలా వద్దా అనేది ముఖ్యమంత్రి తుది నిర్ణయంపై ఆధారపడి ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఆసరా పెన్షన్లను రూ. 500 చొప్పున పెంచే ప్రతిపాదన కూడా పునరాలోచనలో పడింది. -
మార్చి 14 లేదా 15న బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: 2018–19 వార్షిక బడ్జెట్‌ను మార్చి 14 లేదా 15న ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని భావిస్తోంది. పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి వీలుగా సమావేశాలు రెండు వారాలు జరగవచ్చు. పంచాయతీరాజ్ కొత్త చట్టం బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ప్రకటించారు. సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో మరిన్ని జనాకర్షక పథకాలుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాఖల ప్రతిపాదనలు, కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ.61,607 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88,038 కోట్లు కేటాయించింది. ఈసారి భారీ అంచనాలుండటం, ఆదాయ వృద్ధీ ఆశించినంతగా ఉండటంతో భారీ బడ్జెట్‌ను ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. రూ.1.8 లక్షల కోట్ల మేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పెట్టుబడి సాయం.. రైతు బీమా రెండేళ్ల కిందట సాగునీటికి స్పష్టమైన కేటాయింపులతో కొత్త అధ్యాయానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది. ఇది బడ్జెట్‌కు అనుబంధంగా ఉంటుంది. సాగుకు రూ.15 వేల కోట్లు కేటాయించవచ్చు. ఖరీఫ్, రబీ పంటలకు కలిపి ఏడాదికి ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సాయమందించే పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్ నుంచే రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తోంది. ఈ పథకానికి తొలి ఏడాది రూ.12 వేల కోట్లు కావాలని అంచనా. సీఎం తాజాగా ప్రకటించిన మేరకు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, 50 శాతం సబ్సిడీపై నాటు వేసే యంత్రాలు, 75 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు, పంట రుణాలకు వడ్డీ రాయితీ తదితరాల నేపథ్యంలో సాగుకు ఈసారి భారీగా కేటాయింపులుండనున్నాయి. సాగునీటికి పెద్ద వాటా సాగునీటి ప్రాజెక్టులకు ఈసారీ భారీగా నిధులందనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తి చేయటంతో పాటు 50 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందించాలన్న లక్ష్య సాధనకు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పరిపూర్తి తదితరాలకు రూ.30 వేల కోట్ల దాకా కేటాయించవచ్చు. కొత్త పథకాలివే పాత పథకాలకు మెరుగులు దిద్దడంతో పాటు ఈసారి బడ్జెట్లో పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆసరా పెన్షన్ల మొత్తం, పరిధి పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం పెంపు, నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి తదితరాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిరుపేద గిరిజనుల ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పథకానికీ రూపకల్పన చేస్తోంది. అలాగే జనాభాను బట్టి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల దాకా ప్రభుత్వమే నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. -
8న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, అమరావతి: వచ్చే నెల 5వ తేదీన గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 8వ తేదీన 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను సభకు సమర్పించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ముందస్తు బడ్జెట్ కసరత్తు సమావేశాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించారు. కేంద్రం అవసరమైన నిధులివ్వలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సీఎం వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం నుంచి సక్రమంగా సాయం అందడం లేదన్నారు. మోసపోయామని, నష్టపోయామని ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తే వారు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టు పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై వివిధ ఏజెన్సీలు ఇస్తున్న ర్యాంకింగులను కూడా పరిగణనలోకి తీసుకుని పనితీరు మెరుగుపరుచు కోవాలన్నారు. రాష్ట్ర సుస్థిర వృద్ధి, ప్రజల సంతృప్తి లక్ష్యంగా రానున్న బడ్జెట్‌ను రూపొందాలని సూచించారు. -
బడ్జెట్ సమావేశాల్లోనే ‘పంచాయతీ’ బిల్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నిధులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నిధులతోపాటు ఆర్థిక సంఘం, రాష్ట్ర బడ్జెట్, ఆస్తి పన్నుల వసూళ్లు తదితర మార్గాల ద్వారా ఆదాయం సమకూరేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న పంచాయతీలు ఆర్థిక సంఘం నుంచి నిధులు ఏవిధంగా పొందవచ్చనే దానిపై అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు సూచించారు. ఆదివారం పంచాయతీరాజ్ ముసాయిదా బిల్లు పురోగతి, కొత్త పంచాయతీలు, నగర పంచాయతీల ఏర్పాటుపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు నిర్వహించి, కంటి పరీక్షలు చేయాలని.. అవసరమైన వారికి కళ్లద్దాలను ఉచితంగా అందజేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం మూడు నెలల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆసక్తి గల ఇతర వ్యవస్థలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై అవలంబించాల్సిన వ్యూహన్ని ఖరారు చేయాల్సిందిగా ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, కమిషనర్లను ఆదేశించారు. ఇక మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ పాస్ పుస్తకాల ముద్రణ పురోగతి, ధరణి వెబ్సైట్ ఏర్పాటుపై రెవెన్యూ, ఐటీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ పనులన్నీ అనుకున్న సమయంలోగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించారు. హైదరాబాద్ చుట్టూ ‘అర్బన్ ఫారెస్ట్’ హైదరాబాద్ నగరం చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అటవీ భూమిని కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. నగరం పరిధిలో, చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలను పరిశీలించి.. వాటి అభివృద్ధికి ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్, అటవీ శాఖల మంత్రులు, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావులకు అప్పగించారు. ‘సేవ్ హైదరాబాద్’లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నారు. హైదరాబాద్ పరిధిలో దాదాపు లక్షన్నర ఎకరాల మేర అటవీ భూమి ఉందని.. దాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన గాలి పీల్చుకునేలా ‘ఫారెస్ట్ బ్లాక్స్’ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్, హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, అవసరమైనన్ని నిధులు వెచ్చించాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్‌లో వాక్‌వే రూపొందించాలన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, తుమ్మల, జూపల్లి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతాం
తుని: 2018–19కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను మార్చిలో ప్రవేశపెట్టనున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ ముసాయిదా రూపకల్పన కోసం త్వరలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలకు నిధులు కేటాయిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చి, 13 జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. -
రూ. 25 వేల కోట్లిస్తేనే ప్రాజెక్టుల పరుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా జరగని నిధుల విడుదల కారణంగా చతికిలపడ్డ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తిరిగి గాడినపెట్టేందుకు నీటిపారుదలశాఖ మార్గాన్వేషణ మొదలు పెట్టింది. మెజారిటీ సాగునీటి ప్రాజెక్టులను జూన్ నాటికల్లా పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదలలో వేగం పెంచాలని సర్కారును కోరింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల బిల్లులన్నింటినీ చెల్లించడంతోపాటు అర్ధ వార్షికానికే రూ. 25 వేల కోట్ల మేర నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ పెద్దలకు నివేదించింది. బిల్లులు చెల్లించక నెమ్మదించిన పనులు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 25 వేల కోట్ల కేటాయింపులు చేసినా అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ప్రస్తుతం వరకు రూ. 5,046 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల పనులు నెమ్మదించగా ఆదిలాబాద్‌లోని కొమురం భీం సహా ఇతర మధ్యతరహా ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పనులు డీలా పడ్డాయి. బిల్లులు ఇవ్వనిపక్షంలో పనులు నిలిపివేస్తామనే హెచ్చరికలు మరికొన్ని చోట్ల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులపై ఇటీవలే సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్... బడ్జెట్ అవసరాలపై నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి జూన్ వరకు నెలవారీ బడ్జెట్ అవసరాల షెడ్యూల్ తయారు చేయాలని సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. దీంతో ఆమె సూచనల మేరకు జనవరి నుంచి జూన్ వరకు నెలవారీ వ్యయం, చేయాల్సిన పనులపై నీటిపారుదలశాఖ ప్రభుత్వానికి సమగ్ర వివరణ ఇచ్చింది. మొత్తంగా రూ. 25,128 కోట్ల అవసరాలను నివేదికలో చూపింది. ఇందులో పాత బకాయిలు రూ. 5,046 కోట్లను చెల్లించడంతోపాటు అదనంగా మరో రూ. 20,082 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరింది. ఒక్కో ఆర్థిక సంవత్సరానికి కేటాయిస్తున్న బడ్జెట్‌ను వచ్చే ఆరు నెలల్లోనే నెలకు రూ. 4 వేల కోట్లకు తగ్గకుండా ఇవ్వాలని పేర్కొంది. ఇందులో గరిష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ. 9 వేల కోట్ల మేర నిధులు అవసరమని నీటిపారుదలశాఖ తెలిపింది. మరోవైపు వచ్చే ఆరు నెలల వ్యవధిలో పూర్తయ్యే, గరిష్టంగా 8 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే పాలమూరు ప్రాజెక్టులకు పూర్తి నిధులు చెల్లించాలని కోరింది. -
అప్పు తెచ్చుకోండి... గ్యారెంటీ ఇస్తాం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపుల కన్నా అదనంగా బడ్జెట్ కావాలంటే అప్పు తెచ్చుకోండి... ఆ అప్పుకు గ్యారెంటీ ఇస్తామని చెబుతోంది రాష్ట్ర ఆర్థిక శాఖ. ఏ శాఖ ఏ కార్యక్రమానికి, ఏ పథకానికి అదనంగా నిధులు కావాలని అడిగినా ఆర్థిక శాఖ నుంచి ఇదే సమాధానం వస్తోందని పలు శాఖల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జలవనరులు, రహదారులు–భవనాల శాఖలు చేపట్టిన పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులకు కూడా ఇదే విధానాన్ని ఆర్థిక శాఖ అమల్లోకి తీసుకువచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల పనుల అంచనాలను పెంచేయడం, నామినేషన్‌పై పనులు అప్పగించడం యధేచ్ఛగా కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు అవసరమైన నిధులకోసం కొత్త మార్గాన్ని అన్వేషించారు. తొలి దశలో రహదారుల అభివృద్ధి సంస్థ, జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ల పేరుపై బ్యాంకుల నుంచి అప్పులు చేయనున్నారు. ఆ అప్పుల ద్వారా వచ్చిన నిధులను సాగునీటి కాంట్రాక్టర్లకు, రహదారులు–భవనాల కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించాలని నిర్ణయించారు. అంటే సొమ్ము ఒకరిది సోకు మరొకరిదనే చందంగా సాగుతోందని ఆయా శాఖల అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. అప్పుల సలహాలిచ్చేందుకు కన్సల్టెంట్లు మరోవైపు అంతర్గతంగా ఆర్థిక వనరులను సమీకరించుకోవడంతో పాటు వివిధ రూపాల్లో నిధుల సమీకరణ ఎలాగ చేయాలో సలహా ఇచ్చేందుకు కన్సల్టెంట్ల నియమకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అసలే అప్పుల భారంతో కునారిల్లుతున్న కార్పొరేషన్లకు అప్పులు ఎలా చేయాలో సలహా ఇవ్వడానికి రూ.కోట్లు చెల్లించి కన్సల్టెంట్లను నియమించడం హాస్యాస్పదంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఏ విధంగా నిధులను సమీకరించుకోవాలో చెప్పేందుకు కేపీఎంజీ కన్సల్టెంట్‌ను ఏడాది కాలానికి నియమించింది. ఆ సంస్థ ఏడాదిపాటు శ్రమించి... బ్యాంకుల ద్వారా అప్పులు చేసుకోవాలని సలహా ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.23 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పులు చేసి కాంట్రాక్టర్లకు చెల్లింపులు జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ పేరుపై తొలి దశలో రూ.3000 కోట్లు అప్పులు చేసేందుకు వీలుందని కేపీఎంజీ నివేదికను సమర్పించింది. ఆ మేరకు అప్పు చేసేందుకు జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.1000 కోట్ల మేర జలవనరుల అభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఆ అప్పు చేసిన నిధులను జలవనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పునకు గ్యారెంటీ ఇచ్చింది. ఆ అప్పు చేసిన నిధులను సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుకు విడుదల చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. సాగునీటి ప్రాజెక్టుల బిల్లులతో పాటు నీరు–చెట్టు పనులకు చెందిన బిల్లుల మొత్తం రూ.3000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. నీరు–చెట్టు కింద పనులన్నీ నామినేషన్‌పై చేశారని, వాటికి లెక్కా పత్రం లేకుండా ఉన్నందున ఆ బిల్లులు మినహా సాగునీటి ప్రాజెక్టుల పనులకు తొలుత బిల్లులు చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే రహదారుల అభివృద్ధి సంస్థ రూ.మూడు వేల కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే రహదారులు అభివృద్ధి సంస్థ రూ.వెయ్యి కోట్ల అప్పు చేసింది. ఆ నిధులను రహదారులు పనులకు చెందిన కాంట్రాక్టర్ల బిల్లులకు చెల్లిస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల తొలి అంచనాలు కాదని భారీగా పెరిగిపోతున్నాయని, దీంతో పాటు బడ్జెట్ కేటాయింపులకు మించి నిధులు కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలకు అప్పు తెచ్చుకోవడానికి అనుమతించామని, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పు చేయడానికి వీల్లేదని, అయితే గ్యారెంటీలు ఇవ్వడానికి అవకాశం ఉన్నందున సంస్థలు చేసే అప్పులకు గ్యారెంటీ ఇస్తున్నామని ఆ అధికారి వివరించారు. -
మళ్లీ ఖాళీ..
⇒ ప్రభుత్వ ఖాతాలు మరోసారి ఫ్రీజ్ ⇒ ట్రెజరీలో అన్నిరకాల చెల్లింపులు నిలిపివేత ⇒ గురువారం రాత్రి నుంచి ఫ్రీజ్‌లో ఖాతాలు ⇒ చెక్కులు తీసుకున్నా బ్యాంకుల్లో నగదు ఇవ్వని వైనం ⇒ నెల రోజుల్లో రెండోసారి ఈ పరిస్థితి ⇒ ప్రభుత్వ తీరుతో బిక్కముఖం వేస్తున్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులు గుడివాడ : ప్రభుత్వ ఖజానా మరోసారి నిండుకుంది. నెలలో రెండో సారి, అదీ లక్షా యాభై ఏడువేల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది. దీంతో ట్రెజరీ అధికారులు అన్ని రకాల చెల్లింపులను నిలుపుదల చేసి చేతులెత్తేశారు. గురువారం రాత్రి నుంచి అన్ని రకాల పద్దుల చెల్లింపులు ఫ్రీజింగ్లో ఉంచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఖజానా చెక్కులు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన వారు తెల్లముఖం వేసి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. నెలలో ఇది రెండోసారి ఖాతాలను ఫ్రీజింగ్ చేయడం గమనార్హం. ఫలితంగా ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసినవారు బిల్లులను నగదుగా మార్చుకోలేక ఆందోళన చెందుతున్నారు. అన్ని ఖాతాలదీ అదే పరిస్థితి.. ప్రభుత్వ శాఖలకు సంబంధించి మున్సిపాల్టీ, ఇతర ప్రభుత్వ శాఖలు, 13, 14వ ఆర్థిక సంఘాల నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఉన్న అన్ని ఖాతాలు నిలుపుదల చేశారు. కనీసం సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆన్లైన్ ద్వారా ఫ్రీజింగ్లో ఉంచటంతో అధికారులు అవాక్కయ్యారు. గత నెల 8న ఫ్రీజింగ్లో ఉంచిన ప్రభుత్వం దాదాపు నెలరోజులపాటు తీయలేదు. ఈ నెలలో ప్రారంభమైన శాసన సభ బడ్జెట్ సమావేశాల ముందు ఫ్రీజింగ్ ఎత్తి వేశారు. బడ్జెట్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని ఖాతాలు ఫ్రీజింగ్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం అనేక కార్యాలయాలు ఈ గవర్నెన్స్ విధానంలో పనిచేయడంతో బిల్లులు, జీతాలు చెల్లింపులు చెక్కులు ఇచ్చే సమయంలో సంబంధిత బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్లో నమోదు చేస్తేనే బ్యాంకుకు వెళ్లాలి. ఖాతాలు ఫ్రీజింగ్ అవ్వటంతో చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. వారం రోజులే చెల్లింపులు చేసింది... ఫిబ్రవరి 8న ప్రభుత్వ ఖాతాలు ఫ్రీజింగ్లో ఉంచిన ప్రభుత్వం మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి చెల్లింపులు జరపలేదు. మార్చి 16 వరకు మాత్రమే చెల్లింపులు జరిపారు. ఇంకా అనేక చెక్కులకు చెల్లింపులు జరపాల్సి ఉన్నా ఇవ్వలేదు. బ్యాంకు కు చెక్కులు తీసుకుని వెళ్తే గురువారం రాత్రి నుంచి ఫ్రీజింగ్ చేశారని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. చిరుద్యోగుల ఇక్కట్లు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే చిరుద్యోగులు, వీఆర్ఏలు, అంగన్వాడీలు, కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖాతాల ఫ్రీజ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు పొందే వీఆర్ఏలు, ఇతర శాఖల కాంట్రాక్టు సిబ్బందికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. కాంట్రాక్టర్లు అయితే చెల్లింపులు లేవనే సరికి పనులు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ఆర్భాటంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఒక్కరోజు గడవక ముందే ఇలా చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
ఆకాశాన ఆకాంక్ష!
► అబద్ధాల హోరు.. ప్రచారాల జోరుతో బాబు పాలన ► జిల్లాపై నాడు వరాల జల్లు కురిపించిన టీడీపీ ► కీలకమైన ప్రాజెక్టులు రూపొందిస్తామని ప్రకటన ► నేటికీ ఒక్క సంస్థ కూడా కాలుపెట్టని వైనం ► మూడేళ్లుగా కాకి లెక్కలతో దబాయింపు ► మూతబడుతున్న పాత పరిశ్రమలు ► రోడ్డున పడుతున్న వేలాది మంది కార్మికులు ► ఆవిరవుతున్న జిల్లా ప్రజల ఆశలు ► నేడు శాసనసభలో ఏపీ బడ్జెట్ "తప్పెట్లోయ్.. తాళాలోయ్ దేవుని గుడిలో మేళాలోయ్" ఇది చిన్నారుల పాట "మా బాబేనోయ్.. రాష్ట్రాన్ని కాపాడేదోయ్" ఇది టీడీపీ నేతల కీర్తన ఇప్పుడు ఎన్నికలు లేవు.. హడావుడీ లేదు ఒక్కసారి 2014 సార్వత్రిక ఎన్నికల బటన్‌ను రివైండ్ చేస్తే.. లెక్కలేనన్ని బాబు వాగ్దానాలు జనాలను ఆశల పల్లకీ ఎక్కించాయి ఇందులో జిల్లా ప్రజలూ ఉన్నారు ఎన్నో ప్రాజెక్టులు వస్తాయని ఆశించారు కానీ సున్నా సంస్థలే ఈ నేలపై కాలు పెట్టాయి నేడు బడ్జెట్ ప్రసంగం నూతన అసెంబ్లీలోకి రానుంది ఈ సారి ఎన్ని పేలని టపాకాయలు ఇస్తారో!!! సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎస్.. హి బ్రీఫ్డ్ టు జిల్లా..1, 2, 3, 4, 5.... ఇలా ఎన్నో వరాలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. మైకు పట్టుకొని ‘మీకు నేనున్నా’ అని తేల్చి చెప్పారు. కానీ ఒకటి.. రెండు.. మూడు ఇలా ఏళ్లు దొర్లుతున్నాయి. ఒక్క మాటా నెరవేరలేదు. కాకి లెక్కలు.. హంస నడకలే మిగిలాయి రాష్ట్రంలో 10 లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న బాబు సర్కార్ జిల్లాలో పట్టుమని ఒక్క పరిశ్రమ కూడా నెల కొల్పలేదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు. గతంలో ఉన్న పాత పరిశ్రమలు సైతం ప్రభుత్వ ప్రోత్సాహం లేక మూతబడుతున్నాయి. లక్షలాది మందికి కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు సైతం పోగొట్టుకొని రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి సంగతి అంతేనా?: చంద్రబాబుఅధికారం చేపట్టగానే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేశారు. అయితే ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించడం మినహా ఇప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న మూడు, నాలుగు సంస్థలు సైతం ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా నీరు, పోర్టు, రోడ్లు, విమానాశ్రయం లాంటి సౌకర్యాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క పరిశ్రమను నెలకొల్పకపోయినా బాబు ప్రభుత్వం మాత్రం ఎంఓయూలు లెక్క కట్టి లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం. ముందడుగు వేసి.. ఆగిన సంస్థలు ఇవే..: రంగా ఫర్టికల్ బోర్డు (ఆగ్రో బేస్డ్ సంస్థ), కందుకూరు మండలం కోవూరు వద్ద పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో పాటు బీబీఎల్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (మినరల్ బేస్డ్) మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద, వీఎస్ఎల్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పొన్నలూరు మండలం వేలటూరు వద్ద, ఆర్కేఎస్ టెక్నో విజన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (పవర్ జనరేషన్) వెలిగండ్ల మండలం మొగుళ్లూరు వద్ద, స్ప్రింగ్‌బీ డెయిరీ ప్రోడక్ట్ (ఫుడ్ అండ్ ఆగ్రో) పొదిలి మండలం, ఓగులక్కపల్లి గ్రామం వద్ద పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఇదే తరహాలో జాసన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్), మోహన్ వెల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండస్ట్రీయల్ పార్కు), రంగా ఫర్టికల్ బోర్డు, చైనాకు చెందిన కన్సార్టియం ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు, తమిళనాడుకు చెందిన మోహన్ సింటెక్స్ టెక్స్టైల్స్ తదితర కంపెనీలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం దొనకొండతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. అయితే వీటిలో ఏ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడం గమనార్హం. పారిశ్రామిక రాయితీకి ఎసరు: రాష్ట్ర విభజన చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన పారిశ్రామిక పన్ను రాయితీలపై కేంద్రం సెప్టెంబర్ 30న కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలను కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. అయితే వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన చట్టప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు ఐదేళ్ల పాటు జిల్లాలో నెలకొల్పబోయే పరిశ్రమలకు 15 శాతం తరుగుదల పన్ను, పరిశ్రమ ప్లాంట్, కొత్త యంత్రాల వ్యయంపై 15 శాతం పెట్టుబడి అలవెన్సులు రావాల్సి ఉంది. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 32(1), (2ఎ), సెక్షన్ 32 ఏడీ ప్రకారం ఈ ఏడు జిల్లాలను కేంద్రం నోటిఫై చేసింది. అన్నీ ఉత్త లెక్కలేనా?: పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం డిసెంబర్ 20 నాటికి జిల్లాలో 85 పెద్ద, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. రూ. 2,928.80 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన ఈ పరిశ్రమల ద్వారా 22,093 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఇవికాక జిల్లావ్యాప్తంగా 7,593 చిన్న పరిశ్రమలున్నాయి. రూ. 2,040.93 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల ద్వారా 81,277 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రోత్సాహకాల మాట మరచిన సర్కారు: ప్రభుత్వం ఎటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలివ్వకపోవడంతో పరిశ్రమలు ముందుకు నడిచే పరిస్థితి లేకుండాపోయింది. ట్యాక్సులు పెంచడం, అదనపు పన్నులు వేయడం, విద్యుత్ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచటం తదితర కారణాలతో చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయి. జిల్లాలో మొత్తంగా 7678 పరిశ్రమలుండగా చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత దాదాపు 30 శాతం పరిశ్రమలు (2000లకుపైగా) మూతబడినట్లు సమాచారం. విద్యుత్ బిల్లులతో పాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన కంతులు చెల్లించలేక ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోననైనా ప్రభుత్వాలు చిన్న పరిశ్రమలకు రాయితీలు కల్పించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కారు ఏ మాత్రం స్పందించటం లేదు. -
రాష్ట్ర బడ్జెట్‌తో ఉత్తమ్ మైండ్ బ్లాక్: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె .లక్ష్మా రెడ్డి ఖండించారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదన్న ఉత్తమ్ ఆరోపణలు అర్థరహితమన్నారు. ఏ ఆస్పత్రి కైనా వెళ్దాం.. హెల్త్ కార్డు పనిచేస్తే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. శుద్ధ అబద్దాలతో ఉత్తమ్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత మూడు నెలల్లో 4,100 మందికి హెల్త్ కార్డుల ద్వారా వైద్యం అందిందని తెలిపారు. ఈ విషయంలోనే ఇన్ని అబద్దాలు మాట్లాడుతున్న ఉత్తమ్ గవర్నర్ ప్రసంగం అబద్ధమంటూ సీఎంను రాజీనామా కోరడం హాస్యాస్పదమని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం దక్కిందన్నారు. ఈ బడ్జెట్ తో ఉత్తమ్ మైండ్ బ్లాంక్ అయిందని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలు
⇒ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయింపు ⇒ 60 శాతం గృహాలు ఎస్సీ, ఎస్టీలకు ప్రతిపాదించిన తెలంగాణ ⇒ 2016–17కు గాను రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద 2016–17కు గాను రాష్ట్రానికి అదనంగా 12,862 గృహాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. ఇటీవల జరిగిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు చెందిన సాధికారిక కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. 2016–17కు గాను ముందుగా నిర్ణయించిన లక్ష్యం 38,097 గృహాలకు అదనంగా 12,862 గృహాల నిర్మాణానికి తెలంగాణ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సాధికారిక కమిటీ ఆమోద ముద్ర వేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర లక్ష్యం 50,959 గృహాలకు చేరుకుంది. ఈ మొత్తం గృహాలలో 30,575 గృహాలను (60 శాతం) ఎస్సీ, ఎస్టీలకు, 3,566 గృహాలను మైనారిటీలకు కేటాయిస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని పథకాల నిధులు రాష్ట్ర నోడల్ ఖాతాకు బదిలీ చేయాలని, గత ఏప్రిల్ నాటికి వ్యయం కాని రూ.36.44 కోట్లను ఇందిరా ఆవాస్ యోజన కింద పెండింగ్‌లో ఉన్న గృహాల నిర్మాణానికి వినియోగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుందని సాధికారిక కమిటీ పేర్కొంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు పథకం వివరాలు, స్థానిక వనరుల లభ్యత, శిక్షణ పొందిన మేస్త్రీల అవసరం తదితర విషయాలపై అవగాహన కల్పించడానికి క్యాంపులు నిర్వహించాలని ఆదేశించింది. ఆధార్ సీడింగ్‌కు లబ్ధిదారుడి అనుమతి తీసుకోవాలని సూచించింది. ‘ఉపాధి’ ద్వారా నిర్మించండి.. గృహాల నిర్మాణానికి కనీసం 90 నుంచి 95 దినాలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికులను పనిలోకి తీసుకోవాలని సాధికారిక కమిటీ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో పీఎంఏవై కింద గృహాల నిర్మాణంలో స్వచ్ఛ భారత్ మిషన్ లేదా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.12 వేల చొప్పున వినియోగిస్తూ టాయిలెట్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు స్వయంగా గృహాన్ని నిర్మించుకోవాలి లేదా లబ్ధిదారుడి పర్యవేక్షణలో గృహ నిర్మాణం జరగాలి. ఇందులో కాంట్రాక్టర్ల ప్రమేయం ఉండరాదు. అయితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వ్యయంతో తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌హెచ్‌సీఎల్) ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్నందున.. లబ్ధిదారులకు బదులుగా టీఎస్‌హెచ్‌సీఎల్ నిర్మాణం చేపట్టడానికి మినహా యింపు మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించాలని సాధికారిక కమిటీ స్పష్టం చేసింది. -
దేశాన్ని రాష్ట్రం నడిపించాలి
నూరు శాతం ఫలితాలు సాధించేలా బడ్జెట్ రూపకల్పన మూడు రోజుల్లోగా శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలు అందించాలి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ పేరిట ప్రత్యేక సంస్థ ఏర్పాటు కార్యదర్శులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి సమీక్ష సాక్షి, అమరావతి: రాష్ట్రం ముందుండి దేశాన్ని నడిపించాలని, ప్రభుత్వ శాఖలు పట్టుదలతో నూరు శాతం ఫలితాలు సాధించేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నిధుల వ్యయం, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి సోమవారం వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను కొన్ని శాఖలు సమర్థంగా వ్యయం చేయడం లేదని, కేంద్రం కేటాయించిన నిధులను వ్యయం చేసి, పూర్తి స్థాయిలో మిగతా నిధులను తెచ్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేలాగ ప్రణాళికలను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అనుభవం, వనరులు, సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశానికి నాయకత్వం వహించే స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. 2017–18 రాష్ట్ర బడ్జెట్ ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు వీలుగా ఉండాలన్నారు. మరో మూడు రోజుల్లోగా శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. జీఎస్టీతో రానున్న రోజుల్లో ఆదాయం పెరుగుతుందని, స్నేహపూరిత వ్యాపారానికి అనువుగా ఉంటుందన్నారు. ఈవెంట్స్ నిర్వహణ ద్వారా రాష్ట్ర ఖ్యాతి పెంచుతున్నాం.. మారుమూల ప్రాంతాలకు రహదారులు వేసే ప్రాజెక్టు కింద నిధులను పెద్ద ఎత్తున పొందేందుకు అవసరమైతే ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం పోలీసు, రహదారుల శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, రెవెన్యూ లోటు నిధులు, రైల్వే జోన్ కేంద్రం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రానికి బ్రాండింగ్ తీసుకురావడం కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని, ఈవెంట్స్ నిర్వహణ ద్వారా ఖ్యాతి పెరిగేలా చేస్తున్నామన్నారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఇన్ గవర్నెన్స్ పేరిట ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. కోర్ డ్యా‹ష్ బోర్డు రెండో వెర్షన్ తీసుకురావడంతో పాటు ఆదాయ, వ్యయాల వివరాలను ఉంచుతామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ‘నరేగా’ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నరేగా’ను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు–ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని ఎంత మేర సద్వినియోగం చేసుకుంటే అంతమేర గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయవచ్చన్నారు. పంట కుంటల తవ్వకం 2.30 లక్షలు మాత్రమే పూర్తయిందని, మిగిలిన 1.70 లక్షల కుంటలను పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నరేగా నిధులు రూ. 4,430 కోట్లు వ్యయం చేశారని, మిగిలిన రూ. 1,500 కోట్లు రాబోయే రోజుల్లో ఖర్చు చేయాలని ఆదేశించారు. -
దేశ విద్యా విధానంలో మార్పు రావాలి
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: దేశంలో విద్యా విధానం మారాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన తెలంగాణ గురుకుల ఉపాధ్యాయుల సంఘం డైరీ–2017 ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ పోవాలని కోరుతూ ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే విద్యా పోరాట యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని, ఉపాధ్యాయులందరూ తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు జరిగితే బాగుంటుందని, సమాంతర పద్ధతిలో విద్య అందినప్పుడే మార్పును తీసుకురాగలమని చెప్పారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెంచాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.25 వేల కోట్ల నిధులైనా విద్యా రంగానికి ఇవ్వాలన్నారు. కొఠారీ కమిషన్ సిఫిరస్సులను అమలు చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టు విధానంలో నియామకాలను పూర్తిగా నిలిపివేయాలన్నారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... పెన్షన్ రద్దును వ్యతిరేకిస్తూ మార్చి 2న జరిగే నిరసన సభను విజయవంతం చేయాలని కోరారు. గౌరవ అధ్యక్షడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తరహాలో రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గతేడాది మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏటా ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరించి బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆర్థిక శాఖకు సీఎం దిశా నిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులపై స్పష్టత వస్తుంది. అందుకే ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక శాఖను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని శాఖల ప్రతిపాదనలు సిద్ధంగా ఉంటే బడ్జెట్ తయారీ ప్రక్రియకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. 2017–18 బడ్జెట్‌కు సంబంధించి అన్ని శాఖల ప్రతిపాదనలు రెండు రోజుల కిందటే ఆర్థిక శాఖకు చేరాయి. ఈసారి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు విలీనమవటంతో నిర్వహణ పద్దులు, ప్రగతి పద్దులుగా అన్ని శాఖలు ప్రతిపాదనలు తయారు చేశాయి. ఆదాయ వ్యయాల అంచనాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు, వచ్చే ఆర్థిక సంవత్సరపు ప్రాధాన్యాలకు అనుగుణంగా బడ్జెట్ కసరత్తు మొదలైంది. రూ.15 వేల కోట్ల మేరకు సవరణ.. 2016–17 బడ్జెట్ అంచనాలు, వాస్తవంగా వచ్చిన ఆదాయ వ్యయాల ఆధారంగా సవరణ బడ్జెట్‌ను సైతం ఆర్థిక శాఖ తయారు చేయనుంది. కొత్త బడ్జెట్‌తో పాటు సవరణ బడ్జెట్ గణాంకాలను పొందుపరచనుంది. గతేడాది రూ.1.30 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నోట్ల రద్దు పరిణామాలు, భూముల అమ్మకంతో ఆశించిన ఆదాయం రాకపోవటంతో దాదాపు రూ.15 వేల కోట్ల మేర అంచనాలు తలకిందులైనట్లు ప్రభుత్వం విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రూ.1.15 లక్షల కోట్లతో సవరణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
ఇసుక దందాలో సీఎం బంధువుల హస్తం
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల/కరీంనగర్: ఇసుక దందాలో సీఎం బంధువులు, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొదురుపాక, సిరిసిల్ల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఒక్కో పర్మిట్‌పై నాలుగు లారీలు తరలిపోతు న్నాయన్నారు. మద్యం, ఇసుక అమ్మకాలతోనే సర్కారు పాలన సాగిస్తోం దన్నారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని పొన్నం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంత పోకడలతో బడ్జెట్‌ను రూపొందించడం అప్రజాస్వామికమన్నారు. -
సరికొత్తగా రాష్ట్ర బడ్జెట్!
ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు స్వస్తి సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌ను సరికొత్తగా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను వేర్వేరుగా చూపించే పాత బడ్జెట్ సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఆనవాయితీకి భిన్నంగా 2017–18 బడ్జెట్ తయారీకి కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను వేర్వేరుగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులన్నీ ఒకేచోట ప్రతిపాదించాలని సూచించింది. రెండు వారాల్లో అన్ని శాఖలు తమ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. ఈసారి అన్ని శాఖలు తమ పరిధిలో జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, వడ్డీలు, బకాయిలను వేరుగా పంపించాలని సూచించింది. ప్రతిపాదనలను పక్కాగా రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలు సమీక్షించుకుని అంచనాలు పొందుపరచాలని పేర్కొంది. 2017–18లో వచ్చే రాబడులతో పాటు అవసరమయ్యే ఖర్చుల అంచనాలన్నీ నిర్దిష్టంగా పొందుపరిచాలని సూచించింది. -
రాష్ట్ర ఆదాయం రూ.47 వేల కోట్లు
ఆరు నెలల్లో రెవెన్యూ రాబడిలో గణనీయ వృద్ధి: ఈటల - సేల్స్ ట్యాక్స్, వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదల - ఇప్పటివరకు బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాది రాష్ట్ర ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆరు నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ. 47 వేల కోట్ల మేర ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ రాబడి, లోటు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలపై విపక్ష నేత కె.జానారెడ్డి, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఈటల సమాధాన మిచ్చారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినా రాష్ట్ర ఆదాయం తగ్గదని, మున్ముందూ మరింత గొప్పగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఆదాయం వ్యాట్ రూపేణ 22 శాతం పెరిగిందని, వాహనాల పన్ను 35 శాతం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపై 56 శాతం కలిపి మొత్తంగా గతేడాదికన్నా 13 శాతం వృద్ధి ఉందని వివరించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే 44 శాతం తక్కువగా ఉందన్నారు. నోట్ల రద్దుతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నా దాన్ని కేంద్రం ఆర్థిక సాయం రూపంలో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. 2014–15లో రాష్ట్రంలో మిగులు రూ. 369 కోట్లు మేర ఉండగా, 2015–16లో ఆడిటర్ జనరల్ నివేదికల ప్రకారం రూ. 3,121 కోట్ల మిగులు ఉందన్నారు. ప్రస్తుత ఏడాది మిగులు ఎలా ఉండనుంది జీఎస్టీ శ్లాబ్‌లపై స్పష్టత వచ్చాక మార్చి అనంతరం తెలుస్తుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రణాళికేతర వ్యయం రూ. 28,858.33 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ. 22,756.77 కోట్లుగా ఉందని, మొత్తంగా బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లని వెల్లడించారు. మార్చి నాటికి బడ్జెట్ వ్యయం రూ. లక్ష కోట్లు దాటుతుం దన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ. 17వేల కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉం డగా ఇప్పటికే మూడు విడతల మాఫీ పూర్తయిందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ వాకౌట్ విద్యార్థుల ఫీజు బకాయిలపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదంటూ ఎంఐఎం... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల బడ్జెట్ విడుదలపై స్పష్టత లేదంటూ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు: జానా ఇదే అంశంపై సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్ర బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లుగా ఉంది. కానీ ఇప్పటివరకు ఆరు నెలల ఆదాయం 47 వేల కోట్లని అంటున్నారు. మరో ఆరో నెలల్లో మరో రూ.47 వేల కోట్లు వచ్చినా బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు. ఇదే విషయాన్ని గతంలోనే చెప్పా. అదే ఇప్పుడు నిజమవుతోంది. ఇక పెద్దనోట్ల రద్దుతో ఆదాయం 20 వేల కోట్ల మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రే చెబుతున్నారంటే దీనికి అదనంగా మరో రూ. 10 వేల కోట్లు కచ్చితంగా తగ్గుదల ఉంటుంది. ఎలా చూసినా లక్ష కోట్ల బడ్జెట్ దాటడం కష్టం. ఈ ఏడాది బడ్జెట్ ఖర్చు మొదలు పెట్టనే లేదు’ అని పేర్కొన్నారు. ముమ్మాటికీ లోటు రాష్ట్రమే: అక్బరుద్దీన్ ‘రాష్ట్రంలో 2014–15లో మిగులు కనబడుతున్నా, 2015–16లో 4 వేల కోట్ల మేర లోటు ఉంది. ప్రస్తుత ఏడాదిలోనూ ఖర్చు రూ. 51 వేల కోట్ల మేర ఉండగా ఆదాయం 47 వేల కోట్లే ఉంది. అలాం టప్పుడు మిగులు రాష్ట్రం ఎలా అవుతుంది. 10.93 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల మెయింటెనెన్స్ చార్జీలు, రీయిం బర్స్మెంట్ ఫీజులు చెల్లించలేదు. షాదీ ముబారక్ కింద కేవలం 30 కోట్లే విడుదలయ్యాయి. మరి మిగులు రాష్ట్రం అని ఎలా అంటారు’ అని ప్రశ్నించారు -
ముస్లింలు.. సంచలన నివేదిక
- ముస్లింల స్థితిగతులపై సుధీర్ కమిటీ నివేదిక - గత 40 ఏళ్లలో బాగా.. ఎస్సీ, ఎస్టీల కన్నా వెనకబడిపోయారు - అక్షరాస్యత, తలసరి ఆదాయం, వ్యయం అందరికంటే తక్కువ - 16 శాతం ముస్లిం జనాభా పాఠశాల ముఖమే చూడలేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లిం సామాజికవర్గం ఎస్సీ, ఎస్టీల కన్నా వెనుకబడిందని జి.సుధీర్ కమిషన్ తేల్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుకాగా అందులో 12.68 శాతం (44.64 లక్షలు)ఉన్నారని... కానీ వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య స్థితిగతులు అట్టడుగు స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. గత నలభై ఏళ్లలో బాగా వెనుకబడిపోయారని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ముస్లింల సామాజిక–ఆర్థిక, విద్యా స్థితిగతులపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జి.సుధీర్ అధ్యక్షతన ఎంఏ బారి, డాక్టర్ అమీరుల్లా ఖాన్, ప్రొ. అబ్దుల్ షాబాన్‌లతో కూడిన ఈ కమిటీ.. విస్తృతంగా అధ్యయనం చేసి, ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తాజాగా ఆ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు.. 40 ఏళ్లలో బాగా వెనకబడ్డారు నలభై ఏళ్ల కింద సగటు స్థాయిలో ఉన్న ముస్లింలు ఇప్పుడు అందరికన్నా.. కొన్ని విషయాల్లో ఎస్సీ, ఎస్టీల కన్నా కూడా వెనుకబడిపోయారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) గణాంకాల ప్రకారం.. 1999లో సగటు పౌరులతో పోలిస్తే స్వల్పంగా దిగువన ఉన్న ఓబీసీలు ప్రస్తుతం అగ్రవర్ణాలకు సమాన స్థాయిలో ఉన్నారు. అప్పట్లో ఓబీసీలకు సమానంగా ఉన్న ముస్లింలు ఇప్పుడు చాలా వెనకబడి పోయారు. 1999–2011 మధ్య కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల తలసరి ఆదాయ వృద్ధితో పోలిస్తే ముస్లింల తలసరి ఆదాయ వృద్ధి రేటు సగం మాత్రమే. 2004–12 మధ్య ముస్లింల తలసరి వ్యయం 60 శాతం పెరగగా... హిందూ ఎస్టీల్లో 69 శాతం, ఎస్సీల్లో 73 శాతం, ఓబీసీల్లో 89 శాతం, అగ్రవర్ణాల్లో 122 శాతం పెరిగింది. దారిద్య్రరేఖకు దిగువన హిందూ ఎస్సీల కన్నా ముస్లిం ఓబీసీల నిష్పత్తే ఎక్కువ. మధ్యలోనే చదువులకు ఫుల్స్టాప్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ముస్లింలు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు. పాఠశాల ముఖమే చూడని జనాభాలో అత్యధికంగా ఎస్టీలు, ముస్లింలే ఉండడం గమనార్హం. ఎస్టీల్లో 17శాతం, ముస్లింలలో 16 శాతం జనాభా అసలు విద్యా సంస్థల్లోనే చేరలేదు. ముస్లింల అక్షరాస్యత రేటు (70%) ఓబీసీల్లో (74శాతం)కన్నా, సాధారణ హిందువుల (86శాతం) కన్నా తక్కువగా ఉందని 2014లో అమితాబ్ కుందు నేతృత్వంలోని సచార్ ఎవాల్యుయేష న్ కమిటీ బహిర్గతం చేసింది. ఉన్నత విద్య విషయంలో ముస్లింల పరిస్థితి దయనీయం గా ఉంది. తెలంగాణలో వర్సిటీల పరిధిలోని అన్ని కోర్సుల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని వర్సిటీల నుంచి సేకరించిన సమాచారం స్పష్టం చేస్తోంది. సర్కారీ దవాఖానే దిక్కు పేదరికం కారణంగా ముస్లింలు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రులకే వెళుతున్నా రు. వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, పేద రికం, మురికివాడల్లో నివాసం వల్ల ముస్లిం వయోజనుల ఆరోగ్యం బాగా లేదు. ఈ కారణాల వల్లే హిందువులు (62శాతం), క్రైస్తవుల (49.6 శాతం)తో పోల్చితే ముస్లిం గర్భవతు ల్లో(66శాతం) రక్తహీనత అధికం. ఇతరులతో పోల్చితే ముస్లిం పురుషులు ఎక్కువగా మధుమేహంతో బాధపడు తున్నారు. ముస్లిం పిల్లల ఆరోగ్య పరిస్థితి ఇతరుల కంటే మెరుగ్గా ఉంది. ముస్లింలలో మాతా, శిశు మరణాల రేటు తక్కువే. ‘నివాసం’లోనూ వివక్ష హౌజింగ్ మార్కెట్ ముస్లింలపై వివక్ష చూపి స్తోందన్న భావన ఉందని కమిటీ అభిప్రా యపడింది. గృహ సదుపాయం పొందడంలో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని.. 43 శాతం ముస్లింలు అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని పేర్కొంది. ముస్లింల హౌజింగ్ పరిస్థితిపై లోతైన పరిశీలన జరపాలని ప్రభుత్వానికి సూచించింది. లింగపర అసమానతలూ ఎక్కువే.. ఇతర మతాలతో పోల్చితే ముస్లింలలో లింగపర అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ముస్లిం మహిళల్లో 21–29 ఏళ్ల మధ్య వయసు గలవారిలో 71.5 శాతం మంది మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అదే 18–20 ఏళ్ల మధ్య వయసు వారిలో 52.8శాతం మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. మొత్తంగా 21–29 ఏళ్ల వయసులో మధ్యలోనే చదువు మానేస్తున్న వారిలో 85.2 శాతం ముస్లిం మహిళలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 7.36 శాతమే! ∙మొత్తం ఉద్యోగులు 4,79,556.. వారిలో ముస్లింలు 35,279 ∙ముస్లిం గెజిటెడ్ అధికారులు 1.43 శాతమేనని సుధీర్ కమిటీ వెల్లడి ∙340 మంది అఖిల భారత సర్వీసు అధికారుల్లో 10 మందే ముస్లింలు రాష్ట్ర జనాభాలో 12.68 శాతం ముస్లింలు ఉండగా... ప్రభుత్వ ఉద్యోగాల్లో వారు 7.36 శాతమే ఉన్నారని జి.సుధీర్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని 23 ప్రభుత్వ శాఖలు, సచివాలయం, జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల్లో కలిపి మొత్తం 4,79,556 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో ముస్లిం ఉద్యోగులు 35,279 (7.36 శాతం) మందేనని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులు 340 మంది ఉండగా.. అందులో ముస్లింలు కేవలం 10 మందేనని, ఇందులోనూ ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యమే లేదని వివరించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన కమిటీ.. పలు కీలక అంశాలను గుర్తించింది. ముస్లిం ఉద్యోగుల్లో 56.57 శాతం అట్టడుగు స్థాయి (ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్వీపర్, ఇతర నాలుగో తరగతి) ఉద్యోగులేనని తేల్చింది. ఇక 42 శాతం నాన్ గెజిటెడ్ అధికారులని, కేవలం 1.43 శాతం మాత్రమే గెజిటెడ్ అధికారులని తెలిపింది. వ్యవసాయేతర పనులే జీవనాధారం రాష్ట్రంలోని ముస్లింలకు వ్యవసాయేతర పనులే జీవనాధారం. హిందూ పురుషుల్లో 61 శాతం సొంత కమతాల్లో ఉండగా.. 38 శాతం మంది వ్యవసాయ రంగంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ముస్లిం పురుషుల్లో 52 శాతం మంది దినసరి కూలీలుగా, 48 శాతం మంది స్వయం ఉపాధి రంగంలో ఉన్నారు. జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది 2001–2011 మధ్య ముస్లిం జనాభా వృద్ధి 1.47% పట్టణాల్లోనే ఎక్కువ నివాసం సుధీర్ కమిషన్ నివేదిక స్పష్టీకరణ రాష్ట్రంలో ముస్లింల జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతోంది. గత దశాబ్దకాలంలో హిందువుల వృద్ధి రేటు 0.47 శాతం తగ్గిపోగా... ముస్లిం వృద్ధి రేటు అంతకు మించి 0.52 శాతం పడిపోయింది. జి.సుధీర్ కమిషన్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 1991–2001 మధ్య తెలంగాణ జనాభా వృద్ధి రేటు 1.78 శాతంకాగా... హిందువుల జనాభా వృద్ధి రేటు 1.64 శాతం, ముస్లిం జనాభా వృద్ధి రేటు 1.99, క్రైస్తవ జనాభా వృద్ధి రేటు 3.19 శాతం ఉండేది. అయితే 2001–2011 మధ్య రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 1.27 శాతానికి పడిపోగా... హిందూ జనాభా వృద్ధిరేటు 1.17 శాతం, ముస్లింల జనాభా వృద్ధి రేటు 1.47 శాతం, క్రైస్తవుల జనాభా వృద్ధి రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది. పట్టణాల్లోనే ఎక్కువ.. మొత్తం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుకాగా అందులో 12.68 శాతం (44,64,699 మంది) ముస్లింలు ఉన్నారు. పట్టణ జనాభాలో 24శాతం, గ్రామీణ జనాభాలో 5.05 శాతం ముస్లింలు ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్ జనాభాలో 43.4 శాతం, అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 5.2 శాతం ముస్లింలు ఉన్నారు. రాష్ట్ర ముస్లిం జనాభాలో 50.01 శాతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి.. తూర్పు దిశగా వెళ్లే కొద్దీ ముస్లింల జనాభా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర ముస్లిం జనాభాలో షేక్, షేయిక్ వర్గాల వారు 66.2 శాతం, సయ్యద్‌లు 11.5 శాతం, పఠాన్లు 6.12 శాతం ఉన్నారు. ముస్లింల కుటుంబాల సగటు పరిణామం ఇతరులతో పోల్చితే పెద్దగా ఉంది. ఇతరుల కుటుంబాల్లో సగటున 4.8 మంది ఉండగా... ముస్లిం కుటుంబాల్లో సగటున 5.2 మంది ఉన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 99 శాతం సున్నీలు, 1 శాతం మాత్రమే షియాలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 99.3 శాతం సున్నీలు, 0.7 శాతం షియాలు ఉన్నారు. 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ముస్లింలకు కనీసం 9 శాతమైనా కల్పించాలన్న సుధీర్ కమిటీ అందరికీ సమాన అవకాశాల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని సూచన రాష్ట్రంలో ముస్లింలు చాలా వెనుకబడినందున వారికి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని జి.సుధీర్ కమిటీ సిఫారసు చేసింది. కనీసం 9 శాతమైనా కల్పిం చాలని సూచించింది. న్యాయ నిపుణుల సల హాలు తీసుకుని, తమిళనాడు తరహాలో రిజ ర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని కమిటీ తాజాగా వెల్లడించిన తమ నివేదికలో ప్రతిపాదించింది. ‘ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రతిపాదనల ఆధా రంగా గమనిస్తే ముస్లింలు పలు విషయాల్లో రాష్ట్ర సగటు కన్నా దిగువన ఉన్నారు. సామా జికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారు. అందు వల్ల ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పించాలి. 82% ముస్లింలు వెనకబడినవారుగా వర్గీక రించిన దృష్ట్యా వాళ్ల రిజర్వేషన్లను 4 నుంచి 12 శాతానికి పెంచాలి. కనీసం 9 శాతానికైనా పెంచాలి’’ అని కమిటీ పేర్కొంది. ఎస్సీల తరహా వృత్తి చేస్తూ వివక్ష ఎదుర్కొంటున్న మెహ్తర్ వంటి ముస్లిం వర్గాలకు ఎస్సీ హోదా కింద రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. సామాజిక, మత, కుల, భాషాపర వివక్షకు తావులేకుండా ప్రైవేటు, పబ్లిక్ రంగాలతో సహా అన్ని చోట్లా, అన్నివర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు సమాన అవకాశాల కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అన్ని స్థాయిల్లో విద్య, ఉద్యోగం, గృహ వసతి, ఆరోగ్య సదు పాయం, అభివృద్ధి ప్రోత్సాహకాలపై ఆ కమిషన్ పర్యవేక్షణ ఉండాలంది. కమిటీ తమ సిఫారసులను 3 భాగాలుగా విభజించింది. తక్షణమే అమలు చేయాల్సిన కీలక అంశాలతో పాటు మధ్యంతర, దీర్ఘకాలిక సిఫారసులను నివేదికలో సూచించింది. మధ్య కాలిక సిఫార్సులు ► ఎస్సీ, ఎస్టీల తరహాలో ముస్లిం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీఎస్ఐపాస్ కింద రాయితీలు అందించాలి. టీఎస్ఐఐసీ ద్వారా ముస్లింలకు 12 శాతం పారిశ్రామిక స్థలాలు మంజూరు చేయాలి. ► పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో 12% ముస్లింలు స్థాపించిన యూనిట్లకు అందజేయాలి. ► ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల్లో ముస్లింల కోటాను పట్టణ ప్రాంతాల్లో 20 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతానికి పెంచాలి. ► అఖిల భారత సర్వీసు ఉద్యోగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. స్టేట్ సర్వీసుల నుంచి ప్రమోషన్లు ఇచ్చి ఈ అంతరాన్ని పూరించాలి. ► ముస్లిం కుటుంబాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు లభించడం దుర్లభంగా మారింది. ఈ పరిస్థితిని మార్చాలి. ► ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించిన సెలెక్షన్ ప్యానెల్లో కనీసం ఒక ముస్లిం అకడమీషియన్ ఉండాలి. శాఖాపర పదోన్నతుల్లో సైతం ముస్లింలకు న్యాయం జరిగేలా బోర్డులో ఒక ముస్లిం సభ్యుడు ఉండాలి. ► రాష్ట్ర మైనారిటీస్ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలి. రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ కేంద్రాల్లో కార్పొరేషన్ కార్యాలయాలను తెరిచి సిబ్బందిని నియమించాలి. ► మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. ► మదర్సాల మౌలిక పాఠ్య ప్రణాళికలో జోక్యం చేసుకోకుండా వాటిని ప్రధాన స్రవంతి పాఠశాలల్లో కలిపి, మామూలు పాఠశాలలుగా గుర్తించాలి. మదర్సాల్లో సైన్స్, గణితం సబ్జెక్టులు బోధించేలా సూచనలివ్వాలి. మదర్సా బోర్డును స్థాపించి అందులో చేరేందుకు అన్ని మదర్సాలకు అవకాశం కల్పించాలి. మదర్సా కోర్సులకు రెగ్యులర్ కోర్సులతో సమాన హోదా కల్పించాలి. ► మొత్తం జనాభాలో, ప్రత్యేకంగా ముస్లింలలో రక్తహీనత కేసులు పెరగకుండా చూడాలి. ► ముస్లింలు, ఇతర మత గ్రూపుల వేతనాల మధ్య వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలోని ముస్లింలకు కనీస వేతన చట్టాలు కచ్చితంగా వర్తించేలా చూడాలి. తక్షణమే అమలు చేయాల్సిన సిఫార్సులు ► రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్ రూపొందించి.. అన్ని శాఖలు ముస్లింల సంక్షేమం కోసం తగినన్ని నిధులు వెచ్చించేలా చర్యలు తీసుకోవాలి. నిధులు దారిమళ్లకుండా చూడాలి. ► సచార్, కుందూ కమిటీల సిఫారసుల మేరకు భిన్నత్వ సూచికల (డైవర్సిటీ ఇండెక్స్)ను ప్రభుత్వం అమలు చేయాలి. మానవ వనరుల విషయంలో ప్రదర్శించే భిన్నత్వం ఆధారంగా సంస్థలకు ర్యాంకులు ఇవ్వాలి. ► ఉపాధ్యాయుల కొరత, బోధనా నాణ్యత లేక ఉర్దూ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలి. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం, స్కూళ్లలో డ్రాపౌట్లను తగ్గించడం కోసం స్కాలర్‌షిప్పులను పెంచాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తరహాలోనే ముస్లిం విద్యార్థులకు విద్యాసంస్థల్లో క్యాష్‌లెస్ ప్రవేశాలకు అవకాశం కల్పించాలి. ► ముస్లిం ప్రజానీకం పోలీసు, భద్రతా వ్యవస్థలపై నమ్మకంతో ఉంది. ఆ భావనని మరింత పెంపొందించేందుకు వారిపట్ల పోలీసుల వైఖరి మార్చాలి (సెన్సిటైజ్ చేయాలి). ముస్లిం యువకులను ఉగ్రవాదు లు, నేరస్తులన్న అనుమానంతో విచక్షణా రహితంగా అరెస్టు చేయడం ఆపాలి. ► రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆఫీసులకు ఉర్దూలోనూ సైన్‌బోర్డులు పెట్టాలి. దీర్ఘకాలిక సిఫార్సులు ► పాఠశాలల్లో ప్రవేశాలతో సహా ప్రభుత్వ సర్వీసుల్లో, విద్యా సంస్థల్లో ముస్లింలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. ► ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం పెంచాలి. ముస్లిం రిజర్వేషన్లలో 33 శాతం ముస్లిం మహిళలకు ఇవ్వాలి. ► ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠ శాలలను ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య లో ఆడపిల్లల ప్రాతినిధ్యం తక్కువగా ఉ న్నందున వారి కోసం ఉన్నత పాఠశాలలు, కళాశాలలను ఆంగ్ల మాధ్యమంలో తెరవాలి. -
తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి
• సీఎల్పీ డిమాండ్ • బడ్జెట్ కేటారుుంపులకు ‘కోత’ ప్రకటనలపై ఆగ్రహం • నయీమ్ కేసును సీబీఐకి ఇవ్వాలి.. • కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో షాడో కేబినెట్ ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును సాకుగా చూపి రాష్ట్ర బడ్జెట్ కేటారుుంపుల్లో కోతపెడతామంటూ అప్రజాస్వామికంగా ఎలా నిర్ణరుుంచుకుంటారని ప్రభుత్వంపై కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన పార్టీ శాసనభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీలోని కమిటీహాలులో గురువారం సమావేశమయ్యారు. మండలిలో కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశం వివరాలను సీఎల్పీ కార్యదర్శి పి.రామ్మోహన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటారుుంపుల్లో శాఖలవారీగా కోత పెడతామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటనపై సీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై శాసనసభలో చర్చ జరిగి.. ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఆదాయం తగ్గిందనే సాకుతో బడ్జెట్ కేటారుుంపుల్లో కోతపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. శాసనసభ ఆమోదించిన బడ్జెట్‌ను, అదే సభలో చర్చించకుండా, ఆమోదం తీసుకోకుండా కోతపెడ్తామని ఆర్థిక మంత్రి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని సీఎల్పీ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం ఎంత, పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఏమిటి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలసిన సందర్భంలో చర్చలు ఏమిటి, సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖలో ఏముందనేది అసెంబ్లీలో చర్చించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆదాయం తగ్గడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరింది. వీటిపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేసింది. ఈ నెల 5లోగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాలని కోరింది. లేకుంటే అసెంబ్లీలోని గాంధీవిగ్రహం దగ్గర ఈ నెల 5న నిరసన వ్యక్తం చేయాలని నిర్ణరుుంచింది. ఓటుకు కోట్లు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి... గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్, ఓటుకు కోట్లు కేసులను సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత వేలకోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉందని, ఆ డబ్బంతా ఏమైందని ప్రశ్నించింది. నయీమ్ దాచిపెట్టుకున్న వేలకోట్ల రూపాయలను ప్రభుత్వంలోని ముఖ్యులు తీసుకున్నారా, ప్రభుత్వమే స్వాధీనం చేసుకుందా, పోలీసులు పంచుకున్నారా అనేది తేల్చాలని డిమాండ్ చేసింది. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించింది. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగినందుకే ఈ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మధ్యవర్తిగా చంద్రబాబు, కేసీఆర్‌ను కలిపారని ఆరోపించింది. శాఖలవారీగా షాడో కేబినెట్ రాష్ట్రంలో శాఖల వారీగా జరుగుతున్న పనులపై షాడో కేబినెట్‌గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించాలని సీఎల్పీ నిర్ణరుుంచినట్టు తెలుస్తోంది. ఏ శాఖపై ఎవరు అధ్యయనం చేయాలన్న అంశంపై నిపుణులతో చర్చించే బాధ్యతలను పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డికి అప్పగించారు. పీసీసీ, సీఎల్పీ మధ్య ఉన్న సమన్వయలోపంపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్సుమెంట్పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో చేసిన హామీని అమలుచేయకపోవడంపై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వాలని నిర్ణరుుంచినట్టు తెలిసింది. -
సాగునీటి బడ్జెట్‌కు భారీ కోత!
• 25 వేల కోట్ల నుంచి 16,500 కోట్లకు కుదించిన ఆర్థికశాఖ • నోట్ల రద్దు ఎఫెక్ట్ కారణంగానే..! మరింత తగ్గే అవకాశం కూడా.. • పాలమూరులోనే 7,860.89 కోట్ల నుంచి రూ.1,340 కోట్లకు తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అగ్ర తాంబూలం దక్కించుకున్న నీటి పారుదల శాఖకు కేటారుుంపుల్లో భారీ కోత పడింది. ఆర్థిక పరిస్థితి, ఇతర ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగానికి కేటారుుంచిన బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.25 వేల కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు కుదించింది. ఈ మేరకు బడ్జెట్ అంచనాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అరుుతే సాగునీటిశాఖకు కేటారుుంచిన బడ్జెట్లో ఇప్పటివరకు రూ.8 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన ఆర్థిక శాఖ... రానున్న నాలుగు నెలల్లో మరో రూ.8 వేల కోట్లు ఇవ్వగలదా అన్నది సందేహాస్పదం గానే ఉంది. నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై ఉన్న నేపథ్యంలో నిధులివ్వడం కష్టమేనని ప్రభుత్వ వర్గాలే స్పష్టం చేస్తున్నారుు. ఏకంగా మూడో వంతు.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమంటూ 2016-17 బడ్జెట్లో నీటి పారుదల శాఖకు ఏకమొత్తంగా రూ.25 వేల కోట్లు కేటారుుంచారు. ప్రాజెక్టుల పూర్తికి వీలుగా ప్రతి నెలా రూ.2,100 కోట్లు విడుదల చేస్తామనీ ప్రకటించారు. అరుుతే ఆ తర్వాత ప్రభుత్వ ప్రాథమ్యాలు మారడం, రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, విద్యుత్, బియ్యం సబ్సిడీలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులు, హరితహారం, కృష్ణా పుష్కరాల నేపథ్యంలో సాగునీటి శాఖకు సరైన రీతిలో బడ్జెట్ కేటారుుంపులు జరగలేదు. ఎనిమిది నెలల్లో రూ.16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. రూ.8 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు. వచ్చే ఐదు నెలలకు సంబంధించి బడ్జెట్ అవసరాలపై ఇటీవల సమీక్షించిన ఆర్థిక శాఖ... ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకుని అంచనాలను సవరించింది. ఇందులో భాగంగా సాగునీటి శాఖ బడ్జెట్లో ఏకంగా రూ.8,500 కోట్లకు కోత పెట్టింది. ప్రధాన ప్రాజెక్టుల బడ్జెట్‌కు కోత వేసినా తక్షణ ఆయకట్టు నిచ్చే ప్రాజె క్టులకు కేటారుుంపులు పెంచడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిలా ్లలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోరుుల్‌సాగర్, భీమా ప్రాజెక్టులకు కేటారుుంపులు పెంచారు. నెట్టెం పాడుకు తొలుత రూ.125 కోట్లు కేటారుుంచగా.. రూ.202 కోట్లకు పెంచారు. కల్వకుర్తికి రూ.300 కోట్లకుగాను రూ.586 కోట్లు, కోరుుల్సాగర్కు రూ.59.72 కోట్లకుగాను రూ.111 కోట్లకు కేటారుుంపులు పెంచారు. -
సాగునీటికి బడ్జెట్ ఏదీ..?
- ప్రాజెక్టుల పనులకు బడ్జెట్ విడుదలలో తీవ్ర జాప్యం - ప్రతీనెలా రూ.2వేల కోట్లను విడుదల చేయాల్సి ఉన్నా వెయ్యి కోట్లను దాటని వైనం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్లో భారీ కేటాయింపులతో నీటి పారుదల శాఖకు అగ్రస్థానాన్ని కట్టబెట్టినా, నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. ప్రతీ నెలా రూ.2వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నా రూ.1000 కోట్లకు మించి విడుదల చేయడం లేదు. దీంతో ప్రాజెక్టుల బిల్లులన్నీ బకాయిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నీటి పారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యమిచ్చి రూ.25 వేల కోట్లు కేటాయించింది. ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా చేపట్టేందుకు ఈ శాఖకు ప్రతీనెలా రూ. 2000 కోట్లు చెల్లించే పద్ధతిని అనుసరిస్తోంది. ఇలా ఈ నాలుగు నెలల కాలానికి రూ.8వేల కోట్లు విడుద చేయాల్సి ఉన్నా ఇంతవరకు కేవలం 3,700కోట్లను మాత్రమే విడుదల చేసింది. మరో రూ.800కోట్లకు సంబంధించిన బిల్లులకు ఆమోదం లభించినా ఇంకా పీఏఓలో ఉన్నాయి. దీంతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నీటి పారుదల శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖను నీటి పారుదల శాఖ అధికారులు అడిగినప్పుడల్లా రూ.100 నుంచి రూ.200కోట్లు విడుదల చేస్తున్నారని, మిగతా నిధుల విడుదలకు ఆగాల్సిందేనన్న సమాధానం వస్తోంది. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటు రైతుల రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, విద్యుత్తు, బియ్యం సబ్సిడీలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులన్నీ ఏకకాలంలో రావడంతో ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ విడుదల చేస్తున్న బడ్జెట్‌ను జాగ్రత్తగా వాడుతున్న నీటి పారుదల శాఖ పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పూర్తికి, ఆదిలాబాద్‌లోని కొమరంభీం సహా ఇతర మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులకు సంబంధించిన మిషన్ కాకతీయ పనులకు సర్దుబాటు చేస్తున్నారు. అయితే ఇటీవల నీటిపారుదలశాఖ విన్నపం మేరకు ప్రాజెక్టుల్లో అవసరమైన భూసేకరణకు నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సమ్మతించింది. ప్రాజెక్టుల భూసేకరణకు గాను జూలైలో రూ.162కోట్ల మేర విడుదల చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ప్రాణహితమే
♦ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన ♦ ‘ప్రాణహిత’కు రూ.685.30 కోట్లు ♦ సింగూరుకు రూ.27.50 కోట్లు ♦ వడివడిగా ‘నిమ్జ్’ పనులు! ♦ బాగుందన్న అధికార పార్టీ ♦ మండిపడిన ప్రతిపక్ష పార్టీల నేతలు సిద్దిపేట: సాగునీటి రంగానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేసిన నేపథ్యంలో జిల్లాకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. ప్రాణహితకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు తగ్గినా.. దీనికి ఎగువనున్న కాళేశ్వరానికి వేల కోట్లు కేటాయించడం దానికి అనుసంధానమై ఉండే ప్రాణహితకు మేలు చేసేదేనని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే సింగూరుకు రూ.10.5 కోట్ల మేర కేటాయింపులు పెరగడం విశేషం. ప్రధానంగా కొన్ని రంగాలపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మిగతా సంక్షేమ రంగాలకు కోత పెట్టిందని విపక్ష పార్టీలు అంటున్నాయి. వ్యవసాయం, రుణమాఫీ అంశాలపై స్పష్ట లేదని అవి ఆరోపిస్తున్నాయి. జిల్లా అనంతగిరి సమీపంలో ఒక బ్యారేజీ, చంద్లాపూర్వద్ద మరో బ్యారేజీ, సిద్దిపేట మండలం తడ్కపల్లి శివార్లలో భారీగా 52 టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉన్న కొమురవెళ్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పాములపర్తి వద్ద మరో 21 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీలు నిర్మించి జిల్లాకు సాగు నీరందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో 10 నుంచి 15, 17-20, 23, 36 ప్యాకేజీల పేరిట పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రాజెక్టుల రీ డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా బ్యారేజీలకు సొరంగ మార్గాలు (టన్నెళ్లు) , కాలువల పనులు జరుగుతుండగా ఇటీవలే చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో భూసేకరణ పూర్తవటంతో అక్కడ నిర్మించతల పెట్టిన రంగనాయక సాగర్ ఎడమ కాలువ పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మిగిలిన బ్యారేజీలకు సంబంధించి భూసేకరణకు ప్రత్యేకంగా 5 రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేసి సర్వే పనులను ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.685.3 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. కాని గత బడ్జెట్లో కంటే తక్కువగా కేటాయింపులు చేయడం పట్ల జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగూరుకురూ.10 కోట్లు అదనపు కేటాయింపు కాగా జిల్లాలోని మరో ప్రాజెక్టు అయిన సింగూరుకు గత బడ్జెట్ కంటే రూ.10.5 కోట్లు అదనం గా కేటాయించారు. గత బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు రూ.17 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.26.5 కోట్లు కేటాయించడం విశేషం. నిమ్జ్‌కు రూ.100 కోట్లు జహీరాబాద్‌లో నెలకొల్పనున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)కు రూ.100 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం విశేషం. ఇది సాకారమైతే స్థానిక యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వడివడిగా సాగుతోంది. అలాగే ఏదైనా ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా ఎస్పీ వద్ద రూ.కోటి ఉంచాలనే సర్కారు నిర్ణయంపై పోలీసుల వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రోత్సాహకాలే ప్రోత్సాహకాలు.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గరిష్టంగా ప్రయోజనం కలగనుందని ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పట్టణాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయింపుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అలాగే క్రీడలను క్రమం తప్పకుండా నిర్వహించే వివిధ సంఘాలు, అసోసియేషన్లకు ప్రోత్సాహకాలు అందించాలనే నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇది క్రీడలకు ప్రోత్సాహమిస్తుందని అంటున్నారు. అలాగే గ్రామాల్లో వైద్య సిబ్బందికి సైతం ప్రోత్సాహకాలు ప్రకటించడం పేదలకు వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. పండ్లు, కూరగాయల సాగు ప్రోత్సాహానికి వీలుగా హార్టికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం.. జిల్లా రైతాంగానికి ఊరట కలిగించనుంది. ఇప్పటికే మెదక్ జిల్లా వెజిటబుల్ హబ్‌గా ఆవిర్భవించిన నేపథ్యంలో కూరగాయల రైతులకు ఇది మేలు చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాణ‘హిత’మేనా? ప్రాణహిత - చేవెళ్ల (కాళేశ్వరం) పథకానికి కేటాయించిన నిధులపై పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సింగూరుకు సైతం అన్యాయం జరిగిందని వారంటున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల (కాళేశ్వరం) పథకం ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో గతేడాది కంటే తక్కువ నిధులు కేటాయించింది. సోమవారం ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రూ.685.30 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఈ పథకానికి రూ.1515 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో కరీంగనర్ -
ఆదికవి నన్నయ వర్సిటీపై నిర్లక్ష్యం
రాజానగరం : రాష్ట్ర బడ్జెట్లో ఉన్నత విద్యకు అతిస్వల్పంగానే కేటాయించారంటూ విద్యారంగానికి చెందిన పలువురు పెదవి విరుస్తున్నారు. రూ.1,35,688 కోట్ల బడ్జెట్లో ఉన్నత విద్యకు కేవలం రూ. 2,548 కోట్లు కేటాయిం చగా అందులో జిల్లాకు కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఆ మొత్తంకూడా తెలుగు యూనివర్సిటీకే కేటాయించి, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ఆదికవి నన్నయ యూనివర్సిటీని విస్మరిం చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు వర్సిటీకి దక్కిందిలా.. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వారెందరో ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందజేశారు. దాంతో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా శ్రీకాకుళం, కూచిపూడి శాఖలను అభివృద్ధి చేస్తామన్న పాలకులు ఈ బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీకి కూడా పూర్తిగా నెరవేర్చకుండా తెలుగు వర్సిటీకి కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నారు. సుమారు 40 ఎకరాలు పైబడి భూములు వర్సిటీకి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్న తెలుగు వర్సిటీని రాష్ర్టంలోని 13 జిల్లాలకు విస్తరించాల్సిన సమయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బడ్జెట్లో ‘అనంత’కు అన్యాయం
నిధుల సాధనకు పోరాటమే మార్గం చర్చావేదికలో వక్తల అభిప్రాయం అనంతపురం అర్బన్ : రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, బడ్జెట్ సాధనకు పోరాటం ఒక్కటే మార్గమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్జీఓ హోంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప అధ్యక్షతన ఆదివారం ‘రాష్ట్ర బడ్జెట్- అనంతపురం జిల్లా’ అంశంపై జరిగిన చర్చావేదికలో ఎస్కేయూ ప్రొఫెసర్ బాబయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్.ఎం.బాషా, ప్రొఫెసర్ వెంకటనాయుడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కేవీరమణ ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి చేస్తామంటూ చేస్తున్న ప్రకటనలకు, బడ్జెట్ కేటాయింపునకు పొంతన లేదన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మించి ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.1.35 లక్షల బడ్జెట్లో ప్రణాళిక వ్యయం రూ.49 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఇంత తక్కువతో ఏ విధమైన అభివృద్ధి సాధ్యమన్నారు. రూ.2 వేల కోట్లు అవసరమున్న హంద్రీ-నీవాకు రూ.504 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని, జిల్లాకు సాగునీరు ఎప్పటికి అందుతుందన్నారు. రూ.7 వేల కోట్లతో ఆమోదం పొందిన ‘ప్రాజెక్టు అనంత’ను ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ అభివృద్ధి, అనంతపురం జిల్లాకు నిధులు కేటాయింపు కోసం ఈ నెల 15న ఛలో అసెంబ్లీ చేపట్టామని రాంభూపాల్ చెప్పారు. అంశాల వారీగా డిమాండ్ల పత్రాన్ని సిద్ధం చేసి జిల్లా ప్రజాప్రతినిధులందరికీ ఉత్తరాల ద్వారా తెలుపుతామన్నారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు డాక్టర్ వీరభద్రయ్య, సామాజిక నాయకులు తరిమెల అమర్నాథ్రెడ్డి, చిల్లర వర్తకుల సంఘం నాయకులు గూడూరు వెంకటనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, పాత్రికేయులు నాగరాజు, రవిచంద్ర, సామాజిక నాయకులు పసులూరి ఓబులేసు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ పెద్దిరెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు 50శాతం నిధులివ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం హుస్నాబాద్ : రాష్ర్ట బడ్జెట్లో బీసీలకు 50శాతం నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనాభా దామాషా పద్ధతిన చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ను రూ.2వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల్లోని 70కులాల్లో ఇప్పటికీ 40 సంచారకులాలుగా అభిముక్త జాతులుగా బతుకీడుస్తున్నాయని, వీరి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. కులవృత్తుల్లోని నిపుణులకు వందశాతం రారుుతీతో రుణాలు అందజేయూలన్నారు. అంతకముందు పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి గోపీనాథ్, సంకల్ప స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వలుస సుభాష్, నాయకులు పిడిశెట్టి రాజు, నాగం కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీలకు రూ.710 కోట్ల కేటాయింపుపై హర్షం
నెల్లూరు (టౌన్): రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు రూ.710 కోట్లను కేటాయించడం అభినందనీయమని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. హరనాథపురంలోని చారిటబుల్ ట్రస్ట్‌లో టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతేడాది మైనార్టీలకు బడ్జెట్లో రూ.370 కోట్లను కేటాయించారని, ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేయడం మైనార్టీలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. నిధుల కేటాయింపుపై చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మైనార్టీ నేత అబూబకర్ మాట్లాడారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే వారు అభివృద్ధి చెందుతారన్నారు. నాయకులు రఫీ, మౌలానా అబ్దుల్ అజీజ్, సుభహాన్, మున్వర్, పఠాన్‌బాషా, రియాజ్, షంషుద్దీన్, నన్నేసాహెబ్, జియఉల్‌హక్ పాల్గొన్నారు. -
అన్యాయం
♦ బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించని ప్రభుత్వం ♦ జిల్లాకు ప్రాణప్రదమైన జీఎన్ఎస్ఎస్కు అరకొర కేటాయింపు ♦ దుస్థితిలో కేసీ కెనాల్...మైలవరం ప్రాజెక్టులు ♦ ట్రిపుల్ ఐటీ, యోగివేమన యూనివర్సిటీ పట్ల నిర్లక్ష్యం ♦ మహిళలు, రైతులకు సైతం లభించని చేయూత సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. అరకొర కేటాయింపులతో ప్రభుత్వం జిల్లాపై వివక్ష చూపింది. జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధ వహించింది. జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం సైతం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి ఫలాలందించే పథకాలకు సైతం నిధుల కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ, యోగివేమన యూనివర్సిటీ, రిమ్స్ వంటి అత్యున్నత విద్యాసంస్థల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పట్ల ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని తేటతెల్లమైంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు భారీ కోత పెట్టారు. పథకాలు పూర్తి దశకు చేరిన తరుణంలో నిధులు కేటాయిస్తే అభివృద్ధి ఫలాలు అందుతాయన్న ఇంగితజ్ఞానం ప్రభుత్వ పెద్దలకు లోపించిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి లోపించిన చిత్తశుద్ధి.. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పం టీడీపీ ప్రభుత్వంలో కన్పించడం లేదు. కృష్ణా జలాలు రాయలసీమకు అందించి తద్వారా కరువును పారదోలాలనే సంకల్పంతో జలయజ్ఞం పనులు పుట్టుకొచ్చాయి. పాలకపక్షం శీతకన్ను కారణంగా పెండింగ్ పథకాల జాబితాలోకి జిల్లా సాగునీటి పథకాలు చేరిపోయాయి. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ పథకాలు పూర్తి అయితే వెనుకబడ్డ రాయలసీమకు సాగునీటి వసతి కల్పించే అవకాశం ఉంది. ఈ పథకాల పట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న చిత్తశుద్ధి తర్వాత అధికారంలో ఉన్న పాలకులకు లేకపోవడంతోనే పెండింగ్ పథకాలుగా దర్శనమిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన జీఎన్ఎస్ఎస్కు కేవలం రూ.348 కోట్లతో సరిపెట్టింది. అలాగే పీబీసీకి రూ.84కోట్లు, తెలుగుగంగ ప్రాజెక్టు రూ.70.6 కోట్లు కేటాయించింది. కేసీ కెనాల్ ఆధునికీకరణ పట్ల పాలక పక్షానికి చిత్తశుద్ధి లోపించింది. అదే కోవలో మైలవరం ప్రాజెక్టు సైతం చేరిపోయింది. వెలిగల్లు, చెయ్యేరు, దిగువ సగిలేరు, ఎగువ సగిలేరు, బుగ్గవంక లాంటి ప్రాజెక్టులకు కేటాయింపుల్లో చోటు దక్కకపోవడం గమనార్హం. ఉన్నత విద్యపట్ల సైతం అదే ధోరణి.. జిల్లాలోని అత్యున్నత విద్యా సంస్థల పట్ల సైతం ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రదర్శించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. యోగివేమన యూనివర్సిటీకి టీడీపీ ప్రభుత్వం అరకొర ఆర్థిక కేటాయింపులే చేపట్టింది. వైవీయూ సిబ్బంది జీతభత్యాలకు సరిపడ మేరకే బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే ట్రిపుల్ ఐటీ, రిమ్స్‌కు ఈమారు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. ఐజీ కార్ల్ పశు పరిశోధన సంస్థ ఊసే లేదు. (రూ.కోట్లలో) కేటాయింపులున్నాయి. ఫిరాయింపులు సరే... అభివృద్ధి ఏదీ..? ఇది వరకే 11 అంతర్జాతీయ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే కడప మినహా అన్నీ ప్రాంతాలకు ప్రాధాన్యత దక్కింది. ఉర్దూ యూనివర్శిటీ నెలకొల్పుతామని చెప్పి, హజ్‌హౌస్‌కు పరిమితం చేసింది. జిల్లాకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ప్రభుత్వం అదే శ్రద్ధ అభివృద్ధి విషయంలో చూపలేదనే విమర్శలు వినవస్తున్నాయి. అంకెల గారడీ రాష్ట్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. అంకెల గారడీతో మాయ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏ వర్గానికి కూడా సరిపడినన్ని నిధులు కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన హామీలుగానీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలుగానీ నెరవేర్చే దిశగా కేటాయింపులు జరపలేదు. జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన ఒక్క హామీని కూడా ఈ బడ్జెట్ నెరవేర్చలేదు. - ఆకేపాటి అమర్నాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ. -
రాజధానికి అరకొర
► బడ్జెట్లో జిల్లాకు మొక్కుబడి కేటాయింపులు ► వ్యవసాయం, జలవనరుల శాఖలకు అన్యాయం ► కృష్ణా పుష్కరాలకు రూ. 250 కోట్లు సరిపోయేనా! ► బడ్జెట్‌పై కనిపించని మంత్రులు ప్రత్తిపాటి, రావెల ముద్ర సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర బడ్జెట్లోనూ రాజధానికి అన్యాయమే జరిగింది. అరకొరగా నిధులు కేటాయించి అన్ని రంగాలనూ ఉసూరుమనిపించారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ రంగం, దానికి అనుబంధంగా ఉండే సాగునీటి శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉందని అంతా భావించారు. ప్రాధాన్యత కలిగిన ఈ రెండు శాఖల్లో చేపట్టాల్సిన పనుల కేటాయింపులకు పొంతన కుదరడం లేదు. పులిచింతల, డెల్టా ఆధునికీకరణ, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ పరిరక్షణ, కాల్వల అభివృద్ధి, మరమ్మతులు వంటి పనులకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా నిధుల కేటాయింపు జరిగింది. నిజాంపట్నం హార్బర్‌ను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పుష్కరాలనూ పట్టించుకోలేదు.. రాజధాని నిర్మాణం, పర్యాటక రంగం, కృష్ణా పుష్కరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం అరకొరగానే నిధుల కేటాయింపు చేసింది. పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు పెంచుతానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రంగానికి రూ.227.74 కోట్లు కేటాయించారు.గోదావరి పుష్కరాలకు రూ.1680 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపుష్కరాలకు రూ.250 కోట్లను మాత్రమే కేటాయించింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పుష్కరాల్లో చేపట్టాల్సిన పనులకు రూ.2 వేల కోట్లకుపైగానే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ప్రభావం పుష్కరాల నిర్వహణపై కచ్చితంగా పడుతుంది. డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు.. రాజధాని నిర్మాణం నేపధ్యంలో తాడికొండ నియోజకవర్గం లాంలో వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణం, ఇతర పథకాల అమలుపై ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. హైదరబాద్ నుంచి యూనివర్సిటీ తరలింపునకు నిధుల కేటాయింపు మినహా రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు పెద్దగా లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికేతర విభాగంలో రూ.81.04 కోట్లు విధించనున్నదని, వాటితో నిర్మాణ పనులు చేపట్టనున్నామని ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. రుణమాఫీకి గత ఏడాది రూ.4వేల కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.3500 కేటాయించారు. డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ ప్రస్తావన లేకపోవడంతో మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పాత నిధులకే కొత్త మెరుగు... ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణానికి రూ.18000 కోట్లు ఖర్చు కాగలదని చెబుతున్న ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఎప్పటికి నిర్మాణం పూర్తిచేస్తారో సీఎం సమాధానం చెప్పాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఈ నిధులను గతంలో కేటాయించింది. వాటినే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.. సాగునీటి రంగానికి కేటాయింపులు పులిచింతల ప్రాజెక్టులో ఇంకా రూ.50 కోట్లకుపైగానే పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పనులు చేస్తున్న నిర్మాణ సంస్థకు రూ. 8 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మొత్తం రూ.58 కోట్ల వరకు ఈ ప్రాజెక్టుకు నిధులు అవసరం కావాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.43 కోట్లు కేటాయించారు. డెల్టా ఆధునీకరణకు రూ.112 కోట్లను కేటాయించారు. గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణసంస్థలు ముందుకు రాకపోవడంతో ఆ నిధులు పూర్తిగా వ్యయం కాలేదు. ఈ ఏడాది కొన్ని నిర్మాణ సంస్థలు డెల్టా ఆధునీకరణ పనులు చేస్తున్నాయి. పనులు పూర్తిచేస్తే నగదు చెల్లింపులు జరిగే అవకాశాలు లేకపోవడంతో పనులు ప్రారంభించని కొన్ని సంస్ధలు ఈ కేటాయింపుల్ని చూసి ముందుకు వచ్చే ఆలోచన విరమించుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజి పనులకు రూ.70 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం జరిగే దిగువ ఆప్రాన్ పనులకు ఈ నిధులు సరిపోతాయని, మిగిలిన పనులకు నిధుల కొరత తప్పదని ఉందని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.260 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఈ కేటాయింపులు తక్కువుగా ఉండటంతో ఆధునీకరణ పనులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు సాధించలేని ప్రత్తిపాటి, రావెల సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులోనే మొండిచేయి చూపింది. కాపు కార్పొరేషన్ సంస్ధ ద్వారా రూ.1000 కోట్లు కేటాయించింది. మిగిలిన కార్పొరేషన్లకు నామమాత్రంగా కేటాయింపులు జరిగాయి. బ్రాహ్మణ కార్పొరేషన్, మైనార్టీ, ఎస్టీ, ఎస్టీ కార్పొరేషన్లకు రెండంకెలకు మించకుండా నిధులు కేటాయించారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో రోడ్లు-భవనాల శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించాలి. కానీ రూ.2 వేల కోట్లకు పరిమితం చేశారు. జిల్లా నుంచి వ్యవసాయశాఖ, సాంఘిక సంక్షేమశాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌లు ఆ శాఖలపై తమ ముద్రపడే రీతిలో నిధుల కేటాయింపుగానీ, కొత్త పథకాలను కానీ తీసుకురాలేకపోయారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేయనున్న నిధులపైనే గృహ నిర్మాణాలు ఆధారపడి ఉన్నాయి. వీటికోసం విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లోని పేద వర్గాలు వేలల్లో దరఖాస్తు చేసుకున్నాయి. -
రాష్ట్ర బడ్జెట్ రూ.1,35,700 కోట్లు!
నేడు అసెంబ్లీలో 2016-17 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న యనమల సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2016-17) రూ.4,800 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోవడం ఇది 8వసారి కానుంది. ప్రణాళిక, ప్రణాళికేతరం కలపి మొత్తం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,700 కోట్లను వ్యయం చేయనున్నట్టుగా బడ్జెట్లో ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.49,200 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం రూ.86,500 కోట్లుగా చూపనున్నట్టు తెలుస్తోంది. ప్రణాళికేతర పద్దులోని కొన్ని కేటాయింపుల్ని ఈసారి ప్రణాళిక పద్దులోకి తేవడంద్వారా ప్రణాళిక వ్యయం సైజును పెంచారు. కాగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయానికే పురపాలక మంత్రి పి.నారాయణ శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు. యనమల రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం శాసనసభలో వ్యవసాయ మంత్రి పి.పుల్లారావు, శాసనమండలిలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 10.45కి మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. -
సంక్షేమానికి భారీ కేటాయింపులు
బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు పెరగనున్న నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెరగనున్నాయి. దీనిపై కొంతకాలంగా సీఎం కేసీఆర్ మొదలుకొని కింద వరకు వివిధ స్థాయిల్లో సాగిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ శాఖల కు అదనంగా 20శాతం నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సంక్షేమ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు, ఆయా శాఖల మం త్రులు, కార్యదర్శులు, అధికారుల తర్జనభర్జనల అనంతరం సంక్షేమరంగానికి రూ.28 వేల కోట్ల వరకు బడ్జెట్ కేటాయించవచ్చని తెలుస్తోంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.6వేల కోట్లు, ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.10వేల కోట్లు, గిరిజన సంక్షేమశాఖకు రూ.1,800 కోట్లు, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.6,100 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.2,200 కోట్ల మేర ఆయా శాఖలు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక కింద రూ.8,089 కోట్లు, ఎస్సీ శాఖకు రూ.4 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల ఉపప్రణాళిక కింద 5,036 కోట్లు, ఎస్టీశాఖకు 1,142 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ. 2,020 కోట్లు కేటాయించారు. విడిగా బీసీ సబ్‌ప్లాన్ యోచన... వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్లో విడిగా ఉపప్రణాళిక కింద నిధులు కేటాయించాలని కొంతకాలంగా బీసీ సంఘా లు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా యి. ప్రత్యేక ప్రతిపత్తితో బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీన్ని బీసీ సంక్షేమశాఖ బడ్జెట్లో కాకుండా విడిగా విధా న ప్రకటనగా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈక్రమంలో బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ ఉంటుందా లేదా అన్నది స్పష్టం కాలేదు. సంచార జాతుల సంక్షేమానికి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
రాష్ట్ర బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లు!
బడ్జెట్ తయారీకి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ వెల్లడి కావడంతో రాష్ట్ర బడ్జెట్ తయారీ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈసారి రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండేలా తుది కేటాయింపులు జరపాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రంపై ఏమేరకు ప్రభావం ఉంటుంది.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చే అవకాశముంది’ అని సీఎం ఆరా తీశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సీఎం తన క్యాంపు కార్యాలయంలో టీవీలో వీక్షించారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, ముఖ్య అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, బీపీ ఆచార్యలతో చర్చించారు. కేంద్ర పథకాలు, కేంద్రం పన్నుల్లో రాష్ట్ర వాటా, కేంద్రం నుంచి వచ్చే ఇతర గ్రాంట్లు, తదితర అంశాలపై ప్రాథమికంగా అంచనాలు వేశారు. కేంద్ర బడ్జెట్ ప్రాధమ్యాలు, కేంద్ర కేటాయింపులతో రాష్ట్ర పథకాలపై పడే ప్రభావం గురించి సీఎం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. -
‘బడ్జెట్ భేటీ’ల్లో కన్పించని ఆర్థికమంత్రి ఈటల
► సమీక్షలు, సమావేశాలకు దూరం ► సీఎం నేతృత్వంలోనే కీలక భేటీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఈసారి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అంటీముట్టనట్టుగా ఉండటం ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ శ్రేణుల్లో చర్చనీయంగా మారింది. వరుసగా జరుగుతున్న శాఖలవారీ బడ్జెట్ సమీక్షలు, సమావేశాలన్నీ రెండు నెలలుగా ఆయన ప్రమేయం లేకుండానే చకచకా జరిగిపోతున్నాయి. రెండ్రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న బడ్జెట్ సమీక్ష సమావేశాల్లో కూడా ఈటల పాల్గొనలేదు. ఆయనకు సమాచారం లేకుండానే ఈ సమీక్షలు జరుగుతున్నాయా అన్నదానిపై ఆర్థిక శాఖ వర్గాలు కూడా ఏమీ చెప్పలేకపోతున్నాయి. రెండు రోజులుగా ఈటల కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి ఈటల, ఆయన వెంట రాజ్‌భవన్‌కు కూడా వెళ్లారు. కానీ తర్వాత జరిగిన బడ్జెట్ సమీక్షకు మాత్రం గైర్హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ ఆర్థికమంత్రిగా ఉన్న ఈటల అసెంబ్లీలో వరుసగా గత రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఆ రెండుసార్లు బడ్జెట్ తయారీలో, సమీక్షల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఆయన తయారు చేసిన ముసాయిదా ప్రతిని సీఎం పరిశీలించి సలహాలు సూచనలు, మార్పులు చేర్పులతో తుది బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈసారేమో బడ్జెట్ కసరత్తు మొదలైనప్పట్నుంచీ ఈటల దూరంగా ఉన్నారు. ఇటీవల వరుసగా రెండుసార్లు జరిగిన కేబినేట్ సమావేశాల్లోనూ కేసీఆర్ అన్నీ తానై బడ్జెట్‌పై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ప్రభుత్వ పథకాలు, పద్దుల కుదింపు, విలీనంపై సమీక్షించాలంటూ అదే సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి సూచించారు. దాంతో ఎన్నడూ లేనివిధంగా ప్రణాళికా సంఘం అధ్వర్యంలో వరుసగా నాలుగు రోజులు అన్ని శాఖల అధికారులు సమావేశమవటం హాట్‌టాపిక్‌గా మారింది. ఈటల ప్రస్తుతం ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నారు. నేడు ఢిల్లీకి ఈటల ఇటీవల వరుసగా రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. శుక్రవారం మరోమారు ఢిల్లీ వెళ్తున్నారు. జైట్లీ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వస్తు సేవల పన్నుపై ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ కమిటీ భేటీలో ఈటల పాల్గొంటారు. -
నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతల అప్పగింత అంశం తో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించేందుకు మంత్రివర్గం ఆదివారం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్ ఎజెండా ప్రకారం బడ్జెట్‌పైనే ప్రధానంగా చర్చ జరగనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శాఖల వారీగా బడ్జెట్ పద్దులతో పాటు త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజు, గవర్నర్ ప్రసంగించే తేదీని నిర్ణయించనుంది. 1993కు ముందు నుంచి ప్రభుత్వంలో పనిచేస్తున్న 5 వేల మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఆమోదించనుంది. -
30 ఏళ్ల కిందటి పథకాలున్నాయా!
బడ్జెట్ పద్దులపై సీఎస్ విస్మయం సాక్షి, హైదరాబాద్: ‘ఇరవై, ముప్ఫై ఏళ్ల కిందటి కాలం చెల్లిన పథకాలు ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్లో ఉన్నాయి. ఇవి అవసరం లేనివి కాదా? ఇప్పుడు వీటికేమైనా ప్రాధాన్యముందా? ఎప్పుడైనా సమీక్షించుకున్నారా’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వివిధ విభాగాల అధికారులను ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పలేక సంబంధిత అధికారులు నోరెళ్లబెట్టారు. పథకాల కుదింపు ఎజెండాగా రాజీవ్‌శర్మ సమక్షంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ చర్చ జరిగింది. విద్యా శాఖలో ముప్ఫై ఏళ్ల కిందటి ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్లో ఉంది. ఇది అమల్లో లేని పథకమైనప్పటికీ ఏటా విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించటం, ఆర్థిక శాఖ యథాతథంగా బడ్జెట్లో పొందుపరచటం ఆనవాయితీగా మారింది. అదే తరహాలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులకు అవార్డులు, పారితోషికం ఇచ్చే పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలన్నింటా ఉంది. వీటన్నిం టినీ ఏదో ఒక పద్దు కింద ఒకే శాఖకు అప్పగిస్తే సిబ్బంది తగ్గడంతో పాటు పనితీరు సమర్థంగా ఉంటుందని చర్చ జరిగింది. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ విభాగాలన్నీ విడివిడిగా నిర్వహిస్తున్నాయి. వీటిని సైతం ఒకే పద్దుగా ఒకే శాఖ పరిధి లో ఉంచితే నిర్వహణ కూడా సులభంగా ఉం టుం దని, రెండేసి చెల్లింపులు జరిగే లొసుగులకు అడ్డుకట్టు వేసినట్లవుతుందని భావించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో జాబితా... వరుస పనిదినాలైన శనివారం, సోమవారం కొనసాగిన ఈ సమావేశాలు ఇంకా పూర్తి కాలేదు. మరో నాలుగైదు విభాగాలు మిగిలినందున మంగళవారం పోలింగ్ సెలవు ఉన్నప్పటికీ ఈ సమీక్షను కొనసాగించాలని సీఎస్ నిర్ణయించారు. సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల ఐదు కల్లా ఏయే పథకాలను విలీనం చేయాలి.. వేటిని రద్దు చేయాలి.. అనే స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వీటి ఆధారంగా తుది జాబితాను అదే రోజు సీఎం ఆమోదానికి పంపించే అవకాశాలున్నాయి. -
పథకాల కుదింపే ఎజెండా!
నేటి నుంచి సీఎస్ ఆధ్వర్యంలో సమీక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ కసరత్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా పెద్దగా అవస రం లేని పథకాలను కుదించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. శని, సోమవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, పురపాలక, విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం-అనుబంధ శాఖలు, పౌర సరఫరాలు, అటవీ-పర్యావరణం, ఇంధ నం, న్యాయ, ప్రణాళికా శాఖల అధికారులతో శనివారం.. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజ న, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, ఆర్ అండ్ బీ, రవాణా, రెవెన్యూ, పరిశ్రమలు, పెట్టుబడులు, గృహ నిర్మాణం, కార్మిక శాఖ, పర్యాటక, సాంస్కృతిక, ఐటీ, జీఏడీ, హోం శాఖల ఉన్నతాధికారులతో సోమవారం భేటీకానున్నారు. అయితే ప్రధానంగా పథకాలను కుదించే అంశంపైనే ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్లో వందలాది పథకాలకు నిధులు కేటాయించే ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రస్తుతం వాటిలో అవసరం లేనివి, కాలం చెల్లిన వాటిని తొలగించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. పలు చిన్న చిన్న పథకాలను ఇతర పథకాల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పద్దుల సంఖ్య తగ్గి బడ్జెట్ కేటాయింపులు మరింత స్పష్టంగా ఉంటాయని భావిస్తోంది. ప్రాధాన్యతాక్రమంలో ఏయే పథకాలను కొనసాగించాలి, వేటిని రద్దు చేయాలి, వేటిని విలీనం చేసే అవకాశముందనే దానిపై పూర్తి సమాచారంతో ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచిం చింది. వాటన్నింటినీ పరిశీలించి చివరకు మిగిలే పథకాల తుది జాబితాను సిద్ధం చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ సారథ్యంలో అధికారుల భేటీలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులతో రెండు, మూడు దఫాలు బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన కేబినెట్ భేటీలోనూ బడ్జెట్‌పైనే సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేయాలని మంత్రులు, కలెక్టర్లను ఆదేశించారు. దీంతో పథకాల కుదింపు ఒకవైపు.. ప్రణాళికల తయారీ మరోవైపు వేగం పుంజుకున్నాయి. -
కేంద్ర నిధులకోసం ఆఖరి యత్నం
ముగిసిన 13వ ఆర్థిక సంఘం గడువు రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 3010 కోట్లు వచ్చింది రూ.2110 కోట్లు బకాయి రూ.900 కోట్లు ఆఖరి రోజున రూ.183 కోట్లు విడుదల మరిన్ని నిధులు వస్తాయనే ఆశలు సాక్షి, హైదరాబాద్: పదమూడో ఆర్థిక సంఘం కాల వ్యవధి ముగిసింది. ఆఖరి రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.183 కోట్లు విడుదల చేసింది. తొలి ఏడాది కేంద్రం నుంచి వచ్చే నిధులు భారీగా తగ్గిపోవటంతో... రాష్ట్ర బడ్జెట్‌కు భారీగా కోత పడింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం నిధుల విడుదల రాష్ట్ర ఖజానాకు కొంత ఊరటనిచ్చింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పటి నుంచి 13వ ఆర్థిక సంఘం ద్వారా తెలంగాణకు రూ. 3,010 కోట్లు రావాల్సి ఉంది. తాజాగా విడుదలైన నిధులతో కలిపితే ఇప్పటివరకు రూ.2,110 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఈ లెక్కన మరో రూ. 900 కోట్ల బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. దీంతో పాటు 2010లో అమల్లోకి వచ్చిన 13వ ఆర్థిక సంఘం కాల పరిమితి కూడా ముగిసింది. దీంతో ఈ నిధులు మురిగిపోయే అవకాశముంది. ఈ బకాయిలు విడుదలవుతాయా.. లేదా అనేది సందిగ్ధంగానే మిగిలిపోయింది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన మిగతా బకాయిలను తెచ్చుకునేందుకు ఆర్థిక శాఖ చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. మిగతా నిధులను విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి తాజాగా కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. బకాయి ఉన్న రూ. 900 కోట్లలో ఎంతో కొంతైనా విడుదలయ్యే అవకాశముందని, రేపోమాపో ఈ నిధులు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను కేంద్రం నిలిపివేయలేదని.. ఈ ప్రక్రియ పురోగతిలో ఉన్నందున మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు. -
సొంతిల్లు కలేనా!
కష్టతరంగా మారిన పేదోడి గూడు కొత్త సర్కారు వచ్చింది.. రెండు గదుల ఇల్లు కాదు రెండు బెడ్రూంల ఇల్లు ఇస్తానన్నాడు. ఇక నాకు ఇంటి సమస్య తీరినట్టేనని భావించారు బడుగులు.. కానీ, ఇది కేవలం మాటలకే తప్ప చేతలకు కాదని తేలిపోయింది. కనీసం బడ్జెట్లో వీటి గురించి ప్రస్తావించకపోవడంతో సొంతిల్లు చెట్టెక్కినట్టయింది. సాక్షి, మహబూబ్‌నగర్: పేదోడికి కాసింత గూడు కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో గృహ నిర్మాణ రంగానికి అతి తక్కువ కేటాయింపులు చేయడంతో పేదల సొంతింటి కల... కలగానే మిగిలిపోనుంది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు ఈ ఏడాది దాదాపుగా లేనట్లే అని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఇక గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి అగాథంలోకి నెట్టినట్టయింది. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ పేరుతో చేస్తున్న కాలయాపన కారణంగా సామాన్యులు నలిగిపోతున్నారు. పైగా ఇంకా ఇప్పటికీ చెల్లింపులు పూర్తికాని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లుల పరిస్థితిపై అయోమయం నెలకొంది. వీటికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 2,78,447 ప్రశ్నార్థకంగా మారాయి. అందులో 1,91,081 ఇళ్లు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా ఇళ్ల మంజూరు జరిగి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్ల భవిష్యత్తు కూడా అయోమయంగానే ఉంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ను కూడా ప్రభుత్వం పూర్తిగా నిలిపేయడంతో దాదాపు 87,366 ఇళ్లకు బిల్లులు రాకుండా మధ్యలోనే నిలిచిపోయాయి. వీటిపై కూడా ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌కు ఆదేశించింది. ఇది పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందో అధికారులే చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కొందరు అప్పులు చేస్తుంటే... మరికొందరు మధ్యలోనే నిలిపేశారు. సగం ఇళ్లు అంతేసంగతి..! పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నడుం బిగించారు. శ్యాచురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థికసాయం అందజేయడం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే జిల్లాకు మొత్తంగా 5,80,725 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 3,89,644 ఇళ్లు ఆన్లైన్లో నమోదవగా, 3,02,278 ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 87,366 ఇళ్లు వివిధ దశలలో పనులు నిలిచిపోయాయి. అందులో బేసిమెంట్ స్థాయిలో 55,146 (బీఎల్) ఇళ్లు నిలిచిపోయాయి. దర్వాజ స్థాయి (ఎల్ఎల్)లో 7,172 ఉన్నాయి. చెత్తు స్థాయిలో (ఆర్ఎల్) 25,048 ఇళ్లు అర్థంతరంగా నిలిచిపోయాయి. ఇంకా మొదలుపెట్టని 1,91,081 ఇళ్లను రద్దుచేశారు. దీంతో జిల్లాకు మంజూరైన ఇళ్లలో 2,78,447 అంటే దాదాపు 55శాతం ఇళ్లను తిరిగి ప్రభుత్వం లాగేసుకున్నట్లయింది. విచారణ పూర్తయ్యేదెన్నడు...? టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. 3లక్షల ఖర్చుతో నిర్మిస్తామని చెబుతోంది. అయితే అది కూడా సీబీసీఐడీ విచారణ పూర్తయిన తర్వాతనే అని సీఎం స్పష్టం చేశారు. కానీ జిల్లాలో సీఐడీ విచారణ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతంఎంపిక చేసిన అలంపూర్, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో విచారణ సాగింది. ఇప్పటివరకు కేవలం 1,664 ఇళ్లకు సంబంధించి మాత్రమే విచారణ జరిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి విచారణ జరగడానికి ఎంత సమయమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇళ్లకు అనుమతులు, బిల్లుల చెల్లింపు తంతులోని అవకతవకలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకున్న తర్వాతనే కొత్త లబ్ధిదారుల ప్రక్రియ అంటే కనీసం ఏడాదికి పైగా పట్టే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అన్ని వర్గాలకూ అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అన్ని వర్గాల వ్యతిరేక బడ్జెట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. మాటల గారడీ తప్ప సరైన కేటాయింపులు జరగలేదని ధ్వజమెత్తింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు షేక్ బేపారి అంజాద్ బాషా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు.. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 1.13 కోట్ల బడ్జెట్లో మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వికలాంగులకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే కేటాయించారని బాషా విమర్శించారు. మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయిస్తే, ఏపీ బడ్జెట్లో కేవలం రూ.370 కోట్లు కేటాయించారన్నారు. ఎస్సీలకు తెలంగాణలో రూ.6 వేల కోట్లు కేటాయించగా.. ఇక్కడ రూ.2123 కోట్లు, ఎస్టీలకు అక్కడ రూ.3,300 కోట్లు కేటాయించగా ఏపీలో రూ.990 కోట్లు కేటాయించారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు కేటాయించినా.. అందులో రూ.1,600 కోట్లు పట్టిసీమకు పోతే మిగిలేవి రూ.3 వేల కోట్ల పైచిలుకేనన్నారు. ఈ కేటాయింపులు పెంచేంత వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని చెప్పారు. ఈ వర్గం ఆ వర్గం అని చూడకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఇదని చెవిరెడ్డి విమర్శించారు. కీలకమైన అంశాలకు నామ మాత్రపు కేటాయింపులే జరిగాయని, నిరుద్యోగ భృతి, అంగన్వాడీల జీతాల పెంపు వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. సంక్షేమ రంగానికి కూడా భారీ కోత పెట్టమే కాకుండా అన్ని వర్గాలను మోసం చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. 10 జిల్లాల తెలంగాణ ప్రభుత్వానికంటే 13 జిల్లాల ఏపీ తన బడ్జెట్లో చాలా తక్కువ కేటాయింపులు జరిగాయని చెప్పారు. ఏ మంత్రికీ సబ్జెక్ట్‌పై అవగాహన లేదు.. బడ్జెట్‌కు ముందు కూడా చెవిరెడ్డి మీడియా పాయింట్లో మాట్లాడారు. చంద్రబాబు కేబినెట్లోని ఏ మంత్రికీ సబ్జెక్ట్‌పై అవగాహన లేదని, ఒక మంత్రిని అడిగితే మరో మంత్రి సమాధానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అడిగినదానికి సరిగ్గా చెప్పలేక వైఎస్సార్సీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు ఎందుకు ఈ అసమర్ధ మంత్రులను పెట్టుకున్నట్టని ప్రశ్నించారు. సభలో అధికార పక్షం హుందాగా వ్యవహరించాలని, తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శించడం మంచి సంప్రదాయం కాదని సూచించారు. రాష్ట్రంలో 7.95 లక్షల ఇళ్లు పూర్తి చేశామంటున్నారని.. తొమ్మిది నెలలవుతుంటే ఒక ఇటుక కట్టడం కాదు కదా, ఒక్క ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. కాంట్రాక్టర్లకు రూ. 395 కోట్లు బకాయిలున్నాయని చెప్పారు. శాసనసభ సాక్షిగా గవర్నర్‌తో అబద్దాలు చెప్పిస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
‘ఈటెల’.. ఏమిటిలా!
బంగారు తెలంగాణకు బాట అన్న ప్రభుత్వం బడ్జెట్లో అంకెలగారడీ చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ జిల్లాపై చిన్నచూపు చూపారని విమర్శలు వస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులకు అరకొర నిధులు..సంక్షేమ పథకాలకు నామమాత్రం కేటాయింపులతో జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యూయి. - రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై చిన్నచూపు - సాగునీటి ప్రాజెక్టులకు స్వల్ప నిధులు - రాజీవ్‌సాగర్‌కు రూ.25 కోట్లు - ఇందిరాసాగర్‌కు రూ.10 కోట్లు - పెదవాగుకు రూ.50 కోట్లు - పెద్ద ప్రాజెక్టులకు అరకొర నిధులు - రైతు రుణమాఫీకి నామమాత్రమే సాక్షి, ఖమ్మం: బంగారు తెలంగాణ ధ్యేయం అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసుల ఆశలను ఆవిరి చేసింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్తెసరుగా నిధులు కేటాయించి జిల్లాపై వివక్ష చూపింది. భారీ మొత్తంలో నిధులు విడుదలై ప్రాజెక్టుల పూర్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లేకపోవడం గమనార్హం. ఈ బడ్జెట్లో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ ప్రభుత్వం స్వల్పంగా నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పట్లో పూర్తికానట్లే. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు లేకపోవడంతో గడువు దాటినా ఈ ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులపై శీతకన్నే వేసింది. ఇందిరాసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,824 కోట్లు. కానీ ఇప్పటి వరకు నిధులు రూ.1,150.36 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.886.533 కోట్లు ఖర్చు చేశారు. 2011-12 నాటికి అన్నిరకాల పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయిస్తే.. ఈ బడ్జెట్లో కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది. గడువు దాటినా నిధుల కేటాయింపు తక్కువగా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఇక ఇప్పట్లో పూర్తి కానట్లేనని విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాతో పాటు వరంగల్ జిల్లాల్లోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీనికి భారీ ఎత్తున నిధులు విడుదల అవుతాయని ఇరు జిల్లాల రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణలోని ఈ రెండు జిల్లాల్లోని భూములనే సస్యశ్యామలం చేస్తున్నా కేవలం ఈ బడ్జెట్లో రూ.25 కోట్లు మాత్రమే విదిల్చారు. ఈ నిధులు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగిరం కావడానికి ఏమాత్రం సరిపోవు. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నూతన ప్రభుత్వం పెద్దవాగు ప్రాజెక్టుకు రూ.20 లక్షలు కేటాయిస్తే ప్రస్తుతం రూ. 50కోట్లు కేటాయించారు. అశ్వారావుపేట మండలంలోని పెదవాగుపై అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రిజర్వాయర్ నిర్మాణానికి చొరవ చూపారు. మొత్తంగా అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. అయితే కుడి ఎడమ కాల్వల ద్వారా అశ్వారావుపేట మండలంలో 2 వేలు, వేలేరుపాడు మండలంలో 4 వేలు, కుక్కునూరులో మరో 4వేల ఎకరాల ఆయకట్టుకే నీరు అందుతోంది. పంట భూముల చివరి వరకు కాల్వలు లేకపోవడం, ఉన్న కాల్వలు శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినా ఆంధ్రప్రదేశ్‌లోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వెళ్లాయి. మేజర్ ఆయకట్టు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ నిధుల ద్వారా ఎక్కువగా ఆ రాష్ట్ర రైతులే లబ్ధి పొందే అవకాశం ఉంది. గోదావరి నీటినిృకష్ణా నదికి అనుసంధానం చేసే దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌కు గత బడ్జెట్లో ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తే.. ఈ బడ్జెట్లో రూ.కోటి కేటాయించింది. ఇక జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు గత బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.196. 47 కోట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో నల్లగొండతోపాటు జిల్లా కూడా ఉండటంతో మనకు రూ.100 కోట్ల వరకు రానున్నాయి. వెంకటాపురం మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో పాలెంవాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో 10 వేల ఏకరాలకు సాగునీరు అందించేందుకు రూ.70.90 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం 148.99 కోట్లకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తోంది. గత బడ్జెట్లో రూ.కోటి కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.5కోట్లు కేటాయించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) ద్వారా జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాల్లో సుమారు 79వేల ఎకరాలు సాగులోకి రావాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్లుగా సాగుతోంది. ప్రధానంగా వరంగల్ నుంచి జిల్లాలోకి ఈ కాల్వకు సంబంధించిన లింక్ కాల్వల తవ్వకం జరగలేదు. ఈ బడ్జెట్లో ఎస్ఆర్ఎస్పీకి భారీ ఎత్తున రూ.747 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలోని ఈ ఆయకట్టుకు కూడా లింక్ కాల్వల నిర్మాణం చేపట్టవచ్చని రైతులు ఆశిస్తున్నారు. వ్యవసాయ రుణమాఫీ కింద జిల్లాకు రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. 2.90 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. గత బడ్జెట్లో ప్రభుత్వం రూ.364 కోట్లను జిల్లాకు మంజూరు చేసింది. ఈ బడ్జెట్లో రుణమాఫీ కింద రూ.4,800 కోట్లను చూపింది. ఈ లెక్కన జిల్లాకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ కింద సుమారు రూ.500 కోట్ల వరకు రానున్నాయి. దళితులకు భూమి కొనుగోలు కింద జిల్లాలో కేవలం కొంతమందికే అట్టహాసంగా భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. 2 వేలమందికి పైగా లబ్ధిదారులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే జిల్లాకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అయితే అర్హులైన లబ్ధిదారుల్లో కేవలం 200 మందికే ఈ ఆర్థిక సంవత్సరంలో లబ్ధి కలగనుంది. మిగతా లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పవు. - గతంలో జిల్లా కేంద్ర ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఆస్పత్రి గురించి బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదు. - ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు కొంతమేర నిధులు కేటాయించడంతో జిల్లాలోని ఈ వర్గాలకు ఊరట కలగనుంది. - రూ.3లక్షలతో డబుల్ బెడ్ రూమ్, కిచెన్‌తో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బడ్జెట్లో ఈ గహ నిర్మాణాలకు నిధుల కేటాయింపు చేయలేదు. లక్ష మంది వరకు నిరుపేదలు జిల్లాలో ఇప్పటికేృగహ నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూసినా ప్రభుత్వం వారి ఆశలపై నీరు చల్లింది. - గతంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.4,200 ఉండగా ఇప్పుడు రూ.7,000కు పెంచారు. సహాయ కార్యకర్తలకు గతంలో రూ.2,450 వేతనం ఇవ్వగా దీన్ని రూ.4,500కు పెంచారు. జిల్లాలో 3299 మంది కార్యకర్తలు, 1006 మంది సహాయ కార్యకర్తలకు ఊరట దక్కింది. -
ఆశల బడ్జెట్
కేంద్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించని నేపథ్యంలో గురువారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. డెల్టా ఆధునీకరణకు, పులిచింతల పూర్తికి, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి, తాగునీటి సమస్య పరిష్కారానికి, రాజధాని నిర్మాణ క్రమంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారు. అలాగే రాజధాని జిల్లా కేంద్రం గుంటూరు నగరంపై ప్రత్యేక వరాలు కురిపించాలని కోరుకుం టున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్నింటికైనా నిధులు కేటాయిస్తారని ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాటి ప్రాధాన్యం లభించలేదు. శాసనసభలో గురువారం ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యంగా సాగు, తాగునీరు ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సి ఉంది. వ్యవసాయం, వాణిజ్యరంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులు నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా డెల్టా ఆధునీకరణ పనులు రెండేళ్ల నుంచి ముందుకు కదలడం లేదు. పులిచింతల ప్రాజెక్టు విషయంలోనూ ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో ఉన్న గుంటూరు ప్రజల తాగునీరు, మురుగునీటి పారుదల, రహదారుల నిర్మాణాలు, మరమ్మతులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం ఉంది. డెల్టా ఆధునీకరణకు సంబంధించి రెండేళ్ల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలతో చర్చలు జరిపింది. కొత్త ఎస్ఎస్ఆర్ ప్రకారం ధరలు చెల్లిస్తే పనులు తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థలు చెప్పుకొచ్చాయి. ఈ పనులన్నీ తిరిగి ప్రారంభం కావాలంటే అదనంగా రూ.1500 కోట్ల వరకు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో చెల్లించాల్సిన బకాయిలు, అదనంగా విడుదల కావాల్సిన నిధులతో మొత్తం ఈ రంగానికి రూ.3000 కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన నిర్మాణ పనులు, ముంపు గ్రామాల బాధితులకు పునరావాస చర్యల నిమిత్తం రూ.2 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తుళ్లూరు కేంద్రంగా నిర్మితం కానున్న రాజధానికి అనుబంధంగా ఉండే గ్రామాల నుంచి రహదారులు, రవాణా సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రహదారుల విస్తరణ, విద్యుత్ సౌకర్యం, గ్రామాలకు రక్షిత మంచినీటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఒక్కటే రూ. 500 కోట్ల వరకు నిధులు కేటాయించాలని కోరింది. నూతన రాజధాని జిల్లా కేంద్రంగా ఉన్న గుంటూరు నగరం అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని నగర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో నగరంలో ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప కింద మొత్తం 3,100 మందికి సొంతిళ్లు సమకూర్చారు. ఇటీవల రాజీవ్ గృహకల్ప పథకానికి 22 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కరికి కూడా గృహనిర్మాణం చేపట్టలేదు. సొంతింటి కలను నిజం చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో ప్రధాన, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. కేవలం 40శాతం మాత్రమే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థఉంది. 1300 కిలోమీటర్ల పక్కా డ్రైన్లు, 700 కిలోమీటర్ల కచ్చా డ్రైన్లు ఉన్నాయి. నగరం నుంచి నీరు బయటకు వెళ్లే ప్రధాన డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి, వరదనీటి పారుదలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధాన రహదారుల విస్తరణ కార్యక్రమం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అరండల్‌పేట ఫ్లైఓవర్బ్రిడ్జి విస్తరిస్తే కొంత ఫలితం ఉంటుంది. రైల్వేక్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో త్వరగా ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లుగా అదిగోఇదిగో అంటూ ఊరిస్తున్నారే తప్ప ఆచరణలోకి మాత్రం రావడం లేదు. -
వడ్డించేది మనోడే
తెలంగాణ శాసనసభలో గురువారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లావాసి కావడంతో అందరి దృష్టి బడ్జెట్‌పై పడింది. వడ్డించేటోడు మనోడే కావడంతో జిల్లాకు అధికంగా నిధులు వస్తాయని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తగిన డబ్బులు సమకూరుస్తారనే ఆశాభావంతో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. గత ఏడాది చివర్లో స్వల్పకాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈటెల ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తారనే ఆశాభావాన్ని స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌గ్రిడ్, హరితహారం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో జిల్లాల్లోని పలు ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయినా... ఎత్తిపోతల పనులు పెండింగ్‌లో ఉండడంతో రాబోయే ఖరీఫ్ నాటికి నీరందించాలనే లక్ష్యం నెరవేరేలా లేదు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పరిధిలో మిడ్‌మానేరు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులకు నిధుల సమస్య వెంటాడుతున్నందున తగిన కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కరవు ఛాయలు కమ్ముకున్నారుు. భూగర్భ నీటిమట్టాలు పూర్తిగా పడిపోతుండటంతో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన కేటాయింపులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నందున వీటికి సైతం నిధులు కేటాయించాలని జనం కోరుతున్నారు. అవేమిటంటే... జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల సేకరణ, మెడికల్ కళాశాల ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, ప్రధాన ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం వంటి వాటికి బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగాల్సి ఉంది. శాతవాహన యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్మాణానికి రూ.60 కోట్లు అవసరం కాగా, రూ.24.40 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ బడ్జెట్లో రూ.35.60 కోట్లు కేటాయించాల్సి ఉంది. మిడ్మానేరుతోపాటు ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయింపు జరగాలి.జిల్లాలో మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కింద 5939 చెరువులకు 1188 చెరువులను మొదటి సంవత్సరంలో పునరుద్ధరించేందుకు పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంది. అర్బన్, రూరల్ వాటర్‌గ్రిడ్ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయింపు జరగాల్సి ఉంది. సీఎం హామీల్లో భాగంగా... ఎస్సారెస్పీ-మిడ్‌మానేరు మధ్య చెక్‌డ్యాం నిర్మాణానికి, ఫ్లడ్‌ఫ్లో కెనాల్ స్థాయి పెంపునకు, ఎత్తై ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చిన్నపాటి లిఫ్టుల ఏర్పాటుకు నిధులు కేటాయించాల్సి ఉంది.జిల్లాలో ఏడు చోట్ల కొత్త వ్యవసాయ మార్కెట్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు అవసరం. కొండగట్టుపైన 300 ఎకరాల స్థలాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం, తిరుపతి స్థాయిలో తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు కావాలి.రామగుండం మున్సిపాలిటీకి ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీటి సరఫరాకు పైపులైన్, మైనింగ్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది.పెద్దపల్లి నియోజకవర్గంలోని హుస్సేనిమియా వాగుపై మూడు చెక్‌డ్యాంల నిర్మాణంతోపాటు కరీంనగర్లో ఔటర్‌రింగు రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు అనుగుణంగా నిధుల మంజూరు చేయూలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
నిరుటి కంటే తక్కువే..!
హైదరాబాద్: ఆశల పల్లకి నుంచి ఆచరణాత్మక బడ్జెట్ దిశగా తెలంగాణ సర్కారు కొత్త పంథాకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆదర్శంగా చేసుకొని.. ఈసారి కొత్త బడ్జెట్ రూపకల్పనకు మొగ్గు చూపుతోంది. వృద్ధి రేటు, అభివృద్ధిని పక్కనబెట్టి వాస్తవాలను ప్రతిబింబించే విధంగా 2015-16 బడ్జెట్‌ను తయారు చేసింది. ఈ నెల 11న ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అందరి దృష్టినీ ఆకర్షించనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో ఎంత మొత్తం కేటాయింపులుంటాయి..? తొలి బడ్జెట్ రూ.లక్షా 637 కోట్లతో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి అంతకుమించి భారీ బడ్జెట్ ప్రవేశపెడుతుందా.. లేదా కొంత వెనక్కు తగ్గుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం గత నవంబర్ లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అం చనాలన్నీ ఆచరణలో తలకిందుల య్యాయి. ఆశించినంత రెవెన్యూ రాబడి లేకపోవటం.. కేంద్రం నుంచీ పెద్దగా నిధులు రాకపోవటం తో సర్కారు ఇరకాటంలో పడింది. ఫిబ్రవరి వరకు ఉన్న ఆదాయ వ్యయాల అంచనాలను విశ్లేషిస్తే 2014-15 బడ్జెట్లో దాదాపు రూ. 40 వేల కోట్ల కోత తప్పని పరిస్థితి తలెత్తింది. అందుకే ఈ ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించాలని.. వాస్తవాల ఆధారంగా మంచి చెడులను ప్రజ లకు విడమర్చి చెప్పాలని.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో గతంలోలా పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో రాని ఆదాయం నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నాటి నుంచి నేటివరకు ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. రూ.80,090 కోట్ల రెవె న్యూ ఆదాయం లభిస్తుందని భావించింది. ఫిబ్రవరి ఒకటి నాటికి కేవలంరూ.30,187కోట్ల ఆదాయమే వచ్చింది. రెండోవారానికి ఈ ఆదాయం రూ.33 వేల కోట్లకు పెరిగినప్పటికీ ఖజానాకు పెద్దగా ఒరి గిందేమీ లేదు. దీంతో ఆర్థిక లోటు రూ.47 వేల కోట్లకు చేరినట్లు స్పష్టమవుతోంది. మార్చి మొదటివారంలోనూ ఇంచుమించుగా ఈ లోటు రూ.40 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో.. గతంలో నేల విడిచి సాము చేసిన సర్కారు ఇప్పుడు దిగొచ్చింది. తగ్గిన కేంద్ర నిధులు కేంద్ర ప్రభుత్వ పన్నులు, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.14 వేల కోట్ల నిధుల్లో ఇప్పటి వరకు రూ. 8,768 కోట్లే వచ్చాయి. మిగతా రూ.6 వేలకోట్లకు పైగా నిధులపై కేంద్రం నోరు మెదపటం లేదు. పదమూడో ఆర్థిక సంఘం నిధుల్లోనూ భారీ కోతలే పడ్డాయి. విభజనానంతరం ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ వాటాగా రూ.3 వేల కోట్లు రావాల్సి ఉండగా.. వెయ్యి కోట్లే వచ్చాయి. భూముల అమ్మకం ద్వారా వస్తాయని భావిం చిన రూ.6,500 కోట్లలో రూ.66 కోట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ గతం కంటే తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పథకాలు ఉండనట్టే! తొలి బడ్జెట్‌ను పరిశీలిస్తే పది నెలల కాలానికి రూ.లక్షా 637 కోట్లు కేటాయించారు. ఈ ప్రకారంగా చూస్తే ప్రస్తుత బడ్జెట్ రూ.లక్షా 20 కోట్లు దాటాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితేం కనిపిం చడం లేదు. ‘గతంలో ప్రవేశపెట్టింది తొలి బడ్జెట్. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత సీఎం కేసీఆర్ అంచనాలకు మించి హామీలి చ్చారు. వాటిని అమలు చేయాలన్నా.. జనం లో ఆత్మస్థైర్యం నింపాలన్నా.. ప్రజల ఆకాం క్ష ల మేరకు భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరైంది. ఇప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమైంది. అందుకే కొంత వెనుకడుగు వేయక తప్పదు..’ అని ఆర్థికశాఖ వర్గాలు తమ అభిప్రాయం వ్య క్తం చేశాయి. కొత్త పథకాల జోలికి వెళ్లకుండా.. ఉన్నవాటికే నిధులు కేటాయించాలనేది సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది. ఉన్నవాటికే ప్రాధాన్యం కేజీ టు పీజీ పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం లో ప్రారంభించాలని.. దీన్ని అమలు చేసేం దుకు మండల స్థాయిలో ప్రస్తుతమున్న రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, జ్యోతి రావు పూలే పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకా నికి చోటు కల్పించే అవకాశముంది. అమల్లో ఉన్న పది పథకాలను ఈసారి బడ్జెట్లో మరిం త ఫోకస్ చేయాలని నిర్ణయించింది. హరితహారం, కొత్త రోడ్ల నిర్మా ణం, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యు త్తు, భూముల కొనుగో లు, హాస్టళ్లకు సన్నబి య్యం, అంగన్వాడీలకు అదనపు పౌష్టికాహారం, కల్యాణలక్ష్మి పథకాలకు అత్యంత ప్రాధాన్యమివ్వనుంది. ఉచిత విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీకి, విద్యుత్తు సమస్యను అధిగమిం చేందుకు నిర్మించ తలపెట్టిన కొత్త ప్లాంట్లను వేగవంతం చేసేందుకు ఈసారి బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించే అవకాశముంది. -
నిధులొచ్చేనా ?
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో దీనిపై జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్లలో జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లోనైనా జిల్లాకు పెద్దపీట వేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు సీమాంధ్ర పాలకులు శీతకన్ను వేయడం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని పదేపదే ప్రస్తావించిన టీఆర్ఎస్... ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో ఎలాంటి హామీలు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు వేసవి సమీపిస్తుండడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కరువు, కరెంటు కోతలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధుల స్పందన కీలకం కానుంది. సాగు కలిసి రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు పరిహారం చెల్లింపుపై ప్రకటన కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ, రోడ్ల మరమ్మతు వంటి భారీ ప్రణాళికలు ఓ వైపు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాయి. మరోవైపు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పాలమూరు ఎత్తిపోతలకు సీఎం కే సీఆర్ ఇప్పటివరకు శంకుస్థాపన చేయకపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. వలసలకు చెక్ పెట్టేనా? ‘బంగారు తెలంగాణ’ సాధనలో తొలిమెట్టుగా భావించిన గతేడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ తొలి బడ్జెట్ పాలమూరు జిల్లాకు పాక్షిక ప్రాధాన్యతే దక్కింది. పదినెలల కాలానికి గాను ప్రవేశపెట్టిన అప్పటి బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక పాధాన్యతనేది ఏమీ లభించలేదు. ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో వలసలకు చెక్ పెట్టేలా ఏమైనా చర్యలు తీసుకుంటారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధిహామీ అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో ఉపాధిహామీ కింద మొత్తం 8,79,534 కుటుంబాలు జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. ఈ పథకం కింద 4,80,420 మంది కూలీలు పనిచేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం రెండు లక్షల మందికి కూడా పనులు కల్పించలేకపోతున్నారు. దీంతో వలసలు తీవ్రమయ్యాయి. మరోవైపు సరైన వర్షాలు లేక జిల్లాలో కరువు తాండవిస్తోంది. భూగర్భజలాలు పడిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. ఫలితంగా రబీ సాగు సగానికి పైగా పడిపోయింది. ఫలితంగా ఏడాదిలో దాదాపు 76 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే వీరికి ఇప్పటి దాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా..! రాష్ట్రంలోనే నాలుగు భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా వీటి నిర్మాణం పూర్తవడం లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నాటికి కచ్చితంగా నీరందించాలని కృతనిశ్చయంతో ఉంది. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం పనులను ఏడాది లోగా పూర్తిచేసి 2.97 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిమంత్రి ఈటెల రాజేందర్ గత బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కానీ ప్రతిపాదనల్లో మాత్రం కోత విధించారు. జిల్లాలోని ఆరు ప్రాజెక్టులకు రూ.443 కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కేవలం కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు మాత్రమే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. ఆర్డీఎస్ ఆధునికీకరణ ఊసు లేకుండా కేవలం వేతనాలకు సరిపోయే నిధులను మాత్రమే గత బడ్జెట్లో కేటాయించారు. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు శంకుస్థాపన చేయలేకపోయింది. -
ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు
మూడింతలు పెరిగిన శాఖల అంచనాలు.. అంతగా ఇవ్వలేమంటూ తలపట్టుకున్న ఆర్థిక శాఖ మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలంటూ సూచన అనుకున్నంత ఆదాయం తీసుకురాకపోతే ఎలా..! ‘రెవెన్యూ’ తెచ్చే శాఖలపై ఆర్థికశాఖ అసంతృప్తి రేపటితో ముగియనున్న బడ్జెట్ ముందస్తు చర్చలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ. 3,00,000 కోట్లు..! ఇదేంటి మూడింతలు దాటిపోయిందని ఆశ్చర్యపోవద్దు... ఈసారి కేటాయింపుల కోసం వివిధ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనల మొత్తం ఇది. బడ్జెట్ ముందస్తు చర్చల్లోనే ఆర్థిక శాఖ దిమ్మతిరిగిపోయేలా ప్రభుత్వ విభాగాలన్నీ కోరికల చిట్టా విప్పాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకు పైగా నిధులు కావాలంటూ ప్రతిపాదనలు సమర్పించాయి. అంతేకాదు... ‘కొత్త రాష్ట్రం కావడంతో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే ఇంత భారీగా నిధులు ఇవ్వాల్సిందేనని కొసరు మెరుపూ ఇచ్చేశాయి.. 2015-16 సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారం కిందే కసరత్తు ప్రారంభించింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని శాఖల మంత్రులతో విడివిడిగా బడ్జెట్‌పై ముందస్తు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న శాఖలు మినహా అన్ని శాఖలతో చర్చలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాదాపు శాఖలన్నీ ఆర్థిక శాఖకు తమ ప్రతిపాదనలను సమర్పించాయి. కానీ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకుపైగా నిధులు కావాలంటూ ఇచ్చిన ప్రతిపాదనలను చూసి ఆర్థిక శాఖ వర్గాలు విస్తుపోయాయి. అన్ని నిధులు ఇవ్వాలంటే ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుందంటూ తల పట్టుకున్నాయి. తగ్గాల్సిందేనన్న ఆర్థిక శాఖ.. సాగునీటి రంగానికి రూ. 17,692 కోట్లు ఇవ్వాలని నీటి పారుదల శాఖ కోరగా... ఇంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్ల కంటే తక్కువకు తగ్గించి ప్రతిపాదనలు అందజేయాలని సూచించింది. కీలకమైన మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) రూ. నాలుగు వేల కోట్లు కోరింది. విద్యుత్ శాఖ రూ. 12,600 కోట్లు కావాలని ప్రతిపాదించింది. గత ఏడాది విద్యుత్ శాఖకు ప్రభుత్వం రూ. 3,500 కోట్లు కేటాయించడంతో పాటు మరో రూ. 1,000 కోట్లను జెన్కోలో పెట్టుబడిగా పెట్టింది. దీనితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు కోరింది. కానీ అంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఇక పరిశ్రమల శాఖకు గత ఏడాది రూ. 830 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 2,300 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్అండ్బీ విభాగం సైతం గతం కంటే ఘనంగా రూ. 10,800 కోట్లు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆదాయమేదీ..? ఆదాయం తెచ్చి పెట్టాల్సిన శాఖలు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై చర్చల సందర్భంగా ఆర్థిక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాణిజ్య పన్నుల విభాగం ద్వారా 2014-15లో మొత్తం రూ. 27,777 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే... జనవరి వరకు రూ. 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల వ్యవధిలోనే కనీసం మరో రూ. 6,000 కోట్లు రాబట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. వచ్చే ఏడాది రూ. 39,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకొని సాధించాలని వాణిజ్య పన్నుల శాఖను కోరింది. వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఎక్సైజ్ విభాగాల ద్వారానే రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం రావాల్సి ఉందని... లక్ష్య సాధనలో ఆ విభాగాలు వెనుకబడితే ఆదాయం బాగా తగ్గిపోతుందని చర్చల సందర్భంగా మంత్రి ఈటెల సంబంధిత అధికారులకు స్పష్టం చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇబ్బడి ముబ్బడిగా నిధులు కావాలని కోరుతూ ప్రతిపాదనలిచ్చిన మిగతా విభాగాలు.. వీలైనంత కుదించి ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది. బుధవారంతో బడ్జెట్‌పై ముందస్తు చర్చలు ముగియనున్నాయి. అవసరాన్ని బట్టి కొన్ని శాఖలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. పన్ను వసూళ్ల కోసం రూ. 496 కోట్లు! చెక్‌పోస్టులు, తనిఖీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అధిక మొత్తాన్ని కేటాయించాలని వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక శాఖను కోరింది. రెండు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులతో పాటు ఏడు సరిహద్దు చెక్‌పోస్టుల నిర్మాణం, కమిషనరేట్ భవన నిర్మాణం, ఇతర వ్యయం కోసం రూ. 496 కోట్లు కేటాయించాలని కోరింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,373.30 కోట్లు కేటాయించాలంటూ అటవీ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే భారీగా కోతలు.. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది నెలల కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రూ. లక్ష కోట్ల మార్కు దాటింది. భారీగా ఉండాలనే లక్ష్యాన్ని ప్రధానంగా ఎంచుకోవడంతో వాస్తవ అంచనాలు పట్టుతప్పాయి. తీరా బడ్జెట్ కేటాయింపులకు వాస్తవ ఆదాయ, వ్యయాలకు పొంతన లేని పరిస్థితి తలెత్తింది. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు అందకపోవడం, అదనంగా ఎంచుకున్న ఆదాయ మార్గాలు ఆచరణలో సఫలం కాకపోవటం, అప్పుల పరిమితి కూడా పెరగకపోవటంతో 2014-15 ఏడాది ఆదాయం రూ. 75 వేల కోట్లకు మించడం గగనంగా మారింది. మిగతా రూ. 25 వేల కోట్ల పైచిలుకుకు బడ్జెట్లో కోత అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మొదలైన రెండో బడ్జెట్ కసరత్తు అత్యంత ప్రాధాన్యంగా మారింది. దానికితోడు వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు చుక్కలు చూపిస్తున్నాయి. -
నిట్.. పోర్టు
ఏలూరు:రాష్ట్ర బడ్జెట్లో పొందుపర్చే అంశాలు, అంచనాలపై విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నిర్వహించే సమావేశానికి కలెక్టర్ కె.భాస్కర్ నివేదికలను సిద్ధం చేయించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కలెక్టర్ కె.భాస్కర్, డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి హాజరుకానున్నారు. 2015-16 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి సంబంధించి పొందుపర్చాల్సిన అంశాలపై కలెక్టరేట్ యంత్రాంగం మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు కుస్తీలు పట్టి నివేదికలు సిద్ధం చేసింది. కలెక్టర్ భాస్కర్ మంగళవారం ఉదయానికే హైదరాబాద్ వెళ్లి ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలెక్టర్ భేటీ అయినట్టు తెలిసింది. నిట్పైనే ప్రధాన దృష్టి జిల్లాలో నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణపై అధికార యంత్రాం గం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పెదపాడు సమీపంలోని భోగాపురంలో 258 ఎకరాల పైబడి భూములు ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం హైదరాబాద్ వెళ్లిన కలెక్టర్ ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్‌కు నివేదించినట్టు సమాచారం. నరసాపురంలో పోర్టు నిర్మాణానికి 5-6 వేల ఎకరాల అటవీ భూములను సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో భూముల సేకరణకు సంబంధించి కలెక్టర్ నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తోంది. పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించ తలపెట్టిన పోలవరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూముల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని సైతం కలెక్టర్ సిద్ధం చేశారు. పునరావాసంపైనా నివేదిక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం క ల్పించే వ్యవహారం ప్రహసనంగా మారింది. ఏడు ముంపు గ్రామాల పరిధిలోని ప్రజలకు పూర్తిస్థారుులో పునరావాసం సమకూరలేదు. దీనికితోడు ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, అక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని 21 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను సైతం సీఎంకు సమర్పించనున్నట్టు సమాచారం. గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఇటీవల రూపొందించిన ప్రతిపాదనల సమాచారంతో కలెక్టర్ నివేదిక సమర్పించనున్నారు. పుష్కరాలు.. విలీన మండలాలపై పోలీస్ ఫైల్ పుష్కరాల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, సిబ్బంది అవసరం తదితర అంశాలపై పోలీస్ విభాగం తరఫున జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి నివేదిక రూపొందించారు. ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో పోలీస్ సిబ్బంది నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఆ మూడు వర్గాల్లోనే సంతోషం: పొన్నాల
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఇన్నోవా డీలర్లు.. సిమెంట్ కంపెనీలు.. ప్రైవేటు కాలేజీలు.. కేసీఆర్ ఆరు నెలల పాలనలో ఈ మూడు వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నాయని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ ‘ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కేసీఆర్‌కు ముందున్నది ముసళ్ల పండగ.. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టేది లేదు’ అంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు వివేక్, సిరిసిల్ల రాజయ్య, పీసీసీ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
‘లింక్’ కుదర్లే
రేడియల్ రోడ్లు... ట్రాఫిక్ సమస్యకు హెచ్ఎండీఏ ఎంచుకున్న పరిష్కార ‘మార్గం’. ఇన్నర్ రింగ్ రోడ్డుకు...ఔటర్ రింగ్ రోడ్డుకు ‘లింక్’ పెట్టడం ద్వారా రాజధాని నగరంలో ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చాలనే ప్రయత్నం. నిత్యం పెరుగుతున్న వాహనాలు... అంతే స్థాయిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు... పొరపాటున ఒక్క మోటార్ సైకిల్ ఆగినా రోడ్లపై వాహనాల బారులు... ఇవి నగర జీవికి నిత్యానుభవాలు. ‘లింక్’ రహదారులతో ఈ కష్టాలు తప్పించాలనేది హెచ్ఎండీఏ యత్నం.కాస్తంత దృష్టి పెడితే సిటీ జనానికి ఎంతో మేలు చేసే ఈ రహదారులపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. నిధులు విదల్చనంటోంది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో చుక్కెదురైంది. రేడియల్ రోడ్ల కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా రూ.300 కోట్లు కావాలని ప్రతిపాదించగా... బడ్జెట్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో వీటి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యే నాటికి నగరంలో మొత్తం 33 రేడియల్ రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం. వీటిలో ఇప్పటికే ఏడింటిని (53.72 కి.మీ. మేర) హెచ్ఎండీఏ, ఆర్అండ్బీలు సంయుక్తంగా నిర్మించగా...జాతీయ రహదారుల మీదుగా ఉన్న మరో ఐదింటిని (83.35 కి.మీ.) నేషనల్ హైవే అథార్టీ నిర్మించింది. జీడిమెట్ల, ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్, నాగోల్, షేక్‌పేట్, కుషాయిగూడ ప్రాంతాల్లో మరో 5 రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని జైకా నిధులతో గత ఏడాది హెచ్ఎండీఏ చేపట్టింది. మిగిలిన 16 రేడియల్ రోడ్లనూ పూర్తి చేసి ... నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్ఎండీఏ భావించింది. గత ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా అవి ఫైళ్లకే పరిమితమయ్యాయి. కొత్త ప్రభుత్వమూ అదే దారిలో వెళ్లడం అధికారులను విస్మయపరిచింది. పెండింగ్‌లో ఉన్న 16 రేడియల్ రోడ్లకు సంబంధించి ఇంతవరకు భూ సేకరణ జరుగలేదు. వీటిలో 6 రహదారులకు అసలు సర్వే కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తొలి దశలో కీలకమైన 10 రేడియల్ రోడ్లకుసర్వే చేయాలని నిర్ణయించినా... కేవలం నాలిగింటితో సరిపెట్టేశారు. సర్వే పూర్తి కాకపోవడంతో భూసేకరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో రవాణా గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం రాజధాని నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణంపై దృషి ్టపెట్టకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నరకం తప్పదా..? రాజధాని చుట్టూ 158 కి.మీ. దూరం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుకు నగరం నుంచి అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రోరైల్ వంటివి ప్రవేశపెట్టినా ప్రయోజనం ఉండదంటున్నారు. కోర్ ఏరియాలో రోడ్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య నిత్యం నరకం చూపిస్తోంది. ప్రధాన ప్రాంతాలను ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు కలిపితే...50 శాతం ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని గతంలో హెచ్ఎండీఏ సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితి తల్లకిందులవడంతో రేడియల్ రోడ్లపై చేతులెత్తేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడమో... లేదా జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి శాఖల నుంచి నిధులు మళ్లించడమో చేస్తే తప్ప అవి సాకార మయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో పాత భూసేకరణ చట్టం ప్రకారం కీలకమైన 16 రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.1470 కోట్లు వరకు ఖర్చవుతుందని అప్పటి ఉమ్మడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి రావడంతో ఈ వ్యయం మరింత పెరగనుంది. మిగిలిపోయిన 16 రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘స్మార్ట్’ బడ్జెట్
నిధుల సేకరణకు అధికారుల వ్యూహం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక పద్దులు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ నివేదిక సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సర్కారు కలల ప్రాజెక్టులైన వరల్డ్ క్లాస్ సిటీ, స్లమ్ ఫ్రీ సిటీ, స్మార్ట్‌సిటీల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి ప్రత్యేక హెడ్స్ (పద్దులు) ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో వివిధ ప్రభుత్వ శాఖలు భాగస్వాములు కానున్నాయి. ఆ శాఖలకు కేటాయించే నిధులు వాటి అవసరాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ప్రత్యేక పద్దులుంటే మంచిదనే తలంపులో అధికారులు ఉన్నారు. వీటిని సత్వరం పూర్తి చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఐదు నుంచి పదేళ్ల వరకు పట్టనుంది. దశల వారీగా పనులు పూర్తి చేయాలన్నా రూ.వందల కోట్లు అవసరం. దీంతో ప్రత్యేక పద్దుల కింద నిధులు మంజూరు చేయాల్సిన అవసరముందని అధికారులు భావిస్తున్నారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. తద్వారా ఏటా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చార్మినార్ పాదచారుల పథకానికి అవసరమైన దాదాపు రూ.500 కోట్లకు బడ్జెట్లో ప్రత్యేక పద్దు ఉన్న సంగతి తెలిసిందే. దానికంటే భారీ వ్యయంతో కూడుకున్నందున ఈ ప్రాజెక్టులకుప్రత్యేక పద్దుల అవసరాన్ని వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. వేలాది కోట్లు కావాలి.. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగాతొలిదశలో నియోజకవర్గానికో స్లమ్‌ను ఎంపిక చేసినా దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఈ లెక్కన గ్రేటర్‌లోని 1476 మురికివాడలను అభివృద్ధిపరచి స్లమ్ ప్రీ సిటీగా మార్చాలంటే రూ.వేల కోట్లు అవసరం. ఈ తరహాలోనే వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు.. భూగర్భ డక్టింగ్లు, ఫుట్‌ఫాత్‌లు, సైక్లింగ్ మార్గాలు, ఎల్ఈడీ లైట్లు కావాల్సి ఉంటుంది. వీటిని అందుబాటులోకి తేవాలంటే రూ. వేలాది కోట్లు అవసరం. స్మార్ట్సిటీకీ అంతే స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక పద్దులతో ఈ నిధులు మంజూరుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రహదారులకు రూ.10 వేల కోట్లు నగరాన్ని ‘గ్లోబల్’గా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలకు తీసిపోనివిధంగా రహదారుల నిర్మించాలి. కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,్ల రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించడం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, సామూహిక మరుగుదొడ్లు, బస్షెల్టర్లు అవసరం. దీనికోసం అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ తరహారహదారులకు రూ.10వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. కాలువలకూ అధిక మొత్తం కావాల్సిందే నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలంటే తొలుత వరదనీరు సాఫీగా పోయేలా పనులు చేపట్టాలి. అందుకు దాదాపు రూ.16 వేల కోట్లు అవసరమని గతంలో అం చనా వేశారు. ఇది ఇంకా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. రాబడిపై జీహెచ్ఎంసీ దృష్టి ఇప్పటి వరకు రూ.5కే భోజనం.. బస్తీలకు శుద్ధజలం వంటి పథకాలపై శ్రద్ధ చూపిస్తున్న జీహెచ్ఎంసీ... ఆదాయ మార్గాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించడంతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. అదే తరహాలో వివిధ మార్గాల ద్వారా రావాల్సిన ఆదాయంపైనా దృష్టి పెడుతున్నట్టుసోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీకి వృత్తిపన్ను దాదాపు రూ. 300 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లు కూడా రావడం లేదు. మోటారు వాహనాల పన్నుల వాటా, వినోదపు పన్ను, ఇతరత్రా మార్గాల్లో రావాల్సిన వందల కోట్ల నిధులు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడం లేదు. వీటన్నింటిపై శ్రద్ధ వహించడం ద్వారా ఎవరిపై ఎలాంటి భారమూ మోపకుండానే జీహెచ్ఎంసీ ఆదాయం కనీసం 30 శాతం పెరగగలదని అంచనా. ఆ దిశగా అవసరమైన కసరత్తు ప్రారంభించారు. వరల్డ్ క్లాస్ సిటీ కి కావాల్సినవి... చక్కని రహదారులు, ఫుట్‌పాత్‌లు పార్కింగ్ ప్రదేశాలు వీధి దీపాలు 24 గంటలపాటు నీటి సరఫరా నిరంతరం విద్యుత్ సరఫరా భూగర్భడ్రైనేజీ చెరువుల పరిరక్షణ శుద్ధమైన తాగునీరు మెరుగైన ప్రజారవాణా భూగర్భకేబుళ్లు స్మార్ట్‌సిటీకి... వైఫై సేవలు ఆధునిక సాంకేతిక వనరులు ఇంట్లో కూర్చునే నెట్వర్క్తోవివిధ పనులు చేసుకోగలగడం ఫోన్ మెసేజ్‌తో సమస్యల పరిష్కారం -
అన్నీ కాకి లెక్కలే
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జగన్ నిప్పులు ఉచిత విద్యుత్‌కు రూ. 4,580 కోట్లు అవసరం.. కేటాయింపు రూ. 3,185 కోట్లు వడ్డీ లేని రుణాలకు రూ. 2,560 కోట్లు కావాలి.. కేటాయించింది రూ. 599 కోట్లు సామాజిక పెన్షన్లకు రూ. 3,730 కోట్లు అవసరం.. ఇచ్చింది రూ. 1,338 కోట్లు రైతుల రుణాలే రూ. 87,612 కోట్లున్నాయి.. మాఫీకి ఇచ్చింది రూ. 5 వేల కోట్లు ఈ రుణాలపై వడ్డీ, అపరాధ వడ్డీ లక్షకు రూ. 24 వేలవుతోంది.. ఆ ఊసే లేదు రూ. 14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాల మాఫీ గురించి మాట్లాడడమే లేదు నిరుద్యోగ భృతికి ఏడాదికి రూ. 36,000 కోటు ్లఅవసరం... కానీ ఇచ్చింది సున్నా బీసీలకు రూ. 10 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ అన్నారు.. కేటాయింపు రూ. 993 కోట్లు రూ. 1,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. బడ్జెట్లో ఆ హామీ ఊసే లేదు రూ. 5,000 కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి అన్న హామీ ప్రస్తావనా లేదు చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్ల ప్రత్యేక నిధీ లేదు.. చేనేత రుణాల మాఫీ లేదీ కాపుల సంక్షేమం కోసం ఏటా రూ. 1,000 కోట్లు ఇస్తామని.. 50 కోట్లకే సరిపెట్టారు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 500 కోట్లు అన్నారు.. రూ. 25 కోట్లే విదిలించారు అర్హులందరికీ ఇళ్ల కోసం రూ. 15,000 కోట్లు కావాలి.. కేటాయింపు రూ. 808 కోట్లు ఆహార సబ్సిడీకి రూ. 4,671 కోట్లు అవసరం.. బడ్జెట్లో ఇచ్చింది రూ. 2,318 కోట్లు ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు రూ. 3,700 కోట్లు కావాలి.. కేటాయింపు రూ. 2,100 కోట్లే ఎన్టీఆర్ సుజల స్రవంతి’ కోసం రూ. 250 కోట్లు కావాలి.. ఇచ్చింది రూ. 5 కోట్లు ప్రణాళిక బడ్జెట్‌ను తగ్గించివేయడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ భారీగా తగ్గిపోయింది ఉద్యోగాల నియామకాల ఊసు లేదు.. పీఆర్సీ అమలుకు కేటాయింపులూ లేవు రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చలో మాట్లాడటానికి, ఏకైక ప్రతిపక్షంగా తమ పార్టీ అభిప్రాయాన్ని చెప్పి ముగించడానికి మరికొంత సమయం ఇవ్వాలని గత రెండు రోజులుగా కోరినప్పటికీ సమయం ఇవ్వలేదని.. దీంతో ప్రజల పక్షాన బడ్జెట్‌కు సంబంధించి ప్రజా సమస్యలను మీడియా ముందు వినిపించాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆర్థికమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు.. ఆ పార్టీ ప్రభుత్వం బడ్జెట్లో చేసిన కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేదని.. హామీలు, వాటికి చేసిన కేటాయింపుల గణాంకాలతో విడమరిచి చెప్పారు. హామీలు నెరవేర్చాలంటే ఎంతమేరకు నిధులు అవసరమవుతాయో చెప్తూ.. వాస్తవంగా బడ్జెట్లో ఎంత కేటాయించిందీ పేర్కొంటూ.. అవసరమైన మేరకు కేటాయించకపోవడాన్ని ఎత్తిచూపారు. నిధులు కేటాయించకుండా, హామీలను నెరవేర్చకుండా కాకి లెక్కలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వైనంపై జగన్ నిప్పులు చెరిగారు. సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా తమ గొంతు నొక్కుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో జగన్మోహన్రెడ్డి ఏమన్నారంటే... ‘‘బడ్జెట్‌పై చర్చలో సరైన చర్చ లేకుండానే ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. చర్చలో ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే సమయం కేటాయించారు. బహుశా అసెంబ్లీ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. మామూలుగా బడ్జెట్‌పై చర్చ ఆరు రోజులు జరగాలి. కానీ నాలుగు రోజులకే కుదించారు. గత పదిహేనేళ్ల నుంచీ చూస్తే బడ్జెట్‌పై ఏ ప్రతిపక్ష నాయకుడైనా కనీసం రెండు, రెండున్నర గంటలు ప్రతి కేటాయింపుపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీలో రెండే పార్టీలున్నాయి. ఒకటి అధికార పక్షం.. రెండోది ప్రతిపక్షం. వేరే సభ్యులు లేరు. అధికార పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, కేటాయింపులపై నిజంగా మాట్లాడేది ప్రతిపక్షమైన మేము తప్ప వేరే పార్టీ లేదు. అయినా బడ్జెట్ చర్చలో ‘ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే ఇస్తాం.. అంతకన్నా ఎక్కువ సమయం ఇచ్చేది లేదు’ అనే నియంత పోకడ మొట్టమొదటిసారిగా ఈరోజే చూస్తున్నాం. మొన్న బడ్జెట్‌పై మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్ కట్‌చేశారు. ఆ రోజు 11.08 నిమిషాలకు ప్రారంభిస్తే అంతరాయాల మధ్య చివరికి 1.40కి మైక్ కట్ చేశారు. రెండున్నరగంటల సమయంలో గంట ఆరు నిమిషాలు అంతరాయాలు కల్పించారు. ఈ రోజు (బుధవారం) కూడా చర్చలో మైక్ కట్‌చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తాను.. అరగంట సమయం ఇవ్వాలని, అధికారపక్షానికి ఎలా అంటే అలా సహకరిస్తామని చెప్పాము. కానీ ఫలితం లేదు. సమయం ఇవ్వలేదు. సభలో ఇప్పటివరకు జరిగిన చర్చను చూస్తే ఏ ఒక్కరూ కూడా.. బడ్జెట్ కేటాయింపులు ఎంత చేశారు.. అసలు ప్రజలకు ఎంత అవసరం అనేది చెప్పలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిట్టడమే అధికారపక్ష సభ్యులు పనిగా పెట్టుకున్నారు. ఆయన చనిపోయి ఐదేళ్లు అవుతోంది.. కానీ ఇంకా ఆయనే సీఎం అన్నట్లు తిట్టడమే తప్ప.. ప్రజలకు ఏమి కావాలి? ఏ స్కీముకు ఎంత కేటాయించాలి? అన్నది చెప్పలేదు. ప్రజలకు తెలియాల్సిన అంశాలను తెలియనీయకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ ప్రసంగాన్ని ముగించడానికి అవకాశం చిక్కనందున ఆ అంశాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించదల్చుకున్నాను. ఏది సబబో, ఏది సరైనదో ప్రజలే నిర్ణయిస్తారు. రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎలా ? రైతులకు వడ్డీ లేని పంట రుణాల కింద రూ. 56,000 కోట్లు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ పుస్తకంలో పొందుపర్చారు. కానీ.. రైతులకు ప్రస్తుత రుణ బకాయిలున్నాయి. డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14 వేల కోట్లు ఉంది. వీరికి నాలుగు శాతం వరకు వడ్డీ రాయితీ కల్పించాలంటే ఆ నాలుగు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు కట్టాలి. అప్పుడే రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అవుతుంది. ఈ లెక్కన రైతులు, డ్వాక్రా మహిళల రుణాలపై నాలుగు శాతం చొప్పున మొత్తం రూ. 2,560 కోట్లు వడ్డీ కింద బడ్జెట్లో కేటాయించాలి. అపుడే రైతులు, మహిళలకు మంచి జరుగుతుంది. కానీ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ. 599 కోట్లు మాత్రమే. ఇది ఎంతవరకు సరైనది? దీనర్థం.. సామాజిక పెన్షన్లను ఊడబెరుకుతారనే కదా? గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్ ప్రకారం రాష్ట్రంలో 43,11,688 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 130 కోట్లు చెల్లిస్తున్నారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్‌ను రూ. 1,000 కి పెంచుతున్నట్లు చెప్పారు. ఈ ఐదు నెలలకు రూ. 650 కోట్లు అవసరం. ఇదంతా ఇపుడున్న పెన్షన్‌దారుల విషయం మాత్రమే. కొత్తగా పెన్షన్ల కోసం 15 లక్షల దరఖాస్తులున్నాయి. వాటి గురించి నేను చెప్పడం లేదు. అక్టోబర్ నుంచి రూ. వేయి చొప్పున పెంచాల్సి ఉన్నందున.. ఆ ప్రకారం లెక్కవేస్తే అదనంగా రూ. 431 కోట్లు కావాలి. ఇవి కాకుండా 5,36,837 వికలాంగుల పెన్షన్లు రూ. 1,500 చొప్పున వేస్తే మరో రూ. 10 కోట్లు ఉండాలి. మొత్తం కలిపితే దాదాపు రూ. 441 కోట్లు ప్రతి నెల అవసరం. రానున్న ఏడు నెలలకు 3,080 కోట్లు అవసరం. ఇప్పటివరకు ఉన్న ఐదు నెలలకు కావలసిన రూ. 650 కలిపితే మొత్తం రూ. 3,730 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఇంకా రూ. 2,392 కోట్లు అంతరం ఉంది. దానర్థం ఉన్న పెన్షన్లు ఊడబెరుకుతారనే కదా? వ్యవసాయానికి 7 గంటల కరెంటూ ఇవ్వరు... రాష్ట్రంలో 14.54 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. వీటిలో 3 హార్స్ పవర్ నుంచి 10 హార్స్ పవర్ వరకు వినియోగించేవి ఉన్నాయి. సరాసరి ఒక్కో పంపు సెట్టు ఐదు హార్స్ పవర్ ఉంటుంది. ఉచిత విద్యుత్తు 9 గంటలు కాకున్నా కనీసం 7 గంటలు చొప్పున ఇస్తే గంటకు ఒక హార్స్‌పవర్‌కు 0.75 యూనిట్లు అవుతుంది. ఏడు గంటల పాటు పంపు నడిస్తే గంటకు ఒక హెచ్‌పీకి 5.25 యూనిట్లు ఖర్చవుతుంది. 5 హెచ్‌పీకీ రోజుకు 26.25 యూనిట్లు అవసరం. ఏడాదికి 7,875 యూనిట్లు ఒక్కో పంపు సెట్‌కు కావాలి. రాష్ట్రంలోని 14.54 లక్షల పంపు సెట్లకు ఏడాదికి 1,145 కోట్ల యూనిట్లు విద్యుత్తు అవసరం. దీన్ని యూనిట్‌కు రూ. 4 చొప్పున కొనుగోలు ధర వేస్తే రూ. 4,580 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో రూ. 3,188 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే వ్యవసాయానికి 7గంటలు కూడా కరెంటు ఇవ్వరని అర్థమవుతోంది. రూ. 5 వేల కోట్లతో రైతుల రుణ మాఫీనా? అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. అందుకు రూ. 87,612 కోట్లు అవసరం. ఎస్ఎల్బీసీలో బ్యాంకర్లే ఈ విషయం ప్రభుత్వానికి చెప్పారు. బడ్జెట్లో కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే పెట్టారు. మీ మాటలు నమ్మి డబ్బులు కట్టని కారణంగా ప్రతి లక్షకు రూ. 12 వేలు చొప్పున రైతులు వడ్డీ కట్టాలి. ఈ ఏడాది కూడా మీరు కట్టకపోవడంతో మరో రూ. 12 వేలు వడ్డీ పడుతోంది. ఈ రూ. 24 వేల వడ్డీ ఎవరు కడతారో బడ్జెట్లో ప్రస్తావనే లేదు. రూ.14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇపుడు మాఫీ గురించి మాట్లాడడడం లేదు. రూ. 808 కోట్లతో ఇంటి స్థలం, ఇల్లు ఎలా ఇస్తారు? టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. గుడిసెలనేవి లేకుండా చేస్తామన్నారు. అలా చేయాలంటే 10 లక్షల ఇళ్లు కట్టాలి. ఇందుకు రూ. 15,000 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులు చేసింది రూ. 808 కోట్లు మాత్రమే. ఇళ్ల లబ్ధిదారులపై పిడుగుపాటుగా ఇటీవల యూఓ నోట్ విడుదల చేశారు. గృహనిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకునే వరకు బిల్లుల చెల్లింపులు ఆపాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 5.5 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 450 కోట్లు బకాయిలున్నాయి. తాజా ఆదేశాలతో బిల్లులు రాక ఈ 5.5 లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోపక్క ఇప్పటికే మంజూరై పనులు మధ్యలో ఉన్న 7.95 లక్షల ఇళ్లు రద్దుచేస్తున్నట్లు ఆ నోట్లో పేర్కొన్నారు. ఆహార సబ్సిడీకి రూ. 1,853 కోట్ల లోటు రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ, రచ్చబండలో ఇచ్చినవి ఇలా అన్నీ కలిపి.. కోటి నలభై లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇవి కాకుండా పింక్ కార్డులు 14.86 లక్షలున్నాయి. తెల్లకార్డులకు ప్రతి నెలా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాలి. ఇందుకు రూ. 1,223 కోట్లు అవసరం. ఇది కాకుండా అమ్మహస్తం కింద తొమ్మిది సరుకులు రూ. 185 ధరకి ఇస్తున్నారు. రూ. 292 అయ్యే ఈ మొత్తంలో సబ్సిడీ 107 రూపాయలు ప్రభుత్వం భరిస్తోంది. కోటి నలభై లక్షల తెల్లకార్డులకు ఈ అమ్మహస్తానికి ప్రతి నెలా రూ. 1,788 కోట్లు అవసరం. ఇక అక్టోబర్ నుంచి కేంద్రం ప్రవేశపెట్టే కొత్త ఆహార విధానం వస్తుంది. ఇందుకు సంబంధించి మరో రూ. 1,000 కోట్లకు పైగా రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఈ అన్నిటికీ కలిపి రూ. 4,671 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 2,318 కోట్లు మాత్రమే చూపెట్టారు. అంటే 1,853 కోట్లు లోటు. దీనర్థం ఏమిటి? పైగా ఆరు నెలలుగా గోధుమలు, పామాయిల్ కూడా రేషన్ కార్డులపై ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు సగమే ఇచ్చారు... సాంఘిక సంక్షేమ వెబ్సైట్లో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చూపుతున్నారు. అందులో 9.54 లక్షలు మంజూరు కాగా మిగతావి చేయాల్సి ఉంది. 2013-14 సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్రంలో స్కాలర్షిప్లు, రీయింబర్స్‌మెంటు కోసం ఖర్చు చేసినది రూ. 4,286 కోట్లు. దానిలో 60 శాతం సీమాంధ్ర అనుకుంటే రూ. 2,487 కోట్లు అవుతుంది. గత ఏడాదికి సంబంధించి బకాయిలు రూ. 990 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ రెండూ కలిపితే రూ. 3,500 కోట్ల వరకు అవుతుంది. ఇది కాక సీమాంధ్ర పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఫీజులు కట్టకుంటే ఈ ప్రభుత్వమైనా కట్టాలి. లేకపోతే పిల్లల జీవితాలు నాశనమవుతాయి. దాదాపు 40 వేల మంది తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్లు అవసరం. ఈ లెక్కన ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పుల కింద మొత్తం రూ. 3,700 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో రూ. 2,100 మాత్రమే కేటాయింపు చూపారు. రూ. 1,600 కోట్ల మేర కోతపెట్టారు. దీంతో పిల్లల భవిష్యత్తేమి కానుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఇవన్నీ చూస్తే రూ. 15,000 కోట్ల పైచిలుకే లోటు పెడుతున్నట్లు అర్థమవుతుంది. బీసీలకు, మైనారిటీలకూ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి... మైనారిటీలకు సంబంధించి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోక ముందు బడ్జెట్లో రూ. వేయి కోట్లు పెట్టారు. తరువాతి ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని తగ్గించే ధైర్యం చేయలేదు. అందులో 60 శాతం అంటే దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాలి. కానీ బడ్జెట్లో రూ. 371 కోట్లు కేటాయించారు. దీనినిబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనారిటీలపై ఎంత ప్రేముందో అర్థమవుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు, మైనారిటీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలి. అప్పుడే వారికి మంచి జరుగుతుంది. రూ. 5 కోట్లతో ఐదు వేల గ్రామాలకు మినరల్ వాటర్ ఇస్తారా? ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ (మంచినీరు) ఇస్తామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీన్ని ఐదు వేల గ్రామాలకు విస్తరిస్తామన్నారు. ఐదు వేల గ్రామాల్లో ఒక్కో గ్రామంలో బోరు, మోటారు. షెడ్డు, మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 5 లక్షలు అవసరం. ఇలా ఐదు వేల గ్రామాలకు రూ. 250 కోట్లు కావలసి ఉండగా బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే. బాబు వస్తే జాబన్నారు.. నియామకాలు నిలిపేశారు.. ‘బాబు వస్తాడు - జాబు వస్తుంద’ని ఎన్నికల ముందు రకరకాలుగా హామీలు ఇచ్చారు. కానీ జూన్ 24వ తేదీన చంద్రబాబునాయుడు కింద ఉండే జీఏడీ విభాగం.. కొత్తగా నియామకాలు నిలిపేయాలని ఏపీపీఎస్సీకి ప్రత్యేకంగా లేఖ రాసింది. నియామకాలపై సమగ్ర విధానం రూపొందించే వరకు నియామకాలు ఆపేయాలని అందులో ఆదేశించారు. రాష్ట్రంలో 1.60 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా అధికారంలోకి వచ్చి భర్తీ చేయాల్సింది పోయి ఆపేయాలంటుండడం విచారకరం. ఉద్యోగుల పీఆర్సీ అమలు ఏమైనట్లు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పదో పీఆర్సీ అమలు విషయాన్ని బడ్జెట్లో కేవలం ప్రస్తావన చేసి వదిలేశారు. పదో పీఆర్సీ గత ఏడాది 2013 జూలై నుంచి అమలు కావలసి ఉంది. అధికారంలోకి రాగానే పీఆర్సీ అమలు చేస్తామన్నారు. ఇప్పటికి సీఎంకు ఆ నివేదిక ఇచ్చి రెండు నెలలవుతున్నా 4 లక్షల మంది ఉద్యోగులు, 3.58 లక్షల మంది పెన్షనర్ల గురించి చర్యలు లేవు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. నాడు ఉద్యమాలు చేసి.. నేడు బాక్సైట్ తవ్వకాలేమిటి? వైఎస్సార్, ఆ తరువాత ముఖ్యమంత్రులు ఎవరూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ మైనింగ్ చేపట్టలేదు. వీరెవ్వరూ ప్రజాభిప్రాయాన్ని బుల్డోజ్ చేయలేదు. ప్రజల దగ్గరకు వెళ్లి మీకు కావాలా? వద్దా? అని అడిగి.. కావాలంటేనే చేయాలి. లేదంటే మానుకోవాలి. అంతే తప్ప వద్దంటున్నా మైనింగ్‌కు ముందుకు వెళ్లడమేమిటి? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోయినా ఉద్యమాలు చేయించారు. ఇపుడు అధికారం వచ్చాక ప్రజాభిప్రాయానికి భిన్నంగా మైనింగ్‌కు ముందుకు వెళ్లడమెందుకు? దీనివల్ల అక్కడ నక్సలైట్ల సమస్య వస్తోంది. శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. ప్రజలకు ఇష్టం లేనపుడు వదిలేయాలి తప్ప ముందుకు వెళ్లడమెందుకు? ‘ప్రణాళిక’ తగ్గింపుతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భారీగా తగ్గుదల ఇక ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి చెప్పాలి. ఎవరు మైకు పట్టుకున్నా సగం తెలిసీ, తెలియని విధంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను దుమ్మెత్తిపోయడం తప్ప మరే పనీలేదు. అయినా ఓపిగ్గా విన్నాం. 2012 డిసెంబర్ 12న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం వచ్చింది. దాని ప్రకారం ప్రతి ఏటా ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాన్ బడ్జెట్లో కేటాయింపులు చేయా ల్సి ఉంది. ఈ సబ్‌ప్లాన్ రాకముం దు 2012 దాకా చాలా మంది సీఎంలు నిధులు మళ్లిం చారు. ఇది అందరూ చేశారు. చట్టం వచ్చాక మళ్లింపు కాకుం డా కేటాయింపులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఎవ రి హయాం లో ఎంతమేర కేటాయింపులు జరిగాయో చూ స్తే ఒక్క వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎక్కువ కేటాయింపులతో వారికి మేలు చేకూరినట్లు గర్వంగా చెప్పగలం. ఈ రకంగా 2013-14 సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్‌ను ఇవ్వాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. రివైజ్డ్ బడ్జెట్ లేని దుస్థితిలో బడ్జెట్‌పై చర్చించుకోవలసి వస్తోంది. సబ్‌ప్లాన్‌కు ప్రధాన భాగం ప్రణాళిక కేటాయింపులు మాత్రమే. ప్రణాళిక కేటాయింపుల్లో ఎక్కువ ఉంటే సబ్‌ప్లాన్ ఎక్కువ వస్తుంది. ప్రణాళిక బడ్జెట్ రూ. 35,000 కోట్లుంటే అందులో 23 శాతం కేటాయింపు ఎస్సీ, ఎస్టీలకు నిధులు అందుతాయి. అదింకా పెరిగితే ఆ మేరకు సబ్‌ప్లాన్ నిధులు పెరుగుతాయి. గత పదిహేనేళ్ల బడ్జెట్లు చూస్తే ప్రణాళిక బడ్జెట్ 35 శాతానికి తగ్గకుండా కనిపిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొదటిసారి ఈ ప్రణాళిక బడ్జెట్‌ను 35 శాతం నుంచి 23 శాతానికి పడేసింది. ప్రణాళిక బడ్జెట్ 23 శాతానికి తగ్గినందున ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులూ తగ్గిపోతాయి. ప్రణాళిక బడ్జెట్‌కు, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కు సంబంధముంటుంది. ప్రణాళిక బడ్జెట్ ప్రకారమే గ్రాంట్సు వస్తాయి. కానీ ప్రణాళిక తగ్గించి గ్రాంట్లు పెంచారు. ఇది అర్థం కాని విషయం. చంద్రబాబు ఇవన్నీ చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మాట్లాడించారు. గృహ నిర్మాణాల్లోనూ మంజూరు మధ్యలో ఉన్న 7.94 లక్షల ఇళ్లను రద్దుచేశారు. దానిలో అత్యధిక ఇళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలవి కావా? రెండోది బిల్లుల చెల్లింపులు ఆపేయాలని చెప్పారు. దాదాపు 5.5 లక్షల మంది ఇళ్ల లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నారు. వీరికి రూ. 450 కోట్లు బకాయి ఉంది. ఈ బకాయిలు ఇవ్వకుండా నిలిపేశారు. ఇంకా దారుణమేమంటే.. రైతులకు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందడం లేదు. నూటికి మూడు, నాలుగు రూపాయల చొప్పున వడ్డీ చెల్లించి బయట అప్పు తెచ్చుకుంటున్నారు. వీరిలో అధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే. వర్షాలు లేనందున పనుల కోసం వెళ్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వారికి పనులు కూడా దొరక్కుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిలిపేయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాదా? వీరి పరిస్థితి ఏమిటి? నిరుద్యోగ భృతికి కేటాయింపులేవీ? ఇంటికో ఉద్యోగమిస్తామన్నారు. లేనిపక్షంలో రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటిన్నర ఇళ్లున్నాయి. ఇంటికి 2,000 చొప్పున నెలకు రూ. 3,000 కోట్లు, ఏడాదికి రూ. 36,000 కోటు ్లఅవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులు సున్నా. - బీసీలకు రూ. 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పారు. బడ్జెట్లో కేటాయించింది రూ. 993 కోట్లే. - రూ. 1,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పారు. మార్కెట్లో ధరలు మండిపోతున్నా బడ్జెట్లో ఆ నిధి ఊసే లేదు. - రూ. 5,000 కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెడతామన్నారు. వ్యవసాయ బడ్జెట్ అంటూ ఆడంబరంగా ప్రత్యేక బడ్జెట్ పెట్టారు.. కానీ ఈ నిధి గురించి మాట్లాడలేదు. - చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. చేనేత రుణాల మాఫీ అన్నారు. అదీ కనిపించలేదు. చేనేత రుణాలు రూ. 300 కోట్లు ఉన్నాయి. ధర్మవరం, ఉరవకొండలో చేనేత కార్మికులకు నోటీసులు వస్తున్నాయి. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నా వారికి సహాయానికి నిధి ఊసే లేదు. - కాపుల సంక్షేమం కోసం ఏటా రూ. 1,000 కోట్లు, ఐదేళ్లకు రూ. 5,000 కోట్లు కేటాయిస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. బడ్జెట్లో రూ. 50 కోట్లకే సరిపెట్టారు. - బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పి.. రూ. 25 కోట్లు మాత్రమే విదిలించారు. -
అంకెల గారడీతో మభ్యపెడుతున్నారు
వైఎస్సార్ సీపీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన సాక్షి, విజయవాడ : రాష్ట్ర బడ్జెట్లో అంకెల గారడీ తప్ప మరేమీ లేదని, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయటానికే అంకెల గారడీతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ప్రణాళిక వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం అధికంగా చూపడంతో తమపై పన్నుల భారం తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గురువారం విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కల్పన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఏమాత్రం కొత్తదనం లేదని చెప్పారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హమీలను నిలుపుకోలేదని మండిపడ్డారు. రైతు రుణాలు రూ.87,612 కోట్లు రద్దు కావాల్సి ఉండగా, కేవలం 5వేల కోట్లు మాత్రమే కేటాయించటం దారుణమని విమర్శించారు. అలాగే.. బడ్జెట్లో డ్వాక్రా మహిళల ఊసే లేదని, చేనేత రంగానికి, పవర్ హ్యాండ్లూమ్స్కు, మహిళా సాధికారత ఇలా ఏ ఒక్క రంగానికి నిధులు కేటాయించకపోవటం దారుణమని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలో సృష్టతలేదని చెప్పారు. రాజధానికి నిధులేవి? సింగపూర్ తరహాలో నూతన రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో రాజధానికి నిధుల కేటాయింపుపై మాట్లాడకపోవటం శోచనీయమన్నారు. రూ.12వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటే అభివృద్ధి పనులు ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. లోటును పూడ్చుకోవటానికి మళ్లీ తమ నెత్తిన పన్నుల భారం మోపుతారేమనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఆర్బీఐ, ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు అయ్యే పరిస్థితి లేదని, ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మన రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి దాటిపోయామని అందుకే కొత్తగా అప్పు రాదని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 44 శాఖల నుంచి నిధులు కేటాయిస్తామని చెప్పారే కానీ ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారు... ఏపథకం, ఎంత ఇస్తున్నారు అనే వివరం లేనే లేదని చెప్పారు. వికలాంగులకు రూ.1,500 ఫించన్ అని ఎన్నికల్లో హమీలు ఇచ్చి ఇప్పుడు షరతులతో కూడిన పింఛన్ అని మాట మార్చటం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అసులు రంగు బయట పడిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబునాయుడు సర్కారేనని విమర్శించారు. సమావేశంలో పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, పూనూరు గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హామీల నుంచి తప్పించుకుంటున్నారు : సారథి ఇచ్చిన హామీల నుంచి సీఎం బాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా దక్షిణ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ హమీలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఆ రెండు హామీలను నేటికి నెరువేర్చకుండా తప్పించుకు తిరగడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. కేవలం వైఎస్సార్ సీపీ అధినేత వైస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వడ్డీపై రాయితీని కోల్పోతున్నారని, మహిళలు కూడ వడ్డీ లేని రుణాలు కోల్పోతున్నారని చెప్పారు. 15 రోజుల్లో కోటయ్య కమిటీ నివేదిక వస్తుందని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికి 45 రోజులు దాటినా దానిపై చర్యలు చేపట్టలేదన్నారు. రుణమాఫీపై ప్రధాని మోడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఎందుకు పొందలేకపోయిందని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.241 కోట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు. మైనార్టీలు టీడీపీకి ఓటు వేయలేదనే కారణంగా కోత విధంచారా? అని ప్రశ్నించారు. చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ: గౌతమ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేసేది తక్కువ చెప్పేది ఎక్కువగా ఉందని గౌతంరెడ్డి మండిపడ్డారు. ప్రణాళికా వ్యయం రూ.26వేల కోట్లు చూపి ప్రణాళికేతర వ్యయం రూ.86 వేల కోట్లు చూపటం ద్వారానే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించారే గానీ మిగిలిన సౌకర్యాల గురించి పట్టించుకోలేదని, బందరు పోర్టుకు రూ.కోటికేటాయించడం, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, శిల్పారామం అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు -
‘ప్రకాశించని’ బడ్జెట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాపై శీతకన్ను వేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా జిల్లాకు కేటాయించలేదు. రామాయపట్నం పోర్టును సాధిస్తానని జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు బడ్జెట్ సమావేశాల ముందు విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కానీ ఆచరణలో ఈ పోర్టు ప్రస్తావనే బడ్జెట్లో చోటు చేసుకోలేదు. ఒంగోలులో నాన్ - మెట్రో విమానాశ్రయం నిర్మాణం చేపడతామని ప్రకటించినా నిధులు మాత్రం కేటాయించలేదు. జిల్లాకు శిల్పారామం మంజూరైందని ఇక్కడి నేతలు చెబుతూ వచ్చారు. అయితే బడ్జెట్లో కేటాయించిన శిల్పారామాల్లో ఒంగోలుకు స్థానం దక్కలేదు. రిమ్స్‌లో హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకాకుళం, ఒంగోలు కలిపి రూ.3.31 కోట్లు, మెడికల్ కాలేజీ కోసం రూ.8.99 కోట్లు కేటాయించారు. జిల్లా పరిశ్రమల అభివృద్ధి శాఖ భవనానికి నిధులు మంజూర య్యాయి. ‘కోత’ల యజ్ఞం: జలయజ్ఞం ప్రాజెక్టులకు భారీగా కోత పెట్టారు. దీంతో జిల్లాలో జలయజ్ఞ ఫలాలు ఇప్పట్లో ప్రజలకు అందే సూచనలు కనిపించడం లేదు. ప్రధానమైన ప్రాజెక్టుల్లో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాజెక్ట్‌ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎనిమిదేళ్లలో పూర్తికావాలని నిర్ణయిస్తే పదేళ్ల కాలంలో ఇప్పటికి సగంపని మాత్రమే పూర్తయింది. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పకుండా ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటూ పోతున్నారు. కీలకమైన వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.76.58 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.402 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది దాన్ని పూర్తిగా తగ్గించారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణాల్లో లోపాలు,కొన్ని చోట్ల పూర్తికాకపోవడం, ఈ విషయాల్లో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం రైతులకు శాపంగా మారింది. 80 వేల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును వెనువెంటనే వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. గుండ్లకమ్మకు రూ.100 కోట్లు కేటాయిస్తే నిర్వాసితుల సమస్యతోపాటు చిన్న చిన్న కాలువల నిర్మాణం పూర్తవుతుంది. అలాంటి దానికి గత ఏడాది రూ.17 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. ఐదు కోట్లతో సరిపెట్టారు. కొరిశపాడులోని పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా గత ఏడాది రూ.17 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.ఏడు కోట్లతో సరిపెట్టారు. పాలేరు రిజర్వాయర్‌కు రూ.రెండు కోట్లు, మున్నేరుపై నిర్మిస్తున్న రాళ్లపాడు స్టేజి-2కి రూ.రెండు కోట్లు, మోపాడు రిజర్వాయర్‌కు రూ.మూడు కోట్లు, రామతీర్థం రిజర్వాయర్‌కు రెండు లక్షల రూపాయలు కేటాయించారు. పాలేరు ప్రాజెక్టుకు కోటి రూపాయలు, కంభం చెరువు అభివృద్ధికి పది లక్షల రూపాయలు, పోతురాజు నాలా డ్రైన్ అభివృద్ధికి కోటి రూపాయలు బడ్జెట్లో చూపించారు. -
4804 కోట్లు
- జిల్లా ప్రణాళిక సిద్ధం - 10,174 పనులు గుర్తింపు.. - 22న జెడ్పీ పాలక మండలి సమావేశం - ప్రణాళికకు ఆమోదం తెలిపే అవకాశం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా చేపట్టిన ప్రణాళిక సిద్ధమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకొని వారికి కావలసిన అభివృద్ధి పనులను రాష్ట్ర బడ్జెట్లో పొందుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో నేరుగా నిధులు కేటాయించకుండా గ్రామస్థాయిలో ఏఏ పనులు అవసరమో నేరుగా గ్రామస్థాయి ప్రజలను భాగస్వామ్యం చేశారు. ఈ మేరకు జిల్లాలో 10,174 పనులను గుర్తించారు. దీనికి 4804 కోట్ల రూపాయలు అవసరమని నిర్ణయించారు. గ్రామ ప్రణాళికలో జిల్లాలోని 1331 గ్రామ పంచాయతీల్లో మొత్తం 484 పనులను గుర్తించారు. ఇందుకు గాను రూ.2776 కోట్లు నిధుల అవసరం కానున్నట్లు అంచనా వేశారు. మండల స్థాయి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 64మండలాల్లోని ప్రణాళికలను కలుపుకొని 640 పనులకు రూ.2028 కోట్ల అంచనా వేశారు. జిల్లాస్థాయిలో మొతం 50 రకాల పనులు గుర్తించారు. ఈ పనులకు సంబంధించిన నిధుల అంచనాలను ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం... శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సిద్ధం చేసిన ప్రణాళికను ఆమోదానికి పెట్టనున్నారు. జెడ్పీ ఆమోదం పొందిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచేలా చూడనున్నారు. ఆదే రోజు జిల్లా పరిషత్ పరిధిలో ఉండే మొత్తం 7స్టాండింగ్ కమిటీలను ఎన్నుకోనున్నారు. జిల్లాస్థాయి ప్రణాళికలు.... తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండడంతో ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్ట్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే గట్టు మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు జిల్లా ప్రజల కల అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు, గద్వాల, నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్, నేషనల్ హైవే, స్టేట్ హైవే కింద కొల్లాపూర్ నుంచి జడ్చర్ల, జడ్చర్ల నుంచి కోదాడ వయా కల్వకుర్తి రోడ్లను ప్రతిపాదించారు. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో ఏరియా ఆసుపత్రులకు ఏర్పాటు, మఖ్తల్, నారాయణపేట్, జడ్చర్ల, అలంపూర్, మహబూబ్‌నగర్, కొత్తకోటల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పెద్దకొత్తపల్లి, ఇటిక్యాల(మాడల్), వడ్డెపల్లి, తెల్కపల్లి, తలకొండపల్లి, దౌల్తాబాద్, కొడంగల్, కొత్తూర్,లింగాల్, బొమ్రాస్పేట్, నర్వ, బిజినపల్లి, చిన్నచింతకుంట, హన్వాడ, ఉప్పునుంతలలో ప్రభుత్వ జూనియర్‌కాలేజీలు, బల్మూర్, అమ్రాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆమన్‌గల్, కల్వకుర్తి, బాలుర అచ్చంపేట, గద్వాల, వడ్డేపల్లి, దేవరకద్ర, మక్తల్‌లలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మించేందుకు ఎంపిక చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రాజోలి మళ్లింపు పథకం, బీమా లిఫ్ట్ ఇరిగేషన్లకు కెనాల్ లైనింగ్ వర్క్స్ చేపట్టాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. గద్వాల నుంచి మాచర్ల వరకు డబుల్ లైన్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లాను పర్యటకరంగంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా ప్రణాళికలో ప్రతిపాదనలను పొందుపర్చారు. ఇందుకు గాను కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించేందుకు బోటింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఈ బోటును నడిపేందుకు ప్రతిపాదించారు. దీంతోపాటు ఎకో టూరిజం ప్రాజెక్ట్, పిల్లలమర్రిలో ఆంపి థియేటర్‌తోపాటు పార్క్‌ను ఏర్పాటు చేయాలని, మహబూబ్‌నగర్‌లో మినీ శిల్పారామం ఏర్పాటు, ఫ్యూ పాయింట్‌కు అనుకూలంగా ఉన్న ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, ఫరహాబాద్ వ్యూపాయింట్ల అభివృద్ధిని చేయాలని ప్రతిపాదించారు. -
ప్చ్..
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర బడ్జెట్లో జిల్లా విషయంలో స్పష్టమైన వివక్షత కన్పించింది. జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధ వహించారు. జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరి-నగరి సుజల స్రవంతి పథకం నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి ఫలాలందించే పథకాలకు నిధుల కేటాయింపులు లేవు. ట్రిపుల్ఐటీ, యోగివేమన యూనివర్శిటీ, రిమ్స్ వంటి అత్యున్నత విద్యాసంస్థల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాపట్ల రాజకీయ వైరాన్ని ప్రదర్శిస్తున్నారని బడ్జెట్ సాక్షిగా చెప్పకనే చెప్పారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర సంస్థలకు భారీ కోత పెట్టారు. పథకాలను ప్రాధాన్యత పరంగా సమదృష్టితో చూడాల్సిన పాలకపక్షం రాజకీయ వైరంతో అరకొర నిధులను విదిల్చారు. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల ఊసే ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్లో లేకపోవడం విచారకరం. మెట్టప్రాంతాల పట్ల కన్పించని శ్రద్ద.... మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రవేశ పెట్టిన జలయజ్ఞం పనులు కాలక్రమేపి వివ క్షతకు గురవుతున్నాయి. జిల్లాలో 2004-09 హయాంలో నిర్వహించిన పనుల ఆధారంగా జిల్లాకు కృష్ణా జలాలు అందుతాయని ప్రజానీకం పూర్తి ఆశల్లో ఉండే ది. పాలకుల శీతకన్ను కారణంగా పెండింగ్ పథకాల జాబితాలోకి జిల్లా సాగునీటి పథకాలు చేరిపోయాయి. వెనుకబడ్డ రాయలసీమకు సాగునీటి వసతి కల్పించాలనే లక్ష్యంతో జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టారు. అంతే శ్రద్ధతో ఆ పథకాల పూర్తికి చిత్తశుద్ధితో ఆచరణలో చూపెట్టారు. అలాంటి పథకాలకు అరకొర నిధులు కేటాయించి ప్రభుత్వం తన వివక్షతను ప్రదర్శిస్తోంది. మరో రూ.173 కోట్లు వెచ్చిస్తే జీఎన్ఎస్ఎస్ ఫేజ్-1 పనులు పూర్తి కానున్న నేపధ్యంలో ప్రభుత్వం కేవలం రూ.55.14కోట్లు కేటాయించింది. అందులో 50శాతం గ్రాంటు ఆర్‌అండ్‌ఆర్‌కు వినియోగించాలనే నిబంధన విధించింది. కేసీ కెనాల్ ఆధునికీకరణ పట్ల పాలకపక్షానికి చిత్తశుద్ధి లోపించింది. కేవలం రూ.8.4కోట్లు మాత్రమే కేటాయించారు. మైలవరం ఆధునికీకరణకు రూ.8.16కోట్లు, తెలుగుగంగకు రూ.89.6కోట్లు, పీబీసీకి రూ.27.8కోట్లు కేటాయించారు. అనంతపురం జిల్లాలోని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు మాత్రం రూ.128కోట్లు కేటాయించారు. ఎస్సార్బీసీకి రూ.12.48కోట్ల కేటాయింపులు దక్కాయి. వెలిగల్లు, చెయ్యేరు, దిగువ సగిలేరు, ఎగువ సగిలేరు, బుగ్గవంక ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు లేవు. అత్యున్నత విద్యపట్ల అదే వైఖరి.... జిల్లాలోని అత్యున్నత విద్యాసంస్థల పట్ల సైతం ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రదర్శించింది. యోగివేమన యూనివర్శిటీకీ టీడీపీ ప్రభుత్వం అరకొర ఆర్థిక కేటాయింపులే చేపట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.19.39 కోట్లు కేటాయించారు. అందులో రూ.16.92కోట్లు వైవీయూ సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించనున్నారు. ఇతరత్రా వసతులకు రూ.2.47 కోట్లు వినియోగించాలని నిర్ణయించారు. అలాగే ట్రిపుల్ఐటీ, రిమ్స్‌కు ఈమారు నిధులు కేటాయింపులే లేవు. ఐజీ కార్ల్ పశుపరిశోధన సంస్థ ఊసే లేకపోయింది. -
లీడర్స్ ఒపీనియన్ ఆన్ బడ్జెట్
బడ్జెట్ అంతా అంకెల గారడీయే రాష్ట్ర బడ్జెట్ మొత్తం అంకెల గారడీయే. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు ఎదురు చూస్తున్న రుణమాఫీ గురించి ప్రస్తావనే లేదు. యనమల బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. మేనిఫెస్టోను చూపి ఓట్లేయించుకుని పేదప్రజల్ని నిలువునా వంచించారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు నామమాత్రమే. - గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్సీపీ నేత పన్నులన్నా పెంచాలి.. కోతలైనా పెట్టాలి టీడీపీ ప్రభుత్వం పదేళ్ల తరువాత ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదు. నిధులు ఎలా సమీకరిస్తారో బడ్జెట్లో పేర్కొనలేదు. బడ్జెట్ లెక్కలు వాస్తవ రూపంలోకి రావాలంటే ప్రభుత్వం ఎడాపెడా పన్నులనైనా పెంచాలి.. లేదంటే బడ్జెట్ గణాంకాలకు చివర్లో భారీగా కోతలైనా పెట్టాలి. - సి. రామచంద్రయ్య మండలి ప్రతిపక్ష నేత ఇది చరిత్రాత్మక బడ్జెట్ విభజన తర్వాత ఈ తొలి బడ్జెట్ చరిత్రాత్మకమైనది. సర్వజనామోదంగా రూపొందించారు. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉన్నట్లుగా ఏడు ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు చేశారు. ఎన్నికల హామీలు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. రైతు రుణమాఫీకి కట్టుబడ్డామనడానికి నిదర్శనం. - గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి బాబు మోసం చేశారు.. అధికారంలోకి వస్తే అన్ని రకాల రుణాలు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు నేడు ప్రజల్ని మోసం చేశారు. బాబు తొలి సంతకాలను అపహాస్యం చేశారు. ఎన్నికల ముందు అన్ని రుణాలు పూర్తిగా రద్దుచేస్తామని చెప్పి నేటికీ వాటిని రద్దుచేయకపోగా డ్వాక్రా రుణమాఫీకి కొత్తభాష్యం చెబుతున్నారు. - ఎంవీఎస్ నాగిరెడ్డి రైతు నేత -
తక్షణ అవసరాలకు మొండిచెయ్యే
రాష్ట్ర తొలి బడ్జెట్లో తాత్కాలిక రాజధాని ఊసే లేదు గన్నవరం పోర్టు విస్తరణకు చర్యలు పీపీపీ పద్ధతిలో బందరుపోర్టు నిర్మాణం జిల్లాలో శిల్పారామం, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు సాక్షి, విజయవాడ : తాత్కాలిక రాజధాని నగరమైన విజయవాడ ప్రధానకేంద్రంగా ఉన్న జిల్లాకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. కొత్తరాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక బడ్జెట్ కావడంతో ప్రజల దృష్టంతా బడ్జెట్‌పైనే కేంద్రీకృతమయింది. తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో తక్షణ అవసరాలకుగానూ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన జిల్లా ప్రజలకు నిరాశే ఎదురయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన రూ.లక్ష కోట్ల బడ్జెట్ అనేది అంకెలకే పరిమితమై... వాస్తవ అభివృద్ధికి దూరంగా ఉందనే వాదన వినబడుతోంది. రుణమాఫీకి రూ 5వేల కోట్లే.... బడ్జెట్ కోసం అశగా ఎదరుచూసిన అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబానికి లక్షన్నర వరకు రుణమాఫీ అని ప్రకటించారు. అయితే దీనికి గానూ రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.ఐదువేల కోట్లు మాత్రమే కేటాయించడం పలు విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో మొత్తం రూ.9,137 కోట్లరైతురుణా బకాయిలు ఉన్నాయి. సుమారు 98 వేల మంది రైతులు పంటరుణాలు, బంగారు నగలపై రుణాలు తీసుకున్నారు. వీటిలో పంటరుణాలు రూ.3,088 కోట్లు కాగా, బంగారు అభరణాలపై తీసుకున్న రుణాలు రూ.3,276 కోట్లు ఉన్నాయి. ఇవికాక టర్మ్‌లోన్స్ రూ.2,773 కోట్లు ఉన్నాయి. ఇక దీంతో పాటు జిల్లాలో మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన 16 అంశాలను వివరిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు. వాటిలో తక్షణం పూర్తి చేయాల్సినవి 12 వరకు ఉన్నాయి. వీటిలో నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, అగిరిపల్లి, గన్నవరం మండలాల్లో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువు అభివృద్ధి, పెడనలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం, దుర్గగుడి వద్ద ప్లైవోవర్ నిర్మాణం ఇలా అనేక అంశాలున్నాయి. కనీసం వీటిలో కొన్నింటికి కూడ బడ్జెట్లో కేటాయింపులు జరుగలేదు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న బందరుపోర్టు నిర్మాణం, గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు మాత్రమే బడ్జెట్లో చోటు దక్కడం కొంతమేర ఊరటనిస్తోంది. స్పష్టత లేని కేటాయింపులు... రాష్ట్రంలోని ఇతర ఎయిర్‌పోర్టుతో పాటుగా గన్నవరం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. అయితే ఎయిర్‌పోర్టు విస్తరణకు రూ.100 కోట్లనిధులు 400 ఎకరాల భూమిని సేకరించాలని గత ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో మళ్లీ ప్రభుత్వం దీనిని బడ్జెట్లో చేర్చింది. అలాగే జిల్లాలో మరొక శిల్పారామం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారు, నిధుల కేటాయింపు ఎంత చేస్తారు అనేదానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇక విజయవాడ-కాకినాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. అలాగే వైజాగ్ చైన్నై మధ్య కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇది పూర్తిగా దీర్ఘకాలిక ప్రాజెక్టు. ఇక జిల్లాకు ప్రధానమైన బందరు పోర్టు నిర్మాణానికి మాత్రం బడ్జెట్లో గ్రీన్‌సిగ్నల్ లభించింది. పబ్లిక్,ప్రెవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీనిని నిర్మిస్తామని ప్రకటించారు. అయితే ఎంత భూసేకరణ చేయాలి. దీనికి అవసరమైన డీపీఆర్ తయారీకి ఎంత కేటాయిస్తారో ప్రకటించలేదు. తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడలో కనీస సౌకర్యాలు మెరుగుపర్చటానికి నిధుల కేటాయింపులే లేవు. వచ్చే నెల నాటికి గన్నవరంలో సుమారు 11 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తారు. వీరందరికీ అవసరమైన గృహ సముదాయాలు, ఇతర అంశాలకు కేటాయింపుల్లో చోటు దక్కలేదు. మొత్తంమీద బడ్జెట్ కేటాయింపులు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పవచ్చు. కంటితుడుపు బడ్జెట్ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటితుడుపుగా ఉంది. రైతు, డ్వాక్రా రుణమాఫీకి నిధుల కేటాయింపు ఊసేలేదు. అలాగే రూ.లక్ష11వేల కోట్ల బడ్జెట్లో ఏరంగానికి కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేసినట్లు కనిపించలేదు. బాబు వస్తే జాబు దొరుకుతుందన్న నిరుద్యోగులకు ఇక కష్టాలే. ఉమ్మడి రాష్ర్టంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రూ.లక్షకోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని సంక్షేమ రంగాలకు న్యాయం చేశారు. - సామినేని ఉదయభాను, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు సమతుల్య బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. ప్రత్యేకంగా వ్యవసాయం, నీటిపారుదల, మౌలిక సదుపాయాల రంగాల్లో అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చేలా ఉంది. బందరు, భావనపాడు, కళింగపట్నం, నౌకాశ్రయాల పురోభివృద్ధికి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల సత్వర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ తెలుపుతోంది. పారిశ్రామిక పురోభివృద్ధికి కూడా తగిన ప్రణాళికలు ఉంటే బాగుండేది. - ముత్తవరపు మురళీకృష్ణ, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు విద్యారంగానికి నిధులు ఏవి? 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులు తగినంతగా లేవు. జాతీయ స్ధాయి విద్యా సంస్ధల ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంకూడా స్థలసేకరణ, సర్వేల నిమిత్తం కొంతమేర నిధులు కేటాయించాల్సింది. పాఠశాలల్లో టాయిలెట్స్, మంచినీరు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన దృష్ట్యా విద్యారంగానికి నిధుల కేటాయింపులు ఇంకా పెంచాల్సింది. - కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ -
'రాజధానిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు'
హైదరాబాద్: ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వాటన్నింటినీ ఒక ప్రత్యేక బడ్జెట్‌గా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఎంసెట్ పై సుప్రీంకోర్టు తీర్పును ఏపీ కేబినెట్ స్వాగతించింది. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేష అధికారాల అప్పగింత అంశంపైనా కేబినెట్లో చర్చ జరిగింది. గవర్నర్ అధికారాలపై విభజన చట్టంలో ఉన్న అంశాలను మంత్రులకు చంద్రబాబు వివరించారు. విభజనచట్టంలో 8,9,10 షెడ్యూళ్లపై క్లారిటీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విభజనలో సీమాంధ్రకు వచ్చిన ఏడు మండలాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని కూడా నిర్ణయం తీసుకుంది. రాజధాని ఎంపిక విషయంపై ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు మాట్లాడొద్దని మంత్రులను చంద్రబాబు హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలోశాఖలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మంత్రులకు సూచించారు. బడ్జెట్లో రుణమాఫీని ఏ ఖాతాలో చూపించాలనే దానిపై కూడా మంత్రులతో చంద్రబాబు చర్చించారు. -
అసెంబ్లీ సమరం మరికొన్ని గంటల్లో...
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమరం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఇందు కోసం అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమయ్యూరుు. ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలు అడ్డు రావడంతో శాఖల వారీగా నిధుల కేటాయింపులు, సమీక్షలు జరగలేదు. ఎన్నికలు ముగిసిన దృష్ట్యా, ప్రస్తుతం సమీక్షలు, కేటాయింపులపై చర్చకు ప్రభుత్వం సిద్ధం అయింది. గురువారం నుంచి అసెంబ్లీలో శాఖల వారీగా నిధుల కేటాయింపుపై చర్చ, ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రకటనల పర్వం సాగనుంది. ఇందు కోసం అసెంబ్లీ ఆవరణలో సర్వం సిద్ధం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. సచివాలయం మార్గంలో భద్రతను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు రెడీ అయ్యాయి. లండన్ వెళ్లిన డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చెన్నైకు వచ్చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఢీ కొట్టే విధంగా అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా తమిళ జాలర్లపై దాడులు, కచ్చదీవుల వ్యవహారం, బహుళ అంతస్తు కుప్పకూలిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డీఎంకే వర్గాలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మౌళివాకం ఘటనను తమకు అనుకూలంగా మలుచుకుని, సీబీఐ విచారణకు పట్టు బట్టే విధంగా తమ గళాన్ని అసెంబ్లీలో విన్పించేందుకు డీఎంకే సిద్ధం అయింది. ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన దృష్ట్యా, ఈసారి అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టేది అనుమానమే. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా, డీఎంకే తరహాలో వాకౌట్ల పర్వానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ సమావేశాలు వాడి వేడిగాను సాగనున్నారుు. శాఖల వారీగా చర్చలో మంత్రుల ప్రసంగాలకు ప్రాధాన్యత అధికంగా ఉండడం మాత్రం ఖాయం. -
‘మన ప్లాన్లు’ సిద్ధం చేయండి!
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికలు ప్రతి గ్రామానికీ ఓ అధికారి నియామకం కలెక్టర్లకు సహాయంగా ప్రతి జిల్లాకో ఐఏఎస్ ప్రణాళికల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన తెలంగాణ నవ నిర్మాణ ప్రణాళిక వర్క్‌షాప్‌లో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని నియమించి వారి ద్వారా గ్రామసభలు నిర్వహించి ‘మన ప్రణాళికలు’ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 12 నుంచి 27 వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 12 నుంచి 17 వరకు గ్రామ స్థాయి ప్రణాళికలు, 17 నుంచి 22 వరకు మండల స్థాయి ప్రణాళికలు, 22 నుంచి 27 వరకు జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో సగటున వెయ్యి గ్రామాలు ఉన్నందున జిల్లా కలెక్టర్లు వెయ్యి మంది అధికారులను గుర్తించి ప్రణాళికల తయారీ కోసం గ్రామాలకు కేటాయించాలన్నారు. ఈ ప్రణాళికల తయారీలో కలెక్టర్లకు సహకరించేందుకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధమైన తర్వాత ఆగస్టు ఒకటి నుంచి 10 వరకు రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించి రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికల ఆధారంగా ఆగస్టు 10 నుంచి 20 వరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో సోమవారం జరిగిన ‘తెలంగాణ నవ నిర్మాణ ప్రణాళిక వర్క్‌షాప్’ముగింపు ఉపన్యాసంలో ఆయన ఈమేరకు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేకాధికారుల ఎంపిక పూర్తిచేసి వారితో పాటే తహశీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా కేంద్రంలో ఒక రోజు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఒకవైపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తయారుచేసిన ప్రణాళికలతో ప్రభుత్వ శాఖలు సమాంతరంగా తయారు చేసిన ప్రణాళికలను క్రోడీకరించి రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేయాలన్నారు. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు ఈ బాధ్యతను కేసీఆర్ కట్టబెట్టారు. ప్రణాళికల తయారీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలను భాగస్వాములను చేయాలని సూచించారు. మార్పు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కలెక్టర్ల వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వండి ఓ వైపు ఎక్కడికక్కడ ప్రణాళికలు తయారు చేస్తూనే మరోవైపు ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ, ఎన్ఐఆర్డీ, అపార్డ్, బ్రహ్మకుమారి సంస్థల ద్వారా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. 19 నుంచి సర్పంచ్‌లకు, 23 నుంచి మండల అధ్యక్షులకు, 27 నుంచి జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. వచ్చే శనివారం లేదా ఆదివారం ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు హైదరాబాద్‌లో ఒకరోజు శిక్షణ ఉంటుందన్నారు. -
వేగంగా విభజన లెక్కలు
మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల లెక్కకు కాలం చెల్లనుంది. వచ్చే నెల నుంచి కొత్త రాష్ట్ర బడ్జెట్ అమల్లోకి రానుందని, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కు సంబంధించిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌దారు ల పింఛన్లపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఇటీవల జి ల్లా గణాంకశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విభజన లెక్కల ప్రక్రియలో అధికారులు వేగం పెంచా రు. ప్రస్తుత ఉమ్మడి బడ్జెట్లో వచ్చిన నిధులు, ఖ ర్చు, మిగులు నిధులపై నివేదికలు తయారు చేస్తున్నారు. జిల్లాలో 40 వేల మంది ఉద్యోగులు, 15 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. 24న చివరి సంతకం ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ చెల్లింపులకు ఈనెల 24వ తేదీతో తెరపడనుంది. ఇప్పటివరకు చెల్లిస్తున్న వేతనాల రిజిస్టర్లు, పేస్లిప్పులన్నీ మారిపోనున్నాయి. అన్ని శాఖల్లో ఆంధ్రప్రదేశ్ పేరుతో పేమెంట్ విధా నం అమల్లోకి రానుంది. 24న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు పెట్టే సంతకం ఉమ్మడి రాష్ట్రంలో చివరిదికానుంది. ఉద్యోగుల జాబితా తయారు లెక్కలతోపాటు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమవుతోంది. డివిజన్ల వారీగా స్థానిక, స్థానికేతర ఉద్యోగుల జాబితా తయారీతో అధికారులు కుస్తీపడుతున్నారు. విధుల్లో ఎక్కడ చేరారనే ధ్రువీకరణ పత్రాలు, సర్వీసు పుస్తకాలను సమర్పించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖల్లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులను ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించింది. ఖర్చు కాకపోతే అంతేనా? వచ్చే నెల నుంచి ఇక్కడి ఉద్యోగులు, పింఛన్ దారులకు సంబంధించిన నిధులను ఆంధ్ర రాష్ట్రంలో సర్దుబాటు చేయడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను సమర్పించాలని గరవ్నర్ ఆదేశించారు. ఉమ్మడి బడ్జెట్లో కేటాయించిన నిధులను ఈనెల 24 వరకు వినియోగించుకోవచ్చునని, ఇప్పటి వరకు చెల్లించకుండా ఉన్న నిధులను మాత్రం ఆయా శాఖల ఖాతాల్లో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ లెక్కన వినియోగం కాని నిధులు వెనక్కిపోయే అవకాశముంది. జిల్లాలో చాలా మేరకు నిధులు ఖాతాల్లోనే ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఈ నిధుల్లో 30 శాతం కూడా ఖర్చు చేయలే దు. వీటిని వెనక్కు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. వెనక్కి తీసుకుని మళ్లీ కొత్త రాష్ట్రంలో మంజూ రు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్ర బడ్జెట్‌ను 2 రాష్ట్రాలకు విభజించండి
అన్ని శాఖలకు ఆర్థికశాఖ సర్క్యులర్ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను.. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రెండు రాష్ట్రాలకు విభజించాల్సిందిగా ఆర్థికశాఖ బుధవారం అన్ని శాఖలు, విభాగాల అధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ప్రత్యేకంగా సర్క్యులర్ జారీచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 1,83,129 కోట్లుగా ఆర్థికశాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపధ్యంలో ఇందులో తొలి ఆరు నెలల వ్యయానికి మాత్రమే అసెంబ్లీ నుంచి ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెలల్లో బడ్జెట్ కేటాయింపులో ఆరో వంతు అంటే.. రూ. 30,521 కోట్లు మాత్రమే ఆయా శాఖలు వ్యయం చేసేందుకు ఆర్థికశాఖ అనుమతించింది. ఏ శాఖ ఎంత వ్యయం చేయాలనే విషయాన్ని కూడా ఆర్థికశాఖ స్పష్టం చేయనుంది. బడ్జెట్లో పథకాలు, కార్యక్రమాల అమలు, జీతభత్యాలు, పెన్షన్లతో పాటు అన్ని రంగాలకు కేటాయించిన నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఎంత, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో తెలియజేస్తూ ఈ నెల 15వ తేదీలోగా ఆర్థికశాఖ వెబ్సైట్లో ఆన్లైన్లో నమోదు చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధిని కూడా రెండు రాష్ట్రాలకు విభజించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం బుధవారం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్‌కు లేఖ రాశారు. -
కేటాయింపు ఘనం.. ఖర్చు స్వల్పం
బడ్జెట్‌పై శెట్టర్ వాగ్బాణాలు నిధులను సమర్థంగా వినియోగించుకోలేని సర్కార్ గత బడ్జెట్లో 57 శాతం నిధులు మాత్రమే వినియోగం ఈ స్వల్ప కాలంలో నిధులు ఖర్చు చేయడం సాధ్యమేనా? త్వరగా ఖర్చు చేయాలని చూస్తే..నిధుల దుర్వినియోగం ఖాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదు.. ఖజానా ఖాళీ ప్రధాన రంగాలకు ప్రాధాన్యత కరువు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులైతే ఘనంగానే ఉన్నా, ఆ మొత్తాలను ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించ లేకపోతోందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ విమర్శించారు. శాసన సభలో సోమవారం ఆయన 2014-15 బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో జనవరి ఆఖరు వరకు 57 శాతం మాత్రమే ఖర్చయిందని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెలన్నర మాత్రమే ఉందని, ఈ స్వల్ప కాలంలో 43 శాతం నిధులను ఖర్చు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఈ మొత్తాన్ని ఖర్చు చేయజూస్తే డబ్బంతా మూడో వ్యక్తి పాలవుతుందని హెచ్చరించారు. ప్రధాన ఉద్దేశం నెరవేరదన్నారు. తన హయాంలో ఈ కాలానికి 70 నుంచి 80 శాతం నిధులను ఖర్చు చేశామని గణాంకాలతో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదని విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందా...అనే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడం లేదని, డబ్బు ఎక్కడి పోతున్నదో అంతుబట్టడం లేదని ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గత ఏడాది బడ్జెట్ రూపకల్పనలో సమయం లేకపోయిందని అనుకున్నామని, ఈ ఏడాది కావాల్సినంత సమయం ఉన్నా ప్రాధాన్యత రంగాలకు తగిన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు ప్రాధాన్యతనివ్వలేదని ఆరోపించారు. ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి విఫలమయ్యారని, పన్ను సేకరణ లక్ష్యాన్ని సాధించలేక పోయారని విమర్శించారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి, ఆంతరంగిక కలహాలు... తదితర కారణాల వల్ల ఆయన పాలనపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నారని ఆరోపించారు. తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారనే కీర్తిని గడించిన ముఖ్యమంత్రి, తన అనుభవాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారని నిష్టూరమాడారు. -
బాదుడుండదు!
నేడు రాష్ట్ర బడ్జెట్ పథకాలకు స్వల్ప మార్పులు.. మరిన్ని మెరుగులు పీయూసీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఏపీఎల్ కార్డుదారులకు తక్కువ ధరకు రేషన్ విధాన సౌధలో తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సిద్ధు అరుదైన ఘనత దక్కించుకోనున్న సీఎం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభలో శుక్రవారం 2014-15 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక శాఖను ఆయనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొమ్మిదో సారి ఆయన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నందున, ఆ ఖ్యాతి రాష్ట్రంలో తొలిసారిగా ఆయనకు దక్కనుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున, ముఖ్యమంత్రి పలు వరాలు కురిపిస్తారనే అంచనాలున్నాయి. 50 కొత్త తాలూకాల ఏర్పాటు, ప్రతి తాలూకాలో ప్రాథమిక సదుపాయాల కల్పనకు తలా రూ.5 కోట్లు, వ్యవసాయానికి వడ్డీ రహిత రుణాల గరిష్ట మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంపు లాంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. పేద కుటుంబాల్లో జన్మించిన ఆడ పిల్లల కోసం అమలవుతున్న భాగ్యలక్ష్మిలో కొన్ని మార్పులు చేయాలని కూడా సంకల్పిస్తోంది. పీయూసీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు, ఏపీఎల్ కార్డుదారులకు తక్కువ ధరకు రేషన్ లాంటి వ రాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కొత్త పన్నులు విధించడానికి ముఖ్యమంత్రి సాహసించబోరని వినవస్తోంది. బీబీఎంపీ విభజన బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను రెండుగా విభజించాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. బడ్జెట్లో దీనిపై ప్రకటన చేస్తానని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. పాలనా సౌలభ్యం దృష్ట్యా బీబీఎంపీని విభజించాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇక టెలి విద్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వెయ్యి ఉన్నత పాఠశాలల్లో వచ్చే నెల నుంచి టెలి విద్యను ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎడ్యుశాట్ ఉపగ్రహం, ఐఐఎంబీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-బెంగళూరు) నిపుణుల సహకారంతో ఈ విద్యా బోధన ప్రారంభం కానుంది. ఇంత పెద్ద ఎత్తున ఉపగ్రహ ఆధారిత విద్యా బోధనను ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో సైతం ఈ ప్రస్తావన ఉంది. ప్రధాన పాఠ్యాంశాలైన గణితం, విజ్ఞాన శాస్త్రం, ఇంగ్లీషులలో పిల్లల గ్రహణ శక్తిని పెంపొందించడానికి టెలి విద్యను ప్రవేశ పెట్టనున్నారు. ఉపగ్రహం సాయంతో బహు మాధ్యమాల విధానం కింద ఈ విద్యా బోధన ఉంటుంది. యానిమేషన్, అనుబంధ చిత్రాలను ఈ విధానంలో సరళంగా ఉపయోగించవచ్చు. విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఉపాధ్యాయులతో చర్చించడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరులోని టెలి విద్య ప్రధాన కార్యాలయం నుంచి ఏక కాలంలో వెయ్యి ఉన్నత పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రసారమవుతాయి. టెలి విద్యకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రస్తుతం శిక్షణనిస్తున్నారు. ఈ వ్యవస్థను ఎలా వినియోగించాలో... వారికి బోధిస్తున్నారు. పాఠశాలల్లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట తరగతులను నిర్వహిస్తారు. గ్రామాల్లో కరెంటు కోత సమస్యలున్నందున బ్యాటరీలను వినియోగించనున్నారు. ప్రయోగాత్మక తరగతులు సక్సెస్ తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని 14 ఉన్నత పాఠశాలల్లో 2011లో ప్రయోగాత్మకంగా టెలి విద్యను ప్రవేశ పెట్టారు. ఐఐఎంబీ దీనిని పర్యవేక్షించింది. ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ పాఠశాలల్లో ఎస్ఎస్ఎల్సీలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని, పిల్లల్లో ఆత్మ విశ్వాసం కూడా పెరిగిందని ఐఐఎంబీ అధికారులు తెలిపారు. ఫలితాలు కనీసం పది శాతం పెరిగాయని చెప్పారు. ఈ ప్రయోగం ఆధారంగా ఉన్నత పాఠశాలల విద్యలో సంస్కరణలు తీసుకు రావడానికి నివేదికను కూడా తయారు చేశామని వెల్లడించారు. ఈ సిఫార్సులకు ఆమోదం లభిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యలో మరింత ప్రగతిని సాధించవచ్చని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.