మైనార్టీలకు రూ.710 కోట్ల కేటాయింపుపై హర్షం | Allocation of Rs 710 crore for minorities elation | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు రూ.710 కోట్ల కేటాయింపుపై హర్షం

Published Sat, Mar 12 2016 4:30 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

మైనార్టీలకు రూ.710 కోట్ల కేటాయింపుపై హర్షం - Sakshi

మైనార్టీలకు రూ.710 కోట్ల కేటాయింపుపై హర్షం

నెల్లూరు (టౌన్): రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు రూ.710 కోట్లను కేటాయించడం అభినందనీయమని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. హరనాథపురంలోని చారిటబుల్ ట్రస్ట్‌లో టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతేడాది మైనార్టీలకు బడ్జెట్లో రూ.370 కోట్లను కేటాయించారని, ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేయడం మైనార్టీలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. నిధుల కేటాయింపుపై చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మైనార్టీ నేత అబూబకర్ మాట్లాడారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే వారు అభివృద్ధి చెందుతారన్నారు. నాయకులు రఫీ, మౌలానా అబ్దుల్ అజీజ్, సుభహాన్, మున్వర్, పఠాన్‌బాషా, రియాజ్, షంషుద్దీన్, నన్నేసాహెబ్, జియఉల్‌హక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement