వేగంగా విభజన లెక్కలు | faster calculations on division of state | Sakshi
Sakshi News home page

వేగంగా విభజన లెక్కలు

Published Wed, May 21 2014 4:30 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల లెక్కకు కాలం చెల్లనుంది. వచ్చే నెల నుంచి కొత్త రాష్ట్ర బడ్జెట్ అమల్లోకి రానుందని, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కు సంబంధించిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌దారు ల పింఛన్లపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఇటీవల జిల్లా గణాంకశాఖకు ఆదేశాలు జారీ చేశారు

మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల లెక్కకు కాలం చెల్లనుంది. వచ్చే నెల నుంచి కొత్త రాష్ట్ర బడ్జెట్ అమల్లోకి రానుందని, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కు సంబంధించిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌దారు ల పింఛన్లపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఇటీవల జి ల్లా గణాంకశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విభజన లెక్కల ప్రక్రియలో అధికారులు వేగం పెంచా రు. ప్రస్తుత ఉమ్మడి బడ్జెట్‌లో వచ్చిన నిధులు, ఖ ర్చు, మిగులు నిధులపై నివేదికలు తయారు చేస్తున్నారు. జిల్లాలో 40 వేల మంది ఉద్యోగులు, 15 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు.
 
 24న చివరి సంతకం
 ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ చెల్లింపులకు ఈనెల 24వ తేదీతో తెరపడనుంది. ఇప్పటివరకు చెల్లిస్తున్న వేతనాల రిజిస్టర్లు, పేస్లిప్పులన్నీ మారిపోనున్నాయి. అన్ని శాఖల్లో ఆంధ్రప్రదేశ్ పేరుతో పేమెంట్ విధా నం అమల్లోకి రానుంది. 24న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు పెట్టే సంతకం ఉమ్మడి రాష్ట్రంలో చివరిదికానుంది.
 
 ఉద్యోగుల జాబితా తయారు
 లెక్కలతోపాటు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమవుతోంది. డివిజన్ల వారీగా స్థానిక, స్థానికేతర ఉద్యోగుల జాబితా తయారీతో అధికారులు కుస్తీపడుతున్నారు. విధుల్లో ఎక్కడ చేరారనే ధ్రువీకరణ పత్రాలు, సర్వీసు పుస్తకాలను సమర్పించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖల్లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన  అధికారులను ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించింది.
 
 ఖర్చు కాకపోతే అంతేనా?
 వచ్చే నెల నుంచి ఇక్కడి ఉద్యోగులు, పింఛన్ దారులకు సంబంధించిన నిధులను ఆంధ్ర రాష్ట్రంలో సర్దుబాటు చేయడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉమ్మడి  రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను సమర్పించాలని గరవ్నర్ ఆదేశించారు. ఉమ్మడి బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఈనెల 24 వరకు వినియోగించుకోవచ్చునని, ఇప్పటి వరకు చెల్లించకుండా ఉన్న నిధులను మాత్రం ఆయా శాఖల ఖాతాల్లో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ లెక్కన వినియోగం కాని నిధులు వెనక్కిపోయే అవకాశముంది. జిల్లాలో చాలా మేరకు నిధులు ఖాతాల్లోనే ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఈ నిధుల్లో 30 శాతం కూడా ఖర్చు చేయలే దు. వీటిని వెనక్కు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. వెనక్కి తీసుకుని మళ్లీ కొత్త రాష్ట్రంలో మంజూ రు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement