
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. జూలై 22, 2024న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం కొన్ని అంశాలపై చేసిన వక్రీకరణలను వైఎస్ జగన్ లేఖలో వివరించారు.
ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో వైఎస్ జగన్ తెలియజేశారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్‌బీఐ నివేదికల్లోని వాస్తవాలను పొందుపరుస్తూ లేఖ రాశారు.