సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు, పాల్గొన్న మంత్రులు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 5వ తేదీన గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 8వ తేదీన 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను సభకు సమర్పించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ముందస్తు బడ్జెట్ కసరత్తు సమావేశాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించారు. కేంద్రం అవసరమైన నిధులివ్వలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సీఎం వ్యాఖ్యానించారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం నుంచి సక్రమంగా సాయం అందడం లేదన్నారు. మోసపోయామని, నష్టపోయామని ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తే వారు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టు పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై వివిధ ఏజెన్సీలు ఇస్తున్న ర్యాంకింగులను కూడా పరిగణనలోకి తీసుకుని పనితీరు మెరుగుపరుచు కోవాలన్నారు. రాష్ట్ర సుస్థిర వృద్ధి, ప్రజల సంతృప్తి లక్ష్యంగా రానున్న బడ్జెట్‌ను రూపొందాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment