Division Act
-
8న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, అమరావతి: వచ్చే నెల 5వ తేదీన గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 8వ తేదీన 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను సభకు సమర్పించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ముందస్తు బడ్జెట్ కసరత్తు సమావేశాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించారు. కేంద్రం అవసరమైన నిధులివ్వలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సీఎం వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం నుంచి సక్రమంగా సాయం అందడం లేదన్నారు. మోసపోయామని, నష్టపోయామని ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తే వారు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టు పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై వివిధ ఏజెన్సీలు ఇస్తున్న ర్యాంకింగులను కూడా పరిగణనలోకి తీసుకుని పనితీరు మెరుగుపరుచు కోవాలన్నారు. రాష్ట్ర సుస్థిర వృద్ధి, ప్రజల సంతృప్తి లక్ష్యంగా రానున్న బడ్జెట్‌ను రూపొందాలని సూచించారు. -
దద్దరిల్లిన పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, నిధులు రాకపోవడంతోపాటు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో గొంతెత్తి నినదించారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేశారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆందోళనకు దిగారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టేలా వివరించారు. విభజన వల్ల నష్టపోయిన తీరును వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, నిధులను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంట్ లోపల, బయటా ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. పార్టీ సభ్యులు ఉదయం నుంచి రాత్రి వరకూ 8 గంటలకు పైగా అలుపెరగకుండా ఆందోళన చేపట్టారు. కేంద్రానికి తమ నిరసన తెలియజేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా రాత్రి వాకౌట్ చేశారు. అధికార టీడీపీ సభ్యులు మాత్రం ఆందోళనల డ్రామా నిర్వహించారు. అసలేం జరిగింది.. ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్సీపీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన ప్రారంభించారు. ప్లకార్డులతో అరగంటపాటు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘‘హామీల అమలుపై కేంద్ర బడ్జెట్లో ప్రస్తావనే లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పటిదాకా ఏం చేసిందో చెప్పాలి. వాళ్ల(టీడీపీ) స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. హామీలను అమలు చేసేలా ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. కేంద్రం స్పందించేంత వరకూ మా ఒత్తిడి, పోరాటం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం సమీపంలో ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎంపీల నిరసనలో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి పాలుపంచుకోలేదు. వాయిదా తీర్మానానికి నోటీసులు ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంతకు ముందు వైవీ సుబ్బారెడ్డి విభజన హామీల అమలుపై చర్చకు ప్రతిపాదిస్తూ వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు సైతం వెల్‌లోకి చేరుకున్నారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ 11.10 గంటలకు పది నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎంపీలు తమ నినాదాలు కొనసాగించారు. నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అనంత్‌కుమార్ జోక్యం ఇరు పార్టీల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో జోక్యం చేసుకుంటూ ‘‘ఎంపీల ఆందోళనకు సంబంధించిన అంశాలను ప్రధాని పరిశీలిస్తున్నారు. ఎంపీలు ఆందోళన విరమించాలి’ అని కోరారు. మధ్యాహ్నం 12.25 గంటలకు సభలోకి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వద్దకు రాగా, సభ్యులను వెనక్కి పిలిపించాలని ఆయన సూచించారు. ప్రధాని, ఆర్థిక మంత్రితో సంబంధిత అంశాలపై చర్చిస్తున్నామని, ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం తమ పార్టీ సభ్యులు ఆందోళన విరమిస్తారని సుజనా బదులిచ్చినట్లు సమాచారం. 12.25 గంటలకు ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. 2 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చారు. ఈ సమయంలో ప్రధాని ముందువైపు వైఎస్సార్సీపీ ఎంపీలు ఉండగా, విపక్ష కాంగ్రెస్ సభ్యుల వైపు టీడీపీ ఎంపీలు నిల్చున్నారు. 2.30కి కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ప్రయత్నించగా టీడీపీ ఎంపీలు ఆయన చుట్టూ చేరి నినాదాలు చేశారు. దీంతో ఇతర సభ్యుల హక్కులను కాలరాయొద్దని సభాపతి హెచ్చరించారు. అయినా టీడీపీ ఎంపీలు వినకపోవడంతో సభను 2.30 గంటలకు 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రభుత్వ ప్రాయోజిత నాటకం మల్లికార్జున ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకోవడం తగదని సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్ నేతలు చెప్పడం టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగించింది. దోషులు మీరే అంటూ టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ నేతలపైకి దూసుకెళ్లారు. ఈ సమయంలో అక్కడే ఉన్న సోనియాగాంధీ వారించారు. తిరిగి సభ ప్రారంభం కాగానే మల్లికార్జున ఖర్గే తన ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సోనియాగాంధీ ప్రధానికి ఇదివరకే రెండుసార్లు లేఖ రాశారని చెప్పారు. ప్రభుత్వంలో భాగమైన టీడీపీ ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ ప్రాయోజిత నాటకమని ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. ఎంపీల ఆందోళనల మధ్య సభను సభాపతి మరోసారి 2.55 గంటలకు 35 నిమిషాలపాటు వాయిదా వేశారు. జైట్లీ ప్రకటనతో వెనక్కి తగ్గిన టీడీపీ 3.30 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఖర్గే ప్రసంగం మొదలైంది. జైట్లీ సభకు వచ్చారు. అంతకు ముందు ఆయన రాజ్యసభలో విభజన హామీలపై ప్రకటన చేసి వచ్చారు. 4.30కి లోక్‌సభలోనూ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలు 90:10 నిష్పత్తిలో ఉండేవని, సాధారణ రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో ఉండేవని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున కేంద్ర వాటాగా మరో 30 శాతం అంతరాన్ని ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్(ఈఏపీ) ద్వారా ఇద్దామనుకున్నామని చెప్పారు. ఈ మేరకు గతంలోనే ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించామని గుర్తుచేశారు. అయితే ఈఏపీ ద్వారా నిధుల రాక ఆలస్యమవుతున్నందున దానిని నాబార్డు రుణాల రూపంలో ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదించిందని, దీనిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళన విరమించారు. కొనసాగిన వైఎస్సార్సీపీ ఆందోళన టీడీపీ ఎంపీలు వెనక్కి మళ్లినా వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన విరమించలేదు. జైట్లీ ప్రకటనపై సంతృప్తి చెందక తమ నిరసనను కొనసాగించారు. ధన్యవాద తీర్మానంపై చర్చలో వైఎస్సార్సీపీకి అవకాశం రాగా మిథున్‌రెడ్డి మాట్లాడేటప్పుడు రాత్రి 7 గంటల సమయంలో పార్టీ సభ్యులంతా తమ స్థానాలకు వచ్చి నిలుచున్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి తీవ్ర ఆవేదనతో, ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కలత చెందుతున్నామని వివరించారు. ఆర్థిక మంత్రి ప్రకటన తమను ఆవేదనకు గురి చేసిందన్నారు. హామీలు ఎప్పుడు, ఎలా అమలు చేస్తారో స్పష్టమైన, జవాబుదారీ ప్రకటన ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి ప్రకటనతో తాము సంతృప్తి చెందడం లేదని, దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి వైఎస్సార్సీపీ ఎంపీలు సభ నుంచి బయటకు వచ్చేశారు. కాగా, వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన లోక్‌సభ సభ్యులు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక ఏపీ ఎంపీల ఆందోళనలో పాలుపంచుకోలేదు. తెలుగుదేశం సభ్యుల డ్రామా ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ రాజకీయ రంగస్థలంపై రోజుకో నాటకం ఆడుతోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా గట్టిగా నోరెత్తి అడిగే ధైర్యం చేయలేకపోయింది. టీడీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో మంగళవారం పార్లమెంట్ సాక్షిగా సరికొత్త డ్రామాకు తెర తీసింది. సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో నాటకాన్ని రక్తికట్టించేందుకు ప్రయత్నించారు. సభలో మొక్కుబడిగా ఆందోళన చేసి, అరుణ్ జైట్లీ నుంచి హామీ లభించిందంటూ మధ్యలోనే విరమించారు. అరుణ్ జైట్లీ చేసిన ‘హామీల పరిశీలన’ ప్రకటనలో ఎలాంటి కొత్తదనం లేదు. గతంలో చెప్పిన అంశాలనే పునరావృతం చేసినా టీడీపీ సభ్యులు సంతృప్తి చెందారు. అటు సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం నుంచి తమ పార్టీ ఎంపీలు, ఇతర నేతలతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించకుండా ఎలా నడుచుకోవాలో సూచించారు. బడ్జెట్‌పై వ్యతిరేక స్వరం వినిపించకుండా, మొక్కుబడి నిరసనలకే పరిమితం కావాలని ఆదేశించారు. అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత తన అనుకూల మీడియా ద్వారా రాష్ట్రానికి ఏదో న్యాయం జరిగిపోయిందన్నట్లుగా, అది తమ పార్టీ వల్లనే సాధ్యమైందన్న రీతిలో ప్రచారం చేయించారు. -
ఈసారైనా న్యాయం జరిగేనా?
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014ను పార్లమెంట్ ఆమోదించి నాలుగేళ్లు గడుస్తోంది. విభజన చట్టంలోని హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాజధాని లేకుండా ఏర్పడిన నూతన రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని ఎంతగానో ఆశించింది. అయితే, నాలుగేళ్లుగా నిరాశే మిగులుతోంది. ప్రతి బడ్జెట్‌కు ముందు నిధులు వస్తాయని లెక్కలేసుకోవడం, చివరకు ఉసూరుమనడం పరిపాటిగా మారింది. ఈ నాలుగేళ్లలో ఇప్పటిదాకా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల్లో కొన్ని నెరవేరినా వాటికి పూర్తిస్థాయి నిధుల కేటాయింపులు జరగలేదు. ఎన్డీయే ప్రభుత్వం గురువారం తన చివరి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తోంది. అన్యాయం జరుగుతున్నా నోరు విప్పరేం? రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ప్యాకేజీ కింద ఇప్పటిదాకా పైసా కూడా రాబట్టలేకపోయారు. నాలుగేళ్లుగా కేంద్రం హామీలను అమలు చేయకపోయినా, నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నా చంద్రబాబు గట్టిగా నిలదీసిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో రాజధాని నిర్మాణం, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు పైసా కూడా విడుదల కాలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కేవలం రూ.970 కోట్లు వచ్చాయి. ఇప్పటిదాకా చేసిన పనులకు గాను ఇంకా రూ.3,217 కోట్లు రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,100 కోట్లు రావాల్సి ఉండగా, పైసా కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పలు విద్య, వైద్య సంస్థలను కేంద్రం మంజూరు చేసినప్పటికీ వాటికయ్యే వ్యయాన్ని బడ్జెట్లో కేటాయించడం లేదు. పరిష్కారం దొరకని అంశాలు - ఏపీకి 2014–15కు సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేదు. - రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.2,500 కోట్లు కేటాయించింది. అయితే, రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఎంత సాయం కావాలన్న దానిపై రాష్ట్ర సర్కారు నుంచి సరైన ప్రతిపాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. - పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో దోబూచులాట కొనసాగుతోంది. పునరావాస ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నాబార్డు ద్వారా నిధులు ఇస్తామని హామీలు ఇస్తున్నా.. ఇప్పటిదాకా ఇచ్చింది నామమాత్రమే. - పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల పరిధిని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌పై గత నాలుగు బడ్జెట్లలోనూ స్పష్టత ఇవ్వలేదు. - దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు వంటి చట్టబద్ధమైన హామీలను సైతం నాలుగు బడ్జెట్లలో కేంద్రం విస్మరించింది. - విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్ధిష్టమైన కేటాయింపులు జరపలేదు. వీటి ఏర్పాటుపై సందిగ్ధత వీడలేదు. - విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడంలో ఆశించిన పురోగతి లేదు. - వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కోరాపుట్–బొలాంగిర్–కలహండి(కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించారు. కానీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం ఏటా రూ.50 కోట్ల చొప్పున మాత్రమే విడుదల చేస్తోంది. - జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, కేంద్రీయ వర్సిటీ, పెట్రోలియం వర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, ఐఐఐటీ తదితర సంస్థలను కేంద్రమే నిర్మించాల్సి ఉంది. వీటికి నామమాత్రంగానే నిధులు కేటాయిస్తోంది. విశాఖ రైల్వే జోన్‌పై ఏపీ సర్కారు అనాసక్తి విశాఖపట్నం రైల్వే జోన్.. 50 ఏళ్లనాటి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఈ హామీని చేర్చారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిసి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగేళ్లవుతున్నా ఈ హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైల్వే జోన్ ఆవశ్యకతను ఏనాడూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాడుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఏపీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కోరలేదని దక్షిణ మధ్య రైల్వే జోనల్ బోర్డు సభ్యుడు జాన్‌బాబు చెప్పడం గమనార్హం. రైల్వే జోన్‌పై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం ఆసక్తి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే కేంద్రం కూడా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. -
‘పంపకం’ ఇంకా పెండింగ్‌లోనే!
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపకం జరగాల్సి ఉంది. పోలీస్ శాఖలో మూడున్నరేళ్లుగా డీఎస్పీ స్థాయి అధికారుల పంపకం పెండింగ్‌లోనే ఉంది. సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో కొంత మంది అధికారులు హైకోర్టు నుంచి స్టే తీసుకురావడమే ఇందుకు కారణం. సీనియారిటీ జాబితా సవరించిన తర్వాతే అధికారుల విభజన చేయాలని కమల్‌నాథన్ కమిటీతోపాటు ఏపీ, తెలంగాణ డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలిచ్చి రెండేళ్లు దాటింది. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీ వేసిన ఏపీ పోలీస్ శాఖ.. ఇప్పటివరకు సీనియారిటీ జాబితా సవరించకపోవడంతో కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితాకు వెళ్లాల్సిన ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. రాష్ట్ర విభజనలో తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కొరత ఏర్పడిందని ఆందోళన వ్యక్తమవుతుండగా, సమీక్షలు, సీనియారిటీ జాబితా సవరణ పేరుతో మరింత కాలయాపన చేయడం అధికారులను సతమతం చేస్తోంది. కన్ఫర్డ్ ఐఏఎస్‌కు లైన్‌క్లియర్ ఇక రెవెన్యూ సర్వీసు అధికారుల విషయంలోనూ గందరగోళం నడిచింది. చివరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఓ కమిటీ వేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నా రు. పది రోజుల క్రితమే రెవెన్యూ సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు పంపకాలు కూడా పూర్తిచేశారు. దీంతో కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతి పొందేందుకు అర్హత కలిగిన అధికారుల పేర్లను కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఐపీఎస్‌ల సంగతేంటి? రెవెన్యూ సర్వీసులో సీనియారిటీ జాబితా పూర్తయి చకచకా కన్ఫర్డ్ పదోన్నతికి ప్యానల్ వెళ్తుండటంతో తమ పరి స్థితి ఏంటని ఐపీఎస్ పదోన్నతి పొందాల్సిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి సీనియారిటీ జాబితా సవరణ పేరుతో కాలయాపన తప్ప ఒరిగిందేమీ లేదన్న వాదన రెండు రాష్ట్రాల పోలీస్ అధికారుల్లో వినిపిస్తోంది. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన 12 కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానళ్ల ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లకుం డా సీనియారిటీ సమస్యతో పెండింగ్‌లో ఉండిపోయాయి. రెండు రాష్ట్రాల డీజీపీలు త్వరితగతిన నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు. సవరణపై తుది చర్చలు జరిపి సీనియారిటీ జాబితాను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. -
ఇక ఇవ్వాల్సింది రూ.138 కోట్లే
-
విభజన చట్టం అమలు ప్రస్తావనేది?: కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల ప్రస్తావన లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి హోదాతో పాటు విభజన చట్టం అమలు స్థితిని రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచి రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం తన దృఢ సంకల్పాన్ని రుజువు చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశతో ఉన్నారని కేవీపీ పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన నిబద్దతను రుజువు చేసుకోవడంలో విఫలమైందన్నారు. -
ఆస్తుల మాదిరే కృష్ణా జలాలూ పంచాలి
- కృష్ణా ట్రిబ్యునల్ లో స్పష్టం చేసిన కేంద్రం - కేంద్రం వాదనతో విభేదించిన తెలుగు రాష్ట్రాలు సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం జనా భా ప్రాతిపదికగా ఏపీ, తెలంగాణకు ఆస్తులు పంచినట్లే.. కృష్ణా జలాలను కూడా పంపిణీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటకలకు ట్రిబ్యునల్ గతంలో జరిపిన కేటాయింపులపై ప్రభావం పడకుం డా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాలను పంచాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు బుధవారం కేంద్రం తరఫు న్యాయవాది వసీం ఖాద్రీ వాదించారు. అయితే వివాదాన్ని ఏపీ, తెలంగాణలకే పరిమితం చేసే అధికారం కేం ద్రానికి కానీ, సుప్రీంకోర్టుకు కానీ లేదని, నీటి వివాదాల్లో సర్వాధికారాలు ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉన్నాయని తెలుగు రాష్ట్రాలు వాదించాయి. మొదట కేంద్రం తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 2013లో ట్రిబ్యునల్ వెలువరించిన తుది తీర్పునకు, ప్రస్తుత అం శానికి సంబంధం లేదని, సుప్రీంలో స్టే విధిం చిన కారణంగానే అవార్డు అమలులో లేదన్నా రు. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం స్టే విధించిందని గుర్తు చేశారు. అయితే, తర్వాత జరిగిన పరి ణామాల్లో ఉమ్మడి ఏపీ విభజన జరిగిందని, విభజన చట్టం ప్రధాన ఉద్దేశం రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించడం, జనాభా నిష్పత్తిలో ఆస్తులను పంచడం తదితర అన్ని అంశాలపై చట్టంలోని వివిధ సెక్షన్లలో వివరించారని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. నీటిని కూడా ఆస్తిగానే పరిగణించాలని, సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాలను ఉమ్మడి ఏపీ కేటాయింపుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలన్నా రు. దీనికి సంబంధించి గతంలోనూ సుప్రీం లో కేంద్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేశామని గుర్తుచేశారు. ఆ అఫిడవిట్ ప్రతిని ట్రిబ్యునల్‌కు అందజేశారు. ఉనికిలో ఉందన్న కారణంగానే ట్రిబ్యునల్‌కు నీటి కేటాయిం పుల బాధ్యత అప్పగించారని, అది కూడా నీటి వివాదాల చట్టం ప్రకారం కాకుండా విభజన చట్టం ప్రకారం ఇచ్చారని చెప్పారు. ట్రిబ్యునల్‌కే సర్వాధికారాలు: తెలుగు రాష్ట్రాలు కేంద్రం వాదనలతో ఏపీ, తెలంగాణ విభేదించాయి. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం చేసే అధికారం కేం ద్రానికి లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదించారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో అంతిమ నిర్ణయం ట్రిబ్యునల్‌దేనన్నారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలనుకుంటే సెక్షన్ 89ను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. విభన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం కేటాయింపులను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని పార్లమెంట్ భావించి ఉంటే ట్రిబ్యునల్‌ను ప్రస్తావించకపోయేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. ట్రిబ్యునల్ ముందు గురువారం వాదనలు కొనసాగనున్నాయి. -
మాకే అబద్ధాలు చెబుతారా?
- రాష్ట్ర ప్రభుత్వంపై నీతి ఆయోగ్ మండిపాటు - ఏడు జిల్లాలకు రూ.700 కోట్లు విడుదల చేసిన కేంద్రం - ఆ నిధుల్ని వేరే కార్యక్రమాలకు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ : కేంద్రానికే రాష్ట్ర ప్రభుత్వం టోకరా వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాకే అబద్ధాలు చెబుతారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. అంతటితో ఆగకుండా స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీలకు వస్తామంటూ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయి తనిఖీలకు వస్తే ఏ పనులు చూపెట్టాలా... అని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆయా జిల్లాల అభివృద్ధికి వెచ్చించకుండా ఇతర కార్యకలాపాలకు మళ్లించడమే కాకుండా ఆ నిధులన్నీ వ్యయం చేసినట్లు కేంద్రానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పంపడంపై నీతి ఆయోగ్ తీవ్రంగా స్పందించింది. క్షేత్రస్థాయిలో తనిఖీలకు ప్రత్యేకంగా కేంద్ర అధికారుల బృందాన్ని పంపిస్తామని స్పష్టం చేసింది. ఈ నిధులను వ్యయం చేస్తే గానీ తదుపరి నిధులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఖర్చు చేసింది రూ.7.92 కోట్లే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు జిల్లాకు రూ.100 కోట్లు చొప్పున రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం రూ.700 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్ని ఖర్చు చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని కేంద్రం సూచించింది. ఆ ఏడు జిల్లాలను మిగతా ఆరు జిల్లాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావడానికి కేంద్రం ఇచ్చిన నిధులను వ్యయం చేయాలి. విద్య, ఆరోగ్య సేవలు, మంచి నీటి వసతి వంటి ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల్లో వెనుకబడి ఉంటే ఆయా రంగాలపై కేంద్రం ఇచ్చిన నిధులను వ్యయం చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసింది. నిర్ధారించిన అంశాలకు కాకుండా ఇతర కార్యకలాపాలకు వ్యయం చేసుకునే వెసులబాటును కూడా కల్పించింది. దీంతో జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి కార్యక్రమాల సభలు, సమావేశాలకు, స్కానింగ్ యంత్రాల కొనుగోళ్లకు వినియోగించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం రూ. 700 కోట్లు ఇస్తే కేంద్ర మార్గదర్శకాల మేరకు వ్యయం చేసింది కేవలం రూ. 7.92 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం ఇచ్చిన నిధుల వ్యయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం సమీక్షించకపోవడం..పూర్తిగా జిల్లా కల్టెర్లకే వదిలిపెట్టడం చూస్తే ఈ జిల్లాల అభివృద్ధిపై పాలకులున్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోంది. ఏడు జిల్లాల్లో కలిపి రూ.419.14 కోట్ల విలువగల 7,616 పనులను మంజూరు చేశారు. అయితే రూ.103.96 కోట్ల విలువగల 1,977 పనులను మాత్రమే చేపట్టారు. -
‘జిల్లా’లపై జోరుగా కసరత్తు
ఆ 15 జిల్లాలేవి.. ఎక్కడెక్కడ! ♦ క్షేత్రస్థాయిలో అధికారుల కసరత్తు ♦ త్వరగా పూర్తి చేయాలంటూ నేతల ఒత్తిళ్లు ♦ కొత్త జిల్లాల కోసం పలుచోట్ల ఆందోళన ♦ వాటిలో చేర్చే ప్రాంతాలపైనా పీటముడి సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు మొదలైంది. వచ్చే జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాలను ప్రకటిస్తామని స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలంగాణలో ఇప్పుడున్న పది జిల్లాలకు అదనంగా మరో 14 లేదా 15 కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. వీటితోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వవ్యస్థీకరణకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏవన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. సన్నాహాలు పూర్తి.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అధికారిక సన్నాహాలు పూర్తి చేసింది. దీనిపై కసరత్తు చేసేందుకు గత సెప్టెంబరులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలో నలుగురు కార్యదర్శులతో కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫామేషన్ యాక్ట్-1974ను తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫామేషన్ యాక్ట్‌గా పరిగణిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కమిటీ ఇప్పటికే తొలి నివేదిక సిద్ధం చేసింది. పాలనా సౌలభ్యంతో పాటు భౌగోళికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలను బట్టి కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులుండేలా ప్రతిపాదనలు రూపొందించింది. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు ఆ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండాలని, రవాణా సదుపాయాలతో పాటు మౌలిక వసతులున్న ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరీంనగర్, వరంగల్‌తో పీటముడి పలు ప్రాంతాలను కొత్త జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు, సీఎం హోదాలోనూ కేసీఆర్ వాగ్దానం చేశారు. దాంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలుచోట్ల స్పష్టమైన సంకేతాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కరీంనగర్లో జగిత్యాల, వరంగల్‌లో భూపాలపల్లి, మెదక్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండలో సూర్యాపేటలను జిల్లాలుగా మారుస్తామని పలు సందర్భా ల్లో సీఎం ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్‌కర్నూలు, వనపర్తిలను, ఖమ్మం జిల్లాలో కొత్తగూడాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తుది పరి శీలనలో ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను నాలుగు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్తగా వికారాబాద్, ఇబ్రహీంపట్నం, చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న యోచన ఉంది. అయితే ఏయే ప్రాంతాలను ఏ జిల్లా పరిధిలో చేర్చాలనే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలపై పీట ముడి నెలకొందని చెబుతున్నారు. అందుకే అన్ని జిల్లాలకూ అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను గుర్తించి కొత్త జిల్లాలపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. పాలమూరులో ఆందోళనలు.. కొత్త జిల్లాల కోసం రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి డిమాండ్లు తీవ్రస్థాయికి చేరాయి. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, జనగాంలను జిల్లా కేంద్రాలుగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ములుగు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు సీఎస్‌కు వినతి పత్రమిచ్చారు. మహబూబ్‌నగర్‌లో గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఏర్పడ్డ జేఏసీ మూడు నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తోంది. ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌లను జిల్లాలుగా మార్చాలని రంగారెడ్డి ప్రాంత ప్రతినిధులు కోరుతున్నారు. నేతల నుంచి ఒత్తిడి.. కొత్త జిల్లాల ఏర్పాటును వీలైనంత తొందరగా పూర్తి చేయాలంటూ మంత్రులు, అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతకాలంగా సీఎంపై ఒత్తిడి పెంచారు. నియోజకవర్గాల పెంపు, కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ తమ సెగ్మెంట్లు మార్పుచేర్పులకు గురైతే తమ రాజకీమ భవిష్యత్తు ప్రభావితమవుతుంది గనుక రాబోయే ఎన్నికలను దృష్ట్యా ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే నిలదొక్కుకునేందుకు తమకూ సమయముంటుందని వీరంతా సీఎంను కోరుతున్నారు. నిజానికి విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను ప్రస్తుత 119 నుంచి 153కు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది. దాంతో వీటికి అనుగుణంగానే కొత్త జిల్లాలు అవతరిస్తాయనే ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్రం నుంచి ప్రస్తుతానికి స్పష్టత గానీ, సానుకూల సంకేతాలు గానీ లేవు. ఈలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తెరపైకి తీసుకురావటంతో రాజకీయ శ్రేణుల్లో కలకలం మొదలైంది. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి
♦ హోం మంత్రికి మరో వినతిపత్రం అందించిన వైఎస్ జగన్ ♦ విభజన హామీలు నెరవేర్చండి.. రెవెన్యూ లోటు భర్తీ చేయండి ♦ కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయండి ♦ పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయండి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేయాలని, విభజన చట్టంలోని హామీలను అమలుపరచాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో కలిసిన అనంతరం ఏపీకి సాయంపై ఒక వినతిపత్రాన్ని విడిగా అందజేశారు. ముఖ్యాంశాలు ఇవీ.. ► ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం కారణంగా నూత న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్న ఇబ్బందు లు తమకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీ జోక్యం కోరుతున్నాం. వాటన్నింటిలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అమలు ప్రజల ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్‌కు అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ కూడా బలంగా మద్దతు పలికిం ది. ఆనాడు సభలో ఇచ్చిన హామీలను మరోసారి మీ దృష్టికి తెస్తున్నా. ► ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్లపాటు అమలుచేస్తామని. తద్వారా రాష్ట్ర ఆర్థికస్థితి మెరుగుపడుతుందని నాటి ప్రధాని హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో ఉండే రెవెన్యూ లోటును పూర్తిగా భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ► 2014 మార్చిలో కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్ల పాటు అమలుచేయాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. కానీ ఇంతవరకు అమలుకాలేదు. ఇదే అంశమై నేను గుంటూరులో ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాను. అనేక వినతిపత్రాలు కూడా ఇచ్చాను. ప్రధానమంత్రికి, మీకు, ఆర్థిక మంత్రికి పలు సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చాను. ► కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఈవిషయమై గట్టిగా అడగడం లేదు. పైగా టీడీపీ మంత్రులు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు గాను విభిన్న ప్రకటనలు ఇస్తున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు ఎలాంటి వ్యత్యాసం చూపలేదన్న వాదన తెస్తున్నాయి. ఈ వాదనలో పసలేదు. ఎందుకంటే కేంద్ర కేబినెట్ నీతి ఆయోగ్ ద్వారా ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు. మా ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలనలోకి తీసుకోవాలని నీతిఆయోగ్‌కు మార్గదర్శనం చేసింది. ► ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. తద్వారా జీడీపీ వృద్ధిపొందుతుంది. ఒకవేళ ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు ఇస్తే రాష్ట్రంలో భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయి. తద్వారా రెవెన్యూ వృద్ధి చెందుతుంది. లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అపారమైన నమ్మకంతో యావత్ ఆంధ్రప్రదేశ్ మీ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ► కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, వివిధ విద్యాసంస్థల స్థాపన ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికీ అనేక హామీల పరిష్కారం వెలుగుచూడలేదు. మూడో రైల్వే బడ్జెట్లోనైనా విశాఖ రైల్వే జోన్ వస్తుందనుకుని ఆశగా చూస్తే చివరకు నిరాశే ఎదురైంది. ఈ జోన్ ఏర్పాటును డిమాండ్ చేస్తూ మా పార్టీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. చట్టంలో ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన జోన్ ఏర్పాటుచేయాలి. ► ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-46(3) ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రూపంలో ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు కల్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కొద్ది మొత్తాలను మాత్రమే కేటాయించారు. పైగా బీఆర్జీఎఫ్ పథకం రద్దు చేశారు. ► ఏపీ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-90 పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తిచే స్తామని హామీ ఇచ్చింది. 23 నెలలు గడిచినా ఈ విషయంలో చెప్పుకోదగిన పురోగతి లేదు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు జీవరేఖ వంటిది. ప్రణాళిక సంఘం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010 కోట్లుగా ఆమోదించింది. అయితే టీడీపీ ప్రభుత్వం విచక్షణారహితంగా అంచనా వ్యయాన్ని పెంచుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఏపీకి ఆసక్తి లేనట్టు కనిపిస్తోంది. కారణాలు వారికే తెలుసు. ► అందువల్ల విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న మీరు ఈ చట్టంలోని హామీల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. -
నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాలకు సంబంధించి ఏర్పాటైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం నుంచి భేటీ కానుంది. మూడు రోజులపాటు జరగనున్న సమావేశాల్లో తెలంగాణ, ఏపీలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు వినిపించనున్నాయి. విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్ 89(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు కేటాయింపులు ఎలా జరపాలన్నది ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉన్నందున దీనిపైనే వాదనలు జరిగే అవకాశం ఉంది. మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేయాలని తెలంగాణ కోరుతోంది. గతంలో జరిగిన ఒప్పందాల మేరకు రాష్ట్రంలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశుల, కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా, ఆర్డీఎస్కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు మాత్రం 39 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గట్టిగా చెప్పనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా, నీటి కేటాయింపులు మాత్రం కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. కానీ ఏపీలో పరీవాహక ప్రాం తం 31.5 శాతమే ఉన్నా.. కేటాయిం పులు మాత్రం మొత్తం జలాల్లో 60 శాతానికిపైగా జరిపారు. ఈ మేరకు పరీవాహక ప్రాంతం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలన్నది రాష్ట్ర వాదనగా ఉండనుంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర మాత్రం వివాదాన్ని తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయాలని కోరనున్నాయి. -
ప్రత్యేక హోదాపై నేడు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, హైద రాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించటంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం శాసనసభ ప్రత్యేకంగా తీర్మానం ఆమోదించనుంది. మంగళవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతారు. అదే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు సీఎం ప్రకటన చేస్తారు. ఈ సందర్భంగా ప్రసంగించే ఏ నేత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీపై ఎలాంటి విమర్శలు చేయొద్దని ముఖ్యమంత్రి సూచించారు. కేవలం కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నట్లుగానే నేతలు ప్రసంగించాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లు, డిమాండ్ చేసినట్లు మాట్లాడవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. -
హోదా కోసం.. నేడు విశాఖలో ‘యువభేరి’
♦ ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రా వర్సిటీ విద్యార్థులు ♦ వేదిక విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియం.. ♦ ‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి’పై చర్చ ♦ ముఖ్య అతిథిగా హాజరవుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై మార్గనిర్దేశం చేయనున్న విపక్ష నేత సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత సమరభేరి మోగిస్తోంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తాయని, తద్వారా తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించిన విద్యార్థి, నిరుద్యోగ యువత రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఇది ఆగ్రహంగా మారి విద్యార్థి, నిరుద్యోగ యువత ఉద్యమ దిశగా కదులుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15న తిరుపతిలో విద్యార్థులు ‘యువభేరి’ పేరిట సమరభేరి మోగించారు. ఇదే క్రమంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు సాగుతున్నారు. ‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు-రాష్ట్ర భవిష్యత్తు’ అనే అంశంపై విశాఖపట్నంలో మంగళవారం ‘యువభేరి’ పేరిట భారీ సదస్సును నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 10 గంటల కు నిర్వహించే ఈ యువభేరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతుందని, యువతకు ఉద్యోగాలొస్తాయని తొలినుంచీ పోరాడుతున్న జగన్ ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధనపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. పోరు ఆవశ్యకతను వివరించనున్న జగన్ అడ్డగోలు విభజన వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టం, విద్యార్థులు-యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన తీరును జగన్ ఈ సదస్సులో వివరించనున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రభుత్వం మోసగిస్తున్న తీరును తేటతెల్లం చేస్తారు. రాష్ట్రం ప్రగతిపథంలో సాగి ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులు, యువతకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను ఆయన ప్రస్తావిస్తారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలు, హాస్టళ్ల కుదింపు, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, విద్యార్థులపై లాఠీచార్జి తదితర అంశాలను లేవనెత్తనున్నారు. అలాగే యువత సందేహాలను నివృత్తి చేస్తారు. హోదా సాధన దిశగా విద్యార్థులు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పోరుబాట పట్టాల్సిన అవసరాన్నీ వివరిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు విభజనవల్ల కలిగిన నష్టం, ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై కళావాణి ఆడిటోరియం ప్రాంగణంలో ప్రత్యేకంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇతర నేతలు సదస్సు నిర్వహించనున్న పోర్టు కళావాణి ఆడిటోరియంలో సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఉద్యోగుల విషయం తేలాకే ఆస్తుల పంపిణీ
తొలుత జనాభా నిష్పత్తి మేరకు ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలి * తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది * కేంద్రానికీ, షీలాభిడే కమిటీకి ఏపీ సీఎస్ లేఖ సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో గల ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పంపిణీ పూర్తి అయ్యే వరకు ఆ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని నిలుపుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్నీ, షీలాభిడే కమిటీని కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో గల 90 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే నిమిత్తం షీలాభిడే కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. షీలాభిడే కమిటీ దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని ఒక కొలిక్కి తీసుకువచ్చింది. అయితే ఈ విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య ఏకాభిప్రాయం లేదు. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆ లేఖలో ఏపీ సీఎస్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను, కేంద్ర సూచనలను టీ సర్కారు అమలు చేయకపోవడంతో 1,253 మంది ఉద్యోగుల కుటుం బాలు వీధిన పడ్డాయన్నారు. అప్పులు, ఆస్తుల పంపిణీ పూర్తి కాగానే ఆయా సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలనే వ్యూహాన్ని టీ సర్కారు అనుసరిస్తోందని ఏపీ సీఎస్ ఆరోపించారు. ఈ వ్యూహంలో భాగంగానే టీ సర్కారు షీలాభిడే కమిటీ నివేదికను అంగీకరించిందని వివరించారు. అయితే ఉద్యోగులను జనాభా నిష్పత్తి మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ సర్కారు అంగీకరించడం లేదన్నారు. ఆస్తులు, అప్పుల పంపిణీని ఉద్యోగుల పంపిణీని వేర్వేరుగా చూడరాదని ఏపీ సీఎస్ పేర్కొన్నారు. -
విభజన చట్టం, టీఆర్ఎస్ హామీలపై అధ్యయనం
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని అంశాలు, టీఆర్ఎస్ హామీలు, ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ లోతుగా అధ్యయనం చేస్తుందని, దాని కోసం మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించా రు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్ విమర్శించారు. ఒక స్వచ్ఛంద సంస్థతో వాటర్‌గ్రిడ్‌పై పరిశీలన చేయిస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలు, సాంకేతిక అంశాలపైనా లోతుగా అధ్యయనం చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం తర్వాత ఆయా పథకాలపై కార్యాచరణను నిర్ణయించుకుంటామని వెల్లడించారు. 17 మందితో కూడిన అధ్యయన కమిటీలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని పునరుద్ధరిస్తామని ఉత్తమ్ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలు, పనుల పరిశీలనకు మరిన్ని ఉపకమిటీలు వేసి, లోతుగా అధ్యయనం చేసి ఏఐసీసీకి నివేదిక ఇస్తామని సురేశ్‌రెడ్డి వెల్లడించారు. -
షెడ్యూల్ 10 సంస్థలన్నీ తెలంగాణవే..
-
షెడ్యూల్ 10 సంస్థలన్నీ తెలంగాణవే అంటున్న టీ సర్కారు
ఆంధ్రా ఉద్యోగుల్ని రిలీవ్ చేసేందుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో గల సంస్థలపై వివాదం రాజుకుంది. ఉన్నత విద్యా మండలి తెలంగాణకే చెందుతుందని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో పదో షెడ్యూల్లోని రాజధానిలో గల సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. విభజన చట్టంలో రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి ఏడాదిలోగా ఇరు రాష్ట్రాలు 10వ షెడ్యూల్లో సంస్థల నుంచి సేవలు పొందేందుకు ఒప్పందాలు చేసుకోవాలని ఉంది. ఏడాది గడిచిపోయినా సంస్థల విషయంలో ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీంతో 10వ షెడ్యూల్లో రాజధానిలో గల సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆ సంస్థల్లో రాజధానిలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జాతీయ నిర్మాణ సంస్థ (న్యాక్)లో గల ఆంధ్రాకు చెందిన అధికారులందరినీ ఏపీకి బదిలీ చేసింది. మరిన్ని సంస్థల్లో ఉన్న వారినీ రిలీవ్ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ సర్కారు రిలీవ్ చేసినా, తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చినా ఆ సమాచారాన్ని రాష్ట్ర పునర్విభజన విభాగానికి తెలియజేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కోరింది. సచివాలయంలోని ఎల్ బ్లాక్ కింద ఫ్లోర్లో గల రాష్ట్ర పునర్విభజన విభాగానికి ఆ సమాచారాన్ని పోస్టు ద్వారా గానీ లేదా secretarysrap@gmail.com మెయిల్ ద్వారా తెలియజేయాల్సిందిగా ఆ విభాగం కార్యదర్శి ఎల్. ప్రేమచంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. -
'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'
-
'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడంపై వివాదం తగదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన చట్టం ఆమోదించినప్పడు టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలోనే ఉన్న సెక్షన్ 8 అమలు చేయమంటే ఎందుకు విభేదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సెక్షన్ 8 అమలుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టసవరణ కోసం ప్రయత్నించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టం రూపకల్పనలో భాగస్వాములైన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. -
‘సూపర్’ వైద్య సీట్లపై సర్కారు దృష్టి
⇒ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాదన ⇒ విభజన చట్టంలో స్పష్టత లేక అయోమయం ⇒ అన్ని సీట్లను స్థానికులతోనే భర్తీ చేసే యోచన ⇒ న్యాయ సలహా తీసుకోవాలని సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ర్ట ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడమో లేక రాష్ర్టంలో ఉన్న సీట్లను ఇక్కడి వారితోనే భర్తీ చేయాలా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుండటం దీనికి కారణం. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ సహా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 198 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. వీటిలో 110 సీట్లు తెలంగాణలో, 65 సీట్లు ఏపీలో ఉన్నాయి. మిగిలినవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ప్రభుత్వ వాదన ప్రకారం తెలంగాణలో 110 సీట్లుంటే.. రాష్ట్ర విద్యార్థులకు దక్కేవి 48 సీట్లు మాత్రమే. 65 సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఏపీకి మాత్రం 96 సీట్లు దక్కుతున్నాయి. మిగిలిన 54 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటున్నాయి. తెలంగాణలోని సీట్లన్నీ ఇక్కడి విద్యార్థులకే దక్కాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ 15 శాతం ఓపెన్ కేటగిరీని వదిలేసినా 100 సీట్లయినా దక్కాల్సిందేనని వాదిస్తున్నాయి. ఉదాహరణకు నిమ్స్‌లో బ్రాడ్ స్పెషాలిటీలో 28 సీట్లుంటే అందులో ఏపీకి 16, తెలంగాణకు 7 సీట్లు దక్కుతున్నాయి. ఓపెన్ కేటగిరీలో మాత్రం ఐదు సీట్లున్నాయి. నిమ్స్ పీజీ సూపర్ స్పెషాలిటీలో 50 సీట్లుంటే అందులో ఏపీకి 30, తెలంగాణకు 12 సీట్లు మాత్రమే దక్కుతాయి. ఆ రెండు సెక్షన్లు పరస్పర విరుద్ధం విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం వచ్చే పదేళ్ల వరకు ఉన్నత విద్యలోని పాత కోటా సీట్లను గతంలో ఉన్నట్లే భర్తీ చేయాలి. అయితే సెక్షన్ 97 ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సీట్లు ఉండాలని పేర్కొన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. విభజన చట్టంలో గందరగోళం ఉన్నప్పటికీ సెక్షన్ 97 ప్రకారం తెలంగాణలోని సీట్లను తెలంగాణవారితోనే భర్తీ చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ‘తెలంగాణలోని ఉన్నత విద్యలో రాష్ట్రస్థాయి సీట్లకు అయ్యే ఖర్చు, ఫ్యాకల్టీ, విద్యార్థుల ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది. ఏపీ ఒక్క పైసా కేటాయించలేదు. ఆ రాష్ట్ర విద్యార్థులు మాత్రం 64 శాతం సీట్లు పొందుతున్నార’ని జూనియర్ డాక్టర్ల సంఘం కన్వీనర్ శ్రీనివాస్ అంటున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామన్నారు. కాగా, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని, ఆ తర్వాతే తగిన చర్యలు చేపడతామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. -
ఇంటర్మీడియెట్ బోర్డు తెలంగాణదే!
అదీనంలోకి తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు * సెక్షన్ 75 ప్రకారం సంస్థ ఎక్కడ ఉంటే దానికే అధికారం * విభజన చట్టం చెబుతున్నదిదే * ఏపీ కోరితే సేవలకు సిద్ధం * వేరుగానే ఇంటర్ పరీక్షలు! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డుపై అధికారం తమకే ఉంటుందని, ఈ దృష్ట్యా బోర్డును తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం బోర్డు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. బోర్డును తమ ఆధీనంలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ కోరితే వారికి అవసరమైన సేవలు అందించాలని భావిస్తోం ది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం లోనూ ఇంటర్ బోర్డును తమ పరిధిలోకి తెచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సెక్షన్ 75 ఏం చెబుతోందంటే... ‘పదో షెడ్యూలులోని సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర పరిధిలోకే వస్తాయి. అయితే పొరుగు రాష్ట్రానికి ఏడాదిపాటు ఆ సంస్థ సేవలు అందించాలి. రాష్ట్ర విభజనకు ముందు ఎలాంటి సేవలు అందాయో ఆలాంటి సేవలను కొనసాగించాలి. ఎలాంటి తేడా చూపడానికి వీల్లేదు’ అని విభజన చట్టంలో సెక్షన్ 75 చెబుతోంది. వేర్వేరుగా పరీక్షల ఏర్పాట్లు ఇంటర్మీడియెట్ పరీక్షలను వేర్వేరుగానే నిర్వహించేందుకు బోర్డు అధికారులు రెండు రాష్ట్రాలకు అవసరమైన ప్రశ్న, జవాబు పత్రాల పేప రు కొనుగోలు, ముద్రణకు సంబంధించిన టెం డర్లను గురువారం పిలిచారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగానే సరఫరా చేసేలా టెండర్ నోటిఫికేషన్లో నిబంధన విధించారు. ఏపీకి, తెలంగాణకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. రెండు రాష్ట్రాలు కలిపి ఒకే ప్రశ్నపత్రం తో పరీక్షలు నిర్వహిస్తే మూడు సెట్లను ముద్రిం చాలని భావిస్తోంది. లేదంటే 6 సెట్లను ముద్రిం చి ఒక్కో రాష్ట్రానికి 3 సెట్లు అందజే యనుంది. రెండు, మూడు రోజుల్లో షెడ్యూలు ఖరారు! ప్రస్తుతం పరీక్షలు వేర్వేరుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టగా, ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఇవ్వాలా? రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన ప్రశ్నపత్రాలను ఇవ్వాలా? అనేది తేలాల్సి ఉంది. ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూలును సిద్ధం చేసే పనిలో పడింది. షెడ్యూళ్లను కూడా రెండు రకాలుగా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు నిర్ణీత తేదీల్లోగా ప్రశ్నపత్రాల వ్యవహారాన్ని తేల్చాలంటూ రెండు రాష్ట్రాలను కోరాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. -
ఏపీలో ‘ఇన్చార్జి’ పోలీసింగ్!
కీలక పోస్టులకు అధికారులు కరువు ఏడీజీ నుంచి డీఐజీ స్థాయి వరకు ఇదే తీరు ఇన్చార్జి బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు క్యాడర్ అలాట్మెంట్ తరువాతే సమస్యకు పరిష్కారం హైదరాబాద్: విభజన చట్టం అమలుల్లోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికీ క్యాడర్ కేటాయింపు పూర్తికాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం ఇన్చార్జిల పాలనలో నడుస్తోంది. అదనపు డీజీ నుంచి డీఐజీ స్థాయి వరకు అనేక కీలక పోస్టుల్ని ఇన్‌చార్జిలే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 258 ఐపీఎస్ అధీకృత పోస్టులు ఉండగా... 206 మంది అధికారులు అందుబాటులో ఉండేవారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 144 పోస్టులను మే నెలలోనే కేంద్రం మంజూరు చేసింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 నాటికి కేటాయింపులు పూర్తిగా జరక్కపోవడంతో తాత్కాలిక ప్రాతిపదికన (ప్రొవిజనల్ అలాట్మెంట్) రాష్ట్రానికి ఆరుగురు డీజీపీ స్థాయి అధికారులు, 17 మంది అదనపు డీజీ స్థాయి అధికారులు, 11 మంది ఐజీ స్థాయి అధికారులు, 18 మంది డీఐజీ స్థాయి అధికారుల్ని కేటాయించారు.ఆంధ్రప్రదేశ్‌లో అదనపు డీజీ స్థాయిలో 25 పోస్టులు ఉండగా ఏడింటికి, ఐజీ స్థాయిలో 16 పోస్టులు ఉండగా ఆరింటికి, డీఐజీ స్థాయిలో 21 పోస్టులు ఉండగా రెండింటికి ఇన్‌చార్జీలే దిక్కయ్యారు. ఒక్కో అధికారి నాలుగు విభాగాలనూ పర్యవేక్షించాల్సి వస్తోంది. అనేక మంది అధికారులు తాము పని చేస్తున్న స్థానంతో పాటు ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోస్టుకూ సరైన న్యాయం చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. టాస్ వేసి కేటాయింపు.. శనివారం నాటికి కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని రెండు రాష్ట్రాలకూ పంచుతుందని తెలుస్తోంది. నిర్దేశించిన దానికంటే ఎక్కువగా ఉన్న స్థానికులతో పాటు రాష్ర్టేతర అధికారుల్నీ రోస్టర్ పద్ధతిలో కేటాయిస్తారు. తొలి కేటాయింపును టాస్ వేయడం ద్వారా నిర్ధారిస్తారు. దీంతో అనేక మంది స్థానిక, రాష్ర్టేతర అధికారుల్లో తాము ఏ రాష్ట్రానికి వెళ్తామో అనే ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు శాంతిభద్రతల విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు దళం(ఏపీఎస్పీ), న్యాయ విభాగం తదితర కీలక పోస్టుల్లో రాష్ర్టేతర అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరు ఏ రాష్ట్రానికి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది.