
'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడంపై వివాదం తగదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన చట్టం ఆమోదించినప్పడు టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలోనే ఉన్న సెక్షన్ 8 అమలు చేయమంటే ఎందుకు విభేదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
సెక్షన్ 8 అమలుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టసవరణ కోసం ప్రయత్నించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టం రూపకల్పనలో భాగస్వాములైన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.