
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు ఆయన తమ్ముడు, వైఎస్సార్‌సీపీ నేత కృష్ణుడు సవాల్ కూడా విసిరారు. రామకృష్ణుడికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. తనను అరెస్ట్ చేస్తే రామకృష్ణకు మంచిపేరు వస్తుందన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారు. నా దగ్గర పనిచేసే కుర్రాళ్లను, డ్రైవర్లను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు. నిజంగా యనమల రామకృష్ణకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే యనమలకు మంచి పేరు వస్తుంది.
అక్రమ కేసులు, అరెస్ట్‌లకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను.. ఇలాంటి చౌకబారు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నానని చులకనగా చూడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment