
విభజన చట్టం అమలు ప్రస్తావనేది?: కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల ప్రస్తావన లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి హోదాతో పాటు విభజన చట్టం అమలు స్థితిని రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచి రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం తన దృఢ సంకల్పాన్ని రుజువు చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశతో ఉన్నారని కేవీపీ పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన నిబద్దతను రుజువు చేసుకోవడంలో విఫలమైందన్నారు.