ఇసుక దందాలో సీఎం బంధువులు, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల/కరీంనగర్: ఇసుక దందాలో సీఎం బంధువులు, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొదురుపాక, సిరిసిల్ల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఒక్కో పర్మిట్‌పై నాలుగు లారీలు తరలిపోతు న్నాయన్నారు. మద్యం, ఇసుక అమ్మకాలతోనే సర్కారు పాలన సాగిస్తోం దన్నారు.
కాగా, రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని పొన్నం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంత పోకడలతో బడ్జెట్‌ను రూపొందించడం అప్రజాస్వామికమన్నారు.