
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పెట్రో ధరలపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నిం చరని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర తగ్గినా పెట్రోలు ధరలు ఎందుకు తగ్గట్లేదో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ఈ పరిస్థితి వస్తుందని ఆ రోజే మన్మోహన్‌సింగ్ చెప్పారన్నా రు. పెట్రో, డీజిల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ధరను రద్దుచేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు.