petro prices
-
Sri Lanka: నిరసనకారులపై పేలిన తూటా.. ఒకరి మృతి
తీవ్ర సంక్షోభంలో ఊగిసలాడుతున్న శ్రీ లంకలో.. నిరసనకారులపై మొదటిసారి తుటా పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. లంక గడ్డపై ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి నిరసనకారులపై కాల్పులు జరపడం ఇదే తొలిసారి. నిరసనకారులు రాళ్లు రువ్వి హింసకు పాల్పడడంతోనే తాము కాల్పులకు దిగినట్లు ఓ పోలీస్ అధికారి ధృవీకరించారు. సోమవారం రాజధాని కొలంబోకు వంద కిలోమీటర్ల దూరంలోని రామ్‌బుక్కన్న దగ్గర చమురు కొరత, అధిక ధరలను వ్యతిరేకిస్తూ కొందరు నిరసనకారులు హైవేని దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు మృతి చెందగా, పదిమందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన నిరసనకారులు రెచ్చిపోయి.. మరిన్ని దాడులకు తెగపడ్డారు. ఇదిలా ఉండగా.. పెట్రో ధరలను ఇవాళ ఏకంగా 64 శాతం ధరను పెంచేసింది సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్. దీనికి నిరసనగానే ప్రదర్శనలు జరుగుతున్నాయి. చాలాచోట్ల వాహనదారులు.. తమ బైక్ టైర్లను కాల్చేసి రహదారుల్ని మూసేసి నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభం లంకలో కొనసాగుతోంది. ఆహార ఉత్పత్తులు, మందులు, చమురు కొరత తీవ్రంగా కొనసాగుతోంది అక్కడ. ఇన్నిరోజుల పాటు నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు, ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లగా.. ఇప్పుడు ఏకంగా ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర(ఇవాళ్టి పెంపుతో) రూ. 338కి చేరుకుంది. ఆ దేశానికి చెందిన లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) చమురు ధరలను పెంచింది. దీనికి అనుగుణంగా నిన్న అర్ధరాత్రి సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 92 ఆక్టేన్ పెట్రోల్ ధరనే ఏకంగా రూ. 84 మేర పెంచేసింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 338కి చేరుకుంది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలపై లంక ప్రజలు మండిపడుతున్నారు. చదవండి: కుటుంబీకులు లేకుండా... లంక కొత్త కేబినెట్!! -
పెట్రో ధరలపై 14న అమిత్ షాకు నిరసన
సాక్షి, అమరావతి: ఈ నెల 14న తిరుపతి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు పెట్రో ధరల పెంపుపై నిరసనలు తెలపాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇలా కంటి తుడుపుగా రూ.5 తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత క్రూడ్ ఆయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటే లీటర్ పెట్రోల్‌ను రూ.70–75కు, డీజిల్‌ను రూ.55–60కు అందించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని, పెరిగితేనే.. పెరుగుతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయిన 2014లో లీటర్ పెట్రోల్ సగటు ధర రూ.72 కాగా, ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో బేరల్ క్రూడ్ ఆయిల్ సగటు ధర 93 డాలర్లుగా ఉందని తెలిపారు. ఇప్పుడు 82 డాలర్లు మాత్రమేనని.. అయినా 2021 నవంబర్ 1 నాటికి లీటర్ పెట్రోల్ రూ.116కు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ ధర 11 డాలర్లు తగ్గినా పెట్రోల్ ధరను రూ.44 పెంచారని మండిపడ్డారు. అలాగే, లీటర్ డీజిల్ ధర రూ.47గా ఉన్నదాన్ని రూ.109కి పెంచారని తెలిపారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.44 పెంచి రూ.5 తగ్గించిందని, డీజిల్‌పై రూ.61 పెంచి రూ.10 తగ్గించిందంటూ ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన ఆర్థిక నీతిని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీన్ని నిరసించాలని వామపక్ష పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు రామకృష్ణ పేర్కొన్నారు. -
Petrol Price: పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?
సాక్షి, అమరావతి : ‘పెట్రో ధరలు పెంచాల్సినంత పెంచేసి, ఆటవిడుపులా ఇప్పుడు అరకొరగా తగ్గించి.. రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతామంటున్నారు. ఐదో, పదో తగ్గించి.. దాన్ని రాజకీయానికి వాడుకుందామని ప్రయత్నిస్తున్నారు. సర్ చార్జీలు, సెస్‌లు పేరిట చేస్తున్న వసూళ్లలో రాష్ట్రాలకు వాటా లేకుండా చేసిన వారే ఇప్పుడు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. మరో పక్క టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా పెట్రో బాదుడు బాది.. ప్రజల నడ్డి విరిచేసి, ఇప్పుడు దాన్ని మరిచిపోయి, తాము పెంచిన పన్నులను తగ్గించాలని కొత్తపాట అందుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ కుయుక్తులు. ఈ నేపథ్యంలో పెట్రో ధరలపై వాస్తవ విషయాలను ప్రజల ముందు ఉంచుతున్నాం’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇరు పార్టీల అసలు స్వరూపాన్ని నేరుగా ప్రజలకే వివరిస్తూ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇవీ వాస్తవాలు.. ► ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా తగ్గినప్పటికీ, అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలు తగ్గించలేదు. 2019 మేలో లీటరు పెట్రోలు రూ.76.89, డీజిలు రూ.71.50 ఉండగా, ఈ సంవత్సరం నవంబర్ 1న పెట్రోలు రూ.115.99, డీజిలు రూ.108.66కు ధరలు పెరిగాయి. ఇంత బారీగా ధరలు పెరగడం వాస్తవం కాదా? ► పెట్రోలు, డీజిలు మీద కేంద్రం వసూలు చేస్తున్న మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతానికే పరిమితం. వాస్తవంగా అయితే నేరుగా పన్నుల పేరిట వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సెస్‌లు, సర్ చార్జీలు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. ఇలా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. ► పెట్రో ఉత్పత్తుల విక్రయాల మీద రూ.3.35 లక్షల కోట్లు వసూలు చేసినప్పటికీ, రాష్ట్రాలకు ఇచ్చిన వాటా రూ.19,475 కోట్లు (5.8%) మాత్రమే. వాస్తవంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచవలసి ఉంది. అయితే పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్ చార్జి రూపంలో సుమారు రూ.2,87,500 కోట్లు వసూలు చేసి, ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా? ► రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద దృష్టి పెట్టలేదు. ఫలితంగా రోడ్లు దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేస్తున్న విషయం విదితమే. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరు మీద కేవలం రూ.1 మాత్రమే సుంకంగా విధింంచాల్సి వచ్చింది. ► కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రాబడిని కోల్పోయింది. అయినా ఒక్కసారి ఒక్క రూపాయి తప్ప ఎప్పుడూ పెట్రోలు, డీజిలు మీద పన్నులు పెంచలేదన్నది వాస్తవం. -
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడు బతుకు జీవుడా అంటూ బతుకు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి పెరిగి పోతున్న ఈ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్ మంగళవారం 25 పైసలు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. దేశ రాజధానిలో ఒక లీటర్ డీజిల్ ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.47, డీజిల్ ధర లీటరుకు రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్ ధరలు నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 17 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గి 79.36 డాలర్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి భయాలు తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని క్రమ క్రమంగా తొలిగించడంతో ఇంధన ధరలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.(చదవండి: 35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్ సంగతేంది?) దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు.. City Name Petrol Price Diesel Price హైదరాబాద్ 105.48 97.46 విజయవాడ 107.54 99.25 విశాఖపట్నం 106.77 98.51 ఢిల్లీ 101.39 89.57 ముంబై 107.47 97.21 బెంగళూరు 104.92 95.06 చెన్నై 99.15 94.17 -
మళ్లీ పేలిన గ్యాస్ బండ!
సాక్షి, అమరావతి: వంట గ్యాస్ సిలిండర్ మరోసారి భగ్గుమంది. సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 చొప్పున ఉత్పత్తి సంస్థలు పెంచేశాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. ఉత్పత్తి సంస్థలు ధర పెంచిన నేపథ్యంలో విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.857 నుంచి రూ.882కి పెరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రవాణా వ్యయం ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.882కి కాస్త అటూఇటుగా ఉంది. 2019 ఏప్రిల్‌లో గ్యాస్ సిలిండర్ రూ.732 ఉండగా ఇప్పుడు రూ.882లకు చేరుకుంది. అంటే రెండేళ్లలో గ్యాస్ సిలిండర్ ధర రూ.150 మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత నెలలోనూ.. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. గత నెల 1న గ్యాస్ సిలిండర్ ధరను రూ.25.5 పెంచిన ఉత్పత్తి సంస్థలు తాజాగా మరో రూ.25 పెంచేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తోంది. -
డీజిల్‌పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
Petrol Diesel Prices ముంబై: ఇంధన ధరల్లో స్వల్ఫ ఊరట. డీజిల్ ధర లీటర్‌కు 15 నుంచి 17 పైసలు తగ్గింది. అయితే పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రం కొనసాగుతోంది. సోమవారం లీటర్‌కు 25 నుంచి 34 పైసల చొప్పున పెరిగింది. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.97.33పై.గా ఉన్న లీటర్ డీజిల్ ధర.. ప్రస్తుతం 97.19పై.కి చేరింది. ఇక పెట్రోల్ మాత్రం రూ.107.24పై. చేరుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత డీజిల్ ధరలో తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం. మే 4 నుంచి పెట్రోల్ ధరపై ఇది 39వ పెంపు. ఇప్పటికే రాష్రా్టలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 16 చోట్ల పెట్రోల్ రేట్లు సెంచరీ దాటేశాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 105కి చేరుకోగా, లీటరు డీజిల్ స్వల్ఫంగా తగ్గి రూ.97.86పై. కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో.. పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. రాబోయే రోజుల్లో.. ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుండడంతో పెట్రో మంటలను అదుపు చేయలేకపోతున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ ‘కొత్త’ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని, అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారాయన. -
పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి
-
ఉభయ సభలకు పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా.. పెట్రో ధరలపై కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల కారణంగా కార్యక్రమాలకు అంతరాయం కలిగి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవగానే కాంగ్రెస్ సభ్యులు పెట్రోల్, డీజిల్ తదితర పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై చర్చించాలంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఇచ్చిన నోటీస్‌ను చైర్మన్ ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తరచుగా పెరుగుతున్నాయని ఈ అంశంపై చర్చించాలని ఖర్గే 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చినట్టు ౖచైర్మన్ ప్రస్తావించారు. అయితే అప్రొప్రియేషన్ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో దీనిపై చర్చించవచ్చని చెబుతూ చైర్మన్ ఈ నోటీసును తిరస్కరించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రభుత్వం ధరల పెరుగుదలపై ఏ సమాధానం ఇస్తుందోనని ఎదురుచూస్తున్నాం. దీనిపై చర్చించాలి’అని కోరారు. నిరసనలతో సభ నాలుగుసార్లు వాయిదాపడింది. చివరకు.. తిరిగి సభ ప్రారంభమయ్యాక సభాపతి స్థానంలో ఉన్న వందనా చవాన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష కాంగ్రెస్ సభ్యులు పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో సభను రాత్రి 7 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. 7 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. నినాదాలు హోరెత్తడంతో మంగళవారానికి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు నిర్వహిస్తుండగా.. సభ్యుల కోరిక మేరకు సమావేశాలను పూర్వ రీతిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని రాజ్యసభ ౖచైర్మన్ వెంకయ్య, లోక్‌సభ సభాపతి బిర్లా నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల కుదింపు? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికల కంటే ముందే సమావేశాలను ముగించాలని తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యుల విన్నపం మేరకు ఏప్రిల్ 8 వరకు కొనసాగాల్సిన సమావేశాలను ఈనెల 25వ తేదీ నాటికే కుదించనున్నట్టు తెలుస్తోంది. -
వంటింట్లో గ్యాస్ మంట
సాక్షి,హైదరాబాద్: వంటింట్లో గ్యాస్ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. గతేడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 646.50 ఉండగా.. చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్లోనే రూ.100 మేర ధర పెంచాయి. దీంతో ధర రూ. 746.50కు చేరింది. తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర రూ.771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్ ధరలో రూ.520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ.200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారులకు వచ్చేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ.40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. పెట్రో ధరలు సైతం మండుతూనే ఉన్నాయి. -
పెట్రో సెగలు : ఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు చుక్కలను తాకుతుంటే ప్రజలకు ఊరట కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో దేశ రాజధానిలో డీజిల్ ధరలు లీటర్‌కు 8.36 రూపాయలు తగ్గి 82 రూపాయల నుంచి 73 రూపాయలకు దిగివచ్చాయి. డీజిల్ ధరలు దిగిరానుండటంతో ఢిల్లీ ఆర్థిక వ్యవస్ధలో ఉత్తేజం నెలకొనేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేబినెట్ సమవేశానికి అధ్యక్షత వహించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సవాల్‌తో కూడుకున్నదని, ప్రజల సహకారంతో దీన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. డీజిల్ ధరను తగ్గించాలని కొంతకాలంగా నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. డీజిల్‌పై వ్యాట్ తగ్గించడంతో దేశంలోనే డీజిల్ ధర తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. రాజస్ధాన్‌లో అత్యధికంగా డీజిల్ లీటర్‌కు 82 రూపాయలు ఉండగా, మధ్యప్రదేశ్‌లో 81.29 రూపాయలు, మహారాష్ట్రలో 79.81 రూపాయలు పలుకుతోంది. గుజరాత్లో లీటర్ డీజిల్ 79 రూపాయలుగా ఉంది. చదవండి : పెట్రోల్‌తో డీజిల్ ధర సమానం! ఎందుకు? -
ఇంధన భారాలపై సీఈవోలతో ప్రధాని భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఇంధన భారాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ చమరు, గ్యాస్ కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, ముడిచమురు ధరల సెగలు వృద్ధికి ఆటంకంగా మారిన క్రమంలో ప్రధాని మోదీ ఈ సమావేశంలో ఇంధన పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి సౌదీ చమురు మంత్రి ఖలీద్ ఫలీ, బీపీ సీఈవో బాబ్ దుడ్లీ, టోటల్ హెడ్ ప్యాట్రిక్ ఫుయానే, రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ, వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ తదితర ప్రముఖులు పాల్గొంటారు. కాగా చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడుల పునరుద్ధరణపై కూడా ప్రధాని గ్లోబల్ సీఈవోలతో చర్చిస్తారని అధికార వర్గలు పేర్కొన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో చమురు తయారీతో పాటు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్‌కు చెందిన చమురు, గ్యాస్ క్షేత్రాల్లో చమురు ఉత్పాదనలో విదేశీ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలని సలహాలు రాగా ఆయా ప్రభుత్వ రంగ సంస్ధల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదన ముందుకు కదలలేదు. -
ధోని భారత్ బంద్‌లో పాల్గొనలేదు
సాక్షి, రాంచీ : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌కు హద్దు అదుపులేకుండా పోతుంది. ఆ మధ్య కేరళ వరద బాధితుల కోసం కెప్టెన్ కోహ్లి రూ. 82 కోట్లు.. రోనాల్డో 72 కోట్లు అంటూ ఫేక్ న్యూస్‌ను ట్రెండ్ చేశారు. ఇదే తరహాలో పెట్రో ధరలను నిరిసిస్తూ గత సోమవారం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పాల్గొన్నాడని ఓ వార్త వైరల్ అయింది. తన సతీమణి సాక్షి సింగ్, కొంతమంది సహచరులతో ధోని పెట్రోల్ బంక్‌లో కూర్చున్న ఓ ఫొటోను సాక్ష్యంగా చూపిస్తూ ఈ నకిలీ వార్తను ట్రెండ్ చేశారు. ఇది నిజమే అనుకొని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు సైతం పప్పులో కాలేశారు. ఈ ట్వీట్స్‌ను లైక్ చేస్తూ.. రీట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా పెరిగిన పెట్రోల్ ధరలను తాను భరించలేనని, అందుకే హెలిక్యాప్టర్ షాట్స్ ఆడభోనని ధోని వ్యాఖ్యనించినట్లు కూడా కొన్ని పోస్ట్‌లు పుట్టుకొచ్చాయి. అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని ఆ ఫొటోలో ఉన్న ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవాని స్పష్టం చేశారు. ఆ ఫొటో సెప్టెంబర్ 10న తీసింది కాదని ఆగస్టు 29న సిమ్లాలో తీసిన ఫొటో అని నాటి పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ధోని ఎలాంటి బంద్‌లో పాల్గొనలేదని, ఓ ప్రచార చిత్రం కోసం సిమ్లా వెళ్లినప్పుడు హిందుస్తాన్ పెట్రోలియం వారు తీసిన ఫొటో అని పేర్కొన్నారు. Dhoni with Sakshi and friends during night shoot 😇 Picture Courtesy: @sapnabhavnani #Dhoni 🌃🌉🌌⛺😘 pic.twitter.com/vaU7PpYmA4 — #MSDhoni #MSDhoni MS Dhoni MS Dhoni (@iMSDhoniFC) August 30, 2018 ఆగస్టు నాటి ఫొటోను రీట్వీట్ చేసిన స్వప్నా భవాని -
పెట్రో ధరలపై ఎందుకు ప్రశ్నించరు?: పొన్నం
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పెట్రో ధరలపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నిం చరని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర తగ్గినా పెట్రోలు ధరలు ఎందుకు తగ్గట్లేదో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ఈ పరిస్థితి వస్తుందని ఆ రోజే మన్మోహన్సింగ్ చెప్పారన్నా రు. పెట్రో, డీజిల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ధరను రద్దుచేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. -
కర్ణాటక ఎఫెక్ట్.. ‘పెట్రో’ పెంపునకు బ్రేక్
న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం వరకూ పెట్రో ధరల్ని ఇష్టానుసారం పెంచిన ఆయిల్ కంపెనీలు, కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒక్కసారిగా ధరల పెంపునకు బ్రేక్ వేశాయి. ఏప్రిల్ 24 నుంచి ఇప్పటి వరకూ అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర 2 డాలర్లు పెరిగినా.. పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఏప్రిల్ 24న అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర 78.84 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం అది 80.56 అయ్యింది. గతవారం పెట్రో ధరలు దాదాపు ఐదేళ్ల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 74.63, డీజిల్ ధర రూ. 65.93కు చేరడంతో పెట్రో వాత నుంచి సామాన్యుడికి ఊరట కోసం ఎక్సైజ్ పన్నును తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తినా కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం ఒప్పుకోలేదు.ధరల్లో మార్పులు చేయకపోవడానికి కారణాలపై ఆయిల్ కంపెనీ అధికారుల్ని సంప్రదించగా.. మాట్లాడేందుకు వారు నిరాకరించారు. ఈ అంశంపై మాట్లాడవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. మీ ప్రయోజనాలే ముఖ్యమా?: చిదంబరం పెట్రోల్, డీజిల్‌పై పన్ను భారంతో ప్రజల్ని ఇబ్బందిపెడితే.. చివరకు అది ప్రజలు, ప్రభుత్వం మధ్య విభేదాలకు దారితీస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం హెచ్చరించారు. ‘పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి పన్ను తగ్గిస్తే రూ. 13 వేల కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వం చెపుతోంది. అయితే పెట్రోల్, డీజిల్ ఒక్క రూపాయి పన్ను పెంచితే తమపై రూ. 13 వేల కోట్ల పన్ను భారం పడుతుందని ప్రజలు చెపుతున్నారు. ఎవరి ఆసక్తులు ముఖ్యం? ప్రభుత్వ ప్రయోజనాలా.. లేదా ప్రజల సంక్షేమమా?’ అని ట్వీటర్లో ఆయన ప్రశ్నించారు. -
మళ్లీ పెట్రో షాక్
-
మళ్లీ పెట్రో షాక్
15 రోజుల్లో రెండుసార్లు ధర పెంపు నిత్యావసరాల ధరలపై ప్రభావం తప్పనున్న ఆర్టీసీ చార్జీల వడ్డన సాక్షి, విశాఖఫట్నం : కేవలం పదిహేను రోజులవ్యవధిలో రెండోసారి పెట్రో వడ్డన చేశారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.13లు,డీజిల్‌పై రూ.2.71ల చొప్పున శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెంచడం తో సామాన్యులు విల విల్లాడుతున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.72.42లు, డీజిల్ రూ.57.28 లుండగా, తాజా పెంపుతో శనివారం అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్ రూ.75.21, లీటర్ డీజిల్ రూ.59.62 పైసలు కానుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని వరుసగా పదిసార్లు తగ్గించి తర్వాత వరుసగా పెంచుతూ వస్తోంది. రూపాయి...రెండు రూపాయల చొప్పున తగ్గించిన సర్కార్ పెంచే సమయంలో మాత్రం మూడురూపాయలకు పైగానే ఉంటోంది. గత నెల 30వ తే దీ అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ.4.50లు, డీజిల్‌పై రూ.2.80లు పెంచిన ప్రభుత్వం తాజాగా పెట్రోల్‌పై మరోసారి రూ.3.13లు, డీజిల్‌పై రూ.2.71 పైసలుపెంచింది. ఆర్టీసీకి భారమే...: ఒక పక్క 43 శాతం ఫిట్మెంట్ వంకతో ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్న యాజమాన్యానికి ఈ తాజా డీజిల్ చార్జీల పెంపు వరంలా కలిసి రానుంది. నిత్యావసర ధరలపై కూడా ఈ పెట్రో ధరల ప్రభావం కన్పించనుంది. విశాఖ సిటీలో రోజూ 65వేల లీటర్ల పెట్రోల్, 5,500 కిలో లీటర్లు( 55 లక్షల) డీజిల్ వినియోగం జరుగుతుంటుంది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు 85వేల లీటర్ల పెట్రోల్, లక్ష లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటారు. తాజా పెంపు వల్ల పెట్రోల్ వినియోగదారులపై నెలకు రూ.1.86కోట్ల చొప్పున ఏడాదికి రూ. 20 కోట్ల భారం పడుతుంది. డీజిల్ వినియోగదారులపై నెలకు రూ.42కోట్ల చొప్పున ఏడాదికి రూ.500కోట్ల మేర భారం పడుతుంది. ఒకే నెలలో రెండుసార్లు చార్జీలు పెంచడంతో పెను భారం పడనుంది. -
ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!!
-
ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!!
పెట్రోలు, డీజిల్ ధరలు దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో పెట్రోలు మీద 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా వేశారని, డీజిల్ మీద 22.2 శాతం పన్నుతో పాటు మరో రూ. 4 అదనంగా వడ్డించారని విమర్శించారు. శుక్రవారం ఆయన లోటస్‌పాండ్‌లో మాట్లాడుతూ పలు వివరాలు చెప్పారు. దేశంలోనే ఇలాంటి రేట్లు ఎక్కడా లేవని, పోనీ దీనివల్ల రాష్ట్రానికి వనరులు పెరుగుతున్నాయా అంటే అదీ లేదని ఎద్దేవా చేశారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు అంటే.. అది తెలుగు-కాంగ్రెస్ సర్కారని ఆయన విమర్శించారు. కిరణ్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచినప్పుడు ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయని, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేయించి మరీ కిరణ్ సర్కారును కాపాడారని ఆయన గుర్తుచేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడున్న బలం 146 కాగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉందని చెప్పారు. ఆరోజు గనక చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి ఉంటే.. కిరణ్ ప్రభుత్వం ఉండేది కాదని అన్నారు. అలాంటి చంద్రబాబు.. ఇప్పుడు కిరణ్ ప్రభుత్వాన్ని తిడుతూ.. దానికి, తమకు లింకు పెడతారని అన్నారు. అలాంటి అమోఘమైన తెలివితేటలు చంద్రబాబువని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. -
పెరిగిన పెట్రో ధరలు
-
పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. పెట్రోల్ ధర లీటరుకు 60 పైసలు, డీజిల్ ధర 50 పైసలు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చిన ఈ పెంపునకు స్థానిక పన్నులు జతకానుండడంతో ప్రాంతాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. పెట్రోల్ ధర ఈ ఏడాదిలో పెరగడం ఇది రెండో సారి. జనవరి 4న దీనిపై 91 పైసలు వడ్డించారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర 73 పైసలు పెరిగి రూ.73.16కు చేరింది. హైదరాబాద్‌లో రూ.79.11గా ఉన్న పెట్రోల్ ధర 79.90కి పెరిగింది. ఢిల్లీలో డీజిల్ 57 పైసలు పెరిగి రూ. 55.48కి చేరుకుంది. హైదరాబాద్‌లో రూ.59.83 నుంచి 60.44కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 116.04 డాలర్ల నుంచి 118.1 డాలర్లకు పెరగడం, రూపాయి మారకం విలువ 62.02 నుంచి 62.12కు తగ్గడం వల్లే పెట్రోల్ రేటు పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. డీజిల్ అమ్మకాలపై నష్టాల భర్తీకి ప్రతినెలా 50 పైసల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి ఉండడంతో దాని ధరను పెంచామని పేర్కొంది. ఇంకా డీజిల్‌పై లీటరుకు రూ.8.37 నష్టం వస్తోందని వెల్లడించింది.