15 రోజుల్లో రెండుసార్లు ధర పెంపు
నిత్యావసరాల ధరలపై ప్రభావం
తప్పనున్న ఆర్టీసీ చార్జీల వడ్డన
సాక్షి, విశాఖఫట్నం : కేవలం పదిహేను రోజులవ్యవధిలో రెండోసారి పెట్రో వడ్డన చేశారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.13లు,డీజిల్‌పై రూ.2.71ల చొప్పున శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెంచడం తో సామాన్యులు విల విల్లాడుతున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.72.42లు, డీజిల్ రూ.57.28 లుండగా, తాజా పెంపుతో శనివారం అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్ రూ.75.21, లీటర్ డీజిల్ రూ.59.62 పైసలు కానుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని వరుసగా పదిసార్లు తగ్గించి తర్వాత వరుసగా పెంచుతూ వస్తోంది.
రూపాయి...రెండు రూపాయల చొప్పున తగ్గించిన సర్కార్ పెంచే సమయంలో మాత్రం మూడురూపాయలకు పైగానే ఉంటోంది. గత నెల 30వ తే దీ అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ.4.50లు, డీజిల్‌పై రూ.2.80లు పెంచిన ప్రభుత్వం తాజాగా పెట్రోల్‌పై మరోసారి రూ.3.13లు, డీజిల్‌పై రూ.2.71 పైసలుపెంచింది.
ఆర్టీసీకి భారమే...: ఒక పక్క 43 శాతం ఫిట్‌మెంట్ వంకతో ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్న యాజమాన్యానికి ఈ తాజా డీజిల్ చార్జీల పెంపు వరంలా కలిసి రానుంది. నిత్యావసర ధరలపై కూడా ఈ పెట్రో ధరల ప్రభావం కన్పించనుంది. విశాఖ సిటీలో రోజూ 65వేల లీటర్ల పెట్రోల్, 5,500 కిలో లీటర్లు( 55 లక్షల) డీజిల్ వినియోగం జరుగుతుంటుంది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు 85వేల లీటర్ల పెట్రోల్, లక్ష లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటారు. తాజా పెంపు వల్ల పెట్రోల్ వినియోగదారులపై నెలకు రూ.1.86కోట్ల చొప్పున ఏడాదికి రూ. 20 కోట్ల భారం పడుతుంది. డీజిల్ వినియోగదారులపై నెలకు రూ.42కోట్ల చొప్పున ఏడాదికి రూ.500కోట్ల మేర భారం పడుతుంది. ఒకే నెలలో రెండుసార్లు చార్జీలు పెంచడంతో పెను భారం పడనుంది.
మళ్లీ పెట్రో షాక్
Published Sat, May 16 2015 5:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement