BJP Leaders Planning To Assassinate Mallikarjun Kharge And His Family, Claims Congress - Sakshi
Sakshi News home page

ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది! కాంగ్రెస్‌ ఆరోపణలు

Published Sat, May 6 2023 12:42 PM | Last Updated on Sat, May 6 2023 12:51 PM

BJP Planning Assassinate Mallikarjun Kharge And Family - Sakshi

కర్ణాటకలో ఒకే విడతలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంకా నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా దాదాపు తుది అంకానికి చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్‌ బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే అతన్ని కుటుంబాన్ని హత్య చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్‌.

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరు మీడియా సమావేశంలో ఓ ఆడియో క్లిప్‌ని ప్లే చేసింది. బెంగళూరులోని చిత్తాపూర్‌ని బీజేపి అభ్యర్థిగా మణికంఠ రాథోడ్‌ని బరిలోకి దింపింది. అతను ఎలాంటి వాడో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి తెలుసని, అతని నేర చరిత్రకు సంబంధించిన ట్రాక్‌ రికార్డు గురించి వారికి బాగా తెలసునంటూ వ్యాఖ్యానించింది. ఐతే అదే ప్రాంతం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుఫున మల్లిఖార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే పోటీ చేస్తున్నారు. కావాలనే బీజేపీ ఇలా మణికంఠని మల్లిఖార్జున్‌ ఖర్గే కుమారుడిపైకి పోటికి దింపిందని ఫైర్‌అయ్యింది.

చిత్రాపూర్‌ నియోజకవర్గం ప్రజలను అవమానించేందుకే బీజేపి ఇలా ఒక రౌడీషీటర్‌ని దింపోతోందని విమర్శించింది. పైగా కాంగ్రెస్‌ విడుదల చేసిన ఆ ఆడియో క్లిప్‌లో బీజేపీ అభ్యర్థి అనుచిత పదజాలంతో మల్లిఖార్జున ఖర్గేని, అతని కుటుబాన్ని మట్టుబెడతానని చెబుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ బీజేపీ కావాలనే ఇలా చేస్తుందని, ఒకవేళ ఏదైనా జరిగినా..మోదీతో సహా కర్ణాటక పోలీసులు, భారత ఎన్నికల సంఘం కూడా మౌనంగా ఉంటుందని మండిపడింది కాంగ్రెస్‌.

ఐతే కర్ణాటక ప్రజలు దీన్ని చూసి మౌనంగా ఉండరని తగిన సమాధానం చెబుతారని నొక్కి చెప్పింది. కాగా, బీజేపీ అభ్యర్థి మణికంఠ 30కి పైగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద అభ్యర్థి. కలబురిగి నుంచి బహిష్కరించారు కూడా. గతంలో మల్లిఖార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేని హత్య చేస్తానని బహిరంగంగా బెందిరించి అరెస్టు అయ్యాడు. ఆ తదుపడి బెయిల్‌పై విడుదలయ్యాడు. 

(చదవండి:  కారు కింద 15 అడుగులు భారీ కింగ్‌ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement