
‘అరాచకాలు రాజ్యమేలుతున్నాయి’
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు రాజ్యమేలుతున్నాయని కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జునఖర్గె ఆరోపించారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఐక్యంగా ఎదుర్కొంటామని, గెలుపు సాధించిన అనంతరం ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేపీసీసీ కొత్త అధ్యక్షుని నియామకంపై ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, కేపీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది పార్టీ సీనియర్ నేతలు తీర్మానిస్తారన్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం తాను ఎప్పుడూ పోటీ పడలేదని, అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్‌లు చేయాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.