RTC charges
-
జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ప్రధాన ప్రతిపక్షంతో పాటు, వారికి సపోర్టు ఇచ్చే మీడియా కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. గతంలో అసలు ఎన్నడూ చార్జీలు పెరగనట్లు, ఇప్పుడే ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ చార్జీలు పెంచారేమోనన్న అనుమానం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజమే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇలా చార్జీలు పెరిగినప్పుడు విమర్శించలేదా అని అంటే కాదనలేం. దానికి ప్రతిగా ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తే ఆక్షేపించనవసరం లేదు. కాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్ కాని మరీ అసహ్యకరమైన విమర్శలు చేయడం బాగోలేదు. జగన్‌ను ఎంతైనా విమర్శించండి కాని సవ్యమైన భాషలో వ్యాఖ్యానిస్తే బాగుంటుందని చెప్పాలి. ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచవలసి వచ్చిందో అందరికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు గత కొన్నాళ్లుగా డీజీల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచాయి. వారి కారణాలు వారికి ఉండవచ్చు. కాని డీజిల్, పెట్రోల్ ధరలు పంపుదల పేద, మధ్య తరగతి వారిపై అధికంగా ఉంటుంది. అదే సమయంలో డీజిల్ వాడే ఆర్టీసీ బస్సులపైన, ఇతర రవాణా రంగంపైన పెను భారం పడుతోంది. గతంలో లీటర్ వంద రూపాయలు దాటుతుందేమో అని అంతా భయపడేవాళ్లం. అది దాటిపోయి కూడా చానాళ్లయింది. ఇప్పుడు ఏకంగా 115-120 రూపాయల మధ్య ధర ఉంటోంది. అలాగే డీజిల్ ధర కూడా వంద రూపాయలు దాటేసింది. ఇలాంటి పరిస్థితిలో డీజిల్‌పై ఆధారపడి బస్సులు నడిపే ఆర్టీసీ ఏమి చేయాలి. చార్జీలు పెంచకపోతే సంస్థ మరింత దారుణమైన నష్టాలలో కూరుకుపోతుంది. అప్పుడే ఇదే ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే మీడియా మరింత గగ్గోలు పెడుతూ ఆర్టీసీని ముంచేశారని వ్యాఖ్యానిస్తారు. ప్రజలలోకి ఆ విషయాన్ని బలంగా తీసుకు వెళ్లే యత్నం చేస్తారు. అంటే చార్జీలు పెంచినా గొడవే. పెంచకపోయినా గగ్గోలే అని అర్ధం అవుతుంది. అలాంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షం విమర్శలతో సంబంధం లేకుండా ఆర్టీసీని రక్షించుకోవడానికి చార్జీలు పెంచక తప్పదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా తప్పదు. గతంలో చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండేవారు. 1989 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ మెయిన్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ కూడా పలుమార్లు టిక్కెట్ల ధరలు పెంచింది. అలాగే టీడీపీ నేతలు కూడా వ్యవహరించేవారు. అధికారంలో ఉంటే బాద్యత ఎక్కువ ఉంటుందన్నది వాస్తవం. అందువల్ల సంస్థ మునిగిపోతుంటే చూస్తూ కూర్చోలేరు కదా. అక్కడికి జగన్ ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వంలోకి తీసుకుని వారికి జీతాలు ఇస్తున్నారు. కరోనా సంక్షోభంలో కూడా వారికి ఇబ్బంది ఎదురుకాలేదు. అదే ఆర్టీసీలోనే వారు ఉండి ఉంటే జీతాల సమస్య కూడా వచ్చి ఉండేది. తెలంగాణ ఆర్టీసీలో ఎలాంటి చికాకులు వచ్చాయో అంతా గమనించాలి. అలాంటి స్థితి లేకుండా చేసిన జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోతే పోనీ, ఏ అవకాశం వచ్చినా రాళ్లు.. కాదు.. బండరాళ్లు వేస్తున్నారు. తాజాగా డీజిల్ సెస్ పేరుతో టిక్కెట్ కు పది రూపాయలు అదనంగా వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అదే కిలోమీటర్ల లెక్కన చార్జీ పెడితే చాలా మొత్తం అవుతుంది. అలా కాకుండా టిక్కెట్‌కు పది రూపాయలే కనుక కొంత అసంతృప్తి ఉన్నా ప్రయాణికుడు భరించడానికి పెద్దగా ఇబ్బంది పడరు. అయినా టీడీపీ మీడియా సెస్సుల కస్సు బుస్సు, బాదుడే బాదుడు అన్న హెడ్గింగ్లు పెట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేయాలని యత్నించింది. పోనీ ఇదే మీడియా తెలంగాణలో ఇప్పటికే వేసిన డీజిల్ సెస్ పైన కూడా ఇలాంగే హెడింగ్‌లు పెట్టిందా అంటే అలా చేయలేదు. చాలా సాదాసీదాగా ప్రయాణికులపై డీజిల్ సెస్ అంటూ వార్త వరకే ఇచ్చింది. తప్పులేదు. ఇదే వార్తలు ఇచ్చే పద్దతి. కాని ఏపిలో ఏమి చేశారు? ఏకంగా బస్ ప్రయాణికుడు నలిగిపోతున్నట్లు బొమ్మవేసి బ్యానర్‌గా ఇచ్చారు. రకరకాల విశ్లేషణలు ఇచ్చారు. తెలంగాణలో గత కొద్దికాలంలో మూడు సార్లు రకరకాల రూపాలలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. అయినా ఈ మీడియా దానిని సీరియస్‌గా తీసుకుని విశ్లేషణలు ఇవ్వలేదు. అదే ఏపీలో అయితే మాత్రం ఇష్టారీతిన వార్తలు ఇచ్చారు. ఇదే అధర్మ యుద్దం అంటే. జగన్ విజయం సాధించినప్పటి నుంచి ఈనాడు అధినేత రామోజీరావు మరికొందరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. దాంతో ఇలా అధర్మ యుద్దం చేసి అయినా జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని తంటాలు పడుతున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా వ్యవహరించి క్రెడిబిలిటిని దెబ్బతీసుకుంటున్నాయి. అయినా వారికి ఏదో అంశం కావాలి కాబట్టి విమర్శలు చేస్తారు. కాని మీడియాకు ఏమైంది. వారే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్రం డీజిల్ ధరలు పెంచినా ఆ విషయం దాచి పెట్టి, అదేదో ఏపీలో పనిలేక ధరలు పెంచారన్న చందంగా కథనాలు ఇస్తున్నారు. దానిని బట్టే వారు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు. కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
Hyderabad: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేలా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని డిపోలకు సందేశాలు చేరాయి. సాధారణ చార్జీల పెంపు కాకుండా సేఫ్టీ సెస్ రూపంలో వీటిని పెంచింది. ప్రమాదాలు, విపత్తులు, వాహనాల బీమా తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూలనిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్లో ఆర్డినరీ బస్సులకు నాలుగు స్టేజీల వరకు అంటే 8 కిలో మీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న చార్జీలే యథాతథంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ..5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో మొదటి రెండు స్టేజీల వరకు చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. ఆ తర్వాత రూ.5 చొప్పున పెరిగాయి. ప్రయాణికులపై తప్పని భారం.. ఆర్టీసీ మూల నిధి కోసం ఇప్పుడు ఉన్న చార్జీలపై భద్రతా సెస్ రూపంలో మాత్రమే అదనపు చార్జీలను విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని ప్రయాణికులపై ప్రతి నెలా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. నగరంలో ప్రతిరోజు సుమారు 16 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో మెట్రో బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు, ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు ప్రయాణించే వారు నాలుగైదు లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగతా ప్రయాణికులకు సిటీ బస్సుల్లో ప్రయాణం భారంగా మారింది. చదవండి: యూనివర్సల్ బేకరీ.. ఓ స్వీట్ మెమొరీ.. మూతపడటానికి కారణాలేమిటి? ఆర్డినరీ బస్సుల్లో.. ►ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మొదటి రెండు స్టేజీలకు ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాత మరో రెండు స్టేజీల వరకు ప్రస్తుతం ఉన్న రూ.15 చార్జీ యథావిధిగా ఉంటుంది. అంటే ప్రయాణికులు తాము బయలుదేరిన చోటు నుంచి 4 స్టేజీల వరకు అంటే 8 కి.మీ వరకు పాత చార్జీల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. ►10 కి.మీ తర్వాత చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. ఈ మేరకు 5వ స్టేజీ నుంచి రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 5 స్టేజీల వరకు ఇప్పటి వరకు రూ.15 చార్జీ ఉండగా ప్రస్తుతం రూ.20 కి పెంచారు. ► 6వ స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు అంటే 12 కి.మీ నుంచి 18 కి.మీ వరకు ఇప్పుడు ఉన్న చార్జీని రూ.20 నుంచి రూ.25కు పెంచారు. ►ఆ తర్వాత 10వ స్టేజీ అంటే 20 నుంచి 28 కి.మీ (14వ స్టేజీ) వరకు ఇప్పటి వరకు రూ.25 ఉండగా తాజాగా రూ.30కి పెంచారు. ►30 కి.మీ నుంచి 40 కి.మీ వరకు అంటే 15వ స్టేజీ నుంచి 19వ స్టేజీ వరకు ఇప్పటి వరకు రూ.30 చార్జీ ఉండగా దానిని తాజాగా రూ.35కు పెంచారు. ► 40 కి.మీ వరకు (20వ స్టేజీ) ఇప్పటి వరకు రూ.35 ఉండగా, తాజాగా రూ.40కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో... ►మూడో స్టేజీ వరకు అంటే 6 కి.మీ వరకు ఇప్పుడున్న రూ.15ను రూ.20కి పెంచారు. ఆ తర్వాత 8 నుంచి 14 కి.మీ వరకు అంటే 4వ స్టేజీ నుంచి 7వ స్టేజీ వరకు ఇప్పుడు ఉన్న రూ.20 చార్జీలను రూ.25కు పెంచారు. ►16 కి.మీ నుంచి 24 కి.మీ వరకు అంటే 8వ స్టేజీ నుంచి 12వ స్టేజీ వరకు రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత 4 స్టేజీల వరకు రూ.5 చొప్పున అంటే రూ.30 నుంచి రూ.35కు పెంచారు. 36 కి.మీ నుంచి (17వ స్టేజీ నుంచి) 40 కి.మీ వరకు (20వస్టేజీ వరకు) రూ.35 నుంచి రూ.40కి పెంపు. మెట్రో డీలక్స్ బస్సుల్లో.. ►మొదటి 2 కి.మీ వరకు రూ.15 చార్జీలో ఎలాంటి మార్పు లేదు. 4 కి.మీటర్లకు రూ.15 నుంచి రూ.20కి పెంచారు. ఆ తర్వాత 6 కి.మీ నుంచి (3వ స్టేజీ నుంచి) 12 కి.మీ వరకు (6వ స్టేజీ) రూ.20 నుంచి రూ.25కు చార్జీలు పెంచారు. ► 8వ స్టేజీ నుంచి అంటే 14 నుంచి 22 కి.మీ వరకు (11వ స్టేజీ)రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత రెండు స్టేజీల వరకు అంటే 26 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.35 చొప్పున, ఆ తర్వాత వచ్చే రెండు స్టేజీల వరకు అంటే 30 కి.మీ వరకు రూ.35 నుంచి రూ.40 చొప్పున చార్జీలు పెరిగాయి. ►17వ స్టేజీ నుంచి 18వ స్టేజీ వరకు అంటే 34 కి.మీ నుంచి 36 కి.మీ వరకు రూ.40 నుంచి రూ.45కు పెంచారు. ►18వ స్టేజీ నుంచి 20వ స్టేజీ వరకు అంటే 36 నుంచి 40 కి.మీ వరకు ఇప్పటి వరకు ఉన్న చార్జీ రూ.45 నుంచి రూ.50కి పెంచారు. -
పేదలపై పెనుభారం చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణలో పెంచని చార్జీలంటూ ఏవీ లేవని వెఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచిన కేసీఆర్.. తాజాగా విద్యుత్ చార్జీలను పెంచారని విమర్శించారు. 50 యూనిట్లలోపు వాడుకొనే 40 లక్షల పేదవాళ్లపై పెనుభారం మోపారంటూ షర్మిల ట్విట్టర్లో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆ పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న మాట్లాడారు. పెంచిన చార్జీలను పార్టీ తీవ్రం గా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. -
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. కిలోమీటర్‌కు ఎంతంటే..?!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగునున్నాయి. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు ఆపై సర్వీసులకు 30పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. చదవండి: (ఆ కుటుంబపై పాము పగపట్టింది.. ఒకేసారి ముగ్గుర్ని..) -
రోజుకో రూ.కోటి.. చేతులెత్తేశారు!
2019 డిసెంబర్: లీటరు డీజిల్ ధర రూ.63... ఆర్టీసీ ఒకరోజు ఖర్చు: రూ.4.3 కోట్లు...; 2021 జనవరి: డీజిల్ లీటరు ధర రూ.79... ఆర్టీసీ ఒకరోజు ఖర్చు: 5.35 కోట్లు...; కేవలం ఏడాది తేడా.. ఇంధనం కోసం ఒకరోజు ఖర్చులో పెరిగిన మొత్తం ఏకంగా రూ.కోటి.. మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే.. అసలే తీవ్ర నష్టాలతో కుదేలై, బ్యాంకు అప్పులు, వాటిపై వడ్డీ గుట్టగా పేరుకుపోయి తీర్చే మార్గం లేక సతమతమవుతున్న తరుణంలో కోవిడ్ రూపంలో కష్టం వచ్చి పడింది. దీంతో బస్సు ఎక్కేవారు తగ్గి రోజువారీ ఆదాయం బాగా పడిపోవటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనటంతో ఆర్టీసీ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ప్రస్తుతమున్న డీజిల్ ధర ప్రకారం.. ఏడాది క్రితం బస్సు చార్జీలు పెరిగిన సమయంలో ఉన్న డీజిల్ వ్యయం కంటే రోజుకు అదనపు వ్యయమే రూ.కోటిగా నమోదవుతోంది. ఇక ఈ ఖర్చును భరించలేమని ఆర్టీసీ చేతులెత్తేయటంతో ఆ భారం కాస్తా జనం జేబులపై పడేందుకు రంగం సిద్ధమవుతోంది. – సాక్షి, హైదరాబాద్ మైలేజీలో మెరుగే.. ప్రస్తుతం దేశంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల మైలేజీ చాలా మెరుగ్గా ఉంది. వారం రోజుల క్రితమే ఈ విషయంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలంగాణ ఆర్టీసీకి పురస్కారం కూడా ప్రదానం చేసింది. ముంబై (బెస్ట్ సంస్థ) తర్వాత అంత మెరుగ్గా కిలోమీటర్ పర్ లీటర్ (కేఎంపీఎల్) మెరుగ్గా ఉంది. ఈ లెక్కన చూస్తే.. ఆర్టీసీ బస్సులు సగటున నిత్యం 35 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. తాజా మైలేజీ ప్రకారం రోజుకు 6.8 లక్షల లీటర్ల ఇంధనం ఖర్చవుతోంది. ప్రస్తుతమున్న ధర ప్రకారం నిత్యం రూ.5.35 కోట్లు ఖర్చవుతోంది.(చదవండి: ప్రొటీన్.. హైదరాబాద్.. మనమే టాప్!) ఏడాదిలో ఎంత మార్పు.. 2019 అక్టోబర్‌లో ఆర్టీసీలో రికార్డు స్థాయి సమ్మె జరిగింది. దీంతో ఆర్థికంగా సంస్థ కుదేలైంది. అప్పటికీ డీజిల్ లీటరు ధర రూ.63 ఉండటంతో ఆ భారాన్ని భరించలేమని సంస్థ చేతులెత్తేయటంతో ప్రభుత్వం చార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో కి.మీ.కు 20 పైసలు చొప్పున టికెట్ ధరలు పెరిగాయి. కానీ ఏడాదిలో అనూహ్యంగా డీజిల్ ధర రాకెట్లా దూసుకుపోయింది. పెట్రోల్‌తో సమంగా నిలిచింది. దీంతో ఆర్టీసీ చమురు ఖర్చు రికార్డు స్థాయికి చేరింది. మళ్లీ ఏడాది క్రితం నాటి పరిస్థితే పునరావృతమైంది. అప్పట్లో చార్జీలు పెంచి సాలీనా ప్రయాణికులపై రూ.750 కోట్ల భారం మోపారు. డీజిల్ భారాన్ని వారి జేబు నుంచి కొల్లగొట్టారు. ఇప్పుడు కూడా ఆ భారాన్ని మరోసారి జనంపై మోపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. భారం మరింత పెరగనుందా? గత కొంతకాలంగా చమురు ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. గతేడాది కాలంలో చోటుచేసుకున్న పెరుగుదల వల్ల ప్రస్తుతానికి రోజువారీ అదనపు భారం రూ.కోటిగా ఉంది. డీజిల్ ధర ఇంకా పెరిగితే ఈ భారం కూడా మరింత పెరగనుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకు రవాణా వసతి కల్పిస్తున్నందున ఆర్టీసీ కొనే డీజిల్‌పై పన్నులు తగ్గిస్తే కొంత భారం తగ్గుతుందని రవాణా రంగ నిపుణులు చాలాకాలంగా సూచిస్తున్నారు. చివరకు ఆర్టీసీ రోడ్ సెస్‌లాంటి వాటిని చెల్లిస్తోంది. ఆర్టీసీకి డిస్కౌంట్‌కే.. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఇంధనం ధరలతో పోలిస్తే ఆర్టీసీకి స్వల్ప తగ్గింపుతో లభిస్తోంది. ఒకేసారి కోట్ల లీటర్ల డీజిల్‌ను బల్క్‌గా కొంటున్నందున ఆయిల్ కార్పొరేషన్లు కొంత డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. అలా డిస్కౌంట్ వచ్చేలా చేసుకోవటం ఆర్టీసీ విజయ రహస్యమే. ఎవరు తక్కువ కోట్ చేస్తే ఆ సంస్థ నుంచే కొంటామంటూ కొంతకాలంగా ఆర్టీసీ డీజిల్ టెండర్లు పిలుస్తోంది. ఇందులో మూడు ప్రధాన కంపెనీలు పాల్గొంటున్నాయి. తక్కువ కోట్ చేసిన సంస్థకు వర్క్ ఆర్డర్ దక్కుతోంది. ఇలా ఆర్టీసీకి బయటి ధరతో పోలిస్తే లీటర్‌పై రూ.3 నుంచి రూ.4 మేర తక్కువ ఉంటోంది. కానీ.. డీజిల్ ధరలు పెరిగిన ప్రతీసారి అంతమేర కంపెనీలు కూడా ఆర్టీసీకి సరఫరా చేసే ఇంధనంపై ధర పెంచుతున్నాయి. -
ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని టీపీసీసీ అధ్య క్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉత్తమ్ అధ్యక్షతన టీపీసీసీ కోర్‌కమిటీతో పాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షు లు, పీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. అనంతరం రాత్రి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్, కార్యదర్శి చిన్నారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కోర్‌కమిటీ, ఆఫీస్‌బేరర్ల సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె, చార్జీల పెంపు, డిసెంబర్ 14న ఢిల్లీలో నిర్వహించనున్న భారత్ బచావో ఆందోళనపై చర్చించినట్టు చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున కిలోమీటర్‌కు 20 పైసలు ఆర్టీసీ చార్జీలు పెంచడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మున్సిపల్ ఎన్ని కలు జనవరిలో వస్తాయని తాము అంచనా వేస్తున్నామని, ఇందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యకు ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో జరుగుతున్న విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, మద్యం అమ్మకాలను తగ్గించాలని ఆయన డిమాం డ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తో దేశ ఆరి్థక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, కేంద్రం తీరుకు నిరసనగా డిసెంబర్ 14న ఢిల్లీలో ‘భారత్ బచావో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
కనీస చార్జీ రూ.10
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు ఖరారయ్యాయి. పల్లె వెలుగుతోపాటు హైదరాబాద్ సిటీ బస్సుల కనీస చార్జీ రూ.10గా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో స్టేజీలవారీగా టికెట్ ధరలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొత్త చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత సోమవారం నుంచి అమలు చేద్దామని భావించినా.. సీఎం సూచన మేరకు దాన్ని మంగళవారానికి మార్చినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రగతి భవన్లో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతానికి ఆర్టీసీని ఉన్నది ఉన్నట్టుగానే ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇదే తొలి భేటీ. సంస్థను పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు అవలంభించాలనే విషయంలో ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చార్జీల అంశం కూడా చర్చకు వచి్చంది. అన్ని కేటగిరీల బస్సులకు కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి అనుమతించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచి, చిల్లర సమస్య రాకుండా రౌండింగ్ ఆఫ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. దానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. చార్జీలు ఇలా పెరుగుతాయి.. పల్లెవెలుగు, సిటీ బస్సులకు సంబంధించి ప్రస్తుతం కనీస చార్జీ రూ.5గా ఉంది. దాన్ని రూ.10కి పెంచాలని అధికారులు నిర్ణయించి సీఎంకు తెలియజేశారు. ఎండీ స్థాయిలో మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కనిష్ట చార్జీ రూ.5 ఉండగా, 2 నుంచి ఐదో స్టాప్ వరకు రూ.10 ఉంది. ఇప్పుడు కనిష్ట చార్జీని రూ.10గా మార్చి, కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచితే మూడో స్టాపులో ఆ మొత్తం రూ.12.6గా మారు తుంది. దాన్ని రౌండింగ్ ఆఫ్ చేసి రూ.15గా ఖరారు చేస్తారు. ఇలా నాలుగు స్టాపులకు రూ.5 చొప్పున పెంచుతారు. పల్లె వెలుగులో కనిష్ట చార్జీ రూ.10గా మార్చి, ఐదు కిలోమీటర్ల తర్వాత రూ.15గా మారుస్తారు. మిగతా సర్వీసులకు ఉన్న చార్జీపై కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున జత చేస్తారు. వాటికి కూడా చిల్లర సమస్య రాకుండా రౌండింగ్ ఆఫ్ చేస్తారు. ఆదివారం కొత్త చార్జీలు సిద్ధంచేసి డిపోలకు పంపిస్తారు. డిపోలో ఆయా చార్జీలను టిమ్ యంత్రాల్లో ఫీడ్ చేయాల్సి ఉంది. ఈ కసరత్తులో జాప్యం జరిగితే సోమవారం నుంచి అమలు చేసే అవకాశం లేదు. పైగా మంగళవారం తిథి పరంగా మంచి రోజు అనే అభిప్రాయంతో ఆ రోజు నుంచే కొత్త చార్జీలు అమలులోకి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. పోటీతత్వాన్ని పెంచుకోవాలి... కష్టపడి పనిచేసే సిబ్బంది ఉన్నందున పోటీతత్వాన్ని పెంచుకుని ఆర్టీసీ ఆదాయం పెరిగేలా అధికారులు కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు సరీ్వసులు లాభాల్లో ఉన్నప్పుడు ఆర్టీసీ సరీ్వసులు నష్టాల్లో ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అధికారులు–కారి్మకుల మధ్య మంచి సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. అవసరమైతే సిబ్బందితో ఓ గంట ఎక్కువగా పని చేయించుకునేందుకు అవకాశం కలుగుతుందని, అది సత్ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్శిల్ సరీ్వసులకే పరిమితమైన ఆరీ్టసీ.. సరుకు రవాణాపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వాణిజ్య అవసరాలకు వీలుగా లీజుకు ఇచ్చే విషయంపై పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వాటిని ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని పేర్కొన్నారు. నష్టాలకు బాధ్యులపై చర్యలు తీసుకోండి డిపో స్థాయి ప్రతినిధులో సమీక్ష నేపథ్యంలో, ఆర్టీసీ నష్టాలకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునే విషయంపై సీఎం దృష్టి సారించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు కోరారు. రెండు సంవత్సరాల కాలానికి ట్యాక్స్ హాలీడే ప్రకటించాలని, సాలీనా 6% చార్జీలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని, సమర్ధుడైన ఎండీ ని నియమించి, నెలవారీ ఆర్టీసీ బకాయిలు చెల్లించాలని ఓ ప్రకటనలో కోరారు. కాగా, సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించాలని ఎన్ఎంయూ నేతలు కమాల్‌రెడ్డి, అశోక్ విజ్ఞప్తి చేశారు. శంషాబాద్‌లో యువతి అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళా కండక్టర్లకు సాయంత్రం లోపు విధులు పూర్తయ్యేలా డ్యూటీ లు వేయాలని కోరారు. నేడు కార్మికులతో సీఎం భేటీ... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు డిపో ప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్ కారి్మకులను ఈ సమావేశానికి ఆహా్వనించారు. కారి్మకులతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. కార్మికులతో నిర్వహించే సమావేశంలో ఎటువంటి చర్చ జరగాలి? కార్మికులు, సంస్థ అధికారులు.. ప్రభుత్వం నుంచి ఆశించే అంశాలు ఏమిటి? అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలు ఏమిటి? అన్న అంశాలపై చర్చించారు. సంస్థలో సుదీర్ఘ అనుభవం కలిగిన కారి్మకుల క్షేత్ర స్థాయి అనుభవాలను తెలుసుకోవడం ద్వారా ఆర్టీసీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
డీజిలే అసలు విలన్...
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ఉంటే బస్సు ముందుకు పోతుంది. కానీ, డీజిల్ కొంటే ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా వెనక్కి పోతోంది. చమురు ధరల భారంతో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత డీజిల్ ధర ఒక్కసారిగా పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న సమయంలో ఆర్టీసీ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఆ భారాన్ని మోయలేక చతికిలబడ్డ రవాణాసంస్థ, భవిష్యత్తు భారాన్ని బేరీజు వేసుకుని కాపాడాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది. విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఒక శాతానికి తగ్గించాలని చాలాకాలంగా ఆర్టీసీ కోరుతోంది. మూడేళ్లుగా బస్సుచార్జీలు పెంచనందున ఈసారి కచ్చితంగా టికెట్ ధరలను సవరించాల్సిందేనని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల క్రితం ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం 10 శాతానికి పెంచింది. అప్పట్లో డీజిల్ ధర లీటరుకు రూ.44.50 ఉంది. అది కొంత పెరుగుతూ, తగ్గుతూ ఇప్పుడు రూ.72కు చేరుకుంది. అంటే లీటరుపై రూ.28 పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీనికి ప్రధానకారణం డీజిల్ భారమేనని, అంతర్గత సామర్థ్యం పెంచుకుంటూ ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటున్నా డీజిల్ భూతం మింగేస్తోందని తాజాగా లెక్కలు తేల్చింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలం(మార్చి లెక్కలు తేల్చాల్సి ఉంది)లో తెలంగాణ ఆర్టీసీ అంతకుముందు సంవత్సరం అదే సమయం కంటే రూ.295 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంది. ఇందులో టికెట్ల రూపంలో రూ.165 కోట్లు, స్క్రాప్ విక్రయం, ఇతర వాణిజ్యమార్గాల ద్వారా రూ.56 కోట్లు, బస్ పాస్ రీయింబర్స్‌మెంటు ద్వారా మిగతా మొత్తం సమకూర్చుకుంది. కానీ, ఇదే సమయానికి పెరిగిన నష్టాలు ఏకంగా రూ.432 కోట్లు ఉన్నాయి. ఇందులో డీజిల్ వాటా రూ.186 కోట్లని లెక్కలు తేల్చారు. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధరలను ఏకంగా 130 సార్లు సవరించారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.63గా ఉంది. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల కారణంగా 2016లో ఫిబ్రవరిలోరూ. 44గా మారింది. ఆ తర్వాత క్రమంగా పెరగటం మొదలుపెట్టి ఇప్పుడు రూ.72కు చేరుకుంది. ►ఆర్టీసీ నిత్యం ఐదున్నర లక్షల లీటర్ల డీజిల్ ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి 20 కోట్ల లీటర్లకు పైమాటే.. ►2018–19లో 11 నెలల కాలానికి నష్టాలు రూ.684 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరం అదే కాలానికి వచ్చిన నష్టాల కంటే రూ.137 కోట్లు అధికం. ఇదే సమయంలో ముందు సంవత్సరం కంటే పెరిగిన డీజిల్ భారం రూ.186 కోట్లు. 2017–18 సంవత్సరానికి డీజిల్బిల్లు రూ.1,084 కోట్లు నమోదు కాగా, 2018 –19లో రూ.1,270 కోట్లు వచ్చింది. ఇందులో దాదాపు రూ.300 కోట్లు వ్యాట్ కింద రాష్ట్రప్రభుత్వం వసూలు చేసిందే కావటం గమనార్హం. ►2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఆదేశం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ భర్తీ చేస్తుందన్నది దాని సారాంశం. ఆ మేరకు విడుదల చేసిన ఉత్తర్వులో రూ.336 కోట్లు జీహెచ్ఎంసీ ఆర్టీసీకి ఇవ్వాలంటూ పేర్కొంది. 2015–16కుగాను ఒకసారి జీహెచ్ఎంసీ ఇచ్చింది. ఆ తర్వాత చేతులెత్తేసింది. ►పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు ఊతం. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ఆ బస్సుల రూపంలో ఆర్టీసీకి వచ్చిన నష్టాలు రూ.330 కోట్లు. 60 వేల లోపే... ఇటీవల విమానయాన సంస్థలను ఆదుకునే క్రమంలో ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తున్నాయి. విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్‌ను గతేడాది ఒక శాతంగా మార్చారు. దీంతో విమానయాన సంస్థలు లాభపడ్డాయి. విచిత్రమేంటంటే... మన రాష్ట్రంలో సగటున నిత్యం ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య 60 వేలలోపే. కానీ నిత్యం కోటిమందిని గమ్యం చేరుస్తున్న ఆర్టీసీ మాత్రం అదే ఇంధనంపై ఏకంగా 27 శాతం చెల్లించాల్సి వస్తోంది. ధనికులు ప్రయాణించే విమానాలకు వెసులుబాటు కల్పించినప్పుడు ఎక్కువ మంది పేదలే ప్రయాణించే ఆర్టీసీ బస్సుకు ఎందుకు వెసులుబాటు రాదని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విమానయాన సంస్థలు ఆర్థిక ఒడిదొడుకులకు గురైతే దాని ప్రభావం ధనిక వర్గాలపైనే ఉంటుందని, కానీ ఆర్టీసీ ఇబ్బంది పడితే నేరుగా పేదలే సతమతమవ్వాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తే సాలీనా మిగులుబాటు రూ.300 కోట్ల(ప్రస్తుత ధరల ప్రకారం)కే పరిమితమవుతుందని, అదే టికెట్ ధరలను డిమాండ్ చేసిన 30 శాతంలో సగం 15 శాతం పెంచినా రూ.500 కోట్ల లబ్ధి చేకూరుతుండటమే దీనికి కారణం. -
‘బస్సు చార్జీలు తెలంగాణలోనే తక్కువ’
హైదరాబాద్: ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా 6.7 శాతం బస్సు చార్జీలను పెంచిందన్నారు. ఆర్టీసీకి రోజూ రూ. కోటిన్నర నుంచి రూ. 2 కోట్ల వరకూ నష్టాలు వస్తుండడంతో సంస్థను కాపాడుకోవడానికి చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్నెస్తో వేతనాలను పెంచారని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం 2010-13 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు బస్సు చార్జీలు పెంచిందన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో గురువారం కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, చినారెడ్డి, డీకే రుణ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. -
పదిశాతం పెరిగిన బస్సు చార్జీలు
ప్రయాణికులపై ఏడాదికి రూ.18 కోట్ల భారం మెదక్: ప్రభుత్వం ఇటీవల పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు రూ.1లు అదనంగా వసూలు చేస్తే, ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్ లగ్జరీలు పదిశాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.18కోట్ల అదనపు భారం పడుతుంది. జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, నారాయణఖేడ్, గజ్వేల్, జహీరాబాద్ డిపోల్లో మొత్తం 618 బస్సులు ఉన్నాయి. గతకొంతకాలంగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. గత రెండేళ్లుగా కరువు కాటకాలతోపాటు కార్మికులకు పెంచిన వేతన సవరణతో గత ఏడాది జిల్లాలో ఆర్టీసీకి రూ.10కోట్ల నష్టాల్లోకి కూరుకు పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నష్టం వందల కోట్లు . కాగా ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు ఈనెల 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఆర్డీనరీ, పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్లలోపు రూ.1చార్జీ పెరగా, ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్ లగ్జరీలకు మాత్రం ఓవరాల్‌గా పదిశాతం అదనపు చార్జీలు పెంచారు. దీంతో జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.1.5కోట్లు, ఏడాదికి రూ.18కోట్లు అదనపు భారం పడుతుంది. గతంలో మెదక్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వెళ్లేందుకు లగ్జరీ బస్సు చార్జీ రూ.561 ఉండగా, ప్రస్తుతం రూ.612లకు పెరిగింది. ఈ లెక్కన ఒకవ్యక్తికి రూ.51లు పెరిగాయి. అలాగే కాకినాడకు గతంలో రూ.588లుండగా, ప్రస్తుతం రూ.646లకు పెరిగింది. ఈలెక్కన ఒక్కో వ్యక్తిపై రూ.58లను అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌కు కిలో రూ.8పైసలు, డిలక్స్కు రూ.9పైసలు, సూపర్‌లగ్జరీ రూ.11పైసలు, ఇంద్రలో రూ.14పైసలు, గరుడలో రూ.16పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈలెక్కన ఓవరాల్‌గా బస్సు చార్జీలు 10 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. పెరిగిన బస్సుచార్జీలతో బస్సు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ధరలు పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో నిత్యావసర ధరలతోపాటు డీజిల్, పెట్రోల్, కరెంట్, బస్సుచార్జీలు పెరిగాయి. అసలే కరువుతో కొట్టుమిట్టాడుతుంటే...పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోంది. -సంతోష్, ప్రయాణికుడు, కరీంనగర్. మోయలేనిభారం.. పేద, సామాన్య ప్రజలు మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. బస్సుచార్జీలు నామమాత్రమేనంటూ 10 శాతం పెంచారు. ఇక కరెంట్ చార్జీలు ఏమేరకు పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. ధరల పెరుగులతో పేదప్రజలు మరింత పేదలుగానే మారుతున్నారు. -దుర్గారెడ్డి, ప్రయాణికుడు, చిట్కుల్ -
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
విద్యుత్‌చార్జిల పెంపునకు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ..ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. -
సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి పేదల పై భారం వేసే విధంగా చార్జీలను ఎందుకు పెంచారో చెప్పాలని వామపక్షాల నయాకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఎల్బీ నగర్ రింగ్‌రోడ్డు వద్ద విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలు జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలలో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. -
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పది శాతం మేర ఛార్జీలను పెంచుతున్నట్లు రవాణాశాఖమంత్రి మహేందర్ రెడ్డి గురువారం ప్రకటించారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 27 నుంచి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతకు ముందు మహేందర్ రెడ్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై ముఖ్యమత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఛార్జీల పెంపు అనివార్యమైందని తెలిపారు. కాగా పెంచిన ఛార్జీలతో ఆర్టీసీకి రూ.286 కోట్లు అదనపు ఆదాయం రానుంది. పెరిగిన బస్సు ఛార్జీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్, ఆపై సర్వీసులకు 10శాతం ఛార్జీల పెంపు సిటీ సర్వీసుల్లోనూ 10 శాతం పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకూ ఒక రూపాయి పెంపు ఆపై స్టేజ్‌కి పల్లె వెలుగు బస్సుల్లో 2 రూపాయిలు పెంపు ఎక్స్‌ప్రెస్ ఛార్జీ కిలోమీటర్‌కు 79 పైసల నుంచి 87 పైసలకు పెంపు డీలక్స్ ఛార్జీ కి.మీ.కు 89 నుంచి 98 పైసలకు పెంపు సూపర్ లగ్జరీ ఛార్జీ కి.మీ.కు రూ.1.05 పైసల నుంచి రూ. 1.46 పైసలకు పెంపు ఇంద్ర ఛార్జీ కి.మీ.కు రూ. 1.32 పైసల నుంచి రూ. 1.46 పైసలకు పెంపు గరుడ ఛార్జీ కి.మీ.కు రూ. 1.55 పైసల నుంచి రూ.1.71 పైసలకు పెంపు హైదరాబాద్-కరీంనగర్ మధ్య పెరిగిన ఛార్జీలు : ఎక్స్‌ప్రెస్ రూ. 149, రూ. 168, లగ్జరీ రూ. 199 హైదరాబాద్-నిజామాబాద్ మధ్య పెరిగిన ఛార్జీలు : ఎక్స్‌ప్రెస్ రూ. 159, డీలక్స్ రూ. 175, లగ్జరీ రూ. 207 హైదరాబాద్-వరంగల్ మధ్య పెరిగిన ఛార్జీలు: ఎక్స్‌ప్రెస్ రూ. 129, డీలక్స్ రూ. 142, లగ్జరీ రూ. 168 హైదరాబాద్-విజయవాడ మధ్య పెరిగిన ఛార్జీలు : ఎక్స్‌ప్రెస్ రూ. 235, డీలక్స్ రూ. 264, లగ్జరీ రూ. 313 హైదరాబాద్-తిరుపతి మధ్య పెరిగిన ఛార్జీలు: ఎక్స్‌ప్రెస్ రూ.495, డీలక్స్ రూ. 545, లగ్జరీ రూ. 645 -
'చంద్రన్న కానుక కాదు.. సంక్రాంతి దోపిడీ'
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ పోటీగా ఆర్టీసీ దోచుకుంటోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఆర్టీసీ చార్జీలు ప్రైవేటు ట్రావెల్స్ తో పోటీ పడుతున్నాయని అన్నారు. ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులపై భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలు నియంత్రించలేకపోతున్నామని రవాణా మంత్రి చేతులు ఎత్తేయడం శోచనీయమన్నారు. 'చంద్రన్న కానుక కాదు సంక్రాంతి దోపిడీ' అని ధ్వజమెత్తారు. చంద్రన్న కానుక పేరుతో పనికిరాని వస్తువులు అంటగడుతున్నారని దుయ్యబట్టారు. రిటైల్ రంగంలో పెట్టుబడులకు చంద్రబాబు బార్లా తలుపులు తెరవడం దారుణమన్నారు. రిటైల్ రంగంపై పెట్టుబడులకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. -
'చంద్రన్న కానుక కాదు.. సంక్రాంతి దోపిడీ'
-
కండక్టర్ల కస్సు‘బస్సు’
- ఆంధ్ర- తెలంగాణల మధ్య చార్జీల చిచ్చు - ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపు.. - తెలంగాణ బస్సుల వైపు ప్రయాణికుల మొగ్గు సాక్షి, హైదరాబాద్: అది విజయవాడ బస్టాండ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్లాట్ఫారం వద్దకు వస్తోంది. వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్లు వచ్చి దానిని అడ్డుకున్నారు. రెండు ఏపీ బస్సులు బయలుదేరాకే ఫ్లాట్‌ఫారం వద్దకు రావాలని ఆర్డర్ వేశారు. రోజూ నిలిపే సమయమే కదా అడ్డుకోవడమేంటని టీఎస్ ఆర్టీసీ కండక్టర్ ప్రశ్నించారు. ‘మీ బస్సు వస్తే ప్రయాణికులు ఎగబడి ఎక్కేస్తారు, మా బస్సుల ప్రయాణికుల సంఖ్య పడిపోతుంది.’ అంటూ ఏపీ కండక్టర్లు ఎదురుదాడికి దిగారు. ఇది ఒక్క విజయవాడలోనే కాదు. ఏపీలోని పలు ప్రధాన బస్టాండ్లలో ఏపీ, తెలంగాణ కండక్టర్లు కస్సుబుస్సులాడుకుంటున్నారు. ఇదీ సంగతి... ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. కానీ, తెలంగాణ ఆర్టీసీ చార్జీలు యధాతథంగా ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ బస్సు టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఏపీ-తెలంగాణ మధ్య ప్రయాణించే అన్ని రూట్లల్లోనూ ఇదే తీరు. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులు ఎక్కేందుకే ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ బస్సు నడిచే సమయానికి ముందు- వెనక తిరిగే ఏపీ బస్సుల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతోంది. దీంతో కీలక వేళల్లో తెలంగాణ బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు రాకుండా కొన్నిచోట్ల ఏపీ కండక్టర్లు అడ్డుకుంటున్నారు. దీంతో గత్యంతరం లేక వెనక నిలుపుతున్న తెలంగాణ బస్సు కండక్టర్లు ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లి..‘తెలంగాణ బస్సు వెనక ఉంది... వచ్చి కూర్చోండి... టికెట్ ధర కూడా తక్కువ’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఏపీ ఆర్టీసీ కండక్టర్లు వారితో వాదనకు దిగుతున్నారు. ఒకే రూట్లో ప్రయాణించే వేర్వేరు రాష్ట్రాల బస్సుచార్జీలు ఒకేలా ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, తెలంగాణలో కూడా బస్సు చార్జీలు సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఏపీ అధికారులు తెలంగాణ అధికారులను కోరుతున్నారు. లేని పక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఒప్పందం ఉంటే ఏ ఆర్టీసీ బస్సులోనైనా, ఏ రాష్ట్ర భాగంలో ఆ రాష్ట్ర చార్జీని అమలు చేస్తారు. తెలంగాణ భూభాగంలో రెండు ఆర్టీసీలు తెలంగాణ చార్జీని, ఏపీ భూభాగంలో రెండు ఆర్టీసీ బస్సుల్లో ఏపీ చార్జీలను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, సాంకేతికంగా ఇంకా రెండు ఆర్టీసీలు విడిపోకపోవటం ఈ ఒప్పందానికి అడ్డొస్తోంది. -
ఆర్టీసీ చార్జీలు పెంచబోం: మహేందర్ రెడ్డి
మరో 400 పల్లె వెలుగు బస్సుల కొనుగోలు ఇందూరు: తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచబోమని రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతామన్నారు. ఇందుకు గాను రూ.కోట్లు వెచ్చించి బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 500 అద్దె బస్సులను తీసుకున్నామని, పల్లె వెలుగు కోసం 400 వరకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని పది జిల్లాల్లో 95 బస్సు డిపోల్లో 21 డిపోలు లాభాల్లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి అవసరమైన నిధులు కూడా ఇస్తున్నారని, ఇటీవలే రూ. 18 కోట్ల ఇంక్రిమెంట్లు, 44 శాతం పీఆర్సీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు బంగారు తెలంగాణ కోసం 8 గంటలకు బదులు 12 గంటలు విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. బస్ డిపోల్లో, బస్టాండ్లలో సీసీరోడ్లు వేయించడానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపల్లెకు బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఇందుకుగాను గ్రామీణ రోడ్లు వేయించేందుకు రూ.10 వేల కోట్లు మం జూరు చేశామని చెప్పారు. జిల్లా, నియోజవర్గ కేంద్రాల నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపనున్నామన్నారు. -
చార్జీల మంటపై రణభేరి!
♦ సర్కారు తీరుపై జనం ఆందోళన ♦ పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ♦ ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రజలు భగ్గుమన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల ఎదుట బైఠాయించారు. జిల్లాల్లో జనాగ్రహం: వైఎస్సార్‌జిల్లా కడపలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా, మేయర్ కె.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి నేతృత్వంలో ధర్నా చేశారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ధర్నాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పాల్గొన్నారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ధర్నా చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలేశ్వరం డిపో ఎదుట ఎమ్మెల్యే వరుపుల నేతృత్వంలో ధర్నా చేపట్టారు. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ కాంప్లెక్స్ ఎదుట వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు గుడివాడ అమర్నాథ్, జాన్‌వెస్లీ, కోలా గురువులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోను ముట్టడించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధర్నా నిర్వహించారు. పాలకొల్లు బస్టాండు వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో నిరసన తెలిపారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధర్నా నిర్వహించారు. మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. -
డీజిల్ ధర తగ్గితే.. చార్జీలు పెంచుతారా?
తెలుగుదేశం ప్రభుత్వం సామాన్యుడిపై కక్ష కట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికే ధరాఘాతంతో నానా అవస్థలు పడుతున్న పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్టీసీ చార్జీలు పెంచి మరింత భారాన్ని మోపారని దుయ్యబట్టారు. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డీజిల్రేట్లు తగ్గినా.. చార్జీలు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై చంద్రబాబుకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పెంచిన చార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వాన్ని వలిదిపెట్టబోమని స్పష్టం చేశారు. -
ఆర్టీసీ చార్జీలు పెంచటం అన్యాయం
వైఎస్సార్ సీపీ ర్యాలీ, ధర్నా వినుకొండ రూరల్: డీజిల్ ధరలు తగ్గినా ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచటం చంద్రబాబు నైజానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మో హన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడి ఆధ్వర్యంలో సోమవారం పురవీధుల్లో భారీర్యాలీ నిర్వహిం చి బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భం గా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిత్యవసర ధరలు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇక బతికేది ఎట్లా అంటూ ప్రశ్నించారు. దీనికితోడు రోకటి పోటులా ఆర్టీసీ చార్జీలు పెంచటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. బాబు అధికారంలోకి వచ్చాక, డ్యామ్‌ల్లో నీరులేకుండా పోయిందని, దీంతో రైతులు పంటలు పండక అల్లాడిపో తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు బతుకు భారమై అల్లాడిపోతుంటే నీరో చక్రవర్తిలా సీఎం చంద్రబాబు రాజధాని పేరుతో గోప్పలు పోతూ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి దించుతున్నాడన్నారు. పట్టణ, మండల కన్వీనర్లు నరాలశెట్టి శ్రీను, చింతా ఆదిరెడ్డి, చిన్నబ్బాయి, నాయకులు చీరపురెడ్డి కోటిరెడ్డి, దండు చెన్నయ్య, ఎం. గోవింద నాయక్, గంధం బాలిరెడ్డి, కృష్ణారెడ్డి, పీఎస్ ఖాన్, ఇమాంషా, పఠాన్ కరిముల్లా, సానాల పుల్లయ్య, మాటా సత్యం, చికెన్ బాబు, బాషా, మున్నా, రామయ్య, మదార్ వలి, కాల్వ రవిరాజు, వెంకటరెడ్డి, ఏడుకొండలు, కొమిరిశెట్టి రామారావు, పారా వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, రమణారెడ్డి, వెంకిరెడ్డి, రాంబాబు, రఫీ, గౌస్ బాషా, డి. శ్రీను, వీరాంజనేయ రెడ్డి, బ్రహ్మయ్య, ప్రసాద్ సింగ్, అంజిరెడ్డి, పసుపులేటి నరసింహరావు, తోట ఆంజనేయులు, బాలు జాన్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. -
అగ్రహా జ్వాల
ఆర్టీసీ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఆందోళన జిల్లా అంతటా బస్టాండ్ల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు పట్నంబజారు(గుంటూరు): సామాన్యులపై పెనుభారాన్ని మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడంపై జిల్లా అంతటా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కదం తొక్కారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యమించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళగిరి బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ వద్ద గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ బస్టాండ్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పొన్నూరులో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటరమణ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. సత్తెనపల్లిలో పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌మాబు, కె.ప్రభాకర్ తదితర నేతల ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కౌన్సిలర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిలకలూరిపేటలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభాని ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, పలు విభాగాల నేతలు బస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పార్టీ నేతలు, కౌన్సిలర్, మండలాధ్యక్షులు ప్రదర్శన నిర్వహిస్తూ బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల అనంతరం నేతలు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. -
బాబు సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది
-
బాబు సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది
చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సోమవారం పార్టీ ఆద్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. దసరా రోజు రాష్ట్ర ప్రజలకు రంగుల కల చూపి.. చార్జీల వాత పెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం ఇచ్చిన దసరా ఆఫర్ ఇదేనా అని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు అయిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అభినవ నీరో అని అభివర్ణించారు. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే అవినీతికి లంచాలు తీసుకుంటున్నామని ఒప్పుకుంటున్నారని.. లోకేష్ ను అవినీతికి మంత్రిగా నియమిస్తే సరిపోతుందని ఎద్దే వాచేశారు. -
కస్సుబుస్సు
పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు బాదుడు నెలకు రూ.కోటి! ఇక పల్లె వెలుగూ భారమే {పయాణికుల్లో తీవ్ర ఆగ్రహం విశాఖపట్నం: ఒకపక్క నింగిలో నిత్యావసర సరకులు విహరిస్తున్నాయి. పప్పులు, ఉప్పులూ, కూరగాయలు అందనంత ఎత్తుకు పెరిగిపోయాయి. వాటితోనే కుటుంబాన్ని ఈదలేకపోతున్న జనానికి తాజాగా ఆర్టీసీ చార్జీలు వచ్చిపడ్డాయి. ప్రయాణికుడి నడ్డి విరచడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు భారంగా మారాయి. ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి నుంచి 5 నుంచి 10 శాతం వరకు చార్జీలను పెంచేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఇంద్ర, గరుడ వంటి బస్సులతో పాటు సామాన్యుడికి అందుబాటులో ఉన్న పల్లె వెలుగు బస్సులనూ వదల్లేదు. పెంచిన చార్జీలతో విశాఖ ఆర్టీసీ రీజియన్‌కు నెలకు ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? రోజుకు రూ.3 నుంచి 4 లక్షలు! సగటున నెలకు రూ.కోటికి పైమాటేనన్న మాట!! అంటే నెలకు రూ.కోటి రూపాయల భారం ప్రయాణికులపై పడుతున్నట్టు లెక్క. విశాఖ రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోల్లో సుమారు 1060 బస్సులున్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. పండగలు తదితర సీజన్లలో మరో రూ. ఐదు లక్షలు అదనంగా రాబడి వస్తుంది. ఇప్పటికే విశాఖ రీజియన్ ఆదాయంలో సంతృప్తికరంగా ఉంది. తాజాగా పెరిగిన చార్జీలతో ప్రయాణికులకు బాదుడే అయినా ఈ రీజియన్‌కు మాత్రం మరింతగా ఊరట కలగనుంది. అయితే దసరా పండగ వెళ్లి 24 గంటలైనా గడవక ముందే సర్కారు దొంగ దెబ్బతీసినట్టుగా ఆర్టీసీ చార్జీలు మోతమోగించిందంటూ ప్రయాణీకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్యాకేజీ రాలేదని ప్రజలపై పడ్డారు..! ప్రత్యేక ప్యాకేజీ కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన సీఎం చంద్రబాబు ఆఖరికి అది వచ్చే దారి కనిపించకపోవడంతో ప్రజలపై భారం వేసేందుకు సిద్ధపడ్డాడు. అందుకే ప్రధాని మోడీ ఆంధ్ర నుంచి వెళ్లిన వెంటనే ప్రజలపై తన అక్కసు వెళ్లగక్కేలా రూ. 10 శాతం భారం మోపాడు. ప్రజలపై ఇప్పుడు వేస్తున్న వడ్డనకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. -గుడివాడ అమరనాథ్, జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన కానుక రాష్ట్ర రాజధాని శంకుస్థాపన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన కానుక. ఆర్టీసీ నష్టాలలో ఉందనటం వాస్తవం. దానిని బయటపడటానికి ప్రభుత్వం ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వాలి. ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. ప్రజల ఆదాయ వనరులు పెరిగేటటువంటి మార్గం లేకుండా అన్నింటికి ధరలు పెంచుకుంటూ పోవటం అన్నది ప్రజలమీద భారం మోపటమే. -జేవీ సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధరలు పెంచాల్సిన అవసరం లేదు ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరంలేదు. ప్రజలమీద భారం వేయడానికి ప్రభుత్వం ధరలు పెంచుతుంది. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన సహకారం ఇవ్వటంలేదు. రాష్ట్ర విభజనలో ప్రభుత్వం నష్టాన్ని భరిస్తామని హామినిచ్చింది. తాజాగా ప్రజలపై పన్నులు, ఛార్జీల రూపంలో భారం మోపటం సరికాదు. దీనిని సీపీఎం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. -సి.హెచ్.నరసింగరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భారం మోపనన్నారు.. అదే చేస్తున్నారు..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రజలపై భారం వేయనన్నాడు. కానీ ఇప్పుడు తినడానికే తిండి లేకుండా బాధ పడుతుంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచి తన పైశాచికత్వాన్ని చాటుకుంటున్నాడు. రూ. వందల కోట్లు రాజధాని శంకుస్థాపన కోసం ఖర్చు చేయడం కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుండేది. ఎన్నికలప్పటికీ ఇప్పటికీ చంద్రబాబులో చాలా మార్పు కనిపిస్తోంది. ప్రజలను వంచించడానికే ఇప్పుడు ఉన్నాడనిపిస్తోంది. -ద్రోణంరాజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒకే సారి భారీగా పెంచడం సరికాదు..! ఒకే సారి భారీగా ఛార్జీల భారం పడేలా పెంచడం సరికాదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రీ ఆర్గనైజ్ చేయడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టకుండా నేరుగా ప్రజలనే లక్ష్యంగా చేసుకోవడాన్ని నిరసిస్తున్నాం. సామాన్య ప్రజానీకానికి ఆర్టీసీ బస్సు ఒక్కటే రవాణా అవసరాలను తీర్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్జీలు వడ్డన బాధాకరం. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి. -పి.వి.నారాయణ రావు, నగర అధ్యక్షుడు బీజేపీ ఎక్కడ నుంచి ఎక్కడకు: పాత కొత్త విశాఖపట్నం-విజయవాడ (సూపర్‌లగ్జరీ) 420 460 విశాఖపట్నం-తిరుపతి (ఇంద్ర ఏసీ) 1109 1202 విశాఖపట్నం-చెన్నై (గరుడ) 1367 1482 విశాఖపట్నం- హైదరాబాద్ (సూపర్‌లగ్జరీ0 726 797 విశాఖపట్నం-హైదరాబాద్ (గరుడ) 1061 1182 విశాఖపట్నం-రాజమండ్రి (డీలక్స్)సింగిల్స్టాప్ 218 255 విశాఖపట్నం-కాకినాడ (సూపర్‌లగ్జరీ) 195 215 విశాఖపట్నం-విజయనగరం (డీలక్స్) 47 51 విశాఖపట్నం-శ్రీకాకుళం (నాన్‌స్టాప్ డీలక్స్) 107 116 విశాఖపట్నం-పాడేరు (ఎక్స్‌ప్రెస్) 92 100 విశాఖపట్నం-పాడేరు (డీలక్స్) 101 112 -
ఆర్టీసీ చార్జిల పెంపు దుర్మార్గం
హైదరాబాద్: ప్రయాణికుడి నడ్డి విరిగేలా ఆర్టీసీ చార్జిలు పెంచిన చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. చార్జిల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యను దుర్మార్గంగా పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఎడాపెడా పన్నులతో ఆర్టీసీని దివాలా తీయించిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు మళ్లీ ఒకేసారి 10 శాతం ధరలు పెంచడం దారుణమని వైఎస్సార్ సీపీ విమర్శించింది. ఓ వైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా, ఆర్టీసీ చార్జిలు పెంచడం ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేట్ రవాణాను అరికట్టి డీజిల్ పై వ్యాట్ ఎత్తివేయాలని, ఒక్కపైసా చార్జీ పెంచకుండా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించాలని సూచించింది. -
ఆర్టీసీ చార్జీల మోత!
* బస్సు చార్జీల పెంపునకు సర్కారు నిర్ణయం * సంస్థపై వేతన సవరణ భారాన్ని తగ్గించేందుకే... సాక్షి, హైదరాబాద్: బస్సు ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇటీవల ఆర్టీసీ కార్మికుల వేతనాలను భారీగా పెంచిన నేపథ్యంలో సంస్థపైపడ్డ భారాన్ని కొంతమేర తగ్గించేందుకు చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చార్జీలు తక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులపై పెద్దగా భారం పడకుండా చార్జీలను సవరించనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా రూపొందించిన చిహ్నాన్ని మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. అలాగే పల్లెవెలుగు బస్సులకు కొత్త రంగులు వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త రంగులతో తీర్చిదిద్దిన పల్లె వెలుగు బస్సును కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న బస్సుల పర్మిట్ కాలపరిమితి పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు ప్రవేశ పన్ను విధించాలని నిర్ణయించామన్నారు. ఇతర వాణిజ్య వాహనాలకు అమలు చేస్తున్నట్లుగానే ఆర్టీసీ బస్సులను కూడా పన్ను పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 28 నుంచి విడివిడిగా ఆర్టీసీ కార్యకలాపాలు... ఆర్టీసీ విభజన అంశాన్ని ప్రస్తుతం కేంద్రం ఏర్పాటు చేసిన షీలాభిడే కమిటీ పర్యవేక్షిస్తోందని...అయితే పని విభజన కోసం రెండు ఆర్టీసీల మధ్య సిబ్బంది కేటాయింపును పూర్తి చేశామని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి పూర్తిగా రెండు ఆర్టీసీలు విడివిడిగా పనిచేస్తాయని చెప్పారు. దీనికి సంబంధించి ఈనెల 25న నిర్వహించే ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు వివరించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతోందని, దీనికి సంబంధించి అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఏసీ బస్సులు నడిపే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎండీ రమణరావు, ఈడీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో కొత్త బస్సులు అన్ని పట్టణాల నుంచి రాజధానిని అనుసంధానిస్తూ రూ. 20 కోట్లతో కొత్తగా 60 ‘రాజధాని’ పేరిట ఏసీ (ఇంద్ర తరహాలో) బస్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. రూ. 10 కోట్లతో కొత్తగా 10 గరుడ ప్లస్ మల్టీయాక్సిల్ బస్సులు సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఈ నెలాఖరుకు రోడ్డెక్కనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ చిహ్నం ఇలా... లోగో వెలుపలి బంగారు వృత్తం బంగారు తెలంగాణకు, ఆకుపచ్చని వృత్తం హరితహారానికి, మధ్యలోని కాకతీయ ద్వారం తెలంగాణను ప్రతిబింబిస్తుందని, మధ్యభాగంలో పచ్చిక పల్లెలకు, చార్మినార్ చిత్రం నగరాలు, పట్టణాలకు సూచిక అని అధికారులు అభివర్ణిస్తున్నారు. దీన్ని నలంద అడ్వర్టయిజింగ్ అసోసియేట్స్ ప్రతినిధి జ్ఞానేశ్వర్ రూపొందించారు. మెట్రోరైల్, ఉమ్మడి రాష్ట్ర స్వర్ణోత్సవ లోగోలను కూడా ఆయనే రూపొందించారు. పల్లెవెలుగుకు రంగులు.. ఇప్పటి వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ముదురు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉండేవి. ఇకపై పల్లెవెలుగు బస్సులు లేత ఆకుపచ్చ రంగు, పైన వెడల్పాటి గులాబీ రంగు గీతతో కనిపించనున్నాయి. -
చార్జీల పెంపు తప్పదు: ఆర్టీసీ ఎండీ
⇒ బెజవాడ బస్టాండులో నేటినుంచి వై-ఫై సేవలు ఒంగోలు: ఫిట్‌మెంట్‌వల్ల రూ.960 కోట్ల భారం పడిందని, అందువల్ల చార్జీల పెంపు అనివార్యమని ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. అయితే అదెంతనే విషయం ప్రభుత్వంతో చ ర్చల అనంతరం ప్రకటిస్తామన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోను ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ అనేక డిపోలు నష్టాల్లో ఉన్నాయన్నారు. అవన్నీ లాభాలు గడిస్తేనే ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కుతుందన్నారు. అక్రమ రవాణా అరికట్టడమే అందుకు మార్గమని చెప్పారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండులో సోమవారం నుంచి వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. -
చార్జీల పెంపునకు సిద్ధం..!
టికెట్ ధరల సవరణపై యాజమాన్యం దృష్టి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అడిగిన దానికంటే ఒక శాతం ఎక్కువగా ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇక బస్సు చార్జీల పెంపుపై దృష్టి సారించనుంది. ఫిట్మెంట్ భారాన్ని అధిగమించే యత్నాల్లో చార్జీల పెంపు కూడా ఒకటని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయితే ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా చూస్తామని పేర్కొన్నారు. కానీ, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ఆర్టీసీపై రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటికే నష్టంతో కుంగిపోతున్న ఆర్టీసీ ఈ భారం మోయలేమని స్పష్టం చేస్తోంది. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిన వెంటనే దాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక భారం నుంచి కొంతైనా తప్పించుకోవాలని చూస్తోంది. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చిన వెంటనే టికెట్ ధరలు పెంచితే.. ఆ భారాన్ని నేరుగా ప్రజలపై మోపిన భావన వస్తుందనే ఉద్దేశంతో చార్జీల పెంపును వెంటనే అమలు చేయొద్దని భావించింది. కానీ, డీజిల్ ధరలు పెరగడంతో ఇక టికెట్ ధరల పెంపు అనివార్యంగా మారింది. కార్మికులకు ఫిట్మెంట్ ప్రకటిస్తే 15 శాతం మేర టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతించాలని ఆర్టీసీ గత నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దానికి వెంటనే పచ్చజెండా ఊపాలని ఇప్పుడు ఆర్టీసీ కోరబోతోంది. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో కొత్త ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి పలు వరాలు ప్రకటించారు. అందులో కొన్ని మినహా మిగతా వేటిపై స్పష్టత లేదు. ముఖ్యంగా.. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో పడే రూ.850 కోట్ల భారాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుందా, ఆర్టీసీకి కొంతమేర గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేస్తుందా అన్న విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆర్టీసీకి తీవ్ర భారంగా మారిన రూ.1,900 కోట్ల అప్పుల విషయంలోనూ అలాంటి గందరగోళమే నెలకొంది. అప్పులకు సంబంధించి ఆర్టీసీ రూ.186 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ భారం నుంచి బయటపడాలంటే ముందుగా అప్పులు లేకుండా చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. కానీ, ఆ అప్పులను ఎవరు తీర్చాలనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి జరుపుతామన్న కేటాయింపులు ఎంత అనేదీ స్పష్టం కాలేదు. జూన్ నెల నుంచి ఫిట్‌మెంట్‌ను చెల్లించాల్సిన నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, ముఖ్యమంత్రి హామీల్లో స్పష్టత వస్తేగానీ ఈ లెక్కలు తేలవు. దీంతో ఆర్టీసీ అధికారులు రవాణాశాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రెండుచోట్ల కూడా స్పష్టత లేకపోవడంతో ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించి చెప్తామనే సమాధానం వచ్చినట్టు తెలిసింది. -
మళ్లీ పెట్రో షాక్
-
మళ్లీ పెట్రో షాక్
15 రోజుల్లో రెండుసార్లు ధర పెంపు నిత్యావసరాల ధరలపై ప్రభావం తప్పనున్న ఆర్టీసీ చార్జీల వడ్డన సాక్షి, విశాఖఫట్నం : కేవలం పదిహేను రోజులవ్యవధిలో రెండోసారి పెట్రో వడ్డన చేశారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.13లు,డీజిల్‌పై రూ.2.71ల చొప్పున శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెంచడం తో సామాన్యులు విల విల్లాడుతున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.72.42లు, డీజిల్ రూ.57.28 లుండగా, తాజా పెంపుతో శనివారం అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్ రూ.75.21, లీటర్ డీజిల్ రూ.59.62 పైసలు కానుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని వరుసగా పదిసార్లు తగ్గించి తర్వాత వరుసగా పెంచుతూ వస్తోంది. రూపాయి...రెండు రూపాయల చొప్పున తగ్గించిన సర్కార్ పెంచే సమయంలో మాత్రం మూడురూపాయలకు పైగానే ఉంటోంది. గత నెల 30వ తే దీ అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ.4.50లు, డీజిల్‌పై రూ.2.80లు పెంచిన ప్రభుత్వం తాజాగా పెట్రోల్‌పై మరోసారి రూ.3.13లు, డీజిల్‌పై రూ.2.71 పైసలుపెంచింది. ఆర్టీసీకి భారమే...: ఒక పక్క 43 శాతం ఫిట్మెంట్ వంకతో ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్న యాజమాన్యానికి ఈ తాజా డీజిల్ చార్జీల పెంపు వరంలా కలిసి రానుంది. నిత్యావసర ధరలపై కూడా ఈ పెట్రో ధరల ప్రభావం కన్పించనుంది. విశాఖ సిటీలో రోజూ 65వేల లీటర్ల పెట్రోల్, 5,500 కిలో లీటర్లు( 55 లక్షల) డీజిల్ వినియోగం జరుగుతుంటుంది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు 85వేల లీటర్ల పెట్రోల్, లక్ష లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటారు. తాజా పెంపు వల్ల పెట్రోల్ వినియోగదారులపై నెలకు రూ.1.86కోట్ల చొప్పున ఏడాదికి రూ. 20 కోట్ల భారం పడుతుంది. డీజిల్ వినియోగదారులపై నెలకు రూ.42కోట్ల చొప్పున ఏడాదికి రూ.500కోట్ల మేర భారం పడుతుంది. ఒకే నెలలో రెండుసార్లు చార్జీలు పెంచడంతో పెను భారం పడనుంది. -
ఆర్టీసీ చార్జీలు పెంచొద్దు: పద్మ
హైదరాబాద్: ఫిట్ మెంట్ భారం పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచొద్దని ఏపీ ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆర్టీసీ చార్జీలు పెంచితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలుగు ప్రభుత్వాలు ముందే స్పందించివుంటే సామాన్య ప్రజలకు ఈ సమస్యలొచ్చేవా అని ప్రశ్నించారు. పోరాడి విజయం సాధించినందుకు ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపారు. సమ్మెకు మద్దతు తెలిపామని గుర్తు చేశారు. కార్మిక లోకానికి వైఎస్సార్ సీపీ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తుందని పునరుద్ఘాటించారు. -
ఆర్టీసీ చార్జీలు పెంచొద్దు: పద్మ
-
డీజిల్ ధరలు పెరిగితే బస్సు చార్జీలూ భగ్గు!
కేంద్రం ధరలు పెంచినప్పుడల్లా తప్పదు: సిద్ధా రాఘవరావు సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు పెరిగితే ఇకపై ఆ సెగ నేరుగా బస్సు ప్రయాణికులకే తగలనుంది! కేంద్రం ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచినపుడల్లా ఆర్టీసీ చార్జీలు కూడా వాటంతట అవే సవ రణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. సంస్థ ఇంధన ఖర్చును తగ్గించేందుకు బయో డీజిల్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఆర్టీసీ(కేఎస్ ఆర్టీసీ) పనితీరును అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను వ్యక్తులు, సంస్థలకు లీజుకిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకుంటామన్నారు.పల్లె వెలుగు స్థానంలో చిన్న బస్సులు ప్రవేశ పెడతామన్నారు. -
ఆర్టీసీ చార్జీల పెంపు
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ :పంచాయతీ కార్యదర్శి పరీక్ష ఆదివారం.. అయితే పరీక్షలు రాసే అభ్యర్థులకు మాత్రం ఒక రోజు ముందే పరీక్ష రాసినట్లుగా తయారైంది. ఆర్టీసీ బస్సుల కోసం ముందుగానే బస్టాండ్‌కు చేరుకుని టికెట్లు బుకింగ్ చేసుకుని మరీ పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగున్నా అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఆసరాను అదనుగా చేసుకుని ఆర్టీసీ ఏకంగా 50 శాతం అదనపు చార్జీలతో అభ్యర్థులపై ఆర్థిక భారం మోపింది. దీంతో రెగ్యులర్‌గా ఉండే చార్జీలు కాస్త ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో తడిసి మోపడవుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్‌కు వెళ్లే బస్సులకు వాస్తవానికి ఇతర రోజుల్లో చార్జీలు వేరేలా ఉంటాయి. కానీ పరీక్షలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతుండటంతో ఈ చార్జీలు వారిపై మోపుతూ ఆర్టీసీ ఆదాయానికి మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పటికే శనివారం నిర్మల్‌కు 7, ఆదిలాబాద్‌కు 9 బస్సులకు సంబంధించి ముందస్తు టికెట్లు ఇవ్వడంతో అభ్యర్థులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఈ బస్సులన్నీ కూడా ఆదివారం ఉదయం 4 గంటల నుంచి నిర్మల్, ఆదిలాబాద్ మార్గాలకు బయలుదేరుతాయి. పరీక్షా కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో ఆదివారం పరీక్షా కేంద్రాలకు గంట ముందు చేరుకోకుంటే నష్టపోవాల్సి వస్తుందని.. ఒక రోజు ముందుగానే అభ్యర్థులు వచ్చారు. దీంతో మంచిర్యాల బస్టాండ్ శనివారం ఇటు ప్రయాణికులతో పాటు అటు పరీక్షకు వచ్చిన అభ్యర్థులతో కిటకిటలాడింది. తడిసిమోపెడు... ఆర్టీసీ అధికారులు మూకుమ్మడి ప్రణాళికతో ప్రత్యేక బస్సుల చార్జీలు పెంచేశారు. ప్రస్తుతం నిర్మల్‌కు రూ.117 ఉన్న చార్జీ అభ్యర్థులకు మాత్రం రూ.176గా నిర్ణయించారు. అంటే రూ.59 పెంచారు. అలాగే ఆదిలాబాద్‌కు ప్రస్తుతం రూ.129 చార్జి కాగా అభ్యర్థులకు రూ.194 చార్జి చేశారు. అదనంగా రూ. 65 ఎక్కువ చేసి వసూలు చేస్తున్నారు. 16 బస్సులకు రిజ్వేషన్ ‘ఫుల్’... మంచిర్యాల బస్టాండ్ నుంచి నిర్మల్‌కు 7, ఆదిలాబాద్ మార్గాల్లో 9 బస్సులను వేశారు. వీటికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో ఆ బస్సుల్లో రిజర్వేషన్ కోసం గంటలోపు టిక్కెట్లను బుకింగ్ చేసేసుకున్నారు. రిజర్వేషన్లు ఫుల్ కావడంతో నిర్మల్‌కు 4, ఆదిలాబాద్‌కు 4 బస్సులను అదనంగా వేశారు. ఈ బస్సులు కూడా ఉదయం 4 గంటలకు బస్టాండ్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే.. సుదూర ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో కొంత మంది అభ్యర్థులు గ్రూపులుగా ఏర్పడి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. -
సామాన్యుడికి ధరాఘాతం
ఏడాదిలో పదిసార్లు పెరిగిన పెట్రోలు ధరలు.. 14 సార్లు పెరిగిన డీజిల్ ధరల మోతలతో మధ్యతరగతి జీవి విలవిల్లాడిపోయాడు. సన్న బియ్యం రేట్లు చుక్కలు చూపించాయి. వంట నూనెల ధరలు సలసలా కాగి పేదోడి కుంపట్లో నిప్పులు రాజేశాయి. ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 700శాతం పెరిగిన ఎరువుల ధరలు రైతులను కోలుకోలేని విధంగా అప్పుల పాల్జేశాయి. ఏ వస్తువు కొందామన్నా.. షాక్ కొట్టే విధంగా ఉన్న ధరల్ని చూసి ఈ ఏడాది సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా సమ్మె కాలంలో నిత్యావసరాలు చుక్కలు చూపాయి. ధరల నియంత్రణకు నడుం బిగించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై ఏ మాత్రం కనికరం చూపలేదు. చేసేదేమీ లేక చేష్టలుడిగిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జిల్లావాసులు మోయలేని భారం మోశారు. ఆర్టీసీ కస్సు ‘బుస్సు’ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయాణీకులపై చార్జీల రూపంలో అదనపు భారం వేసిన ఆర్టీసీ.. జూన్ నెలలో టోల్ ట్యాక్స్ బాదుడుతో బెంబేలెత్తించింది. ఏడాదికి రూ.75 లక్షల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో భాగంగా ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపింది. సమైక్యాంధ్ర ఉద్యమం ముగిశాక, మరోసారి చార్జీలు పెంచి పెరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేసింది. కిలో మీటరుకు 30 నుంచి 50 పైసల వరకు చార్జీలను పెంచి సగటున నెలకు రూ.12 లక్షల అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు రీజియన్ అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. రైతన్నకు ఎరువుల ధరాఘాతం కనీవినీ రీతిలో ఎరువుల ధరలు రైతన్న వెన్ను విరిచాయి. దీంతో పాటు సమైక్య సమ్మె ప్రభావంతో ధరలు ఆకాశాన్నంటాయి. 50 కిలోల యూరియా బస్తా రూ.284కు అమ్మాల్సి ఉంటే, రూ.350 చొప్పున అమ్ముకున్నారు. మిగిలిన ఎరువులు రూ.50 నుంచి రూ.70 వరకు అధిక ధరలకు విక్రయించారు. సుమారు 700 శాతం మేర ఎరువుల ధరలు పెరిగి అన్నదాతలకు అప్పులు మిగిల్చాయి. నియంత్రించాల్సిన అధికార గణం పట్టనట్లు వ్యవహరించడంతో వ్యాపారులు చెప్పిందే రేటు.. అన్నట్లు సాగింది. దీనికి తోడు వరుస తుఫాన్లు చుట్టుముట్టి పెట్టిన పెట్టుబడికి తోడు ఎకరాకు రూ.20 వేల అప్పు మిగిలింది. కరెంటు నిల్లు... బిల్లు ఫుల్లు... గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలు చుక్కలు చూపించాయి. లేని కరెంటుకు మూడింతలు కరెంటు బిల్లులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కరెంటు చార్జీలు 60 శాతానికి పైగా పెరిగాయి. జిల్లావాసులపై పెరిగిన కరెంటు బిల్లుల భారమే నెలకు రూ.101.69 కోట్లకు పైగా ఉంది. సర్దుబాటు చార్జీల పేరిట గడిచిన రెండేళ్లకు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. నెలకు సర్దుబాటు చార్జీల భారం రూ.30 కోట్లకు పైగా ఉంది. పరిశ్రమలకు మూడురోజుల పాటు పవర్ హాలిడే అమలు చేయడంతో జిల్లాలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పలు రకాల ఉత్పత్తులు నిలిచిపోయాయి. నిత్యావసరాలు ప్రియం.. ఈ ఏడాది సన్న బియ్యం, వంట నూనెలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరిగాయి. సన్న బియ్యం మరింత ప్రియం అయ్యింది. ఏడాది ప్రారంభంలో కేజీ రూ.35-రూ.40 వరకు ఉన్న సన్న బియ్యం సమ్మెకు ముందు రూ.50 కి చేరింది. సమ్మె కాలంలో రూ.60 వరకు పలికింది. వంట నూనెల్లో పామాయిల్ మంటలు మండింది. రూ.75వరకు ధర పలికింది. వేరుశనగ మొన్నటివరకు రూ.110కి చేరింది. నిత్యం అవసరమైన కూరగాయలు, ఆకు కూరలు మధ్యతరగతి వర్గాలకు దడ పుట్టించాయి. టొమాటో మొదట్లో కేజీ రూ.5 ఉన్న ధర ఏకంగా కేజీ రూ.40కి చేరింది. అల్లం అల్లాడించగా, బీన్స్ ధరలు పెరిగాయి. క్యారట్ రూ.12 ఉన్న ధర రూ.26 వరకు పలికింది. రూపాయి ములక్కాయ ధర రూ.పదికి చేరింది. కార్తీక మాసంలో కూర‘గాయాలు’ చేశాయి. గ్యాస్ ‘బండ’ పడింది.. గ్యాస్ సిలిండర్ ధర వినియోగదారుడిని గందరగోళానికి గురి చేసింది. ఆధార్ లింకుతో గ్యాస్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. రాయితీ సిలిండర్ ధర రూ.412 నుంచి రూ.600కి చేరింది. నెలకు వినియోగదారులపై సుమారు రూ.20 కోట్ల భారం పడింది. వంట గ్యాస్‌కు ఆధార్ లింకేజీతో సిలిండర్‌కు వినియోగదారులు రూ.1,017 చెల్లించారు. బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన డబ్బు జమ కాకపోవడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. పెట్రో వాత.. డీజిల్ మోత.. పదిసార్లు పెట్రోలు చార్జీలు పెంచి పథ్నాలుగు సార్లు డీజీల్ మోత మోగించిన కేంద్ర ప్రభుత్వ తీరుకు వినియోగదారుడి జీవిత చక్రానికి బ్రేకులు పడ్డాయి. జిల్లాలో 220 పెట్రోలు బంకు ఔట్లెట్లు ఉన్నాయి. రోజుకు డీజిల్ 27 లక్షల లీటర్ల వినియోగం జరుగుతుండగా, పెట్రోలు 9 లక్షల లీటర్ల వినియోగం జరుగుతున్నట్లు అంచనా. పెట్రోలు జనవరిలో రూ.73.20 ఉంటే, ప్రస్తుతం రూ.77.40 వరకు ఉంది. అంటే లీటరుకు రూ.4.20 వరకు పెరిగింది. రోజుకు పెట్రోలు భారం రూ.3.78 లక్షలు పెరిగింది. డీజిల్ జనవరిలో రూ.52.60 ఉంటే ప్రస్తుతం రూ.58.40 ఉంది. లీటరుకు రూ.5.80 వరకు పెరిగింది. రోజుకు జిల్లాలో డీజిల్ భారం రూ.15.66 లక్షల వరకు ఉంది. ఉల్లి లొల్లితో కంట కన్నీరు.. ఉల్లి ధరలతో ప్రభుత్వాలనే గడగడలాడించింది. ఈ ఏడాది అక్టోబరులో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. మహారాష్ట్ర, నాందేడ్, కర్ణాటకలలో పంట తుడిచిపెట్టుకుపోవడం, స్థానికంగా తుపాన్లుతో పంట దెబ్బతినడంతో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు కేజీ రూ.వందకు చేరాయి. సమ్మెకాలంలో రూ.120కి చేరుతుందని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా ధర లేక రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పుడు కేజీ రూ.8కి కొంటామని వ్యాపారులు రైతుల వద్ద బేరాలు చేస్తుండటంతో ఉల్లి రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. -
జనంపైకి ‘ప్రగతి చక్రం’!
రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందోనని జనమంతా కళవళపడుతున్నవేళ ఇదే అదునుగా ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏమంత పెంచలేదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే అన్ని రకాల సర్వీసుల్లోనూ టిక్కెట్ల ధరలపై సగటున 9.5 శాతంమేర అదనంగా వడ్డించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు సామాన్యుడికి ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే ఆర్టీసీ తన వంతు బాదుడుకు సిద్ధపడింది. కనీస చార్జీల జోలికె ళ్లలేదంటూనే రెండో స్టేజీనుంచి ధరల మోత మోగించింది. సామాన్య పౌరులు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులనుంచి గరుడ, గరుడ ప్లస్ వరకూ దేన్నీ వదల్లేదు. ఎవరినీ కనికరించలేదు. తరతమ భేదాలు లేకుండా అన్ని తరగతులవారిపైనా భారం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ దాదాపు 1.40 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వారిలో సగంమంది గ్రామీణ ప్రాంతాలవారే. వాస్తవానికి ఆర్టీసీ చార్జీలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గత నెలలో కథనాలు వెలువడ్డాయి. ఏటా రూ. 500 కోట్ల మేర చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఆ కథనాలు వెల్లడించాయి. కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారుకు ఇది సరిపోలేదేమో... మరో వందకోట్ల రూపాయల బాదుడును జతచేసింది. గత నాలుగేళ్లలో ఇలా చార్జీలను పెంచడం ఇది నాలుగోసారి. గత మూడేళ్లలోనే టిక్కెట్ల ధరలు 50 శాతంపైగా పెరిగాయి. చార్జీలు పెంచే ప్రతిసారీ ప్రభుత్వం డీజిల్ ధరలను సాకుగా చెబుతుంది. ఈసారి ఉద్యమాలు కూడా అందుకు తోడయ్యాయి. ఆర్టీసీ నష్టాల బాటలో ఉన్నదన్న సంగతి యదార్థమే. అందుకు కేవలం డీజిల్ చార్జీలనూ, ఉద్యమాలనూ సాకుగా చూపడం మాత్రం అన్యాయం. సామాన్య జనానికి రవాణా సదుపాయం కల్పించడం కోసమంటూ ఏర్పడిన ఆర్టీసీని చిక్కుల్లో పడేస్తున్నదీ, చిక్కిపోయేలా చేస్తున్నదీ సర్కారే. ఒకపక్క వివిధ రూపాల్లో ఆర్టీసీని ిపిండుతూ దాని కష్టాలకు మరేవో కారణాలు చెప్పడం సర్కారుకే చెల్లింది. డీజిల్‌పైనా, విడిభాగాల కొనుగోలుపైనా ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఏటా దాదాపు రూ. 700 కోట్లు రాబడుతోంది. మోటారు వాహనాల పన్ను రూపంలో మరో 450 కోట్ల రూపాయలు వసూలుచేస్తోంది. ఇక బస్సు పాస్‌లకు ఇచ్చే రాయితీలను రీయింబర్స్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ బాపతు బకాయిలు రూ. 1,000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఇవన్నీ కలుపుకుంటే ఆర్టీసీకి ఇప్పుడు వస్తున్నాయంటున్న నష్టాల బెడద చాలా వరకూ తీరుతుంది. బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఆర్టీసీ వెన్నువిరిగి, అది ప్రైవేటీకరణ ముప్పులో చిక్కుకోగా తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం దాన్ని అన్నివిధాలా ఆదుకుంది. ఆర్టీసీ చెల్లించే వ్యాట్‌ను 12 శాతంనుంచి 7 శాతానికి తగ్గించింది. అయిదేళ్లకాలంలో ఒక్కసారికూడా చార్జీలు పెంచకుండా ఆ సంస్థను లాభాలబాట పట్టించింది. ఏమి చేసి ఆయన ఈ అద్భుతాన్ని సాధించగలిగారో పరిశీలించవలసిందిపోయి, ఆ విధానాలను అమలుచేయవలసిందిపోయి చార్జీల పెంపే ఏకైక పరిష్కారమన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత పదేళ్లలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ రద్దీకి దీటుగా ఆర్టీసీ బస్సులను సమకూర్చలేక పోతున్నది. సాధారణ సమయాల్లో ఇలా చేతులెత్తేస్తూ పండుగల పేరుచెప్పి ప్రయాణికులను నిలువుదోపిడీ చేయడంలో ప్రైవేటు బస్సు యాజమాన్యాలతో పోటీపడుతోంది. తలుపులు, కిటికీలు కూడా సరిగాలేని సిటీ బస్సుల్ని ప్రధాన పట్టణాలకు తిప్పుతూ రెండుచేతులా సంపాదిస్తోంది. ఇన్ని చేస్తున్నా నష్టాలే దాపురించడానికి కారణం ఏమిటి? ఎప్పటికప్పుడు పనితీరుని సమీక్షించుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటే, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుంటే ఆర్టీసీ లాభాలు సాధించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆ పని చేయడంలో సంస్థ దారుణంగా విఫలమవుతున్నది. కనుకనే ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించవలసి వస్తున్నది. అటు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఇదే అదునుగా ఒక నంబరుతో నాలుగైదు బస్సులు తిప్పుతూ ఆర్టీసీ ఆదాయానికి కన్నం పెడుతున్నారు. సిటీ రూట్లలో నష్టాలను తగ్గించుకోవడానికంటూ ట్రిప్పులను గణనీయంగా తగ్గించారు. రాత్రి 9 గంటలు దాటితే బస్సుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. పర్యవసానంగా నగర పౌరులు ఆటోలపైనా, ఇతర వాహనాలపైనా ఆధారపడవలసివస్తున్నది. ఆర్టీసీ నిర్వహణ ఇంత అస్తవ్యస్థంగా ఉంటున్నా సర్కారు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఆ సంస్థ సామర్థ్యం పెంపునకు ఎలాంటి సూచనలూ చేయదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై పరుగులు పెడుతున్న ప్రైవేటు బస్సులనూ అదుపుచేయదు. మొన్నీమధ్య బెంగళూరునుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు పెను ప్రమాదంలో చిక్కుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో దాదాపు 200 బస్సుల్ని సీజ్ చేశారు. అంటే, ఇన్నేళ్లుగా ఈ బస్సులన్నీ అడిగే నాథుడులేక ఇష్టమొచ్చినట్టు తిరిగాయన్నమాట. అన్ని స్థాయిల్లో లాలూచీ లేకుండా ఇలా తిరగడం సాధ్యమేనా? తప్పులన్నీ తమవద్ద పెట్టుకుని, దేన్నీ సరిదిద్దలేని అశక్తతను కప్పిపుచ్చుకుని... బస్సెక్కడానికివచ్చే సామాన్య పౌరుల జేబులకు చిల్లుపెట్టడమే ఏకైక మార్గమన్నట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీకి ఇప్పటివరకూ దాదాపు రూ. 4,200 కోట్ల అప్పులున్నాయి. ప్రైవేటు బస్సుల్ని నియంత్రిస్తే... వ్యాట్, ఇతర పన్నుల చెల్లింపునుంచి ఆర్టీసీకి ఒకటి రెండేళ్లు మినహాయింపునిస్తే ఈ అప్పుల్లో సింహభాగం తీరిపోతుంది. కానీ, ఆ రూటును ఎంచుకోవడంమాని చార్జీల పెంపుతోనే సమస్య తీరుతుందన్నట్టు అటు ఆర్టీసీ, ఇటు ప్రభుత్వమూ భావించాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థలు ఇంతకన్నా తక్కువ చార్జీలనే వసూలు చేస్తూ కళకళలాడుతుంటే ఇక్కడే ఎందుకిలా జరుగుతున్నదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ విధానాలను పునస్సమీక్షించుకోవాలి. -
వామ్మో టికెట్
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గమనిక.. బస్సు ఎక్కబోతూ ఒక్కసారి జేబు తడుముకోండి. మీ దగ్గర ఉన్న డబ్బులు టికెట్ సరిపడ ఉన్నాయో లేదో చూసుకోండి.. వీలయితే చార్జీ ఎంతో కండెక్టర్‌ను అడిగి బస్సెక్కండి. ఆర్టీసీ సంస్థ చార్జీలు పెంచింది. ఈ చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రెండు నెలల పాటు విధులు బహిష్కరించి సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కర్నూలు రీజియన్‌కు రూ. 55 కోట్లు నష్టం వాటిల్లింది. సీమాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో నష్ట నివారణ చర్యలకు యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. అయితే ఈనెల 1వ తేదీ నుంచి మళ్లీ డీజిల్ ధరను లీటరుపై 50పైసలు పెంచడం సంస్థపై కోలుకోలేని దెబ్బపడింది. అయితే డీజిల్‌పై విధించే రాష్ట్ర ప్రభుత్వ పన్ను నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరినా స్పందించని ప్రభుత్వం చార్జీలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు సోమవారం అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈనెల 6వ తేదీ (అర్ధరాత్రి నుంచే) కొత్త చార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొత్త చార్జీల వివరాలను రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 11డిపో మేనేజర్లకు పంపింంచారు. దీంతో ఆయా డిపో పరిధిలోని బస్సులు తిరిగే రూట్లలో బస్ చార్జీలను సవరించారు. పంచింగ్ టికెట్లపై కొత్త చార్జీల ధరను స్టాంప్ ముద్ర వేయించారు. టిమ్ (టికెట్ ఇష్యూ మిషన్) వినియోగంలోని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ సాఫ్ట్ వేర్ ద్వారా కంప్యూటర్లో సవరించి మిషన్లలో సాఫ్వేర్ను ఇన్స్టాల్ చేశారు. -
చార్జీల మోతపై జనాగ్రహం
సర్కారు తీరు సమంజసంగా లేదు సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు ఇప్పటికే నిత్యావసరాలు మండుతున్నాయి కార్మిక సంఘాలు, నేతలు, {పయాణికుల మండిపాటు కంఠేశ్వర్, న్యూస్‌లైన్: ఆర్టీసీ చార్జీల పెంపుదలపై ప్రజలు, కార్మిక సంఘాలు, రాజకీ య పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య, పేద ప్రజల రథంగా భావించే ఆర్ టీసీ బస్సుల చార్జీలను పెంచడం భా వ్యం కాదని స్పష్టం చేశారు. ఇది ప్రజా రవాణా వ్యవస్థకు తీరని విఘా తం కలిగిస్తుందన్నారు. ఇప్పటికే చుక్కలనంటిన కూరగాయలు, నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై చార్జీల మోత మోగించ డం సమంజసం కాదని పేర్కొన్నారు. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె చేసి నష్టపోయినందునే తెలంగాణ ప్రజలపై ఆర్టీసీ చార్జిల భారం మోపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు తీరు సరిగా లేదని మండిపడ్డారు.నిజామాబాద్ రీజియన్‌లో ఆరు డిపోలు, 670 బస్సులు ఉన్నాయి. ఇవి ప్రతి రోజు రెండున్నర లక్షల కిలోమీటర్లు తిరుగుతూ రూ. 60 లక్షల ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పెరిగిన చార్జీలతో ఆర్టీసీకి రోజూ అదనంగా ఐదు లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది. పెరిగిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. కుంభకోణాలే కారణం బస్సు చార్జీలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆర్టీసీ ప్రయాణానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. బస్‌పాస్‌ల రేట్లు సైతం పెరగడంతో పేద విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడం ఇబ్బం దిగా మారుతుంది. యూపీఏ ప్రభుత్వం కుంభకోణా ల్లో కూరుకుపోయి డీజిల్, పెట్రోల్ పెంచుతుండడంతో పరోక్షంగా ఆర్టీసీపై భారం పడుతోంది. కాంగ్రెస్ సర్కారు ఖజానాను నింపుకోవడానికి అడ్డదారులు వెతుకుతోంది. చార్జీలను వెనుకకు తీసుకోకపోతే ఆం దోళనలు చేస్తాం. -పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడాదికి నాలుగుసార్లు పెంచుతున్నరు పేద ప్రజలు ప్ర యాణించే ఆర్టీ సీ చార్జీలు పెంచ డం సరైందికాదు. ప్రభుత్వం ఏడాదికి నాలుగు సార్లు చార్జీలు పెంచి సామాన్యుడిపై భారం మోపుతోంది. నష్టాల సాకుతో చార్జీలు పెంచడం సరైంది కాదు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. -బస్వ లక్ష్మీనర్సయ్య, టీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి సర్కారు తీరు సరిగా లేదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పటికే డీజిల్,పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెంచేశారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. -ఎ.నర్సారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ సామాన్యుడిపైనే భారం సామాన్యుడి రవాణా సదుపాయం అయిన ఆర్టీసీ చార్జీలు పెంచడం సరైంది కాదు. పేద, మధ్యతరగతి ప్రజలపై పెరిగిన చార్జీలు మరింత భారాన్ని పెంచుతాయి. వెంటనే ప్రభుత్వం పెంచిన చార్జీలను వెనుకకు తీసుకోవాలి. -శ్రీకాంత్, లెక్చరర్ -
మళ్లీ ఆర్టీసీ బాదుడు
ఒంగోలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం నాలుగోసారి ఆర్టీసీ చార్జీలు పెంచేసింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర జనాగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పల్లెవెలుగుకు కిలోమీటరుకు 4 పైసలు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు 7 పైసలు, డీలక్స్ 9 పైసలు, సూపర్‌లగ్జరీ 11 పైసలు, ఇంద్ర 12 పైసలు, గరుడ 15 పైసలు చొప్పున పెంచేశారు. పెరిగే చార్జీల ప్రకారం జిల్లాలో కిలోమీటరుకు పల్లెవెలుగు 59 పైసలు, ఎక్స్‌ప్రెస్ 79 పైసలు, డీలక్స్ 89 పైసలు, సూపర్ లగ్జరీ 105 పైసలు, ఇంద్ర 132 పైసలు, గరుడ సర్వీసుకు 165 పైసలు చొప్పున ఆర్టీసీ వసూలు చేస్తుంది. పెరిగిన చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. సరాసరిన ఏడాదికి రూ.30 కోట్ల అదనపు ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చార్జీల పెంపు భారం ఇలా: ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన తరువాత తన తొలి అయిదేళ్ల పాలనలో కేవలం ఒకే ఒకసారి 2006లో బస్సు చార్జీలను పెంచారు. అది కూడా పల్లెవెలుగులపై భారం పడకుండా. సంస్థాగతంగా కూడా బలోపేతమై 2008-09లో ఆర్టీసీ ప్రకాశం రీజియన్ ఎన్నడూలేనంతగా రూ.94 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. కానీ 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ఆర్టీసీకి కూడా కష్టకాలం దాపురించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోలుకోలేని నష్టాలను మూటగట్టుకుంటూనే ఉంది. ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు వైఎస్ఆర్ 5 శాతం సేల్స్ టాక్స్‌ను తగ్గించడం కూడా సంస్థకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. కానీ తరువాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రోశయ్య 2010 జనవరిలో ఆర్టీసీ చార్జీలను పెంచగా, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం 2011 జూలై 16న, 2012 సెప్టెంబర్ 24న, తాజాగా మరోసారి ఆర్టీసీ చార్జీలను పెంచేశారు. దీంతో గతంలో మూడు రూపాయల కనీస చార్జీగా ఉన్న పల్లెవెలుగు టికెట్ నేడు ఏకంగా రూ. 6లకు చేరుకుంది. తెలంగాణ , సమైక్యాంధ్ర ఉద్యమాలను ప్రస్తుతం చార్జీల పెంపుదలకు కారణంగా చూపిస్తున్నారు. ఇవే కాకుండా ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతున్న డీజిల్ ధరలు, టోల్ గేటు చార్జీ కూడా పెనుభారంగానే మారింది. ఇవే కాకుండా విద్యార్థుల బస్సుపాసు చార్జీలను కూడా ఆర్టీసీ పెంచేసింది. ఆర్టీసీ బస్టాండులో ప్రయాణీకులకు మౌలిక వసతుల పేరిట ఏకంగా టికెట్‌కు రూపాయి చొప్పున ఈ ఏడాది జూలై నుంచి ఆర్టీసీ అన్ని వర్గాల జనంపైన వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రకాశం రీజియన్‌లో ఆర్టీసీ సర్వీసులు మొత్తం 745 ఉన్నాయి. ఇవి కాకుండా 108 అద్దె బస్సులున్నాయి. వీటిలో 131 ఎక్స్‌ప్రెస్, 85 డీలక్స్, 116 హైటెక్ సర్వీసులు, 15 ఇంద్ర సర్వీసులు, గరుడ సర్వీసులున్నాయి. పల్లెవెలుగు సర్వీసులు 506 ఉన్నాయి. రోజుకు సరాసరిన ఆదాయం రూ. 65 లక్షలు వస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరల కారణంగా రోజుకు మరో 8 లక్షల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. దీంతో ఇకనుంచి రోజుకు రూ.73 లక్షల ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రకారం జిల్లాకు రూ.29.20 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుకు సంబంధించి ఒంగోలు నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్‌కు రూ. 38, బెంగళూరుకు రూ. 58, తిరుపతికి రూ. 29, విశాఖకు రూ. 57 చార్జీలు అదనంగా పెరిగాయి. -
ఆర్టీసీ చార్జీల వాత
నేటి అర్ధరాత్రి నుంచే కొత్త చార్జీల అమలు =0-14 కిలోమీటర్లపై రూపాయి పెంపు =ఆ పైన రూ.2 చొప్పున పెంపుదల =పెరిగిన కనీస టికెట్ ధర =బస్‌పాస్‌లపై రూ.50 చొప్పున పెంచిన ఆర్టీసీ =ప్రయాణికుల బెంబేలు సాక్షి, సిటీబ్యూరో : సగటు ప్రయాణికుడే లక్ష్యంగా ఆర్టీసీ చార్జీల మోత మోగించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు విరివిగా వినియోగించే ఆర్డినరీ బస్సులను సైతం వదిలి పెట్టకుండా గ్రేటర్లో బస్సు చార్జీలను పెంచేశారు. నగరంలో మొదటి 14 కిలోమీటర్లకు ఒక రూపాయి చొప్పున, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపైన రూ.2 చొప్పున చార్జీలను పెంచుతూ ఆర్టీసీ సోమవారం నిర్ణయించింది. పెరిగిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో చార్జీలు పెంచిన ఆర్టీసీ మొదటి 10 కిలోమీటర్ల ప్రయాణంపై ఎలాంటి భారం మోపకుండా కొంత మేరకు ఊరట కలిగించింది. కానీ ఈసారి తక్కువ దూరం వెళ్లే ప్రయాణికులను కూడా వదిలి పెట్టకుండా పెంచారు. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల చార్జీలు, బస్‌పాస్‌ల ధరలు కూడా పెరిగాయి. వివిధ రకాల పాస్‌లపైన రూ.50 చొప్పున పెంచారు. చార్జీల పెంపు వల్ల గ్రేటర్ పరిధిలోని సుమారు 35 లక్షల మంది ప్రయాణికులపై సగటున రూపాయి చొప్పున రూ. 35 లక్షల భారం పడనుంది. ఈ మేరకు చూస్తే నెలకు రూ. 10.50 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇందులో ఒక్క బస్‌పాస్‌లపైనే ప్రతి నెలా రూ.కోటీ 25 లక్షల భారం పడనుంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ ప్రతిరోజు రూ.2.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండగా పెంపు వల్ల ఇది రూ.3.05 కోట్లకు పెరగనుంది. డీజిల్ ధరల పెరుగుదల, విడిభాగాల ధరలు పెరగడం, బస్సుల నిర్వహణ భారం వంటి వివి ధ రకాల కారణాలతో ఆర్టీసీ 2010 నుంచి ప్రతి సంవత్సరం ప్రయాణికులపై మోత మోగిస్తూనే ఉంది. ఇటీవల పెరిగిన డీజిల్ ధరలు, సీమాంధ్ర సమ్మె నష్టాలు తదితర పరిణామాల దృష్ట్యా చార్జీల పెంపుపై కసరత్తు చేపట్టిన ఆర్టీసీ.. ఎట్టకేలకు సామాన్యుడి రవాణా సదుపాయాన్ని మరింత భారంగా మార్చేసింది. అయితే నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న పుష్పక్ ఏసీ బస్సుల ధరలు మాత్రం పెరగలేదు. వాటి ధరలు ప్రస్తుతం ఉన్న ప్రకారమే యథావిధిగా ఉంటాయని ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి. పెరిగిన చార్జీల తీరిదీ... మొదటి 14 కిలోమీటర్లకు రూపాయి చొప్పున పెరగనుంది. అంటే సికింద్రాబాద్ నుంచి కోఠీ, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, ఎల్బీనగర్ నుంచి నాంపల్లి, దిల్సుఖ్నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వంటి దగ్గరి రూట్లలో 14 కిలోమీటర్ల వరకు ప్రయాణికుడిపై రూపాయి చొప్పున భారం పడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం 8 రూపాయలు చెల్లిస్తున్న ప్రయాణికుడు ఇక నుంచి 9 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. 14 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపైన రూ.2 చొప్పున భారం పడనుంది. దిల్సుఖ్నగర్-పటాన్చెరు, సికింద్రాబాద్-బీహెచ్ఈఎల్, కోటీ-కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, ఉప్పల్-కొండాపూర్, ఈసీఐఎల్-హైటెక్‌సిటీ వంటి పలు రూట్లలో 14 కిలోమీటర్లు దాటి వెళ్లే ప్రయాణికులు ఇక నుంచి రూ.2 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటివరకు రెండు బస్టాపులు లేదా 4 కిలోమీటర్ల వరకు ఉన్న కనీస టికెట్ ధర కూడా పెరుగుతుంది. ఈ మేరకు ప్రస్తుతం రూ.5 ఉన్న ఆర్డినరీ టిక్కెట్ ధర ఇక నుంచి రూ.6 చొప్పున మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.6 నుంచి రూ. 7కు, మెట్రో డీలక్స్ రూ.7 నుంచి రూ.8 కి, ఏసీ బస్సు 10 రూపాయల నుంచి రూ.12 కు పెరుగనున్నాయి. 2.5 లక్షల పాస్ వినియోగదారులపై భారం గ్రేటర్లో ప్రతి రోజు 2.5 లక్షల మంది ఆర్టీసీ బస్‌పాస్‌లపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికులను సైతం అధికారులు టార్గెట్ చేశారు. రూ.50 చొప్పున పెంచారు. బస్‌పాస్‌ల పైన ఇప్పటి వరకు ఆర్టీసీకి నెలకు రూ.18.75 కోట్ల ఆదాయం లభిస్తుండగా పాస్ ధరల పెంపు వల్ల మరో రూ.కోటీ 25 లక్షలు అదనంగా రానుంది. దీంతో పాస్‌లపై నెలకు రూ. 20 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. -
ఆర్టీసీ కుమ్మేసింది!
=టికెట్ ధరల పెంపు =కొన్ని రకాల బస్‌పాస్‌లపైనా భారం =టోల్ బాదుడు, సెస్చార్జీలు యథాతథం =పల్లె వెలుగుపై కాస్త కనికరం =రీజియన్‌లో నెలకు రూ.2 కోట్ల భారం సాక్షి, విశాఖపట్నం : ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. బుధవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. విశాఖ రీజియన్ (సిటీ/రూరల్) పరిధిలో 1064 బస్సులున్నాయి. రూరల్‌లో 352 సర్వీసుల ద్వారా రోజుకు రూ.70 లక్షల ఆదాయం వస్తోంది. పెరిగిన చార్జీలతో ప్రయాణికులపై నెలకు రూ.2 కోట్ల భారం పడుతుంది. ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్నవాళ్లపై భారం పడదని అధికారులు తెలిపారు. కొన్ని బస్‌పాస్‌లపైనా భారం మోపింది. మొత్తమ్మీద 10 శాతం చార్జీలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. పల్లె వెలుగులో 35 కి.మీ దాటితే రూ.1 పెరగ్గా, సిటీ బస్సు టికెట్లు కూడా రూ.1కి తక్కువ లేకుండా పెరగబోతున్నాయ్. ప్రయాణికుల నుంచి బస్టాండ్లు, కాంప్లెక్సుల్లో అభివృద్ధి చార్జీల పేరిట ప్రస్తుతం వసూలు చేస్తున్న సెస్ రూ.1 తోపాటు టోల్గేట్ల వసూల్లో మార్పేమీ లేదని డిప్యూటీ సీటీఎం (రూరల్) పబ్బా జీవన్ ప్రసాద్ తెలిపారు. స్టేజీల పరిస్థితి ఇదీ : 14 కి.మీల పరిధిలో ఏడు స్టేజీల వరకు రూ.1 పెరగనుంది. 14 కి.మీ నుంచి 40 కి.మీ వరకు రూ.2 పెంచనున్నారు. సిటీ మెట్రోపై ప్రతి స్టేజీకి రూ.1 వడ్డన పడనుంది. కనీస టికెట్ రూ.6 నుంచి రూ.7కి పెరగనుంది. సిటీ పరిధిలోని తొమ్మిది డిపోల పరిధిలో సుమారు 400 సర్వీసులున్నాయి. బస్‌పాస్‌లపైనా భారం పడనుంది. విద్యార్థుల పాస్‌లపై దృష్టి సారించినప్పటికీ ఆర్డినరీ పాస్ తీసుకుని ఎక్స్‌ప్రెస్/మెట్రో బస్సులెక్కేవారిపై (కాంబి టికెట్) ఇప్పుడున్న రూ.5 అదనపు ధర రూ.10కి పెరగనుంది. జనరల్ బస్ టికెట్ (జీబీటీ) పాస్ రూ.650ది ఇకపై రూ.700కానుంది. మెట్రో పాస్ రూ.750ది ఇకపై రూ.800 కానుంది. సిటీ బసుల్లో పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ గతంలో రూ.60 ఉండగా ఇప్పుడది రూ.70 అవుతుంది. ఎన్జీవో పాస్‌లు గతంలో రూ.220 ఉండగా ఇప్పుడు రూ.235, మెట్రోల్లో రూ.320ది కాస్త రూ. 335కానుంది. ఇదీ పరిస్థితి పల్లెవెలుగుకు 35కి.మీ వరకు రూపాయి పెరగ్గా 36నుంచి 55కి.మీ వరకు రూ.2పెరిగింది. 56నుంచి 75కి.మీ వరకు రూ.3పెరిగింది. 76నుంచి 115కి.మీ వరకు రూ.4పెరిగింది. ఎక్స్ప్రెస్ల్లో కనీస టికెట్ ధర రూ.10, డీలక్స్‌లో రూ.15, ఇంద్రలో రూ.25, గరుడ రూ.25, గరుడ ప్లస్‌లో రూ.25లో ఎలాంటి మార్పులేదు. ఎక్స్‌ప్రెస్‌లో ఇదివరకు ఉన్న రూ.72టిక్కెట్ ధర ఇక నుంచి రూ.79కి పెరగనుంది. డీలక్స్‌లో రూ.80 ధర 89వరకు పెరగనుంది. సూపర్‌లగ్జరీలో రూ.94 ఉన్న ధర ఇకపై రూ.105కానుంది. ఇంద్రలో రూ.120 ధర రూ.132కానుంది. గరుడ రూ.140ది రూ.155కానుంది. గరుడ ప్లస్ రూ.150ది రూ.165 కానుంది. -
ప్రయాణికుల వెన్ను విరిచే పధకానికి ఆర్టీసీ శ్రీకారం
-
ఇక బస్సెక్కలేం!
* కనీసం10 శాతం చార్జీల పెంపు.. ఆర్టీసీ నిర్ణయం * ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ.. * నాలుగేళ్లలో నాలుగోసారి బాదుడు! * గత మూడేళ్లలో 50 శాతానికిపైగా పెరిగిన చార్జీలు * ప్రతిపాదిత పెంపు భారం ఏటా రూ. 500 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సెక్కితే ఇక బాదుడే.. నష్టాలను సాకుగా చూపుతూ చార్జీల మోతకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. కనీసం 10 శాతం చార్జీల హెచ్చింపునకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. చార్జీల పెంపుపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రతిపాదిత పెంపు భారం ఏటా కనీసం రూ. 500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చార్జీల పెంపులో గ్రామీణ రూట్లలో తిరిగే పల్లె వెలుగు బస్సులనూ మినహారుుంచలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఆర్టీసీ చార్జీలు ఏనాడూ పెరగలేదు. ఆయన అధికారం చేపట్టేనాటికి ఉన్న చార్జీలే ఆయన మరణించే నాటికీ అమల్లో ఉన్నాయి. ఆయన వుృతి తర్వాత 50 శాతానికిపైగా ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. తాజా చార్జీలు అమల్లోకి వస్తే.. మొత్తం పెంపు 60శాతం దాటనుంది. 2009 సెప్టెం బర్ 1 తర్వాత నాలుగేళ్లలో మూడు సార్లు ఛార్జీలు పెంచారు. 2010 జనవరి 9న 28.41 శాతం, 2001 జూలై 17న 10 శాతం, 2012 సెప్టెంబర్ 24న 12.5 శాతం చొప్పున ఛార్జీలు పెంచారు. 2010లో రూ. 480 కోట్లు, 2011లో రూ. 538 కోట్లు, 2012లో రూ. 362 కోట్లు.. ఛార్జీల పెంపు భారాన్ని ప్రయాణీకులపై మోపారు. ఛార్జీలు పెరిగి ఏడాది వుుగియుగానే.. మళ్లీ వడ్డన ప్రతిపాదనను ఆర్టీసీ సిద్ధం చేసింది. సరాసరిన ఈ దఫా ఛార్జీల వడ్డన 10 శాతానికి పైగా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రతి కిలోమీటరుకు ప్రయాణానికి పల్లెవెలుగు బస్సుల్లో 55 పైసలు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 72 పైసలు, డీలక్స్ బస్సుల్లో 80 పైసలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో 94 పైసలు, ఇంద్రలో రూ. 1.20, గరుడలో రూ.1.40, గరుడప్లస్‌లో రూ. 1.50, వెన్నెల బస్సుల్లో రూ. 2.30 వసూలు చేస్తున్నారు. కనీస ఛార్జీ పల్లెవెలుగు బస్సుల్లో రూ. 5, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 10, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 15, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ. 25, వెన్నెల బస్సుల్లో రూ. 50.. కనీస ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతిపాదిత పెంపు అమలయితే.. కనీస ఛార్జీలు పల్లెవెలుగులో రూ. 7, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 15, డీలక్స్, సూపర్ లగ్జరీలలో రూ. 20కు పెరగనున్నారుు. సామాన్యుడి మీదే అధిక భారం తాజా వడ్డింపు ప్రతిపాదనలు సామాన్యుల జేబు పిండటడమే లక్ష్యంగా ఆర్టీసీ రూపొందించింది. గ్రామీణులు ప్రయాణించే పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సులు, సిటీ బస్సుల ఛార్జీల పెంపు ద్వారా అధిక ఆదాయ ఆర్జనకు ఆర్టీసీ సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 1.40 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయూణిస్తుండగా.. వారిలో గ్రామీణ సర్వీసుల ప్రయాణికులే ఎక్కువ. నిత్యం సగటున 75 లక్షల మంది.. అంటే సగానికి పైగా ప్రయాణికులు పల్లెవెలుగు, సిటీ బస్సులను వినియోగించుకుంటున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో.. కిలోమీటరుకు కనీసం 5 పైసల చొప్పున వడ్డించడమేగాకుండా... కనీస చార్జీని రూ.7కు పెంచనుంది. ఎక్కువ ప్రయాణీకులను గమ్యస్థానాలను చేర్చడంలో పల్లెవెలుగు తర్వాతి స్థానం సిటీ ఆర్డినరీ బస్సుల దే. సుమారు 20.41శాతం మంది ఈ బస్సులలో ప్రయూణిస్తున్నా రు. ఈ క్రమంలో ఈ బస్సుల చార్జీలను భారీగా పెంచనున్నారు. టికెట్ కనీస ధరను రూ.7కు పెంచడం ద్వారా ‘సిటీ’ ప్రయాణాన్ని కూడా ఆర్టీసీ భారంగా మార్చనుంది. -
వైఎస్ ఉంటే ఇలా జరిగేదా : అంబటి రాంబాబు
విభజనపై ప్రతి ఒక్కరి మదిలోనూ ఇదే ప్రశ్న చంద్రబాబు యాత్ర ఉద్యమంపై నీళ్లు చల్లేందుకే సీమాంధ్రులకు రూ. నాలుగైదు లక్షల కోట్లకు ఖరీదు కట్టిన చంద్రబాబు అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు వైఎస్ 4వ వర్ధంతిని ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను చూసి ‘వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఇలా ఉండేదా!’ అని రాష్ట్రంలో మేధావులు, ప్రజలు భావిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ కనుక జీవించి ఉంటే సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా చీల్చే ప్రయత్నం చేసి ఉండేవారా? అనే ప్రశ్నకు అన్ని వైపుల నుంచీ ‘లేదు’ అనే సమాధానమే వస్తుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ పరిపాలించిన 5 ఏళ్ల 3 నెలల కాలంలో రాష్ట్రాన్ని విభజించాలనే యత్నం జరగలేదని, విభజించాలనే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతూ వచ్చిందే తప్ప పెరిగిన సందర్భమే లేదన్నారు. అంతేకాదు, ధరలు పెరిగినపుడు, ఆర్టీసీ చార్జీలు పెరిగినపుడు, విద్యుత్ చార్జీలు పెరిగినపుడు, రాష్ట్రం అతలాకుతలం అవుతున్నపుడు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నపుడు ప్రతి ఒక్కరికీ వైఎస్ గుర్తుకు వస్తున్నారని, ఆయన ఉంటే ఇలా జరిగేదా అనే గుండెలు పిండేసిన బాధ కలుగుతోందని అన్నారు. చివరకు ఢిల్లీలో విజయమ్మ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం కలిసినపుడు సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వైఎస్ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని గుర్తు చేసుకున్నారని ఆయన అన్నారు. అదో పీడకల.. వైఎస్ మర ణం అందరికీ ఒక పీడకల అని, సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా, వాడవాడలా ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అంబటి పిలుపునిచ్చారు. విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. పైనుంచి చూస్తున్న వైఎస్‌ను.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్ది ఆశీర్వదించాలని కోరుతూ ఆయన విగ్రహాలకు పార్టీ శ్రేణులు వినతి పత్రాలు కూడా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానాలు, అన్నదానం, సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. యాత్ర ఎందుకో చెప్పండి చంద్రబాబూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రను దేని కోసం చేస్తున్నారో చెప్పి ఆ తరువాతనే బయలుదేరాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు విభజనను అడ్డుకోవడానికి తొలి నుంచీ పోరాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. బాబు వాలకం చూస్తుంటే.. సమైక్యాంధ్ర ఉద్యమంపై నీళ్లు చల్లడానికే వెళుతున్నారని అనిపిస్తోందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత విలేకరుల సమావేశంలో బాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. నాలుగైదు లక్షల కోట్ల రూపాయలిస్తే రాజధానిని నిర్మించుకుంటామని చెప్పడం అంటే, దానర్థం ఏమిటి? ఈ అడ్డగోలు విభజనను బాబు అంగీకరిస్తున్నట్లు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. సీమాంధ్రులను నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ఖరీదు కట్టిన బాబు అక్కడ ప్రవేశించడానికి వీల్లేదని అంబటి అన్నారు. 2న తిరుపతిలో షర్మిల సభ సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగానే ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీ నుంచి చేపట్టబోయే బస్సు యాత్రను విజయవంతం చేయాలని అంబటి కోరారు. సీమాంధ్రలోని 13 జిల్లాలను నాలుగైదు వారాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనివివరించారు. ఆ రోజున ఉదయం షర్మిల ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో షర్మిలతో పాటుగా పలువురు పార్టీ నేతలు ప్రసంగిస్తారని అంబటి తెలిపారు. షర్మిల బస్సు యాత్ర ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. -
నేటి నుంచే ఆర్టీసి బాదుడు