ఆర్టీసీ చార్జీల పెంపుదలపై ప్రజలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య, పేద ప్రజల రథంగా భావించే ఆర్టీసీ బస్సుల చార్జీలను పెంచడం భా వ్యం కాదని స్పష్టం చేశారు.
సర్కారు తీరు సమంజసంగా లేదు
సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు
ఇప్పటికే నిత్యావసరాలు మండుతున్నాయి
కార్మిక సంఘాలు, నేతలు, {పయాణికుల మండిపాటు
కంఠేశ్వర్, న్యూస్‌లైన్: ఆర్‌టీసీ చార్జీల పెంపుదలపై ప్రజలు, కార్మిక సంఘాలు, రాజకీ య పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య, పేద ప్రజల రథంగా భావించే ఆర్ టీసీ బస్సుల చార్జీలను పెంచడం భా వ్యం కాదని స్పష్టం చేశారు. ఇది ప్రజా రవాణా వ్యవస్థకు తీరని విఘా తం కలిగిస్తుందన్నారు. ఇప్పటికే చుక్కలనంటిన కూరగాయలు, నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై చార్జీల మోత మోగించ డం సమంజసం కాదని పేర్కొన్నారు. సీమాంధ్రలో ఆర్‌టీసీ సమ్మె చేసి నష్టపోయినందునే తెలంగాణ ప్రజలపై ఆర్‌టీసీ చార్జిల భారం మోపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు తీరు సరిగా లేదని మండిపడ్డారు.నిజామాబాద్ రీజియన్‌లో ఆరు డిపోలు, 670 బస్సులు ఉన్నాయి. ఇవి ప్రతి రోజు రెండున్నర లక్షల కిలోమీటర్లు తిరుగుతూ రూ. 60 లక్షల ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పెరిగిన చార్జీలతో ఆర్‌టీసీకి రోజూ అదనంగా ఐదు లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది. పెరిగిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
కుంభకోణాలే కారణం
బస్సు చార్జీలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆర్‌టీసీ ప్రయాణానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. బస్‌పాస్‌ల రేట్లు సైతం పెరగడంతో పేద విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడం ఇబ్బం దిగా మారుతుంది. యూపీఏ ప్రభుత్వం కుంభకోణా ల్లో కూరుకుపోయి డీజిల్, పెట్రోల్ పెంచుతుండడంతో పరోక్షంగా ఆర్‌టీసీపై భారం పడుతోంది. కాంగ్రెస్ సర్కారు ఖజానాను నింపుకోవడానికి అడ్డదారులు వెతుకుతోంది. చార్జీలను వెనుకకు తీసుకోకపోతే ఆం దోళనలు చేస్తాం.
-పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ఏడాదికి నాలుగుసార్లు పెంచుతున్నరు
పేద ప్రజలు ప్ర యాణించే ఆర్‌టీ సీ చార్జీలు పెంచ డం సరైందికాదు. ప్రభుత్వం ఏడాదికి నాలుగు సార్లు చార్జీలు పెంచి సామాన్యుడిపై భారం మోపుతోంది. నష్టాల సాకుతో చార్జీలు పెంచడం సరైంది కాదు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
-బస్వ లక్ష్మీనర్సయ్య, టీఆర్‌ఎస్
నిజామాబాద్ అర్బన్ ఇన్‌చార్జి
సర్కారు తీరు సరిగా లేదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పటికే డీజిల్,పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెంచేశారు. ఇప్పుడు ఆర్‌టీసీ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. -ఎ.నర్సారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ
సామాన్యుడిపైనే భారం
సామాన్యుడి రవాణా సదుపాయం అయిన ఆర్‌టీసీ చార్జీలు పెంచడం సరైంది కాదు. పేద, మధ్యతరగతి ప్రజలపై పెరిగిన చార్జీలు మరింత భారాన్ని పెంచుతాయి. వెంటనే ప్రభుత్వం పెంచిన చార్జీలను వెనుకకు తీసుకోవాలి.
-శ్రీకాంత్, లెక్చరర్