సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ పోటీగా ఆర్టీసీ దోచుకుంటోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఆర్టీసీ చార్జీలు ప్రైవేటు ట్రావెల్స్ తో పోటీ పడుతున్నాయని అన్నారు. ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులపై భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.