ఆర్టీసీ చార్జీలు పెంచటం అన్యాయం
వైఎస్సార్ సీపీ ర్యాలీ, ధర్నా
వినుకొండ రూరల్: డీజిల్ ధరలు తగ్గినా ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచటం చంద్రబాబు నైజానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మో హన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడి ఆధ్వర్యంలో సోమవారం పురవీధుల్లో భారీర్యాలీ నిర్వహిం చి బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భం గా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిత్యవసర ధరలు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇక బతికేది ఎట్లా అంటూ ప్రశ్నించారు. దీనికితోడు రోకటి పోటులా ఆర్టీసీ చార్జీలు పెంచటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. బాబు అధికారంలోకి వచ్చాక, డ్యామ్‌ల్లో నీరులేకుండా పోయిందని, దీంతో రైతులు పంటలు పండక అల్లాడిపో తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజలు బతుకు భారమై అల్లాడిపోతుంటే నీరో చక్రవర్తిలా సీఎం చంద్రబాబు రాజధాని పేరుతో గోప్పలు పోతూ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి దించుతున్నాడన్నారు. పట్టణ, మండల కన్వీనర్లు నరాలశెట్టి శ్రీను, చింతా ఆదిరెడ్డి, చిన్నబ్బాయి, నాయకులు చీరపురెడ్డి కోటిరెడ్డి, దండు చెన్నయ్య, ఎం. గోవింద నాయక్, గంధం బాలిరెడ్డి, కృష్ణారెడ్డి, పీఎస్ ఖాన్, ఇమాంషా, పఠాన్ కరిముల్లా, సానాల పుల్లయ్య, మాటా సత్యం, చికెన్ బాబు, బాషా, మున్నా, రామయ్య, మదార్ వలి, కాల్వ రవిరాజు, వెంకటరెడ్డి, ఏడుకొండలు, కొమిరిశెట్టి రామారావు, పారా వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, రమణారెడ్డి, వెంకిరెడ్డి, రాంబాబు, రఫీ, గౌస్ బాషా, డి. శ్రీను, వీరాంజనేయ రెడ్డి, బ్రహ్మయ్య, ప్రసాద్ సింగ్, అంజిరెడ్డి, పసుపులేటి నరసింహరావు, తోట ఆంజనేయులు, బాలు జాన్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.