పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి పేదల పై భారం వేసే విధంగా చార్జీలను ఎందుకు పెంచారో చెప్పాలని వామపక్షాల నయాకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఎల్బీ నగర్ రింగ్‌రోడ్డు వద్ద విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలు జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలలో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం నిర్వహించారు.
సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
Published Fri, Jun 24 2016 12:38 PM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement