
ఆర్టీసీ చార్జీలు పెంచొద్దు: పద్మ
హైదరాబాద్: ఫిట్ మెంట్ భారం పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచొద్దని ఏపీ ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆర్టీసీ చార్జీలు పెంచితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
తెలుగు ప్రభుత్వాలు ముందే స్పందించివుంటే సామాన్య ప్రజలకు ఈ సమస్యలొచ్చేవా అని ప్రశ్నించారు. పోరాడి విజయం సాధించినందుకు ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపారు. సమ్మెకు మద్దతు తెలిపామని గుర్తు చేశారు. కార్మిక లోకానికి వైఎస్సార్ సీపీ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తుందని పునరుద్ఘాటించారు.