
సాక్షి, తాడేపల్లి: స్వలాభం కోసమే వైఎస్ జగన్‌పై వాసిరెడ్డి పద్మ విమర్శలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. జగనన్న కార్యకర్తలను సరిగా చూసుకోకపోతే మహిళా చైర్మన్ పదవి ఆమెకు ఎలా వచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అగ్రస్థానం కల్పించారన్నారు. వ్యక్తిగత స్వార్థంతో వాసిరెడ్డి పద్మ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
‘‘పదవులు అనుభవించి వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఇలా మాట్లాడటం పద్దతి కాదు. పదవిలో ఉన్నప్పుడే ఆమె రాజీనామా చేయవలసింది. వాసిరెడ్డి పద్మకి క్యాబినెట్ హోదాతో కూడిన మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. దాడుల్లో చనిపోయిన వారికి పది లక్షలు అందజేస్తున్నాం. పదవులు పూర్తిగా అనుభవించి నైతిక విలువలు గురించి వాసిరెడ్డి పద్మ మాట్లాడటం సరికాదు. రాజకీయం కోసం ఆత్మవంచన చేసుకోకూడదు. వైఎస్సార్‌సీపీపై బురద చల్లడం మానుకోవాలి’’ అంటూ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్