![Vasireddy Padma Slams Chandrababu Over Taneti Vanitha Attack Incident](/styles/webp/s3/article_images/2024/05/8/Vasireddy-Padma-Slams-Chandrababu-Over-Taneti-Vanitha.jpg.webp?itok=bKsbELHI)
గుంటూరు, సాక్షి: ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్నికల సంఘం తనను ఏమీ చేయదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని నిలదీశారు వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ. నల్లజర్లలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనపై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ద్వారా పద్మ స్పందించారు.
‘‘టీడీపీ శ్రేణులు బరితెగించాయి. సాక్షాత్తూ దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడికి యత్నించాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉంది. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారు. అసలు దళితులంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ..?.
ఒక రాష్ట్ర హోంమంత్రి.. అందునా మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయటం దుర్మార్గపు విషయం. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయదని చంద్రబాబు భావిస్తున్నారా?.
.. మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కానీ, చంద్రబాబు మహిళల మీద వివక్ష చూపుతున్నారు. ఇప్పటికే ఇంటింటి పెన్షన్లు నిలిపివేయించి.. అవ్వాతాతల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో దళితులు, మహిళల మీద దాడులకు తెగపడ్డారు.
.. ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా స్పందించటం లేదంటే చంద్రబాబుకు ఎంత లెక్కలేని తనం?. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఉండీ ఏం ప్రయోజనం?. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment