సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణలో పెంచని చార్జీలంటూ ఏవీ లేవని వెఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచిన కేసీఆర్.. తాజాగా విద్యుత్ చార్జీలను పెంచారని విమర్శించారు.
50 యూనిట్లలోపు వాడుకొనే 40 లక్షల పేదవాళ్లపై పెనుభారం మోపారంటూ షర్మిల ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆ పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న మాట్లాడారు. పెంచిన చార్జీలను పార్టీ తీవ్రం గా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment