
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పది శాతం మేర ఛార్జీలను పెంచుతున్నట్లు రవాణాశాఖమంత్రి మహేందర్ రెడ్డి గురువారం ప్రకటించారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 27 నుంచి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతకు ముందు మహేందర్ రెడ్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై ముఖ్యమత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఛార్జీల పెంపు అనివార్యమైందని తెలిపారు. కాగా పెంచిన ఛార్జీలతో ఆర్టీసీకి రూ.286 కోట్లు అదనపు ఆదాయం రానుంది. పెరిగిన బస్సు ఛార్జీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- ఎక్స్ప్రెస్, ఆపై సర్వీసులకు 10శాతం ఛార్జీల పెంపు
- సిటీ సర్వీసుల్లోనూ 10 శాతం
- పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకూ ఒక రూపాయి పెంపు
- ఆపై స్టేజ్కి పల్లె వెలుగు బస్సుల్లో 2 రూపాయిలు పెంపు
- ఎక్స్ప్రెస్ ఛార్జీ కిలోమీటర్కు 79 పైసల నుంచి 87 పైసలకు పెంపు
- డీలక్స్ ఛార్జీ కి.మీ.కు 89 నుంచి 98 పైసలకు పెంపు
- సూపర్ లగ్జరీ ఛార్జీ కి.మీ.కు రూ.1.05 పైసల నుంచి రూ. 1.46 పైసలకు పెంపు
- ఇంద్ర ఛార్జీ కి.మీ.కు రూ. 1.32 పైసల నుంచి రూ. 1.46 పైసలకు పెంపు
- గరుడ ఛార్జీ కి.మీ.కు రూ. 1.55 పైసల నుంచి రూ.1.71 పైసలకు పెంపు
హైదరాబాద్-కరీంనగర్ మధ్య పెరిగిన ఛార్జీలు : ఎక్స్‌ప్రెస్ రూ. 149, రూ. 168, లగ్జరీ రూ. 199
హైదరాబాద్-నిజామాబాద్ మధ్య పెరిగిన ఛార్జీలు : ఎక్స్‌ప్రెస్ రూ. 159, డీలక్స్ రూ. 175, లగ్జరీ రూ. 207
హైదరాబాద్-వరంగల్ మధ్య పెరిగిన ఛార్జీలు: ఎక్స్‌ప్రెస్ రూ. 129, డీలక్స్ రూ. 142, లగ్జరీ రూ. 168
హైదరాబాద్-విజయవాడ మధ్య పెరిగిన ఛార్జీలు : ఎక్స్‌ప్రెస్ రూ. 235, డీలక్స్ రూ. 264, లగ్జరీ రూ. 313
హైదరాబాద్-తిరుపతి మధ్య పెరిగిన ఛార్జీలు: ఎక్స్‌ప్రెస్ రూ.495, డీలక్స్ రూ. 545, లగ్జరీ రూ. 645