సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగునున్నాయి. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు ఆపై సర్వీసులకు 30పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్‌సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment