
డీజిల్ ధర తగ్గితే.. చార్జీలు పెంచుతారా?
తెలుగుదేశం ప్రభుత్వం సామాన్యుడిపై కక్ష కట్టిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికే ధరాఘాతంతో నానా అవస్థలు పడుతున్న పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్టీసీ చార్జీలు పెంచి మరింత భారాన్ని మోపారని దుయ్యబట్టారు. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
డీజిల్‌రేట్లు తగ్గినా.. చార్జీలు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై చంద్రబాబుకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పెంచిన చార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వాన్ని వలిదిపెట్టబోమని స్పష్టం చేశారు.