సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను, డాక్టర్లను అవమాన పరిచిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు పల్లెల్లో కంటి పరీక్షల చికిత్స జరిగితే ముఖ్యమంత్రి కళ్లకు మాత్రం ఢిల్లీ డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం కంటే అవమానం ఏంటని ఆయన ప్రశ్నించారు.
నిజంగా సీఎం కళ్ల సమస్యతో ఢిల్లీ వెళ్తున్నారా? లేదా రాజకీయంగా రహస్య పర్యటన చేస్తున్నారా? అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. కంటి పరీక్షలకు ప్రపంచం మొత్తం ప్రముఖ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ దగ్గరకు వస్తే, మన సీఎం ఢిల్లీకి ఎందుకు పోయాడో జవాబు చెప్పాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ క్షమాపణ చెప్పాలి’
Published Mon, Oct 29 2018 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment