సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమరం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఇందు కోసం అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమయ్యూరుు. ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలు అడ్డు రావడంతో శాఖల వారీగా నిధుల కేటాయింపులు, సమీక్షలు జరగలేదు. ఎన్నికలు ముగిసిన దృష్ట్యా, ప్రస్తుతం సమీక్షలు, కేటాయింపులపై చర్చకు ప్రభుత్వం సిద్ధం అయింది. గురువారం నుంచి అసెంబ్లీలో శాఖల వారీగా నిధుల కేటాయింపుపై చర్చ, ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రకటనల పర్వం సాగనుంది. ఇందు కోసం అసెంబ్లీ ఆవరణలో సర్వం సిద్ధం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. సచివాలయం మార్గంలో భద్రతను పెంచారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు రెడీ అయ్యాయి. లండన్ వెళ్లిన డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చెన్నైకు వచ్చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఢీ కొట్టే విధంగా అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా తమిళ జాలర్లపై దాడులు, కచ్చదీవుల వ్యవహారం, బహుళ అంతస్తు కుప్పకూలిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డీఎంకే వర్గాలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మౌళివాకం ఘటనను తమకు అనుకూలంగా మలుచుకుని, సీబీఐ విచారణకు పట్టు బట్టే విధంగా తమ గళాన్ని అసెంబ్లీలో విన్పించేందుకు డీఎంకే సిద్ధం అయింది.
ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన దృష్ట్యా, ఈసారి అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టేది అనుమానమే. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా, డీఎంకే తరహాలో వాకౌట్ల పర్వానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ సమావేశాలు వాడి వేడిగాను సాగనున్నారుు. శాఖల వారీగా చర్చలో మంత్రుల ప్రసంగాలకు ప్రాధాన్యత అధికంగా ఉండడం మాత్రం ఖాయం.
అసెంబ్లీ సమరం మరికొన్ని గంటల్లో...
Published Thu, Jul 10 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement