సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్‌లో సీఎం కలల స్వప్నం కళాభారతి ప్రస్తావనే లేదు. జాతీయ కళావేదిక రవీంద్రభారతికి రూ.2 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. భాషా సాంస్కృతిక శాఖ రూ.103 కోట్లతో ప్రతిపాదనలు పంపగా... అందులో సగమే రూ.58 కోట్లు కేటాయించింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఏటా బోనాలు, బతుకమ్మ, రాష్ట్ర అవతరణ దినోత్సవం తదితర ప్రభుత్వ వేడుకల్లో సాంస్కృతిక శాఖది ముఖ్య భూమిక. తెలంగాణ మహనీయుల పేరుతో అవార్డులు అందిస్తూ, వారి జయంతి, వర్ధంతి నిర్వహిస్తోంది. ఇవన్నీ దిగ్విజయంగా జరగాలంటే రూ.103 కోట్లు పైనే ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఈ మేరకు ప్రభుత్వానికిప్రతిపాదనలు పంపగా.. బడ్జెట్‌లో మాత్రం రూ.58 కోట్లు కేటాయించింది. కాకపోతే గతేడాదితో పోలిస్తే రూ.12కోట్లు పెంచారు. వీటిలో దాదాపు రూ.3.5 కోట్లతో మన టీవీ కార్యాలయంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నారు. సాహిత్య అకాడమీకి రూ.4 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో మళ్లీ ఎప్పటి మాదిరి వివిధ వేడుకలనిర్వహణకు ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిధులతోనేఅంతర్జాతీయ ఫెస్టివల్, థియేటర్, ఆర్ట్ ఫెస్టివల్స్, ఏప్రిల్ 1 నుంచి జూన్ 2 వరకు నిరంతర కళారాధన నిర్వహించాలనినిర్ణయించారు. ఇక సాంస్కృతిక సారథికి రూ.20 కోట్లు అవసరం కానున్నాయి. ఇవన్నీ పోను కళలను బతికించుకునేందుకు, కళాకారులకు చేయూతనిచ్చేందుకుకార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఇది ఎలా సాధ్యమని పలువురు వాపోతున్నారు.
పర్యాటకాభివృద్ధిని మరిచారు...
రాష్ట్ర ఆదాయ వనరుల్లో పర్యాటక శాఖ ఒకటి. దీనికి గుండెకాయ లాంటిదైన తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)ని ప్రభుత్వం విస్మరించింది. బడ్జెట్‌లో అరకొరగా రూ.30 కోట్లు కేటాయించింది. మరిన్ని నిధులు కేటాయించి హరిత హోటల్స్, ఇతర హేరిటేజ్ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించలేదు.
Comments
Please login to add a commentAdd a comment