బడ్జెట్‌లో బీసీలకు 50శాతం నిధులివ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం
హుస్నాబాద్ : రాష్ర్ట బడ్జెట్‌లో బీసీలకు 50శాతం నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనాభా దామాషా పద్ధతిన చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ను రూ.2వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల్లోని 70కులాల్లో ఇప్పటికీ 40 సంచారకులాలుగా అభిముక్త జాతులుగా బతుకీడుస్తున్నాయని, వీరి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. కులవృత్తుల్లోని నిపుణులకు వందశాతం రారుుతీతో రుణాలు అందజేయూలన్నారు. అంతకముందు పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి గోపీనాథ్, సంకల్ప స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వలుస సుభాష్, నాయకులు పిడిశెట్టి రాజు, నాగం కుమార్ తదితరులు పాల్గొన్నారు.