బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్ల కేటాయింపు
గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు పెంపు
మైనార్టీ సంక్షేమానికి రూ.802 కోట్లు పెంచి.. రూ.3,003 కోట్ల కేటాయింపు
కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కూడా గణనీయంగా నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్‌లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.
⇒ తెలంగాణ తాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.
⇒ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..
⇒ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్‌మెన్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..
⇒ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.
⇒ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.
⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.
⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.
⇒ ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.
సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..
శాఖ నిధులు (రూ.కోట్లలో)
ఎస్సీ సంక్షేమం 28,724.53
గిరిజన సంక్షేమం 15,123.91
బీసీ సంక్షేమం 9,200.32
మైనారిటీ సంక్షేమం 3,002.60
మహిళా, శిశు సంక్షేమం 2,736.00
కార్మిక సంక్షేమం 881.86
Comments
Please login to add a commentAdd a comment