Labor Welfare
-
వెనుకబడిన వర్గాలకు చేయూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.⇒ తెలంగాణ తాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.⇒ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..⇒ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్మెన్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..⇒ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.⇒ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.⇒ ఇక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..శాఖ నిధులు (రూ.కోట్లలో)ఎస్సీ సంక్షేమం 28,724.53గిరిజన సంక్షేమం 15,123.91బీసీ సంక్షేమం 9,200.32మైనారిటీ సంక్షేమం 3,002.60మహిళా, శిశు సంక్షేమం 2,736.00కార్మిక సంక్షేమం 881.86 -
కార్మిక సంక్షేమం... మరింత సరళీకృతం
సాక్షి, హైదరాబాద్: కార్మిక సంక్షేమ కార్యక్రమాలను కార్మిక శాఖ మరింత సరళీకృతం చేసింది. ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ మండలి, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలి ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్మికులనుద్దేశించిన పథకాల ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. ♦భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ మండలి అన్ని నిర్మాణసంస్థల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేయగా వచ్చిన నిధులతో ఆ కార్మికుల ప్రయోజనం కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం బోర్డులో 19.68 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. కార్మికులకు వివాహ బహుమతి కింద రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే, సహా యం కింద రూ.6 లక్షలు, ఆసుపత్రుల్లో చేరితే నెలకు రూ.4,500 చొప్పున 3 నెలలు సాయం చేస్తారు. ప్రసూతి ప్రయోజనం కోసం రూ.30 వేలు, సహజ మరణమైతే రూ.లక్ష, శాశ్వత వైకల్యమైతే రూ.4 లక్షలు ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోనివారికి రూ.50 వేలు, మరణించినవారి అంత్యక్రియలకు రూ.30 వేలు ఇస్తారు. ♦ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థలు, మోటారు రవాణాసంస్థల కార్మికుల పిల్లలకు తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ రూ.1,000 నుంచి రూ.2,,000 వరకు స్కాలర్షిప్లు ఇస్తోంది. ♦రాష్ట్ర అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలిని ఇటీవలే ఏర్పాటు చేశారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 35.41 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ♦రవాణా, రవాణేతర ఆటోడ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డుల కోసం ప్రమాద మరణ బీమా పథకాన్ని కార్మిక శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు. -
సంక్షేమమా..అదెక్కడ!?
సాక్షి, అమరావతి: గత నాలుగేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమాన్ని అటకెక్కించింది. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలుకాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన ఏజెన్సీల్లో ఆదివాసీల జీవితాలు దారుణంగా ఉన్నాయి. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో వారికి అందటంలేదు. విజయనగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీల పరిస్థితి దారుణంగా ఉంది. గూడేలకు కనీస వసతుల్లేవు. తాగేందుకు ఊట చెలిమల నుంచి వస్తున్న నీరే దిక్కు. గూడేలకు దూరంగా వైద్యశాలలు ఉండటం, సిబ్బంది సకాలంలో చేరుకునే పరిస్థితి లేకపోవడంతో వైద్యం అందని ద్రాక్షలా మారింది. రోడ్డు సౌకర్యాల్లేవు. రూ.400 కోట్లతో రోడ్లు వేస్తున్నామని మాత్రం ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రచారం చేసుకుంటోంది. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నిర్వీర్యమైంది. బినామీల గుప్పెట్లో ఎస్సీల ఫలాలు ఇక ఎస్సీ సంక్షేమ పథకాలు బినామీలు ఎగరేసుకుపోతున్నారు. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్ల కొనుగోలు పథకం ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఇవి ఎస్సీల పేరుతో పలువురు ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువుల వద్దకు చేరాయి. భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. రూ.200 కోట్లతో 4333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు 75శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు ప్రకటించింది. కానీ, నాలుగేళ్లలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. - ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే మొత్తం రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.800కోట్లు బకాయి ఉన్నారు. - మైనార్టీలకు రూ.500కోట్లకు మించి ఖర్చుపెట్టిన దాఖలాల్లేవు. వైఎస్సార్ హయాంలో స్వర్ణ యుగాన్ని చవిచూసిన ఆ వర్గం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. - బీసీల్లో కుల వృత్తుల వారికి ఇస్తామన్న ఆదరణ పనిముట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉంటే ఏటా రుణాలు ఇచ్చేందుకు 50వేల మందినే ఎంపిక చేస్తున్నారు. అయినా, అందులో 25వేల మందికి కూడా ఇవ్వడంలేదు. - ఆదాయ పరిమితి పెట్టడంవల్ల చాలా కుటుంబాల వారు ‘పెళ్లి కానుక’ పథకానికి దూరమవుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన వధూవరులు 3,034 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క జంటకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు. - అలాగే, గిరిజనులకు ఉద్దేశించిన గిరిపుత్రిక కళ్యాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్క కొత్త జంటకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం కూడా అలంకారప్రాయంగా మారింది. ఒక్కరికీ ఈ పథకం లబ్ధిచేకూర్చలేదు. అలాగే, బీసీలకు ప్రభుత్వం కొత్తగా రూ.35వేలు ఇస్తామని ప్రకటించింది. వీరి విషయంలోనూ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. కులాంతర వివాహాలు చేసుకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం మెలిక పెట్టింది. - సంప్రదాయ చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు. - మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి గత ఏడాది రూ.60 కోట్లు, ఈ సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించారు. ఒక్కరికి కూడా సాయం అందించలేదు. స్టడీ సర్కిళ్లు నిర్వీర్యం ఇదిలా ఉంటే.. సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీ సర్కిళ్లు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రభుత్వం వాటి గురించి ఆలోచించడం మానేసింది. దీంతో.. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ కోచింగ్‌కు దూరమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఉన్నా వాటిల్లో ఫ్యాకల్టీలు లేరు. మొక్కుబడిగా ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ ఈ పథకం కింద విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థి యూనివర్సిటీలో చేరి అడ్మిషన్ వివరాలు పంపిస్తే మొదటి విడతగా రూ.5లక్షలు విడుదల చేస్తారు. సంవత్సరం ముగిసే సమయంలో మరో రూ.5లక్షలు ఇస్తారు. కానీ, విదేశాల్లో పీజీ చదవాలంటే కనీసం రూ.30 లక్షలు ఖర్చవుతాయి. బ్యాంకుల నుంచి రూ.10 లక్షలు రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఉన్నతి లేని ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్‌లో ఉచిత కోచింగ్‌కు సంబంధించి గత ఏడాది బీసీ, ఈబీసీలు కలిపి 1,240 మందికి, కాపులు 700 మందికి, ఎస్సీలు 700 మంది, ఎస్టీలు 300 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపించారు. ఒక్క బీసీలే సుమారు 50వేల మంది వరకు పరీక్ష రాశారు. మెరిట్ ప్రకారం ఎక్కువమందికి కోచింగ్ ఇప్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, శిక్షణ పొందిన వారికి నేటికి కూడా స్టైఫండ్ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో హాస్టళ్ల నిర్వాహకులు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. అక్కరకు రాని ‘చంద్రన్న బీమా’ ఇక ‘చంద్రన్న బీమా’ పథకం ద్వారా పేదలకు సకాలంలో సాయం అందటంలేదు. ఈ పథకానికి కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి సుమారు రూ.600కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి బీమా సొమ్ములో సగం కేంద్ర ప్రభుత్వ వాటా కాగా, మిగిలిన సగం రాష్ట్రానిది. కానీ, బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. తన వాటాను కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తీసుకుని చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, చిన్న పిల్లలకు తప్ప పెద్ద పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడంలేదు. అలాగే, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు రూ.2,000లు పింఛన్ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అదీ ఇవ్వడంలేదు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం రాష్ట్రంలో ఐదేళ్లలో 13 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా పథకం మాత్రం ముందుకు సాగడంలేదు. బిల్లులు చెల్లించకపోవడమే కారణం. మరోవైపు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. 23వేల ఇళ్లు నిర్మించామని రాష్ట్రం అంటే.. కాదు, 7,749మాత్రమే అని కేంద్రం అంటోంది. దీంతో కేంద్రం బిల్లులు చెల్లించడంలేదు. అలాగే, మరో 20.97 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్రం మరో ఉత్తరం రాసింది. దీంతో.. మొదట 23 వేల ఇళ్లకు లెక్కలు చెప్పండి అంటూ కేంద్రం ప్రత్యుత్తరం ఇవ్వడంతో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఇక అర్బన్ హౌసింగ్ పథకం కింద దాదాపు 6 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 4,934 ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు. 2019 నాటికి 5 లక్షల గృహాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా ఆ మేరకు నిర్మాణాలు మాత్రం చేపట్టడంలేదు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఇళ్ల కోసం 12 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా వీరి గురించి పట్టించుకునే నాథుడేలేడు. చేనేత, మత్స్య కారులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని.. మధ్య తరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఇప్పటివరకు అతీగతీలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత దానిని రూ.1.50 లక్షలకు కుదించి పేదలను మోసం చేశారు. ఇలా హామీల మీద హామీలు ఇవ్వడం మినహా పేదలకు మాత్రం సొంతింటి కల నెరవేర్చలేదు. సంక్షేమ హాస్టళ్ల రద్దు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ హాస్టళ్ల రద్దు పర్వం మొదలైంది. మెరుగైన విద్యను అందించేందుకు హాస్టళ్లను రద్దుచేసి ఆ స్థానాల్లో గురుకుల విద్యాలయాలు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించి పేదలను మోసం చేసింది. - మొత్తం ప్రీమెట్రిక్ కింద ఎస్సీల హాస్టళ్లు 1,450కు గాను ఇప్పటివరకు 648 రద్దయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 27,917 మంది. - అలాగే, మొత్తం 197 ఎస్టీ హాస్టళ్లకుగాను అన్నీ రద్దయ్యాయి. వీటిలో 16,250మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. - బీసీ హాస్టళ్లదీ దాదాపు ఇదే పరిస్థితి. మొత్తం 897 హాస్టళ్లకుగాను 201 రద్దయ్యాయి. వీటిలో 13,000మంది విద్యనభ్యసిస్తున్నారు. - ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఒక్క గురుకుల పాఠశాల కూడా నిర్మించలేదు. రద్దుచేసిన ఎస్టీ హాస్టళ్ల స్థానంలో 80 హాస్టల్ కన్వర్టెడ్ గురుకుల పాఠశాలలు, ఏజెన్సీలో 30 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఇవన్నీ రద్దుచేసిన పాత భవనాల్లోనే కొనసాగుతుండగా అక్కడి పరిస్థితులు పాత హాస్టళ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. - కేంద్ర ప్రభుత్వం 14 ఏకల్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి భవన నిర్మాణాలకు నిధులిచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరడంతో ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కమీషన్ల విషయంలో తేడా రావడంతో ఈ భవనాలు ఆగిపోయినట్లు సమాచారం. -
కార్మిక సంక్షేమమే లక్ష్యం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమానికి, సామాజిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘వికాసపర్వం’లో భాగంగా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ మజ్దూర్ మోర్చా సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గతంలో చిన్న వ్యాపారులకు అప్పులు పుట్టక ఇబ్బం దులు పడ్డారని, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్ర బ్యాంకు ద్వారా వారికి రుణాలు ఇస్తోందన్నారు. వీటిని అట్టడుగు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారంచేయాలని లక్ష్మణ్ కోరారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు టి.కృష్ణమూర్తి, నేతలు ధర్మారెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
మేడే వేడుకల్లో విజేతలు వీరే..
ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : మేడే సందర్భంగా కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల పోటీల విజేతలకు, ఉత్తమ పరిశ్రమలకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర కార్మికశాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు బహుమతులు అందజేశారు. పలువురు కార్మిక నాయకులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. విజేతలు వీరే.. వాలీబాల్: విశాఖ స్టీల్ ప్లాంట్ (విన్నర్), సుందరం మోటార్స్, విజయవాడ(రన్నర్). బాల్ బాడ్మింటన్ : విశాఖ స్టీల్ ప్లాంట్(విన్నర్), ఏపీ పేపర్ మిల్లు, రాజమండ్రి(రన్నర్). కబడ్డీ: విశాఖ స్టీల్ ప్లాంట్(విన్నర్), సుజల పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాల (రన్నర్) టెన్నీకాయిట్(మహిళల డబుల్స్) : శ్రీఅనంతలక్ష్మి స్పిన్నింగ్ ప్రైవేట్లిమిటెడ్, మర్రిపాలెం, గుంటూరు (విన్నర్). 100 మీటర్ల పరుగుపందెం(పురుషులు): వి.వెంకటేష్, శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ (ప్రథమ), నీరుజోగి శేఖర్, శ్రీవిజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, విశాఖపట్నం(ద్వితీయ). 50మీటర్ల పరుగు పందెం(మహిళలు): టి.హృదయ, శ్రీఅనంతలక్ష్మి టెక్స్టైల్స్ స్పిన్నింగ్‌మిల్స్ లిమిటెడ్, మర్రిపాలెం, గుంటూరుజిల్లా (ప్రథమ) డిస్కస్‌త్రో : సుంకర వీఎన్ స్వామి, జీఎస్కే లిమిటెడ్, ధవళేశ్వరం(ప్రథమ), కె.శ్రీనివాస్,కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విశాఖ(ద్వితీయ). షాట్‌పుట్ : నరేష్, వైభవ్ జ్యూయలర్స్, విశాఖ (ప్రథమ), దాసు, సుజల పైప్స్, నంద్యాల, కర్నూలు జిల్లా (ద్వితీయ). లాంగ్‌జంప్: పి.సాయిరామ్, మద్దిలక్ష్మయ్యఅండ్ కో, గణపవరం, గుంటూరు జిల్లా(ప్రథమ), వెంకటేష్, శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ (ద్వితీయ) జావలిన్‌త్రో : జె.మోహన్‌కుమార్, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్(ప్రథమ), వి.సత్యశివ, ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్స్, రాజమండ్రి(ద్వితీయ) కల్చరల్ ఈవెంట్స్ పాటల పోటీ: టి.రామకృష్ణ, ఆర్టీసీ, ఏలూరు(ప్రథమ). సిహెచ్.వీరయ్య, కేసీపీ లిమిటెడ్, మాచర్ల, గుంటూరు జిల్లా(ద్వితీయ). ఫ్యాన్సీ డ్రస్ : భవాని, టీబీజడ్ లిమిటెడ్, విజయవాడ(ప్రథమ),కె.అహ్మద్, ఆర్టీసీ, కర్నూలు. మోనోయాక్షన్ : కె.సైదారావు, కేసీపీ లిమిటెడ్, మాచర్ల,గుంటూరు(ప్రథమ),బీకేఎన్ఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్టీటీపీఎస్ ,ఇబ్రహీంపట్నం(ద్వితీయ) ప్లేలెట్ : ఆర్టీసీ,సత్యవీడు డిపో(ప్రథమ). ఉత్తమ పరిశ్రమలు ఇవే.. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ (బోగసముద్రంగ్రామం, తాడిపర్తి మండలం, అనంతపురం జిల్లా), కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కాకినాడ), నాగార్జున అగ్రికమ్ లిమిటెడ్ (ఈతకోట, రావులపాలెం మండలం), నాగార్జునఫెర్టిలైజర్స్ అండ్‌కెమికల్స్ లిమిటెడ్ (కాకినాడ), శ్రీసర్వారాయసుగర్స్ లిమిటెడ్, బాట్లింగ్యూనిట్ (కేశవరం, మండపేట రూరల్ మండలం) శ్రీసర్వారాయసుగర్స్ లిమిటెడ్(వేమగిరి, కడియం మండలం), శ్రీమద్ది లక్ష్మయ్య అండ్ కో లిమిటెడ్ (గణపవరం, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా), కేసీపీ లిమిటెడ్ (మాచర్ల, గుంటూరు జిల్లా), భారతి సోప్ వర్క్స్, (గోరంట్ల, గుంటూరు జిల్లా), శ్రీఅనంతలక్ష్మి స్పిన్నింగ్మిల్స్ప్రైవేట్ లిమిటెడ్ (మర్రిపాలెం గ్రామం, యడ్లపాడు మండలం, గుంటూరుజిల్లా), కేసీపీ సుగర్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ (లక్ష్మీపురం, చల్లపల్లిమండలం, కృష్ణాజిల్లా), కేసీపీ సుగర్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఉయ్యూరు, కృష్ణాజిల్లా), ఐటీసీ లిమిటెడ్ (చీరాల, ప్రకాశం జిల్లా), కృష్ణాపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (ముతుకూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా), భారతీయ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా), దివిస్ లాబోరేటరీస్ లిమిటెడ్, యూనిట్-2 (చిప్పాడ, బీమునిపట్నం, విశాఖపట్నం.), ఎస్సార్స్టీల్ ఇండియా లిమిటెడ్ (విశాఖపట్నం), ఎంఎస్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (మల్కాపురం, విశాఖపట్నం), టోయోటోసు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, (విశాఖపట్నం). -
కార్మిక సంక్షేమానికి పాటుపడాలి : శ్రీధర్‌బాబు
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కార్మికులు ఎంతో కష్టపడి లాభాల్లోకి తీసుకువచ్చారు.. వారి శ్రేయ స్సు, సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. శనివారం ఆర్జీ-1 సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఐఎన్టీయూసీ అనుబం ధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ 40వ మహా సభలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గని కార్మికులకు గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆర్జించిన లాభాల్లో 25 శాతం వాటా ఇప్పించడానికి త్వరలో సీఎంను కలిసి అభ్యర్థించనున్నామని చెప్పారు. సింగరేణి షేప్ నిధులతో నిర్మించిన మంథని జేఎన్టీ యూ ఇంజినీరింగ్ కళాశాలలో గని కార్మికుల పిల్లలకు ప్రస్తుతం 5శాతం సీట్లు కేటాయిస్తున్నారని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10 శాతం సీట్లు కేటాయిస్తారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో రాబోయే రాష్ట్రంలో సింగరేణి ఎలా ఉండాలనే విషయాలపై ఐఎన్టీయూసీ లోతైన అధ్యయనం చేయాలని, అందులో బొగ్గు ఉత్పత్తికి అవకాశాలు, ఎక్కువ మందికి ఉపాధి లభించేలా భూగర్భ గనుల ఏర్పాటు, వారసత్వ ఉద్యోగాల కల్పన, డిస్మిస్డ్ కార్మికులందరికి తిరిగి ఉద్యోగాలిప్పించడం తదితర అంశాలు పొందుపర్చాలని సూచించారు. ప్రతీ కార్మికుడు, వారి కుటుంబ సభ్యులు ఐఎన్టీయూసీ తద్వారా కాంగ్రెస్ పార్టీని నమ్మే విధం గా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నమ్మకంతో గెలిపిస్తే నట్టేటముంచారు : వెంకట్రావు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంతో నమ్మకంతో తెలంగా ణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపిస్తే యూనియన్ నాయకులు అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు తో సమస్యలను గాలికొదిలేసి కార్మికులను నట్టేట ముం చారని సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్‌సీఎల్‌యూ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.వెంకట్రా వు విమర్శించారు. టీబీజీకేఎస్ వైఖరితో ఐఎన్టీయూ సీ ఇతర ప్రాతినిధ్య సంఘాలను కలుపుకుని సింగరేణి అధికారుల వద్దకు వెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరినట్టు చెప్పారు. అక్టోబర్ మొదటి వారంలో మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కోల్‌బెల్ట్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను కలుపుకుని సీఎం వద్దకు వెళ్లి కార్మికులకు 25 శాతం వాటా చెల్లించాలని కోరనున్నామని తెలిపారు. దీపావళి పండుగ సందర్భం గా చెల్లించే ప్రొడక్టివిటీ లింక్డ్ రివార్డు(పీఎల్ఆర్) బోనస్ గతంలో రూ.26వేలు చెల్లించగా దానిని రూ.40వేలకు ఇప్పించేలా జేబీసీసీఐ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం తమ యూనియన్ పోరాడుతుందని స్పష్టం చేశారు. సభలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సింగరేణి పరిధిలోని నాలుగు జిల్లాల యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.