గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కార్మికులు ఎంతో కష్టపడి లాభాల్లోకి తీసుకువచ్చారు.. వారి శ్రేయ స్సు, సంక్షేమం కోసం ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. శనివారం ఆర్జీ-1 సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఐఎన్‌టీయూసీ అనుబం ధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ 40వ మహా సభలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గని కార్మికులకు గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆర్జించిన లాభాల్లో 25 శాతం వాటా ఇప్పించడానికి త్వరలో సీఎంను కలిసి అభ్యర్థించనున్నామని చెప్పారు.
సింగరేణి షేప్ నిధులతో నిర్మించిన మంథని జేఎన్‌టీ యూ ఇంజినీరింగ్ కళాశాలలో గని కార్మికుల పిల్లలకు ప్రస్తుతం 5శాతం సీట్లు కేటాయిస్తున్నారని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10 శాతం సీట్లు కేటాయిస్తారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో రాబోయే రాష్ట్రంలో సింగరేణి ఎలా ఉండాలనే విషయాలపై ఐఎన్‌టీయూసీ లోతైన అధ్యయనం చేయాలని, అందులో బొగ్గు ఉత్పత్తికి అవకాశాలు, ఎక్కువ మందికి ఉపాధి లభించేలా భూగర్భ గనుల ఏర్పాటు, వారసత్వ ఉద్యోగాల కల్పన, డిస్మిస్డ్ కార్మికులందరికి తిరిగి ఉద్యోగాలిప్పించడం తదితర అంశాలు పొందుపర్చాలని సూచించారు. ప్రతీ కార్మికుడు, వారి కుటుంబ సభ్యులు ఐఎన్‌టీయూసీ తద్వారా కాంగ్రెస్ పార్టీని నమ్మే విధం గా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
నమ్మకంతో గెలిపిస్తే నట్టేటముంచారు : వెంకట్రావు
గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంతో నమ్మకంతో తెలంగా ణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపిస్తే యూనియన్ నాయకులు అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు తో సమస్యలను గాలికొదిలేసి కార్మికులను నట్టేట ముం చారని సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్‌సీఎల్‌యూ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.వెంకట్రా వు విమర్శించారు. టీబీజీకేఎస్ వైఖరితో ఐఎన్‌టీయూ సీ ఇతర ప్రాతినిధ్య సంఘాలను కలుపుకుని సింగరేణి అధికారుల వద్దకు వెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరినట్టు చెప్పారు.
అక్టోబర్ మొదటి వారంలో మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కోల్‌బెల్ట్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను కలుపుకుని సీఎం వద్దకు వెళ్లి కార్మికులకు 25 శాతం వాటా చెల్లించాలని కోరనున్నామని తెలిపారు. దీపావళి పండుగ సందర్భం గా చెల్లించే ప్రొడక్టివిటీ లింక్డ్ రివార్డు(పీఎల్‌ఆర్) బోనస్ గతంలో రూ.26వేలు చెల్లించగా దానిని రూ.40వేలకు ఇప్పించేలా జేబీసీసీఐ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం తమ యూనియన్ పోరాడుతుందని స్పష్టం చేశారు. సభలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సింగరేణి పరిధిలోని నాలుగు జిల్లాల యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కార్మిక సంక్షేమానికి పాటుపడాలి : శ్రీధర్‌బాబు
Published Sun, Sep 29 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement