INTUC
-
సింగరేణి సమరం.. కొనసాగుతున్న కౌంటింగ్
Singareni Elections 2023.. Updates రామగుండంలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.. ఆర్జీ-1కౌంటర్లో పోలైన 5044 ఓట్ల లెక్కింపు కోసం 5 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-2 కౌంటర్లో పోలైన 3369 ఓట్ల లెక్కింపు కోసం 3 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-3 కౌంటర్లో పోలైన 3612 ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. అర్ధరాత్రి వరకూ కొనసాగనున్న లెక్కింపు. ఆర్జీ-1కు సంబంధించి పోలైన 32 ఓట్ల బ్యాలెట్ బాక్స్ రావడం ఆలస్యం కావడంతో లేట్ గా ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. రామగుండం పరిధిలో ముందుగా వెలువడనున్న ఆర్జీ-2 ఫలితం. తుది ఫలితాల కోసం నెలకొన్న ఉత్కంఠ. అర్ధరాత్రి తర్వాత అధికార గుర్తింపు సంఘం ఎవరనేది తేలనున్న ఫలితం. కౌంటింగ్ ప్రారంభం మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491 పోలింగ్ శాతం 93.03 % నమోదు అయ్యింది.. బెల్లంపల్లి డివిజన్లో 996 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు... 96.29 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835 మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.. ముందుగా ఓట్లను యూనియన్ల వారీగా ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేస్తారు. శ్రీరాంపూర్ ఆఫీసర్స్ క్లబ్ మొత్తం తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేశారు. 13 యూనియన్ లకు 13 బాక్సులు ఏర్పాటు. 25 చొప్పున ఓట్లు కట్టలు కడతారు.. ఆపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఐదుగురు.. మొత్తం తొమ్మిది టేబుల్ లకు 45 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా లో పారంభమైన సింగరేణి ఎన్నికల కౌంటింగ్.. ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ల్లో 96 శాతంపైగా నమోదైన పోలింగ్. ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ. గోదావరిఖని కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్న ఎన్నికల సిబ్బంది. బ్యాలెట్ బాక్సుల తరలింపుకు రంగం సిద్ధం. ఆర్జీ-1లో 5 టేబుల్స్, ఆర్జీ-2లో 3 టేబుల్స్, ఆర్జీ-3 లో 4 టేబుల్స్ పై కొనసాగనున్న బ్యాలెట్ పత్రాల లెక్కింపు. రాత్రి 12 గంటలకల్లా వెల్లడి కానున్న ఫలితాలు.. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 95 శాతంకు పైగా నమోదైన పోలింగ్. అధికార గుర్తింపు సంఘంగా విజేత ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగిసిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్. 95 శాతం పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 37 వేల మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. గెలుపు పై ధీమాతో ఉన్న ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి యూనియన్లు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది.. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు... మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి గెలిచిన ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో సాయంత్రం 5.00 గంటల వరకు మొత్తం 95 శాతం పోలింగ్ నమోదు 9127 ఓట్లకు గాను పోలైన ఓట్లు 8491. బెల్లంపల్లి డివిజన్లలో 985 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు. 96.3 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491.. పోలింగ్ శాతం 95% నమోదు.. మరికొద్ది సేపట్లో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 85.80 శాతం పోలింగ్ నమోదు. ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న 34128 మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు. మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ గెలిచింది. ఈసారి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య రసవత్తరంగా జరిగిన ఎన్నికల పోరు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది. భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 3 గం. వరకు 86.15% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 4661 మంది ఓటర్లు. మంచిర్యాల: బెల్లంపల్లి ఏరియాలో 3 గంటల వరకు 88.4% పోలింగ్ నమోదు. శ్రీరామ్ పూర్లో 86.7 శాతం మందమర్రి 86.19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో 2pm గంటల వరకు 83.1 శాతం నమోదు... మొత్తం 985 ఓట్లకు గాను 819 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఔ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లో మధ్యాహ్నం 3.00 గంటల వరకు 86.19 శాతం పోలింగ్ నమోదు. మొత్తం 4835 ఓట్లకు గాను 4166 ఓట్లు పోలయ్యాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన ఓట్లు 26,815. పోలైన ఓటింగ్ శాతం 67.42 శాతం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా: కొత్తగూడెం కార్పొరేట్ 887 ఓట్లు, నమోదైన పోలింగ్ 74.47%. కొత్తగూడెం ఏరియా 1,540 ఓట్లు నమోదైన పోలింగ్ 66.06%. ఇల్లందు 500 ఓట్లు, నమోదైన పోలింగ్ 81.56%. మణుగూరు 1,716 ఓట్లు నమోదైన పోలింగ్ 69.98% సింగరేణి వ్యాప్తంగా మధ్యాహ్నాం 12గం. వరకు నమోదు అయిన ఓట్లు 23,613 సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ 12 గంటల వరకు ఆర్జీ రీజియన్‌లో.. రామగుండం- 1లో 11 పోలింగ్ కేంద్రాల్లో 58.4 శాతం RG -2లో 6 పోలింగ్ కేంద్రాల్లో 50.09 శాతం RG-3 లో 6 పోలింగ్ కేంద్రాల్లో 60.24 శాతం మొత్తం 57 శాతం పోలింగ్ నమోదు భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 12 గం.ల వరకు 61% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 3,300 కార్మికులు ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో 11 గంటల వరకు 53 శాతం పోలింగ్ నమోదు నమోదైన ఓట్లు 4,830 10 గంటలకు పోలింగ్ ఇలా.. ఇల్లందు ఏరియాలో 45 శాతంపైగా పోలింగ్ మణుగూరులో 36 శాతం జయశంకర్ భూపాలపల్లిలో 45 శాతం పోలింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో 42 శాతం పోలింగ్ మందమర్రి డివిజన్ లో 10 గంటల వరకు 34.93 శాతం పోలీంగ్ నమోదు మందమర్రిలో 4835 ఓట్లకు గాను 1689 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు బెల్లంపల్లి ఏరియాలో అత్యధికంగా.. 10.00 గంటల దాకా 48.99 శాతం పోలింగ్ నమోదు రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ పరిధిలో.. 48.99 శాతం పోలింగ్ నమోదు సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సింగరేణి కార్మికులను కలుసుకుని మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటేసేందుకు కార్మికుల క్యూ ఉదయం విధులకు హాజరయ్యే కార్మికులతో మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకే పోలింగ్ ఓటేసేందుకు క్యూ కడుతున్న కార్మికులు రాత్రి 7గం. మొదలుకానున్న కౌంటింగ్ రాత్రి 11గం. కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం పెద్దపెల్లి రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 పరిధిలో ఉదయం 9 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు. 8 గంటలకు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ 8 గంటల వరకు ... తొలి గంటలో నమోదైన పోలింగ్ 21% పెద్దపల్లిజిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ 3 ఏరియాలో ఉదయం 8 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 13.5% మొత్తం 3884 ఓట్లకు గాను 528 మంది కార్మికుల ఓటు హక్కు వినియోగం కొమురం భీంలో 144 సెక్షన్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి.. బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి ఎన్నికల హడావిడి మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఓటు హక్కు వినియోగించుకొనున్న 985 మంది సింగరేణి కార్మికులు నిరసన.. ఫిర్యాదు మంచిర్యాల శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గని నిరసన ఒక అధికారి ప్రచారం నిర్వహిస్తున్నాడని ఓ యూనియన్ నేత ఆరోపణ అధికారులకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏం పని? అంటూ ప్రశ్న పోలింగ్ హెల్ప్ డెస్క్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సదరు యూనియన్ లీడర్ జీఎం కార్యాలయం నుంచి ఐడెంటిటీ కార్డులు కొనసాగుతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి ఐడెంటిటీ కార్డ్ లేనివారు జీఎం కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచిస్తున్న సింగరేణి అధికారులు సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లా లో 11 ఏరియాల్లో పని చేస్తున్న 39వేల మంది మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి ఖమ్మంలో.. సింగరేణి ఎన్నికల్లో.. కొత్తగూడెం కార్పొరేట్ ఏరి యాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు మణుగూరులో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కొత్తగూడెం ఏరియా రుద్రం పూర్, సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లో మూడు చొప్పు న పోలింగ్ కేంద్రాలు.. ఐదు ఏరియాల్లో 6,587 మంది కార్మికులకు ఓటు హక్కు గట్టి పోటీ ఈ రెండు యూనియన్ల నడుమే! భూపాలపల్లి సింగరేణి డివిజన్ లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న ఐదువేల మంది కార్మికులు జిల్లా వ్యాప్తంగా వివిధ గనులపై 09 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు ఉదయం 7 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పోలింగ్ ను బ్యాలెట్ పేపర్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్వహణ పోలింగ్ అనంతరం కృష్ణ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్‌కు బ్యాలెట్ బాక్సుల తరలింపు రాత్రి 7 గంటల నుండి రౌండ్ కు 2,500 చోప్పున ఓట్ల లెక్కింపు చివరకు.. ఫలితాల వెల్లడి బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పుకుందన్న ప్రచారంతో.. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యే గట్టి పోటీ సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభం సింగరేణి గుర్తింపు ఎన్నికల సంఘం పోలింగ్ ప్రారంభం ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి 84 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5గం. వరకు కొనసాగనున్న పోలింగ్ సాయంత్రం 7గం. నుంచి కౌంటింగ్ మొత్తం 39,809 మంది ఓటర్లు శ్రీరాంపూర్‌లో 15, మందమర్రిలో 11, బెల్లంపల్లిలో ఐదు పోలింగ్ కేంద్రాలు బరిలో 13 కార్మిక సంఘాలు ఎన్నికల నుంచి తప్పుకున్న టీజీబీకేఎస్ AITUCకి మద్ధతు ప్రకటించిన బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ TBGKS(Telangana Boggu Ghani Karimka Sangham) కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయమని ప్రకటన నేడే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ భూపాలపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,410 మంది కార్మికులు మొత్తం 09 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు బ్యాలెట్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ పోటీలో 13 గుర్తింపు యూనియన్లు ఎన్నికల్లో ఇలా.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిధులు, నియామకాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఈ ఎన్నికలపైనా ఆసక్తి నెలకొంది. మొత్తం 11 ఏరియాల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. తాజా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(బీఆర్ఎస్ టీజీబీకేఎస్ సపోర్ట్) మధ్య జరుగుతున్నాయి. సింగరేణి ఎన్నికల చరిత్ర ఇది.. సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ప్రభుత్వం.. సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో.. నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుత) అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. -
బ్యాంక్ సేవలపై భారత్ బంద్ ప్రభావం
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్ సంఘాలూ మద్దతిచ్చాయి. ఆర్బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె... పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రాయల్, నగదు డిపాజిట్ చేయడం, చెక్ క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్మెంట్ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి. మరోవైపు హోండా మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. -
నేడు దేశవ్యాప్త సమ్మె
-
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: ప్రధాన కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ప్రభావం కీలకమైన బ్యాంకింగ్, రవాణా తదితర రంగాలపై పడనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, యూటీయూసీ తదితర వివిధ రంగాల కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8వ తేదీన బంద్ పాటించాలంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్మానించాయి. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు, దేశంలో పెరిగిన నిరుద్యోగిత, దిగజారిన ఆర్థిక పరిస్థితులకు నిరసనగా తాము కూడా సమ్మెలో భాగస్వాములవుతామంటూ రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలైన ఏఐఆర్ బీఈఏ, ఏఐఆర్‌బీడబ్ల్యూఎఫ్ మంగళవారం తెలిపాయి. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు తదితర 12 డిమాండ్లతో కూడిన ఉమ్మడి ఎజెండాపై ఈ నెల 2వ తేదీన జరిపిన చర్చల్లో కార్మిక మంత్రి నుంచి ఎటువంటి హామీ రానందున సమ్మె పిలుపునకు కట్టుబడి ఉన్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా 25 కోట్లమందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపాయి. సమ్మె ప్రభావం బుధవారం బ్యాంకింగ్ సేవలపై పడనుందని ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ ఎక్సే్ఛంజీకి సమాచారం అందించాయి. బ్యాంకుల్లో నగదు, విత్‌డ్రా, చెక్ క్లియరింగ్ వంటి సేవలపై బంద్ ప్రభావం పడనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగనున్నాయి. అఖిల భారత స్థాయి బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణాతోపాటు ఇతర కీలక రంగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. పాల్గొంటే కఠిన చర్యలు: కేంద్రం బంద్‌లో కార్మికులు పాల్గొనకుండా చూడాలంటూ ప్రభుత్వం రంగ సంస్థలను కేంద్రం కోరింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలను అమలు చేసి కార్యకలాపాలు యథాతధంగా సాగేలా చూడాలని కోరింది. ఏ విధమైన బంద్, నిరసనల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద వేతనంలో కోత వంటి కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మెమోరాండంలో స్పష్టం చేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపైనా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. -
పెరట్లో పాములా ఏఐటీయూసీ కాటేస్తది
భూపాలపల్లి: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలేనని.. మరోమారు ఏఐటీయూసీని గెలిపిస్తే పెరట్లో పాము మాదిరిగా అది కార్మికులను కాటు వేస్తుందని నిజామాబాద్ ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భూపాలపల్లిలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే టీబీజీకేఎస్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించేందుకు సర్క్యులర్ తీసుకొస్తే ఏఐటీయూసీ కోర్టులో కేసు వేసి అడ్డుకుందన్నారు. రానున్న రోజుల్లో 50 వ్యాధులను జత చేసి వారసత్వ ఉద్యోగాలకు బదులుగా కారుణ్య నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చారు. అనుమానం ముందు పుట్టి ఎర్రచొక్కా తర్వాత పుట్టిందని, కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే ప్రతి పనికీ ఎర్రచొక్కా నాయకులు ఏదో అనుమానం చెబుతూ అడ్డు పడుతున్నారని, ఈ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. తమ యూనియన్ను గెలిపిస్తే నేమ్ కరెక్షన్ పేరిట మారు పేర్లతో పనిచేస్తున్న కార్మికులందరి పేర్లు సరిచేస్తామన్నారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు వడ్డీ లేని రుణం రూ. 6 లక్షలు అందజేస్తామన్నారు. 190 నుంచి 240 మస్టర్ల వరకు ఉన్న బదిలీ ఫిల్లర్లను పర్మనెంట్ చేస్తామన్నారు. జేఎంఈటీ కార్మికుల ప్రమోషన్ల పరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తామన్నారు. అంబేడ్కర్ జయంతిని హాలిడేగా ప్రకటిస్తామన్నారు. గులాబీ జెండా ఎగరడం ఖాయం గోదావరిఖని (రామగుండం): సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం తథ్యమని, సింగరేణిలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని యూనియన్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత ధీమా వ్యక్తంచేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–1లో జరిగిన గేట్ మీటింగ్‌లో, ఆ తర్వాత ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని గోదావరిఖనిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలోనే 16 శాతంగా ఉన్న లాభాల వాటాను 25 శాతానికి పెంచామని, గతంలో నెలకు 25 మంది వారసులకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి ఉంటే దానిని పక్కకు పెట్టి ఒకేసారి 3,100 మందికి ఉద్యోగాలివ్వడం జరిగిందన్నారు. సింగరేణి సంస్థ మనుగడ, కార్మిక సంక్షేమం కోసం టీబీజీకేఎస్ గుర్తు బాణంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కవిత కార్మికులను కోరారు. మరోవైపు సింగరేణిలో కొత్త గనులు, ఉద్యోగాలతో సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఆర్కే గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తే 2003లో టీబీజీకేఎస్ యూనియన్ ఏర్పడిందన్నారు. -
జీవో 279ని రద్దు చేయండి
– కమిషనర్‌కు విన్నవించిన ఐఎన్టియుసి నాయకులు కర్నూలు (టౌన్): జీవో 279ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వై.వి. రమణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికుల సమ్మెకాలపు వేతనాన్ని మంజూరు చేయాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇఎస్ఐ చెల్లించాలన్నారు. కార్మికులకు యూనిఫామ్స్, చెప్పులు, నూనె, ఆఫ్రాన్స్ ఇవ్వాలన్నారు. టైమ్ స్కేల్ వర్కర్స్ అందరికీ పీఆర్సీ వెంటనే ఇవ్వాలన్నారు. -
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
– ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవ రెడ్డి – నంద్యాలలో ఏపీఎస్ఈబీ 327 రాష్ట్ర కార్యవర్గ సమావేశం నూనెపల్లె: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలే శరణ్యమని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నంద్యాలలోని శోభా ఫంక్షన్ హాలులో మంగళవారం ఏపీఎస్ఈబీ 327 యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులకు సరైన పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని సంజీవరెడ్డి ఆరోపించారు. ఎన్టీపీసీలో ఏడాదికి రూ. 80వేలు బోనస్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేనని చెప్పడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థల ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇచ్చి దేశ సంపదను వారికి దోచి పెడుతోందన్నారు. కాంట్రాక్టు, ప్రయివేటు ఉద్యోగంతో హోదా పెరగదని, వారికి పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాడ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు పెరుగుతున్నా కొత్తవారికి కాంట్రాక్టు బేసిక్ ఇవ్వడం ఎక్కడా లేదన్నారు. అనంతరం పవర్ వర్కర్ అనే యూనియన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి, 327 యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సాయిబాబా, రీజినల్ నాయకులు రఘు, గిరి, నంద్యాల డివిజన్ కార్యదర్శి లక్ష్మికాంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ నేడు ‘గుర్తింపు’ ఎన్నికలు
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు గుర్తింపు సంఘం ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. గతంలో కార్మిక శాఖ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగేవి. ప్రస్తుతం ఎన్టీపీసీ యాజమాన్యం స్వీయపర్యవేక్షణలో నిర్వహిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్(ఐఎన్టీయూసీ), ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయిస్ యూనియన్(హెచ్ఎంఎస్), ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్), ఎన్టీపీసీ తెలుగునాడు ఎంప్లాయీస్ యూనియన్(టీఎన్టీయూసీ), ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ), తెలంగాణ ఎన్టీపీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘం అర్హత పొందాయి. పోటీలో ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్(ఐక్యఫ్రంట్), బీఎంఎస్, ఎన్టీకేఎస్ యూనియన్లు ఉన్నాయి. ఐఎన్టీయూసీకి ఐక్యఫ్రంట్ గట్టి పోటీ ఇస్తోంది. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్టీపీసీ రామగుండం యాజమాన్యం నిర్వహిస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొదటి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. 693 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. పోలింగ్ కోసం రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి బూత్‌లో 1 నుంచి 350 మంది, రెండవ బూత్‌లో 351 నుంచి మిగతా ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 3:30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను విడుదల చేస్తారు. -
ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ‘తల్లమల్ల’
రామగిరి : ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్లగొండ పట్టణానికి చెందిన తల్లమల్ల యాదగిరిని నియమిస్తూ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సతీశ్ కుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాదగిరికి కండువా కప్పి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ఐఎన్టీయూసీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనకు బాధ్యతలు అప్పగించిన పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు దినేష్ శర్మలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వనమాల రమేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రాములు యాదవ్, కోశం జగదీశ్, యాదయ్య, రొయ్య నర్సింహ, పేరుమాళ్ల జనార్ధన్, వెన్నమల్ల వెంకన్న, గద్దగూటి గణేష్, అశోక్, ప్రవీణ్, సాగర్, శ్రావణ్, హరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ‘తల్లమల్ల’
రామగిరి : ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్లగొండ పట్టణానికి చెందిన తల్లమల్ల యాదగిరిని నియమిస్తూ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సతీశ్ కుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాదగిరికి కండువా కప్పి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ఐఎన్టీయూసీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనకు బాధ్యతలు అప్పగించిన పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు దినేష్ శర్మలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వనమాల రమేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రాములు యాదవ్, కోశం జగదీశ్, యాదయ్య, రొయ్య నర్సింహ, పేరుమాళ్ల జనార్ధన్, వెన్నమల్ల వెంకన్న, గద్దగూటి గణేష్, అశోక్, ప్రవీణ్, సాగర్, శ్రావణ్, హరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఐఎన్టీయూసీ సంఘాలు ఏకం
10న గోదావరిఖనికి సంజీవరెడ్డి రాక అధికారికంగా ప్రకటించే అవకాశం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలు ఒక్కటికానున్నాయి. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒకే బ్యానర్‌పై కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐఎన్టీయూసీ అనుబంధంగా కొనసాగుతున్న జనక్‌ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎస్.నర్సింహారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలతో సెప్టెంబర్ 10వ తేదీన గోదావరిఖనిలో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి హాజరవుతున్నందున పెద్ద ఎత్తున క్యాడర్‌ను సమీకరించే పనిలో రెండు యూనియన్ల నాయకత్వం నిమగ్నమైంది. ఎస్సీఎంఎల్యూ ఆస్తుల పరిరక్షణపై దృష్టి ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్సీఎంఎల్యూ)కు మొన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన బి.వెంకట్రావు ఈనెల 18న టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌లో చేరి ఆ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు. ఈ నేపథ్యంలో యూనియన్‌కు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్.నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా త్యాగరాజన్‌ను నియమిస్తూ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం యూనియన్ పేరుతో కొత్తగూడెం, మణుగూరు, సెంటినరీకాలనీలో సొంత భవనాలున్నాయొ. బెల్లంపల్లి మినహా మిగతా అన్ని ఏరియాల్లో సింగరేణి సంస్థ క్వార్టర్లను సమకూర్చింది. ఈ నేపథ్యంలో యూనియన్‌కు చెందిన ఆస్తులను, కార్యాలయాలను కాపాడుకునేందుకు కొత్త కార్యవర్గం దృష్టి సారించింది. -
ఎస్‌సీఎల్‌యూ భవితవ్యమేమిటి ?
టీబీజీకేఎస్‌లో విలీనమా..కలిసి పనిచేయడమా..! అయోమయంలో ఐఎన్టీయూసీ శ్రేణులు గోదావరిఖని(కరీంనగర్) : ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్‌సీఎల్‌యూ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా నియూమకం కావడంతో ఎస్‌సీఎల్‌యూ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కొంత కాలం క్రితం గోదావరిఖనిలో జరిగిన యూనియన్ సమావేశంలో టీబీజీకేఎస్‌తో కలిసి పనిచేయడానికి వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తనతో కలిసి వచ్చే నాయకులతో సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన వెంట వెళ్లే నాయకులెందరనేది సంశయంగా మారింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెంకట్రావు వ్యవహరిస్తున్నందున ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎస్సీఎల్యూను అందులో విలీనం చేయూలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ భవిష్యత్‌లో టీబీజీకేఎస్ నుంచి బయటకు వచ్చినా.. తిరిగి ఎస్‌సీఎల్‌యూ ద్వారా సింగరేణి లో కార్యకలాపాలు నిర్వహించేందుకు కలిసి పనిచేయా లా? అనే మరో ఆలోచన సైతం చేస్తున్నట్లు సమాచారం. బలోపేతం కానున్న ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ సింగరేణిలో నిన్నటి వరకు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి సింగరేణిలో రెండు యూనియన్లు పనిచేశాయి. వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్‌సీఎల్‌యూ, జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ) కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే వెంకట్రావు టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెళ్లడంతో ఎస్సీఎల్యూలో కొనసాగే క్యాడర్, కాంగ్రెస్ అభిమానులు సహజంగా ఎస్సీఎస్డబ్ల్యూయూకే మద్దతు తెలుపుతారు. ప్రస్తుతం ఎస్‌సీఎల్‌యూ వర్కింగ్ కమిటీలో 63 మంది సభ్యులుండగా అందులో 43 మంది జనక్‌ప్రసాద్ యూనియన్‌లో చేరడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. అలాగే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఒకే యూనియన్ సింగరేణిలో పనిచేయనుండడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. 1998లో జరిగిన మొదటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ‘సాజక్’ పేరుతో పోటీచేసి ఆర్జీ-1, 2 డివిజన్లను గెలుచుకుంది. తర్వాత 2007 ఎన్నికల్లో వెంకట్రావుతో కలిసి పనిచేసి గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అయితే రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను ఓడించడానికి సంజీవరెడ్డి సూచన మేరకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసి పోటీచేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో గోదావరిఖనిలో జరి గిన ఐఎన్టీయూసీ మహాసభల్లో పాల్గొన్న యూనియన్ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి సింగరేణిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఒకే యూనియన్ ఉంటుందని చెప్పారు. తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతుండడంతో యూని యన్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. మిర్యాల’తో మంతనాలు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మిర్యా ల రాజిరెడ్డిని యూనియన్‌లో స్థానం లేకుండా చేయడం తో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్ అనుబంధ యూనియన్‌లో చేర్చుకునేందుకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎస్సీసీడబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, బడికెల రాజలిం గం, గుమ్మడి కుమారస్వామి తదితర నాయకులు మిర్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి సెంటినరీకాలనీలోని నివాసంలో రాజిరెడ్డిని కలిసి యూనియన్‌లోకి రావాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని యూని యన్ నుంచి తొలగించడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు సమావేశమై టీబీజీకేఎస్ నాయకత్వంపై ఒత్తిడి తీసురావాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ యూనియన్, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు వారు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
సమ్మెను విజయవంతం చేయాలి
శ్రమ దోపిడీకి పాల్పడుతున్నప్రభుత్వాలు కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తివేయాలి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి హన్మకొండ : కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ పరిస్థితులు, ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై కార్మిక సంఘాలన్నీ పోరాడేందుకు ఏకమయ్యాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 6వ పే కమిషన్ 54 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం వేసిన 7వ పే కమిషన్ కేవలం 23.5 శాతం మాత్రమే ఇచ్చిందని, ఫిట్మెంట్ పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.16వేలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలన్నా రు. సింగరేణ సంస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలి యా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి బొగ్గు దిగుమతి కావడంతో లోకల్ బొగ్గుకు గిరాకి తగ్గి నిలువలు పెరిగిపోతున్నాయని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిం చాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంస్థలే నేరుగా జీతాలు ఇవ్వాలని, ఈ నెలాఖరు వరకు ఇవ్వక పోతే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ ముఖ్య ఉపాధ్యక్షులు జనక్‌ప్రసాద్, ఇనుగాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్, నాయకులు పి.మహేందర్‌రెడ్డి, హనుమంతరావు, త్యాగరాజు, లక్ష్మణ్, సదయ్య పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
► ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి రాజమహేంద్ర వరం సిటీ: పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వ పాలనపై దేశంలోని అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఏపీలోని రాజమహేం ద్రవరంలో జరిగిన ఐఎన్టీయూసీ ఉభయ తెలుగు రాష్ట్రాల 185వ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనపై దేశంలోని అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబరు 2న సార్వత్రిక సమ్మె నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. ఐఎన్టీయూసీ ఉభయ తెలుగు రాష్ట్రాల 185వ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. జాతీయాదాయం పెరుగుతున్నట్లు మోదీ చెబుతున్నారని, అదే స్థాయిలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని అన్నారు. సంపద కేంద్రీకృతం అవుతుండటంతో పేదరికం పెరిగిపోతోందన్నారు. రాష్ట్రంలో కార్మికుల రక్షణతోపాటు వారి హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలసి నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. కార్మికులకు రూ. 18 వేల జీతం ఇస్తూ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఐఎన్టీయూసీని ఆదరించాలి
వర్కింగ్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు ఆర్కే 5గనిపై గేట్ మీటింగ్ శ్రీరాంపూర్ : వచ్చే ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీని ఆదరించాలని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు తెలిపారు. సోమవారం ఆయన ఆర్కే 5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. తాము గుర్తింపు సంఘంగా ఉన్న హయాంలోనే కార్మికులకు 40 హక్కులు సాధించామని అన్నారు. ఆ తర్వాత గెలిచిన సంఘాలన్నీ కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయని విమర్శించారు. టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని, వారి అసమర్థత వల్ల నేడు ప్రైవేటీకరణ పెరిగిందని పేర్కొన్నారు. గనులు కూడా ప్రైవేటు పరం కాబోతున్నాయని ఆరోపించారు. 9వ వేజ్‌బోర్డులో కార్మికులకు మెరుగైన జీతాలు అందించడానికి జాతీయ సంఘాలు కృషి చేశాయని, 10వ వేజ్‌బోర్డులో కూడా మెరుగైన వేతనాల కోసం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించాలని, స్వంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని తెలిపారు. సమావేశంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డి.అన్నయ్య, బ్రాంచి ఉపాధ్యక్షులు జి.మహిపాల్‌రెడ్డి, అద్దు శ్రీనివాస్, అశోక్, బోనగిరి కిషన్, ఫిట్ సెక్రెటరీ ఆనందం, నాయకులు గంగయ్య, రమేశ్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్ అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన వివిధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను సవరణల పేరుతో కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందజేయకుండా వారి సంక్షేమాన్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ నాయకులు శీతల రోశపతి, మేకల నాగేశ్వరరావు, చల్లా రామకృష్ణ, చిలకరాజు లింగయ్య, వంటిపులి శ్రీనివాస్, బెల్లంకొండ గురవయ్య, మేళ్లచెరువు ముక్కంటి, నర్సింహారావు, జానయ్య, ముస్తఫా, వెంకటరెడ్డి, పుల్లయ్య, సావిత్రి, రవికుమార్, కరుణాకర్‌రెడ్డి, హుస్సేన్ గౌడ వీరబాబు, లాలుగౌడ్ పాల్గొన్నారు. -
కార్మిక హక్కులను కాలరాస్తే ఖబడ్దార్: ఉత్తమ్
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. కార్మికులకు అన్యాయం చేసే కార్యక్రమాలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఆదివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో మేడే సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఐఎన్టీయూసీ పతాకావిష్కరణ చేశారు. అనంతరం టీపీసీసీ అనుబంధ కార్మిక విభాగం అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు. కార్మికులు జమ చేసుకున్న పీఎఫ్ డబ్బులపై పన్నులు వేస్తామని, వడ్డీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యమించిడంతో తోక ముడిచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు చేసే పోరాటాలకు తాము సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ఉన్న పరిశ్రమలను మూసేసే దిశగా అడుగులు వేస్తున్నారని, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా యాజమాన్యాలతో కుమ్మక్కై పనిచేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ కార్మిక నేతలకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
‘సెప్టెంబర్ 2న భారత్ బంద్’
పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఐఎన్టీయూసీ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది. కార్మికుల కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ కార్మిక సంఘాలతో కలిసి సెప్టెంబర్ 2న భారత్ బంద్ నిర్వహిస్తామని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి తెలిపారు. పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ బంద్‌కు త్వరలోనే అన్ని సంఘాల నుంచి మద్దతు కూడగడతామని ఆయన అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ రామగుండంలోని అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
ఇంటక్‌లో నిర్వేదం
నిస్సహాయ స్థితిలో గుర్తింపు సంఘం కమిటీల్లో జాప్యంపై కార్యకర్తల్లో అసంతృప్తి సమస్యలు వినేవారే లేరని కార్మికులు ఆవేదన ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లో ఐఎన్టీయూసీకి మొదటి నుంచి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నా, గుర్తింపులో ఉన్నా వారి ఎన్నికల గుర్తు సింహం వలే దుడుకుగా, ఏది శాసిస్తే అది జరిగేలా ఉండేది. ఇటీవల కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలిచి తొమ్మిది నెలలైనప్పటికి కమిటీల నియామకాలు ప్రక్రియ పూర్తికాక పోవడం, గతంలో ఫ్రంట్ హయాంలో యాజమాన్యం ప్రతిపాదించిన వివిధ అంశాలను వ్యతిరేకించిన ఇంటక్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత వాటిని అంగీకరించడం ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనియన్‌లో నెలకొన్న ఈ పరిస్థితి పట్ల నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు యూనియన్ స్తబ్దంగా ఉండటంతో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఉందని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. సమస్యలు వినే నాథుడు కరువు? ఈ ఏడాది ఫిబ్రవరి 14న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఏడేళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మంచి మెజార్టీతో గెలుపొందింది. ఉక్కు యాజమాన్యం నుంచి మే 29న అధికారికంగా గుర్తింపు పత్రాన్ని అందుకున్నారు. తీవ్రమైన జాప్యంతో ఐఎన్టీయూసీ నాయకత్వం పీఎఫ్, ఎస్బీఎఫ్, సెంట్రల్ సేఫ్టీ కమిటీ, ఉక్కునగరంలోని అంబేద్కర్ కళాక్షేత్రం, ఆంధ్రకేసరి కళాక్షేత్రం, వడ్లపూడి, అగనంపూడి, గంగవరం కమిటీలను పూర్తిచేయగలిగారు. ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అతి ముఖ్యమైన ఉక్కు జనరల్ ఆస్పత్రి, టౌన్ డెవలప్మెంట్ కమిటీలకు ఇంతవరకు మోక్షం కలగలేదు. దీని వల్ల ఉక్కు జనరల్ ఆస్పత్రి సమస్యలను వినే నాథుడు లేకుండా పోయారు. ఇక ప్రొడక్షన్, మార్కెటింగ్, సీఎస్ఆర్, వెల్ఫేర్ వంటి క మిటీల ఊసేలేదు. పరిమితికి మించి సభ్యులను కోరడం వల్లే ? చాలా కమిటీలకు పరిమితికి మించి సభ్యులను గుర్తింపు యూనియన్ కోరడంతో అవి పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నవాటిని తీసుకుని, మిగిలిన వాటిని అడిగి ఉంటే బాగుండేదని గుర్తింపు యూనియన్ నాయకులే వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విధంగా జాప్యం జరగడం వల్ల కార్మికుల్లో అపఖ్యాతి మూటగట్టుకోవడం తప్ప ఒరిగేదేమి లేదంటున్నారు. పుండు మీద కారం చల్లినట్టు యాజమాన్యం ఇటీవల ప్రారంభించిన గేటు నిబంధనలు కార్మికుల్లో మరింత అసంతృప్తి రేకెత్తిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సొంత క్యాడర్లో మరింత అసంతృప్తి ప్రబలే అవకాశముంది. తక్షణం కమిటీలు వేయడంతో పాటు జనరల్ ఆస్పత్రి, టౌన్ అడ్మిన్, గేటు సమస్యలపై చర్యలు తీసుకోకపోతే జరిగే నష్టానికి యూనియన్ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి: ఐఎన్టీయూసీ
జ్యోతినగర్ (కరీంనగర్): ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు. -
వెంకన్న వెనుక పోదామా? వద్దా?
గోదావరిఖని(కరీంనగర్) : ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ బి.వెంకట్రావు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడంతో అయోమయంలో ఆ యూనియన్ కేడర్ ఉంది. సెప్టెంబర్ 1న వెంకట్రావు చేరికకు ముహూర్తం ఖరారు కావడంతో ఆయనతో ఉండాలా? లేక యూని యన్‌లో కొనసాగాలా? అనే మీమాంసలో కొట్టుమి ట్టాడుతున్నారు. సింగరేణితో 45 ఏళ్లుగా సుధీర్ఘ అను బంధం ఉన్న వెంకట్రావు రాజకీయంగా 1970 నుంచి 1980 వరకు పదేళ్ల పాటు ఆదిలాబాద్ జిల్లా రామ కృష్ణాపూర్ సమీపంలోని కేతనపల్లికి ఏకగ్రీవంగా కాంగ్రెస్ నుంచి సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత తాండూర్ కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌లో పనిచే శారు. సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా కొనసాగారు. సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా, కోల్ఇండియాలో వేజ్‌బోర్డు సభ్యుడిగా 25 ఏళ్ల పాటు కొనసాగారు. పార్టీ పరంగా యూత్ కాంగ్రెస్‌లో కొనసాగిన వెంకట్రావు ఆ తర్వాత పీసీసీ లేబర్ సెల్ చైర్మన్‌గా 2002 నుంచి 2007 వరకు పని చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా 2013 వరకు కొన సాగారు. ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. సింగరేణిలో ఐఎన్టీయూసీ అను బంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ ఎమ్మెల్సీగా గవ ర్నర్ కోటాలో ఆయన కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెం కట్రావు టీఆర్ఎస్లో చేరడం ఖాయం కావడంతో ఆ యూనియన్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. పార్టీ పరంగా టీఆర్ఎస్లో కొనసాగడం, యూనియన్ తరఫున ఐఎన్టీయూసీలో పనిచేయడం ఎలా సాధ్య మవుతుందనే భావనతో వారున్నారు. ఏదో ఒక వైపు ఉంటేనే పార్టీకి గానీ, యూనియన్‌కు గానీ సార్థకత చేకూరుతుందని, కానీ వెంకట్రావు నిర్ణయం ఎటూ పనిచేయకుండా ఉందని వారు ఆందోళన చెందుతు న్నారు. తాము ఎటు వైపు ఉండాలనే నిర్ణయాన్ని మా త్రం ముఖ్యమైన నాయకులు ఇంకా నిర్ణయం తీసు కోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా వెంకట్రావు టీఆర్ ఎస్‌లో చేరితే ఇప్పటికే ఆ పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న టీబీజీకెఎస్‌లో నాయకత్వం ఐఎన్టీయూ సీపై విమర్శలు చేస్తుందా? లేక ఐఎన్టీయూసీలో కొనసాగుతానన్న వెంకట్రావు టీబీజీకేఎస్ పట్ల సాను కూల వైఖరితో ఉంటాడా? అనే ప్రశ్నలు ఉదయిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ కేడర్ వెంక ట్రావుతో వెళ్లాలా.. లేక ఐఎన్టీయూసీలో కొనసా గాలా.. అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇక పలువురు ఐఎన్టీయూసీ నాయకులకు మాజీమంతి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ జి.వివేక్ ఫోన్లు చేసి వెంకట్రావు వెంట వెళ్లొద్దని కోరినట్లు సమాచారం. -
రైలు చార్జీల పెంపుతో సామాన్యుల గగ్గోలు
-
ఎంత కఠినమో
- రైలు చార్జీల పెంపుతో సామాన్యుల గగ్గోలు - జిల్లా ప్రయాణికులపై రోజూ రూ.లక్షల అదనపు భారం సాక్షి, రాజమండ్రి / రాజమండ్రి సిటీ : నరేంద్రమోడీ సర్కారు ఆదిలోనే తీసుకున్న బాదుడు నిర్ణయం జిల్లా ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ముందెన్నడూ లేని విధంగా అన్ని రకాల రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం పెంచడంతో జిల్లావాసులు గగ్గోలు పెడుతున్నారు. రైలు చార్జీల పెంపు ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరిగినా సాధారణ ప్రయాణికులను మినహాయిస్తారని భావించారు. అయితే మోడీ సర్కారు.. ‘వడ్డించే’ విషయంలో తనకు ఎలాంటి విచక్షణా లేదని చాటుకుంది. జిల్లాలో ప్రధాన మైన రాజమండ్రి రైల్వేస్టేషన్ నుంచి రోజూ 30 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. సుమారు 3000 మంది రిజర్వేషన్‌తో వివిధ తరగతుల్లో ప్రయాణిస్తారు. తర్వాత ముఖ్యమైన సామర్లకోట నుంచి సుమారు 20 వేల మంది అన్ని తరగతుల్లో ప్రయాణిస్తారు. 2000 మందికి పైగా రిజర్వేషన్లను పొందుతారు. జిల్లా కేంద్రం కాకినాడ నుంచి రోజూ సుమారు 10 వేల మంది ప్రయాణిస్తారు. వెయ్యి మంది వరకూ రిజర్వేషన్లు చేయించుకుంటారు. పెంచిన చార్జీలతో నిత్యం వీరందరిపై రూ.లక్షల్లో అదనపు భారం పడనుంది. ప్రయాణ చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం వలన రాజమండ్రి స్టేషన్ నుంచి నిత్యం జరిగే వివిధ సరుకుల రవాణాపై అదనపు భారం పడనుంది. చార్జీల పెంపు దారుణం.. ప్రజారంజకమైన పాలన అంటూ గద్దె నెక్కిన మోడీ సర్కార్ రైలు చార్జీలను అమాంతం పెంచి పేదల నడ్డి విరిచింది. పాలన చేపట్టి నెల కాకుండానే ఇలా చేయడం దారుణం. ధనిక వర్గాలతో సమానంగా టిక్కెట్ ధర పెంచడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. పెంపును విరమించి పేదలను ఆదుకోవాలి. - కేఎల్ఎన్రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, రాజమండ్రి -
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వం: ఐఎన్టీయూసీ
రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులను ఓడించాలని ఐఎన్టీయూసీ సీమాంధ్రులకు పిలుపునిచ్చింది. శనివారం విశాఖపట్నంలో ఆ సంస్థ నేతలు తమ్మినేని నర్సింగరావు, ఎమ్ రాజశేఖర్‌లు విలేకర్లతో మాట్లాడారు. అభివృద్ధికి నమూనాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని వారు సీమాంధ్రులకు హితవు పలికారు.